Saturday, March 14, 2026

సెక్స్ ఎలా పుట్టింది? | 4 బిలియన్ ఏళ్ల జీవం మిస్టరీ | Life Origin Explained In Telugu

సెక్స్ ఎలా పుట్టింది? | 4 బిలియన్ ఏళ్ల జీవం మిస్టరీ | Life Origin Explained In Telugu

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gMQWL7XtszY



Transcript:
(00:05) ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మిషన్ ఏంటో తెలుసా? స్పేస్ఎక్స్ రాకెట్లు అనుకుంటున్నారా లేక అనుబాంబులు అనుకుంటున్నారా? ఇవేవి కాదు మీ శరీరంలో ఇప్పుడు రన్ అవుతున్న ఒక చిన్న కణం అవును మీరు విన్నది నిజమే. మనం చూస్తున్న ఈ అద్భుతమైన ప్రపంచం ఈ మనుషులు ఈ ప్రకృతి ఇదంతా 400 కోట్ల ఏళ్ల క్రితం ఒక చిన్న నీటి బుడగలో మొదలైందని మీకు తెలుసా? అసలు బుద్ధి లేని ఆ కణాలకి సెక్స్ అంటే ఏంటో ఎలా తెలిసింది? అసలు చావులేని ఆ జీవులకు సెక్స్ అనే అవసరం ఎందుకు వచ్చింది? దేవుళ్ళు చెప్పారా లేక ప్రకృతి ఆడిస్తున్న నాటకమా? ఈరోజు మన పాడ్కాస్ట్ లో మన ఉనికి
(00:48) వెనుకున్న ఆ షాకింగ్ సీక్రెట్స్ ని బట్టబయలు చేయబోతున్నాం. వెల్కమ్ టు ది షోఫర్ బిలియన్ ఏళ్ల క్రితం భూమి ఇప్పుడున్నంత ప్రశాంతంగా లేదు. అంతా వేడి చుట్టూ అగ్ని పర్వతాలు విషవాయువులతో నిండిపోయి ఉంది. సముద్రాల్లో మిథేన్ అమ్మోనియా హైడ్రోజన్ నిండిపోయి ఒక వింతైన కెమికల్ సూప్లా ఉండేది. అప్పుడు ఆకాశం నుండి పడే మెరుపులు సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన యువ కిరణాలు ఆ కెమికల్స్ మీద దాడి చేశాయి. అప్పుడు రియాక్షన్ మొదలైంది.
(01:21) దీనివల్ల చిన్న చిన్న ఆర్గానిక్ మాలిక్యూల్స్ పుట్టాయి. ఇవి సముద్రపు నీటి బుడగల్లోకి చేరాయి. ఇక్కడే ఒక లాజిక్ ఉంది సముద్రంఅంతా కలిస్తే అది పలుచగా ఉంటుంది. కానీ ఒక చిన్న బుడగలో ఇవన్నీ చేరితే అది హై కాన్సంట్రేషన్ అవుతుంది. అంటే ఒక గ్లాసు నీళ్లలో ఐదు చెంచాల ఉప్పు వేసినట్టు ఈ గాడత పెరగడం వల్లే ఆర్ఎన్ఏ dఎన్ఏ లాంటి సంక్లిష్టమైన అణువులు పుట్టుకొచ్చాయి.
(01:50) అలా భూమి మీద మొదటి సింగిల్ సెల్ లేదా ఏకకణ జీవి అడుగు పెట్టింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ మొదటి జీవులకి బ్రెయిన్ లేదు ఆలోచన లేదు మరి అవి ఎలా పెరిగాయి వాటికి మనల ప్రేమ, పెళ్లి సెక్స్ ఇవేవి తెలియవు. ఒక జీవి ఇంకో జీవిని తినేసేది. అలా తిని తిని బాగా లావైపోయేది. మన బాడీలో ఫ్యాట్ పెరిగితే ఎలా బద్ధకం వస్తుందో ఆ కణానికి కూడా అలాగే అయ్యేది.
(02:19) గాలి పీల్చుకోవడం కష్టమై సర్వైవల్ కోసం తనని తాను రెండుగా విడగొట్టుకునేది. దీన్నే సైన్స్ భాషలో బైనరీ ఫిషన్ అంటారు. దాదాపు 200 కోట్ల ఏళ్ల పాటు ఇదే బోరింగ్ ప్రాసెస్ నడిచింది. ఒకటే మొహం మళ్ళీ అదే డ్యూప్లికేట్ ఎలాంటి మార్పు లేదు ఎవల్యూషన్ లేదు కానీ ప్రకృతికి ఇక్కడే ఒక ఐడియా వచ్చింది. ఎన్నాలిలా ఒకేలా ఉండటం అని అప్పుడే జీవ పరిణామ క్రమంలో ఒక అద్భుతం జరిగింది.
(02:51) ఒక జీవి తన DNAన్ఏ లో సగభాగాన్ని ఇంకో జీవితో పంచుకోవడం మొదలు పెట్టింది. అలా సెక్స్ అనే ప్రక్రియకు బీజం పడింది. ఇది కేవలం ఎంజాయ్మెంట్ కోసం కాదు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా కొత్త రకం జీవులను సృష్టించడానికి ప్రకృతి వేసిన మాస్టర్ ప్లాన్ ఇక అక్కడి నుండే వేగం పుంజుకుంది. ఒంటరిగా ఉన్న కణాలు గ్రూపులుగా చేరాయి. నేను ఆహారం తెస్తా నువ్వు జీర్ణం చేయి ఇంకొకడు సంతానోత్పత్తి చూసుకుంటాడు అని ఇలా పనులు పంచుకున్నాయి.
(03:21) దీన్నే డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. ఈ టీం వర్క్ వల్లే మొక్కలు ఫంగస్ జంతువులు పుట్టాయి. మీకు తెలుసా మన శరీరంలో ఇప్పుడు దాదాపు 37 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. అవన్నీ ఒకప్పుడు విడివిడిగా ఉన్నవే కానీ కాలక్రమేన అవి ఒక సిస్టం లా మారాయి. మొదట్లో జెల్లీ ఫిష్ వంటి జీవులకి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అవి కేవలం వెలుతురుని బట్టి రియాక్ట్ అయ్యేవి.
(03:49) కానీ ఎప్పుడైతే నర్వ్స్ సిస్టం డెవలప్ అయ్యిందో అప్పుడు జీవుల్లో మీటింగ్ డ్రైవ్ పెరిగింది. ఇది కేవలం బాడీ నీడ్ మాత్రమే కాదు జీవన్ తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటం. చివరకు కోతుల నుండి మనుషుల వరకు వచ్చేసరికి ఈ బయోలాజికల్ ప్రాసెస్ కాస్త ఎమోషనల్ గా మారిపోయింది. ఆకలి తీర్చుకోవడం ఎంత ముఖ్యమో మన జాతిని ముందుకు తీసుకెళ్ళడం కూడా అంతే ముఖ్యమైంది.
(04:15) అందుకే సెక్స్ అనేది కేవలం ఒక శారీరక ప్రక్రియ మాత్రమే కాదు అది 400 కోట్ల ఏళ్ల సుదీర్గ పోరాట ఫలితం మన జీవన సూత్రాల్లో అత్యంత కీలకమైన భాగం మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఆనాడు సముద్రపు నీటి బుడగలో జరిగిన ఆ చిన్న కెమికల్ రియాక్షనే కారణం. ఈ అద్భుతమైన ప్రయాణం గురించి మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పంచుకోండి.
(04:41) ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్.

No comments:

Post a Comment