Friday, August 21, 2026

 *🙏🕉️స్వామి సన్నిధిలో పురుషోత్తమానంద!!!*

*"భగవాన్ బాబావారు కొందరు భక్తులతో కలసి స్వామిశివానంద ఆహ్వానాన్ని మన్నించి హృషీకేశ్ వెళ్ళి, రుద్రాక్షమాల సృష్టించి శివానందకు ఇచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించి, నడవ గల్గే శక్తిని ప్రసాదించారు. అక్కడినుంచి వశిష్ట గుహలోనికి వెళ్ళి పురుషోత్తమానంద మహర్షికి దర్శనం ప్రసాదించారు. కొంత సేపటికి వెంటగిరి వాస్తవ్యుడు, అడ్వకేట్ సుబ్బరామనాయుడు, స్వామి ఇంకా రాలేదని గుహదగ్గరకు వెళ్ళి తలుపు సందులోనుంచి చూశాడు. పురుషోత్తమానంద ఒడిలో భగవాన్ తలపెట్టుకొని పవళించి ఉన్నారు. శ్రీ సత్యసాయి నాధుని శరీరం దివ్యకాంతులతో జ్యోతిర్మయమై భాసించింది. ఆ గుహ అంతా కాంతిమండలం అయింది. తరువాత బాబావారి సంభాషణలో పురుషోత్తమానందకు పద్మనాభస్వామి అంటే చాలా ఇష్టమని అందువల్ల ఆ వృద్ద తపస్వికి భగవాన్ బాబా పద్మనాభస్వామి దర్శనమనుగ్రహించారని తెలిసింది. "ఈనాడు నేను నిజంగా పురుషోత్తముని దర్శించుకున్నాను నా జన్మ తరించింది” అన్నారు, ఆనంద బాష్పాలతో పురుషోత్తమానంద. వచ్చేటప్పుడు స్వామి ఒక చీటి ఇచ్చి ఫలానారోజు ఫలానా టైమ్కు వస్తాను అని వ్రాసి పురుషోత్తమానంద చేతికిచ్చారు. చెప్పిన సమయానికి ఆయన ఎదుట బాబావారు సాక్షాత్కరించారు. స్వామిని చూస్తూ ఆయన, స్వామిలో ఐక్యం చెందారు. అప్పుడు "పురుషోత్తమానంద మీలో చేరిపోయాడు" అని ఆయన శిష్యులు బాబాకు టెలిగ్రాం ఇచ్చారు."*  
 *"~భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు @ సనాతన సారథి_01/2013 ."*

No comments:

Post a Comment