వేశ్యావృత్తి అంటే కేవలం అదేనా? || ఆచార్య ప్రశాంత్
Author Name:Acharya Prashant Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=B2oxz8s-Bos
Transcript:
(00:04) నా ప్రశ్న ముఖ్యంగా వేశయావృత్తి గురించి సమాజంలో దీనిని ఒక నిషేధంగా మరియు ఒక కళంకంగా భావిస్తారు. జనం దీని గురించి మాట్లాడటానికి గాని గుర్తించడానికి గాని ఇష్టపడరు. దీని పట్ల మన దృక్పదం ఎలా ఉండాలి? మీకు అర్థం కావట్లేదా వేశయావృత్తి అనేది ఆధ్యాత్మికత లేకపోవటానికి ప్రత్యక్ష ఫలితం. చాలా దేశాల్లో ఇది చట్టబద్ధం కూడా నిజానికి చెప్పాలంటే ఆమె సంపాదిస్తోంది కాబట్టి ప్రభుత్వం కూడా పన్నులు వసూలు చేస్తుంది ఆమె పన్ను చెల్లిస్తుంది.
(00:38) మీరు చైతన్యాన్ని గౌరవించినప్పుడు మాత్రమే శరీరాన్ని గౌరవంగా చూస్తారు. కానీ కొన్ని సంస్కృతులు సిద్ధాంతాలలో చైతన్యాన్ని అస్సలు గుర్తించరు. ఒక అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తాడు. అతను చేస్తున్నదల్లా ఆమె శరీరాన్ని కొలవడమే. అది వేశయావృత్తి ఎందుకు కాదు చెప్పండి మహిళల వైపు నుండి కూడా అంతే ఒక మహిళ పురుషుడు శరీరాన్ని గాని అతని ఆస్తిని గాని కొలుస్తుంటే అది వేశయావృత్తి ఎందుకు కాకుండా పోతుంది? అందుకే వేదాంతం అవసరం.
(01:13) సార్ నాకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా ప్రశ్న ముఖ్యంగా వేశయావృత్తి గురించి దీని గురించి కొంచెం వివరించండి. సమాజంలో దీనిని ఒక నిషేధంగా మరియు ఒక కళంకంగా భావిస్తారు జనం దీని గురించి మాట్లాడటానికి గాని గుర్తించడానికి గాని ఇష్టపడరు కానీ ఇది జరుగుతూనే ఉంది. ఇది ఎలాంటిది అంటే మీరు అన్నట్లు సమాజం అంటే ఎవరు మనమే సమాజం మరి దీని పట్ల మన దృక్పదం ఎలా ఉండాలి? ఇది నిజంగా ఒక నిషేధితంశమా లేక దీనికి మరేదైనా కోణం ఉందా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? వేశయావృత్తి చూడండి ఎప్పుడైతే జీవిత లక్ష్యం
(01:58) కేవలం భౌతిక సుఖమే అవుతుందో అప్పుడు భౌతిక సుఖాన్ని ఇచ్చేది ఏదైనా సరే దానిని పొందుతారు. ఆ వస్తువు కోసం భౌతికమైన వెల చెల్లిస్తారు. మీరు ఒక మనిషిని ఎలా చూస్తారు? ఒక మనిషిని గనుక మీరు కేవలం ఒక శరీరంగానే చూస్తే ఎందుకంటే మిమ్మల్ని మీరు ఒక శరీరంగా చూసుకుంటున్నారు. ఎందుకంటే మీరు మీ చైతన్యానికి తగిన గౌరవం ఇవ్వటం లేదు అలాంటప్పుడు ఆ శరీరాన్ని మీరు ఎందుకు కొనరు మీకు అర్థం కావట్లేదా వేశయావృత్తి అనేది ఆధ్యాత్మికత లేకపోవటానికి ప్రత్యక్ష ఫలితం.
(02:36) మీరు ఎంత భౌతికవాదిగా ఉంటే ఒక శరీరాన్ని కొనాలనే ధోరణి అంత ఎక్కువగా ఉంటుంది. నిజానికి చాలా దేశాల్లో ఇది చట్టబద్ధం కూడా అది ఎందుకు చట్టబద్ధం అంటే కొనడానికి అమ్మడానికి వస్తువులు ఉన్నప్పుడు శరీరం కూడా ఒక వస్తువే కదా అంటారు ఎవరో అమ్ముతున్నారు ఎవరో కొంటున్నారు ఇందులో సమస్య ఏముంది అని వారి వాదన వారు ఆలోచించే విధానం ప్రకారం అది సరైనదే చైతన్యం అనేది ఏదీ లేదని వారు అంటున్నారు.
(03:06) మనం కేవలం జంతువులమే. జంతువు అంటే కేవలం శరీరమే పురుషుడు ఒక శరీరం స్త్రీ ఒక శరీరం అంతే మరియు ఒక శరీరం మరొక శరీరాన్ని అనుభవించాలని కోరుకుంటుంది. దాన్ని చట్టబద్ధం చేయండి. అవతలి శరీరంపై బలవంతం చేయకండి వెల చెల్లించండి. డబ్బులు ఇవ్వండి. నిజానికి చెప్పాలంటే ఆమె సంపాదిస్తోంది కాబట్టి ప్రభుత్వం కూడా పన్నులు వసూలు చేస్తుంది ఆమె పన్ను చెల్లిస్తుంది.
(03:35) అసలు శరీరం అంటే ఏమిటి? శరీరం అనేది చైతన్యానికి నిలయం ఆ చైతన్యం మాత్రమే మనం గౌరవించదగ్గ ఏకైక విషయం. మీరు శరీరాన్ని ఈ విధంగా చూసినప్పుడే ఆ శరీరం పవిత్రం అవుతుంది లేకపోతే శరీరం కేవలం చెప్పుల లాగో బట్టల లాగో ఒక వస్తువు మాత్రమే లేదా ఒక పాత ఇనుప ముక్క లాంటిది ఏదైనా కొనుగోలుకు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదంతా ఏంటి ఇది కూడా ఇతర వస్తువుల లాంటి పదార్థమే కదా ఇందులో చాలా కార్బన్ ఉంది కొంచెం హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఈ శరీరం అంటే అంతే కదా మీరు కార్బన్ను
(04:22) కొనగలిగినప్పుడు ఒకరి శరీరాన్ని ఎందుకు కొనకూడదు చెప్పండి కార్బన్ నైట్రోజన్ మార్కెట్ లో దొరుకుతాయి కదా అవునా ఈ శరీరంలో కూడా చాలా కార్బన్ నైట్రోజన్ ఉంది అంతే కదా మరి శరీరాన్ని ఎందుకు కొనకూడదు దానికి సమాధానం ఎందుకంటే శరీరం అనేది శరీరం అనేది చైతన్యవంతమైనది అది సజీవం ైనది అది చైతన్యం కలిగినది కాబట్టే మీరు దాన్ని కొనలేరు.
(04:51) లేకపోతే అది కేవలం కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు కొన్ని ఖనిజాల కలయకే కాబట్టి శరీరంలో ఉన్న ప్రత్యేకత ఆ చైతన్యమే మీరు చైతన్యాన్ని గౌరవించినప్పుడు మాత్రమే శరీరాన్ని గౌరవంగా చూస్తారు. కానీ కొన్ని సంస్కృతులు సిద్ధాంతాలలో చైతన్యాన్ని అస్సలు గుర్తించరు. వారు గుర్తించేదల్లా ఇనుము, క్లోరిన్, కార్బన్ మరియు ఆక్సిజన్ మాత్రమే వస్తువులను గుర్తిస్తారు కానీ చైతన్యాన్ని గుర్తించరు.
(05:30) ఇప్పుడు వేష్యావృత్తి చట్టబద్ధం కావడంలో ఆశ్చర్యం ఏముంది? ఆ వ్యక్తి ఏమంటాడంటే నా దగ్గర చాలా ఉన్నాయి. నేను నా చెప్పులను కారును అమ్ముకోగలిగినప్పుడు నా జననేంద్రియాలను ఎందుకు అమ్ముకోకూడదు ఎలాగోలా బ్రతకాలి కదా ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది సరే అలాగే చెయ అంటుంది ఇలా డబ్బు సంపాదించి నాకు పన్ను కట్టు నాకు అభ్యంతరం లేదు.
(06:01) నిజానికి నేను ఈ వస్తువును వాడుకుని పర్యాటకులను కూడా ఆకర్షిస్తాను. మా దేశంలో ఏదో ప్రత్యేకమైనది అమ్ముతున్నారని చెప్పి ప్రచారం చేస్తాను. టూరిస్టులుగా రండి కొనుక్కోండి అంటారు. మెడికల్ టూరిజం ఉన్నట్లే ఇది ఒకటి ఎలాగైతే మీరు ప్రకృతిని చూడడానికి ఒక చోటికి వెళ్తారో అలాగే మరొకరి శరీరాన్ని అనుభవించడానికి అటువంటి ప్రదేశాలకు వెళ్తారు.
