Saturday, March 14, 2026

Love vs Need: Machiavelli Secret Telugu | Power of Dependency | Telugu Podcast

Love vs Need: Machiavelli Secret Telugu | Power of Dependency | Telugu Podcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5aUonRWE91Y



Transcript:
(00:00) జస్ట్ ఇమాజిన్ మీరు ఒక పెద్ద ఎడారిలో చిక్కుకున్నారు. మీ చేతిలో కోటి రూపాయల విలువైన వజ్రం ఉంది. అలాగే మీ పక్కన మరో వ్యక్తి ఉన్నాడు వాడి చేతిలో కేవలం ఒక లీటర్ నీళ్ల బాటిల్ మాత్రమే ఉంది. మీరు ఆ వజ్రాన్ని ఇచ్చి ఆ నీళ్ల బాటిల్ అడుగుతారు. కానీ వాడేమో ఇవ్వనంటాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వాడి కాళ్ళ మీద పడతారా? లేక ఆ వజ్రాన్ని వాడి కాళ్ళ దగ్గర పారేస్తారా? అవును మీరు అలాగే చేస్తారు.
(00:30) ఎందుకంటే ఆ క్షణంలో మీ ప్రాణం ఆ నీళ్ల బాటిల్ మీద ఆధారపడి ఉంది. ఆ నీళ్ల బాటిలు ఉన్న వ్యక్తికి మీరు థాంక్యూ చెప్పక్కర్లేదు. అతన్ని ప్రేమించనక్కర్లేదు కానీ అతనికి మీరు తలవంచాలి. ఇదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం. దీని పేరే డిపెండెన్సీ. మనలో చాలామంది ఒక అబద్ధపు లోకంలో బ్రతుకుతున్నారు.
(00:57) జనాలు నన్ను ప్రేమించాలి నా మంచితనాన్ని గుర్తించాలి అనుకుంటారు. కానీ చరిత్ర ఏం చెబుతుందో తెలుసా? ప్రేమ అనేది ఒక ఐస్ ముక్క లాంటిది. అది ఎప్పుడైనా కరిగిపోవచ్చు. కానీ అవసరం అనేది ఒక ఇనుప గొలుసు లాంటిది. ఈరోజు ఈ వీడియోలో మీరు ఎవ్వరికీ లొంగిపోకుండా లోకం మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసే ఆ మాకివెల్లి రహస్యాన్ని బయట పెట్టబోతున్నాను. చివరివరకు చూడండి ఎందుకంటే ఐదవ నిమిషంలో నేను చెప్పబోయే నిజం మీ జీవితాన్నే మార్చేయబోతుంది.
(01:28) ముందుగా ఫ్రెండ్స్ మనం కాలంలో కాస్త వెనక్కి వెళ్దాం. ఇది 16వ శతాబ్దం నికోలో మాకియావెల్లి అనే ఒక రాజకీయ మేధావి ఉండేవాడు. అతను ప్రపంచానికి ఒక చేదు నిజాన్ని పరిచయం చేశాడు. ప్రజలు తమకు ఇష్టం వచ్చినప్పుడు ప్రేమిస్తారు కానీ తమకు అవసరమైనప్పుడు మాత్రమే భయపడతారు లేదా లొంగి ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా మన ఇంట్లో ఉండే పాత సామాన్లను మనం ఎందుకు బయట పారేస్తాం? ఎందుకంటే వాటి అవసరం తీరిపోయింది కాబట్టి అలాగే మీ అవసరం తీరిపోయిన మరుక్షణమే ఈ సమాజం మిమ్మల్ని చెత్తకుప్పలో పారేస్తుంది.
(02:08) మీరు ఎంత గొప్పవారైనా ఎన్ని దానధర్మాలు చేసినా సరే అవతలి వాడికి మీ వల్ల ఉపయోగం లేకపోతే మీరు జీరో అందుకే తెలివైనవాడు ఏం చేస్తాడంటే ప్రజలు తనను ప్రేమించేలా చేసుకోవడం కంటే తన మీద ఆధారపడేలా చేసుకుంటాడు. మీరు ఒక చెట్టు అనుకుంటే జనాలు మీ దగ్గరికి నీడ కోసం రావాలి తప్ప ఆ చెట్టు అందాన్ని చూడటానికి కాదు ఒకవేళ ఆ చెట్టు నీడ ఇవ్వడం ఆపేస్తే మరుసటి రోజే దాన్ని నరికేస్తారు.
(02:39) ఇది వినడానికి క్రూరంగా ఉందా? కానీ ఇదే వాస్తవం. ఈ సూత్రాన్ని మన చుట్టూ ఉన్న వ్యవస్థలు ఎలా వాడుతున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మొదటగా రాజకీయ నాయకులు ఒక సమస్యను వాళ్ళు పూర్తిగా ఎందుకు పరిష్కరించరో తెలుసా? సమస్య మాయమైతే నాయకుడి అవసరం మీకు ఉండదు. ఆ సమస్య అలా నలుగుతూ ఉంటేనే మీరు ప్రతి ఎన్నికల్లో వాళ్ళ దగ్గరకు వెళ్తారు.
(03:04) వాళ్ళు మీ ఆకలిని మీ అవసరాన్ని వాడుకొని మీ మీద అధికారం చెలాయిస్తారు. ఇక రెండవది కార్పొరేట్ కంపెనీలు ఒక ఎంప్లాయిని కంపెనీ ఎప్పుడు భరిస్తుంది? అతను చాలా మంచిగా ఉన్నప్పుడా లేదు అతను చేసే పని ఇంకెవరూ చేయలేనప్పుడు అంటే కంపెనీ అతని మీద ఆధారపడినప్పుడు మాత్రమే వాడికి వాల్యూ ఇస్తుంది. చరిత్రలో క్లియోపాత్రను కేవలం ఒక అందగత్తగా చూస్తారు.
(03:34) కానీ అది తప్పు రోమ్ సామ్రాజ్యానికి కావలసిన ధాన్యం ఈజిప్టు నుండే వస్తుంది. ఆ ధాన్యపు గిడ్డంగుల తాళాలు ఆమె చేతిలో ఉండేవి. అంటే రోమ్ నగరం ఆకలితో చావాలా లేదా అని డిసైడ్ చేసేది క్లియోపాత్ర ఒక్కతే అందుకే ప్రపంచాన్ని జయించిన వీరులు కూడా ఆమె ముందు మోకరిల్లారు. అది అందం చూసి కాదు ఆమె దగ్గర ఉన్న పవర్ ఆఫ్ డిపెండెన్సీని చూసి సరే ఇప్పుడు మనం అసలు పాయింట్ కి వద్దాం.
(04:04) మీరు మీ జీవితంలో పవర్ఫుల్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు అందరికీ కావలసిన వారు కాకూడదు. మీరు ఎవరు భర్తీ చేయలేని వారు కావాలి. మీ ఆఫీస్ లో గాని మీ బిజినెస్ లో గాని చివరకు మీ ఇంట్లో గాని ఒక కీలకమైన పని కేవలం మీకు మాత్రమే తెలిసి ఉండాలి. ఆ పని మీ ప్రమేయం లేకుండా జరగకూడదు. అప్పుడు మీకు ఎదురు చెప్పే ధైర్యం ఇక్కడ ఎవరికీ ఉండదు.
(04:31) మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళ సమస్యను పూర్తిగా తీర్చేయకండి. ఎందుకంటే సమస్య తీరిపోతే కృతజ్ఞత ఉంటుంది కానీ గౌరవం ఉండదు. మాకియా వెళ్లి ఏమంటాడంటే కృతజ్ఞత అనేది మనుషుల్లో చాలా తక్కువ కాలం ఉంటుంది. కానీ భయం లేదా అవసరం అనేది వారిని ఎప్పటికీ కట్టిపడేస్తుంది. మీరు ఒకరిని లొంగ తీసుకోవాలంటే వారిని ఇబ్బంది పెట్టనక్కర్లేదు.
(04:58) వారి అవసరాల తాలంచెవి మీ దగ్గర ఉంచుకుంటే చాలు వాళ్ళు మిమ్మల్ని ద్వేషించినా సరే మీతోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనుగడ మీ చేతుల్లో ఉంది కాబట్టి అయితే ఈ అధికారం అనే కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. ఇక్కడే జాగ్రత్తగా వినండి ప్రజలు మీ మీద ఆధారపడితే మీరు రాజు అవుతారు. కానీ ప్రజలు మిమ్మల్ని చూసి అసహయించుకుంటే ఆ డిపెండెన్సీ కూడా మిమ్మల్ని కాపాడలేదు.
(05:25) మీరు ఆ నీళ్ల బాటిలు ఇచ్చేటప్పుడు నేనే గొప్ప అని అహంకారం చూపిస్తే అవతలివాడు ఆ నీళ్ల కోసం మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడడు. అందుకే మీ అవసరాన్ని వారికి గుర్తు చేస్తూనే వారికి మీ మీద గౌరవం ఉండేలా చూసుకోవాలి. ప్రేమను నమ్ముకుంటే మీరు మోసపోవచ్చు కానీ అవసరాన్ని నమ్ముకుంటే మీరు సామ్రాజ్యాన్ని ఏలవచ్చు. ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి.
(05:55) మీ స్నేహితులు మీ బంధువులు లేదా మీ బాస్ వీరంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? లేక మీ వల్ల వాళ్ళకి ఏదో పని ఉంది కాబట్టి మీ పక్కన ఉన్నారా? ఒకవేళ ఈరోజు మీ దగ్గర ఉన్న ఆ పవర్ పోతే రేపు మీ పక్కన ఎంతమంది ఉంటారు ఈ నిజం మీకు భయాన్ని కలిగిస్తే మీరు ఇంకా బలహీనంగా ఉన్నారని అర్థం. అదే ఈ నిజం మీకు ఒక మార్గాన్ని చూపిస్తే మీరు మాకి ఆవెల్లి శిష్యువులయినట్టే నిజం ఎప్పుడూ చేరుగానే ఉంటుంది.
(06:23) కానీ అది మిమ్మల్ని స్వేచ్ఛాజీవులుగా మారుస్తుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్

No comments:

Post a Comment