Friday, August 21, 2026

అఘోరులు అసలు ఎవరు? 😱 వారి జీవితం, భస్మం, శ్మశాన సాధన వెనుక ఉన్న రహస్యం | Aghori Secrets

అఘోరులు అసలు ఎవరు? 😱 వారి జీవితం, భస్మం, శ్మశాన సాధన వెనుక ఉన్న రహస్యం | Aghori Secrets

Author Name:The lyfe of Rag's🌀

Youtube Channel Url:https://www.youtube.com/@raghavsivam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hwc_4fTYBMU



Transcript:
(00:01) ఒక మనిషి ఇంట్లో మంచం ఉండి కూడా నేల మీద పడుకుంటాడు. చేతిలో డబ్బు ఉన్నా దాచుకోడు చుట్టూ మనుసులు ఉన్నా ఒంటరిగా ఉంటాడు. శరీరాన్ని అలంకరించుకోవాల్సిన చోట భస్మంతో కప్పుకుంటాడు. భయపడే స్మశానాన్ని తన సాధన స్థలంగా ఎంచుకుంటాడు. ప్రపంచం దూరంగా పెట్టే విషయాలను అతను భయపడకుండా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు ఎందుకు? అతనికి జీవితం మీద విరక్తి వచ్చిందా లేదా అతను మనకు అర్థం కానీ ఒక సత్యాన్ని వెతుకుతున్నాడా ఇంకా ఒక ప్రశ్న ఒక మనిషి తన జీవితాన్ని ఇంత కఠినంగా మార్చుకోవడానికి ఏ శక్తి కారణం అవుతుంది సమాధానం ఒక్కటే అని అఘోర సంప్రదాయం
(00:41) చెబుతుంది. దానికి కారణం శివుడు కానీ శివుడికి పూజించడానికి ఇంత కష్టం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అంటే ముందుగా ఒక అఘోర శరీరంపై ఉన్న ఆ భస్మాన్ని అర్థం చేసుకోవాలి. భస్మం అలంకరణ కాదు ఒక జ్ఞాపకం మనిషి ఉదయం అద్దంలో చూసుకునేది తన ముఖాన్ని అఘోర మాత్రం తన శరీరం చివరి వరకు ఏమవుతుందో గుర్తు చేసుకుంటాడు.
(01:10) భస్మం అందుకే కొన్ని అఘోర సంప్రదాయాల్లో భస్మాధారణకు ఇంత ప్రాధాన్యం ఉంటుంది. ఇది నేను భయంకరంగా కనిపించాలి అనే ఉద్దేశంతో కాదు ఒకప్పుడు బలమైన శరీరం ఒకరోజు బూడిదిగా మారుతుంది. ఈ నిజాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవడం ద్వారా శరీరంపై ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవాలనే భావన ఇందులో ఉంటుంది. మనిషి తన అందం గురించి గర్వపడతాడు. తన డబ్బు గురించి గర్వపడతాడు.
(01:37) తన స్థానం గురించి గర్వపడతాడు. కానీ భస్మం ఒక్కటే చెబుతుంది. ఇవన్నీ శాశ్వతం అనేవి కావు. అందుకే అఘోరి శరీరంపై ఉన్న భస్మాన్ని చూసి వింతగా అలంకరించుకున్నాడు. అని అనడం కంటే శరీరం శాశ్వతం కాదని విషయాన్ని ఎందుకు ఇంత దగ్గరగా ఎంచుకున్నాడు అని మనం ఆలోచించాలి. మరి మనలో చాలామంది జుట్టును స్టడీ చేసుకుంటాం. కానీ సాధువు తన జుట్టును అలంకరణ కోసం కాకుండా వైరాగ్యానికి సంబంధించిన గుర్తుగా ఎంచుకోవచ్చు.
(02:10) జట్టులు పెంచుకున్నంత మాత్రాన ఎవర అఘోరి అయిపోరు. అది ఒక బాహ్య రూపం మాత్రమే అసలు విషయం జుట్టు కాదు మనసు ఎంతగా ప్రపంచపు అలంకారాణల నుంచి వెనక్కి వచ్చింది. అదే ఇక్కడ వీడియోలో ఇప్పుడు మనం అఘోరుల గురించి ఎక్కువగా భయపడే విషయం దగ్గరకు వచ్చాం. స్మశానం రాత్రి స్మశానం పేరు వినగానే చాలామందికి భయం కానీ ఒకసారి ఆలోచించండి అక్కడ మనిషి జీవితంలో అత్యంత నిజమైన విషయం కనిపిస్తుంది.
(02:45) డబ్బున్న వాడైనా పేదవాడైనా అందమైన వాడైనా సాధారణమైన వాడైనా చివరికి శరీరానికి ఒకటే గమ్యం ఒకటే స్థానం స్మశానం అందుకే కొన్ని అఘోర సాధన సంప్రదాయాల్లో స్మశానం మరణాన్ని గుర్తు చేసే స్థలం మాత్రమే కాదు భయాన్ని ఎదుర్కొనే సాధనా స్థలంగా భావించబడుతుంది ఒక అఘోరికి మనిషి సాధారణంగా మరణం గురించి ఆలోచించకుండా జీవిస్తాడు అఘోర సాధకుడుమాత మాత్రం నేను ఒకరోజు చనిపోతాను అనే సత్యాన్ని ఎదురుగా పెట్టుకొని జీవించడానికి ప్రయత్నిస్తాడు.
(03:20) ఇక్కడే అఘోర సాధన యొక్క కఠినత మొదలవుతుంది. కఠోర సాధన అఘోరహలు అసలుకి ఎందుకు తీసుకుంటారు? కఠోర సాధన అంటే కేవలం శరీరానికి బాధ కలిగించడం మాత్రమే కాదు అసలు కష్టం మనసును ఎదుర్కోవడం. నిశబ్దంతో కూర్చుంటే మనలోని ఆలోచనలు బయట పడతాయి. ఒంటరిగా ఉంటే మన భయాలు బయటపడతాయి. సౌకర్యాలు తగ్గితే మన కోరికలు బయటపడతాయి.
(03:49) మరణాన్ని దగ్గరగా చూస్తే మన జీవితంపై ఉన్న అహంకారం బయటపడుతుంది. అందుకే సాధన యొక్క అసలు పోరాటం బయట ఉన్న ప్రపంచంతో కాదు తనలో ఉన్న మనసుతో ఆ మనసుతోనే మనం కోరికలు ఆశలు పెట్టుకొని ఈ జీవితపు మాయలో పడి చిక్కుకొని ఊగిసలాడుతూ ఉంటాం. మనుషులకు దూరంగా అందుకే ఈ అఘోరీలు ఉంటారు. ఇది కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం మనమైతే అఘోరులు మనుషులను ఇష్టపడరు అని అనుకోవడం సరైన పద్ధతి కాదు అసలు ఆలోచనే కాదు అందరూ ఒకేలా ఉండరు కదా వైరాగ్య జీవితం ఎంచుకున్న సాధువుకు సామాజిక జీవితం కుటుంబ బంధాలు, ఆస్తి, పేరు, ప్రతిష్ట వంటి విషయాల నుంచి దూరంగా ఉండడం సాధనలో భాగం కావచ్చు ఎందుకు?
(04:34) ఎందుకంటే మనిషికి అత్యంత బలమైన బంధం ఏది అంటే నాది అనే భావం నా ఇల్లు నా డబ్బు నా పేరు నా కుటుంబం నా గరువు ఈ నా అనే భావాన్ని తగ్గించుకోవడం వైరగ్యానికి ఒక ముఖ్యమైన అంశంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే కొందరు సాధువులు సమాజానికి దూరంగా జీవిస్తారు అది మనుషుల మీద ద్వేషం కావాల్సిన అవసరం లేదు ప్రపంచ బంధాల నుంచి తన మనసును వెనక్కి తీసుకోవడం కావచ్చు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మధ్య కలియుగంలో మనుషుల మధ్య ఉండాలి అంటే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఒక మనిషిగా మారాలి న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి అనుకున్న మనిషి నాలుగు గోడల మధ్య
(05:21) ఉంటేనే తను ప్రశాంతంగా ఉండగలడు ఇక్కడికు వస్తే అఘోరి జీవితంలో మరో ముఖ్యమైన విషయం అనేది కనిపిస్తుంది. శివనామం దగ్గర శివనామ స్మరణ శివుడు వారికి కేవలం ఒక దేవత కాదు వారి సాధనకు కేంద్ర బిందువు మంత్ర జపం, ధ్యానం, తపస్సు, గురుసేవ, వైరాగ్యం ఇవన్నీ వారి సంప్రదాయాన్ని బట్టి శివ సాధనలో భాగమవుతాయి.
(05:47) ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం అనేక శైవ సంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైనది. అయితే ప్రతి అఘోరి రోజంతా ఒకే మంత్రాన్ని ఒకే విధంగా జపిస్తాడని ఎవరూ చెప్పలేరు. గురుం పరంపరను బట్టి సాధన మారవచ్చు. ఆహారం కూడా అఘోరి ఎందుకు కఠినంగా ఉంటుంది అంటే మనిషికి మొదట అవసరాల్లో ఒకటి ఆహారం అందుకే ఆహారం మీద నియంత్రణ కూడా సాధనలో ఒక భాగం కావచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద అపోహ ఉంది.
(06:17) అఘోరి అంటే మానవ మాంసం తినేవాడు అని సోషల్ మీడియాలో చాలా కథలు తిరుగుతున్నాయి. ఇది అందరూ అఘోరుల గురించి చెప్పగలిగే నిజం అయితే కాదు వారి ఆహారం ఒకేలా ఉండదు. కొంతమంది సాధువులు సాధారణ నిరాడంబరమైన ఆహారం తీసుకుంటారు. కొన్ని తాంత్రిక సంప్రదాయాల్లో సాధారణ సమాజం నిషేధంగా చూసే కొన్ని విషయాలలో సంబంధం ఉన్న ఆచారాల గురించి వర్ణనలు ఉన్నాయి.
(06:44) కానీ ఒక విషయం మాత్రం గుర్తు చేసుకోవాలి సినిమాలో చూపించే ప్రతి భయంకరమైన దృశ్యాన్ని అఘోర సంప్రదాయం మొత్తాన్ని వర్తింప చేయడం అనేది తప్పు వారు ఎందుకు ఇంత కఠినంగా జీవిస్తారు అనే దానికి సమాధానం ఇది మొత్తం వీడియోలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న అనేది ఎందుకు ఎందుకంటే సాధారణ మనిషి జీవితంలో సుఖం కావాలి గౌరవం కావాలి డబ్బు కావాలి భద్రత కావాలి కుటుంబం కావాలి ఆస్తి కావాలి రేపటి గురించి భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఉంటాయని ఇవన్నీ ఎక్కడ మిస్ అవుతాయో ఇవన్నీ ఎక్కడ ఎవరు ఎత్తుకుపోతారో ఇవన్నీ తనకు దూరమైతే తాను ఎంత బాధపడతాడు అని చెప్పేసి అక్కడే ఆ
(07:21) పాయింట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అఘోర సాధకుడు మాత్రం తన సాధన ద్వారా నాకు అనవసరమని నేను అనుకునే వాటిలో నిజంగా ఎంత అవసరం ఉంది అని ఆలోచిస్తాడు. అతను సౌకర్యాన్ని తగ్గించుకుంటే అది సౌకర్యాన్ని ద్వేషించడం కోసం కాదు సౌకర్యం లేకపోయినా మనసు ప్రశాంతంగా ఉండగలదా అని తెలుసుకోవడానికి ఇంతవరకు అఘోరల గురించి విన్న తర్వాత వారి భస్మం భయంకరంగా కనిపించకపోవచ్చు వారి జఠలు వింతగా కనిపించకపోవచ్చు స్మశానం ఎందుకు ఎంచుకున్నారో కొంత అర్థమవుతుంది ఒంటరితనం ఎందుకు ఎంచుకున్నారో అర్థమవుతుంది.
(08:00) కఠిన సాధన ఎందుకు చేస్తారో అర్థమవుతుంది. ఎందుకంటే అఘోర మార్గం బయట కనిపించేది ఒకటి లోపల వెతికేది మరొకటి బయట భస్మం లోపల అనితీయత బయట స్మశానం లోపల మరణ భయాన్ని ఎదుర్కోవడం బయట ఒంటరితనం లోపల తన మనసును ఎదుర్కోవడం బయట వైరాగ్యం లోపల నా అనే భావన తగ్గించుకోవటం నాది అనే భావాన్ని తగ్గించడం బయట శివనామం లోపల శివతత్వాన్ని అనుభవించ చాలనే తప్పన అందుకే అఘోరిని అర్థం చేసుకోవాలి అంటే అతను రూపాన్ని చూడకండి అతను ఎందుకు ఆ రూపాన్ని ఎంచుకున్నాడు ఆ విధంగా కఠినంగా ఎలా ఉన్నాడు అని అర్థం చేసుకుంటే అతని గురించి
(08:46) మనకు పూర్తిగా అర్థమవుతుంది. అక్కడి నుంచి అఘోర మార్గం అసలు కథ అనేది మొదలవుతుంది. కానీ ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అఘోరులు ఎందుకు కపాలాన్ని ఉపయోగిస్తారు? ఆ కపాలం కేవలం ఒక భయంకరమైన వస్తువే కదా మరి కపాలం చూస్తే మనలో చాలా మందికి భయమేస్తుంది అవునా నాకు వచ్చిన సందేశం కూడా అదే అసల కపాలాన్ని అఘోరులు ఎందుకు ఉపయోగిస్తారు నాకు ఎవరో ఒక మనిషి చెప్పినట్టు గుర్తు ఈ కపాలంలో నీళ్లు పోసుకొని నీళ్లు తాగుతారంట ఆ నీళ్లు తాగితే ఇవాళ్ళకి ఏదో శక్తులు వస్తాయని నేను విన్నాను కానీ దాని వెనక శివతత్వానికి సంబంధించిన ఒక లోతైన అర్థం
(09:24) ఉందా అనేది నేను తెలుసుకోవాలి ఇంకా కొన్ని అఘోర సాధనలో చెప్పబడే కపాల సాధన శివ సాధన భైరవ సాధన అసలు ఇవన్నీ ఏంటి అని తెలుసుకుంటే అఘోరుల గురించి మనకు ఉన్న చాలా అపోహలు తొలగిపోతాయి. ఇదే తర్వాత భాగం ఓం నమఃశివాయ

No comments:

Post a Comment