Thursday, November 13, 2025

 *_ఓ... మాయల మనిషి..._*
*_ఓ... మానవా... ఇకనైనా మానవా..._* 

*_నేను... నేను... నేను అన్న దేహం బూడిద అవుతుంది ఏదో ఒక రోజు._*
*_నాది... నాది అన్నవన్నీ చావుతో వదిలిపోతుంది ఒకరోజు._*
*_చివరికి పంచభూతాళ్లలో  కలిసి పోతావు. నీ అస్తిత్వమే ఉండదు ఈ లోకాల్లో... మన వ్యవహారిక భాషలో పేరు మాసిపోతుంది._*

*_బ్రతకడం అంటే తినడం, త్రాగడం ఆనందించడం, నిద్రించడం, భోగాలను అనుభవించడం కాదు! నీ శరీరాన్ని వదిలి వెళ్లిన నీ జ్ఞాపకాల్లో బ్రతకడం... అది కదా జీవితమంటే..._*

*_కనీసం నీవు నూలు పోగుతో కూడా రాలేదు. దిగంబరుడవై వచ్చావు, దిగంబరుడవై వెళ్ళిపోతావు. చివరికి దింపుడు కళ్లెం కాడ నిన్ను దోచుకుంటారు సుమీ... నా అనే నీవల్లే... నువ్వు సాధించింది ఏంటి.?_*

*_చావు పుట్టుకల మధ్య ఉన్న సంబంధమే నీ కర్మ. సమాజానికి మంచి చేస్తే మంచి కర్మ. చెడు చేస్తే చెడు కర్మ. ఇవే నీ వెంట వచ్చేది గుర్తిరువు..._*

*_ఆస్తి అంతస్తులు, డబ్బు, అధికారం, హోదా, ఇవన్నీ కేవలం నీవు బ్రతికున్నంత వరకు మాత్రమే... అవి కేవలం గాలి మేడలే..._*

*_అసలు నీతో వచ్చేవి ఏంటో తెలుసా.? కేవలం నువ్వు చేసుకున్నటువంటి కర్మ, అనగా మంచి పనులు... పదిమంది హృదయంలో నీ జీవన ప్రయాణం... నిలిచిపోయేటట్టు సాగాలి నీ జీవితం... అదే... జీవితం అంటే... నీ శ్వాస ఆగిపోతే నీ పార్థివ దేహాన్ని చూసి ఉక్కిరిబిక్కిరిగా రోధించాలి. మనస్పూర్తిగా..._*

*_నీ పార్తివదేహాన్ని చూస్తే... కళ్ళనుండి అశ్రుధారాలు... జాలువారాలి... హృదయం ద్రవించాలి... చివరికి మనసా వాచా, కర్మణా నిన్ను అనుకరించాలి అది కదా జీవితం అంటే..._*

*_పుట్టడం గొప్ప కాదు, నువ్వు ఎలా గొప్పగా జీవించావు అన్నదే ముఖ్యం. ఎంత మంచి పనులు చేస్తూ... ఎంతమంది హృదయాన్ని గెలిచుకున్నావనేదే ముఖ్యం... అవే కదా నీ వెంట వచ్చేవి._*

*_సృష్టిలో ఎన్నో జీవులు జన్మిస్తూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి. కానీ మానవుడిగా పుట్టిన నీవు ఎలాంటి... జీవనాన్ని కొనసాగించావు అనేదే ముఖ్యం. బంధాలు బంధుత్వాలు అని కాకుండా నిన్ను... నీ సహాయం కోసం  నీ చెంత చేరి ఆశ్రయించే... అభాగ్యులకు నువ్వు ఎలాంటి మేలు చేశావన్నదే ముఖ్యం...☝️_*

No comments:

Post a Comment