మన పిల్లలకు వాళ్ల ధర్మం గురించి నేర్పించే బాధ్యత ఇంకెవరిదో కాదు, మనదే.
ఇంట్లో పూజ చేసేటప్పుడు, రాత్రి హారతి ఇచ్చేటప్పుడు పిల్లలను పక్కన కూర్చోబెట్టుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నామో వాళ్లకు నేర్పించండి.
ఇంట్లో ఏదైనా సంప్రదాయం, ritual follow అయినప్పుడు దాని వెనక ఉన్న logic, science చెప్పండి. సనాతన ధర్మంలో దీన్ని ఎందుకు జరుపుకుంటామో చెప్పండి.
దీపావళి వచ్చినప్పుడు కేవలం టపాకాయలు ఇవ్వడం కాదు. వాళ్లను లక్ష్మీ పూజలో కూర్చోబెట్టండి. లక్ష్మీ పూజ ఎందుకు చేస్తాం, ఎలా చేస్తాం, గోవర్ధన పూజ ఎందుకు చేస్తాం అని చెప్పండి.
హోళీ వచ్చినప్పుడు హోళీ దహనం ఎందుకు చేస్తామో చెప్పండి. మన మత గ్రంథాలను చదవండి, మీరు కూడా చదవండి.
Bollywood లో శ్రీ కృష్ణుడిని కేవలం రాసలీలలు చేసే గోపికలతో ఆడుకునే వాడిగా చూపిస్తే, అది నిజం కాదని చెప్పండి. మహాభారతం ఎందుకు జరిగింది? ధర్మ స్థాపన కోసం జరిగింది అని చెప్పండి.
భగవాన్ రాముడు లేడిని కొట్టినప్పుడు అది కేవలం లేడి కాదు, అది రాక్షసుడు అని చెప్పండి. అప్పుడు ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్లు సమాధానం చెప్పగలరు. పిల్లలను మానసికంగా బలంగా తయారు చేయండి.
అప్పుడు వాళ్లు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తడబడరు. ధర్మం పట్ల వాళ్ల foundation చాలా బలంగా ఉంటుంది. ఎవరూ వాళ్లను convert చేయలేరు, manipulate చేయలేరు.
మీరు ఇప్పుడు వాళ్లకు ఇవన్నీ నేర్పించకపోతే, ముందు ముందు ఎవరైనా వాళ్లకు వేరే ధర్మం నేర్పించవచ్చు. అప్పుడు మీరు చేతులు కట్టుకుని చూడడం తప్ప ఏమీ చేయలేరు.
కాస్త ఆలోచించండి.
*"మీరు మీ పిల్లలకు సనాతన ధర్మాన్ని నేర్పించకపోతే -- ప్రపంచం వాళ్లకు మిగతావన్నీ నేర్పిస్తుంది"*
వేరు చెట్టుకు వేరులే బలం. అలాగే సంస్కారం ఒక తరాన్ని బలంగా చేస్తుంది. మీ సంస్కృతిని కాపాడండి, మీ విలువలను కాపాడండి, తెలివితో తదుపరి తరానికి మార్గనిర్దేశం చేయండి.
🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏
No comments:
Post a Comment