ప్రజల్ని మాయచేయడం ఎలా? మాస్ ప్రోపగండాలకి ఆద్యుడు ఎవరు? #edwardbernays #propaganda #manipulation
Author Name:Kutuhala Shaala
Youtube Channel Url:https://www.youtube.com/@KutuhalaShaala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PzOVgzO23Og
Transcript:
(00:03) మీకు టూ వీలర్ కారో అవసరమయ్యి నాలుగైదు షోరూమ్లు తిరిగి మీకు నచ్చిన కంపెనీది కొనుక్కున్నారు. నిజంగా మీకు నచ్చే కొనుక్కున్నారా అలా కొనుక్కొని ఇంటికి వెళ్ళే ముందు ఒక గుడి దగ్గర పూజ చేపిస్తే ప్రమాదాలు జరగవు అని చాలా మంది నమ్మకం. అందుకనే మీరు కూడా వెళ్లి అక్కడ పూజ చేయించారు. అసలు ఆ నమ్మకం ఎలా పుట్టింది? తర్వాత వారం జరిగిన ఎన్నికల్లో మీకు ఇష్టమైన నాయకుడికి ఓటు వేసి ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(00:31) ఇంతకీ మీకు ఆ నాయకుడి మీద ఇష్టం ఎలా కలిగింది మనకి స్వతంత్రం 1947 లో రాలేదు 2014 లో వచ్చిందని ఎవరో చెప్తే టీవీలో విన్నారు.మౌంట్ మౌంట్ బెటన్ వాస్ హియర్ ఫోటో నహి తి వో భీక్ తి జో ఆజాది మిలీ హై వో 2014 మే మిలి హే ఆ మాట అన్నవాళ్ళు అంత పిచ్చి మాటలు ఎలా మాట్లాడగలిగారు మనం తినే అన్నం వినే మాట చూసే సినిమా వేసే ఓటు నమ్మే మతం నచ్చే ఉద్యోగం తిట్టే ఫ్రెండ్ ఇవన్నీ మన ఛాయిస్ లేనా మనం సొంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలేనా ఒక అడ్వర్టైజమెంట్ క్యాంపెయిన్ ఒక సోషల్ మీడియా పోస్ట్వా WhatsApp లో వచ్చిన ఒక మెసేజీ ఆ మాటకవస్తే పొద్దున్నే లేచి చదివే మీ నమ్మకమైన
(01:15) దినపత్రిక వీటిలో నిజాలంతా అబద్ధాలఎంత ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలుసు ఎలా తెలుసు మనం ఒక వస్తువు కొనాలన్నా ఒక వ్యక్తిని నమ్మాలన్నా ఒక పార్టీకి ఓట వేయాలన్నా తిన్నగా చెప్తే చేస్తామా లేదా మన మైండ్ ని మనిపులేట్ చేసి దాని మీద ఇష్టం కలిగేటట్టు చేసే చేస్తామా ఏది కష్టం ఏది సులభం రోజుకో పండు తింటే రోగాలు రావని మన దేశాన్ని ఒక వ్యక్తే రక్షించగలదని ఇంకో దేశంలో ప్రభుత్వం మారితేనే మనం సురక్షితంగా ఉంటామని మనల్ని మనమే ఒప్పించడం కన్విన్స్ చేయడం ఎలా సాధ్యం ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఒక వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా
(01:55) తెలుసుకోవాలి. అతనే ఫాదర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ గా పిలవబడే ఎడ్వర్డ్ బర్నెస్ ఈరోజు వీడియోలో అతని జీవితాన్ని క్లుప్తంగా చూసి అతను నడిపిన మూడు క్యాంపెయిన్ల గురించి వివరంగా చెప్తాం. మా పని మేము బాగా చేస్తే గనుక ఈ వీడియో పూర్తయ్యే లోపులో మీ ఆలోచన విధానమే మారిపోవచ్చు. ఇంకా ఆలస్యం చేయడం అనవసరం పదండి. 1891లో వియన్నాలో పుట్టిన ఎడ్వర్డ్ బర్నెస్ సిగ్మన్ ఫ్రాయిడ్ లాంటి ప్రముఖ వ్యక్తికి మేనల్లుడు.
(02:27) తను పుట్టగానే వాళ్ళ ఫ్యామిలీ అమెరికాకి వలస వెళ్ళింది. మొదటి పుట్టిన రోజు కూడా ఆ ప్రయాణంలో భాగంగా ఓడలోనే చేసుకున్నాడు అంటారు. కాస్త ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు కాబట్టి చిన్నప్పుడు సినిమా కష్టాలు ఏమీ పడలేదు. ఒక పక్క అమెరికాలో చదువుకుంటూ మరో పక్క సెలవల్లో యూరోప్ కి వెళ్ళినప్పుడు తన మేనమామ సెగ్మెంట్ ఫ్రాయిడ్ తో సమయం గడిపేవాడు. అలాంటి సందర్భాలలో ఫ్రాయిడ్ డెవలప్ చేసిన సైకో అనాలసిస్ మోడర్న్ సైకాలజీలని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు.
(02:53) మన సబ్కాన్షియస్ మైండ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి పాత్ర వహిస్తుంది [సంగీతం] అమెరికాలో ఉన్న కమర్షియల్ కల్చర్ కి దాన్ని ఎలా లింక్ చేయొచ్చు ఇలాంటి విషయాల మీద ప్రాథమిక అవగాహనకు వచ్చాడు. కేవలం ఫ్రాయిడ్ తో సరిపెట్టకుండా గుస్తావ్ లీ బోన్ ని చదివి క్రౌడ్ సైకాలజీ వాల్టర్ లిప్మెన్ ని చదివి పబ్లిక్ ఒపీనియన్ మేనేజ్మెంట్ ని బాగా వంటపట్టించుకున్నాడు.
(03:13) తండ్రి కోరిక మేరకు వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశడు కానీ కెరీర్ మాత్రం జర్నలిజంతో మొదలు పెట్టాడు. ఒక మెడికల్ జర్నల్ కి ఎడిటర్ గా పనిచేస్తూ మెల్లగా నాటకాలని నటులని రివ్యూ చేసే పని చేసేవాడు. వాటిలో భాగంగా కళాకారుల నాటకాల మీద పబ్లిక్ ఒపీనియన్ ని ఇన్ఫ్లయెన్స్ చేయడం మొదలు పెట్టాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సినిమాలకే సినిమా స్టార్లకి రివ్యూలు రాయడం అనుకోండి అలా రాస్తూ సొసైటీలో మెల్లగా ఎదగడం ప్రారంభించాడు.
(03:43) తనకున్న టాలెంట్ తో హ్యూమన్ సైకాలజీ మీద ఉన్న పట్టుతో ఆ కాలంలో అమెరికాలో ఉన్న ప్రముఖ వ్యక్తుల కళాకారుల సంస్థల నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. మెల్లగా నటులని నాటకాలని పబ్లిసైజ్ చేస్తూ పాతికలకే మార్కెటింగ్ రంగంలో గొప్ప పేరు సంపాదించాడు. అదే సమయంలో అంటే 1916 లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి. వాటిలో అప్పటికే ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న వుడ్రో విల్సన్ కూడా పోటీ చేశాడు.
(04:09) ఆ క్యాంపెయిన్ లో భాగంగా తాను మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికాని ఇన్వాల్వ్ చేయలేదని న్యూట్రల్ గానే ఉంచానని చెప్పి మళ్ళీ అధ్యక్షుడయ్యాడు. కాకపోతే మరుసటి ఏడాది కల్ల పరిస్థితులు మారిపోయి అమెరికా కూడా యుద్ధంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆరు నెలలకు ముందే యుద్ధంలోకి అమెరికాని దింపలేదని ఓట్లు అడిగాడు కాబట్టి తన చర్యలని సమర్ధించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
(04:33) అటు దేశంలో ఇటు దేశం బయట యుద్ధానికి మద్దతు సాధించేందుకు కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనే ఒక కమిటీని నెలకొల్పాడు. ఆ కమిటీలో ఎడ్వర్డ్ బెర్నర్స్ కూడా ఒక జూనియర్ మెంబర్ అప్పటిదాకా మెడికల్ జర్నల్లలో నాటకాల్లో వాడిన తన ప్రాపగాండా పద్ధతుల్ని బెర్నర్స్ నేరుగా రాజకీయాల్లో ఉపయోగించే అవకాశం వచ్చింది. తను నేర్చుకున్నదంతా వాడి ఆ కమిటీతో కలిసి పనిచేసి వుడ్రో వెల్సన్ కి కావలసింది చేసిపెట్టారు.