(06:35) మీరు సమస్యలను పూర్తిగా చూడాలి. అవి ఎక్కడి నుండి పుడుతున్నాయో ఆ మూలాల్లోకి వెళ్ళాలి. వేశవృత్తి అనే పదం వింటేనే మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ భార్యా భర్తలు ఒకరినొకరు కేవలం శరీరాలుగా చూసుకుంటే అప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించదా అది వేశయావృత్తికి ఏ విధంగా భిన్నమో చెప్పండి. ఒక అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తాడు.
(07:06) అతను చేస్తున్నదల్లా ఆమె శరీరాన్ని కొలవడమే అది వేశవృత్తి ఎందుకు కాదు చెప్పండి మహిళల వైపు నుండి కూడా అంతే ఒక మహిళ పురుషుడు శరీరాన్ని గాని అతని ఆస్తిని గాని కొలుస్తుంటే అది వేశయావృత్తి ఎందుకు కాకుండా పోతుంది అసలు వేశవృత్తి అంటే ఏంటి ఒక ప్రాణిని కేవలం ఒక శరీరంగా చూడటమే వేశయావృత్తి అదే అసలైన వేశయావృత్తి ఒక తల్లి తన బిడ్డ పట్ల చాలా శ్రద్ధ చూపిస్తుంది.
(07:39) కేవలం బిడ్డ శరీరం గురించి మాత్రమే ఆరాటపడుతుంది బిడ్డ దేహం పట్ల మాత్రమే ఇది వేశయావృత్తి చేసేదానికి ఏ విధంగా భిన్నంగా ఉంది? ఆ తల్లి బిడ్డ యొక్క చైతన్యం గురించి అస్సలు పట్టించుకోదు. బిడ్డ మనసులో ఏం జరుగుతుందో పట్టదు కానీ బిడ్డ కడుపునిండా తిన్నదా లేదా అని మాత్రం తెగ ఆరాటపడుతుంది. తిన్నావా నాన్న వెచ్చగా ఉందా మంచి బట్టలు వేసుకున్నావా అని అడుగుతుంది.
(08:06) వీటి గురించి ఆమెకు చాలా పట్టింపు ఉంటుంది. కానీ బిడ్డ లోపల ఏం జరుగుతుందో ఆమెకు అవగాహన ఉండదు. నిజానికి బిడ్డ అంతరంగానికి ఆమె ఇచ్చే గౌరవం సున్నా. ఇది వేశయావృత్తికి పునాది వేసే ఆలోచన కంటే ఏ విధంగా వేరు లేదా ఒక వ్యక్తి తనను తాను కేవలం ఒక శరీరంగా చూసుకుంటూ అద్దం ముందు రెండు గంటల పాటు మేకప్ చేసుకుంటే ఇది వేశ్యావృత్తి ఎందుకు కాదు సరే అక్కడ కొనేవాళ్ళు ఎవరూ లేకపోవచ్చు మీరు డబ్బులు తీసుకుని అమ్మకపోవచ్చు కానీ మిమ్మల్ని మీరు ఒక శరీరంగానే చూసుకుంటున్నారు కదా మిమ్మల్ని మీరు కేవలం శరీరంగా చూసిన క్షణమే వేశ్యావృత్తి మొదలైపోయినట్లే
(08:58) అందుకే వేదాంతం అవసరం మీకు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి శరీరం అనేది ఒక వాస్తవం మాత్రమే కానీ అది మీ సత్యం కాదు మీ సత్యం శరీరానికి అతీతమైనది. ఒకవేళ వేదాంతం లేకపోతే మీకు మిగిలేది వేశావృత్తి మాత్రమే అది రకరకాల రూపాల్లో ఉంటుంది. కేవలం ఒక రూపాన్ని మాత్రమే మనం అధికారికంగా వేశయావృత్తి అంటాం. మిగిలిన వాటికి మనం చాలా గౌరవప్రదమైన పేర్లు ఇచ్చుకుంటాం.
(09:30) కానీ జీవితం గురించి తెలిసిన వారు వారికి తెలుసు. ఒక శరీరం కేవలం వస్తువుగా మారినప్పుడు మనిషి కేవలం ఒక భౌతిక అస్తిత్వంగా మారిపోయినప్పుడు అది వేశయావృత్తే. మీరు దానికి ఎంత గొప్ప పేరు పెట్టినా అది వేశ్యావృత్తే అవుతుంది.
No comments:
Post a Comment