365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో
♥️ *కథ* - *93* ♥️
చదివే ముందు... మెల్లగా కళ్లు మూసుకోండి... దీర్ఘంగా శ్వాస తీసుకోండి... మీ మనసు లోతుల్లో అనంతమైన శాంతిని అనుభూతి చెందండి... చదవడం కొనసాగించండి...
*శాంతిని* *అనుభూతి* *చెందటం*
ఒకసారి గౌతమబుద్ధుడు తన దైనందిన పనులు ముగించుకుని శిష్యులందరికీ సందేశం ఇస్తున్నాడు. అతను ఇలా అన్నాడు, "ఈ రోజు అన్నీ ఉన్నప్పటికీ, ఆనందంగా లేని ఒక వ్యక్తి కథ నేను మీకు చెప్పబోతున్నాను”.
ఒక నగరంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి లక్షల్లో ఆస్తి ఉంది. చాలా పెద్ద భవనం ఉంది, అందులో ఒక సేవకుల బృందం కూడా ఉంది. అయినా అతనికి మనశ్శాంతి లేదు. సమీపంలోని పట్టణంలో, ప్రజలు కోరుకున్నవన్నీ పొందగలిగేలా వారిని నైపుణ్యులుగా చేసే ఒక ఋషి గురించి ఎవరో అతనికి చెప్పారు.
అతను ఆ మహర్షి వద్దకు వెళ్లి, ఆయనకు నమస్కరిస్తూ, "అయ్యా, నా వద్ద డబ్బుకు కొరత లేదు, అయినా నా మనస్సు చాలా వ్యాకులంగా ఉంది. దయచేసి శాంతిని పొందే మార్గాన్ని సూచించండి" అని అభ్యర్థించాడు.
ఆ మహర్షి తనకు పెట్టుకోవడానికి ఏదైనా తాయెత్తు ఇస్తాడనీ, లేదా తన కోరిక తీరడానికి మరేదైనా చేస్తాడనీ, తన మనసుకు శాశ్వతంగా శాంతి చేకూరుతుందని అనుకున్నాడు. కానీ ఋషి అలాంటిదేమీ చేయలేదు. అతను కేవలం నవ్వి, “దయచేసి కొన్ని రోజులు ఇక్కడే ఉండు” అన్నాడు.
మరుసటి రోజు, ఋషి ఆ ధనవంతుడిని రోజంతా ఎండలో కూర్చోబెట్టాడు, తను మాత్రం తన గుడిసెలో నీడన కూర్చున్నాడు. అది వేడిగా ఉన్నవేసవి రోజు. ఆ వేడి భరించలేనంతగా అవుతున్న కొద్దీ అతనిలో కోపం పెరిగిపోతోంది. కానీ ఏదో ఒకవిధంగా తనను తాను నియంత్రించుకొని శాంతపరచుకోగలిగాడు.
ఒకసారి లేచి వెనక్కి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ తర్వాత ఎలాఅయినా ఒకసారి ప్రయత్నించాలని అనుకుని, ఆగాడు. ఎందుకంటే అతను తన అంతర్గత గందరగోళం, అశాంతితో చాలా బాధపడుతున్నాడు.
మరుసటి రోజు ఋషి అతనితో, "ఈ రోజు నీకు రోజంతా ఆహారం లభించదు" అని చెప్పాడు. ధనవంతుడు ఆకలితో చాలా అశాంతికి గురయ్యాడు. ఋషి ఎదురుగా కూర్చుని రకరకాల వంటకాలు తిన్నాడు కానీ, అతనికి ఒక అన్నం మెతుకు కూడా ఇవ్వలేదు.
ధనవంతుడు చాలా కలత చెందాడు, రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఆ మహర్షి అంత హృదయం లేకుండా ఎలా ఉన్నాడా అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఇంక ఉండలేక వెళ్ళిపోదామని మూడవరోజు అన్నీ సర్దుకుని బయల్దేరబోతుండగా ఋషి వచ్చి ఎదురుగా నిలబడి “ఏమైంది?” అని అడిగాడు.
దానికి ధనవంతుడు "మీ మీద ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఏమీ లభించలేదు, బదులుగా, నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని కష్టాలను భరించవలసివచ్చింది, నేను బయలుదేరుతున్నాను."
దానికి మహర్షి, ‘‘ఒక్క క్షణం ఆగి ఆలోచించు... నీకు చాలా ఇచ్చాను కానీ నువ్వు ఏమీ తీసుకోలేదు. ధనవంతుడు ఆశ్చర్యంగా మహర్షి వైపు చూసి, "ఇబ్బంది కలిగించావు తప్ప నాకు ఏమి ఇచ్చావు?" అని అడిగాడు.
సన్యాసి ఇలా అన్నాడు, " నిన్ను ఎండలో కూర్చోబెట్టి, నేను నీడలో కూర్చునప్పుడు, నేను నీడలో కూర్చోవడం వల్ల నీకు ప్రయోజనం ఉండదని అనుభూతిని కలిగించాను. ఇది నీకు అర్థం కానప్పుడు, మర్నాడు నిన్ను ఆకలితో ఉంచి, నేను చాలా బాగా తిన్నాను, దీని ద్వారా, నేను బాగా తినడం వల్ల నీ కడుపు నిండదని నీకు తెలియజేయడానికి ప్రయత్నించాను. అలాగే, నా సాధన, ధ్యానం వలన నీకేమి సిద్దించదని గుర్తుంచుకో. నీ స్వంత కృషి ద్వారా డబ్బు సంపాదించావు.
అదేవిధంగా, నీవు నీ స్వంత చిత్తశుద్ధి, ధ్యానం, సాధన ద్వారా మాత్రమే శాంతిని పొందగలవు."
మనం కొన్ని క్షణాలు ఆగి, మన హృదయంపై ధ్యానించినప్పుడు, అప్పుడు మనం నిజమైన శాంతిని అనుభవించగలుగుతాం. ఎలాంటి బాహ్య సాధనాలు మనకు శాంతిని కలిగించలేవు!
ధనవంతుని కళ్ళు తెరుచుకున్నాయి, అతను నిజమైన శాంతికి మార్గాన్ని తెలుసుకున్నాడు.
♾️
ఆనందం బాహ్యకారణాలపై ఆధారపడి ఉండదు. ఆనందానికి సంబంధించిన ఈ బాహ్య వనరులపై మన ఆధారపడటాన్ని మరింత స్థిరమైన సంతోషంతో మనం సమతుల్యం చేసుకోవాలి. 🌼
దాజీ
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment