Saturday, March 14, 2026

వద్దు అంటే ఎందుకు చేస్తాం? | The Psychology of Forbidden Fruit | Margadarshi Telugu Podcast

వద్దు అంటే ఎందుకు చేస్తాం? | The Psychology of Forbidden Fruit | Margadarshi Telugu Podcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H2j4vylZDlY



Transcript:
(00:00) ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా మన ఊర్లో ఖాళీగా ఉన్న గోడలన్నీ చాలా నీట్ గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ గోడ మీద ఎర్రటి అక్షరాలతో ఇచ్చట ఉచ్చపోయరాదు అని రాస్తారో సరిగ్గా మరుసటి రోజు నుంచే అక్కడ వాసన మొదలవుతుంది. అలాగే ఇక్కడ చెత్త వేయరాదు అని ఎక్కడైతే బోర్డు ఉంటుందో చుట్టుపక్కల అంతా బాగున్నా ఆ బోర్డు కింద మాత్రం కుప్పలు కుప్పలు చెత్త కనిపిస్తుంది.
(00:25) అసలు మన మనుషులకి ఏమైంది? వద్దు అంటేనే ఎందుకు చేస్తాం చేయొద్దు అన్న చోటే ఎందుకు చేస్తాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ నిఖిల్ ఈరోజు మనం ఈ వింతైన హ్యూమన్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా సైకాలజీలో దీనికి ఒక పేరు ఉంది. అదే సైకలాజికల్ రియాక్టెన్స్ అంటే ఎవరైనా మనల్ని ఏదైనా చేయొద్దు అని ఆజ్ఞాపించినప్పుడు మన మెదడు అది మన స్వేచ్ఛను హరించడంగా భావిస్తుంది.
(00:55) నన్ను ఆపడానికి వీడెవడు అనే ఒక చిన్న మొండితనం మన సబ్కాన్షియస్ మైండ్ లో మొదలవుతుంది. చిన్న పిల్లల్ని చూడండి ఆ నిప్పుని ముట్టుకోకు అంటే వాళ్ళు కచ్చితంగా అక్కడికే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ నిషిద్ధమైన వస్తువు మీద కుతుహాలం పెరుగుతుంది. మనం పెద్దవాళ్ళం అయినా సరే మనలో ఆ చిన్న పిల్లవాడు అలాగే ఉన్నాడు. అక్కడ పోయొద్దు అన్నప్పుడు మన మెదడు ఆ ప్రదేశాన్ని చాలా స్పెషల్ గా గుర్తుపెట్టుకుంటుంది.
(01:23) ఇక్కడ మరో కోణం ఉంది. అది ఫోకస్ మనం ఒక ఖాళీ స్థలాన్ని చూసినప్పుడు మనకు ఏ ఆలోచన రాదు. కానీ ఎప్పుడైతే బోర్డు కనిపిస్తుందో మన అటెన్షన్ అంతా అక్కడికే వెళ్తుంది. ఆ బోర్డు మనకు ఒక ఐడియా ఇస్తుంది. చెప్పాలంటే ఆ బోర్డులు మనకి వార్నింగ్ ఇవ్వడం లేదు. మనకి ఆ పని చేయడానికి ఒక లొకేషన్ చూపిస్తున్నాయి. దీనికి తోడు మనలో ఉన్న సోషల్ ప్రూఫ్ అనే లక్షణం కూడా దీనికి కారణం.
(01:52) బోర్డు కింద ఆల్రెడీ ఎవరో ఒకరు చెత్త వేశారు అనుకోండి. వాడు వేశడు కదా నేను వేస్తే ఏమవుతుంది అనే ఒక సామూహిక బాధ్యతా రాహిత్యం మనల్ని ఆ పని చేసేలా ప్రోత్సహిస్తుంది. అంటే అక్కడ బోర్డు ఉండడం వల్లే మనక అక్కడ పని కానిచ్చేయొచ్చు అనే ధైర్యం వస్తుంది. ఫిలాసఫికల్ గా చూస్తే మనిషి ఎప్పుడూ ఒక తిరుగుబాటుదారుడు నియమాలని బ్రేక్ చేయడంలో మనకు ఒక తెలియని కిక్ ఉంటుంది.
(02:18) జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అంటారు. క్రమశిక్షణ అనేది బయట నుంచి రుద్దితే అది బానిసత్వం అవుతుంది. మనం బొడ్డులు పెట్టి మనుషుల్ని మార్చాలి అనుకుంటున్నాం కానీ వాళ్ళలో అవగాహన తీసుకురావాలి అనుకోవట్లేదు. ఎక్కడైతే భయం లేదా ఆంక్షలు ఉంటాయో అక్కడ మనిషి దొంగచాటుగా ఆ పని చేయడానికి సిద్ధపడతాడు. మనలో ఉన్న అపరిశుభ్రత గోడల మీద లేదు. అది మన ఆలోచనల్లో ఉంది.
(02:43) ఆ బోర్డు కేవలం మన నిజస్వరూపాన్ని మనకు అద్దంలా చూపిస్తుంది. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ ఈ సమస్యకి పరిష్కారం బోర్డులు మార్చడం కాదు. మన మైండ్సెట్ మార్చుకోవడం మీరు గమనించారా? కొన్ని చోట్ల ఇక్కడ పోయరాదు అని రాయకుండా ఆ గోడ మీద దేవుళ్ళ ఫోటోలు పెడతారు లేదా అందమైన పెయింటింగ్స్ వేస్తారు. అప్పుడు అక్కడ ఎవరు ఆ పని చేయరు. ఎందుకు ఎందుకంటే అక్కడ ఆజ్ఞ లేదు అక్కడ ఒక విలువ ఉంది.
(03:09) మనం కూడా అంతే ఏదైనా పని వద్దు అనుకున్నప్పుడు దానికి బోర్డులు వెతకడం కాదు అది ఎందుకు తప్పో మనకి మనమే అర్థం చేసుకోవాలి. వచ్చేసారి మీరు ఏదైనా బోర్డు చూసినప్పుడు మీలో ఉన్న ఆ మొండి వాడిని కొంచెం అదుపులో పెట్టుకోండి. మన ఊరు మన ఇల్లు అనుకున్నప్పుడే బోర్డులతో పని ఉండదు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్

No comments:

Post a Comment