Monday, July 6, 2026

 *వ్యాసుని జ్ఞానసముద్రం* --

*పౌర్ణమి వచ్చినప్పుడల్లా సముద్రం పాలవంటి తెల్లటి నురగతో పొంగి పొర్లిపోతుంది! అలానే ఒక మహానుభావుని జననంతో జ్ఞానం అనే వారిధి పొంగుతుంది. పొంగి తన తెల్లసి విజ్ఞానపు అలలతో జ్ఞానతరంగాల్ని ఎత్తివచ్చి, ఈ విశాలవిశ్వమంతా నింపేస్తుంది.*

*చంద్రుడు సముద్రాన్ని సృష్టించడు! దాన్ని పొంగిస్తాడు అంతే! అలాగే వ్యాసుడుకూడా వేదాన్ని సృష్టించలేదు. అందులోని విజ్ఞానసాగరాన్ని జగత్తంతా పొంగించాడు అంతే! సరిగ్గా అలానే జరిగింది. ప్రపంచంలో వ్యాసమహర్షి అవతరించటంతో! అపారమైన జ్ఞాన సముద్రం, ఎన్నో యుగయుగాలనాటి విజ్ఞానం ఒక్కసారిగా వ్యపితం చేయబడింది. వేదాలలోనూ ఉపనిషత్తులలో పురాణాలలో నిండిన విజ్ఞానమంతా సముద్రంలా, పాలకడలిలా పొంగి విశ్వమంతా వ్యాపించింది చంద్రోదయంలో లాగే!*

*అయితే పొంగిన ఈ “జ్ఞానసముద్రం" ఏమిటి? అంటే వ్యాసుని అవతారంతో ప్రపంచమంతా పొంగిన వేదవిజ్ఞానం ఏమిటి? అన్న అనేక ప్రశ్నలుకూడా ఉదయిస్తాయి సహజంగానే. ఆజ్ఞానసముద్రం ఎటువంటిదో దానిలో ఎన్నిశాస్త్రాలూ సైన్సులూ ఇమిడివున్నాయో, అన్నిటినీ వ్యాసమహర్షి మనకోసం ఎలాగ పరిరక్షించి ఇచ్చాడో అదంతా యిక్కడే తెలుసుకుందాం! ఇందులో మొదటిది 'వేదవిజ్ఞానం. ఈ వేదవిజ్ఞానం అంటే ఏమిటో ఈ యువతరంవారికి దాదాపు ఏమీ తెలియదు! అదేమిటో ముందు చూద్దాం!*

*వేదంకంటె ప్రాచీనం :*

మనలో చాలామంది వేదం అన్ని శాస్త్రాలకూ అన్ని ఇతిహాసాలకూ మొదటిదని, అనుకుంటారు. ఇది నిజంకాదు! ఇలాఅంటే ఆశ్చర్యంగా వుంటుందికదూ! అవును. దీనికో కారణం వున్నది. ఇప్పుడు మనం చదువుకునేవాటిలోకల్లా ప్రాచీనమైనవి నాలుగు వేదాలుగదా! నిజమే! కాని ఇవి నాలుగూ వేదవ్యాస మహర్షి వేదాలను విభజించియిచ్చిన కాలంనాటివే! అంతకంటే ముందునుంచీ ప్రపంచంలో ఈ కనపడే, సృష్టి జరిగిన కాలంకంటే పురాతనమైన ఒక ప్రాచీనమైన విశ్వచరిత్ర(Universal History) వుండేది, అని వేదాలను విభాగించిన వ్యాసమహర్షియే ఒప్పుకున్నాడు “మత్స్యపురాణం" లో!

యుగాల గతచరిత్ర :-

ఈ “విశ్వచరిత్ర" అంటే, కేవలం ఈనాడు 'హిస్టరీ' (History) గా మనం చదువుకునే కొద్దిపాటికాలం రెండువేలో, నాలు గువేలో-- సంవత్సరాల రాజుల అవినీతికథల లిస్టుగాదు. “చరిత్ర” అంటే, మానవజాతి ప్రాచీన చరిత్ర “మనువు" ఎలాగ మానవజాతి అంతా గడచిన ప్రళయంలో మునిగి పోయి, నశించిన సమయంలో సశ్వవిజ్ఞానాన్ని నశించకుండా దాచి, తిరిగి ఈక్రొత్త మానవజాతి వచ్చింతర్వాత దాన్ని అందరికీ యిచ్చి దేన్ని చదివిస్తాడో ఆచరిత్ర అన్నమాట!

ఇది పురాతనం అయినదీ, వేదకంటే ప్రాచీనమైందీ అని, దీన్నిగురించి వ్యాసుడెందుకు వ్రాశాడో ఇప్పుడర్థమౌతుంది. ఇది పురాతనం అయినది కనుక “పురాణం" అని పేరు! ఈరోజు మనం చదువుకునే అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలూ, దేనిలోంచి పుట్టాయో; వ్యాసుని తండ్రి అయిన పరాశరుడు ఆదివిష్ణుపురాణాన్ని దేన్ని అనుసరించి వ్రాశాడో అంతకన్న ముందుగా ప్రతి “ద్వాపరయుగం” లోనూ గతించిన వ్యాసులు (వీరు 27 --మంది) ఏ "ఆదిపురాణం" ను ఆధారంగా 'విశ్వచరిత్ర' ను, తయారుచేశారో అది వేదంకన్న ప్రాచీనం! ఇదే, వ్యాసుని జ్ఞాన సముద్రం, అంటే!

అందుకే అన్నాను, వ్యాసుడు జ్ఞానసముద్రాన్ని పొంగించాడని, చంద్రునిలాగ! సృష్టించలేదు అదే “ఆదిపురాణం.”

ఐతే దీనిలోని విషయం ఏమిటి? దీన్ని నశించిపోకుండా మనకు ప్రళయాలను దాటి రక్షించి మనకి అందించే పరమగురువులు ఎవరు? ఈ సిద్ధులపని ఏమిటి అంటే, కొన్ని రహస్యాలు యిక్కడ చెప్పక తప్పదు.

ప్రాచీన రహస్య విజ్ఞానమే “పురాణం” :

ఈ భూమ్మీద మానవజాతి పుట్టి, కొన్ని కోట్లసంవత్సరాలయింది. అనాదిగా మానవుడు సంపాదించిన విజ్ఞానమంతా యుద్ధాల వల్లా, జలప్రళయాలవల్లా, భూకంపాల దుండగుల ఘాతుక చర్యలవల్లా ఎన్నో గ్రంథాలూ భాండాగారాలూ తగులబడిపోయినప్పటికీ, అందులోని అతి ముఖ్యమైన రహస్యవిజ్ఞానం ప్రపంచంలో ఏదోఒకమూల దాచబడి రక్షింపబడుతూనే వున్నది. అలా రక్షించబట్టే మళ్ళీ ఈ ప్రళయాల అనంతరం మానవుడు జంతుదశలోకి జారిపోకుండా రక్షిస్తున్నది కూడా ఈవిజ్ఞానమే!

ఈ వేదశాస్త్రేతిహాసాలు అనేక కల్పాంతరాలనుంచీ వస్తూన్నవే. అయినా, అనాదులే ఐనా ప్రతి మహాయుగంలోనూ, కలియుగంలో కొంతభాగం గతించేసరికి, అన్నీ తిరిగి అంతర్హితమై పోతున్నాయి! మళ్ళీ అవసరమైనపుడు, తిరిగి మహర్షులవల్ల అవి ప్రచారములోనికి వస్తున్నవి.

శ్లో. యుగాంతే న్తర్ణితాన్ వేదాన్ పేతిహాసాన్ మహర్షయః | లేభిరే తపసాపూర్వం అనుజ్ఞాతాః స్వయంభువా | వేదవిద్వేద భగవాన్ వేదాంగాని బృహస్పతిః| భార్గవో నీతిశాస్త్రంతు జగాద జగతోహితం | గాంధర్వో నారదో వేద, భరద్వాజో ధనుర్గ్రహం | దేవర్షిచరితం గార్గ్యః కృష్ణాత్రేయశ్చికిత్సికం | న్యాయశాస్త్రాణ్యనేకాని తైస్తెద్వక్తాని వాదిభిః ||

* (భారత శాంతిపర్వం 210. అధ్యా||

తా. "యుగాంతములో, అంతర్హితమయిన, వేదశాస్త్ర ఇతిహా సాదులను, అనేకులుమహర్షులు, తపస్సుచేసి బ్రహ్మ అనుగ్రహంతో సంపాదించారు.

వీటిలో, వేదవేత్తయగు బృహస్పతి వేదాంగములనూ, శుక్రాచార్యుడు నీతిశాస్త్రమునూ, నారదమహర్షి గాంధర్వ వేదమునూ, భరద్వాజమహర్షి ధనుర్వేదమునూ, దేవర్షుల చరిత్రను గార్గ్యుడను మహర్షి, వైద్యశాస్త్రము కృష్ణ ఆత్రేయుడున్ను, తర్కశాస్త్రములు, మొదలగు వాటిని ఇంకా అనేకులు, లోకహితంకోసం చెప్పారు.”

అయితే, ఇలా రహస్యంగా విజ్ఞానాన్ని రక్షించడం మనం అనుకున్నట్లు, అచ్చుపుస్తకాల రూపంలోనూ లైబ్రరీ (Library)ల రూపంలోనూ సాహిత్యగ్రంథాల రూపంలో ఉన్నదికాదు. ఇది కేవలం కొన్నివేల సంవత్సరాలకే సరిపోతుంది.కాని కోట్ల, సంవత్సరాలలో భూగోళంలో జరిగే కొలదీ మార్పులూ, దేశాల ఆకారాలలో కలిగే మార్పులూ, నదులూ భూఖండాలూ, పర్వతాలు, వాతావరణంలో మార్పులూ ఇలాంటి మార్పులలో దేశాలకి దేశాలే సముద్రంలో మునిగి పోయి మటుమాయం అయిన ప్రళయాలు భూమ్మీద ఎన్నో గతించిపోయాయి.

ఇలాంటివెన్నో యీనాటి సైన్సుకూడా గుర్తించింది. ఇలా 50,000 సంవత్సరాలక్రితం “అట్లాంటిస్" (Atlantis) అనే ఒక పెద్ద భూఖండం మునిగిపోయినట్లు ప్లాటో (Plato) వ్రాసింది యదార్థమని "వెలికోవీస్కీ" (Velikovsky) వంటి యీనాటి సోవియట్ రష్యాలోని వైజ్ఞానిక పరిశోధకులు కూడా తేల్చారు! ఇలాంటి మహా ప్రళయాల్లో దేశాలకిదేశాలే మారిపోయి భౌగోళిక మార్పులలో వేలాది, లక్షలాది జీవులు నశిస్తాయి. అలాటి “ప్రళయాల" నుంచి నశించకుండా విచిత్రంగా రక్షింపబడిన ఈ రహస్య విజ్ఞానాన్ని జాగత్రగా మనకి అందించే మహావ్యక్తులు కొందరున్నారు. వీరే పరమగురువులు లేక సిద్ధ మునిమండలి!

వీళ్ళు మనలాంటి సామాన్య “మానవులు” కారు. అనేక జన్మలు తపస్సుచేసి 'సిద్ధి' ఏనాడో సంపాదించినవారు. మన పురాణాలలో "సిద్ధపురుషులు” లేక “చిరంజీవులు" అని చెప్పబడే వ్యక్తులు వీళ్ళే ! వీరు అనంతమైన ఈ రహస్యవిజ్ఞానాన్ని మనస్సుతోనే 'ధారణ' చేసి పుస్తకాలూ, రాగిరేకులూ వంటివెన్నో నాశనం అయినా కాలిపోకుండా తామే అదృశ్యంఅయి జరిగిన ప్రళయాల గాథను చూచి, యధాతధంగా వ్రాసిన రహస్య చరిత్ర --ఇంకా యిప్పటికీ హిమాలయ గుహలలో దాచివుంచారు!! దీన్ని చూసిన పాశ్చాత్యులు కూడా* చాలామంది మనకాలంలోనే వున్నారు.

రష్యనుయోగి “గుర్ణేఫ్" (Gurdjieff); రష్యన్యోగినీ సిద్ధురాలు ఐన “&” Blavatsky యింకా ప్రపంచ భవిష్యత్తును దర్శించి ముందే వ్రాసిన “కిరో” (Cheiro) వంటి వారు చాలమంది చూచిన 
కాబట్టి ఇలాంటి ఆది గ్రంథం, (The Old Book) ఈ విశ్వచరిత్రని అంతా తెలిపేది వొకటి యీనాటి మన "వేదాలు" పుట్టక ముందునించే వున్నదని తేలుతున్నది. దీనికి "పురాణం" అని పేరు. (మనం ఎరుగున్న 18 పురాణాలు కావు) ఇదే మానవ విజ్ఞానానికి “ఆదిమగ్రంథం”, పురాతన “విశ్వచరిత్ర". దీన్ని ప్రాచీన ఋషులందరూకూడా ఎరుగుదురు. అంటే వేదాలలోని మంత్రాలలో వర్ణించిన “దీర్ఘతమసుడు" "నారాయణుడు" అత్రి, అంగీరసుడూ వంటి వైదికఋషులూ-పురాణాలు వ్రాసిన వ్యాసమహర్షి తండ్రియైన పరాశరుడు, కూడా యిలాంటి ఆది 'పురాణాన్ని' స్వయంగా ఎరుగున్నట్టూ అది వేదాలకన్న ప్రాచీనమైందనీ ఇతర పురాణాలు కూడా సాక్ష్యమిస్తున్నాయనీ, మనలో చాలామందికి తెలియదు. لتو

ఇది నూరుకోట్లశ్లోక సంఖ్యకలది. దీనితర్వాతనే వేదాలు ఉత్పత్తి అయినాయి. ఈవిషయం “మత్య్సపురాణం”లో యిలా వున్నది.

శ్లో| “పురాణం” సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతం నిత్యం శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరం అనంతరం చ వక్త్రభ్యో వేదాస్తస్య వినిర్గతాః

మత్స్యపురాణం

కాని వేదవ్యాస మహర్షి ఈ నాలుగువేదాలూ తాను విభజించక ముందు ఒకే వేదంగా ఉండివుండటమే గాకుండా ఈ వేదాన్ని సంహిత కంటే అతిప్రాచీనమైన “పురాణ” ఒక్కటే గ్రంధంగా వుండేదంటూ నొక్కి 'పురాణ మేకమేవాసీత్' అంటూ నారదపురాణంలో మళ్ళీ ఇలా వివరించారు:

సాక్ష్యం వున్నది. గ్రంథవిస్తర భీతిచే వివరాలు వొదిలి వేస్తున్నాను ఇవి నా గ్రంథం "మనదేశం-- మనసంస్కృతి" (USECFI) చూడవచ్చు. దీన్ని గురించిన వివరాలు, "మహామునుల యోగమండలి" “పరమగురువుగా వ్యాసమహర్షి" అన్న తర్వాతి అధ్యాయాలలో ఇవ్వబడింది.
పురాణ మేకమేవాసీత్, సర్వకల్పేషు మానద చతుర్వర్గస్య బీజం చ, శతకోటి ప్రవిస్తరం"

໕. 1. 92-22

చాలామంది పండితులు ఈనాడు వేదంకంటే ప్రాచీనమైన ఒక 'పురాణం' వుండేదంటే కూడా విశ్వసించలేరు! అందుకని వారు పైశ్లోకాన్ని ఎవరో చేర్చిన -- 'ప్రక్షిప్త' శ్లోకంకింద భావించవచ్చు! కాని వ్యాసమహర్షి ఇదే మాటను అనేకచోట్ల మళ్ళీమళ్ళీ నొక్కిచెప్పారు ఇతర పురాణాలలో సంహితం కూడా!

