The Psychology of “Mine” | Why Identity Matters More Than Truth
Author Name:Think Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JS294XabiRo
Transcript:
(00:00) నేను పక్కదేశంలో ఉన్నప్పుడు నా దేశం గ్రేట్ అన్నాను నా దేశంలో ఉన్నప్పుడు నా రాష్ట్రం గ్రేట్ అన్నాను నా రాష్ట్రంలో ఉన్నప్పుడు నా జిల్లా గ్రేట్ అన్నాను నా జిల్లాలో ఉన్నప్పుడు నా మండలం గ్రేట్ తీరా మండలానికి చేరుకున్నప్పుడు నా గ్రామం గ్రేట్ అన్నాను. కొన్ని రోజులకి నా పక్కింటోడితో గొడవయింది. ఇప్పుడు నా ఫ్యామిలీ గ్రేట్ అంటున్నాను.
(00:28) మరికొన్ని రోజులకి నేను నా ఫ్యామిలీతో గొడవ పడ్డాను. ఇప్పుడు నేను మాత్రమే గ్రేట్ అంటున్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే గొప్పతనం స్లోగా తగ్గిపోతుంది. బట్ నా అనేది మాత్రం అలానే ఉంది. మనిషి ట్రూత్ ముఖ్యమం అంటాడు. కానీ చాలా సందర్భాలలో అతను వెతికేది ట్రూత్ కాదు తన పక్షానికి అనుకూలమైన సత్యం. అందుకే ఒకే వ్యక్తి సందర్భాన్ని బట్టి జాతీయవాది ప్రాంతీయవాది మాతృభాషాభిమాని యాసాభిమాని చివరికి తనకు తానే వేరాభిమాని నాకు ఏమనిపిస్తుందంటే మనిషి గొప్పతనాన్ని ప్రేమించడు తనదైన గొప్పతనాన్ని ప్రేమిస్తాడు. ఇక్కడ నా
(01:13) తీసేస్తే గొప్పతనం కూడా మాయమవుతుంది. సో గొప్ప అనే పదానికి అర్థం లేదు. నా అనే పదానికి మాత్రమే అర్థం ఉంది. కానీ నా ఎందుకు మనిషి లైఫ్ లో అంత ఇంపార్టెంట్ మనిషి దేన్నైనా భరించగలడు దేన్నైనా జయించగలడు బట్ చావుని భరించలేడు జయించలేడు. ఇవాన్ తుర్గనవు రాసిన ఫాదర్స్ అండ్ సన్స్ లో నావెల్ చివర్లో ఒక మాట ఉంది. మరణం అనేది ఒక పాత కథ.
(01:45) బట్ అయినా కూడా అది ప్రతిోడికి ఎప్పుడూ కొత్త కథే సో అసలు చావుకి మనిషి ఎందుకు భయపడతాడు తనని ఎక్కడ మర్చిపోతారేమో అని అండ్ అలాగే మరణం తను పెంచి పోషించుకున్న నేను అనే పదాన్ని చెరిపేస్తుందని. అందుకే మనిషి తనని గుర్తుపెట్టుకునే పనులు చేస్తాడు తనని పెద్దవాడిని చేసే కథని వెతుకుతాడు తనని తాను కొనసాగించుకోవాలని కోరుకుంటాడు.
(02:12) సో అందుకే చనిపోయే ముందు కొడుకుని వదిలేస్తాడు ఒక బుక్ రాస్తాడు సామ్రాజ్యం కట్టి వెళ్తాడు గుడి కట్టి వెళ్తాడు విగ్రహం పెట్టించుకుంటాడు హిస్టరీలో పేరు రాసుకుంటాడు. వీటన్నింటిలో కామన్ ఏంటో తెలుసా నేను చావకూడదు అనే వెర్రి ప్రయత్నం కానీ అది మనంఅందరం అనుకునే స్వార్థం కాదు గుర్తింపు కోసం ప్రాకులాట ఐడెంటిటీ ఆకలి అనేది సెల్ఫిష్ కంటే డేంజర్ ఎందుకంటే స్వార్థంలో నా కొడుకు తప్పు చేసినా నేను వాడిని క్షమిస్తాను ఆ తప్పు నుంచి కాపాడతాను ఆ కాపాడే క్రమంలో ట్రూత్ ని మారుస్తాను బట్ ఐడెంటిటీ ప్రిజర్వేషన్ లో అలా కాదు ఇక్కడ మనిషి ట్రూత్ ని మార్చడు ఏకంగా ట్రూత్ కి నా అనే పేరు పెడతాడు. అందుకే
(02:59) ఒకే నిజం వేరు వేరు మనుషుల చేతుల్లో వేరు వేరు జెండాలు అవుతుంది.
No comments:
Post a Comment