Tuesday, July 7, 2026

నమ్మిన వాళ్ల చేత మోసపోయారా? ||నీలకంఠుడివైతే విజయం నీదే || SEETAKANTH TALKIE #motivation #lifelessons

నమ్మిన వాళ్ల చేత మోసపోయారా? ||నీలకంఠుడివైతే విజయం నీదే || SEETAKANTH TALKIE #motivation #lifelessons

Author Name:SEETAKANTH TALKIE

Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_me9pC9IIGo



Transcript:
(00:00) సాయంత్రం ఆరు గంటలు ఊరి చివరిన ఉన్న పాత గుడి ఆ గుడి మెట్ల మీద ఒంటరిగా కూర్చున్న 28 ఏళ్ల సందీప్ ఇక చాలు నా బతుకు వేస్ట్ నేను ఒక ఫెయిల్యూర్ ని నా వల్ల మా అమ్మ నాన్నలకి అవమానం తలవంపులు తప్ప నేను వాళ్ళకి ఇచ్చింది ఇంకేమీ లేదు నేను ఈ భూమిమీద లేకపోతేనే వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉంటారు అని ఆలోచిస్తున్నాడు. ఆ ఒక్క క్షణంలో ఇక తన జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఏ దారి మిగలలేదని అనిపించింది.
(00:28) గుడికి వచ్చిన వారు ఎవరైనా తమ కోరికలు తీర్చమని దేవుని ఆశగా మొక్కుకుంటారు తమ బాధల్ని చెప్పుకుంటారు కానీ అతని మనసులో ఆ దేవుని అడగటానికి ఒక్క ప్రార్థన కూడా మిగలలేదు ప్రార్థించాలంటే బతకాలన్న ఒక చిన్న ఆశ ఉండాలి కానీ అతను చనిపోవాలనుకుంటున్నాడు అంత దారుణమైన స్థితికి అతను ఎందుకు వచ్చాడు అతన్ని ఆ గుడిమెట్ల దాకా తీసుకొచ్చిన ఆ కష్టం ఏంటి అది తెలియాలంటే కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాలి.
(00:53) సందీప్ ది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నెల తిరిగేసరికి జీతం కోసం ఎదురుచూసే కుటుంబం కానీ అతని మనసులో పుట్టిన కల మాత్రం చాలా పెద్దది. అతను చిన్నప్పటి నుంచి తన ఊరిలో ఒక విషయాన్ని నిత్యం గమనించేవాడు రైతులు రోడ్డు పక్కన అమ్ముకునే చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు ఆ నాలుగు డబ్బుల కోసం రోజు రక్తాన్ని చెమటగా మార్చి ఎంత కష్టపడతారో అతను చూశడు కానీ మిగిలిపోయిన సరుకు దాచుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ కొనే స్తోమత వాళ్ళకి అస్సలు ఉండదు.
(01:22) దాంతో వాళ్ళు కష్టపడి సంపాదించిన సరుకులో సగం భాగం అమ్ముడుపోక మరసటి రోజుకల్లా కుళ్లిపోయి చెత్త కుప్పల్లో పడేసేవారు. వాళ్ళ ఆ కష్టం ఆ చెత్తలో కలిసిపోయేది. ఆ బాధను చూసిన సందీప్ మనసులో ఒక బలమైన ప్రశ్న పుట్టింది వీళ్ళ కష్టం ఇలా వృధా అవ్వకుండా నేను ఆపలేనా నా చదువు వీళ్ళకి ఉపయోగపడదా సరిగ్గా అక్కడే పుట్టింది అతనికి ఒక కల సోలార్ తో నడిచే కరెంట్ అవసరం లేని ఒక సామాన్య రైతు కూడా సులభంగా కొనగలిగే ఒక కోల్డ్ స్టోరేజ్ బాక్స్ ని కనిపెట్టాలి అని అది గనక తయారైతే లక్షల మంది పేద రైతుల బతుకులు శాశ్వతంగా మారిపోతాయి.
(01:57) దీనికోసం ఏకంగా మూడేళ్ళు రాత్రింబవళ్ళు నిద్ర కూడా మానుకొని కష్టపడ్డాడు రీసెర్చ్ చేయడానికి స్పేర్ పార్ట్స్ కొనటానికి డబ్బు కావాలి తన కల కోసం కన్నతల్లి మెడలో ఉన్న ఒకే ఒక బంగారు గొలుసు తీసి అమ్మేసాడు నాన్న తన రిటైర్మెంట్ డబ్బులతో కొన్న ఒక చిన్న స్థలం కొడుకు మీద నమ్మకంతో తండ్రి అమ్మేసాడు ఇంకా కొంతమంది ప్రాణ స్నేహితులు సందీప్ మీద నమ్మకంతో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేశారు.
(02:21) అది కూడా సరిపోక బంధువుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర లక్షల్లో అప్పు చేశాడు. అది చూసి చుట్టుపక్కల అందరూ నవ్వారు వీడికి పిచ్చి పట్టింది ఈ వయసులో ఉద్యోగం చేసుకోకుండా ఈ చెత్త డబ్బాలతో గాలిలో మేడలు కడుతున్నాడు అని ముఖం మీదే అన్నారు. కానీ సందీప్ మాత్రం ఆగలేదు ఎందుకంటే తన కల మీద తన ఆలోచన మీద తనకినూటికిన శాతం నమ్మకం ఉంది. చివరికి ప్రాడక్ట్ పర్ఫెక్ట్ గా రెడీ అయింది అది చూసి ఒక పెద్ద కంపెనీ అతని ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది.
(02:46) ఇంకేముంది తను ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అనుకున్నది సాధించే క్షణం చేరువయింది అనుకొని ఎగిరి గంతేశాడు. కానీ జీవితం అక్కడే ఒక భయంకరమైన పెద్ద దెబ్బ కొట్టింది. అతను ఈ ప్రయాణంలో ఎవరినైతే గుడ్డిగా నమ్మాడో తన ప్రాజెక్టులో పార్ట్నర్స్ గా ఉన్నవాళ్ళు మొదటి రోజు నుంచి తన జర్నీలో తోడుగా ఉన్న వాళ్లే దారుణంగా వెన్నుపోటు పడిచారు.
(03:08) వాళ్ళు చేసింది ఏదో చిన్న మోసం కాదు చాలా పగట్బందీగా ప్లాన్ చేసి మరీ చేశారు. ఆ ప్రొడక్ట్ తో పాటు దానికి సంబంధించిన పేటెంట్ లైసెన్స్ భవిష్యత్తులో వచ్చే అన్ని హక్కులు కాగితాల మీద లాయర్ల ద్వారా తమ పేరుని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చిన డబ్బు మొత్తం తమ అకౌంట్స్ లోకి తీసేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ నుంచి సందీప్ అనే పేరుని పూర్తిగా తీసేసి తామే ఆ గొప్ప ఆవిష్కరణకు యజమానుడిగా మారిపోయారు.
(03:35) సందీప్ మూడేళ్ల కష్టం అతని రక్తం చెమట ఒక్క రాత్రిలో చట్ట ప్రకారం వాళ్ళది అయిపోయింది. సందీప్ చేతిలో మిగిలింది ఒక్కటే గుండెను కోసే మోసం తీర్చలేని కొండంతా అప్పు ఏమీ లేని ఖాళీ చేతులు. ఇక్కడ మీలో చాలా మందికి ఒక లాజికల్ డౌట్ రావచ్చు ఒక కొత్త టెక్నాలజీని అంత అద్భుతమైన ప్రొడక్ట్ ని కనిపెట్టిన తెలివితేటలో ఉన్నవాడు పేటెంట్ లాంటి చిన్న విషయంలో అంత ఈజీగా ఎలా మోసపోయాడు కనీసం కాగితాలు కూడా చదువుకోలేదా అని దీనికి సమాధానం ఒకటే నమ్మకం కొత్త కొత్త టెక్నాలజీని కనిపెట్టగలిగే అతని తెలివితేటలు తన పక్కనే ఉన్న మనుషుల మనసులో ఉన్న కుట్రను మాత్రం పసికెట్టలేకపోయినాయి
(04:11) ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి తనతో పాటు నడిచిన వాళ్ళు కదా నా సొంత మనుషు లే కదా అన్న ఒక పిచ్చి నమ్మకం ఆ కాగితాల మీద సంతకాలు పెడుతున్నప్పుడు సందీప్కి కనీసం ఒక చిన్న అనుమానం కూడా రానివ్వలేదు. అతను వాళ్ళని వ్యాపార భాగస్వాములుగా చూడలేదు తన సొంత అన్నదమ్ములుగా చూశడు ఆ గుడ్డి నమ్మకమే అతని కళ్ళకి గంతలు కట్టేసింది.
(04:33) ఒక మనిషి యంత్రాల వల్ల ఎప్పుడూ ఓడిపోడు మనుషుల మీద పెట్టుకున్న గుడ్డి నమ్మకంతోనే మోసపోతాడు. ది నైఫ్ దట్ కట్స్ ద డీపెస్ట్ ఇస్ ఆల్వేస్ హెల్డ్ బై ఏ ఫెమిలియర్ హాండ్ అంటే ఈ ప్రపంచంలో మన గుండెల్లోకి అత్యంత లోతుగా దిగే ప్రాణం తీసే కత్తి ఎప్పుడూ మనకు బాగా తెలిసిన వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే ఒక పరాయివాడు మనల్ని మోసం చేయడానికి వస్తే మనం అప్రమత్తంగా ఉంటాం జాగ్రత్త పడతాం కానీ ప్రాణంగా నమ్మిన మన మనిషి మోసం చేస్తే ఆ గాయం నుంచి ఆ దెబ్బ నుంచి తేరుకోవడం ఏ మనిషికైనా చాలా కష్టం.
(05:03) ఇక ఇక్కడి నుంచి సందీప్ జీవితంలోకి అసలు విషయం రావడం మొదలైంది ప్రాజెక్ట్ ఆగిపోయింది అని తెలియగానే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు గుమ్మం ముందు అప్పుల వాళ్ళందరూ నాన్న గోల అక్కడ వాళ్ళ ముందు ఆ క్షణంలో ఎవరు నిలబడ్డారో తెలుసా ఇన్నేళ్ళు ఏ మనిషి ముందు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని తలంచని సందీపు వాళ్ళ నాన్న ఆ తండ్రి నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా వాళ్ళ ముందు రెండు చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
(05:30) నా కొడుకు తప్పు చేశడు బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను కొంచెం టైం ఇవ్వండి ఎలాగైనా నా ప్రాణం పోయినా సరే మీ అప్పు తీర్చేస్తామ అని కన్నీళ్ళతో బతిమలాడుతున్నాడు. చుట్టుపక్కల ఇళ్లల్లో కిటికీలు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి చుట్టుపక్కల జనం అందరూ సినిమా చూసినట్లు తొంగి తొంగి చూస్తున్నారు సందీప్ ఆ ఇంటి గేటు దగ్గర నిలబడి ఏమి చేయలేక నోట మాట రాక ఒక శిలలా మారిపోయి చూస్తూ ఉండిపోయాడు.
(05:52) ఒక్కసారి ఊహించుకోండి తనని కంటికి రెప్పల ఏ లోటు లేకుండా పెంచిన నాన్న తన కల కోసం తను కూడపెట్టుకున్న సొంత స్థలం అమ్మిన నాన్న ఆ నాన్న తన వల్ల తన పగటి కలల వల్ల అందరి ముందు తలంచటం ఏ కొడికి జీవితంలో ఈ దారుణమైన దృశ్యం రాకూడదు. ఇంతటితో సందీప్ కష్టం ఆగిపోలేదు చుట్టూ ఉన్న బంధువులు నవ్వారు మేము ముందే చెప్పాం కదా వీడుఒక పిచ్చోడని ఏ పని చేతగానోడని వయసువచ్చినా తండ్రిని రోడ్డు మీద నిలబెట్టాడు అని మొహం మీదే అన్నారు.
(06:21) సమాజం వాడిని దారుణంగా హేళం చేసింది సందీప్ ని ఆ ఊరిలో ఎక్కడికి వెళ్ళినా అవే చులకన చూపులు అవే అవమానించే గుసగుసలు అవే నవ్వులు ఇదంతా భరించలేక ఆ బరువు మోయలేక ఈరోజు సందీప్ ఆ గుడిమెట్ల మీదకి చేరాడు. తన బతుకు అయిపోయిందని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. చనిపోదామని మెల్లగా పైకి లేచాడు ఆ గుడి మెట్లు దిగి వెళ్ళిపోవడానికి ఒక అడుగు ముందుకు వేశడు సరిగ్గా ఆ క్షణంలో అతని వెనక నుంచి ఒక గొంతు వినిపించింది ఆ గుడి ఆవరణలోనే ఒక మూలన ఒక ముసలి మాస్టర్ కూర్చొని ఉన్నారు ఆయన రోజు సాయంత్రం ఆ చుట్టుపక్కల ఉండే పేద పిల్లలకి ఉచిత పాఠాలు చెప్తుంటారు నిజం చెప్పాలంటే గత కొన్ని రోజులుగా సందీప్ ఆ గుళలో ఆ మూలనే
(06:57) కూర్చునేవాడు ఎందుకంటే అతని తలలో ఉన్న ఆ భయంకరమైన గోల ఆ ఆవేదన ఆ బాధ కొంచెం ఆగే ఒకే ఒక్క యొక్క ప్రశాంతమైన చోటు అదే ఆ మాస్టర్ మాత్రం ఆ డీలా పడ్డ గుర్రాన్ని అతని బాధని రోజు దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు. అతని కళ్ళలో ఉన్న ఆ చావు తాలుకు శూన్యాన్ని ఆయన ఎప్పుడో చదివేశారు. ఆ రోజు ఆ మాస్టర్ సందీప్ ని పిలిచారు నాకు ఇవాళ కొంచెం ఆయాసంగా ఉంది నీరసంగా ఉంది ఈరోజు నా బదులు నువ్వే ఈ పాఠం చెప్పు పిల్లలకి అని బుక్కు పట్టుకొని పిలుస్తున్నారు.
(07:28) సందీప్ ఒక్కసారిగా బిగుసుకుపోయాడు చనిపోదామని వెళ్తున్న తనక ఇప్పుడు పాఠం చెప్పే స్థితి ఏంటి కానీ మాస్టర్ తనకోసం ఎదురు చూస్తున్నారు ఆ చిన్న పిల్లలంతా మొహాలు పైకెత్తి ఎంతో అమాయకంగా తన వైపే చూస్తున్నారు కాదనలేకపోయాడు. వాళ్ళ ముందుకు వెళ్లి కూర్చొని వణుకుతున్న గొంతుతో ఆ పాఠం చెప్పడం స్టార్ట్ చేశాడు. అది మన పురాణాల్లో ఎంతో గొప్పదైన సముద్ర మదనం కథ.
(07:52) సందీప్ వణకుతున్న గొంతుతో ఆ పిల్లలకు చెప్పడం మొదలు పెట్టాడు. చాలా కాలం క్రితం దేవతలు అన్నీ కోల్పోయారు ఒక ఋషి శాపంతో వాళ్ళ శక్తి వాళ్ళ ఐశ్వర్యం వాళ్ళ స్థానం అన్ని పోయాయి. ఆ బలహీనతను చూసి రాక్షసులు దేవలోకం మీద పడి దాడి చేశారు దేవతలని ఓడించి అంతా ఆక్రమించేశరు. ఓడిపోయిన దేవతలు దిక్కు తోచక విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన ఒక్కటే దారి చెప్పాడు ఆ పాల సముద్రాన్ని మదించండి దాని అట్టడుగున అమృతం ఉంది అది తాగితే మీరు మళ్ళీ శక్తి పొందుతారు మీ స్థానం మీకు దక్కుతుంది కానీ అక్కడ ఒక మెలిక పెట్టాడు ఆ సముద్రాన్ని ఒంటరిగా మీరు మదించలేరు మీ శత్రువులైన రాక్షసులతోనే
(08:26) చేయి కలపాలి అన్నాడు. అందుకని వాళ్ళు రాక్షసులతో కలిసి ఆ మధనం మొదలు పెట్టారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు వాసుకి అనే మహా సర్పాన్ని తాడుగా చుట్టారు ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు ఆ సర్పాన్ని పట్టుకొని ఇటు లాగు అటు లాగు అంటూ లాగటం మొదలు పెట్టారు. సముద్రం అల్లా కల్లోలం అయింది సందీప్ కళ్ళ ముందు ఇప్పుడు ఆ దృశ్యం కదలాడుతుంది.
(08:50) మళ్ళీ పాఠం చెప్పడం స్టార్ట్ చేశాడు. అమృతం కదా అంత తేలిగ్గా రాదు చిలుకుతున్నారు గంటలు గడిచాయి రోజులు గడిచాయి చేతులు పడిపోతున్నాయి ఒళ్ళు హోనమైపోతుంది కానీ అమృతం మాత్రం రావట్లేదు ఇంకెంతసేపు అసలు వస్తుందా రాదా అని అందరిలో అనుమానం మొదలైంది అలసిపోయారు విసిగిపోయారు అయిన ఆశతో మళ్ళీ లాగారు అప్పుడు ఆ పాల సముద్రంలో నుంచి మొదట పైకి వచ్చింది అమృతం కాదు ఆ సముద్రంలో నుంచి మొదట వచ్చింది హాలాహలం ఈ లోకాలన్నింటిని నిలువున కాల్చేసే ఒక భయంకరమైన విషం ఆ విషం నుంచి నల్లటి పొగలు పైకి లేచాయి గాలంతా విషంతో నిండిపోయింది ఆ విషపు వేడికి నదులు ఇంకిపోయాయి చెట్లు మాడిపోయాయి దేవతలు
(09:27) గజగజా వణకిపోయారు. రాక్షసులు కూడా భయంతో పరిగెత్తారు ఇంతసేపు ఎంతో కష్టపడి కలిసి మదనం చేసిన వాళ్ళంతా ఆ ఒక్క విషం రాగానే దాన్ని చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. అక్కడ ఎవ్వరూ మిగలలేదు అందరూ తమ కష్టాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. మదనం ఆగిపోయింది ఆ విషం మధ్యలో ఆ అమృతం అలాగే ఆ సముద్రపు లోతుల్లోనే ఉండిపోయింది.
(09:50) ఇక్కడ చెప్తూ చెప్తూ సందీప్ ఆగిపోయాడు గొంతు పూడుకుపోయింది ఎందుకంటే తనకి ఇప్పుడు చెప్తుంది ఒక పురాణ కథల అనిపించట్లేదు తన సొంత బతుకులా అనిపించింది. తను ఒక కల కోసం ఏళ్లుు చిలికాడు తన ప్రాణాలు పెట్టి అలిసిపోయాడు తను ఆశపడిన అమృతం అంటే సక్సెస్ రావాల్సిన చోట మోసం అప్పులు అవమానం అనే హాలాలం వచ్చింది తను అందరిలాగే ఆ విషయం చూసి తట్టుకోలేక భయపడి చావు వైపు పారిపోవాలనుకున్నాడు.
(10:15) అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ కథ చెప్పడం ఆపలేదు పిల్లల వైపు చూస్తూ మళ్ళీ మొదలు పెట్టాడు. అందరూ భయపడి పారిపోయినప్పుడు ఒక్కరు మాత్రం అక్కడే గట్టిగా నిలబడ్డారు వెనక్కి కదలలేదు ఆయనే సాక్షాత్తు పరమశివుడు ఆయన ముందుకు వచ్చారు ఆ భయంకరమైన విషాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకున్నారు చుట్టూ ఉన్న వాళ్ళంతా భయంతో అరిచారు వద్దు స్వామి అది తాకితేనే మరణం అని కానీ శివుడు ఏమాత్రం భయపడకుండా ఆ విషాన్ని తన నోట్లోకి తీసుకున్నారు.
(10:42) ఇప్పుడు ఆయన ముందు రెండే దారులు ఉన్నాయి ఆ విషాన్ని మింగేయాలి లేదా కిందకి ఉమ్మేయాలి కానీ ఆలోచించండి మింగితే ఏమవుతుంది ఆ విషం లోపలికి దిగి ఆయనే లోపల నుంచి నిలువున కాల్చేస్తుంది ఉమ్మితే ఏమవుతుంది ఆ విషం లోకమంతటి మీద పడి ఈ సృష్టినంతా బూడిద చేస్తుంది. ఈ రెండు దారులు వినాశనమే అప్పుడు శివుడు ఏం చేసాడో తెలుసా మింగలేదు బయటికి ఉమ్మలేదు ఆ విషాన్ని సరిగ్గా తన కంఠం మధ్యలో ఆపేశారు.
(11:08) అక్కడే గట్టిగా బిగబట్టారు. లోపలికి పోనివ్వలేదు బయటికి రానివ్వలేదు ఆ విషం ఆయన గొంతును శాశ్వతంగా నీలం రంగులోకి మార్చేసింది. అప్పటి నుంచి ఆయన నీలకంఠుడు అయ్యాడు. సందీప్ ఒక క్షణం ఆ మాట దగ్గర ఆగాడు ఆ కంఠం బిగబట్టం అనే మాట అతని గుండెల్లో ఏదో మూసుకుపోయిన తలుపుని బలంగా తట్టింది. మళ్ళీ చదవడం స్టార్ట్ చేశడు అంతటితో శివుడు ఆగలేదు ఆ విషయాన్ని గొంతులో బొరువుగా మోస్తూనే భయపడిన మిగతా అందరికీ ధైర్యం చెప్పాడు పారిపోకండి మళ్ళీ కవ్వం పట్టుకొని లాగండి మదనం అసలు ఆపకండి అన్నారు.
(11:42) పారిపోయిన వాళ్ళంతా తిరిగి వచ్చి మళ్ళీ సముద్రాన్ని చిలగటం మొదలు పెట్టారు. అప్పుడు అప్పుడు వచ్చాయి అసలైన అద్భుతాలు కామధేను వచ్చింది కల్పవృక్షం వచ్చింది ఐరావతం వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మీ దేవే వచ్చింది. చివరికి దేవతలు ఏళ్లుు తరబడి కళ్ళు కాయల కాసేరా ఎదురు చూస్తున్న ఆ అమృతం ధన్వంతరి చేతిలో పైకి వచ్చింది. కథ చెప్పడం ఆపాడు సందీప్ ఆ ఒక్క క్షణంలో అతనికి ఒక పెద్ద నిజం మెరుపులా అర్థమయింది.
(12:08) అమృతం ఎప్పుడూ ముందు రాదు మొదట హారాహలమే వస్తుంది అమృతాన్ని చేరాలంటే కచ్చితంగా ఆ విషాన్ని దాటాల్సిందే వేరే దారి లేదు తప్పదు కానీ ఇన్నాళ్ళు తను ఏం చేస్తున్నాడు ఆ విషాన్ని మింగేయాలని చూశడు అంటే తన బాధని లోపల దాచి ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కుమిలిపోయి తనని తానే కాల్చేసుకుంటూ బతికాడు అది చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా కిందకి ఉమ్మేయాలని కూడా చూశడు అంటే చావు అనే నిర్ణయంతో అంతా వదిలేసి పారిపోవాలనుకున్నాడు.
(12:35) కానీ శివుడు ఆ రెండు చేయలేదు మింగలేదు బయటికి ఉమ్మలేదు గంటంలో గట్టిగా బిగబడ్టాడు బాధని మోస్తూనే మదనం కొనసాగించమన్నాడు తను చేయాల్సింది కూడా అదే కదా ఆ సత్యం అర్థమైన క్షణంలో సందీప్ లేచి మాస్టర్ పాదాలకి కన్నీళ్ళతో నమస్కరించాడు మాస్టర్ చిన్నగా నవ్వారు అతని తలమీద చెయ్యి పెట్టి అన్నారు నువ్వు ఈ పిల్లలకి పాఠం చెప్పలేదు నాయనా నీకు నువ్వే చెప్పుకున్నావ్ వెళ్ళు నీ మదనం ఇంకా పూర్తఅవ్వలేదు సందీప్ ఏదో తెలియని ధైర్యంతో తన మీద తనకున్న నమ్మకంతో బయలుదేరాడు ఇన్నాళ్ళు సందీప్ ఒక్కటే అనుకున్నాడు నా ప్రొడక్ట్ పోయింది అంటే నేను పోయాను అని కానీ ఆ రాత్రి అతనికి ఒక
(13:11) కొత్త నిజం మెరిసింది ఆ ప్రొడక్ట అంటే అది ఒక పంట మాత్రమే కానీ ఆ పంటని పండించిన నేల అది అతని బుర్ర వాళ్ళు పంటని దోచుకున్నారు నిజమే కానీ నేలని దోచుకోలేరు కదా ఆ నేల ఇంకో పంట పండించగలదు ఇంకో 10 పంటలు పండించగలదు నేను ఒక ప్రొడక్ట్ని కాదు నేను అలాంటి 100 ప్రొడక్టులని పుట్టించగలిగే మనిషిని ఈ ఒక్క ఆలోచన సందీప్ని పూర్తిగా మార్చేసింది.
(13:36) ఇక్కడ మనం అందరం చాలా ముఖ్యమైన విషయం ఒకటి అర్థం చేసుకోవాలి మన విలువ మనం చేసిన ఒక పనిలో ఉండదు ఆ పనిని చేయగలిగే మన సామర్థ్యంలో ఉంటుంది. ఒక పరీక్ష ఫెయిల్ అయితే మన తెలివి పోదు ఒక ఉద్యోగం పోతే మన అనుభవం పోదు ఒక ప్రాడక్ట్ పోతే దాన్ని పుట్టించిన మెదడు ఎక్కడికీ పోదు ఎప్పటికీ అది మనతోనే ఉంటుంది. మనం కోల్పోయేవి ఎప్పుడూ పంటలే కానీ నేల ఎప్పటికీ మనదే ఇంగ్లీష్ లో ఒక అద్భుతమైన మాట ఉంది దే కెన్ స్టీల్ వాట్ యు బిల్ట్ బట్ నెవర్ ద మైండ్ దట్ బిల్ట్ ఇట్ అంటే నువ్వు నీ కష్టంతో నిర్మించిన దాన్ని వాళ్ళు దొంగిలించగలరు కానీ దాన్ని నిర్మించిన నీ మెదని ఎప్పటికీ
(14:12) దొంగిలించలేరు. ఇదే సందీప్ కొనుగొన్న గొప్ప నిజం ఇదే అతనికి కొత్త బలం అయింది. ఆ రోజు నుంచి సందీప్ పాత ప్రొడక్ట్ గురించి ఏడవటం ఆలోచించడం మానేసాడు దాన్ని వాళ్ళ దగ్గరే చెత్తలా వదిలేశడు బదులుగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూడటం మొదలు పెట్టాడు. ఇన్నాళ్ళు ఒక్క సమస్య మీదే గుడ్డిగా దృష్టి పెట్టిన అతనికి ఇప్పుడు చుట్టూ ఉన్న ఎన్నో వందల సమస్యలు కనిపించడం మొదలయ్యాయి.
(14:36) ప్రతి సమస్య అతనికి ఒక కొత్త అవకాశంలా కనిపించింది. అలా అతను ఒక కొత్త సమస్యను పట్టుకున్నాడు పూర్తిగా వేరే రంగం పాత ప్రొడక్ట్ తో ఏ సంబంధం లేనిది తన మెదడు తన అనుభవం మొత్తం ఆ కొత్త పరిష్కారం మీద పెట్టాడు. కానీ ఇది అతను అనుకున్నంత తేలిగ్గా జరగలేదు ఒక చిన్న అద్య గదిలో పగలంతా అప్పులు తీర్చడానికి దాదాపు కూలి పనులు చేశాడు రాత్రంతా నిద్ర మానుకొని తన కొత్త ఆలోచన మీద కూర్చున్నాడు.
(15:01) మొదటి మోడల్ అనుకున్నట్లు రాలేదు ఫెయిల్ అయింది రెండోది కూడా ఫెయిల్ అయింది మూడోది కూడా ఫెయిల్ అయింది ప్రతిసారి అతనికి ఇక నా వల్ల కాదేమో మళ్ళీ మొదటికి వచ్చానేమో నేను చేతగాని వాడినేమో అనిపించేది అప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చి గుర్తు చేసేవారు కానీ ప్రతిసారి అతనికి ఆ గుడి మెట్లు ఆ నీళ్ల కంటుడు గుర్తొచ్చేవారు మింగొద్దు బయటికి ఒమ్మొద్దు కంఠంలోనే బిగపట్టు ఆ ఒక్క మాట అతన్ని కింద పడిన ప్రతిసారి మళ్ళీ పైకి లేపింది రాక్ బాటం బి బికమ్ ద సాలిడ్ ఫౌండేషన్ ఆన్ విచ్ ఐ రబిల్ట్ మై లైఫ్ అంటే నేను నా జీవితంలో అన్నీ కోల్పోయి ఏ అట్టడుగున స్థానానికి
(15:38) పడిపోయానో ఆ పడిపోయిన స్థానమే నా జీవితానికి తిరిగి కట్టుకోవడానికి ఒక గట్టి పునాది అయింది ఒక్కసారి ఆలోచించండి మనం అట్టడుకకి పడిపోయినప్పుడు ఇక అంతకన్నా పడిపోతాను అన్న భయం మనకు ఉండదు అక్కడి నుంచి వెళ్లేది పైకి మాత్రమే ఎదగటానికి మాత్రమే అందుకే కింద పడిపోవటం అనేది ముగింపు కాదు అది కొత్తగా కట్టుకోవడానికి మనకు దొరికిన గట్టి నేల ఎవరికీ కని కనిపించకుండా ఏళ్ల తరబడి ఆ గరళాన్ని కంఠంలో పెట్టుకొని ఎంతో ఓపికగా సందీప్ తన మధనం కొనసాగించాడు.
(16:08) కొన్నేళ్ల తర్వాత సందీప్ కొత్తగా పుట్టించిన ఆ ఆవిష్కరణ నెమ్మదిగా నలుగురు దృష్టిలో పడింది. మొదట ఒక్కరు నమ్మారు తర్వాత 10 మంది నమ్మారు ఆ తర్వాత వందలు వేలు అది ఒక సంచలనం అయింది. ఏమి చేతగానోడు అన్న వేదికల మీదే ఇప్పుడు అతను ఏకంగా ముఖ్య అతిథిగా నిలబడ్డాడు. ఒకప్పుడు అప్పుల వాళ్ళు ముందు రోడ్డు మీద సిగ్గుతో తలవంచుకున్న వాళ్ళ నాన్న ఇవాళ ఊళలో అందరికీ తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకుంటూ కాలర్ ఎగరేసుకొని తలఎత్తుకొని నడుస్తున్నాడు.
(16:35) కానీ నిజంగా చెప్పండి అమృతం అంటే ఇదేనా ఆ కొత్త ఆవిష్కరణ ఆ పేరా ఆ చప్పట్లా అతని అకౌంట్ లో పడిన డబ్బా కాదు అసలైన అమృతం అంటే ఏంటో తెలుసా అది ఆ కొత్త ప్రొడక్ట్ కాదు తను ఏ పరిస్థితిలో అట్టడుగున పడిపోయినా సరే సున్నా నుంచి మళ్ళీ నిలబడగలనన్న ఆ ధైర్యం ఆ ఒక్క నమ్మకమే అసలైన అమృతం ఎందుకంటే ప్రొడక్ట్ ని ఎవరైనా దొంగిలించగలరు కానీ ఆ ధైర్యాన్ని ఎవర లాక్కోలేరు అది ఒక్కసారి దొరికితే జీవితంలో లో ఎన్ని హాలాహలాలు వచ్చినా వాడు ప్రతిదాన్ని అవలేగా దాటగలడు.
(17:07) ఆ అమృతమే ఆ గుడి మెట్ల మీద ఆ ఒక్క సాయంత్రం చావు అంచున నిలబడిన సందీప్ సంపాదించుకుంది. కథ అయిపోయింది ఇక మన సంగతి మాట్లాడుకుందాం మన జీవితంలో కూడా మనం ఏమైనా పెద్ద పెద్దది సాధించాలని బయలుదేరినప్పుడు మొదట మన చేతికి అమృతం రాదు మొదట ఆలహాలమే వస్తుంది. కష్టాలు ఓటములు అవమానాలు నమ్మిన వాళ్ళ మోసాలు నలుగురిలో తలదించుకునే క్షణాలు ఇవి అందరికీ వస్తాయి.
(17:32) ఇది మన జీవిత మధనంలో ఒక భాగం దీన్ని ఎవరు ఎప్పటికీ తప్పించుకోలేరు. కానీ మనలో చాలామంది ఎక్కడ ఆగిపోతారో తెలుసా సరిగ్గా ఆ ఆలహలం దగ్గర ఆ విషయాన్ని ఆ కష్టాన్ని చూసి భయపడి ఇక నా వల్ల కాదు నా జీవితం అయిపోయిందని వెనక్కి తగ్గుతాం. ఇక్కడ ఒక నిజం మనం గుర్తుంచుకోవాలి మీరు గనుక ఇక్కడ వెనక్కి తగ్గితే ఆ కష్టాలు ఆ అవమానాలు అనే విషయం ఎక్కడికీ పోదు అది జీవితాంతం మన మెడక చుట్టుకొని ఉండిపోతుంది.
(17:56) మన జీవితాంతం ఏడుస్తూ మోయాల్సిన శాశ్వతమైన మూట అవుతుంది కానీ అది ధైర్యంగా దాటితే అమృతంగా మారుతుంది భయపడి ఆగితే అది శాపంగా మిగులుతుంది. ద పెయిన్ యు ఫీల్ టుడే విల్ బి ద స్ట్రెంత్ యు ఫీల్ టుమారో అంటే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ బాధ ఈ నొప్పి ఈ కష్టం ఈ అవమానం రేపు నిన్ను నిలబెట్టే బలంగా మారుతుంది. ఈరోజు కంఠంలో బిగబట్టిన ప్రతి విషపు చుక్క రేపు నిన్ను ఒక యోధుడిలా నిలబెట్టే శక్తి అవుతుంది.
(18:22) అలాగే ఇంకో అందమైన మాట ఉంది పర్ల్స్ డోంట్ లై ఆన్ ద సీ షోర్ ఇఫ్ యు వాంట్ వన్ యు మస్ట్ డైవ్ ఫర్ ఇట్ ముత్యాలేవి సముద్రం వడ్డున నీకోసం పడి ఉండవు నీకు ఒక్క ముత్యం కావాలన్నా ఆ సముద్రపు లోతుల్లోకి దూకాల్సిందే ఒడ్డున సురక్షితంగా నిలబడినంత సేపు నీకేమీ దక్కదు ఆ లోతుల్లోకి ఆ కటిక చీకటిలోకి ఆ భయంలోకి ధైర్యంగా దూకిన వాడికే ఆ ముత్యం దక్కుతుంది.
(18:44) మరి ఆ హాలాహలం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మూడు మాటలు చాలా సింపుల్ మొదటిది విషాన్ని మింగకూడదు అంటే ఆ బాధని లోపలే దాచేసి ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే కుమిలిపోయి కుంగిపోయి నిన్ను నువ్వు నాశనం చేసుకోకూడదు. లోపలికి మింగిన విషం మనల్ని లోపల నుంచి చంపేస్తుంది. ఈ బాధ ఎక్కువైనప్పుడు దాన్ని నీలోనే దాచుకోకూడదు నీకు నమ్మకమైన ఒక్కరితోనైనా పంచుకోవాలి.
(19:07) మాట్లాడటమే దానికి మొదటి మందు రెండోది విషాన్ని బయటికి ఉమ్మకూడదు అంటే నిరాశలో ప్రాణం తీసుకోకూడదు లేదా ఆ కోపంతో ఆ ప్రతీకారంతో పిచ్చివాళ్ళ అందరి మీద విరుచుకు పడకూడదు పగ గొడవలు నిందలు వీటితో మన విలువైన శక్తిని సమయాన్ని వృధా చేసుకోకూడదు ఉమ్మిన విషం మన చుట్టూ ఉన్న మంచిని కాల్చేస్తుంది. ఇక మూడోది శివుడిలో ఆ విషాన్ని కంఠంలో బిగ బట్టాలి ఆ బాధని ఓర్చుకుంటూనే పంటి బిగువును భరిస్తూనే నీ లక్ష్యం వైపు నీ మదనాన్ని అసలు ఆపకుండా కొనసాగించాలి అదే నీలకంఠ తత్వం అదే అసలైన విజేత లక్షణం చివరిగా ఒక మాట మీ జీవితంలో అమృతం ఇంకా పుట్టలేదంటే దాని అర్థం మీరు
(19:45) ఓడిపోయారని కాదు మీ మదనం ఇంకా పూర్తఅవ్వలేదని మీరు ఆగిపోయిన చోట అది మీ జీవితానికి ముగింపు కాదు అది కేవలం హాలాహల దశ మాత్రమే ఆ స్టేజ్ దాటితే అమృతం కచ్చితంగా మీదే సూటిగా మీకు మీకు ఒక ప్రశ్న మీ జీవితంలో మీరు ఏ మదనం మధ్యలో ఆగిపోయారు ఏ హాలహాలను చూసి భయపడి వెనక్కి తగ్గారు ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి ఎందుకంటే మీరు సగంలో వదిలేసిన ఆ మదనం ఆ లోతుల్లో ఉన్న ఆ అమృతం ఇప్పటికీ మీ కోసం ఎదురుచూస్తూనే ఉంది.
(20:12) మీ జీవితంలో ఇలా ఏదైనా హాలాహలాన్ని దాటి అమృతం సాధించిన క్షణం ఉంటే ఆ అనుభవాన్ని కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి అది చదివిన ఇంకెవరికో మీ కథ ధైర్యాన్ని ఇస్తుంది. మరో పవర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం గుర్తుంచుకోండి కష్టం వచ్చినప్పుడు పారిపోకండి గరళాన్ని కంఠంలో బిగబట్టండి మదనాన్ని ఆపకండి మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్

No comments:

Post a Comment