ఉదాహరణకు ఆయన 'స్కాంద పురాణం'లో ఒక్కటే ప్రాచీనమైన పురాణం వుండేదని "ఏక మేవ పురాహ్యాసీత్” అని నొక్కిచెప్పిన ఈక్రింది శ్లోకం గమనార్హము :

ఏకమేవ పురాహ్యాసీత్, బ్రహ్మాండం శతకోటి ధా తతో అష్టాదశధా కృత్వా వేదవ్యాసో యుగేయుగే

స్కాందం (72-8)

అని, తానేగాదు. ఇలా ప్రతి మహాయుగంలోనూ వచ్చిన వేదవ్యాసులందరూ ఈశాశ్వతమైన 'పురాణాన్నే' తపస్సులో దర్శించి పద్దెనిమిదిగా విభాగించి వ్రాశారని తెలిపేందుకు “వేదవ్యాసో యుగే యుగే' అన్నారు నిస్సందేహంగా!! పైశ్లోకంలో 'బ్రహ్మాండం' అంటే ఇప్పటి బ్రహాండ పురాణం కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు! ఒక బ్రహ్మాండమైన పురాణం ఏకైకమైనది అనగా ఈ యావత్ బ్రహ్మాండవిషయాలను తెలిపేది అని అర్ధమని శ్లోకంలోని

తర్వాత పాదంలో 'తతో అష్టాదశధా కృత్వా' (దానినే పద్దెనిమిది పురాణాలుగా విభజించి) అనటంవల్ల ఈ బ్రహ్మాండ పురాణమంటే ఈనాటి పద్దెనిమిది పురాణాలకీ ప్రాచీన మాతృక అని అర్థం. ఇదే నారద పురాణంలో కూడా ఇలా తిరిగి వివరించారు:"బ్రహ్మాండం యచ్ఛతుర్లక్షం పురాణం యేన పఠ్యతే తదేతస్య గదితమధా అష్టాదశధా పృధక్”

ఇదే “ఆది పురాణము” లేక ఆద్యమైన 'పురాణ సంహిత'గా ఆకాశంలో శబ్దస్వరూపంగా నిత్యమైనదీ, అది సాక్షాత్ బ్రహ్మనుంచి పుట్టినది . అని వ్యాసమహర్షి స్పష్టంగా మత్స్య, వాయు, పద్మ మార్కండేయ భవిష్యపురాణాలలో అన్నింటిలోనూ వివరించాడు, ఒకే శ్లోకం ద్వారా! *

వేదము ఒక్కటే :

91/386

ప్రాచీన కాలమైన ఆదికాలంలో వేదాలు యీనాటికిమల్లే కాకుండా “వేదము" ఒక్కటిగానే వుండేదని తెలుస్తున్నది. ఇలాంటి "ఆది మవేదాన్ని" ఛందోబద్ధం చేసి సామాన్య ప్రజలందరి ఉపయోగార్థం మంత్రాలుగా ఆంగీరసుడనే ముని, చేశాడు. అందుకే దీనిని “ఆంగిరస” మనే పేరుతో పిలిచేవాడు. దీనికే "సంగ్రహ ఛాందసము" లేక “అధర్వము” అనికూడా నామాంతరములున్నాయి. ఇది చాలామంది వేదపండితులుగూడా ఎరుగరు.

వేదవిభాగము - వేదవ్యాసుడు :-

మిగిలినదంతా కలిసి, ఏకంగా "వేదం" అని అవిభక్తంగానే

* "పురాణం పర్వశాస్త్రాణాం ప్రధమం బ్రహ్మణాస్మృతం.

విత్యం శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరం, అనంతరంచ వక్త్రభ్యోవేదాస్తస్య వినిర్గతాః"
 అని బ్రాహ్మ (161-27):  1-45): (53,3) వాయు(1-44) : మార్కండేయ (45-20) పురాణాలు అంగీకరించాయి.
వుండిపోయింది. వ్యాసమహర్షి యీ వేదాన్నే అధ్యయనం చేశాడు. ఈయన, తన అధ్యయనం పూర్తికాగానే ఒక్కసారిగా, ఏకాకారంలో వున్న వేదాన్ని ఆమూలాగ్రం పరిశీలించాడు సమగ్ర దృష్టితో, అప్పుడాయనకేమి కనిపించిదంటే వేదంలోని మంత్రభాగాలూ, ఋక్కులూ అన్నీ కలిసిపోయి చిందరవందరగా ఒక క్రమం ప్రకారం లేవని! కొన్నికొన్ని ఒక్కొక్క ఋషిదగ్గర పడివున్నాయి! వేరే దేశంలో కొన్నిప్రాంతాలలో కొన్నిఋక్కులు ప్రచారంలో వున్నాయి. మరికొన్ని దేశంలో అంతటా వ్యాపించి ఉన్నాయి. ఇంకొన్ని అసలే మూలబడి బహుళ ప్రచారంలో లేవు, ఖిలమైపోయే దశలో వున్నాయి. వీటినే 'ఖిల' మన్నారు!

ఈ అసందర్భాన్ని వేదవ్యాసుడు వెంటనే గుర్తించాడు. వెంటనేగనుక సత్వరంగా యీ మంత్రాలనూ, ఋక్కులనూ ఒక్కచోట చేర్చి పోగుచేసి క్రమబద్ధంచేసి వాటి అర్థాన్నిబట్టి, వాటి ఉపయోగాన్నిబట్టి, తీరుగా అమర్చకపోతే, అవి ఒక అడవిలాగ గడిబిడగా అల్లుకు పోయివుండటమేగాక ఇంకొన్నాళ్ళకు వేదంలో కొన్నిభాగాలు అసలే నామరూపాలు లేకుండా, ప్రచారంలోంచి నశించిపోతాయి ప్రజలు వాటిని విస్మరించడం ద్వారా ఏర్పడే ఈ భయంకర పరిస్థితిని చక్కజేయాలంటే యీ వేదాన్ని అంతా క్రమబద్ధంగా అమర్చి ఒక తీరూతెన్నూ వుండేలా విభజించాలి.

ఇది వేదాలకు అర్థం తెలిసినవాళ్లు తప్ప, ఇతరులు చేయలేరు. ఇంతేగాదు.ఆ మంత్రాలలో వర్ణించబడ్డ విషయాలను దివ్య దృష్టితోగాని, ప్రత్యక్షానుభూతితోగాని అర్థం చేసుకున్నవాడైతేగాని వాటి ఉపయోగాలను తెలుసుకోలేడు. ఇది సామాన్యుడైన కవి, సాహితీపరుడూ, చేయలేదు కేవలం యోగి మాత్రమే అయిన వ్యక్తివల్ల అయ్యేపనికూడాకాదు. అనేక శాస్త్రాలలో అనుభవంతో కూడిన పరిచయంవుండి "వేదార్థమును” యోగశాస్త్రాభ్యాసంతో రంగరించి, ఆ సమ్యగ్దృష్టితో వేదార్థాన్ని గ్రహించి--తద్వారా వాటి ఉపయోగాన్నిబట్టి ఏమంత్రాలు గానం చేయడానికి పనికివస్తాయో వాటిని “సామములు” గానూ, ఏ భాగాలు యాజ్ఞిక కర్మలయిన క్రతు యజ్ఞ విధులలో ఉపయోగిస్తాయో, వాటిని "యజుస్సులు” గానూ ఏమంత్రాలు ఋక్భాగాలో, అందులో ఏవి దైవిక మంత్రాలో అన్నదాన్నిబట్టి "ఋక్కులు" గానూ విడదీశాడు వ్యాసమహర్షి! ఇలా ఏర్పడినాయి, సామవేదం, యజుర్వేదం, (యజుస్ + వేదం), ఋగ్వేద(ఋక్+ వేదము)మూనూ!

ఈవిధంగా వేదానికి ప్రస్తుతరూపం ఏర్పాటు అయింది. ఇదే చతుర్వేద విభాగం. ఇది చేసిన చతుర్ముఖుడే వ్యాసబ్రహ్మ. ఇలా వేదవిద్యలు శాఖోపశాఖలుగా విస్తారంచెయ్యబడి, వ్యాప్తిచెందినాయి. ఈ వ్యాప్తి చెందటాన్నే "వ్యసించడం" అంటారు. వేదములను వ్యసనము చేసినందువల్లనే, కృష్ణద్వైపాయన మునికి "వేదవ్యాసు” డనే పేరు కలిగింది. ఇది, ద్వాపర యుగాంతానికి జరిగిన విషయం.

ఇప్పుడు మళ్లీ "కలియుగం" అంతం కాబోతున్న కాలంలో మళ్ళీ ఇదే పరిస్థితి వెలిసింది! ఈనాడు మళ్ళీ యీ వేదాలను అభ్యసించేవాళ్లు కరువై దేశంలో కొన్నికొన్ని శాఖలు అసలు చదివేవాళ్ళే లేరు. ఆ కారణంగా ఈనాటి వేదపండితులు 1966 లో తిరుపతిలో “వేద రక్షణ సభ"లో శ్రీజగద్గురు కంచికామకోటిస్వామి వారి ఆధ్వర్యంలో అందరం సమావేశమైనప్పుడీ ఘోరవిపత్తు కళ్ళకు కట్టినట్టుగా బైటపడింది. కొన్నికొన్ని వేదశాఖలలో కొల్లలుగా దాన్ని అధ్యయనం చేసేవాళ్లున్నారు. ఉదాహరణకు యజుశ్శాఖీయులు దేశంలో బహుళంగా వున్నారు. ఇక సామవేదం అధ్యయనం చేయగలవాళ్లూ "ఋక్ శాఖీయులూ” అతి తక్కువగా వున్నారు.

కొన్నికొన్ని శాఖలలో ఎక్కడో
ఒకళ్ళు. అక్కడ సత్వరమే మనం మేలుకుని అలనాడు వ్యాసమహర్షి తన వేర్వేరు శాఖలు యిచ్చి వారిచేత అధ్యయనం చేయించినట్టుగానే -- మళ్ళీ ఈనాడుకూడా అన్నిశాఖల వారినీ అలాగే సక్రమంగా ఏర్పాటు చెయ్యకపోతే, వేదంలో చాలాభాగం లుప్తమై ఖిలమై పోతుంది! ఇది యీనాడు దేశం గుర్తించినట్టు కనపడదు.

వ్యాస శిష్యులద్వారా విద్యలప్రచారం :-

ఇలాగ వ్యాసమహర్షి, సూతుడు ఉపదేశించి, వారిచేత అనేవానికి పురాణాలూ, యితర శిష్యులకు యితర భాగాలూ చదివించి, వాటివాటి ఉపయోగంలో వారికి శిక్షణనిచ్చి వాటిని దేశంలో ప్రచారం చేయించి ఆయాభాగాలు సాంప్రదాయ రూపంలో శాశ్వతంగా పాతుకుపోయి నిల్చిపోయేలాగ చేశాడు.

ఏ యే శిష్యుడు ఏయే విషయాల్లో శిక్షణపొందాడో, అన్న విషయం వేరేచోట వివరంగా గమనిద్దాం. ✍️లక్ష్మీరాజ్     *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment