Saturday, March 14, 2026

జీవితాన్ని కంట్రోల్ చేయడం ఆపండి – Lao Tzu చెప్పిన 2500 Year Old Secret | Telugu Podcast

జీవితాన్ని కంట్రోల్ చేయడం ఆపండి – Lao Tzu చెప్పిన 2500 Year Old Secret | Telugu Podcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NwHZUULE_3Y



Transcript:
(00:04) ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మీరు ఎంత కష్టపడినా ఎంత ప్లాన్ చేసినా ఏదో ఒకటి మిమ్మల్ని అసంతృప్తికి గురి చేస్తూనే ఉందని గడియారంతో పోటీ పడుతూ 10 మందిని మెప్పించాలని చూస్తూ ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తూ అలసిపోతున్నారా అయితే ఒక్క క్షణం ఆగండి దాదాపు 2500 ఏళ్ల క్రితం చైనాలో ఒక గొప్ప జ్ఞాని ఉండేవాడు ఆయనే లావోజు ఆయన ఒక వింతైన మాట చెప్పాడు జీవితాన్ని మార్చాలని ప్రయత్నించకు జీవితాన్ని గమనించు చాలు మనల్ని మనం హింసించుకుంటూ సాధించే విజయం కంటే సహజంగా వచ్చే ప్రశాంతత గొప్పదని ఆయన నమ్మారు.
(00:50) ఈరోజు ఈ వీడియోలో మీ లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చేసే లావోజు రహస్యాలను తెలుసుకుందాం. ఈ ఐదు నిమిషాలు మీ జీవితంలో అత్యంత విలువైనవి కాబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఎలా పరిగెత్తాలి అని కాదు ఎలా ప్రశాంతంగా ఉండాలి అని ముందుగా లావోజు ఫిలాసఫీలో అత్యంత ముఖ్యమైన పదం హూవే అంటే పని చేయకుండా ఉండడం అని కాదు బలవంతం లేకుండా పని చేయడం అని అర్థం.
(01:25) ఒక చిన్న ఉదాహరణ చూద్దాం నదిలోని నీరు ఎలా ప్రవహిస్తుంది దారిలో రాయి అడ్డు వస్తే అది గొడవ పడదు నెమ్మదిగా పక్కనుండి వెళ్ళిపోతుంది. ఎవరిని నెట్టదు ఎవరికీ ఎదురు తిరగదు కానీ కాలక్రమేన ఆ మెత్తటి నీరే కఠినమైన రాయిని కూడా కరిగించేస్తుంది. మనం కూడా అంతే మన చుట్టూ ఉన్న మనుషులను పరిస్థితులను మనకు నచ్చినట్టు మార్చేయాలని చూస్తాం.
(01:56) మన పిల్లలు ఇలాగే ఉండాలి మన పార్ట్నర్ ఇలాగే మాట్లాడాలి. మన ఆఫీస్ లో అందరూ మనల్నే మెచ్చుకోవాలి. ఇలా ప్రతిదీ మన కంట్రోల్ లో ఉండాలనుకుంటాం. కానీ లావోజు ఏమంటారంటే మీరు ఎంత ఎక్కువ కంట్రోల్ చేయాలని చూస్తే అంత ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. జీవితం ఒక ప్రవాహం లాంటిది ఎదురు ఈదడం ఆపి ఆ ప్రవాహంతో కలిసి సాగడం నేర్చుకోండి. అప్పుడే మీ పనిలో నాణ్యత పెరుగుతుంది.
(02:25) మీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజుల్లో మన పెద్ద సమస్య ఏంటో తెలుసా? అదే సమాచారం మన చేతిలో ఫోన్ ఉంది. అందులోగూగు YouTube మరికొన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి. రోజంతా వేల రకాల ఆలోచనలు మన మెదల్లోకి ఎక్కుతున్నాయి. మనం జ్ఞానాన్ని ప్రోగు చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ నిజానికి కన్ఫ్యూజన్ను పెంచుకుంటున్నాం. లావోజు ఒక అద్భుతమైన మాట చెప్పారు.
(02:56) జ్ఞానం అంటే రోజుకో విషయాన్ని నేర్చుకోవడం వివేకం అంటే రోజుకో అనవసరమైన విషయాన్ని వదిలేయడం ఒక కప్పు నిండుగా ఉంటే అందులో కొత్తగా టీ పోయలేము. అలాగే మీ మనసు పాత అభిప్రాయాలతో ఇతరుల జడ్జిమెంట్లతో నిండిపోయి ఉంటే మీకు నిజమైన సత్యం కనిపించదు. అందుకే మీ మనసును ఖాళీ చేయడం నేర్చుకోండి. నాకు అన్నీ తెలుసు అనే అహంకారాన్ని పక్కన పెట్టి ఒక పసిపిల్లాడిలా ప్రపంచాన్ని చూడండి.
(03:27) అనవసరమైన వార్తలు ఇతరుల మీద గాసిప్స్ పనికిరాని చర్చలు వీటన్నింటిని వదిలేస్తే మీ మెదడులో నిశబ్దం ఏర్పడుతుంది. ఆ నిశబ్దంలోనే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. మనల్ని అత్యధికంగా బాధ పెట్టేది పరిస్థితులు కాదు. మన ఈగో ఎవరైనా మనల్ని విమర్శిస్తే ఎందుకు కోపం వస్తుంది? మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఎందుకు బాధ కలుగుతుంది ఎందుకంటే మనం మన ఇమేజ్ గురించి అతిగా ఆలోచిస్తాం.
(04:01) లావోజు దృష్టిలో నిజమైన శక్తివంతుడు ఎవరంటే తనను తాను గెలిచినవాడు ఎదుటివారు మిమ్మల్ని పొగిడినా తిట్టిన మీ ప్రశాంతత చెదరకూడదు. ప్రకృతిని గమనించండి సూర్యుడు ఉదయిస్తాడు. తను వస్తున్నాడని డప్పు కొట్టుకోడు. పువ్వు వికసిస్తుంది. తన సువాసన గురించి ప్రకటనలు ఇవ్వదు. అవి తమ సహజ గుణంతో పని చేసుకుంటూ పోతాయి. కానీ మనిషి మాత్రం ప్రతి చిన్న పనికి గుర్తింపు కోరుకుంటాడు. షో ఆఫ్ చేయాలనుకుంటాడు.
(04:37) ఈ షో ఆఫ్ చేసే గుణమే మనల్ని అందరితో పోల్చుకునేలా చేస్తుంది. ఆ పోలికే మన దుఃఖానికి కారణం. మీ ఈగోను సున్నా చేసుకుంటే మీకు ఎవరు శత్రువులు ఉండరు. మీరు ఎవరికీ పోటీ కాదు మీతో మీరు యుద్ధం చేయడం ఆపేస్తారు. సింపుల్ గా ఉండటం అంటే బలహీనత కాదు ఫ్రెండ్స్ అది ఒక గొప్ప ధైర్యానికి నిదర్శనం ఇక చివరిగా లావోజు చెప్పిన అత్యంత విలువైన పాఠం తృప్తి ఆయన అంటాడు ఎవరికైతే ఉన్నది చాలు అనిపిస్తుందో వారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అని మన కోరికలకు అంతం లేదు.
(05:20) ఒక ఫోన్ కొంటే ఇంకోటి కావాలి. ఒక ఇల్లు కడితే ఇంకోటి కట్టాలి. ఈ పరుగులో మనం ప్రస్తుతాన్ని అనుభవించడం మర్చిపోతున్నాం. భవిష్యత్తు గురించి ఆందోళన గతంలోని బాధలు ఇవే మనల్ని వెంటాడుతున్నాయి. ప్రకృతిలో ఏది హడావిడి చేయదు కానీ ప్రతిదీ సకాలంలో పూర్తవుతుంది. చెట్టు ఒకే రోజులో పెరగదు. కానీ అది ఎప్పుడూ ఆందోళన పడదు. మీ జీవితం కూడా అంతే అన్ని సమయానికి జరుగుతాయి.
(05:50) మీరు చేయాల్సింది అల్లా ప్రశాంతంగా ఉండటం మీ పనిని ప్రేమతో చేయడం కాబట్టి ఫ్రెండ్స్ ఇవాల్టి నుండి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఫోర్స్ చేయకండి ఫ్లో తో వెళ్ళండి మీ ఈగోను తగ్గించుకోండి ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. అప్పుడు మీ జీవితం ఒక పోరాటంలా కాకుండా ఒక అందమైన పాటలా మారుతుంది. లావోజు చెప్పినట్టు నిశబ్దంగా ఉండండి అప్పుడే విశ్వం మీకు సమాధానం ఇస్తుంది.
(06:24) ఈ వీడియో మీకు నచ్చితే మీలో కలిగిన ఒక చిన్న మార్పును కామెంట్ చేయండి. మరో మంచి ఫిలాసఫీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్

No comments:

Post a Comment