Stop Buying on EMI! The Hidden Trap Banks Don't Want You to Know
Author Name:Mana Life Lessons
Youtube Channel Url:https://www.youtube.com/@manalifelessons-g5d
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iiQaVWOuKZ4
Transcript:
(00:01) మాయానగరం అనే ఊరిలో ప్రజలు చాలా ప్రశాంతంగా బ్రతికేవారు. ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతే డబ్బు ఖర్చు పెట్టేవారు. ఒకరి దగ్గర పాత సైకిల్ ఉంటే ఇంకొకరు హ్యాపీగా నడిచి వెళ్ళేవాళ్ళు అప్పులు అనే పదమే వారికి తెలీదు. కానీ ఒకరోజు ఆ ఊరిలోకి ధనదాసు అనే ఒక తెలివైన వ్యాపారి వచ్చాడు. ఆయన ఒక పెద్ద షాపింగ్ మాల్ పెట్టాడు.
(00:26) అందులో మెరిసిపోయే రథాలు పట్టు బట్టలు వింత వింత వస్తువులు పెట్టాడు. ఊర్లో ఉన్న రాము అనే ఒక సామాన్య యువకుడు ఆ మాలుకు వెళ్ళాడు అక్కడ ఒక అద్భుతమైన పట్టు చొక్క చూసి దాని ధర 100 వెండి నాణలు కానీ రాము జేబులో కేవలంప నాణాలు మాత్రమే ఉన్నాయి. రాము దిగులుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ధనదాసు నవ్వుతూ వచ్చి భుజం మీద చెయ్యి వేశడు. ధనదాసు రాముతో అన్నాడు రాము ఈ చొక్క నీకోసమే తయారయింది.
(00:55) [సంగీతం] దీనికోసం నువ్వు 100 నానాలు ఇప్పుడే ఇవ్వక్కర్లేదు. నీ దగ్గర ఉన్న 10 నానాలు ఇచ్చి చొక్కా తీసుకొని వెళ్ళిపో అని చెప్పాడు రాము ఆశ్చర్యపోయాడు. మరి మిగిలిన 90 నాణాలు ఎలా అని అడిగాడు. ధనదాసు ఒక మాయా కాగితం తీసి చూయించి ఇలా అన్నాడు నువ్వు [సంగీతం] ప్రతి నెల కేవలం ఐదు నాణాల చొప్పున నాకు ఇస్తే చాలు. దీనినే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు సింపుల్ గా ఈ అమ్మాయి అంటారు.
(01:23) రాము మనసులో లెక్క వేసుకున్నాడు. నెలకు ఐదు నాణాలు ఇవ్వటం నాకేం పెద్ద కష్టం కాదు కదా అని సంబరపడిపోయాడు. ఆ చొక్క వేసుకొని ఊరంతా తిరిగాడు ఊరి జనం అంతా రాము రాత్రికి రాత్రే ధనవంతుడు అయిపోయాడని కుల్లుకున్నారు. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. రాముని చూసి ఊరిలో ప్రతి ఒక్కరు ధనదాసు దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టారు. చేతిలో డబ్బులు లేకపోయినా పెద్ద పెద్ద గుర్రపు బగ్గీలు కొన్నారు లోన్లు తీసుకొని ప్యాలెస్లు కట్టారు. అలా కొన్ని నెలలు గడిచాయి.
(01:53) [సంగీతం] రాము జీవితం నరకంలా మారిపోయింది పోను పోను ఎందుకంటే ప్రతి నెల ఒకటవ తారీకు రాగానే ధనదాసు మనుషులు రాము ఇంటి ముందు నిలబడేవారు. చొక్కాకి ఐదు నాణాలు కొన్న బగ్గీకి 20 నాణాలు ఇంటి లోనికి 50 నాణలు ఇలా రాము రాత్రి పగలు కష్టపడి సంపాదించే ప్రతి నానం ధనదాసు జేబులోకి వెళ్ళిపోయేది. ఒకరోజు రాముకి బాగా జ్వరం వచ్చింది పనిలోకి వెళ్ళలేకపోయాడు కానీ ధనదాసు మనుషులు వచ్చి నీకు జ్వరం వస్తే మాకేంటి ఈ నెలకు రావాల్సిన ఈ అమ్మాయి రాకపోతే నీ చొక్క నీ బగ్గి మొత్తం లాకెళ్లిపోతామని బెదిరించారు.
(02:32) రాము ఏడుస్తూ ఆ జ్వరంతోనే రాత్రి పగలో కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు గాని రాముకి ఒక భయంకరమైన నిజం తెలియలేదు. తాను వస్తువులను కొనలేదు ఆ వస్తువులే తనను కొనేసాయి అని తాను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్న మనిషిని కాదు ధనదాసు దగ్గర బంది అయిన ఒక ఆధునిక బానిస ఈ మాయానగరంలో ఉన్న రాము మరెవరో కాదు ఈరోజు మొబైల్ స్క్రీన్ చూస్తున్న మీరు నేను మనమే ఆ రాములం మన పెద్దలు ఒక మాట చెప్పేవారు దుప్పటి ఉన్నంతవరకే కాళ్ళు చాచాలి అని కానీ నేటి బ్యాంకులు మనకు నువ్వు కాళ్ళు చాచేసి పడుకో దుప్పటి మేము అప్పు మప్పు ఇస్తామని వలవేస్తున్నాయి.
(03:11) ఇలాంటి ఆర్థిక బానిసత్వం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బ్యాంకుల వల నుండి ఎలా తప్పించుకోవాలో మూడు సింపుల్ రూల్స్ ఇప్పుడు చెప్తాను. అవి చూసే ముందు మన లైఫ్ లెసన్స్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకులు మనల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాయో తెలుసా? నో కాస్ట్ ఈఎంఐ అంటారు అంటే వడ్డీ లేదు అని నమ్మిస్తారు కానీ అసలు నిజం ఏంటంటే మీరు క్యాష్ పెట్టి కొంటే వచ్చే డిస్కౌంట్ ను వాళ్ళు ముందే కట్ చేసేస్తారు పైగా ఒక్కరోజు లేట్ అయినా వేసే పెనాల్టీలో ప్రాసెసింగ్ ఫీజులతో మీ జేబు ఖాళీ చేసేస్తారు.
(03:47) ఈ వల నుండి బయట పడటానికి ఈ మూడు రూల్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మొదటిది మీరు ఏదైనా కారు కొనాలి అని అనుకుంటే కనీసం 20% డౌన్ పేమెంట్ కట్టాలి లోన్ కేవలం నాలుగు ఏళ్ళు మాత్రమే తీసుకోవాలి. మీ నెలవారి ఈఎంఐ మీ జీతంలో 10% కంటే ఎక్కువ ఉండకూడదు. రూల్ నెంబర్ టూ మీరు ఒక ఫోన్ కొనాలి అని అనుకుంటే ఫోన్ కాస్ట్ 50,000 ఉంటే మీ అకౌంట్ లో లక్ష రూపాయల క్యాష్ ఉంటేనే ఆ వస్తువును కొనండి లేదంటే మీకు ఆ వస్తువు కొనే అర్హత లేదని అర్థం ఈఎంఐ లో అస్సలు కొనకండి.
(04:27) రూల్ నెంబర్ త్రీ అప్పు చేసి ఐఫోన్ కొంటే దాని వాల్యూ మరుసటి రోజే తగ్గిపోతుంది. అదే అప్పు లేకుండా దాచుకున్న డబ్బుతో ఒక చిన్న ల్యాండ్ కొన్న మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన అది భవిష్యత్తులో మీ జేబులోకి డబ్బులు తెస్తుంది. అదే నిజమైన ఆస్తి గుర్తుపెట్టుకోండి క్షణకాలపు బంధాల కోసం పక్కవాడికి చూపించుకునే షో ఆఫ్ కోసం మీ జీవితాన్ని అప్పులు పాలు చేసుకోకండి.
No comments:
Post a Comment