Thursday, November 13, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(270వ రోజు):--
        ప్రతి వ్యక్తీ తన అంతరంగ వ్యక్తి త్వాన్ని అభివృద్ధి చేసుకొని, ఉత్సాహం గా విశ్వసేవకు ఉపక్రమిం చి నపుడే నిజమైన, పరిపూర్ణమైన ప్రగతి సాధ్యమౌతుంది. మనం సమాజాన్ని సేవించాలి కాని దోచుకో కూడదని ప్రకృతి ఎన్నోసార్లు ప్రత్యక్ష ప్రమాణంతో ఋజువు చేసింది. దీనిని సాధించటానికి మన విద్యా విధానాన్ని తగిన విధంగా మలుచు కోవాలని దృఢంగా చెప్పారు స్వామీజీ. తమలో నిబిడీకృతమై ఉన్న దివ్యత్వాన్ని యువతరం గ్రహిం చాలి. ఈ పారమార్థిక జ్ఞానంతో వారు ప్రశాంత మయమైన, నిర్మల మైన, సంతోషకరమైన జీవితాలను గడపగలరు. 
         సంవత్సరాంతంలో, హిందూ ధర్మరక్షణకు అంకితమైన 'ఈనాటి హిందూమతం' అనే దినపత్రిక హిందుమత పునరుద్దరణకు అవిరళమైన కృషి చేసినందుకు 1992 వ సంవత్సరానికి పూజ్య స్వామి చిన్మయానందను గౌరవిస్తు న్నట్లు ప్రకటించింది. 'ఈ సంవత్సర పు హిందువు' పురస్కారం ప్రపంచ మంతటా ఉన్న హిందువులపై అత్యంత ప్రభావాన్ని చూపిన, హిందూ మతపు విస్తారతనూ, సహిష్ణుతనూ, భూతదయనూ, ఆధ్యాత్మికోన్నతినీ బోధించిన మహానుభావుల కోసం ఉద్దేశించ బడింది. స్వామీజీ గత 40 ఏళ్ళుగా కృషిచేస్తున్న లక్ష్యానికి ఇది నిజంగా సంక్షిప్తమైన, అర్థవంతమైన నిర్వచనం. 
         స్వామీజీ 1993 వ సంవత్సరా నికి తన కార్యక్రమాన్ని నిశ్చయించి ముద్రించారు - జనవరి 20, 1994 వరకూ ఒక్క రోజైనా ఖాళీ లేదు. కాని దానిపై 'ఆరోగ్యం బాగుంటే' అనే రాగల విపత్తును సూచించే అక్షరా లున్నాయి. 1992 లో చేసిన విదేశ పర్యటన నుంచి తిరిగి వచేటప్పుడు ఆయనను విమానం నుంచి క్రిందికి మంచంపై దించాల్సి వచ్చినా, ఈ సారి కార్యక్రమంలో కూడా విదేశ పర్యటన చేర్చారు. 
        1993 ప్రారంభంలో అమెరికా లోని కొన్ని విశ్వవిద్యా లయాల్లో ఉపన్యాసా లిచ్చారు. భారత ఉప ఖండపు చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సంస్కృతభాష, వేదాంతం, మతం మొదలైన విష యాలను బోధించే చాలామంది ఆచార్యులతో సమావేశమై, కొచ్చిన్ లో వేదాంత పరిశోధన కోసం నెల కొల్పబడిన అంతర్జాతీయ చిన్మయ సంస్థ గురించి వివరించారు. ఆ సంస్థకు మౌలిక సదుపాయాలు, గ్రంథాలయం ఏర్పాటు చెయ్యడానికీ ప్రాక్పశ్చిమ దేశాల నడుమ సత్సంబంధాలు నెలకొల్పటానికీ సముచితమైన సలహాల నీయటం ద్వారా సహకరించమని వారందరికీ పిలుపు నిచ్చారు. ఈ సత్కార్యానికి పూర్తి సహకారాన్నందిస్తామని ఆచార్యులంతా వాగ్దానం చేశారు. ఈ సంస్థను అభివృద్ధి చేయటం ఆయనకు ఎంత ప్రియమైన విషయ మో దీనివల్ల స్పష్టమౌతుంది. 
         1993 జులైలో కాలిఫోర్నియా లోని పియర్సీ లోనూ, వాషింగ్టన్ లోనూ ఆధ్యాత్మిక శిబిరాలను పూర్తి చేసి, ఆగస్టు 1 న శాండియాగో చేరారు. ఒక వారం క్రితమే భవిష్య సూచకమైన మాటలన్నారు : "దేవుడు నన్ను పిలుస్తున్నాడు ; కాని, ఈ ప్రజలు నన్ను వెళ్లనీయటం లేదు. రెండువైపుల నుంచీ లాగ బడుతున్న తాడులాఉంది నా పరిస్థితి." 
        🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment