💯 రోజుల HFN St🌍ryతో
♥️ కథ-16 ♥️
చదివే ముందు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి... మీ హృదయంతో మమేకం అవ్వండి... మరియు ఈ క్షణంలో మీలోని సంపూర్ణతను అనుభవించండి... నెమ్మదిగా కళ్లు తెరవండి... చదవడం కొనసాగించండి...
*సంపూర్ణతను అనుభవించడం*
ఒక ఇంటి దగ్గర చాలా కాలంగా పెద్ద భవనం నిర్మాణం జరుగుతోంది. ప్రతిరోజూ, కూలీల చిన్న పిల్లలు అక్కడ గుమిగూడి, ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకుని రైలు ఆట ఆడేవారు.
ప్రతిరోజు, పిల్లలలో ఒకరు ఇంజిన్‌గా మారతారు మరియు ఇతర పిల్లలు బోగీలు గా మారేవారు.
ఇంజన్ మరియు బోగీలు ఆడే పిల్లలు ప్రతిరోజూ మారతారు, కానీ...
కేవలం నీకర్ మాత్రమే ధరించిన ఒక చిన్న పిల్లవాడు తన చేతితో చిన్న గుడ్డ ముక్కఊపుతూ ప్రతిరోజూ రైలు గార్డుగా( guard) మాత్రమే ఉండేవాడు.
రోజూ ఆ పిల్లలు ఆడుకోవడం చూస్తున్న వ్యక్తి, రోజు గార్డ్గా మాత్రమే వుంటున్న బాలుడిని ,ఉత్సాహంగా పిలిచి ఆ బాలుడిని అడిగాడు, "పిల్లాడా, నువ్వు రోజూ గార్డ్గానే వుంటున్నావు. నువ్వు ఎప్పుడూ ఇంజిన్‌గా లేదా కొన్నిసార్లు బోగీగా ఉండకూడదనుకుంటున్నావా?"
దీనిపై ఆ పిల్లాడు, "సార్, నాకు వేసుకోవడానికి చొక్కా లేదు.నా వెనుక ఉన్న పిల్లలు నన్ను ఎలా పట్టుకుంటారు. ఇంకా నా వెనుక ఎవరు నిలుస్తారు?" అని ప్రశ్నించాడు.
అప్పుడు అతను ఉత్సాహంగా, "అందుకే నేను ఆటలో పాల్గొనడానికి ప్రతిరోజూ గార్డుగా మారతాను. నేను అందరితో ఆడాలి." ఇలా చెబుతూనే ఆ చిన్నారి తన స్నేహితుల వద్దకు తిరిగి వెళ్లి ఆడుకోవడంలో మునిగిపోయాడు.
ఆ క్షణంలో, ఆ పిల్లవాడి వైఖరిలో ఎటువంటి ఫిర్యాదుగాని, లోపభూయిష్ట భావనగాని లేదు!
ఆ కుర్రాడి మాటలకు, అతని పరిస్థితికి కొన్ని క్షణాలు అక్కడే ఆగిపోయాను. ఆ రోజు ఆ బాలుడు నాకు జీవితంలో పెద్ద పాఠం నేర్పాడు.
మనం జీవితంలో అన్నీ పొందలేము.
పిల్లవాడు తన తల్లిదండ్రులపై కోపం తెచ్చుకుని ఇంట్లో కూర్చుని ఏడువగలడు. కానీ, అతను అలా చేయకుండా పరిస్థితికి పరిష్కారం కనుగొన్నాడు.
కానీ మనం ఎంత ఏడుస్తాం?
ఒక్కోసారి మన స్వరూపం మీద, ఒక్కోసారి పోటీతనం మీద, ఇంకొన్ని సార్లు పొరుగింటి వారి పెద్ద కారుపై, ఇంకొన్ని సార్లు పక్కవాడి భార్య హారంపై, ఒక్కోసారి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినందుకు, ఒక్కోసారి భాష తెలియకపోవడం వల్ల, ఒక్కోసారి మన వ్యక్తిత్వం వల్ల, ఒక్కోసారి ఉద్యోగం వల్ల. వ్యాపార మందగమనం వలన..... జీవితం యొక్క పరిపూర్ణత కోసం మనం బయిట వెతుకుతున్నంత కాలం, అసంపూర్ణ భావన ఉంటుంది. కానీ మనలోని హృదయంతో మనం అనుసంధానం అయినప్పుడు, పరిస్థితి ఏమైనప్పటికీ, మనం దానిలో సంపూర్ణంగా అనుభూతి చెందగలము మరియు ఆనంద స్థితిలో ఉండగలుగుతాము.
డేగ ఎత్తులో ఎగరడం చూసిన చిన్న పక్షి ఎప్పుడూ నిరాశకు గురికాదు, అది తన ఉనికిని ఆస్వాదిస్తోంది.
కానీ ఇతర మానవులను మంచి స్థాయిలో చూసిన తర్వాత మానవులు చాలా త్వరగా ఆందోళన చెందుతారు.
పోల్చుకోవడం మరియు అసూయ మన జీవితాలను పరిమితం చేస్తాయి.
ఎవరితోనూ అసూయ లేదు, ఎవరితోనూ పోటీ లేదు..!
నాకు నా స్వంత గమ్యాలు ఉన్నాయి, నా స్వంత వేగం ఉంది...!
"పరిస్థితులు ఎప్పుడూ సమస్యగా మారవు, ఆ పరిస్థితులను ఎలా అధిగమించాలో మనకు తెలియకపోవటం వలన సమస్య సృష్టించబడుతుంది."
♾️
"మనం ఎప్పుడూ ఆందోళన చేసే విషయాలు మన అంతర్గత స్వభావాన్ని మారుస్తాయి. మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండటం పూర్తిగా భిన్నమైన స్థాయిని సృష్టిస్తుంది."
*దాజీ*
హృదయపూర్వక ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment