Saturday, March 14, 2026

కన్యత్వం గురించి ఓషో చెప్పిన పచ్చి నిజాలు! | Osho about Virginity in Telugu | Telugu Podcast

కన్యత్వం గురించి ఓషో చెప్పిన పచ్చి నిజాలు! | Osho about Virginity in Telugu | Telugu Podcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HheIihpOa4s



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం సెన్సిటివ్ మనమంతా దీని గురించి ఏదో ఒక సమయంలో లోపల మదనపడ్డ వాళ్ళమే కానీ ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడుకోలేదు. ఆ పదమే వర్జినిటీ కన్యత్వం మీకు తెలుసా ఈ పదాన్ని వినగానే కొంతమంది సైలెంట్ అయిపోతారు.
(00:24) ఎందుకంటే మనం దీన్ని ప్రతి ఒక్క దానితో ముడిపెట్టాం. పాపం, గౌరవం, పరువు, సిగ్గు కానీ నాకు నిజంగా కావాల్సిన ఆన్సర్ ఏంటంటే అసలు వర్జినిటీ అంటే ఏంటి? ఇది కేవలం బాడీకి సంబంధించిన ఒక స్టేటస్ మాత్రమేనా లేక మన మనసుకు సంబంధించిన ఒక క్లారిటీనా ఈరోజు మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. జస్ట్ మన సొసైటీ మైండ్సెట్ ను ఒకసారి చెక్ చేసుకుందాం.
(00:51) పార్ట్ వన్ ఫిలసాఫికల్ యాంగిల్ గొప్ప గొప్ప వాళ్ళు ఈ విషయం గురించి ఏం చెప్పారో చూద్దాం. వాళ్ళ దృష్టిలో వర్జినిటీ అంటే బాడీ గురించి కాదు మన మైండ్ గురించి ఓషో చాలా సింపుల్ గా చెప్పాడు కన్యత్వం అనేది శరీరానికి సంబంధించింది కాదు అది మన ఆత్మకు సంబంధించింది. అంటే నువ్వు ఎన్నిసార్లు ప్రపంచాన్ని చుట్టి వచ్చినా ఎన్ని ఎక్స్పీరియన్స్లు చూసినా నీ లోపలి మైండ్ మాత్రం ఎవరు టచ్ చేయకుండా ఉంటే నువ్వు ఎప్పటికీ ప్యూర్ గా ఉంటావు.
(01:21) ఇక్కడ ప్యూరిటీ అంటే ఏమీ చేయకుండా ఉండడం కాదు ఏం చేసినా దాని గురించి పరిపూర్ణంగా తెలుసుకొని చేయడం జడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఇదే చెప్పారు. నిష్కల్మశంగా ఉండడమే కన్యత్వం సమాజం మతం లేదా సాంప్రదాయాల వల్ల కలిషితం కాకుండా ఉండడమే అసలైన కన్యత్వం. అంటే మన మైండ్ ఎప్పుడు సొసైటీ మాటలు విని జడ్జిమెంట్లు విని కలవరం చెందుతుందో అప్పుడే మన ఇన్నోసెన్స్ పోతుంది.
(01:47) శరీరం వల్ల కాదు ఆలోచనల వల్ల మాత్రమే మన కన్యత్వం దూరమవుతుంది. సో వర్జినిటీ అంటే వద్దు అని చెప్పడం కాదు తెలుసు అని చెప్పడం దాన్ని దూరం పెట్టడం కాదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. పార్ట్ట సైకలాజికల్ యాంగిల్ మన చుట్టూ ఉన్న ప్రపంచం వర్జినిటీని ప్యూర్ అని ఫిక్స్ చేసింది. కానీ ఈ ప్యూరిటీ డెఫినేషన్ అసలు ఎవరు రాశారు ఎప్పుడు రాశారు సీరియస్ గా చెప్పాలంటే మనం ఈ పదాన్ని జడ్జ్ చేయడానికి పొగడడానికి ఒక టూల్ గా వాడుకుంటాం.
(02:18) నువ్వు మంచివాడివి నువ్వు కాదు అని చెప్పడానికి మాత్రమే ఈ పదాన్ని యూస్ చేస్తాం. నిజానికి ఇది బయాలజీ కంటే ఎక్కువ సైకాలజీ పైన డిపెండ్ అయి ఉంది. దీని చుట్టూ ఉన్న గిల్ట్ సిగ్గు భయం ఇవన్నీ మన సాఫ్ట్వేర్ లో సొసైటీ ఇన్స్టాల్ చేసిన వైరస్లు ఒక వ్యక్తి ఒక ఎక్స్పీరియన్స్ ను పొందినంత మాత్రాన తన లైఫ్ వాల్యూ తగ్గిపోతుందా? తగ్గదు కదా కానీ మనకు లోపల కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది.
(02:46) ఎందుకంటే మన పర్సనల్ నిర్ణయాలను కూడా సొసైటీ కంట్రోల్ చేయాలని చూస్తూనే ఉంటుంది. దీన్ని బానిసత్వం అని కాకపోయినా మన మెదడుపై నియంత్రణ అని మాత్రం చెప్పొచ్చు. ఈ కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పార్ట్ త్రీ స్పిరిచువల్ యాంగిల్ బుద్ధుడు ఏం చెప్పాడంటే పవిత్రత అపవిత్రత అనేవి మనపైనే ఆధారపడి ఉంటాయి. ఎవరు ఒకరిని పవిత్రం చేయలేరు అలాగే అపవిత్రం చేయలేరు.
(03:12) నీ పవిత్రతను నీ పక్కింటి ఆంటీ డిసైడ్ చేయలేదు నువ్వే డిసైడ్ చేయాలి. స్పిరిచువల్ వర్జినిటీ అంటే నీ మైండ్ ను కోరిక దురాశ గిల్ట్ వంటి వాటికి బలవ్వకుండా చూసుకోవడం. నా ఉద్దేశం కోరికలను చంపేయమని కాదు వాటిని దూరం నుంచి గమనించమని వివేకానంద గారి మాటల్లో చెప్పాలంటే కోరికల రూపంలో వృదా అయ్యే శక్తిని బలం మరియు వివేకంగా మార్చవచ్చు.
(03:37) అంటే నీలో ఉన్న ఆ ఎనర్జీని భయంతో దాచుకోవడం కాదు దాన్ని నీ గోల్స్ కి నీ నాలెడ్జ్ కి వాడుకోవడం ఎప్పుడైతే మనం మన బాడీ కోరికలు మరియు మైండ్ ని ఒక కరెక్ట్ లైన్ లో పెడతామో అప్పుడే మనం ఈ ఫిజికల్ లెవెల్ దాటి నిజమైన ప్యూరిటీని అందుకుంటాం. ఇక పార్ట్ఫోర్ నా పర్స్పెక్టివ్ లో చెప్పాలంటే సొసైటీ పదాన్ని మనపై జడ్జిమెంట్ టూల్ గా వాడింది.
(04:04) మనం దాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి. గుర్తుంచుకోండి ఎవరి శరీరం ఎవరి లైఫ్ ఎవరి ఎక్స్పీరియన్స్ అది వాళ్ళ వ్యక్తిగతం మనం దాని గురించి అభిప్రాయం చెప్పడం కాదు అర్థం చేసుకోవడం ముఖ్యం. దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం దాంట్లో దాగిన నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలి.
(04:28) ఎందుకంటే నిజమైన వర్జినిటీ అంటే నువ్వు శారీరకంగా ఎంత ప్యూర్ గా ఉన్నావో కాదు నీ ఆలోచనలు ఎంత క్లియర్ గా ఉన్నాయో అదే అసలైన వర్జినిటీ నీ మైండ్ కల్మషం లేకుండా ఉంటే నీ ఆలోచనలు స్ట్రెయిట్ గా ఉంటే నువ్వే నిజమైన వర్జిన్ సో ఫైనల్ గా ఫ్రెండ్స్ మనలో చాలామంది ఈ వర్జినిటీ ఇష్యూని తీసుకొని బయటి సమాజంతో గొడవపడతారు. కానీ నిజమైన యుద్ధం బయట లేదు. మన లోపల కన్ఫ్యూజన్ తో ఉంది.
(04:55) నువ్వు సొసైటీ చెప్పిన డెఫినేషన్స్ అన్నింటిని దాటేసి నీ లోపల ప్యూర్ గా ఉంటే అది ఈ లోకం చెప్పే దానికంటే మిలియన్ రెట్లు విలువైంది. ఒక వ్యక్తి తన బాడీ వర్జినిటీని ఒకేసారి కోల్పోవచ్చు. కానీ తన ఇన్నోసెన్స్ ని ప్రతి రోజు చాలాసార్లు కోల్పోతాడు. దాన్ని తిరిగి తీసుకురాగలిగే శక్తి ఒక్కటే అదే అవగాహన అవేర్నెస్ ఇకపై వర్జినిటీ అనే పదం వినగానే భయం రాకూడదు అలాగే సిగ్గు రాకూడదు ఒక క్లారిటీ మాత్రమే రావాలి.
(05:28) ఎందుకంటే వర్జినిటీ అంటే శరీరం కాదు అది నీ చైతన్యం అది మన నిజమైన ప్యూర్ స్టేట్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్

No comments:

Post a Comment