Tuesday, July 7, 2026

ఆధ్యాత్మిక శూన్య దశ, కుండలినీ, వైరాగ్యం, KUNDALINI SYMPTOMS, VOID STATES, CHAKRAS

ఆధ్యాత్మిక శూన్య దశ, కుండలినీ, వైరాగ్యం, KUNDALINI SYMPTOMS, VOID STATES, CHAKRAS

Author Name:కుండలినీ మార్గదర్శి

Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EqHewwgb2ZE



Transcript:
(00:00) నమస్తే ఈరోజు వీడియోలో నేను ఆధ్యాత్మిక ప్రక్రియలో గాని కుండలిని ప్రక్రియలో గాని మనం అనుభవించేటువంటి శూన్య స్థితులు శూన్య స్థితులు అంటే ఈ స్థితులు మనకి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఉండొచ్చు అది మన ఆధ్యాత్మిక జాగృతి యొక్క తీవ్రత బట్టి ఉంటుంది. ఈ శూన్య స్థితుల్లో మనం ఎక్కువ ఏడుస్తాం. జీవితంలో అన్ని పోగొట్టుకున్నట్టుగా అన్ని కోల్పోయినట్టుగా మనకు అనిపిస్తుంది.
(00:31) ఒంటరితనం ఇష్టపడతాం లేదు అంటే చాలా సంబంధాలు మనకి తెగిపోతాయి ఈ కాలంలో మనం ఉద్యోగం మారిపోవచ్చు మన జీవిత పరిస్థితులు మారిపోవచ్చు మనం ఇక్కడ ఎక్కువ దుఃఖిస్తాం అంతా మనకి అంధకారంగా అగమ్య గోచరంగా అనిపించేటువంటి ఒక స్థితి ఈ శూన్య స్థితి ఇది ఆధ్యాత్మిక ప్రక్రియలో చాలా ముఖ్యమైన భాగం ఈరోజు ఈ శూన్య స్థితి యొక్క లక్షణాలు ఏమిటి అనేది నేను వివరిస్తాను మీరు శూన్య స్థితిలో ఉన్నారా లేదా అనేది మీకు అర్థమయ్యేటట్టుగా ఈ రోజు నేను వివరిస్తాను.
(01:14) ఆధ్యాత్మిక ప్రక్రియ అంటేనే చాలా మనం మారిపోతాం. స్వల్ప సమయంలో అంటే ఇంచుమించు కొన్ని ఏళ్ల సమయంలో మనం ఎంతో జీవితకాలాలు మనలో రాని మార్పు మనకి కాస్త సమయంలో మనకి ఒక జీవిత కాలంలో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మన శరీర స్పందన పెరిగి మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్ది మన ప్రవర్తనే మారిపోతుంది మునుపున్న ప్రవర్తన ఇప్పుడు మనకి ఆధ్యాత్మికంగా ఎదిగాక మనలో కొన్ని గతం తాలూకు ప్రవర్తనలు గాని ఆలోచించే విధానం గాని ఇప్పుడు మనలో ఉండదు అది తొలగిపోతుంది మనం పూర్తిగా ఒక వేరే వ్యక్తిలాగా అయిపోతాం.
(01:56) దాని కారణం ఏంటో కూడా నేను చెప్తాను. అయితే ఆధ్యాత్మిక ప్రక్రియ గాని కుండలిని ప్రక్రియ గాని అది మన మనసు లోతుల్లోకి వెళ్లి ఆ లోతుల్లో అది పని చేస్తుంది. ఆ లోతుల్లో పని చేసేటప్పుడు చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ఈ లోతుల్లో పని చేస్తేనే మనం మారతం పై పైన జరిగే మార్పుల వల్ల మనిషి మారారు. మనిషి ప్రవర్తన అలాగే ఉంటుంది.
(02:21) ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. తెర్చుకోవడం వల్ల ఈ శక్తి మనకి విశ్వం నుంచి వచ్చేటువంటి ఈ శక్తి మన గురువు ఒక శక్తిపాతం దైవానుగ్రహం ఎలా ఉంటుంది అంటే మన లోతుల్లో మనసు లోతుల్లోకి వెళ్లి మనల్ని మార్చేటట్టుగా అది పనిచేస్తుంది. ఇలాంటప్పుడు మనం మార్పుకి గురి అవుతున్నాం కాబట్టి మనకి ఒంటరితనం అవసరం.
(02:48) ఎందుకంటే 10 మంది మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు కొంతమంది మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు కొంతమంది మనల్ని ఆ మనలో ఉన్న అహంకారాన్ని ప్రేరేపించేటట్టుగా కొంతమంది ఉంటారు కొంతమంది మనకి ప్రతికూలం అనుకూలం ఇలా రకరకాల పరిస్థితులు మనకి కల్పిస్తూ ఉంటారు దాంతో మనం రాగ ద్వేషాలతో నిత్యం చలిస్తూ ఉన్నప్పుడు మనం మారలేం మార్పు అనేది మనలో రావాలి అంటే మన లోపల ప్రాణ ఏ నాడుల్లో నుంచి ప్రవహిస్తుంది మళ్ళీ మళ్ళీ అవే పాత మార్గాల్లోంచి నర్వస్ ఎనర్జీ గనుక ప్రవహించింది అనుకోండి మనం మారాం.
(03:28) మనకి ఇప్పుడు ట్రైన్ చూశరంటే ట్రైన్ ట్రాక్ మారుతుంది ట్రాక్ మారినప్పుడు దిశ మారుతుంది. అదే రకంగా మన దేహంలో ప్రాణ ప్రవాహం వేరే కొత్త మార్గాల గుండా ప్రవహించాలి. కొత్త మార్గాల గుండా ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే మనకి అంతక్రితం కనిపించని విషయాలు ఇప్పుడు మనకు కనిపించడం మొదలు పెడతాయి అంతక్రితం మనకి అర్థం కాని విషయాలు ఇప్పుడు మనకు అర్థం అవ్వటం మొదలు పెడతాయి.
(03:56) మనం స్వస్థత పొందుతాం మానసికంగా శారీరికంగా గతంలో మనకి ఏమైనా కీడు ఎవరైనా తలపెట్టి ఉన్నా మనం బాధపడి ఉన్నా ఆ గాయాలు కూడా మనకి మానిపోతాయి అలా మానిపోవాలి అంటే మనకి మన నర్వస్ సిస్టం అప్గ్రేడ్ అవ్వాలి అది అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఈ ప్రక్రియ మనకి ఒంటరితనానికి వైపు తీసుకెళ్తుంది అంటే మీ చుట్టుపక్కల వాళ్ళతో మీరు మసల్ లేక మీరు వచ్చి వేరేగా ఉండటం లేదంటే మీరు మీ కుటుంబంతో కలిసి ఉన్నా కూడా ఒంటరగా ఉండటానికి ఇష్టపడేటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉండటం ఎందుకంటే నిత్యం మిమ్మల్ని పొడిచి మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు మధ్యలో గనుక మీరు ఉంటే మీకు శరీరం ఏదైతే ప్రశాంత స్థితిలోకి వెళ్ళాలో ఈ మార్పులు
(04:42) జరగటానికి అది జరగదు కాబట్టి ఈ ప్రక్రియే మిమ్మల్ని కొద్దిగా బయట లోకానికి దూరం తీసుకెళ్తుంది ఎందుకంటే ప్రక్రియలో మనం అంతర్ముఖులం అవుతాం చాలా కాలం మనం లోపలికి వేసి చూసుకోవడం మొదలు పెడతాం అలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అప్గ్రేడ్ అవుతున్నాం మీరు ఎప్పుడైనా చూడండి కంప్యూటర్ అప్గ్రేడ్ అయినప్పుడు దానికి డౌన్ టైం కావాలి అంటే ఆ సమయంలో పని చేయదు మనం కూడా అంతే మన జీవితం మారుతున్నాం మనం మారుతున్నాము అంటే మనకి కూడా డౌన్ టైం అనేది కావాలి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితం మునుపున్నట్టుగా ఇప్పుడు ఉండదు ఇంకా తర్వాత అన్ని మారిపోతున్నాయి మీరు మారిపోయినప్పుడు మీ
(05:22) శరీర స్పందన మారినప్పుడు మీ జీవితం కూడా మారిపోతుంది. మన జీవితం అనేది మనం ఏ స్పందన నుంచి మనం ఉన్నాము అనేదాన్ని బట్టి అది ఉంటుంది. మనం గనుక తక్కువ స్పందనలో ఉన్నాం అనుకోండి మనకి చుట్టూ కష్టాలు కన్నీళ్లు పీడించే వాళ్ళు దురదృష్టం ఇట్లాగే ఉంటుంది. మనం సాధన చేసి స్పందన పెంచుకున్నప్పుడు మన స్పందన పెరగడం మూలంగా మీ చుట్టూ లోకం కూడా ఆ స్పందనని మీకు ప్రతిబింబించేటట్టుగా అది ఉంటుంది కాబట్టి మీ చుట్టూ ఉన్న లోకం కూడా మీకు మారుతుంది.
(06:02) మీ శరీర స్పందన మారినప్పుడు మీ బయట అనుభవాలు మారుతాయి మీరు పనిచేసే చోటు మారిపోవచ్చు ఉండే చోటు మారిపోవచ్చు మీరు గతం తాలూకు కదల్లో నుంచి బయటకి వచ్చేస్తారు పాతవన్నీ వెళ్ళిపోతాయి దాని స్థానంలో కొత్తవి వస్తాయి కానీ ఈ పాతవి వెళ్ళిపోయి కొత్తవి వచ్చే మధ్యలో స్థానం ఉంది చూడండి అదే శూన్య స్థితి ఈ శూన్య స్థితిలో ఏమవుతుందంటే గతం తాలూకు నేను అంటే నా గతం తాలూకు ప్రవర్త ఆలోచించే విధానం నేను బాధ్యత తీసుకుంటున్నానా లేదా ఎంత తీసుకుంటున్నాను నేను ఎక్కువగా ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ లో ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఏ ఇంట్లో అయితే పుట్టానో ఏ
(06:46) వాతావరణంలో అయితే పెరిగానో దాని తాలూకు భావోద్వేగాలు నాలో ఎక్కువ ఉన్నాయా లేదంటే సొంతంగా నేను ఆలోచించిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానా ఇవన్నీ కూడా మారిపోతాయి మీకు మారిపోయి అంటే ఇవన్నీ పాత నేను ఎలా ఉన్నాను అంటే పాత నేను మూలాధార చక్రం నుంచి పనిచేస్తున్నాను అనుకోండి మూలాధార చక్రంలో మనకి ప్రోగ్రామింగ్ ఉంటుంది.
(07:11) అంటే మనం ఏ ఇంట్లో అయితే పుట్టామో ఏ వాతావరణంలో అయితే పుట్టామో ఆ ఏ సంస్కృతిలో అయితే పెరిగామో దాని తాలూకు ముద్రలు చిహ్నాలు ఆలోచనలు నమ్మకాలు మనలో బలంగా నాటుకుని ఉంటాయి. మనం మన పూర్వీకులు ఎలా మాట్లాడారో మనం అలాగే మాట్లాడతాం అది తప్ప సరా అనేది మనం ప్రశ్నించం. ఎందుకంటే మనసు మూలాధారంలో ఎక్కువగా పనిచేస్తుంది అంటే అక్కడ అలాగే పనిచేస్తుంది.
(07:38) మూలాధారంలో ఎక్కువగా పనిచేసేటువంటి మనసు ఇక్కడున్న వ్యక్తికి ఏంటంటే నిత్యం వాళ్ళు వాళ్ళని వాళ్ళు బాధితులు అనుకుంటారు. వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ వాళ్ళు బుద్ధిని వాడట్ల బుద్ధిహీనులయి ఎవరైనా గొడవ పెట్టడానికి వస్తే గొడవలు పెట్టుకోవటం ఎంతసేపటికి లాభం నష్టం అని ఆలోచించడం ఇదంతా మూలాధార చక్రంలో మనసు ఎక్కువగా అక్కడ ఉందనుకోండి ఎవరికైనా కూడాను వాళ్ళ ప్రవర్తనలు అలా ఉంటాయి.
(08:07) అయితే ఆధ్యాత్మిక ప్రక్రియలో ఏమవుతుందంటే మనకి విశ్వం నుంచి శక్తిపాతం వస్తుంది. విశ్వం నుంచి శక్తిపాతం వచ్చినప్పుడు ఏంటంటే ఈ శక్తిపాతం మనకి గురువుల నుంచి దీక్షల నుంచో లేదంటే మనం ఏదైనా సాధన చేస్తున్నాం దేవుని మంత్ర జపం చేస్తున్నాం ఏదో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు మన దేహ స్పందన పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏంటంటే మనసు అనేది కింద చక్రా నుంచి పై చక్రాకేసి వస్తుంది.
(08:36) మనలో రకరకాల ప్రవర్తనలు ఉంటాయి. ఈ ప్రవర్తనలు అన్ని మన ప్రవర్తనలు కావు ఇవి చక్ర ప్రవర్తనలు. ఇప్పుడు ప్రతి చక్రానికి దళాలు అనేవి ఉంటాయి. ఈ దళాలు ఈ రేకులకి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు కోపం ఈర్ష అసూయ ద్వేషం ఆనందం సునితత్వం మంచితనం ఇవన్నీ కూడా చక్ర రేకులు మొక్క లక్షణాలు మీకు ఒక చక్ర తీసుకుంటే స్వాదిష్ట చక్రం తీసుకుంటే అంటే కింద నుంచి రెండో చక్రం తీసుకుంటే అక్కడ మీకు ఈర్ష అనేది ఉంటుంది.
(09:18) మరుపు అనేది కూడా ఉంటుంది వేరే చక్రం స్థాయిలో మనం మన మనసు ఏ చక్ర స్థాయి నుంచి పని చేస్తుంది అనే దాన్ని బట్టి ఆ లక్షణాలు మనం ఎక్కువ వ్యక్తపరుస్తాం మన మనసు ఎప్పుడైతే మనం చేసే సాధన వల్ల మన శరీర స్పందన పెరగడం వల్ల మూలాధారం నుంచి పైకి లేస్తుందో స్వాదిష్ట చక్ర స్థాయి నుంచి పనిచేస్తుందో మూలాధార చక్ర స్థాయి ఇవన్నీ మనం వదిలేస్తాం.
(09:46) అంటే ఇప్పుడు నేను ఆ మనిషిని కాను నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచించేదాన్ని వాళ్ళ నమ్మకాలని నేను తీసుకున్నాను కానీ నాకు పెద్దయ్యాక వాటిని ప్రశ్నించాను ఆ నమ్మకాలని నాకు అవి సరికాదేమో అనిపించింది కాబట్టి ఆ నమ్మకాలని నేను వదిలేసుకున్నాను ఆ నేను పెరిగిన వాతావరణం నన్ను ఎవరినో ద్వేషించమని చెప్తోంది ఉదాహరణకి చుట్టాల మధ్యలో కొట్లాలు ఉన్నాయి ఏదో ఆస్తి పంపకాల విషయాల్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారు తరతరాల బట్టి ద్వేషించుకుంటున్నారు ఇప్పుడు నన్ను కూడా తరతరాన్ని ద్వేషించమని చెప్తున్నారు నాకు అది ఇష్టం
(10:22) లేదు నేను కాస్త ఈ విషయాలకి దూరంగా ఉంటున్నాను అంటే ఏమవుతుంది ఇక్కడ మీరు మూలాధార చక్ర స్థాయి విషయాలన్నిటిని మీరు తిరస్కరించారు. మీ గతం అనేది దానికి సంబంధించింది. ఎందుకు తిరస్కరించారు మీ మీద ఈ ప్రాణ దిగటము లేకపోతే ఏదో దైవిక కటాక్షం లాంటివి రావటం వలన మీ మనసు తేలికపడింది తేలికపడి కింద చక్రా నుంచి పై చక్రాకేసి వస్తుంది అదే పై చక్రాకేసి వచ్చేటప్పుడు కిందవన్నీ వదిలేస్తుంది.
(10:56) అంటే పాత నేను మీరు వదిలేసుకున్నారు నేను అది కాదు నా వల్ల కాదు నేను అలా బతకలేను నేను ఆ మనిషిని కాదు అనుకున్నారు. కానీ కొత్త మీరు ఏంటో మీకు తెలీదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాత నేను పోయి కొత్త నేను స్వాదిష్టాన చక్రంలో కొత్త నేను ఏ రకంగా ఉంటాను నన్ను నేను ఏ రకంగా వ్యక్తపరుచుకుంటాను నాకు ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయి ఇవన్నీ నాకు తెలియదు ఇంకా అంటే ఒక రకమైనటువంటి అంధకారంలో నేను ఉన్నాను.
(11:26) ఈ అంధకారంతో పాటు నేను నా కుటుంబ సభ్యులందరి వాళ్ళ ఆలోచనలు అన్నిటిని నేను తిరస్కరించాను కాబట్టి వాళ్ళఎవరు నాతో మాట్లాడటం లేదు నేను తిరిగి ఆ పరిస్థితుల్లోకి వెళ్లి ఇమడలేను నా గతం తాలూకు విషయాలన్నీ తీసేసాను దాంతో నాకు ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తోంది. నాకు పరిచయం లేని స్థితిలో ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ ఏమవుతుందో నాకు తెలియదు నా జీవితం ఎటు వెళ్తుందో నాకు తెలియదు.
(11:53) అందరూ నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినందుకు నాకు ఏదో ఇంకా బతుకుతున్నానో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. నా జీవితం వింతగా తోస్తుంది నా చుట్టుపక్కల వాళ్ళ జీవితంలో నా జీవితం లేదు. పైగా ఇక్కడ ఇరుక్కుపోయి కూరుకుపోయినట్టుగా నాకు ఉంది. దాంతో నాకు బాగా అనిపించట్లేదు.
(12:15) నేను తీసుకున్న నిర్ణయాలకి నా జీవితం చాలా బాగుంటుంది అనుకున్నాను. అలాంటిది నేను ఒక అంధకారంలోకి ఎందుకు వచ్చాను. జీవితం ఎందుకు ఇంత క్రూరంగా ఉంటుంది మనుషులు ఎందుకు ఇంత క్రూరంగా ఉంటారు అనే ఆలోచనలో ఈ వ్యక్తి చాలా ఆ నెలలు సంవత్సరాలు ఏడవచ్చు ఆ ఏడుస్తున్నప్పుడు ఏడుపులో ఆ మనిషికి అహంకారం అనేది కరిగి వెళ్ళిపోతుంది. తీవ్రమైనటువంటి భావద్వేగాలు అనుభవిస్తారు కోపం దుఃఖం ఒక రకంగా జీవితం మీద ఇంకా విరక్తి భావం ఎందుకు ఈ జీవితం అంతా చీకటి ఎవరిని నమ్మలేరు ఒకప్పుడు ఎవరినైతే చూసి వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళతో
(12:58) ఉండబుద్ది ఉండబుద్ధి కావటం లేదు జీవితం బరువు అనిపిస్తుంది. పైగా ఇక్కడ మనకి ఏమవుతుందో కూడా మనకి తెలియదు. ఇప్పుడు ఒకవేళ మీకు కుండలిని జాగృతము ఆధ్యాత్మిక జాగృతి మీ దేహంలో మొదలయింది దాని తాలూకు లక్షణాలుగా మీరు ఈ శూన్య స్థితిలోకి వచ్చారు అంటే మీకు అర్థం అవుతుంది ఓహో నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కొంతకాలం ఉంటాను బయటికి వస్తాను అన్న సంగతి మీకు అర్థం అవుతుంది.
(13:24) ఒకవేళ అసలు మీకు ఆధ్యాత్మిక ప్రక్రియ మీ దేహంలో అవుతుందన్న సంగతి మీకు తెలియదు అనుకోండి అప్పుడు ఇంకా మీకు ఏదో చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలామందికి ఇక్కడ ప్రాణ గండాలు లాంటివి చచ్చి బతకటం లాంటిది లేదంటే కొన్ని చాలా రోగాలు క్రానిక్ ఎలిమెంట్స్ అనేవి రావటం ఈ స్థితిలో కొంతమందికి ఏమో ఆత్మహత్య యత్నాలు చేయటం లేదంటే ఆలోచనలు ఎక్కువ రావటం ఎందుకంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది.
(13:55) ఇక్కడ ఏమవుతుంది పాత నేను అనేది వెళ్లిపోయింది కొత్త నేను ఇంకా రాలేదు అంటే దేని ఆధారంగా అయితే నేను నా ఉనికిని నన్ను వర్ణించుకుంటున్నాను అది ఇంకా నాకు తెలియదు దాని మూలంగా ఈ చీకట్లో నేను ఏంటో నాకు తెలియటం లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఒక చీకటి దిక్కు తోచని స్థితి ఇదే శూన్యస్థితి కానీ ఈ స్థితిలో ఏంటి అంటే నేను ఏది కాను అవన్నీ నేను నా జీవితంలో నుంచి తీసేస్తున్నాను కాబట్టి నాలో రోజు రోజుకి స్పష్టత పెరుగుతుంది అంటే ఇదంతా నేను కాదు ఈ క్రూరత్వం నేను కాదు ఈ ఆలోచించే విధానం నేను కాదు ఈ నమ్మకాలు నేను కాదు అని అన్నిటిని వదిలేసు కుంటున్నాను అంటే ఎందుకు
(14:41) వదిలేసుకుంటున్నాను నాలో నిజాయితి పెరుగుతోంది నన్ను నేను అర్థం చేసుకునే ప్రయత్నంలో వీటన్నిటిని వదిలేసుకుంటున్నాను. కానీ ఆ కొత్త నేనుఏంటో నాకు తెలియదు కాకపోతే ఇక్కడ ఒకటి మటుకు మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి శూన్య స్థితిలో మనకి ఒక ఒంటరితనం అనేది ఇక్కడ దొరుకుతుంది ఆ ఒంటరితనంలో మనల్ని మనం చాలా ప్రశ్నించుకుంటాం నేను ఎవరు ఎందుకు వచ్చాను ఎందుకు పుట్టాను ఇదంతా నేను ఎందుకు అనుభవించాలి మనం మనతో మాట్లాడుకునే విధానం మారిపోతుంది.
(15:13) ముందు మనం ఏంటంటే అన్ని వివరించుకుంటాం. పెద్దవాళ్ళు ఏం చెప్పినా ప్రశ్నించం వాటిని పాటించేస్తూ ఉంటాము. ఇక్కడ శూన్య స్థితిలో మనం మనతో మాట్లాడుకునే విధానం మారిపోతుంది ఇప్పుడు మనం ఎక్కువ అన్నిటిని ప్రశ్నిస్తున్నాం. చాలా లోతైన ప్రశ్నలు అడుగుతాం ఇక్కడ మనం ఆ లోతైన ప్రశ్నలు ఎందుకు అడుగుతాం అంటే మనకి ఇక్కడ స్పష్టత కావాలి. మనం ఒక కొత్త వెలుగు కోసం మన లోపలలో లోతుల్లో ఉన్నటువంటి వెలుగు కోసం మనం వెతుక్కుంటున్నాం ఆ వెలుగు ఏంటంటే ఒక స్పష్టత అంతేకాకుండా ఒక నిజాయితి దీనిన్నిటికీ మించి నేను ఉన్నాను అది నా నిజం ఆ నిజం ఏంటో నేను తెలుసుకోవాలి.
(15:55) ఆ నిజాన్ని అందుకునే ప్రయత్నం ఈ శూన్య స్థితిలో మనం చేస్తాం. ఈ శూన్య స్థితిలో నుంచి మనం బయటికి వచ్చాక ఏమవుతుందంటే అంటే కొత్త నేను అనేది మీకు క్రమేపి మీ అవగాహనలోకి వస్తుంది మీరు మారుతారు మీ స్పందన పెరుగుతుంది కొత్త నేను అనేది వచ్చేసరికి అది ఎలా ఉంటుందంటే పాత నేను నుంచి ఒక విడుదలలా అనిపిస్తుంది. అంటే ఇంకా పాత తాలూకు ఆ మనిషి బాధలు గాని ఆ మనిషి అనుభవాలు గాని ఆ మనిషి ప్రవర్తనలు గాని ఇప్పుడు నాకు చెందవు.
(16:29) వాటన్నిటి నుంచి నాకు ఒక విముక్తి అనేది కలిగింది ఒక రకమైనటువంటి స్వతంత్రం అనేది నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను దాని వల్ల నా లోపల ఉన్నటువంటి నా లోపల ఉన్నటువంటి జ్ఞానం అవ్వచ్చు తెలివి అవ్వచ్చు అది నాకు ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. నా లోపల ఉన్నటువంటి సృజనాత్మకతని నేను తేలికగా అందుకోగలుగుతున్నాను. దైవిక కటాక్షాన్ని దైవానుగ్రహాన్ని గురువుల కృపని పొందగలుగుతున్నాను.
(17:00) ఇప్పుడు నాలో ఒక కొత్త నేను అనేది చిగురిస్తుంది. ఈ కొత్త నేను కొత్త ప్రవర్తనలు అంటే ఇప్పుడు నేను ఇందాక ఉదాహరణ ఇచ్చా ఒక మనిషి మూలాధారం నుంచి అక్కడ ప్రవర్తనలన్నీ వదిలేసుకుని స్వాధిష్టాన చక్ర స్థాయి నుంచి బతుకుతున్నారు అని. ఆ స్వాధిచార చక్ర స్థాయి నుంచి బ్రతికే వాళ్ళ జీవితము మూలాధారం వాళ్ళకి భిన్నంగా ఉంటుంది.
(17:24) ఎలా భిన్నంగా ఉంటుంది అంటే మూలాధారం వాళ్ళు ఎక్కువగా చాలా ఎక్కువ కర్మ రుణాల్లో కూరుకుపోయి ఉంటారు. దాంట్లో నుంచి బయటకి పడటం అనేది వాళ్ళకి చేత కాదు. స్వాధిష్టాన చక్ర స్థాయిలోకి వచ్చేసరికి చాలా మటుకు కర్మ రుణాలని వీళ్ళు తీసేస్తారు స్వాదిష్టాన చక్రం వాళ్ళకి నచ్చదు కూడా ఇప్పుడు కర్మ ఒక ఇంట్లోప మంది కలిసి ఉన్నాము మనంఅందరం బంధువులు అంటే స్వాయిష్ట చక్రం వాళ్ళు ఇష్టపడరు వాళ్ళకి వాళ్ళ స్వాతంత్రం చాలా ముఖ్యం వాళ్ళ అట్లాగా 10 మందిలో ఎమ్మట్టడానికి ఇష్టపడలేరు పైగా వాళ్ళని వాళ్ళు ఎక్కువ వ్యక్తపరుచుకుంటారు స్వాదిష్టన చక్రం అంటేనే అర్థం మనల్ని మనం
(18:02) వ్యక్తపరచుకోవటం స్వాదిష్టన చక్రం జలతత్వం జలతత్వం ఏం చేస్తుంది తనను తాను ఎక్కువ వ్యక్తపరుచుకుంటుంది నన్ను నేనేంటి తెలుసుకోవాలి అనేటువంటి ఒక భావన స్వాదిష్ట చక్ర స్థాయి లోంచి మనసు ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ స్వాతంత్రాన్నే వాళ్ళు ఇష్టపడతారు. అలా వాళ్ళ మనసు ఎదిగేసరికి వాళ్ళు 10 మందితో కలిసి ఒక ఇంట్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ జీవితం వేరేగా బ్రతకడానికి ఇష్టపడతారు.
(18:33) వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నిజం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎక్కడో లోతుల్లో ఆ ఒక దైవానుగ్రహం గురువులతో ఒక సంబంధం లాంటిది ఈ స్థాయి నుంచి ఏర్పడి ఉంటుంది వాళ్ళకి దాంతో వాళ్ళు బతికే ఒక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ వేరుఉంటుంది. ఇక్కడ మనల్ని మనం పునర్సృష్టించుకుంటున్నాం. ఇది ఇంకో జీవితం లాంటిది ఇప్పుడు ఒక మామూలు మనిషికిను ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి తేడా ఏంటంటే మామూలు మనిషి కాస్త మారటానికి కూడా ఎన్నో జీవిత కాలాలు పడుతుంది.
