@RASALEELAA
6 hours ago
ఏదైనా వస్తువును నీ జీవితంలో ఆహ్వానం పలకాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనస్సులో విచారణ చేస్తే ఆ వస్తువు వలన ప్రశాంతత, ఆనందం వెళ్లకుండా చూసుకోవచ్చును.
ఆ వస్తువును కొనడానికి shop కి వెళ్ళినప్పుడు నాలుగు విషయాలు గుర్తించుకోవాలి.
1. ఈ వస్తువు ఇప్పుడు ఎలా ఉందో అదే విధంగా వస్తువు ఉన్నంత జీవితకాలము అటువంటి శ్రద్ధతో ఉపయోగించుకుంటాను. మొదటి రోజు ఎలా ఉపయోగిస్తానో, గుర్తించుకొని 10 వ రోజైనా, 100 వ రోజైనా, 1000 వ రోజైనా అదే విధంగా ఉపయోగిస్తాను.
2. ఈ వస్తువు repair వచ్చినప్పుడు వెంటనే బాగు చేస్తాను. బాగు చెయ్యడానికి వాయిదాలు వెయ్యను. రిపేర్ చేయకపోవడానికి సాకులు వెతకను.
3. ఈ వస్తువును ఎవరైనా నిర్లక్ష్యంగా దానిని పనికి రాకుండా చేసినప్పుడు వారు ఆ విధంగా ఎలా జరిగింది తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి. వెంటనే వారితో గొడవపడకూడదు. వారు accidental గా చేశారా! intentional గా చేసారా ! తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి. accidental గా జరిగితే మన్నించండి. intentional గా చేస్తే మీరు ఒక నిర్ణయానికి రండి. వారు మీరు చెబుతున్న విషయం అర్థం చేసుకుంటున్నారా! వింటున్నారా! లేదా మీతో వాదిస్తున్నారా అనే విషయాన్ని గుర్తించి మీరు నిర్ణయం తీసుకోవాలి.
4. ఒక వేళ ఆ వస్తువు నీ నుండి దూరం అయ్యినప్పుడు నీవు భాదపడుతున్నావా! అని అనిపిస్తే ఆ వస్తువును నీ జీవితంలోనికి ఆహ్వానం చేసే సమయం రాలేదని అర్థం. మనకు car drivining వచ్చునా రాదా అని driving test పెడుతారు. అదే విధంగా మనం పైన చెప్పిన 4 points లో ఉత్తీర్ణత సాధిస్తేనే మీరు ఆ వస్తువును కొనవలసి వస్తుంది.
ఈ క్రింది విషయాలు shop నుండి ఇంటికి వచ్చిన తరువాత ఒక వేళ ఇంటిలో ఆ వస్తువును ఇంక ఎవరైనా ఉపయోగించవలసి వస్తే నీకు అంగీకారమా అనే విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవలసి ఉంది.
ఆ వస్తువు కొన్న తరువాత ఇంటికి వచ్చిన తరువాత ఇంతక ముందు వస్తువులను ఉపయోగించినట్టే ఈ వస్తువును ఉపయోగించవలసి ఉంటుంది. ఈ వస్తువును ఏమైనా అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా అనే విషయం కూడా check చేసుకోవాల్సి ఉంది. ఒక వేళ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అయ్యితే ఆ వస్తువును ఉపయోగించడం వాయిదా వెయ్యడం మంచిది.
చివరిగా మీరు వస్తువుల మీద ఆధారపడటం పెరుగుతూ ఉందా! లేదా! మీరు ఉపయోగించే వస్తువుల సంఖ్య పెరుగుతూ ఉందా! తగ్గుతూ ఉందా! మీకు జీవితం మీద అవగాహన పెరిగే కొద్దీ ఉపయోగించే వస్తువులు, నీ జీవితంలోకి ఆహ్వానించే వస్తువులు తగ్గుతూ ఉన్నాయా లేదా అనే విషయం మీద దృష్టి పెట్టాలి. వస్తువు అవసరం కోసమా! ఆవశ్యకమా! ఆభరణం కోసమా అనే విషయం కూడా దృష్టి పెట్టాలి. ఇది మనకు వస్తువులకు సంబంధించిన సంబంధం గురుంచి అవగాహన తెలుసుకొని పిల్లలకు తెలిసేటట్టు ప్రయత్నం చెయ్యాలి. పెద్దలకు చెబితే వారు వినకపోవచ్చు. మీరు పిల్లలకు చెబితే చక్కగా వింటారు. వస్తువుల స్థలంలో మనుష్యులను పెట్టి చూసినా మీకు కొంత సమాధానం దొరుకుతుంది. ఆభరణం కోసం కొంటే మాత్రం అశాంతిని మీరు ఆహ్వానం పలికి నట్టే.
No comments:
Post a Comment