33 మంది 3 ముఖాలతో తిన్నారు?#satyanandiraju #satyasanatandharma #hindu #devotional #spirituality
https://youtu.be/LghrS6HEEMg?si=U2y4bp-pJ9U-52_1
https://www.youtube.com/watch?v=LghrS6HEEMg
Transcript:
(00:00) శ్రీమాత్రే నమః మీ సత్యానంది రాజు గొంతు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల సరిగ్గా లేదు ఈసారి కొంచెం మీరు సద్దుకు పోవాలి. ఇవాళ నేను చెప్పేటటువంటి సత్సంగం గతించినటువంటి యువ గురించి కాదు మీరు నన్ను అడుగుతున్నారు కదా సజీవంగా ఉన్నటువంటి మహాత్ముల గురించి ఒక ఐటిఐ ప్రొఫెషనల్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లీడ్ యూఎస్ వీసా కూడా వచ్చింది కొన్ని రోజుల్లో యూఎస్ వెళ్ళిపోవాలి కానీ వెళ్ళలే ఎవరు ఆపారు ఎందుకు ఆపారు ఆయన ఎందుకు సన్యాసిగా మారారు మాూరు గడ్డలో ఏం చేస్తున్నారు ఎటువంటి సాక్షాత్కారాలను పొందారు స్వామివారు ఎటువంటి తర్ఫీదుని ఇచ్చారు
(00:50) ఈయన సర్వస్య శరణాగతి ఎలా చేశారు ఆయన్ని నేను ఎక్కడ కలిసాను ఎలా కలిశాను మీరు ఆయన్ని ఎలా కలవాలి ఎక్కడ కలవాలి మొబైల్ నెంబర్ మాత్రం నన్ను అడగొద్దు సుమ నాకు అనుమతి లేదు కానీ ఎక్కడ ఉంటారో మీరు ఎలా కలవాలో మాత్రం దానికి అనుమతి ఉంది అవన్నీ మీతోనే పంచుకుంటాను శ్రద్ధగా మీరు సత్సంగం వినాలి. ఇవన్నీ ఇవాళ మనం సత్సంగంలో చర్చించుకోబోతున్నాం నేను అందుకే చెప్తాను మన సత్సంగాలు దత్తస్వామి పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
(01:29) చెప్పే నా పక్కన వినే మీ పక్కన స్వామి వారు శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు. అనుమానం లేదు. స్వామివారు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు మన గురించి ఎందుకు సత్సంగం ఇంకా ఆలస్యం అవుతుందా అని ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి ఆ యోగి గురించి సన్యాసి గురించి మనం సత్సంగం చేసుకొని తరించిపోయి ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు పొందేద్దాం రండి మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ యూఎస్ వీసా కూడా వచ్చింది కొద్ది రోజుల్లో యుఎస్ వెళ్ళిపోవాల్సిందే దీని పేరు సుధీర్ స్వామి పూర్వాశ్రమం పేరు ఇప్పుడు పేరుఏంటో మీకు
(02:12) తర్వాత చెప్తాను నేను వీరి స్వస్థలం అదిలాబాద్ హైదరాబాద్ లో ఉంటుండేవారు వీరి కుటుంబంలో ఒకానొక సమయంలో ఒక సమస్య వచ్చినప్పుడు వీరి గురువు గారు గుప్తా మహారాజుని కలిశారు. ఈ గుప్తా మహారాజు గారు ఎవరు అంటే శివనేసన్ స్వామి వారి శిష్యులు సరే కలిసినప్పుడు గుప్తా మహారాజు గారు నువ్వు చదువుకున్నావు కదా నీ సమస్యను నువ్వు ఎందుకు పరిష్కరించుకోలేవు అని చెప్పి ప్రశ్నించి పంపించేశారు అప్పుడు ఈ సుధీర్ స్వామి గారు జ్యోతిష్య శాస్త్రంలో అష్టక వర్గ అనేటువంటి ఒక జ్యోతిష్య విధానాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు.
(02:50) ఆ నేర్చుకునే సమయంలో స్వామి సమర్థ దర్శనం ఒకానొక శుభ సందర్భంలో జరిగింది. సరే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది కదా ఆ కూలిపోయే కొన్ని రోజుల ముందు స్వామీ సమర్థ దాన్ని లైవ్ లో చూపించారు సుధీర స్వామికి సరే ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత సుధీర స్వామి గారు ఆశ్చర్యపోయారు. ఇలాంటివి కూడా ఉంటాయా ఎందుకంటే అప్పటిదాకా ఆయన ఒక సాధారణ ఐటి ఉద్యోగి ఇటువంటివి ఆయనకి అంతకుముందు అనుభవం లేదు ఇటువంటి సంఘటనలు సరే దాని తర్వాత యూఎస్ వీసా వచ్చింది అని చెప్పాను కదా ఆయన యూఎస్ వెళ్ళిపోవాలి కానీ స్వామి సమర్థ మళ్ళీ దర్శనం ఇచ్చి నేను నిన్ను యూఎస్ పంపించట్లేదు అని చెప్పారు.
(03:36) ఆయనకి కళా భ్రాంత నిజమా ఇది ఏంటిది నాకు విఎస్ విసా వచ్చింది కొన్ని రోజుల్లో వెళ్ళిపోవాలి స్వామి సమర్థ పంపించను అంటున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆ సందిగ్దావస్థలో మళ్ళీ గుప్తా మహారాజు గారి దగ్గరికి వచ్చారు అప్పుడు సుధీర్ స్వామి గుప్తా మహారాజు గారితో ఏమన్నారు అంటే నేను మీ దగ్గర ఉండిపోతాను అని ఇప్పుడు వారు అన్నది ఏమిటంటే నా దగ్గర ఉండే నువ్వు నా నౌకరుగా ఉండిపోతావు అదే స్వామి సేవకు అంకితమైతే ఆ దత్త స్వామి దగ్గర నువ్వు నౌకరిగా ఉంటావు ఏది కావాలో నువ్వే ఆలోచించుకో అని చెప్పా రెండోదే సరైందిగా అనిపించింది సుధీర్ స్వామికి
(04:14) దాని తర్వాత అప్పుడు గుప్తా మహారాజు ఏం చెప్పారంటే ఆ సందర్భంలో ఇప్పుడున్న కాలంలో మూడు ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి స్వామి సమర్ధ క్షేత్రం అక్కల్కోట రెండు మాణిక్యనగర్ మూడు గాపురం నీకు ఎలాగో స్వామి సమర్థ దర్శనం అవుతుంది కదా అలాంటప్పుడు వేరే స్థానాలకు వెళ్లి నువ్వు ప్రయత్నించి చూడు అన్నప్పుడు సుధీర్ స్వామి మాణిక్యనగర్ వెళ్లారు ఐదవ తరం ప్రభువులు సిద్ధేశ్వర మాణిక్య ప్రభువు ఉన్నారు వారి దగ్గరికి వెళ్లి ఈ అష్టక వర్గం గురించి అడిగారు మీరు నాకు ఏమైనా నేర్పిస్తారా వారు నేను అటువంటివి నేర్పించను కానీ నీకు ఎవరు చెప్పారు ఇవి నేను నీకు
(04:59) నేర్పిస్తానని అంటే స్వామి సమర్థే చెప్పారు అని చెప్పారు సుధీర స్వామి అలా అయితే నువ్వు వారినే వెళ్లి అడుగు ఇక్కడ కాదు అన్నారు సిద్ధేశ్వరి మాణిక్య ప్రభు అప్పుడు సుధీర స్వామి గారికి ఇదేంటి ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి సమర్ధ నన్నేమో యూఎస్ పంపించట్లేదు అని చెప్తున్నారు మాణిక్య దగ్గరికి వస్తే ఇక్కడ నా సమస్యకు పరిష్కారం దొరకలేదు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి సరే నేను వెళ్ళే చోట మాత్రం అది నా అంతిమ లక్ష్యం కావాలి అనుకని ఆయన బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు బస్ స్టాండ్ లో ఆ టైంలో ఏ బస్సు వస్తే ఆ ఊరికి వెళ్ళిపోదాం అంటే గాపురం బస్సు వస్తే గాపురం లేదు
(05:38) అక్కలకోట వస్తే అక్కలకోట ఆ సమయంలో అసలు అక్కలకోటకు వెళ్ళే బస్సు లేదు కానీ అక్కలకోటకు వెళ్ళే బస్సు వచ్చింది సరే అది ఎక్కి సుధీర్ స్వామి అక్కల కోటకు వెళ్ళా సరే వెళ్ళారు బానే ఉంది ఆయన తెచ్చుకున్న డబ్బులు కొన్నే ఉన్నాయి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు ఇంకా ఎన్ని ఉన్నాయి నా దగ్గర మరి ఖర్చులు సరిపోవాలి కదా అని చెప్పి లెక్క పెట్టుకుంటూ ఉంటే మిట్ట మధ్యాహ్నం వారి కులదైవం ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చి నువ్వు డబ్బులు లెక్కపెట్టుకుంటున్నావ్ ఇక్కడ కూర్చుని ఇక్కడ స్వామి చాలా కఠినం ఇలాంటివి నువ్వు చేస్తే నిన్ను తన్ని
(06:16) తరిమేస్తారు జాగ్రత్త అని చెప్పి అంతర్ధానం అయిపోయారు. సుధీర స్వామి గారు మళ్ళీ సందిగ్దం యూఎస్ వెళ్లద్దు అంటారు అటు నాకు టైం అయిపోతుంది ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి ఇప్పుడు నేను డబ్బులు లెక్కపెట్టుకుంటూ ఉంటేనేమో అది కూడా ఇక్కడ చెల్లుబాటు కాదు అంటున్నారు నేను ఏం చేయాలి ఇటా స్వామి సమర్థ దర్శనం కావట్లా అక్క కోటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఏదైతే అది అయిపోయింది అని చెప్పి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు తీసుకువెళ్లి హుండీలో వేసేశారు.
(06:48) దేవుణ్ణి పట్టుకోవడం అంటే ఏంటో చూడండి అంత తేలిక కాదు మనం అలా చేయగలమా లేదా అని చెప్పి మనకు మనం ప్రశ్న వేసుకోవాలి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సాధారణ ఐటీ ఉద్యోగిని స్వామి వారు ఎటువంటి జీవితంలోకి లాగబోతున్నారు మీరు ప్రతి మలుపుని జాగ్రత్తగా వింటూ ఉండాలి హుండీలో అన్ని డబ్బులు వేసేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు ఒక సెక్యూరిటీ పర్సన్ వచ్చాడు వచ్చి సుధీర్ స్వామి చేయి పట్టుకొని ని బరాబరా లాకర్ దగ్గర తీసుకువెళ్ళాడు తీసుకెళ్లి అక్కడ సిబ్బందికి చెప్పాడు ఇక్కడి నుంచి ఈ స్వామి వారి దగ్గర మీరు రూపాయి కూడా తీసుకోవడానికి వీలు లేదు దాని తర్వాత అన్నాత్ర దగ్గర తీసుకువెళ్లి
(07:32) అక్కడ కూడా చెప్పాడు అక్కడ రెండు రూపాయలు ఇస్తే భోజనం పెడతారు ఇక్కడి నుంచి ఈ రెండు రూపాయలు కూడా ఈ స్వామి వారి దగ్గర మీరు తీసుకోవద్దు అని చెప్పి ఆ సెక్యూరిటీ పర్సన్ చెప్పాడు అక్కడ సిబ్బందికి ఈ సుధీర స్వామి అక్కలకోటకు వచ్చినప్పటి నుంచి కూడా అన్నచాత్రాలు సేవ చేస్తున్నారు సరే ఇదంతా బానే ఉంది. ఇప్పుడు కొంచెం సామాన్లు పెట్టుకోవడానికి లాకర్ దగ్గర ఒక వసతి దొరికింది.
(07:57) భోజనానికి ఒక వసతి దొరికారు. ఇంకా స్వామీ సమర్థ దర్శనం అవ్వట్లేదు ఏం చేయాలి? అర్థం కావట్లే సుధీర్ స్వామి వారికి బాగా ఆలోచించారు ఇదంతా ఎక్కడ అక్కలకోటలో బొటవృక్ష సంస్థానం దగ్గర అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ఆఖరికి యూఎస్ వీసా కూడా ఆయన తగలబెట్టేసారు అది సర్వస్య శరణాగతి కొంతమంది అడుగుతారు చేయాల్సినవన్నీ చేసేసి భగవంతుడి దర్శనం కావాలి దానికి మనకు అర్హత ఉండాలి కదా మనం భగవంతుడి వైపు ఇన్ని అడుగులు వేసాం ఆయన వచ్చి వచ్చి మనకి ఈ దర్శనం ఇవ్వడానికి ఇప్పుడు సుధీర స్వామి చేసినట్టు మనలో ఎంతమంది చేయగలం నాతో సహా ఈ ప్రశ్న నేను
(08:38) వేసుకుంటున్నాను చిన్న విషయం కానే కాదు అది కొంతమంది యుఎస్ వీసా ఒక జీవిత పరమావధిగా బతుకుతారు తప్పు కాదని అనేది అటువంటి దాన్ని కూడా ఆయన లెక్క పెట్టకుండా తగలబెట్టేసి ఆ మంటలో నుంచి స్వామి సమర్ధ నిలువెత్తు దర్శనం ఇచ్చారు సుధీర్ స్వామికి స్వామి సమర్థ ఎంత పొంగిపోయి ఉంటారు కదా అటువంటి బిడ్డ దొరికినందుకు ఎంత తర్ఫీదుని ఇస్తున్నారో చూడండి దత్తస్వామి అది సర్వస్య శరణ అప్పటినుంచి స్వామి సమర్ వారి నిత్య దర్శనం అవుతూ ఉండే సుధీర స్వామికి అక్కడ మూడు సంవత్సరాలు సేవ చేశారు సుధీర స్వామి ఎంత కఠినమైనటువంటి సేవ అంటే రోజుకి 18 నుంచి 20 గంటలు
(09:14) కష్టపడేవారు పుడుకునేది మహా అయితే ఒక రెండు గంటలు అంతే ఆ అన్నాత్రాలో అంటే అన్నదానం చేసే చోట అలాగే ఆలయంలో స్వామి వారి యొక్క అలంకరణ కానీ అక్కడ శుభ్రం చేయడం కానీ పాదుకలను శుభ్రం చేయడం కానీ అలాగే పల్లకీ సేవ ఇటువంటి సేవలు చేసి ఆయన తరించిపోయారుఅని చెప్పాలేమో సరే మూడు సంవత్సరాలు గడిచిపోతుంది ఆ అదే ఆలయంలో ఆ వటవృక్ష సంస్థానంలోనే స్వామి వారిది పెద్ద నిలువెత్తు ఒక చిత్రపటం ఉంటుంది అక్కడికి ఒకసారి వెళ్ళిన తర్వాత ఎందుకో కానీ స్వామి సమర్ధ ఆగ్రహంతో వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అరిచారు సుధీర్ స్వామి కి భయం వేసింది ఇదేంటి ఎప్పుడూ
(09:53) స్వామి చాలా ప్రసన్నంగా ఉంటారు నేను ఏం తప్పు చేశాను అని చెప్పి మధుర పడిపోతూ భయపడిపోయి స్వామి కొంచెం శాం శాంతించండి నేను కూర్చోవచ్చా అని అడిగారు స్వామి సమర్థ కొంచెం ఆగ్రహం తగ్గించుకున్నారు. పిఠాపురం వెళ్ళమనటువంటి ఆదేశం పొందారు సుదే స్వామి అదే సమయంలో వీరి గురువుగారు గుప్తా మహారాజ్ హైదరాబాద్ నుంచి అక్కలకోట వచ్చి మనం పిఠాపురం వెళ్ళాలి పదా అన్నారు.
(10:18) చూశారా అంటే అది భగవంతుని యొక్క ఆదేశం పిఠాపురం వెళ్ళడం అట్లా పిఠాపురం వచ్చేసిన తర్వాత అప్పుడు గుప్తా మహారాజు గారు స్వామి వారికి ఏదైతే నైవేద్యం పెడతారో దానిలో కొంచెం భాగం ఈ సుధీర స్వామికి వచ్చేలాగా ఏర్పాటు చేశారు అక్కడ కూడా సుధీర్ స్వామి గారు ఎన్నో సేవలు చేశారు లేదు స్వామి వారు చేయించుకున్నారు అందులో మొదటిది అన్నదాన సేవ ఒక రకంగా అన్నదాన సేవ అక్కడ మొదలుపెట్టింది సుధీర్ స్వామి గారు అని చెప్పాలి మొదలుపెట్టిన 40 రోజుల్లోనే ఆ సంఖ్య వెయికి పైగా చేరిపోయాయి కొన్ని కారణాలు రిచ్చా అన్నదాన సేవ ఇంకో స్థలం నుంచి చేయవలసి వచ్చేది ఇక్కడ కూడా
(10:56) పల్లకీసేవ మొదలు పెట్టారు అక్కలకోట నుంచి కొంతమంది అబ్దాగిరి తీసుకొచ్చారు పూణే నుంచి ఒకళ్ళు రాజదండం తీసుకొచ్చారు వెండి రాజదండం తీసుకొచ్చి స్వామి గారు మీకు ఇమ్మన్నారు అని చెప్పి సుధీర స్వామి చేతిలో పెట్టారు ఇక్కడి నుంచి ఆ పల్లకీ చేసిన లీలలు వింటే అసలు దాని గురించి మనం స్వామి కృప ఉంటే వేరే సత్సంగం చేసుకుందాం విడిగా ఆ పల్లకి మొట్టమొదటిసారిగా 1300 కిలోమీటర్లు కాలినడకన భక్తులందరితో కలిసి శిరిడి చేరింది మొట్టమొదటిసారి ఇక్కడ అర్చకులు ఎవరికీ చేనటువంటి ప్రత్యేక పూజలు ఈ పల్లకీకి స్వామి వారికి చేసి వీరందరికీ ప్రత్యేక దర్శనం ఇప్పించారు. రెండోసారి పల్లకీ
(11:37) యాత్ర 700 కిలోమీటర్లు శ్రీకూర్ అరసవెల్లి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా చుట్టి వచ్చారు. మూడోసారి పంచారామాలు అన్ని కూడా పల్లకీ యాత్ర చేయాలని సంకల్పించారు చేతిలో చిల్లిగ అవ్వలేదు మనుషులు లేరు మనుషులు లేకపోతే ఎట్లా పల్లకీ సేవ చేయడం డబ్బులు లేకపోతే ఎట్లా ఖర్చులకి దారి ఖర్చులకి స్వామివారి సంకల్పం వేరేలా ఉంది అక్కడ నుంచి వచ్చాడు ఒకాయన వచ్చాడు వచ్చి కొత్త ఈ టాటా ఏస్ వాహనం మీ కోసమేనండి ఈ పల్లకీ యాత్రకి దీన్ని వినియోగించండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఒక స్పాన్సర్ వచ్చి దారి ఖర్చులు నేను భరిస్తా అన్నారు మనుషులు సమకూరారు ఆ పంచారామాల యాత్ర అంతా పూర్తి
(12:17) చేసుకుని అమరావతి దగ్గరికి వచ్చారు యాత్ర పూర్తి అయిపోయింది ఎటువాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు సుధీర్ స్వామి ఒక్కళ్ళే ఏడు రోజులు ఉన్నారు అమరావతిలో మనుషులు లేరు పల్లకిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి చూడండి సాధనలో ఎన్ని మలుపులు ఉన్నాయో మళ్ళీ ఒక్కొక్కరుగా తిరిగి రావడం మొదలుపెట్టారు అక్కడ నుంచి పల్లకి 2135 km పాదయాత్ర చేసి సుధీర స్వామి ఇక్కడ ఎక్కడ ఆగారో ఇన్ని ఇబ్బందులు పడ్డారో ఇది కూడా తర్ఫీదులో భాగం మాహూరు గడికి చేరుకున్నారు నాలుగున్నర నెలల సమయం పట్టింది మాహూరు గడికి చేరుకొని ఇప్పుడున్న మహంత గారిని దర్శించుకున్నారు వారు సామాన్యులు కాదు మీరు నన్ను
(12:57) అడుగుతున్నారు కదా ఇప్పుడున్న మహాత్ములని ఇప్పుడున్న మహంత గారిని మీరు తప్పకుండా దర్శించుకొని తీరాలి నేను వారిని దర్శించుకోవాలంటే ఏం చేయాలి ఎక్కడ దర్శించుకోవాలి వారి వివరాలన్నీ కూడా వచ్చే మాహుర్ఘట్ సత్సంగం మీతో పంచుకుంటాను సరే ఆ మహంత గారు ఏమన్నారంటే ఇంతమందిలో మీలో మిగిలేది నలుగురో ఇద్దరు అని చెప్పారు వాడికి అర్థం కాలా ఈ వచ్చిన ఈ పల్లకీ బృందంలో అందరూ వెళ్ళిపోగా మిగిలింది నలుగురు మళ్ళీ ఆ నలుగురిలో ఇద్దరు కాలం చేశారు ఇప్పుడు మిగిలింది ఇద్దరే ఆ ఇద్దరిలో ఒక్కళ్లే సుధీర్ స్వామి సరే నన్ను ఇక్కడే ఒక 40 రోజులు ఉండనివ్వండి అని చెప్పి అడిగారు సుధీర్
(13:35) స్వామి మహత్తు గారిని ఇక్కడ కాదు నీటి కొరత ఉంది నువ్వు కొండ కింద ఉండు అని చెప్పి ఆజ్ఞాపించారు మహంతు గారు అప్పుడు సుధీర్ స్వామి ఆ పలకీని తీసుకుని ఇప్పుడు మాతృతీర్థం పక్కన ఉన్న కాశీ విశ్వనాథ్ బాబా ఆశ్రమంలో పెట్టారు అది ఎటువంటి స్థలం అంటే సాక్షాత్తు పరశురాములు వారు రేణుకామాతకి దత్తాత్రేయ స్వామి వారు పౌరోహిత్యం చేస్తూ ఉండగా ఉత్తరక్రియలు జరిపినటువంటి చోటు కరెక్ట్ గా ఈ కాశీ విశ్వనాథ్ బాబా ఆశ్రమం అక్కడే ఉందని చెప్తారు అదే ప్రాంతంలో అట్లా సుధీర్ స్వామి గారు సుమారు 2008 2009లో ఇక్కడికి వచ్చారు మహోరు గట్ల సుధీర స్వామి గారు కొండ కిందకు
(14:15) వచ్చి ఆ రోజుల్లో రోజుకి 500 మందికి అన్నదానం చేసేవారు ఎంత ఓపిక ఉండాలి సాధన మీద ఎంత ప్రీతి ఉండాలి ఆ భగవంతుని మీద ఎంత విశ్వాసం ఉండాలి అవన్నీ ఇచ్చేది ఎవరు స్వామే కానీ దానికి తగినట్టుగా మనం ఉన్నామా లేదా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఆ కాశీ విశ్వనాథ్ బాబా ఆశ్రమంలో బయట ఒక పెద్ద పెద్ద చెట్టు ఉండేది.
(14:43) ఒకసారి అక్కడ పడుకున్నప్పుడు ఒక పెద్ద దేవతా సర్పం కనబడింది. ఆయనకి భయం వేసేసింది సుధీర స్వామికి భయం వేసి అప్పటినుంచి ఆశ్రమం లోపల నిద్రించడం మొదలు పెట్టారు. శ్రీపాదవల్లభులు కనిపించి నువ్వు ఇక్కడ కాదు ఆ చెట్టు కిందే పడుకోవాలి అని చెప్పారు ఆజ్ఞాపించారు. ఆ సాధనలో ఆ తర్ఫీద్ అదంతా కూడా అట్లా సుధీర స్వామి గారు ఆ చెట్టు కింద మూడు సంవత్సరాలు ఉన్నారు ఆయన ఇవాళే నాతో ఒక అనుభవం పంచుకున్నారు ఏంటంటే ఆ కాశీ విశ్వనాథ్ బాబా ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారట ఒకానొక సందర్భంలో సరే అన్నం అంతా కూడా వడ్డించేసి వెనకాల దత్తాత్రేయ స్వామి వారి చిన్న పటం ఉంటే ఇలా నమస్కరించుకొని మళ్ళీ ఈ టేపు
(15:24) తిరిగారట అప్పుడు సరిగ్గా 33 మంది భోజనం చేస్తున్నారు అలా తిరిగి చూడండి డగా ఒక్కొక్కరికి మూడు శిరస్సులు ఉన్నాయట వారందరూ ఆ మూడు శిరస్సులతో అంటే ఆ మూడు ముఖాలతో భోజనం చేస్తున్నారు నమ్మకం ఉంటే భగవంతుడు ఎక్కడ లేడు నేను ఇంకో తమాషా విషయం చెప్తాను దత్తస్వామి అల్లరి చేస్తలు ఎలా ఉంటాయో మీరు అన్నదానం చేస్తూ ఉంటారు అని చెప్పాను కదా ఒకానొక సందర్భంలో దత్తాత్రేయ స్వామి వారు ఈ వంటకాల్లో వేపాకులు వేస్తూ కనిపించారట ఈయన మర్నాడు అదే అదే ధ్యాస లో ఉండి వీరు వండిన వంటకాలు కూడా వేపాకులు కలిపేశారు సుధీర్ స్వామి గారు సరే కలిపేశారు స్వామి వారికి
(16:08) నైవేద్యం పెట్టేసారు అందరికీ కూడా వడ్డించేశారు దాని తరువాత వీరికి ఆలోచన వచ్చింది అయ్యో నీ వేపాకులు కలిపేసాను ఇప్పుడు ఎట్లా చేదుగా ఏమన్నా ఉంటాయా ఎట్లా భగవంతుడా అనుకుంటూ ఉంటే ఎప్పటికంటే కూడా చాలా రుచికరంగా ఉన్నాయి అని చెప్పారు అందరూ అంతే కాదు ఎప్పటికంటే కూడా చాలా త్వరితిగతిన అయిపోయిన అన్ని పదార్థాలు ఇట్లా వీరికి ఆశ్చర్యం వేసింది వేపాకులు కలిపితే ఎక్కడైనా మధురంగా ఉంటాయా పదార్థాలు చేదు రాకుండా ఎలా ఉంటుంది ఒక కాకు తింటే చాలు మనకు తెలిసిపోతుంది ఊరంతా కూడా చేదుగా అయిపోతుంది.
(16:40) ఎట్లా మధురంగా అయిపోయినాయి పదార్థాలన్నీ వీరికి ఆశ్చర్యం వేసే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పదార్థాన్ని రుచి చూడాలని చెప్పి ఆయన ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆయన వరకు పదార్థాలు వచ్చేవి కాదు అయిపోయేవి నెలన్నర తర్వాత అప్పుడు సుధీర్ స్వామి గారికి ఆ రుచి చూసే అవకాశం దక్కింది. నిజంగా అమృత ప్రాయంగా ఉందని చెప్పారు అంటే దత్త స్వామి కృపతోనే ఆ సేవ మొత్తం జరిగింది సరే ఒకసారి సుధీర స్వామి గారు దత్త శిఖరం పైకి వెళ్లారు మహంత గారిని కలవడానికి ఇప్పుడు మహుగారు అన్నారు అట ఎప్పుడు అన్నం వండుకుంటూనే కూర్చుంటావా ఏంటి అని అడిగారు అట దాని తర్వాత దత్త
(17:15) స్వామి వారు కూడా దర్శనం ఇచ్చి పిఠాపురంలో లాగా ఇక్కడ కుదరదు అని చెప్పి చెప్పారట అంటే అన్నదాన సేవే కాదు వేరే సేవ ఏమన్నా ఉందేమో మరి స్వామి వారి సంకల్పం దాని తర్వాత సుధీర్ స్వామి గారికి నరం పట్టేసి నడుము నూనె చెయ్యి నొప్పి రావడం మొదలు పెట్టినాయి అప్పుడు మహంత గారి దగ్గరికి వెళ్ళారట నేను నేను వైద్య పరీక్షలు చేయించుకొని వస్తాను అంటే మహంత గారు కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్లి నువ్వు వెళ్ళు నువ్వు ఎన్ని పరీక్షలు చేయించుకున్న రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా వస్తాయి నీకు ఏం ఉండదు పో అన్నారు నిజంగానే రిపోర్ట్స్ అన్ని
(17:50) నార్మల్ గా వచ్చినా ఏ సమస్యలేదు మహంత గారు మామూలు పీఠాధిపతి కాదు దాని తర్వాత క్రమంగా అన్నదాన సేవ తగ్గిపోతూ వచ్చింది. మరి రోజుకి 18 గంటలు 20 గంటలు కష్టపడేటువంటి సుధీర్ స్వామి గారి ఖాళీగా ఉండడం ఆయన వల్ల కాల మళ్ళీ మహతి గారి దగ్గరికి వెళితే ఆయన ఎక్కడికి వెళ్లద్దు ఇక్కడే ఉండని చెప్పి ఆదేశించారు. నేను ఆ పిఠాపురం వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నారు సుధీరీ స్వామి కానీ మహతి గారి యొక్క ఆజ్ఞ ఆయనకు దొరకలేదు.
(18:22) దాని తర్వాత ఒకానొక సందర్భంలో సుధీర స్వామి వెళ్లి నాకు సన్యాస దీక్షను ఇవ్వండి అని చెప్పి అడిగితే మహంత గారు ప్రత్యేకమైనటువంటి ప్రసాదం పట్టుకు వచ్చి సుధీర స్వామిని కింద పైకి మూడుసార్లు చూస్తూ నీకు పుణ్యఫలం చాలా ఉంది లేకపోతే సన్యాస దీక్ష ఇమ్మని నన్నే డైరెక్ట్ గా అడుగుతున్నావ్ అంటే అది మామూలు విషయం కాదని చెప్పి అప్పుడు సుబాహుభారతి అనేటువంటి సన్యాసా ఆశ్రమ నామాన్ని ఇచ్చారు.
(18:53) అట్లా సుధీర్ గారు సుబాహు భారతీ స్వామి గా మారిపోయారు మనం ఇక్కడి నుంచి వీరిని సుబాహు భారతీ స్వామి అని పిలుచుకుందాం ఇంకో అద్భుతమైన విశేషం ఏంటంటే ఈ సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిన తర్వాత 10వ రోజు కల్లా అనుసూయమాత ఆశ్రమంలో ప్రధాన అర్చకునిగా మారిపోయారు వీరు అక్కడ సహజ సంప్రదాయం ఏమిటంటే ఒక అర్చకుని దగ్గర కనీసం 12 సంవత్సరాలు శిష్యరికం చేస్తే కానీ ఒక సాధారణ అర్చకునిగా కూడా మనం అక్కడ మారలేం అటువంటిది వీరు తిన్నగా సన్యాసం తీసుకున్న 10వ రోజు కల్లా అనసూయ మాత ఆశ్రమంలో ప్రధాన అర్చకునిగా అయిపోయారు.
(19:32) అక్కడ నాలుగైదు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత గత ఐదు నెలలుగా కొండ కింద ఈ మాతృతీర్థం దగ్గరే ఉంటున్నారు. ఇప్పుడు నేను వారిని ఎలా కలిసానో చెప్తాను. నాకు వీరు అక్కడ ఉంటారని నాకు తెలియదు. ఆ దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చిన సంకల్పమే ఎందుకో కానీ మాతృతీర్థం దగ్గర నుంచి మొదలు పెట్టాలి అనుకున్న ఎందుకంటే అది గొప్ప రేణుకా మాత క్షేత్రం అలాగే అనసూయ మాత అత్రి మహర్షి వారి యొక్క తపోస్థలం దత్తాత్రేయ స్వామి వారు పుట్టినటువంటి పరమ పుణ్యక్షేత్రం ఎందుకు ఇది మాతృ సంబంధమైనటువంటి పుణ్యక్షేత్రం అక్కడి నుంచే మొదలుపెట్టాలి అని చెప్పి సంకల్పించుకుని మాతృతీర్థం
(20:15) దగ్గర వెళ్ళాం మొట్టమొదటిసారి కొండ మీద కూడా వెళ్ళలా డైరెక్ట్ గా అక్కడ కాసేపు ఉన్న తర్వాత ఇంక బయలుదేరబోతూ ఉండంగా మా మాతృ సమానురాలు నా తల్లి రాజలక్ష్మి అమ్మగారు మెసేజ్ పెట్టారు నాన్న దగ్గరలోనే కోరీభూమి ఉంది సతీస్థానం అది కూడా చూడండి అని సరే అక్కడి నుంచి దానికి ఎటు వెళ్ళాలో నాకు తెలియదు. సరే ఎందుకో గానీ కుడి వైపు వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి కుడి వైపు స్టీరింగ్ తిప్పారు కరెక్ట్ గా ఇద్దరు పని చేసే వ్యక్తులు బైక్ మీద వెళ్తూ ఉండంగా కోర భూమి ఎక్కడ అని అడిగా బైక్ ఆపేశారు అంటే అక్కడ ఒక రెండు సెకండ్లు ఆలస్యమైనా వాళ్ళు
(20:58) వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు అక్కడ ఆగడం ఎంత ముఖ్యమో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సరే అందులో ఒక వ్యక్తి అన్నాడు నేను మీకు చూపిస్తాను పర్లేదా అన్నాడు అయ్యో రండి తప్పకుండా చూపించండి అని చెప్తే వారు స్వయంగా వచ్చి సరే నన్ను తీసుకువెళ్తూ వారు ఏం చెప్పారంటే ఇక్కడ ఒక తెలుగు సన్యాసి ఉన్నారు చాలా శక్తిమంతులు మీరు వారిని కలిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అక్కడికి తీసుకువెళ్లి వారిని పిలిచారు నేను ఇందాక ఇద్దరు ఉన్నారని చెప్పాను కదా ఇంకొకరి పేరు దత్తానందభారతి వారు సరే ముందు వారు వచ్చారు దాని తర్వాత ఈ సుభాహు భారీ స్వామి వారు వచ్చారు.
(21:39) దాని తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. కానీ నేను దేనికి వచ్చాను సతీ స్థానాన్ని చూడడానికి వచ్చాను దాని ప్రాముఖ్యత ఏమిటనేది నేను మాహుర్ఘట్ సత్సంగంలో చెప్తా కానీ నన్ను ఈ వ్యక్తి ఇక్కడికి తీసుకువచ్చారు. అట్లా సుబాహు భారతీ స్వామి వారిని కలిసేటువంటి అదృష్టం తక్కింది నాకు దాని తర్వాత అప్పుడు కూడా మోటల వారు ఏమన్నారంటే ఇట్లా పైకి వెళ్ళాలండి అక్కడ ఉంటుంది అని చెప్పారు.
(22:07) దాని తర్వాత ఎందుకో ఏదో ప్రస్తావన వచ్చి నేను మీకు రేణుక మాత శిఖరాన్ని చూపిస్తాను అని చెప్పి ఇక్కడ పక్కకు తీసుకువెళ్లి అక్కడ సత్సంగం మొదలయింది. అలా మూడు నాలుగు గంటలు అక్కడే కూర్చుని పోయాను నా ప్లాన్ ప్రకారం ఆరోజు హైదరాబాద్ బయలుదేరాలి ఆ రోజు కేవలం రేణుక మాధ దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి హోటల్ కి వెళ్ళిపోయాం. ఆ మర్నాడు దత్తశిఖరం నూనెను అనుసూయ మాత ఆశ్రమాన్ని దర్శించుకుని అప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చాం.
(22:43) దాని తర్వాత కూడా స్వామివారు ఫోన్ లో ఇంకో నాలుగు గంటలు సత్సంగం చేశారని చాలా తేలిగ్గా చెప్పవచ్చు ఇవాళ కూడా సత్సంగం జరిగింది నిన్న కూడా జరిగింది నా ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్తున్నారు సుబావు భారతీ స్వామి వారు సత్సంగానికి అనుమతిస్తూ నాతో ఏం చెప్పారంటే మీ సత్సంగం అంతా కూడా ఆ దత్త స్వామి చుట్టూనే తిరగాలి నా గొప్పతనంగా ఏది చెప్పవద్దు అంటే అంటే ఒక సాధారణ ఒక ప్రైవేటు ఉద్యోగి ఆధ్యాత్మిక మార్గంలో ఎలా లాగబడతారు ఎటువంటి స్థితుల్ని పొందవచ్చు స్వామి అనుగ్రహంతో మాత్రమే మీరు చెప్పండి అని చెప్పి నాకు చెప్పారు. అందుకనే వారు
(23:28) సిద్ధంగా ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా వారు భగవంతుని మీద భక్తి విశ్వాసాలు పెంపొందించేందుకు వారి యొక్క అనుభవాన్ని మీతో పంచుకునేందుకు కూడా అదే ప్రాంతంలో అక్కడ వారు ఉన్నారు అందుకనే మీరు కలవాలి అనుకుంటే మాూరు గడ్డలో ఆ మాతృతీర్థం దగ్గర కుర్రాడి మఠం అని ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ స్వామివారు ఒక చిన్న ఆశ్రమంలో ఉంటారు నేను మీకు ఆ లొకేషన్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో మీరు కంగారుపడి కామెంట్స్ లో అడగకండి అక్కడికి వెళ్ళండి స్వామి వారితో సత్సంగం చేయండి మరిన్ని విశేషాలు తెలుసుకోండి సాధనలో మీరు పురోగమించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ సత్సంగం మీకు
(24:13) నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. మర్చిపోకండి వచ్చే సత్సంగంలో మా ఊరు గడ్లో ఇప్పటివరకు ఎవరు సత్సంగం చేయనటువంటి అద్భుతమైన తీర్థాలు ప్రాంతాల గురించి మనం సత్సంగం చేసుకోబోతున్నాం ఆ దత్తస్వామి కృపతో కాబట్టి దాన్ని అస్సలు మీరు వదులుకోవద్దు ఈ సత్సంగంలో పాల్గొన్న నాకు మీ అందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు ఆ రేణుక మాత ఆశీస్సులు అలాగే అనసూయమ్మ తల్లి అత్రి మహర్షి వారి ఆశీస్సులు సంపూర్ణంగా మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన సత్సంగంలో మనం అందరం కలుద్దాం. శ్రీ మాత్రే నమః మీ సత్యానంది
(24:57) రాజు.
No comments:
Post a Comment