(19:12) ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళు ఏంటంటే ఎన్నో జీవిత కాలాల మార్పు ఒక జీవిత కాలంలో అనుభవిస్తారు. అది ఎలా అవుతుంది అంటే వాళ్ళ మనసు ఒక చక్ర స్థాయి నుంచి పై చక్ర స్థాయికి ఒకవేళ స్వాదిశ చక్ర స్థాయిలో ఎవరైనా ఉన్నారు అనుకోండి అక్కడ వాళ్ళకి ఆధ్యాత్మిక వికాసం జరిగింది అనుకోండి వాళ్ళు మణిపుర చక్రం వేసే వాళ్ళ మనసు పైకి వస్తుంది.
(19:37) అంటే వాళ్ళు ఇప్పుడు ఆలోచించే విధానం గానీ ప్రవర్తన గాని స్వాదిష్ట చక్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి భావోద్వేగాలకి కూరుకుపోకుండా దాన్ని అధిగమించి మణిపుర చక్రంలో వాళ్ళు 10 మందికి ఒక నాయకత్వపు స్థాయికి వెళ్లి వాళ్ళు 10 మందికి ఆ వాళ్ళు ఒక దిశ చూపించేటట్టుగా వాళ్ళలో యుక్తి శక్తి ఎక్కువ ఉంటుంది. అక్కడ చక్ర స్థాయి ఆ చక్ర స్థాయి లక్షణాలు ప్రవర్తనలు వేరే ఉంటాయి.
(20:10) అలా మనసు వికాసం చెంది ఒక చక్ర స్థాయి నుంచి పై చక్ర స్థాయికి వేసి వెళ్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగిన ప్రతి వాళ్ళకి మొత్తం ప్రక్రియ పూర్తయి కాంతి దేహం తయారవ్వాల్సిన అవసరం లేదు చాలామందికి ఏంటంటే వాళ్ళకి ఒక జీవిత కాలంలో ఒక చక్ర స్థాయి నుంచి ఇంకో చక్ర స్థాయి వరకు వచ్చి అక్కడ ఆగిపోతుంది ప్రక్రియ అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కింద చక్ర స్థాయి లక్షణాలనేవి మనం వదిలేసుకుంటాం.
(20:34) ఇప్పుడు మనం పై చక్ర స్థాయి నుంచి పని చేస్తున్నాం. కానీ మార్పు జరిగేటప్పుడు అంటే కిందది వదిలేసి పైది ఇంకా రానప్పుడు మధ్యలో మీరు ఒక అకాదం ఒక శూన్య స్థితి ఒక చీకటిలో మీరు కొంతకాలం ఉంటారు అదే శూన్య స్థితి. ఇక్కడ నేను ఆధ్యాత్మిక ప్రక్రియ ఒక దశలు అనేవి వర్ణించాను. మీకు మొదటి దశ ఏంటంటే మీ మీద ప్రాణశక్తి అనేది రావటం.
(20:59) ఈ ప్రాణ మన దేహం గుర్తించదు మనసు గుర్తించదు కాబట్టి ఈ పదార్థం మన మీదకు రాంగానే మన కోసాల్లో ప్రాణ కదిలికలు అవి పైకిసి వెళ్ళడం మొదలు పెడతాయి దేహంలో అది శరీరానికి ఒక షాక్ లాంటిది కాబట్టి ఇక్కడ మనకి కుండని సింటమ్స్ అన్ని వస్తాయి. తర్వాత ఇక్కడ నేను రాశను చూడండి డెత్ చేంజెస్ టు ఈగో అని ఇదే శూన్య స్థితి శూన్య స్థితి మనం చావుతో పోల్చొచ్చు ఎందుకు చావుతో పోల్చొచ్చు అంటే ఇక్కడ నేను పాత నేను నేను పోతున్నాను.
(21:35) నా అహంకారం దానితో ముడి వేసుకున్నటువంటి అహంకారం కూడా కరిగిపోతుంది నా పాత సంబంధాలతో పాత జ్ఞాపకాలతో పాత అలవాట్లతో ఏదైతే నేను నా శక్తిని ముడి పెట్టానో ఆ ముళ్ళు కూడా తెగిపోతున్నాయి తెగిపోతున్నందుకు నేను చాలా ఏడుస్తున్నాను ఇక్కడ నాకు వైరాగ్య భావం వస్తుంది గతంతో చూసుకుంటే నన్ను నేను పోల్చుకుని నాకు వైరాగ్య భావం వస్తుంది ఎందుకు ఇది శూన్య స్థితి చావు లాంటి స్థితి ఇక్కడే చాలామందికి చనిపోవాలనే కోరిక రావటము ఆ జీవితం కూడా అర్థం కాదు ఒక చీకటి స్థితి అది మీకు ప్రక్రియ ఎంత మీకు బలంగా అవుతుంది అనే దాన్ని బట్టి ఈ కాలం ఎంతైనా ఉండొచ్చు తర్వాత మీకు ఈ సున్న స్థితిలో
(22:23) నుంచి బయటకు వచ్చాక ఒక కొత్త బలం లాగా మీ మీద కొత్త అవగాహన మీకు రావటం మీరు కొత్త ఆధారాల మీద మిమ్మల్ని మీరు నేను ఇది అని మిమ్మల్ని మీరు వర్ణించుకోవటం దాని తర్వాత మీకు కొత్త ప్రవర్తనలు మీ లోపల పూర్తిగా ఆ మీరు వినుడించుకుని మీరు పై స్థాయి ఫ్రీక్వెన్సీ నుంచి బ్రతకటం ఇది మీకు ఆధ్యాత్మిక ప్రక్రియలో దశలు అయితే ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది సైక్లికల్ ప్రాసెస్ ఈ ఆఖరి ఫిఫ్త్ అయిపోయాక మళ్ళీ మీరు మొదటి దానికి వెళ్తారు మళ్ళీ మీ మీదకు ప్రాణం దిగుతుంది.
(23:03) మళ్ళీ శరీరానికి షాక్ లాగా చాలా కుండని సింటమ్స్ వస్తాయి. మళ్ళీ శూన్య స్థితిలోకి వెళ్తారు. కాకపోతే ఇలా సైక్లికల్ గా ఈ ప్రక్రియ వెళ్ళిన కొద్దీ మీకు మొదటిసారి ఏదైతే శూన్య స్థితి మీకు మూడేళ్ళ నాలుగేళ్ళ ఉందో తర్వాత మళ్ళీ ఆ స్థితిలోకి మీరు వచ్చినప్పుడు అది ఏడాదిన్నర పాటే ఉండొచ్చు ఏడాది పాటే ఉండొచ్చు. మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా అయి మళ్ళీ మూడోసారి వచ్చారనుకోండి శూన్య స్థితిలో అది కొన్ని నెలలే ఉంటుంది.
(23:31) అంటే ముందుకు వెళ్ళే కొద్ది ఈ శూన్య స్థితి అనేది తగ్గిపోతా వస్తుంది. దాని బరువు దాని దుఃఖం కూడా తగ్గిపోతుంది దాంతో పాటు ప్రక్రియతో పాటు మీరు ప్రక్రియలో చాలా ముందుకు వెళ్ళాక మీరు శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు మీరు గుర్తుపట్టేస్తారు ఓహో ఇది శూన్య స్థితి మళ్ళీ మొదలయింది నాకు అనేది మీకు ఆ గుర్తుపడతారు ఆ గుర్తుపట్టడం వల్ల మీకు ఆ శూన్య స్థితిలో మీరు ఏడవచ్చు అక్కడ కాకపోతే మొదటిసారి బాధ పెట్టినంతగా ఇక్కడ ఈ మిమ్మల్ని శూన్య స్థితి అంత బాధ పెట్టదు ఎందుకంటే దానికి మీరు తయారై ఉన్నారు ఇది ఒకటి ఉంది అన్న సంగతి మీకు అర్థం అవ్వటం మూలంగా
(24:08) మీరు దానికి తయారై ఉన్నారు. ఈ శూన్య స్థితిలో ఏంటంటేనండి మనం చాలా విషయాలు వదిలేసుకుంటాం. ఈ వదిలేసుకునేటప్పుడు ఏడుస్తాం మనల్ని మనం మళ్ళీ పునరావిష్కరించుకోవాలి నేను మళ్ళీ పుట్టాలి అంటే ఇప్పుడు తల్లి పుట్టినప్పుడు ప్రసవ వేదన పడుతుంది. కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు మళ్ళీ మీరే కంటున్నారు కాబట్టి ఆ ప్రసవ వేదన మీరే పడుతున్నారు.
(24:36) పుట్టేది ఏంటి అంటే మీలో ఒక కొత్త సెన్స్ అఫ్ సెల్ఫ్ నేను ఇది అని ఒక కొత్త ఆధారంగా మిమ్మల్ని మీరు వర్ణించుకుంటున్నారు చూడండి ఆ ఉనికి పుడుతోంది మీలో నుంచే పుడుతోంది. దానికోసం ప్రసవ వేదన మీరే పడుతున్నారు. అందుకనే ఈ శూన్య స్థితి అనేది కష్టమైన స్థితి ఈ శూన్య స్థితి అయిపోయి మీకు కొత్త స్పందనలో మిమ్మల్ని మీరు నాటుకున్నాక మీకు ఒక విడుదల ఒక స్వతంత్రం అనేది ఇక్కడ మీరు అనుభవిస్తారు.
(25:08) కానీ ఈ స్థితి చేరడం అంత తేలిక కాదు ఆ స్థితికి చేరాలి అంటే మనం కూడా పురిటి నొప్పులో పడినంత కష్టపడాలి అదంతా శూన్య స్థితిలోనే అవుతుంది. శూన్య స్థితి మనకి మనసులో లోతుల నుంచి మనం మారాలి. అంటే ఇప్పుడు మన మనసుని మనం మహాసముద్రం అనుకుంటే ఈ శూన్య స్థితిలో మనం ఆ మహాసముద్రంలోకి వెళ్లి ఆ లోలోతుల్లో ఎక్కడో 3000 ఫీట్ 4000 ఫీట్ లోతుల్లో ఉన్నటువంటి భూమిని తాకి వెనక్కి రావడం ఎంత కష్టమో ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం ఎక్కువగా భావోద్వేగాలు ఇదులాడుతూ ఉంటాం ఎందుకంటే మనకి స్వాదిశన చక్రం
(25:54) అంటేనే మహాసముద్రం అక్కడ ఉన్నది దాని లోపలికి వెళ్లి ఆ లోతుల్లోకి వెళ్లి దాన్ని అక్కడ తాకి పైకి రావటం అనేది అంతవరకు వెళ్తే గాని మీలో మార్పులు రావు ఆ మార్పులు రావటం అనేది మీరు దాన్ని తీసుకురాగలగాలంటే మీరు పురిటి నొప్పులు పడినంత కష్టపడాలి అప్పుడే మీది ఒక కొత్త ఆ ఆధారంగా మిమ్మల్ని మీరు వర్ణించుకునేటట్టుగా మీకు ఇక్కడ అవకాశం వస్తుంది.
(26:27) దీనిలో భాగంగా మనం చాలా వదిలేసుకోవాలి. మన అటాచ్మెంట్స్ మనకి ఒక వ్యక్తితో మనకి ఆశాపాసాలు ఉండొచ్చు రాగద్వేషాలు ఉండొచ్చు మనకి వస్తువులతో ఏవో సంబంధాలు ఉంటాయి మనకి ఒక చేసే పనితో గాని ఒక ప్రాంతంతో గాని మనకి ఒక అటాచ్మెంట్ ఉంటుంది అటాచ్మెంట్స్ వదిలేసుకోవాల్సి ఉంటుంది వ్యసనాలు వదిలేసుకోవాల్సి ఉంటుంది ప్రవర్తనలు వదిలేసుకోవాల్సి ఉంటుంది మన జీవితంలో కర్మ సంబంధాలని వదిలేసుకోవాల్సి ఉంటుంది మనం ఉండే స్థానాల కూడా అప్పుడప్పుడు మన జీవితం నుంచి వెళ్ళిపోతుంది మనం చేసే పని ఏదో పని చేయాలని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటాం.
(27:04) ఆ పని మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది మనం మన కోరికలను వదిలేసుకోవాల్సి ఉంటుంది. మన లోపల చాలా బాధ అనేది బయటికి రావడం మొదలవుతుంది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. తెరుచుకునే సరికి ఎన్నో జన్మల బాధ మీ లోపల ఉంటుంది. ఈ ఒక్క జన్మది కాదది అదంతా కూడా బయటక వస్తూ ఉంటుంది.
(27:30) మీ ఎన్నో జన్మల కర్మ బయటికి వస్తుంటే ఆ కర్మను కూడా మీరు విడుదల చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియలో సాధన ద్వారా అంతేకాకుండా పూర్వీకుల కర్మలు ఒకవేళ ఏమైనా లైంగికంగా మీరు వేధింపబడి ఉన్నా మీ కుటుంబంలో ఎవరైనా కూడా లైంగికంగా వేధింపబడి ఉన్నా వాళ్ళ కర్మని మీరు విడుదల చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చిన్ననాటి మన బాధలు కష్టాలు తర్వాత చాలా కుటుంబాల్లో మానసిక సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇవన్నీ కర్మలే ఇవన్నీ మనకి పితృ దోషాలు వాళ్ళ శాపాలు కర్మలు కుటుంబం మీద ఉన్నవి ఇవన్నీ కూడా బయటికి వస్తాయి ఈ స్థాయిలో కాబట్టి శూన్య స్థితి అంటేనే మనకి చాలా
(28:16) ఆ దిక్కు తోచన స్థితి అది అంతా ఒకటేసారి బయటికి వస్తుంది అది కూడా ఒక రకమైన ైనటువంటి గందరగోళం ఉంటుంది ప్రశాంతత ఉండదు కాకపోతే ఇక్కడే మనం చాలా మారుతాం ఈ చీకట్లో ఏదైతే మీ లోపలికి నొక్కేసి ఉన్నటువంటి మీ విషయాలు ఉన్నాయో ఏవైతే మారకుండా అలాగే ఉంటే మీరు మారరో అవన్నీ బయటికి వస్తాయి. అవన్నీ ఎందుకు బయటికి వస్తాయి అంటే ఈసారి బయటికి వచ్చేది మీకు అవి విడుదల అనేవి ఇవ్వటానికి బయటికి వస్తుంది.
(28:55) అప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక శూన్య స్థితిలో ఉంటాము చీకటి స్థితి ఈ చీకటి స్థితి మనకి చావుని కలిపిస్తుంది. అన్ని జీవితంలో నుంచి వెళ్ళిపోవడం వైరాగ్య భావం తీవ్రంగా ఏడవటం ఏళ్ల దరబడి ఏడవటం జీవితం అర్థం కాకపోవటం ఒంటరితనం తీవ్రమైన ఒంటరితనం మీకు పరిస్థితిలో వలన మీరు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది లేదంటే మీరు కుటుంబంతో ఉన్నా కూడా నాకు ఎవరూ లేరు నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని అనుకునేటట్టుగా మీకు అనిపిస్తుంది.
(29:32) ప్రతి నిమిషం మీకు మీ ఒంటరితనం గుర్తుకొస్తుంది ఆ ఒంటరితనం తట్టుకోలేక మీరు ఏడుస్తారు. కానీ ఆధ్యాత్మిక శూన్య స్థితి మనం దాటామ అనుకోండి అది మళ్ళీ మనం తిరిగి ఇంకోసారి పుట్టినట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చాలా వదిలేసుకుంటాం కదా ఈ ఆధ్యాత్మిక శూన్య స్థితిలో బంధాలను వదిలేసుకుంటాము పరిస్థితులు అంటే గతం తాలూకు పరిస్థితులు ఆలోచనలు నమ్మకాలు అన్నీ వదిలేసుకుంటాం ఇక్కడ చాలా విడుదలకు వచ్చేస్తాయి.
(30:01) ఇవన్నీ వదిలేసుకోవడం వల్ల మన లోపల ఒక ఖాళీ జాగా అనేది ఏర్పడుతుంది. అంటే అది సూక్ష్మంగా అవ్వచ్చు లేదంటే మీ జీవితంలో కూడా పెద్దగా మనుషులు లేకపోవటం మీకు ఖాళీ సమయాం లాంటిది ఎక్కువ ఉండటం ఈ ఖాళీ జాగాలో ఏం నిండుతుంది అంటే ఇప్పుడు వెలుగు నిండుతుంది. దైవ కటాక్షం నిండుతుంది గురువుల కృప అనేది అక్కడ వచ్చి నిండుతుంది.
(30:31) సృజనాత్మకత అంతర్దృష్టి మీలో పైస్థాయి ఆ బుద్ధి తర్వాత మిమ్మల్ని మీరు దేని ఆధారంగా వర్ణించుకుంటారో ఆ కొత్త ఉనికి అనేది రావటం మీరు తర్వాత ఏం పని చేయాలి ఎలా పని చేయాలి మీకు కొత్త అవకాశాలు రావటం ఇంకో దిశగా మీ జీవితం ముందుకు వెళ్ళటం మీకు ఏదో ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా మళ్ళీ జీవితం కొత్త కొత్తగా మొదలవుతున్నట్టుగా ఇది పునర్జన్మ లాగా మీకు అనిపించటం ఇవన్నీ కూడా ఇక్కడ ఈ శూన్య స్థితిలో నుంచి బయటికి వచ్చాక జరుగుతాయి.
(31:07) అయితే ఈ శూన్య స్థితిలో చాలా ఏడవటం మూలంగా మనకి అహంకారం చాలా కరిగిపోతుంది. అహంకారం కరిగిపోయిన ఆ స్థానంలో మీకు మీ లోపల వెలుగు పెరుగుతుంది ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే మీ గురువుల యొక్క శక్తిపాతం నుంచో గురువు అంటే మనకి భౌతికంగా గురువు లేకపోయినా సూక్ష్మ లోకాల్లో గురువులు మన మీదకి శక్తిపాతం పంపిస్తారు.
(31:34) అంతేకాకుండా మీరు ఆ ఏదైనా దేవుడికి సాధన చేస్తుంటే ఆ దైవ కటాక్షం వల్ల కూడా మీలో వెలుగు పెరుగుతుంది. వెలుగు పెరిగేసరికి మీ దేహం యొక్క స్పందన పెరుగుతుంది. ప్రతిసారి మీరు ఈ ప్రాసెస్ లో ఈ సైక్లికల్ ప్రాసెస్ అని నేను దశలు చూపించా చూడండి. ఆ దశల్లోంచి వెళ్లే కొద్ది ఇక్కడ దశలు ఉన్నాయి చూడండి ఎన్ని సార్లు అయితే మీరు ఈ దశల్లోనుంచి వెళ్లి మీరు మళ్ళీ మొదటి దశకి వస్తారో అంతగా మీలో కాంతి పెరుగుతూ ఉంటుంది అంతగా మీ మనసు చక్రాల్లో పైకి వేసి వెళ్తుంది.
(32:13) అయితే కొంతమందికి ఏంటంటే చాలా మొత్తం మీకు మనస్సు ఈ స్థాయి దాటి పైకి వెళ్ళింది అనుకోండి మనసు అప్పుడు మీ చేతన అవస్థ ఏదైతే జీవుడు స్థాయి నాభిలో ఉందో అక్కడి నుంచి మార్పే వచ్చి ఇక్కడ కూర్చుంటుంది అలాంటి వాళ్ళకి కాంతి దేహం తయారవుతుంది. సీతాకు ఒక చిలుక ఒక చిన్న గుడ్డు నుంచి అది ఎగరటం వరకు దాని ప్రయాణం చూసినట్లయితే అది గుడ్డు నుంచి మీకు పురుగు వస్తుంది గొంగళి పురుగు ఆ గొంగళి పురుగు తర్వాత తన్ని తాను బంధించుకుంటుంది ఒక తన చుట్టూ అది దారాలు అల్లుకుని ఒక గూటిని కట్టుకొని ఆ గూటి లోపల అది ఉండిపోతుంది అలాగ చాలా రోజులు అలా ఎందుకు ఉంటుంది అంటే ఆ గూటి లోపల దాని
(33:01) రూపం మారుతుంది. ఆ గూడు కట్టక ముందు అది గొంగళి పురుగు ఆ గూట్లో దాని రూపం మారి అది సీతాకోక చిలకల బయటకి ఎగిరిపోతుంది తర్వాత ఈ గూటిలో ఉన్నప్పుడే దాన్ని నేను శూన్య స్థితి అంటున్న ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం కూడా అంతే ఇప్పుడు నేను చెప్పాను మూలాధార చక్ర స్థాయి నుంచి ఒక మనిషి బతుకుతున్నాడని అతను గొంగళి పురుగు లాంటి వ్యక్తి అతను ఈ శూన్య స్థితిలో వేరేగా వెళ్లి ఒంటరిగా బ్రతకాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడొచ్చు లేదంటే మనుషుల మధ్యలో ఉన్నా కూడా నేను ఒంటరి వాడిని అనేటువంటి తలంపులో అతను దుఃఖేస్తూ బ్రతకొచ్చు.
(33:39) ఆ పైగా అదే సమయంలో మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోవటం మన మీద నిందలు వేయటం మనకి అక్కడ కర్మ సంబంధాలు తెగిపోతున్నాయి. మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు చుట్టుపక్కల వాళ్ళకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనం మన గూట్లోకి వెళ్ళిపోతాం తెలియకుండా మన చుట్టూ మనం గూడు కట్టేసుకున్న గూట్లోకి వెళ్ళిపోతాం ఎవరిని కలవం ఎవరితో మాట్లాడాలనిపించదు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది కొంతమంది చేస్తే సాధన చేస్తారు లేదంటే ఏడుస్తూ ఉంటారు అంటే మనం కూడా గొంగళి పురుగు గూట్లోకి వెళ్ళినట్టుగా మనం కూడా గూటు మన చుట్టూ గూడు కట్టుకుంటున్నాం. ఇక్కడ మనకి రక్షణ
(34:21) అవసరం ఈ మార్పు చెందేటప్పుడు నిత్యం మనతో గొడవ పడేవాళ్ళు మనల్ని రచ్చగొట్టేవాళ్ళు మనల్ని పీడించేవాళ్ళు మన జీవితంలో ఉంటే అది కష్టం అయిపోతుంది మనల్ని మనం రక్షించుకోవడానికి మన చుట్టూ గూడు కట్టేసుకుంటాం లేదంటే ఈ ప్రక్రియ ఇలా చేస్తుంది. ఆఖరికి మీరు సీతాకోక చిలుగా చిలుకగా మారి బయటికి వస్తారు అంటే ఏంటి ఒక రకమైనటువంటి స్వతంత్రం అనేది మీకు ఈ ప్రక్రియ ఇస్తుంది.
(34:51) కానీ ఆ ప్రక్రియ ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మీరు శూన్య స్థితిలో నుంచి మటుకు కచ్చితంగా వెళ్ళాలి. నేను గతంలో ఒక వీడియో చేశాను ధూమావతి దేవి అమ్మ మీద వీడియో చేశాను ధూమావతి దేవికి శూన్య స్థితులకి సంబంధం ఏంటో అక్కడ నేను వివరించాను వీలైతే చూడండి. అయితే శూన్య స్థితుల్లో ఏంటంటే మన లోపల పాత నేను అనేది అది పోతుంది. తిరిగి ముక్కలే వెళ్ళిపోతుంది.
(35:16) నన్ను నేను ఏ రకంగా వర్ణించుకున్నాను నేను ఇది అది అని ఎలా అయితే అనుకున్నానో అవన్నీ పోతున్నాయి. అవన్నీ నాకు ఇప్పుడు అవసరం లేదు అనవసరపు విషయాలు మనం జీవితంలో నుంచి తీసేసినట్టుగా ఆ పాత నేనుకు సంబంధించిన విషయాలన్నీ మన జీవితంలోనుంచి వెళ్ళిపోతున్నాయి. ఆ వెళ్లిపోయేటప్పుడు మనం తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురి అవుతాం.
(35:39) మనకి శారీరక నొప్పులు మానసిక నొప్పి ఏదో ఆత్మ స్థాయిలో కూడా చాలా విలపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. తర్వాత ఇది ప్రక్రియ ఎంత బలంగా అవుతుంది అనే దాన్ని బట్టి మీకు శూన్య స్థితి కూడా మీకు బాధ అంత బలంగా అనిపిస్తుంది. పైగా శూన్య స్థితిలో మీకు కొన్ని కొన్ని సార్లు ఏ రకంగా మనకి అనుభవంలోకి వస్తాయి అంటే నా ప్రక్రియ ఇక్కడే ఆగిపోయింది ముందుకు వెళ్ళట్లేదు.
(36:03) ఎక్కడో ఇరుక్కుపోయినట్టుగా నాకు అనిపిస్తోంది. నాకు ఏమి దిశ తెలియట్లేదు ఎట్ట వెళ్తున్నానో నాకు అర్థం కావట్లేదు. చాలామంది సాధకులకు ఈ సమస్య వస్తుంది. వాళ్ళు అందరి ముందుకు వెళ్ళిపోతున్నారు నేను మటుకు ఇక్కడే ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. ఇది కూడా మీకు శూన్య స్థితుల్లో అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే నేను చెప్పాను మీకు ఇక్కడ స్వాయిశాం చక్రం మీకు మహాసముద్రం లాంటిది.
(36:28) ఈ మహాసముద్రంలో మీకు లోలోతుల్లో మార్పులు జరుగుతున్నాయి లో లోతుల్లో మార్పులు జరుగుతున్నప్పుడు నేను గనుక పైన నీటిపైన ఉన్నాను అనుకోండి లో లోతుల్లో జరిగే మార్పులు నాకు తెలియదు కాకపోతే నేను నా పడవ ఎటు వెళ్ళట్లా నేను ఇక్కడే ఉన్నాను అని అనుకుంటున్నాను. అదేరకంగా ఈ ప్రక్రియలో చాలామందికి ఏమవుతుందంటే అంతరంగాల్లో లోలోతుల్లో మార్పులు జరుగుతున్నప్పుడు పైన వాళ్ళకి వాళ్ళ ఎంత సాధన చేసినా వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళట్లేదు ఆధ్యాత్మిక ప్రక్రియ ముందుకు వెళ్ళట్లేదు నేను ఇక్కడ ఎరుక్కుపోయాను అనే భావన ఉంటుంది వాళ్ళేమ ఎరుక్కుపోలేదు.
(37:05) వాళ్ళు చేసే సాధన వల్ల లోలోతుల్లో మార్పులు జరుగుతున్నాయి ఆ లోపల మార్పులు పూర్తఅయ్యాక బయటికి దాని ఫలితం తర్వాత వస్తుంది. అప్పటివరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక్కడ మేము ఎరుక్కుపోయాం అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉండిపోతారు. అంతేకాకుండా మన లోపల కోపం, దుఃఖం, ఈర్ష, అసూయ ఇవన్నీ కూడా బయటకి వచ్చేస్తూ ఉంటాయి ఈ శూన్య స్థితిలో.
(37:33) ఎందుకంటే మన శరీర స్పందన పెరుగుతుంది కదా, ఆ కొత్త స్పందనకి ఈ భావోద్వేగాలు సరిపడవు. కాబట్టి బయటకి విసిరేసినట్టుగా దేహంలో నుంచి ఈ భావోద్వేగాలన్నీ బయటకి వస్తూ ఉంటాయి. మనం వాటిని అనుభవిస్తాం మళ్ళీ అనుభవించి వదిలేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు అందుకనే బయటికి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇక్కడ బయటికి వెళ్ళిపోతున్నాయి సంగతి మనకు అర్థం కాదు నాకు ఎందుకు ఊరుకునే కోపం వస్తుంది నాకు ఎందుకు ఊరుకునే దుఃఖం వస్తుందిని మనం అనుకుంటాం.
(38:03) అది మీకు రావటం కాదు అది ఇప్పుడు మీ కొత్త నేనుకి ఈ భావోద్వేగాలు అనేవి సరిపడవు కాబట్టి ఈ మీ దేహంలో నుంచి బయటకి వెళ్ళ విసిరేస్తుంది. ఈ ప్రక్రియ ఇవన్నీ మీకు ఇప్పుడు అవసరం లేదు చాలాసార్లు శూన్య స్థితుల్లోకి వెళ్ళేటప్పుడు లేదంటే శూన్య స్థితుల్లో ఉన్నప్పుడు మనకి కొన్ని కొండలిని సింటమ్స్ వస్తాయి విపరీతంగా ఉడకటం అంటే వేసవకాలం 45° టెంపరేచర్ ఉంటుంది ఆ 45° టెంపరేచర్ లో మనమేమో కంబళ్ళు కప్పుకొని మన లోపల ఉనికిపోతూ ఉంటాం చలికి తీవరమైనటువంటి చలి రావటం లేదంటే ఒంట్లో చాలా వేడి రావటం ఇవన్నీ అన్నీ కూడా మీకు శూన్య స్థితుల్లో కూడా ఈ లక్షణాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా
(38:45) ఈ చలికి విపరీతంగా వనకటం అనేది శూన్య స్థితుల్లోనే ఎక్కువ చూశను నేను అంతేకాకుండా విపరీతంగా ఏడవటం మీకు మూడ్స్ మారిపోవటం ఒకసారి తీవ్రమైనటువంటి కోపం వచ్చేయటం మళ్ళీ తర్వాత పోవటం మళ్ళీ రావటం రకరకాల క్రానిక్ ఎలిమెంట్స్ కూడా శూన్య స్థితిలో ఎక్కువ ఉంటాయి మీకు ఆ ఒక చీకటి దశ ఇది ఈ దశలో మీరు చాలా లోతుల్లోకి వెళ్లి ఆలోచిస్తారు.
(39:13) గతం తాలూకు వ్యాపకాలు చాలా వచ్చి ఏడుస్తూ ఉంటారు. మీరేదో అంతా మిమ్మల్ని వెలివేసినట్టు ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నట్టు ఆ మీకు లోపల మీ ఆత్మ ఏడుస్తుంది అన్నంత గట్టిగా మీరు విలపిస్తూ ఉంటారు. ఇది ఎవరికైనా మీరు మీరు చెప్దాం అన్నా ఎవరికీ అర్థం కూడా కాదు మీ పరిస్థితి ఇది అలాంటి స్థితి పైగా ఈ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇది ఎప్పటికీ అంతం కాదేమో ఇక్కడే ఉండిపోతామేమో జన్మాంతం అనే భయం కూడా వేస్తుంది.
(39:49) మనకి గతం తాలూకు చాలా విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకవచ్చి మనల్ని తీవ్రంగా బాధ పెట్టేటువంటి స్థితి ఉండేస్తుంది. కానీ ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రక్రియలో అవసరం ఎందుకు అవసరం అంటే ఇవన్నీ మనం అనుభవించి వీటిలో ఏ సారం లేదు అని మనం వదిలేస్తాం చూడండి ఆ వదిలేసినప్పుడే మనం పై స్థాయి స్పందనక వెళ్లి మనల్ని మనం అక్కడ వేరేగా మనం ఆ అర్థం చేసుకుంటాం.
(40:16) మనకి పాత వాటి నుంచి విడుదల వస్తుంది ఇక్కడ. అయితే శూన్య స్థితులు తెచ్చేటువంటి మంచి విషయాలు కూడా ఉన్నాయి. మనకి శూన్య స్థితి చీకటి స్థితి అయినా దుఃఖ భరితమైన స్థితి అయినా కూడాను ఇది మనకి మంచి చేస్తుంది. ఎంత మంచి చేస్తుంది అంటే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి అర్థం కాదు ఆ స్థితిలో నుంచి బయటికి వచ్చాక అర్థం అవుతుంది.
(40:39) మనకి శూన్య స్థితిలో అంత క్రితం ఎప్పుడు అడగని ప్రశ్నలను అడుగుతూ ఉంటాం. దాని మూలంగా మనకి జీవితం ఎక్కువ అర్థం అవ్వడం మొదలు పెడుతుంది పాఠాలు తొందరగా నేర్చుకోవడం మొదలు పెడతాం. మన లోపల జ్ఞానం పెరుగుతుంది జ్ఞాన వైరాగ్యం పెరుగుతుంది మనము ఎదుటి మనిషికి ఎంత మన జీవితంలో మనం రానివ్వాలి ఎంతవరకు రానివ్వకూడదు అని మీరు గిరిగేసుకుంటారు మీ చుట్టూ ఆ రేఖలు చక్కగా గీసి ఎవరిని మీరు హద్దు మీరి ప్రవర్తించని నివ్వరి తర్వాత మీతో మళ్ళీ ఈ రేఖలు అనేవి మీకు శూన్య స్థితిలో చరిగిపోతూ ఉంటాయి దానివల్ల ఆ కొంతమంది అతిగా గ వాళ్ళు ఆ గీతలు దాటి ప్రవర్తించడం లాంటిది మీకు శూన్య స్థితిలో అనుభవంలోకి వస్తుంది కానీ
(41:26) శూన్య స్థితిలో అక్కడ మీరు నేర్చుకునే పాఠాలు ఏంటంటే ఎవరిని కూడా మనం మరీ ఎక్కువగా మర్యాద రేఖ దాటి రానివ్వకూడదు అన్న సంగతి మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం ఇలా ఒక రేఖ ఉంది నేను గీసుకోవాలన్న సంగతి కూడా మీకు శూన్య స్థితిలోనే అర్థం అవుతుంది. మీకు శూన్య స్థితిలో లేనప్పుడు ఈ పాఠాలు తొందరగా తలకెక్కవు. తర్వాత శూన్యశతి మిమ్మల్ని ఎంత మారుస్తుంది అంటే మీరు వెనక్కి తిరిగి శూన్యస్థని చూసుకుంటే అక్కడే నేను చాలా ఎక్కువ ఏడ్చాను అక్కడే నేను చాలా ఎక్కువ బాధపడ్డాను కాకపోతే ఆ స్థితే నన్ను చాలా మార్చేసింది మనిషిగా [నవ్వు] వెనక్కి తిరిగి నేను ఆ స్థితికేసి చూసుకుంటే నాకు
(42:07) ఇప్పుడు చాలా కృతజ్ఞత అనిపిస్తుంది ఆ స్థితి గనుక నేను అనుభవించి ఉండకపోతే ఈరోజు నేను మనిషిగా మారేదాన్ని కాదు నాకు అది అవసరమైన పాఠాలు నేర్పించింది ఆ చీకటి స్థితి మన జీవితాన్ని మార్చేసేటువంటి స్థితి అది అక్కడ ఏంటంటే చాలా ఏడ్చి ఏడ్చి మన అహంకారం కరిగిపోతుంది. కరిగిపోయి మనలో ఒక ఉద్దిక అనేది వస్తుంది మనలో ఒక ఆ దైవిక శక్తి అనేది పెరుగుతుంది మంచి గుణాలు అనేవి రావటం ముందవుతాయి.
(42:35) పైగా బుద్ధితో మనకి సంబంధం ఏర్పడటం మూలంగా మనలో విచక్షణ అనేది నిజాయితీగా బతకాలి ఇవన్నీ మనకి శూన్య స్థితిలో నేను ఏంటి నా నిజాయితి ఏంటి అనేది మీకు ఆ రకంగా అంత బలంగా మనల్ని ఆలోచింప చేయగలిగేటువంటి శక్తి శూన్య స్థితిలో ఉంటుంది. పైగా శూన్య స్థితిలో ఏమవుతుందంటే మనం కాలాన్ని వేరేగా అనుభవిస్తాం. ఇక్కడ మనకి కలలు ఎక్కువైపోతాయి మనం గతం తాలూకు విషయాలు గుర్తుకు రావటం భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలన్నీ ఇక్కడ రావటం ముందు వెనక్కి కాలంలో అవ్వగటం వల్ల ముందు వెనక ఊగుతున్నప్పుడు కర్మ రుణాలు తీర్చేసుకుంటున్నాం మనం ఒక మామూలు వ్యక్తి భూమిమీద పుట్టినప్పుడు అతని కాలాన్ని ఒక
(43:19) గీతలాగా అనుభవిస్తాడు. అంటే నిన్న ఈరోజు రేపు అలా ముందుకు వెళ్తూ ఉంటుంది జీవితం అలా మీరు జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మీకు కర్మ రుణాల్లో నుంచి మీరు బయటకి రాలేరు శూన్య స్థితుల్లో ఏమవుతుందంటే మీరు ఆ దుఃఖంలో బాధలో చాలా తీవ్రమైనటువంటి వ్యధ అనుభవిస్తున్నప్పుడు ముందుకు వెనక్కి కాలంలో వెళ్తూ ఉంటారు ఊగిసలాడుతూ ఉంటారు.
(43:43) స్వప్న స్తుతులు పెరిగిపోతాయి. స్వప్న స్తుతుల్లో కూడా మీకు గతం తాలూకు విషయాలు, గత జన్మల తాలూకాకు విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు కనిపించడం ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఆ జరిగినప్పుడు మీకు ఇక్కడ కర్మ రుణాలనేవి తీరిపోతున్నాయి. ఇక్కడ మీకు కాలం ఒక టైం లూప్ లాగా మీకు అనుభవంలోకి వస్తుంది. తిన్ననైన గీతలా కాదు.
(44:06) అంటే ఒక కాల చక్రం లాగా మీకు తోస్తుంది. మీకు ఆ చక్రం అన్న సంగతి మీకు అర్థమయ్యేసరికి మీ లోపల మీ ఆలోచనలు గాని మీ నమ్మకాలు గాని మీ ప్రవర్తనలు గాని ఏవైతే వలయాలుగా ఉన్నాయో ఆ వలయాల్లోనుంచి మీరు బయటకి ఈ శూన్య స్థితుల్లోనే రాగలుగుతారు. మామూలుగా అయితే మనం మన ఆలోచన వలయాల్లో విశ్వవలయాలు అయినా కూడా మనం వాటిలనే చెప్పుకొని ఉంటాం బయటకి ఎట్లా రావాలో మనకి అర్థం కాదు శూన్య స్థితుల్లో మనకి బయటకి వచ్చే మార్గం దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది మనం ఒంటరిగా ఉంటాం.
(44:41) మనం లోకంకి సంబంధం లేకుండా మనల్ని మనం దూరం పెట్టేసుకుంటాం అక్కడ మన లోపల చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా మన దేహంలో ప్రాణ ప్రవహించే విధానాలు మార్గాలు మారిపోతాయి. ఆ మార్పు అలా అయినప్పుడు ఏంటంటే మనం మన ఆలోచన వలయాలు ప్రవర్తన వలయాలు దాంట్లో నుంచి బయటకి రాగలుగుతాం అందుకనే చాలామంది శూన్య స్థితుల్లో వాళ్ళు వ్యసనాల నుంచి బయటకి వచ్చేస్తారు అంత క్రితం ఎన్ని సార్లు ప్రయత్నించిన వ్యసనాల నుంచి బయటికి రాలేని వాళ్ళు ఇక్కడ బయటకి వచ్చేస్తారు.
(45:14) ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దేహంలో మా శక్తి వేరే మార్గాల గుండా పనిచేస్తుంది. ఆ ప్రవాహం మారేసరికి వీళ్ళు ప్రవర్తన మారిపోతుంది. మనకి శరీరం మనసు ఈ రెండు రీస్ట్రక్చర్ అవుతాయి. ఇక్కడ మనకి ఇప్పుడు మన దృష్టి అంతా నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి నేను నా కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి అంటే అనవసరపు అలవాట్లకి దురలవాట్లకి దూరంగా ఉండి ఆ కాలాన్ని నేను సాధనకి పెట్టాలి యోగా నేర్చుకోవాలి నేను ఎక్సర్సైజ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే మన ధనాన్ని మన కాలాన్ని మన శక్తిని మంచి విషయాల మీదకి మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి వంటి
(45:59) విషయాల మీదకి ఇతరుల మంచికి కూడా పనికవచ్చేటట్టుగా మనం వాటిని వాడతాం. ఇప్పుడు దేన్ని మనం దుర్వినియోగం చేయం అన్నమాట. అది కాలమైనా ధనమైనా శక్తి అయినా ఫుల్ అయినా దీని మూలంగా మీరు కర్మ రుణాల్లో నుంచి ఇంకా తొందరగా బయటకి వచ్చేస్తారు. మిమ్మల్ని మీరు మీ నిజాన్ని మాట్లాడటం అనేది మీరు మీ శూన్య స్థితిలో నేర్చుకుంటారు భయాన్ని అధిగమించి మీ నిజం మాట్లాడటం మీ నిజం ఏంటో కూడా మీకు ఎందుకు అర్థం అవుతుంది అంటే మీరు మనస్సు లోతుల్లోకి ఈ శూన్య స్థితిలో వెళ్లారు కాబట్టి కొంతవరకు లోతుల్లో ఉన్న నేను ఏంటో నాకు అర్థం అయింది కాబట్టి నేను దాన్ని బయట
(46:37) లోకానికి ఎక్కువ వ్యక్త పరచగలుగుతాను కాకపోతే ఈ శూన్య స్థితుల్లోకి తదా ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి జరిగే కొన్ని అనుభవాలు ఉంటాయి చూడండి అవి ఎంత లోలోతుల్లో అవుతాయి అంటే వాటిని బయటకి వ్యక్తపరచడానికి కూడా మనకి భాష అనేది ఉండదు మనం మామూలుగా మాట్లాడే భాషలో ఈ అనుభవాలని మనం వ్యక్తపరచలేం చాలా కష్టం అయపోతుంది భాష పనికి రాదు ఇక్కడ అందుకనే మనం ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో చాలా లోతుల్లోకి వెళ్లి చాలా దశల్లో రకరకాల అనుభవించిన దాంట్లో కొంతమేరే మనం బయట లోకానికి చెప్పగలుగుతాం ఈ శూన్య స్థితుల్లో మనకి మన మీద మనకి పట్టు అనేది వస్తుంది మనసు మీద శరీరం మీద
(47:23) క్రమశిక్షణ సాధన చేయటం ఇవన్నీ మనకి శూన్య స్థితులు నేర్పిస్తాయి కూర్చుని రోజుకి గంట సేపు మంత్ర జపం చేయటం అనేది మీకు ఇక్కడ అంతకైతే మీకు చేతన అవ్వకపోవచ్చు నా వల్ల కాదని ఐదు నిమిషాలు కూర్చోలేను అనుకోవచ్చు ఈ శూన్య స్థితి మనల్ని ఎంత మార్చేస్తుంది అంటే మనం కూర్చుని అట్లా గంట సేపు అవలీలగా సాధన చేసేస్తాం. మన జీవితాన్ని మనం మార్చుకుంటాం ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది మనం సీతాక ఒక చిలకలా మారాం మారాం కాబట్టి మన జీవితం అది ఎటు వెళ్ళాలి ఆ జీవితం ఎలా ఉండాలి మనకి ఇక్కడ స్వతంత్రం ఎక్కువ ఉండటం మూలంగా మన జీవితాన్ని మనకు కావాల్సినట్టుగా మనం
(48:01) మళ్ళీ సృష్టించుకోగలుగుతాము ఇక్కడ మనం మనిషిగా మారిపోయి ఉన్నాం ప్రవర్తన మారిపోయిఉంది ఆలోచించే విధానం మారిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ పుట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ శూన్య స్థితులు అయిపోయాక మళ్ళీ ఒక ఆనంద స్థితుల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను నా నిజాన్ని మాట్లాడుతున్నాను. మనం ఎప్పుడు మన నిజాన్ని మాట్లాడినప్పుడు మన కర్మ రుణాల్లో పూర్వకం మనకి ఇంకా ఇంకా విడుదల వస్తూ ఉంటుందన్నమాట.
(48:28) కాబట్టి సువన్ సిద్ధి మనం అనుభవించినప్పుడు మనకి చాలా కష్టంగా అనిపించిన దాంట్లోనుంచి బయటికి వచ్చినప్పుడు మటుకు అది మనకి ఆనందంగా అనిపిస్తుంది. అది మనకి మంచి చేస్తుంది. పైగా శూన్య స్థితుల్లోనుంచి వెళ్ళందే మనకి ప్రక్రియ ముందుకు వెళ్ళదు ఇది అనివార్యం ఆధ్యాత్మిక ప్రక్రియ దశల్లో శూన్య స్థితి కచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ లోతుల్లో ఏముందో మనకి అంతా ఈ శూన్య స్థితిలోనే బయటకు వస్తుంది.
(48:59) మన గత జన్మ కర్మలు మన కర్మలు పూర్వీకుల కర్మలు అన్ని ఇక్కడే బయటిక వస్తాయి. ఈ అన్ని అనుభవిస్తూ ఈ బాధలు కష్టాల్లోనుంచి మన నిజాయితి కూడా బయటికి వస్తుంది. అయితే శూన్య స్థితి కూడా నేను చెప్పాను కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయేటప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అది వెళ్ళిపోతుంది అంటే ఉన్నట్టుండి మీకు ఆ బాధ దుఃఖం స్థితిలో ఏదో టక్కుమని ఒక మంచి శుభవార్తలు రావటం ఏదో కొత్త మార్గం వైపు మీ జీవితం వెళ్తోంది ఏదో కొత్త ఉద్యోగం రావటం కొత్త పరిస్థితి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి బయట ఏర్పడటం లేదంటే మళ్ళీ సింక్రనిసిటీస్ కనిపించటం మీకు లోపల ఆనందం కలగటం మీరేదో మారిపోయినట్టుగా
(49:44) మీరేదో కొత్త వ్యక్తిలా అయిపోయినట్టుగా మీకు అనిపించటం మీ శరీర స్పందన పెరగటం మీకు వైబ్రేషన్ నోట్లో తెలియటం మీకు ఎక్కువగా ఆరిక్ ఫీల్డ్ అనేది మీ దేహం చుట్టూ తిరుగుతుంది ఆరిక్ ఫీల్డ్ అనేది ఆ అంటే అది వ్యాన వాయువు మీకు గుండెలో మొదలై ఇలా పైట కేర్స్ వస్తుంది. రెండు ఇక్కడ వేళ్ళు పెట్టారంటే ఇక్కడ నుంచి బయటికి వస్తుంది.
(50:08) అది ఎక్కువ ప్రవహించడం అది ఎక్కువ ప్రవహించింది అంటే మీరు శూన్య స్థితుల్లో నుంచి బయటకు వస్తారు. అంతే కాకుండా మీ పాత జ్ఞాపకాలలో నుంచి కర్మ రుణాల్లో నుంచి మీకు అంతకత మీరు పని చేసే చోటు బాలేదు అనుకోండి చాలా తేలికగా ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళిపోగలుగుతారు ఆ మార్పులన్నీ ఇక్కడ టక టక టక అయిపోతాయి. సుల్లినిస్తులో నుంచి బయటికి రాంగానే అంతక్రిత మీకు ఏ దుక్కు తోచలేదు ఇప్పుడు టక్కుమని బోల్డ్ మార్గాలు తెరుచుకుంటాయి.
(50:35) ఇక్కడ మళ్ళీ మీకు కొత్త ఉత్సాహంతో జీవితంలోకి ముందుకు వెళ్తారు. మీ శరీరం మనసు కూడా ఒక ఆనంద స్థితిలోకి వెళ్తుంది. ఇది శూన్య స్థితులు అయిపోయేటప్పుడు మనలో వచ్చేటువంటి సూచనలు కానీ మళ్ళీ ప్రక్రియ ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రక్రియలో భాగంగా మళ్ళీ మీరు శూన్య స్థితిలోకి వెళ్ళొచ్చు ఆ వెళ్ళినప్పుడు ఏంటంటే గతం తాలూకు నేను అనేది వెళ్ళిపోవడం కొత్త నేను వచ్చే మధ్యలో ఉన్న చీకటి దశే ఈ శూన్య స్థితి ఉంటానండి నమస్కారం గారు

No comments:

Post a Comment