Saturday, March 14, 2026

MARITAL RAPE: పెళ్లి పేరుతో జరుగుతున్న నిశబ్ద నేరం#telugupodcast

MARITAL RAPE: పెళ్లి పేరుతో జరుగుతున్న నిశబ్ద నేరం#telugupodcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RkWNOOySwf8



Transcript:
(00:06) నా పేరు స్నేహ ఆ రోజు నేను అలసిపోయి నా రూమ్లో మంచం మీద పడుకున్నాను ఇంట్లో పని బాధ్యతలు ఇవి నన్ను పూర్తిగా అలసిపోయేలా చేశాయి కానీ రాత్రికి రాత్రి ఎదురయ్యే మరో బాధ నా శరీరంపై పూర్తి హక్కు నాదేనని నా భర్త ఆలోచన అప్పుడు రాత్రి 11 గంటలు అవుతుంది నా శరీరాన్ని తన కోరిక తీర్చుకునే వస్తువుగా భావిస్తూ నా భర్త నా దగ్గరకు వచ్చాడు నేను నువ్వు చెప్తూనే నా చేతులతో ఆపే ప్రయత్నం చేశాను నేను అలసిపోయాను నాకు ఇప్పుడు ఇష్టం లేదని సమాధానం ఇచ్చాను కానీ అతను నా మాటలను వినే పరిస్థితిలో లేడు
(00:51) అలాగే అతను నా పైన వాలిపోయాడు నేను ఆ సమయంలో ఏం చేయలేక పైకి చూస్తూ ఉండిపోయా ఆ రాత్రి అతను తన పనిని ముగించేసరికి నా కన్నీళ్లు నా దిండును తడిపేసాయి ఆ క్షణం నేను ప్రాణం ఉన్న శవంలా ఫీల్ అయ్యా కనీసం ఇలాంటిది బయట జరిగితే న్యాయం కోసం అరిచే స్వేచ్ఛ అయినా ఉంటుంది నన్ను ఎవరైనా రక్షిస్తారనే నమ్మకం ఉంటుంది కానీ ఇక్కడ రెండు లేవు కనీసం నన్ను కాపాడండి అని అరిచే హక్కు కూడా నాకు లేదు ఆ క్షణం నేను నా కోపాన్ని బాధను నాలో దాచుకోవాల్సి వచ్చింది ఈ సమాజం పెళ్లి అనే లైసెన్స్ కింద ఇలాంటి అత్యాచారాలు చేసే అధికారం
(01:38) ఇచ్చిందా ఇదేనా నా జీవితం నా విలువ అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను ఈ కథ మీరు ఎక్కడా వినకపోయినా ఇలాంటి నిశ్శబ్ద కేకలు ప్రతి రాత్రి ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి ఈ కథ నేను ఇక్కడి వరకే రాశాను ఇక దీన్ని కాస్త ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ లో చూద్దాం ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మొగుడైనా ఏ మగాడైనా మనిషి ఎప్పుడూ సాధనంగా కాకుండా తన స్వతంత్ర వ్యక్తిత్వంతో గౌరవించబడాలి కానీ ఈ సూత్రం పెళ్లిలో ఎందుకు ఆచరణకు రావడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి తర్వాత భర్త భార్యను
(02:25) ఏమే ఇది తీసుకురావే అది తీసుకురావే అంటే ఈ సమాజం దాన్ని అంగీకరిస్తుంది అదే భార్య భర్తను ఒక్క నిమిషం రా తీసుకువస్తున్నా అంటే ఈ సమాజం దాన్ని అంగీకరించదు జస్ట్ పెళ్లి అనేది ఒకరికి ఇంకొకరిపై అధికారం మాత్రమే ఇస్తుంది పెళ్లి అనే కార్డు చేతిలో ఉన్నంత మాత్రాన పార్ట్నర్ అనుమతి లేకుండా చేసే సెక్స్ కూడా రేప్ లాంటిది ఒక మ్యారీడ్ ఉమెన్ మాటలు ఇవి పెళ్లి ఒక ఒప్పందం అది లైసెన్స్ కాదు నీలో కోరిక పుడితే నీ పార్ట్నర్ అనుమతి తీసుకో అప్పుడే నువ్వు నీ పార్ట్నర్ కి రెస్పెక్ట్ ఇస్తున్నట్లు అలా కాకుండా ఇది నా హక్కు అని లాగేసుకున్న ఆమె
(03:08) అరిచి గోల చేయదు ఎందుకంటే ఈ సొసైటీ ఆమెను ఈ విషయంలో మూగదాన్ని చేసేసింది నీ కోరిక తీరాక నిషేమం ఆమె శరీరంపై పడ్డా ఆమె అదే పొజిషన్ లో ఉందంటే ఆ క్షణమే నువ్వు ఆమెను మెంటల్లి చంపేసినట్లు మన సొసైటీలో ఇలాంటివి ఆగాలంటే మన మాట వరసకు చెప్పుకునే అబద్ధాలను నిజం చేయాలి పెళ్లి అంటే జస్ట్ అధికారం కాదు అది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ గౌరవం అనుమతి అనే పునాది మీద నిర్మించబడుతుందనే మాటలను మనం నిజం చేయాలి ఇక నా పర్స్పెక్టివ్ లో ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు ఏదో ఒక వర్క్ చేయాలి
(03:54) ఇలాంటివి జరిగినప్పుడు నీ లైఫ్ నువ్వు బ్రతకగలవు ఆ కెపాసిటీ నీలో ఉందని నీ పార్ట్నర్ కి అర్థమైతే ఇలాంటివి కాస్త తగ్గే అవకాశం ఉంది ఫైనల్ గా మ్యారిటల్ రేప్ ఇండియాలో నేరం కాదు ఒకవేళ ఇలా చేసేవాడు ఎవడైనా ఈ వీడియో చూస్తే గుర్తుపెట్టుకోండి నీ కోరిక కోసం నీ పార్ట్నర్ ని నువ్వు మెంటల్ గా చంపేస్తున్నావని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్

No comments:

Post a Comment