(04:58) ఇదిగో ఈ పోస్టర్ చూడని అమెరికన్ దాదాపుగా ఉండడో ఇది తయారు చేసింది కూడా కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వాళ్లే. ఈ క్యాంపెయిన్ లో బర్నెస్ నేర్చుకున్నవి మూడు మొక్కల్లో చెప్పాలంటే ఒకటి సాధారణ ప్రజలకి ప్రతి విషయం పరిశోధించి తెలుసుకునే ఓపిక సమయం సామర్థ్యం ఉండవు. రెండు అందుకని వాళ్ళు నమ్మకమైన మధ్యవర్తుల మీద ఆధారపడతారు. అవి దినపత్రికలు కావచ్చు నాయకులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు ఇంటలెక్చువల్స్ కూడా కావచ్చు.
(05:27) మూడు ఆ మధ్యవర్తులని గాని మనం మేనేజ్ చేస్తే [సంగీతం] ఇన్ఫ్లయెన్స్ చేస్తే ప్రజలని కూడా చాలా సులభంగా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళ అభిప్రాయాలని మనకు తగ్గట్టు మార్చుకోవచ్చు. వాళ్ళతో కావలసిన పనులు చేయించుకోవచ్చు. ఈ పద్ధతులకి సానబెట్టి సామాన్య ప్రజల్ని తన లక్ష్యాలకు అనుగుణంగా మలచడం మొదలు పెట్టాడు. ఎలాగంటారా మీకు ఇంకా క్లారిటీ రావడానికి తను చేసిన కొన్ని మార్కెటింగ్ క్యాంపెయిన్లు కాదు కాదు ప్రాపగండాల గురించి చెప్తాం జాగ్రత్తగా వినండి.
(05:56) 1920లలో అమెరికాలో పొగాక అమ్మకాలు పెద్దగా పెరగడం లేదు. అమెరికన్ టుబాకో కంపెనీ ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్ హిల్ కి ఆడవాళ్ళ రూపంలో ఒక మంచి గిరాకే దొరికింది. అప్పటి అమెరికన్ సమాజంలో ఆడవాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ లో పొగ తాగడం అనేది చాలా అరుదు కొద్దో గొప్పో తాగినా తాము ఉండే ఇళ్లల్లోనో లేదా గుట్టు చప్పుడు కాకుండా పని చేసేవాళ్ళు.
(06:18) అందుకని [సంగీతం] పొగ తాగే ఆడవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. తమ కంపెనీ సేల్స్ పెరగాలంటే ఆడవాళ్ళకి పొగ అలవాటు చేయడం పబ్లిక్ ప్లేసుల్లో ఎటువంటి కామెంట్లు రాకుండా బహిరంగంగా పొగ తాగేటట్టు చేయగలగడం కావాలి. ఒకసారి గాని అది జరిగితే పొగాకు అమ్మకాలు ఆకాశంలోకి దూసుకెళ్తాయి. పొగతాగే ఆడవాళ్ళ సంఖ్యను పెంచడానికి హిల్ బెర్నెస్ ని నియమించుకున్నాడు.
(06:41) బెర్నెస్ కూడా ఏఏ బ్రిల్ అనే సైకాలజిస్ట్ తో మాట్లాడి కొంత బేసిక్ నాలెడ్జ్ పోగు చేసి తన ప్రాపగండా మొదలు పెట్టారు. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న బహిరంగంగా పొగుతాగే వాళ్ళు ఇంకా అవమానాలు ఎదుర్కొంటున్నారని ఈ విధంగా మెసేజ్లు పంపించడం మొదలు పెట్టాడు. ఒక మగవాడు హుందాగా ఏ ఇబ్బంది లేకుండా పార్కుల్లో రోడ్ల మీద ఇంటి బయట దమ్ము కొట్టగలిగినప్పుడు ఆ పని ఆడవాళ్ళు చేస్తే తప్పేంటి ఏ ఆ మాత్రం ఫ్రీడమ స్త్రీలకు ఉండకూడదా అమ్మాయిలంటే అలుసైపోయారా తన సెక్రటరీ అయిన బెర్త హంట్ కి కొన్ని రోజులు సెలవిచ్చి ఉమెన్స్ రైట్ యాక్టివిస్ట్ గా నటింపజేయిస్తూ ఆ సర్కిల్
(07:19) లో బాగా తిప్పించాడు. అమ్మాయిలు బహిరంగంగా వెలిగించేది సిగరెట్ కాదని అది తమ టార్చ్ ఆఫ్ ఫ్రీడమ అని ఆ సర్కిల్ లో బాగా స్పీచ్ ఇప్పించాడు. మార్చ్ 31 1929 లో బెత్తాతో పాటు ఒక 10 మంది అమ్మాయిలని హైర్ చేసుకొని న్యూయార్క్ ఈస్టర్ పీరియడ్ లో వాళ్ళ చేత బహిరంగంగా సిగరెట్లు వెలిగించేటట్టు చేశాడు.
(07:41) దేశం నలుమూలలా ఉన్న న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు ఆ ఈవెంట్ ని కవర్ చేసేలా మేనేజ్ చేశాడు. అదే సమయంలో బెర్నస్ గాని అమెరికన్ టొబాకో కంపెనీ గాని ఎక్కడా కనపడకుండా వాళ్లే ఇదంతా చేస్తున్నట్లు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. మామూలు ప్రజల దృష్టిలో ముఖ్యంగా ఆడవాళ్ళ దృష్టిలో అక్కడ జరిగింది పొగడటం కాదు స్వేచ్ఛ వాయువులను పీల్చడం పురుష అహంకారాన్ని ఎదిరించడం ఒక మెట్టు పైకి వెళ్ళడం పురుషులతో తాము కూడా సమానమే అన్నదాన్ని నిరూపించడం ఇంకేముంది 1923 లో జరిపిన పొగాకు అమ్మకాల్లో ఆడవాళ్ళు కొన్న శాతం ఐదు గా ఉంటే 29 కల్లా అది 12%కి చేరి 35 కల్ల 18%నికి రీచ్ అయింది. అమెరికన్ టొబాకో కంపెనీకి చెందిన
(08:22) లక్కీ స్ట్రైక్ బ్రాండ్ అమ్మకాలు అయితే ఏకంగా 300%కి పెరిగాయి. ఆ పొగ తాగే ట్రెండ్ దాదాపు 50 ఏళ్ల పాటు అలాగే కొనసాగింది. ఇక్కడ తాగిపోతే కిక్ ఏముంది? కార్పొరేట్ల ధనదాహం ఇంకా తేరలేదు. లక్కీ స్ట్రైక్ అమ్మకాలు పెరిగినా దానితో పాటే మిగతా బ్రాండ్ అమ్మకాలు కూడా పెరగటం మొదలు పెట్టాయి. కొన్నాళ్ళకి దాన్ని దాటేసే పరిస్థితి.
(08:49) కారణం ఏంటా అని చూస్తే ఆ సిగరెట్ ప్యాకెట్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఆడవాళ్ళకి అంత ఆకర్షణీయంగా కనపడకపోవడమే అందుకని ఎవరైతే కొత్త కొత్త ఫ్యాషన్లు ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారో వాళ్ళు మరింత బాగా కనపడే వేరే కంపెనీలో సిగరెట్ ప్యాకెట్లు కొనడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆ కాలంలో హ్యాండ్ బ్యాగ్, టోపీ, బూట్లు ఎలాగో బెర్నెస్ క్యాంపెయిన్ మూలంగా సిగరెట్ ప్యాకెట్ అనేది కూడా వాళ్ళు పట్టుకునే వస్తువుల్లో భాగం అయిపోయింది.
(09:14) ఇదే సమస్యని మళ్ళీ బెర్నర్స్ ముందు పెడితే ఏముంది [సంగీతం] పెట్టి రంగు మార్చండి సరిపోతుందిగా అన్నాడు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. దీన్ని డిజైన్ మీద ఉత్పత్తి మీద పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాం నువ్వే ఏదో ఒకటి చెయి అని తిరిగి సమాధానం ఇచ్చారు. దీన్నో ఛాలెంజ్ గా తీసుకున్న బెర్నర్స్ ఇంకో క్యాంపెయిన్ మొదలు పెట్టాడు.
(09:32) కలర్ ఫ్యాషన్ బ్యూరో అనే కొత్త సంస్థను నెలకొలిపి ఫ్యాషన్ డిజైనర్లకి ఇంటీరియర్ డిజైనర్లకి డిపార్ట్మెంట్ స్టోర్ల వాళ్ళకి ఉత్తరాలు రాయడం మొదలు పెట్టాడు. ఏమని ఆకుపచ్చ గ్రీన్ అనేది తొందరలో రాబోయే కొత్త ట్రెండ్ దాన్ని గాని మీరు వదిలేస్తే వెనక పడిపోతారు అని అలానే వనోందగా సిల్క్ కంపెనీ అనే బట్టలు తయారు చేసే కంపెనీతో భాగస్వామ్యం కుదుచ్చుకొని ఆ ప్రెసిడెంట్ ని రాబోయే ఆకుపచ్చ విప్లవాన్ని వినియోగించుకోవాలని సలహాలు ఇచ్చాడు.
(10:00) దాంతో ఆ కంపెనీ పెద్ద ఎత్తున ఆకుపచ్చరంగులో బట్టలు తయారు చేయడం మొదలు పెట్టింది. మెల్లగా మార్కెట్ లోకి పచ్చరంగు ప్రవేశించి అది రాబోతున్న గొప్ప ఫ్యాషన్ ట్రెండ్ గా అందరూ భావించడం మొదలు పెట్టారు. మేము గాని దీన్ని ఫాలో అవ్వకపోతే వెనకపడిపోతామేమో అని సాధారణ జనం కూడా ఎగబడి పచ్చరంగు బట్టలు కొనడం మొదలు పెట్టారు. చివరగా 1934 లో ఒక పెద్ద ఈవెంట్ ని నిర్వహించాడు.
(10:23) పొగాకు కంపెనీ పేరు గాని ఆకుపచ్చ రంగు గురించి గాని ఏమి చెప్పకుండా ఒక న్యూట్రల్ పర్సన్ గా నేషనల్ సిటీ బ్యాంక్ చైర్మన్ భార్య అయిన వండర్ బిల్ట్ ని అప్రోచ్ అయ్యాడు. ఒక చారిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని తను కానీ చీఫ్ గెస్ట్ గా వస్తే ఆ ఈవెంట్ టికెట్లు అమ్మడంలో వచ్చిన డబ్బుల్ని ఆవిడ నడుపుతున్న ఆసుపత్రికే విరాళంగా ఇస్తానని ప్రపోజ్ చేశాడు.
(10:44) తనకే విరాళాలు వస్తాయి కదా అని ఆవిడ కూడా ఒప్పుకుంది. అంతేకాకుండా తనతో పరిచయం ఉన్న సెలబ్రిటీలను కూడా ఆ ఈవెంట్ కి ఆహ్వానించింది. ఇక్కడే బెర్నస్ తన బుర్ర వాడాడు. ఆ ఈవెంట్ కి ఆకు పచ్చ రంగుని తీమ్ కలర్ గా నిర్ణయించాడు. మొత్తం ఆడిటోరియం ని పచ్చరంగుతో నింపేసాడు. పచ్చ కార్పెట్లు పచ్చ కర్టెన్లు పచ్చ లైటింగ్ పచ్చ రంగులో ఉండే కాక్టైల్లు ఆహారం వచ్చే గెస్ట్ులు పచ్చ బట్టలు అలా మొత్తం పచ్చమయం అయిపోయింది.
(11:10) చీఫ్ గెస్ట్ అయిన వండర్ బిల్ట్ కూడా అదే రంగు గౌన్ వేసుకొని గెస్టులని రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత పత్రికల్లో టీవీలో ఈ ఈవెంట్ గురించి కొన్ని నెలల పాటు ఊదరగొట్టించాడు. ఫలితం ఆకుపచ్చ అనేది ఇంకెంత మాత్రం మామూలు రంగు కాదు అదో ఫ్యాషన్ ట్రెండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వేసుకునే బట్టల వాడే వస్తువుల రంగు కట్ చేస్తే లక్కీ స్ట్రైక్ అమ్మకాలు మళ్ళీ కొన్ని రెట్లు పెరిగాయి బర్నెస్ మళ్ళీ సక్సెస్ అయ్యాడు.
(11:37) ఇవేముంది ఇవన్నీ మార్కెటింగ్ క్యాంపెయిన్లు కదా కార్పొరేట్ ప్రపంచంలో సహజంగా జరిగేవే కదా అంటారా? కానే కాదు ఈ రెండు క్యాంపెయిన్లలో ఎక్కడ కూడా దేన్నైతే మార్కెటింగ్ చేస్తున్నారో ఆ విషయం చివరిదాకా సాధారణ ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సిగరెట్లనే స్వేచ్ఛకి లింక్ పెడితే ప్యాకెట్లనే ఫ్యాషన్ ట్రెండ్ కి లింక్ పెట్టారు. ఇక్కడ జరిగింది ప్యూర్ మార్కెటింగ్ఏ కాదు గ్రేట్ మనిపులేషన్ కూడా అలాగే ఇలాంటి మనిపులేషన్స్ కేవలం ఉత్పత్తులు అమ్మడానికే కాదు దేశాలకి దేశాలని నాశనం చేయడానికి కూడా వాడొచ్చు.
(12:10) వాడారు కూడా ఆ సంగతి కూడా చూద్దాం పదండి. 1940లలో అమెరికాకి చెందిన యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ తన అరటిపళ్ళ సేల్స్ పెంచుకోవడానికి బెర్నర్స్ ని నియమించుకుంది. సహజంగానే తనదైన శైలిలో అరటిపళ్ళు తింటే ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఏ రకంగా అవి సూపర్ ఫుడ్ ప్రచారం చేయించడం మొదలు పెట్టాడు. అరటిపళ్ళ గొప్పతనం గురించి సూడో సైంటిఫిక్ పేపర్లు ప్రచురించడం సెలబ్రిటీల చేతుల్లో వాటిని పెట్టి పాపులర్ చేయటం సెనోరిటా చికిత బనానా అనే కార్టూన్ క్యారెక్టర్ సృష్టించి పిల్లల మనసుల్లో అరటిపళ్ళ ప్రాముఖ్యతను పెంచడం గట జరిగింది.
(12:46) ఫలితంగా అరటిపళ్ళ అమ్మకాలు బాగా పెరిగి యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి మంచి లాభాలు వచ్చింది. అసలు కదా తర్వాత 10 ఏళ్లకి అంటే 1951లో మొదలైంది. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి అమెరికాకి దక్షిణంగా ఉన్న గ్వాటమేలా దేశంలో 5దున్నర లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ భూమిలో కొంత భాగంలో స్థానిక కూలేలను వాడుకుంటూ అతి తక్కువ ధరకి పళ్ళను ఉత్పత్తి చేస్తూ అమెరికాలో మంచి లాభాలకు అమ్ముకునేది.
(13:13) 1951లో గ్వాటమేలాలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగి కల్నల్ జాకోబో ఆర్బెంజ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన రాగానే మొట్టమొదట చేసిన పని భూసంస్కరణాలు చేపట్టడం. దానిలో భాగంగా ఆ కంపెనీకి ఉన్న భూమిలో సుమారు 40% భూమిని అది కూడా ఏ విధమైన సాగు చేయని ప్రాంతంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ఉచితంగా కాదు తగిన పరిహారం చెల్లించి మరి కంపెనీ మూలాలు కదిలిపోయాయి.
(13:38) అంత పెద్ద భూమిని లాక్కునేసరికి ఏదో ఒకటి చేయమని బెర్నేస్ ని అడిగారు. [సంగీతం] ఇంకేముంది కథ మొదలైంది. అదే సమయంలో అంత పెద్ద భూమికి హక్కుదారుగా ఉన్న యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి వ్యతిరేకంగా గ్వాటమెలాలో నిరసనలు జరిగాయి. బెర్నర్స్ చేసిన మొట్టమొదటి పని గోవాటమెలాలో జరుగుతున్న ఈ నిరసనల్ని ఒక కంపెనీకి వ్యతిరేకంగా జరిగే వాటిలా కాకుండా అమెరికాకి వ్యతిరేకంగా జరుగుతున్న వాటిగా ఫాల్స్ న్యూస్ తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాడు.
(14:05) ఆ నిరసనలని సాగుగా చూపిస్తూ ఏ విధంగా కొత్త గోటమేలా ప్రభుత్వం అమాయకపు అమెరికన్ కంపెనీల ఆస్తులని దోచుకుందో అమెరికాలోనే ప్రాపగాండా చేయించడం మొదలు పెట్టాడు. కంపెనీకి అనుకూలంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించడం న్యూస్ పేపర్లలో ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రచారం చేయించడం లా మేకర్లని చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళతో గ్వాటమేలాకు వ్యతిరేకంగా మీటింగలు పెట్టించడం చేశాడు.
(14:31) చివరగా తన బద్ధ శత్రువైన రష్యాతో గ్వాటమేలా కొత్త అధ్యక్షుడు జత కలిసి అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పెద్ద గూడు పొటాన్ని నడుపుతున్నాడని అమెరికన్ ప్రజలని కన్విన్స్ చేయగలిగాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఒక కంపెనీ కోల్పోయిన భూములు కాదు అమెరికా యొక్క స్వాతంత్రం అక్కడ ప్రజల సేఫ్టీ ప్రజల్లో అధికారుల్లో నాయకుల్లో చాలామంది గ్వాటమిలా ప్రభుత్వం అక్కడి నాయకత్వం అమెరికన్ భద్రతకు ప్రమాదం అని మనస్ఫూర్తిగా నమ్మారు.
(14:59) కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. చివరగా 1954 లో ఆపరేషన్ పిబి సక్సెస్ పేరుతో సిఐఏ ద్వారా ఒక మిలిటరీ తిరుగుబాటు చేయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన జాకోబో అర్బెంచ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కార్లోస్ అర్మాస్ అనే మిలిటరీ నియంత అధ్యక్షుడయ్యాడు. [సంగీతం] ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే సిఐఏ అందించిన నిధులు సహకారంతో కేవలం 480 మంది సైనికులతో కార్లోస్ తిరుగుబాటు చేసి సక్సెస్ అయ్యాడు.
(15:29) ప్రభుత్వం దాన్ని తిప్పి కొట్టిన బెర్నేస్ అప్పటికే చేసిన ప్రాపగండా మూలంగా అంతర్జాతీయంగా గోటమేలా యకావడం తప్పుడు బాంబింగ్ రిపోర్ట్ులు పంపి మోరల్ దెబ్బతీయడంతో సైన్యం సహకరించలేదు జాకోబో రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం ఒక కంపెనీ దురాశ ఒక వ్యక్తి చేసిన ప్రాపగాండా మూలంగా దేశానికి దేశమే నాశనం అయిపోయింది. ఇది జరిగి 70 ఏళ్లకు పైనే అవుతున్న ఈరోజుకి కూడా గోటమేలా కోలుకోలేదు.
(15:54) 36 ఏళ్ల అంతరయుద్ధం జరిగి కొన్ని లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అవినీతితో పేదరికంతో అల్లాడిపోతున్నారు. దాదాపురం లక్షల మంది చనిపోయారు. స్థానిక మయన్ల మీద అనేక దాడులు జరిగాయి. ఇదంతా ఒకే ఒక ప్రాపగండా పర్యవసానం ఒక దేశమే తలకిందులు అయిపోయింది. అంటే ఈ మనిపులేషన్ [సంగీతం] ప్రాపగాండా విష ప్రచారం తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అనేవి కేవలం వ్యాపారాలే కాదు దేశాలనే ప్రజల్ని కూడా ప్రభావితం చేయగలవు.
(16:23) మీ జీవితాన్ని మా జీవితాన్ని కూడా సర్వనాశనం చేయగలం. ఇప్పటిదాకా చెప్పిన ఉదాహరణలు 70 నుంచి 100 ఏళ్ల క్రితపువి ఆ కాలంలో ప్రజలకు సమాచారం దినపత్రికలు రేడియోలు లాంటి రెండు మూడు మాధ్యమాల ద్వారానే జరిగేది. అయినా గాని ఒక దేశాన్నే తప్పుదారి పట్టించడం సమాచారాన్ని ఒక్కీకరించడం తమ దేశం చేస్తున్న పనే సరైందని ప్రజలని నమ్మించడం చేయగలిగారు. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉండి క్షణాల్లో సమాచారం ఇవ్వగలిగే కాలంలో ఈ ప్రాపగండా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వ్యాప్తి ఇంకెంత వేగంగా వెళ్ళగలదో మీరే ఊహించుకోండి.
(17:00) వాట్ WhatsApp లో Facebook లోఎక్స్ లో YouTube లో మిగతా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారం ప్రతి ఒక్కరి ఆలోచనలని విపరీతంగా ప్రభావితం చేయగలదు. ఒక పోస్టో మెసేజో చూడగానే మనకి ఆలోచించే సమయం గాన నిజా నిజాలని నిర్ధారించుకునే అవకాశం గాన ఉండదు. చూస్తాం వెంటనే రియాక్ట్ అవుతాం. ఆ ప్లాట్ఫామ్ లో డిజైన్ చేసే విధానం కూడా అలానే ఉంటుంది.
(17:23) మిమ్మల్ని రెచ్చగొట్టేవి ఉద్రేక పరిచేవి అబద్ధమైనా గానీ వాటిని మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తూ అదే నిజమైన బ్రహ్మలో మిమ్మల్ని ముంచేస్తాయి. అబ్రహం లింకన్ ఒక మాట అంటాడు యు కెన్ ఫూల్ సమ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైం అండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైం బట్ యు కెనాట్ ఫూల్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైం అని ఈ మాట అన్నప్పుడు ఇప్పుడు మనకు ఉన్న పరికరాలు అందుబాటులో లేవు.
(17:47) ఉంటే గనుక కచ్చితంగా యు కెన్ ఫూల్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైం అని అనేవాడు. అందుకే వచ్చిన ప్రతి మెసేజ్ ని పోస్ట్ ని వీడియోని [సంగీతం] చూసి మీరు రియాక్ట్ అయ్యే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి ఆలోచించుకోవాలి. దాని ఇంటెంట్ దాని లక్ష్యం మనల్ని మిస్లీడ్ చేయడమా ఒక వర్గం మీద ద్వేషం రెచ్చగొట్టడమా మూఢ నమ్మకాన్ని వ్యాప్తి చేయించడమా అనేది ఖచ్చితంగా పరిశీలించాలి.
(18:10) మిగతా దేశాల సంగతి ఏమో గానీ రిలేటివ్ గా ఈ మధ్యనే పుట్టి విభిన్న మతాలు, కులాలు, ఆచారాలు, వ్యవహారాలు కలిసిన మూఢ నమ్మకాలు బాగా పాతుకుపోయిన మన దేశంలో ఒక గ్రూపుని రెచ్చగొట్టడం ఒక వర్గాన్ని కించపరచడం ఒక మూఢనమ్మకాన్ని ప్రచారం చేయడం చాలా చాలా సులభం. అందుకే చరిత్రలో జరిగిన ప్రస్తుతం జరుగుతున్న ప్రాపగండాలని స్టడీ చేస్తూ, ఈ మధ్యకాలంలో వెదజలుతున్న విద్వేషాలని గుర్తిస్తూ ఒక బాధ్యత గల పౌరునిగా నడుచుకోవడం మన విధి.
(18:40) ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు ఒక పోస్ట్ పెట్టే ముందు ఒక వీడియోని నమ్మే ముందు ఒక్క విషయం ఒక్క నిమిషం ఆలోచించండి అది షేర్ చేయడం అవసరమా లేదా అని అంతకుమించి ఫ్యాక్ట్ చెక్ మనం చేయక్కర్లేదు. ఏమంటారు ఏదేమైనా గాని కుతూహలంగా ఉండండి కుతుల శాలని చూడండి.
No comments:
Post a Comment