గతాన్ని వదిలేయకపోతే ఏమవుతుంది? | Powerful Telugu Life Philosophy | Telugu Podcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2JOZUH_TScs
Transcript:
(00:01) ఫ్రెండ్స్ మనందరికీ ఒక అలవాటు ఉంది కదా కొత్త బట్టలు కొంటే పాతవి తీసేస్తాం. ఇంట్లో సామాన్లు ఎక్కువైతే పాడైపోయిన సామాన్లను బయట పడేస్తాం. కానీ మన మనసులో పేరుకుపోయిన పాత బాధల్ని ఎవరో అన్న మాటల్ని జరిగిపోయిన అవమానాల్ని మాత్రం ఏళ్ల తరబడి మోస్తూనే ఉంటాం. ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్ ఈ అనవసరమైన భారాన్ని మోస్తూ మనం ఎంత అలసిపోతున్నామో అని మనం కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా మొదట మన చేతుల్లో ఉన్న ఆ పాత బరువుని కింద పడేయాలి.
(00:36) వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు ఫ్రెండ్స్ కొత్త ప్రయాణానికి సిద్ధంఅవ్వడం మనం ఎందుకు వదిలేయలేం ఎందుకంటే ఆ బాధని పట్టుకొని కూర్చోవడంలో మనకు తెలియని ఒక కంఫర్ట్ ఉంటుంది. వాడు నన్ను మోసం చేశాడు లేదా నాకు అన్యాయం జరిగింది అని పదే పదే చెప్పుకోవడం వల్ల మనం ఒక విక్టిం రోల్ లో ఉండిపోతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఆ గతాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నా జరిగిన దాన్ని ఎవ్వరు మార్చలేరు.
(01:07) ఒక వేడి గిన్నెను పట్టుకుంటే ఎవరికి కాలుతుంది గిన్నెకా లేక పట్టుకున్న నీకా కచ్చితంగా నీకే కదా ఆ మంట భరించలేనప్పుడు గిన్నెని వదిలేయడం తప్ప మరో మార్గం లేదు. మనసులో బాధ కూడా అంతే ఇక్కడ బుద్ధుడు చెప్పిన మాట మీకు చెప్పాలి. గతాన్ని పట్టుకొని కూర్చోవడం అంటే వేడి నిప్పురవ్వని చేతిలో పట్టుకొని అది అవతలి వాడి మీద విసరాలి అనుకోవడం లాంటిది.
(01:33) ఇక్కడ కాలేది నీ చేయి మాత్రమే ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఒక మాట చెప్పారు. నువ్వు నిన్నటి జ్ఞాపకాలతో జీవిస్తున్నావ అంటే నువ్వు చనిపోయినట్టే లెక్క. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఈ క్షణంలోనే ఉంటుంది. నిజమే కదా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు కళ్ళ ముందున్న అందమైన క్షణాల్ని మనం చూడలేం. వదిలేయడం అంటే క్షమించడం కాదు ఫ్రెండ్స్ ఆ విషయం నిన్ను ఇకపై బాధించకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం.
(02:02) ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనల్ని బాధ పెట్టిన మనిషి ఎక్కడో హాయిగా ఉండొచ్చు. కానీ వాళ్ళని తలుచుకుంటూ నువ్వు మాత్రం ఇక్కడ నువ్వు నీ నిద్రని నీ ప్రశాంతతని పాడు చేసుకుంటున్నావ్. వదిలేయడానికి అర్థం వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఒప్పుకోవడం కాదు. వాళ్ళు ఏం చేసినా నా మనశశాంతిని పాడు చేసే హక్కు వాళ్ళకి ఇక లేదు అని నీకు నువ్వే చెప్పుకోవడం.
(02:26) నీ హృదయంలో అనవసరమైన వాళ్ళకి రెంటు లేకుండా చోటు ఇవ్వడం ఆపేయ్. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ ఈరోజు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. నేను వెనక్కి లాగుతున్న ఆ పాత జ్ఞాపకాన్ని ఆ చేదు అనుభవాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో థాంక్యూ నాకు ఒక పాఠం నేర్పినందుకు కానీ ఇక నీ అవసరం నాకు లేదు అని మనస్ఫూర్తిగా దానికి బాయ్ బాయ్ చెప్పేయ్ నీ చేతులు ఖాళీగా ఉంటేనే కదా జీవితం ఇచ్చే కొత్త కానుకల్ని నువ్వు అందుకోగలవు.
(02:56) ఎండిపోయిన ఆకు కింద పడితేనే కదా కొత్త చిగురు వస్తుంది. నీ లైఫ్ లో కూడా కొత్త చిగురు రావాలంటే పాత బాధల్ని రాల్చేయక తప్పదు. సో ఫ్రెండ్స్ వదిలేయడం అంటే వదులుకోవడం కాదు నిన్ను నువ్వు విడిపించుకోవడం. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్ లో పంచుకోండి.
(03:18) నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్.
No comments:
Post a Comment