Friday, November 14, 2025

10 Secrets to a HAPPY Marriage Life! #love #madangupta #happymarriage

10 Secrets to a HAPPY Marriage Life! #love #madangupta #happymarriage

https://youtu.be/JTRB8mTHMvw?si=q2KglXcfjxagp6pY


నమస్తే సదా వత్సలే మాతృభూమి. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్త మిత్రులారా, మనకున్న సబ్స్క్రైబర్స్ కంటే చూస్తున్నటువంటి వ్యూయర్స్ దాదాపు 70% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం  లేదు. ఈ విషయాన్ని గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎక్కువ  ఉత్సాహం వస్తుంది. ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ పండంటి కాపురానికి 10 సూత్రాలు చెబుతున్నాను. వీటన్నింటిని లేదా వీటిలో కొన్నింటిని మీ జీవితంలో సాధన చేయండి. మీ వైవాహిక  జీవితం ఆనందంగా గడుస్తుంది. మొదటి సూత్రం వీలైనంత వరకు తగాదా లేదా గొడవలకు దూరంగా ఉండండి ఒకరు గొడవ పడుతూ ఉంటే రెండవ వారు గమ్ముగా ఉండడానికి ప్రయత్నించండి.  వీలైనంతవరకు తగాదా పడడానికి దూరంగా ఉండండి. ఏ గొడవ అయినా సూర్యాస్తమయానికి ముందే పూర్తఅయ్యేటట్లుగా ప్రయత్నించండి. మీరు సరిగ్గా మాట్లాడలేదు తప్పుగా మాట్లాడాను అని మీరు భావిస్తే  మీరు అవతలి వాళ్ళను సరిగ్గా అర్థం చేసుకోలేదని మీరు రియలైజ్ అయితే అది మీకు చిన్నతనం కాదు మీ జంటలో ఒకరికొకరు సారీ లేదా క్షమాపణ చెప్పుకోవడం  కోరడం చిన్నతనం అనిపించుకోదు. ఒక చిన్న కథ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఇద్దరు యువత యువకులు ఉండేవాళ్ళు ఇద్దరు చాలా షార్ట్ టెంపర్ చాలా చిన్న విషయాల కూడా ఇతరులతో గొడవపడుతూ ఉండేవారు. అలాంటి వారిద్దరికీ పెళ్లిఅయింది ఊరంతా అనుకున్నారు వీళ్ళ కాపురం ఎక్కువ రోజులు నిలవదు అని ఆశ్చర్యకరంగా  వాళ్ళ కాపురం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వాళ్ళ 25వ వివాహ వార్షికోత్సవం నాడు ఊరంతా వాళ్ళ కాపురం ఇన్నేళ్ళు సవ్యంగా నడపడంలో నడవడంలో ఉన్న రహస్యాన్ని వెల్లడించమని అడిగారు. అందుకు భర్త మేము మా మొదటి రాత్రి ఒక  నిర్ణయం తీసుకున్నాం. ఒకరు టెంపర్ గా లేదా కోపంగా ఉన్నప్పుడు లేదా అరిచేటప్పుడు రెండవ వారు గమ్ముగా ఉండాలి అని ఆ కట్టుబాటుకు నిలబడడం అందుకే ఏ గొడవ  లేకుండా 25 సంవత్సరాలు హాయిగా సంసారం చేశం అని రహస్యాన్ని వెల్లడించాడు. ఇంకో సంఘటన చూద్దాం. ఒక స్త్రీ ఒక గొప్ప గురువుగారి దగ్గరకు వచ్చి చెప్పింది స్వామి మా వారు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు చీటికి  మాటికి అరుస్తూ ఉంటారు. నేను ఆయనను భరించలేకపోతున్నాను అని అప్పుడు ఆ గురువుగారు  ఒక బాటిల్లో నీళ్లుు తెప్పించి ఆమె చేతిలో ఉంచాడు. ఆమె అడిగింది స్వామి ఆయన కోపంగా ఉన్నప్పుడు ఈ నీళ్ళు ఆయన చేత తాగించమంటారా  అని అందుకు స్వామీజీ చెప్పారు కాదమ్మా మీ ఆయన గొడవ పడుతూ ఉన్నప్పుడు అరుస్తూ ఉన్నప్పుడు ఈ నీళ్లు ఒక బుక్కెడు నీ నోట్లో పోసుకొని పుకిట్లో ఉంచుకో మీ ఆయన కోపం తగ్గేదాకా నీళ్ళను ఉయ్యడం గాన మింగడం గాన చేయకు  అని సలహా ఇచ్చాడు అంటే ఇక రెండోవారు దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోతే అవతల వారు కొంతసేపు  వాక్కొని వెళ్ళ వెళ్ళిపోతారు. ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్  ఐన్స్టీన్ తన 25వ వివాహ వార్షికోత్సవం నాడు ఆయన వైవాహిక  జీవిత సాఫల్య రహస్యాన్ని వెల్లడించాడు. మా మొదటి  రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక చిన్న చిన్న నిర్ణయాలన్నీ మా  ఆవిడ తీసుకునేటట్లు పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ నేను తీసుకునేటట్లు అయితే పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం నాకు ఇప్పటివరకు  రాలేదు అని రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఇక రెండవ సూత్రం మీ జీవిత భాగస్వామి నుండి పరిపూర్ణతను ఆశించవద్దు డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్ ఫ్రమ యువర్ స్పౌస్ ఈ  ప్రపంచంలో పరిపూర్ణమైన మనుషులు ఎవ్వరూ లేరు అని గుర్తించండి. పెళ్లి అనేది ఇద్దరు అపరిపూర్ణ వ్యక్తుల కలయక ఎవరైనా ఇంతకుముందు ఉన్నట్లు ఇప్పుడు ఉండరు ఇప్పుడు ఉన్నట్లు భవిష్యత్తులో ఉండరు మనిషి ఎప్పుడు మార్పుకు గురి అవుతూ ఉంటాడు. మార్పు అనేది ఈ సృష్టి సహజ గుణం మూడవ సూత్రం ఎదుటివాళ్ళు చెప్పేది శ్రద్ధగా  వినండి. బి ఏ గుడ్ లిసనర్ మీరు ప్రపంచంలో దేన్నైనా సాధించగలరు శ్రద్ధగా వినేవాళ్ళం తప్ప నేను చాలా సమావేశాల్లో గమనించాను ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో లేచి ఏదో ఒకటి అడిగేవాళ్ళను మాట్లాడుతున్న వ్యక్తి మొత్తుకుంటూ ఉంటాడు  నేను చెప్పదలుచుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పనివ్వండి పూర్తి చేయనివ్వండి అని మొదట అవతలి  వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకుంటే  ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా అనుభవంలో గ్రహించారా మీరు మాట్లాడుతుంటే  అవతల వ్యక్తి జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. బ్రిటిష్ నాయకుడు బెంజమిన్ డిజ్రైవ్ అంటాడు. భగవంతుడు రెండు కళ్ళు రెండు నాసికారంద్రాలు రెండు చెవులు  ఇచ్చాడు కానీ నోరు మాత్రం ఒకటే ఇచ్చాడు అది రెండు చెవులకు మధ్యలో నోటినే అమర్చాడు. ఎందుకో తెలుసా ఎక్కువగా విను ఎక్కువగా చూడు తక్కువగా మాట్లాడు అని ఎక్కువగా  మాట్లాడడం దేవుడికి ఇష్టమైతే చెవుల స్థానంలో నోళ్ళను ఉంచేవాడు. అప్పుడు మనం ఎలా ఉంటామో ఒకసారి  ఊహించుకోండి మంచి వక్తగా కంటే మంచి శ్రోతగా ఉండండి. నోటి విషయంలో భగవంతుడు ఎన్ని జాగ్రత్తలు  తీసుకున్నాడో చూడండి. హృదయం నుండి వెలుబడే భావం గొంతులో నుండి బయటకు వచ్చి నాలుక పళ్ళు పెదవులు వీటిని దాటుకొని బయటపడాలి. అదే చెవులు నిరాటంకంగా వినే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి శ్రోతగా  ఉండండి బి ఏ గుడ్ లిజనర్ మీ నాలుక విషయంలో జాగ్రత్తగా  ఉండండి అది తేమ ఉండే ప్రదేశంలో ఉంటుంది. ఎప్పుడైనా చారే అవకాశం ఉంటుంది. ఒక్క మాట  స్నేహితుల్ని విడదీస్తుంది బంధుత్వాల్ని చెడుకుతుంది కాపురాలని కూలుస్తుంది యుద్దాలు సృష్టిస్తుంది అదే మాట స్నేహితుల్ని దరిచేస్తుంది బంధువుల్ని కలుపుతుంది కాపురాలని నిలబెడుతుంది యుద్ధాలని నివారిస్తుంది మాటే మంత్రం మాట్లాడిన మాట విడిచిన బాణం లాంటిది దాన్ని వెనుక్కు  తీసుకోలేము మాట్లాడని మాట సద్ది మూట కాబట్టి శ్రద్ధగా వినండి ఆలోచించి మాట్లాడండి నాలుగవ సూత్రం అందరినీ అభినందించండి పొగడండి గ్రో ఇన్ ది స్పిరిట్ ఆఫ్ అప్రిసియేషన్ అందరిని పొగుడుతూ ఉండండి మీ భార్యను పొగడండి మీ పిల్లల్ని పొగడండి మీ స్నేహితులని పొగడండి మీ ఆఫీస్ లో మీ సహచరులని పొగడండి పిల్లల్ని అభిదంచండి  వాళ్ళని కోప్పడద్దు మీరు పిల్లల్ని కోప్పడితే వాటిలో వికాసం అడుగంటిపోతుంది. ఒక సంఘటన చూద్దాం ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి మీ పేరేంటి  అని అడిగాను. స్కూల్లో నన్ను రమేష్ అని పిలుస్తారు కానీ ఇంట్లో రమేష్ డోంట్ అని పిలుస్తారు. అలా ఎందుకు  అని అడిగాను. స్కూల్లో అందరూ రమేష్ అనే పిలుస్తారు నన్ను ఇంటికి వెళ్ళగానే రమేష్ డోంట్ సిట్ లైక్ దిస్ రమేష్ డోంట్ టాక్ లైక్ దిస్ రమేష్ డోంట్ డ లైక్  దిస్ అని అంటూ ఉంటారు. అందుకని నేను ఇంట్లో రమేష్ డోంట్ పిల్లల్ని ఎదగనిచ్చే పద్ధతి ఇది కాదు. పిల్లల్ని ఎప్పుడు  తిడుతూ ఉంటే వారు పెద్ద నిషేధ మూర్తులుగా తయారవుతారు. పిల్లల్ని మెచ్చుకుంటూ ఉంటే వారిలో  వికాసం ఎక్కువగా ఉంటుంది. ఒక అమెరికా తత్వశాస్త్రవేత్త విలియం జేమ్స్ అంటాడు మానవ హృదయం మెప్పును కోరుతుంది. మీరు ఎవరినైనా మెచ్చుకుంటే పైకి సిగ్గు నటించిన లోపల పొంగిపోతారు. ఇంకొక తత్వ శాస్త్రవేత్త ఇలా అంటాడు మానవులు రెండు విషయాలు తప్పనిసరిగా కోరుకుంటారు. ఒకటి సెక్స్ రెండవది మనీ డబ్బు అని అందరూ అనుకుంటారు కానీ మరో రెండు విషయాలు కూడా మనిషి కోరుకుంటాడు  అవి ఒకటి మెప్పు రెండు గుర్తింపు లియోనార్డ్  డాన్సీ అంటాడు నీ స్నేహితులని గురించి గాని నీ జీవిత భాగస్వామిని గురించి గాని ఇతరుల ముందు విమర్శించకు వాళ్ళ పొరపాట్లు ఏవైనా ఉంటే  వారి ముందే సౌమ్యంగా చెప్పండి అని ఇక ఐదవ సూత్రం మీలో క్షమా గుణాన్ని పెంపొందించుకోండి. గ్రో ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ వివాహం యొక్క ప్రధాన సూత్రం ఒకటే ఇవ్వు ఇవ్వు ఇవ్వు నువ్వు ఇచ్చిన దానికి ఫలితాన్ని ఆశించకు క్షమించు క్షమించు క్షమించు ఎన్నిసార్లు క్షమించావో లెక్కించకు జీసస్ ఆయన భక్తులను అడిగారు ఎవరైనా ఎన్నిసార్లు క్షమించాలి అని జీసస్ చెప్పాడు  లెక్క లేకుండా క్షమించడం అలవాటు చేసుకోండి అని ఇద్దరు  చిన్ననాటి స్నేహితులు చాలా కాలం తర్వాత బజార్లో కలుసు కుంటారు పొద్దుపోయే వరకు ఒక రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వారికి సమయమే  తెలియలేదు. ఇంతలో వారిలో ఒకరికి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. దాంతో ఆయన కంగారుగా పరిగెడుతూ  ఇంటికి వెళ్ళాడు. మర్నాడు స్నేహితుడు ఫోన్ చేసి అడిగాడు రాత్రి ఇంటికి పరిగెడుతూ వెళ్ళడం ఏమైనా సీరియస్ అని దానికి  ఆయన అదేం లేదు రాత్రి మా ఆవిడ హిస్టారికల్ గా మారింది అన్నాడు అవతల స్నేహితుడికి  అర్థం కాలేదు హిస్టారికల్ గానా అని అడిగాడు కాదు కాదు హిస్టారికల్ గానే రాత్రి ఆమె గత చరిత్రనంతా విప్పింది. పెళ్లయినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన తప్పులన్నీ రాత్రి ఏకరవు పెట్టింది అన్నాడు క్షమించడం  అంటే ఇలా కాదు షేక్స్పియర్ అంటాడు క్షమ అనేది మనల్ని కష్టపెట్టే విషయం కాదు క్షమ అనేది స్వర్గం నుండి భగవంతుడు కురిపించే సన్నటి చిరుజల్లు లాంటిది ఇతరుల తప్పులని క్షమించలేని  వాడు భగవంతుడు కురిపించే దయా వర్షానికి గొడుగు అడ్డం పెట్టుకున్నవాడే అవుతాడు. వినయం నమ్రత  విధేయతలు మీలో పెంపొందించుకోండి. ఇది ఆరవ సూత్రం గ్రో ఇన్ ది స్పిరిట్ ఆఫ్ హూమిలిటీ చాలా అవసరమైన గుణం మీరు  స్వర్గ తుల్యమైన గృహాన్ని నిర్మించుకోవాలి అంటే వినయాన్ని అలవర్చుకోండి అండర్స్టాండింగ్ అంటే అర్థం ఏమిటి అండర్స్టాండింగ్  అనే పదం ఏ సందేశాన్ని ఇస్తుంది అండర్స్టాండ్ కింద నిలబడండి ప్రతివాళ్ళు పైన నిలబడాలని చూస్తారు కింద నిలబడడానికి అణగి మణగి ఉండడానికి ఎవరు ప్రయత్నించరు. అలా ఉన్నందువల్ల మీ గొప్పతనమే తగ్గిపోతుంది. అనువు గాని చోట అధికులమన రాదు కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభవిరామ వినురవేమ ఎప్పుడు మీరు గొప్పలు చెప్పుకోకండి. నేను అది  చేశాను నేను ఇది చేశాను నేనే అంతా సంపాదించాను అంటూ గొప్ప గొప్పలకు పోకండి. మేరీ అండర్సన్  ఎప్పుడు తన ఉపన్యాసంలో నేను అనే పదాన్ని వాడలేదు. ఒకసారి ఒక సభలో ఇదే ప్రశ్నను ఒక విలేగరు  అడిగాడు మీరు ఎప్పుడు నేను అనే పదాన్ని వాడలేరు కారణం ఏమిటి అందుకు ఆమె  ఇచ్చిన సమాధానం అద్భుతం ఈ ప్రపంచంలో ఏదైనా ఒక్కరే సాధించలేరు  ప్రతి కార్యం సమిష్టి కృషి అని అలాగే ఇల్లు  సభ్యంగా నడవాలి అంటే భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు బంధువులు మిత్రులు అందరి సహకారం ఆ కుటుంబ అభివృద్ధికి  కారణం భార్య ప్రోత్సాహం భర్త భర్తను అభివృద్ధి పదాన ముందుకు నడిపిస్తుంది. భర్త ప్రోత్సాహం భార్య ఆనందానికి కారణం అవుతుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లల అభివృద్ధికి కారణం అవుతుంది. కాబట్టి సమిష్టి కృషి ఏదైనా కార్యాన్ని సాకారం సాఫల్యం  చేస్తుంది. నేను అనే యుగో అహాన్ని వదిలి అనగుగా ఉండడం అలవాటు చేసుకుంటే  మన ఇల్లు స్వర్గాలే సెయింట్ ఫ్రాన్సిస్ ని ఒకసారి కొందరు  మిత్రులు అడిగారు నువ్వు అందగాడివి కాదు గొప్ప శక్తివంతుడివి కాదు గొప్ప తెలివిగలవాడివి కాదు బాగా చదువుకున్న వాడివి కాదు కానీ  ప్రజలందరూ నిన్ను గొప్పగా ఎందుకు గౌరవిస్తారు అని అడిగాడు అందుకు ఆయన  ఇచ్చిన సమాధానం ఆ భగవంతుడు తన దయ యొక్క మహత్యాన్ని  చూపించాలని తలంచాడు మానవుల్లో ఎందుకు పనికి రానివాడు ఎవరైనా  ఉన్నారా అని వెతికి వెతికి నన్ను పట్టుకున్నాడు.  ఈ కీర్తి ఈ ప్రఖ్యాతి అంతా ఆయన దయావర్షమే అని సమాధానం ఇచ్చాడు. అంతటి గొప్పవాడు తనను  తాను ఎలా చూసుకుంటున్నాడో గమనించండి. అంతటి అనుకువ మనదిగా చేసుకుందాం. ఇక  ఏడవ సూత్రం చర్చించండి వాదించవద్దు డిస్కస్ బట్ నాట్ ఆర్గ్యూ మీరు ఏదైనా విషయాన్ని చర్చించండి వాదించవద్దు  మీరు ఎప్పుడూ వాదించడం వల్ల గెలవలేరు అవతలి వారిని మీ వాదన పటిమతో అలసిపోయేటట్టు చేసి వారు వాదనను వదులుకునేటట్లు మాత్రమే చేయగలరు. ఇఫ్ యు విన్ ద ఆర్గ్యుమెంట్ యు  లూస్ ద పర్సన్ మీ కుటుంబంలో వాదనకు తాగిస్తే  మీరు కుటుంబంలోని సభ్యులను కోల్పోతారు. సమస్య ఉన్నప్పుడు దాని మీద చర్చించండి  మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ అభిప్రాయమే గెలవాలని మీ నిర్ణయమే అమలు కావాలని పట్టుదలకు పోకండి. చాలా కాపురాలు కోరడానికి కారణాలు పట్టుదల  వాదించుకోవడాలు. ఇక ఎనిమిదవ సూత్రం మీలో హాస్యరసాన్ని కాస్త అభివృద్ధి  చేసుకోండి. డెవలప్ ఏ హెల్తీ సెల్స్ ఆఫ్ హ్యూమర్ నవ్వడం నేర్చుకోండి నమ్మడం శరీరానికి మంచి  టానిక్ లాంటిది అది శరీరానికి మనసుకు ఆధ్యాత్మికతకు తలాన్ని ఇస్తుంది. నమ్మడం వలన లంగ్స్ బాగా పనిచేస్తాయి  రక్త ప్రసరణ బాగా జరుగుతుంది తిన్నది బాగా అరుగుతుంది. మీ బుద్ధికి  బలం చేకూరుతుంది. మీరు నవ్వడం నేర్చుకోండి. మనం హాయిగా నవ్వడం మర్చిపోయి ఎంత  కాలం అయింది నవ్వలేని వాడు బ్రతుకు అందం ఎరుగలేడు నవ్వలేని  వారు జీవితంలో ఆనందంతో పాటు అన్ని కోల్పోయినట్లే ఇతరుల నిస్సహాయత మీద ఇతరులను కించపరచడానికి  నమ్మకండి హాస్యం నవ్వు ఈ రెండు మనకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి. మేడం గాడ్ని అడిగాడు ఈవుని ఎందుకు అంత అందంగా సృష్టించావు అని  గాడ్ సమాధానం నువ్వు ఆమెను ప్రేమించడానికి ఈవు అడిగింది ఆడమని ఎందుకు అంత తెలివి  తక్కువ వాడిగా సృష్టించావు అని గాడ్ సమాధానం అతడు నిన్ను ప్రేమించడానికి అని ఇంకొక సరదా విషయం ఓ జంట భర్త కొడుక్గా భార్య పొట్టిగా ఉంటుంది. ఒకరోజు ఇద్దరు వాదనకు  దిగారు భర్తకు బాగా కోపం వచ్చి నిన్ను మింగేస్తాను అన్నాడు. భార్య కాస్త సరదా మనిషి నన్ను మింగితే మీకు తలలో కంటే కడుపులోనే మెదడు ఉంటుంది అన్నది ఇంకొక సరదా జోక్ చెప్పుకుందాం. ఒక భర్త తన భార్యను గురించి ఒక స్నేహితుడికి చెప్తున్నాడు. ఇంతకుముందు నా భార్య నాకు బూట్లు  తెచ్చిచ్చేది మా కుక్క అరుస్తూ ఉండేది. ఇప్పుడు సీన్ మారింది సీన్ రివర్స్  అయింది నా కుక్క బూట్లు తెరుచుతుంది నా భార్య అరుస్తూ ఉంది  అని ఆమె కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఎందుకు మీరు అలా చెప్తారు మీకు ఇప్పుడు కూడా రెండు లభిస్తున్నాయి కదా ఊట్లు లభిస్తున్నాయి అరుపులు  లభిస్తున్నాయి ఇలా ఇంకొక సరళా విషయం చూద్దాం ఒక జంట వార్షికోత్సవం జరుపుకుంటూ ఉండి భర్త చాలా  విచారంగా కూర్చొని ఉన్నాడు ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు అని భార్య అడిగింది. మీకు గుర్తుందా పెళ్లికి ముందు మనం ఒకే మంచం మీద ఉండంగా  మీ నాన్నగారికి పట్టుబడ్డాం. తర్వాత ఆయన నన్ను కూర్చోబెట్టి నేను ఈ విషయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్  చేస్తే నీకు 20 సంవత్సరాలు జైల్ శిక్ష పడుతుంది. కాబట్టి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడు. ఆ రోజు  నిరాకరించినా బాగుండేది. ఈ పాటికి జైల్ నుంచి బయట పడేవాడిని అని వాపోయాడు. హాస్యం  జీవితంలో ఒక భాగంగా ఉండాలనుకున్నాం కాబట్టి కొన్ని జోక్స్ చెప్పుకున్నాం. కొన్ని సరదా విషయాలు  మాట్లాడుకున్నాం తొమ్మిదవ సూత్రం మీ హృదయాలు ప్రేమతో నింపండి. ఫిల్ యువర్  హార్ట్స్ విత్ లవ్ మీ కుటుంబ సభ్యులను ప్రేమించండి. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించండి. ప్రేమ అనేది మీ మనసులో చోటు చేసుకుంటే  మీ హృదయం సున్నితం అవుతుంది. ఎవరిని నొప్పించడానికి ఇష్టపడరు. ఈ ప్రేమ నిస్వార్ధంగా ఉండాలి. ఎదుటి వారి నుంచి ఏమి ఆశించకుండా ప్రేమించగలగాలి. మీరు ఇతరులను ఎంత ప్రేమిస్తారో ఇతరులు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తారు. ద్వేషం ద్వేషాన్ని ప్రేమ అనేది మీ  మనసులో ఉంటే మీ కుటుంబ సభ్యులు చేసే చిన్న చిన్న పొరబాట్లు మీకు కనిపించవు. మీ ప్రేమ అందరినీ మీకు దగ్గర చేస్తుంది. ప్రేమ అనే ఒక్క పదాన్ని గురించి చెప్పాలి అంటే రోజులు తరబడి చెప్పొచ్చు కాబట్టి ఆఖరి అంశాన్ని చూద్దాం 10వ సూత్రం భగవంతుని మళ్లా మీ ఇంట్లోకి తీసుకురండి.  బ్రింగ్ గాడ్ ఇన్ యువర్ హోమ మనం ఇవాళ ఇళ్ల నుంచి భగవంతుని తోసి వేసాం.  ఆ ఖాళీని దెయ్యాలు ఆక్రమించుకున్నాయి. ఇది ఎంత నిజమో ఆలోచించండి.  దెయ్యాలు భూతాలు ఎన్ని ఇళ్ల మీద స్వారీ చేస్తున్నాయో చూడండి. స్పిరిచువల్ థాట్స్ కు దూరమైతే ఆ గ్యాప్ ని ఈవిల్ థాట్స్ భర్తీ చేస్తాయి. మీ గృహాలు మీ కుటుంబాలు చల్లగా ఆనందంగా ఉండాలి అంటే మళ్ళా  మీరు దేవుని ఇంట్లోకి ఆహ్వానించండి. దేవుని ఆరాధించండి ప్రతిరోజు అందరూ కలిసి దేవుడి పటం ముందు కూర్చొని 10 నిమిషాలు ప్రార్థన చేయండి.  మీరు ఏ దేవుడినా పూజించండి శివుడు విష్ణువు దుర్గ రామ కృష్ణ అల్లా యెహోవా బుద్ధుడు ఏ దేవుడైనా లేదా ఏ సాధువు పురుషుల మహాత్ముల చిత్రపటాన్ని శిరిడి సాయి పుట్టపర్తి సాయి బుద్ధుడు గురునానక రమణ మహర్షి మెహర్బా ఎవరైనా గాని మీ ఇంట్లో ప్రతిష్టించండి. మీ ఇంట్లో ప్రధానమైన చోట ఆ చిత్రపటాన్ని  పెట్టండి. మీరు బయటకి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక్కసారి ఆ చిత్రపటానికి నమస్కరించండి. రోజులో ఒక్క పూట ఇంట్లో అందరూ  కలిసి భోం చేయండి ఈ రెండు విషయాలు మీ గృహాన్ని స్వర్గతుల్యం చేస్తాయి. ఆనందాన్ని ప్రశాంతతను మీ సొంతం చేస్తాయి. ఇది మిత్రులారా ఈ 10 సూత్రాలను పాటిస్తారని  లేదా 10లో కొన్ని సూత్రాలనైనా పాటించి మన జీవితాలను మన కాపురాలను బాగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను. మిత్రులారా  ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలు మీ కుటుంబాలు మీ గృహాలు స్వర్గధామాలు  కావాలనే గాఢమైన కోరిక ఎన్నో కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయ అనే బాధ వివాహ స్ఫూర్తి లోపిస్తుంద లోపిస్తుందనే  ఆర్తి సంస్కృతి సాంప్రదాయాలు అడుగంటిపోతుంటే చూస్తూ పడుతున్న ఆవేదన ఈ పనికి పురికొలిపింది. మీ కాపురాలు మీ గృహాలు మీ కుటుంబాలు కలకాలం చల్లగా ఆనందంగా ఉండాలని సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కాంక్షిస్తూ మీ మదన్ గుప్త మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవా మరి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లైతే వెంటనే మన ది మదన్ గుప్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి,  షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ మిత్రులకు కూడా ది మదన్ గుప్త ఛానల్ ను పరిచయం  చేయండి. జై హింద్ జై మాభారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త

No comments:

Post a Comment