జిడ్డు కృష్ణమూర్తి: “సత్యం మార్గం లేని దేశం” – ప్రపంచ గురువును ఎందుకు తిరస్కరించాడు?
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NgIzozRqwXA
Transcript:
(00:05) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అసలు ఈ ప్రపంచంలో మనల్ని మనం అర్థం చేసుకోవడం కంటే పెద్ద విద్య ఇంకేదైనా ఉందా? శతాబ్దాలుగా ఎంతో మంది మేధావులు సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారు. అరిస్టాటిల్ నుండి వేమన వరకు ఎందరో గొప్ప తత్వవేత్తలను మనం చూసాం కదా కానీ మన తెలుగు గడ్డపై పుట్టి ఏ సిద్ధాంతాలకు కట్టుబడకుండా మనిషి అంతరాత్మను తట్టిలేపిన అరుదైన వ్యక్తి మన జిడ్డు కృష్ణమూర్తి.
(00:34) అసలు ఈయన ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన చెప్పిన వింతైన ఫిలాసఫీ ఏంటి? ఈ విశేషాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనుషుల మధ్య సంబంధాలు మనసులో కలిగే సంఘర్షణలు వీటిపై ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసిన వ్యక్తి మన జిడ్డి కృష్ణమూర్తి గారు. ఈయన 1895 మే 22 న ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లిలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.
(01:02) ఆర్థిక ఇబ్బందుల వల్ల వీరి కుటుంబం తమిళనాడుకు మారింది. అక్కడ ఆడాయార్ లోని థియోసాఫికల్ సొసైటీకి వీరి ఇల్లు దగ్గరగా ఉండేది. అప్పట్లో దానికి అన్బిసెంట్ గారు అధ్యక్షురాలు. చిన్నప్పుడు కృష్ణమూర్తి గారు తన తమ్ముడైన నిత్యానందతో కలిసి సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉండేవారు. వారిని గమనించిన సొసైటీ సభ్యులు ఆ పిల్లల కళ్ళలో ఏదో తెలియని తేజస్సును చూశారు.
(01:26) వారిని అన్బిసెంట్ గారి వద్దకు తీసుకెళ్ళగా ఆమె కూడా జేకే గారిని చూసి ఆశ్చర్యపోయారు. భవిష్యత్తులో ఈయనే ప్రపంచ గురువు అవుతారని నమ్మి ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్కు పంపించారు. అయితే తన పిల్లలను తనకు ఇచ్చేయాలని వారి తండ్రి నారాయణ కోర్టుకు వెళ్ళిన అనిబిసెంట్ గారు వారి బాధ్యతను తానే తీసుకున్నారు. 1925 లో కృష్ణమూర్తి గారి తమ్ముడు నిత్యానంద మరణించడం ఆయన జీవితాన్ని కుదిపేసింది.
(01:57) ఈ సంఘటన ఆయన ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చివేసింది. 1929 లో నెదర్లాండ్ లో జరిగిన ఒక సదస్సులో ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకోసం ఏర్పాటు చేసిన ఆర్డర్ ఆఫ్ ది స్టార్ సంస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి నేను ఎవరికీ గురువును కాదు సత్యం అనేది మార్గం లేని దేశం అంటే ట్రూత్ ఈస్ ఏ పాత్లెస్ ల్యాండ్ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
(02:23) నిజానికి జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ ఎట్లాంటిది అంటే ఏ ఫిలాసఫీని గుడ్డిగా నమ్మకపోవడమే ఆయన యొక్క ఫిలాసఫీ మనం ఎలా జీవించాలి అని ఎవరో చెప్పడం కాదు. అసలు మనం ఎలా బ్రతుకుతున్నామో మనమే గమనించాలని ఆయన అనేవారు. మతం కులం కట్టుబాట్లు భయం వీటన్నింటి నుండి మనసు విముక్తి పొందినప్పుడే నిజమైన జ్ఞానం కలుగుతుందని ఆయన బోధించారు.
(02:49) మనిషి తనను తాను తెలుసుకోవడమే ప్రపంచంలో అతి పెద్ద విప్లవం అని ఆయన నమ్మకం. మనం నిత్యం ఏదో ఒక మానసిక ఒత్తిడిలో ఉంటాం కదా దీనికి కారణం మన ఆలోచనలేనని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. మన ఆలోచనలు ఎప్పుడూ గతానికి లేదా భవిష్యత్తుకు పరిమితమై ఉంటాయి. కానీ వాస్తవాన్ని వాస్తవంగా చూసినప్పుడు అంటే ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా గమనించినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది.
(03:16) మీ సమస్యలకు పరిష్కారం బయట ఎక్కడో లేదు మీలోనే ఉందని ఆయన గుర్తు చేసేవారు. సమాజం మారాలి అని మనం అందరం కోరుకుంటాం కదా కానీ సమాజం అంటే ఏంటి? మనందరి మధ్య ఉన్న సంబంధాల సమూహారమే ఈ సమాజం కదా అంటే మనం మారకుండా ఈ సమాజం ఎలా మారుతుంది? కోపం అసూయ గర్వం వంటివి అజ్ఞానం నుండి పుడతాయని నిజమైన తెలివైనవాడు తనను తాను ఒక సాక్షిలా గమనించుకుంటాడని జేకే ఎప్పుడూ చెప్పేవారు.
(03:45) ఆయన రాసిన ఎడ్యుకేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ వంటి పుస్తకాలు నేటికి ఎంతో ప్రాచుర్యం పొందాయి. జేకే గారు 1986 ఫిబ్రవరి 17 న కన్ను మూసారు. ఆయన చనిపోయిన ఆయన స్థాపించిన పాఠశాలలు స్టడీ సెంటర్లు నేటికీ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి. సద్గురువు వంటి ఎంతో మంది నేటితరం మేధావులు కూడా ఆయన ప్రసంగాల ద్వారా ప్రభావితమైన వారే జీవితాంతం విదేశాల్లో ఉండటం వల్ల ఆయన తెలుగు భాషను కొంతవరకు మర్చిపోయినా ఆయన అందించిన జ్ఞానం మాత్రం విశ్వవ్యాప్తం.
(04:20) ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment