Saturday, March 14, 2026

Kamasutra Real Meaning in Telugu | 80% మంది తెలియని నిజం

Kamasutra Real Meaning in Telugu | 80% మంది తెలియని నిజం

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9y6CTkFhTEM



Transcript:
(00:05) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక సెన్సిటివ్ కానీ ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కామసూత్ర కామసూత్ర అనగానే మీ మైండ్ లోకి వచ్చే మొదటి ఆలోచన ఏంటి? ఏదో ఒక అశ్లీల పుస్తకమా? లేక కేవలం శృంగార భంగిమల సమూహారమా? మనలో చాలామందికి తెలియని నిజం ఏంటంటే ప్రపంచానికి నాగరికత తెలియని రోజుల్లోనే బాత్షాయన మహర్షి మనిషి ఎలా జీవించాలి అనే అంశంపై ఒక అద్భుతమైన గైడ్ ఇచ్చారు.
(00:38) ఈరోజు మన పాడ్కాస్ట్ లో కామసూత్ర చుట్టూ ఉన్న అపోహలను పటాపంచలు చేసి అందులో ఉన్న సైకాలజీ మరియు లైఫ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సిద్ధంగా ఉండండి ఇది మీ ఆలోచనా దృక్పతాన్ని మార్చేయబోతుంది. లెట్స్ డైవ్ ఇంటు అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్ మనమందరం అపోహలో బ్రతుకుతున్నాం అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. కామసూత్ర గ్రంథంలో కామసూత్ర గ్రంథంలో శరీర భంగ్యమల గురించి ఉండేది కేవలం 20% మాత్రమే మరి మిగిలిన 80%లో ఏముంది అని ఆలోచిస్తున్నారా అక్కడికే వస్తున్నా ఫ్రెండ్స్ అక్కడే ఉంది మన అసలైన జీవితం ఒక మనిషి సమాజంలో తనను తాను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి తన
(01:19) భాగస్వామి యొక్క మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఒక స్త్రీ లేదా పురుషుడు తమ వ్యక్తిత్వాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఇలాంటి ఎన్నో సైకలాజికల్ అంశాలను వాత్సాయన మహర్షి అప్పుడే వివరించారు. దీన్ని కేవలం ఒక బూతు పుస్తకం అని ముద్ర వేయడం అంటే ఒక గొప్ప లైఫ్ మేనేజ్మెంట్ సైన్స్ ను అవమానించడమే అవుతుంది.
(01:43) ఇప్పుడు కామం అంటే కేవలం శృంగారం కాదు దీని అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో నాలుగు పురుషార్థాలు ఉన్నాయి. అవి ధర్మ అర్థ కామ మోక్ష ఇక్కడ కామం అనే పదానికి అర్థం కేవలం శారీరక వాంఛ మాత్రమే కాదు పంచేంద్రియాల ద్వారా అంటే చూడటం వినటం స్పృశించడం రుచి చూడటం వాసన చూడటం ద్వారా ఈ సృష్టిలో అందాన్ని ప్రేమను కలలను ఆస్వాదించడాన్ని కామం అంటారు ఒక మంచి పెయింటింగ్ ను చూసి ఆనందించడం కూడా ఇక్కడ కామమే ఒక మధురమైన పాటను వినడం కామమే ఒక రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం కూడా కామమే జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించకుండా వైరాగ్యం పేరుతో
(02:29) కోరికలను అణచివేసుకుంటే మోక్షం రాదు. అందుకే మన పురాణాలు ఒక పచ్చి నిజం చెబుతున్నాయి. కామి కానివాడు మోక్షగామి కాలేడు. అంటే జీవితంలోని అనుభవాలను ధర్మబద్ధంగా అనుభవించి తృప్తి చెందిన వాడే సహజంగా మోక్షం వైపు ప్రయాణించగలడు. ఇక్కడ చాలామంది అడుగుతుంటారు ఫ్రెండ్స్ దేవుడు భక్తి గురించి మాట్లాడే చోట ఈ టాపిక్ ఎందుకు అని కానీ గమనించండి మనం దేవుడిని ఎంత పవిత్రంగా పూజిస్తామో భార్యా భర్తల బంధం కూడా అంతే పవిత్రమైంది.
(03:04) పాశ్చాత్య దేశాల్లో అంటే వెస్ట్రన్ కల్చర్ లో శృంగారం అనేది కేవలం ఒక ఎంజాయ్మెంట్ లేదా అవసరంగా చూడవచ్చు. కానీ మన ప్రాచీన భారతదేశంలో అది ఒక పవిత్రమైన బాధ్యత. ఒక అద్భుతమైన కల రాధాకృష్ణుల ప్రేమను మనం ఎంతో పవిత్రంగా చూస్తాం కదా అలాగే భార్యా భర్తల మధ్య ఉండే అనురాగం ఆకర్షణ కూడా దైవికమైనవే ఒకరినొకరు గౌరవించుకోవడం ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం ప్రేమను ఒక బాధ్యతగా స్వీకరించడం ఇవే కామసూత్ర మనకు నేర్పించే పాఠాలు.
(03:40) ఇది కేవలం శరీరాల కలయక మాత్రమే కాదు ఇది మనసుల మేలవింపు. ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎందుకు పెటాకులు అవుతున్నాయి? దీనికి కారణం భార్యా భర్తల మధ్య మానసిక దూరం పెరిగిపోతుంది. ఎందుకంటే మనం సంబంధాల్లో ఉండటం నేర్చుకుంటున్నాం కానీ అవగాహన పెంచుకోవడం లేదు. వాత్సాయన మహర్షి చెప్పినట్లుగా భాగస్వామి ఇష్టా ఇష్టాలను తెలుసుకోవడం వారి మూడ్ ని గౌరవించడం కమ్యూనికేషన్ సరిగ్గా ఉండటం అనేది నేటి స్ట్రెస్ ఫుల్ లైఫ్ లో చాలా ముఖ్యం.
(04:10) కామసూత్రాన్ని ఒక శాస్త్రంగా చదివితే అది మనకు సహనాన్ని ప్రేమను జీవితం పట్ల ఒక పాజిటివ్ దృక్పదాన్ని నేర్పిస్తుంది. అది అశ్లీలత కాదు ఫ్రెండ్స్ అది అనురాగపు సైన్స్ చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్ జ్ఞానం అనేది ఎప్పుడూ తప్పవదు. దాన్ని మనం అర్థం చేసుకునే విధానంలోనే తప్పు ఉంటుంది. కామసూత్రాన్ని దాచాల్సిన అవసరం లేదు. దాన్ని సరిగ్గా చదివి అందులోని సారాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
(04:38) కోరికలను తప్పుగా చూడకుండా వాటిని ధర్మబద్ధంగా ఆస్వాదిస్తూ ఉన్నతమైన జీవితాన్ని గడపడమే నిజమైన సంస్కారం. ఈ పోడ్కాస్ట్ మీ ఆలోచనల్లో చిన్న మార్పునైనా తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment