Thursday, November 13, 2025

 🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకం 57

శ్లో॥ కర్తవ్యతైవ సంసారో న తాం పశ్యన్తి సూరయః | శూన్యాకారం నిరాకారా నిర్వికారా నిరామయాః11


కర్తవ్యదృష్టే, ధర్మాచరణభావమే, ఈ సర్వసృష్టికూడా, సర్వవ్యాపిగా నిరాకారంగా, పరిణామ రహితంగా, నిష్కళంకంగా తన్ను తాను గుర్తించిన జ్ఞానికి ధర్మాధర్మాల ప్రసక్తే ఉండదు.

స్వప్నంలో నా కుటుంబానికి, సమాజానికి, నేను నిర్వర్తించవలసిన ధర్మాలెన్నో ఉంటాయి. ఆ కర్తవ్యదీక్ష చాలా పవిత్రమైనది, అనుల్లంఘనీయ మైనది. నిజమే!

స్వాప్నికుడు (తైజసుడు అని పిలవబడతాడు) స్వప్నంలో ఉన్నంత సేపూ అది నిజమనే భావిస్తాడు. ఆ భావనలోనుండే అన్ని ధర్మాలూ బాధ్యతలూ బయలుదేరతాయి. అయితే తైజసుడు స్వప్నంనుండి మేల్కొని విశ్వుడు (జాగృతుడు) గా తన్ను తాను గుర్తించినప్పుడు ఆ ధర్మాల ప్రయోజనం ఏమిటి? ఇంకా ఆ కుటుంబాన్నీ సమాజాన్నీ తన కర్తవ్యాలనూ అతడు గుర్తుంచు కోవాలా? జీవన్ముక్తుడయిన జ్ఞాని, దీర్ఘ స్వప్నంవంటి జగద్య్రమనుండి -ముక్తుడవుతాడు. అనంతమైన చైతన్యమే తానని గుర్తిస్తాడు. మనఃకల్పిత మయిన జగత్తూ దాని ధర్మాలూ కూడా జీవన్ముక్తునికి వర్తించవు. కొన్ని విషయాలమీద ప్రత్యేక విలువా వ్యామోహం ఉన్నప్పుడే కర్తవ్యమూ ధర్మమూ ఉద్భవిస్తాయి. ప్రపంచాన్ని నిజంగా భావిస్తేనే విలువలూ వ్యామోహాలూ ఉండడం సాధ్యమవుతుంది. జ్ఞానిదృష్టిలో ఈ కనిపించే జగత్తంతా భావనామాత్రం, మిథ్య, -వడంతో అతనికి విలువా వ్యామోహమూ ఉండవు, నిర్వర్తించవలసిన ధర్మాలూ ఉండవు.అతడు సిద్ధాంతానికి ఆధారంగా సర్వవ్యాప్త నిరాకార నిష్కళంక చైతన్యంగా తన్ను తాను తెలుసుకున్నాడు.🙏🙏🙏

No comments:

Post a Comment