Monday, July 6, 2026

 అమూల్యమైన మానవ జన్మ మనకి ఎలా పడితే అలా తిని,తాగి, కులాసాగా గడపడానికో,ఆస్తులు కూడబెట్టడానికో లభించలేదు. కేవలం పరమాత్మ ప్రాప్తి కోసం సాధన చేయడానికి అనుకూలమైన శరీరంతో మానవ జన్మ లభించింది.ముఖ్యంగా ఈ మానవ జీవితంలో ఏదో ఒకటి నేర్చుకోవడానికి,సాధించడానికి, లక్ష్యసాధనకు ప్రయత్నించాలి తప్ప,...వృధాగా సాకులు చెబుతూ కాలం గడపకూడదు.ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా జీవించడానికి ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి తప్ప వేరే ఎవరో వచ్చి ఉద్ధరించరు. దత్త భగవానుడిని సేవించడమే మనల్ని మనం ఉద్ధరించుకోవడం. రోజూ దత్త భగవానుడిని త్రికరణ శుద్ధిగా ప్రార్ధించి,సహాయం అడగండి. మనం ఏమరపాటుగా ఉన్నా, నిద్రపోతున్నా ఆయన మాత్రం మనల్ని ఉద్ధరించడానికి ఎల్లప్పుడూ మేల్కొనే ఉంటాడు. మన ఆలోచనల్ని,మన జీవితాన్ని మార్చడానికి, సరిదిద్దడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధతతో ఉంటాడు.
జై గురుదేవ దత్త.

http://youtube.com/post/UgkxiUpu809OdATRBQEE2-puKEvVF23hU11W?si=--60nzwkwItqV0Gp

No comments:

Post a Comment