Friday, August 21, 2026

Dr. Varaprasad Reddy Podcast | Telugu Adda Episode -23 | Pamidikalva Madhusudan || Dhatri TV

Dr. Varaprasad Reddy Podcast | Telugu Adda Episode -23 | Pamidikalva Madhusudan || Dhatri TV

Author Name:Dhatri TV

Youtube Channel Url:https://www.youtube.com/@dhatritvtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UqsVxiJvEWw



Transcript:
(00:00) వరంగల్ హైవే కు దగ్గర్లో కే వైకే కే టెంపుల్ టూరిజం కారిడార్ ప్లాట్స్ ఇప్పుడే మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి. [సంగీతం] మీరు ఒక అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు సవాలుగా ఎలా నిలబడ్డారు? [సంగీతం] స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉన్న మనిషికి చిన్న బిడ్డకి వ్యాక్సిన్ ఇస్తున్నాం హెపటైటిస్ నేను రోగం ఉండి కాదు [సంగీతం] భారతీయ విద్యా వ్యవస్థ మీద చాలా ఆవేదనగా చాలా బాధగా కోపంగా కూడా మాట్లాడుకుంటారు ఎందుకు అంత తీవ్రత
(00:49) మన స్కూళ్లలో చదువే చెప్తున్నారు చదువుతో పాటు సంస్కారం చెప్పడం [సంగీతం] భర్తే దైవం అని భర్త సతీ సగమనం చేసిన దేశంలో భర్తని చంపేయాలని కూర్చున్నటువంటి పెళ్ళ తయారయిందంటే ఏమని చెప్పారు ఇవంతా మోసం తగా సామాన్య మానవుడికి టోపీ ఇది ఇవి పోతే గాని ఈ అసలు జోద జోదరులుగా తయారు చేసేటువంటి తత్వం బహుశా మహాభారతం తెచ్చుకున్నారు [సంగీతం] నమస్తే ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం.
(01:32) శాంతా బయో వరప్రసాద్ రెడ్డిగా లోకానికి పరిచయమైన వరప్రసాద్ రెడ్డి గారు ఫార్మా లేక పారిశ్రామిక వేత్త నుంచి ఇంకొద్దిగా పక్కక వస్తే ఆధ్యాత్మిక భాష సాంస్కృతిక వ్యవహారాలు మన దేశంలో చదువుకుంటున్న పద్ధతి మనకు నిజానికి ఏం కావాలి యువత ఉద్యోగాలు వాళ్ళ అలవాట్లు ఇలా దేశానికి మన తెలుగు సంస్కృతికి సంబంధించిన లోతైన అవగాహన వాటిలో మమేకమై అనేక దశాబ్దాలుగా కార్యక్రమాల్లో తలమనుకలుగా ఉన్న ప్రసాద్ రెడ్డి గారితో కొంత ఫార్మా గురించి మిగతావి ఆయనకు చాలా అత్యంత ఇష్టమైనవి లోకానికి ఈ రోజుల్లో అవసరమైన
(02:18) విషయాలు మాట్లాడదాం. నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం నాకు దాదాపుగా మీరు మూడు దశాబ్దాలుగా పరిచయం మిమ్మల్ని నేను ఎక్కడ చూసినా పారిశ్రామిక సదస్సులు లేక ఫార్మా వాటికంటే కూడా ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలు లేదా భాషకు సంబంధించిన పుస్తకావిష్కరణ ఇలాంటి వాటిల్లో కలుస్తూ ఉంటారు.
(02:41) కానీ మీ ఇంటి పేరే శాంతా ప్రసాద్ రెడ్డి అయ్యారు కాబట్టి అసలు ఇప్పటికీ నాకు అర్థం కాంది నేను బిజినెస్ లో అంత లోతుగా లేను మీ చేతిలో ఇంకా శాంత సంస్థ ఉందా లేక అందులో ఇప్పుడు ఎవరైనా వేరేవాళ్ళు ఉన్నారా శాంత ప్రారంభకుడిగా ఒక చరిత్ర శాంతాల కొనసాగింపుగా ప్రస్తుత చరిత్ర కొనసాగింపే కొనసాగింపు అంటే నేను దాని యాజమాన్య స్థితి లో లేను దానికి ఒక అలంకార ప్రాయంగా ఒక చైర్మన్ పదవిలో ఉన్నాను మొదటినుంచి అది కొనసాగిస్తున్నారు అందుకనే కొనసాగింపు అన్నాను నాకు దాని మీద పట్టు కోల్పోయింది మల్టీనేషన్స్ వచ్చినప్పుడే అంటే మెజారిటీ
(03:26) షేర్ వాళ్ళదయింది తక్కువ షేర్స్ నాదైనాయి నిర్ణయాధికారాలు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి ఒక్క భారతదేశం వరకు నా అనుమతితో వాళ్ళు వ్యవహరించేవాళ్ళు తక్కువ ఖరీదులు ఇవ్వాలని సంకల్పాన్ని వ్యవహరించే వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు కాదు ప్రెసెంట్ టెన్స్ కాదు కాదు 10 ఏళ్ల వరకు వాళ్ళు పాటించారు మల్టినేషన్స్ తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా అయ్యారు నాకు మనస్కరించలేదు వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్దేశం కూడా కొనసాగించాలని కాదు కొంతకాలం వాళ్ళకి వస్తున్నటువంటి పోటీ నుంచి తట్టుకోవడానికి ఒక ఆయుధంగా వాడారు.
(04:01) ఓహో అంటే మీరు పోటీ అని తెలిసి మీ పరిశ్రమలోనే డబ్బులు పెట్టి దాన్ని తొక్కేయడమా అంటే దాన్ని ఆ పోటీ నుంచి నివారించగలిగే పద్ధతులు ఎన్నుకున్నారు వాళ్ళు చేశారు వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళకి ఆ విజయాన్ని చేకూర్చినటువంటి ఘనత మన ప్రభుత్వాలదే ఓ ఎఫ్డిఐ అని ఉంటుంది మీకు తెలుసు అవును ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మొదట్లో కొంత పర్సెంట్ తక్కువ ఉండేది 40 ఉండేది కాలక్రమంలో 40 నుంచి 50 50 నుంచి 75 ఇప్పుడు ఇప్పుడు 100% అంటే ఏ మల్టీనేషనల్ కంపెనీ అయినా ఎవడైనా విదేశీయుడైనా మన సంస్థ మన దేశంలో ఉన్నటువంటి సంస్థ బాగుంది పచ్చగా చక్కగా చల్లగా ఉందంటే
(04:42) వచ్చి కొనేయొచ్చు వాడికి అనుమతులు అక్కర్లేదు. అలాంటి స్థితిలో ఉన్నాం ఇవాళ మనం కాబట్టి మనకు మేధోపరమైనటువంటివి దేశానికి అనుగుణమైనటువంటివి అవసరమైనటువంటివి అలాంటి కంపెనీలు ఉంటే వ్యూహాత్మకంగా దాన్ని ఎవరనా కొనేసి అలాంటి పరిస్థితి లేకుండా చేయవచ్చు. ఇది మనం మన ప్రభుత్వాలు చేసుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి చర్య.
(05:08) మీ మాటల్లో చాలా గౌరవంగాను స్పష్టంగా చెబుతున్నారు కానీ దాని మధ్యలో అంతులేని ఆవేదన వైరాగ్యం అవి బాధ ఆవేశం ఆ నేను చాలా ఆవేశాలు నడుచుకున్నాను కాబట్టే డయాబెటిక్ అయ్యాను [నవ్వు] కొనితెచ్చుకున్న జబ్బు అది ఓకే సో నేను ఇప్పుడు నా మీద గౌరవం కొద్ది ఐ ది ఫేస్ ఆఫ్ ది కంపెనీ నమ్మినటువంటి వాళ్ళు సార్ మీరే ఉండండి చైర్మన్ గాను అంటారు కానీ దాని మీద నిర్ణయాధికారాలు నాకేమీ లేవు నేను ఒక గైడింగ్ ఫోర్స్ గా ఉంటాను వాళ్ళకి చెప్తాను కొన్ని వింటారు కొన్ని వినరు.
(05:44) అయితే ప్రేక్షకులకు తెలియాలి మీరు ఒక అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు సవాలుగా ఎలా నిలబడ్డారు నేనంత ధీరుడిని కాదు వీరుడిని కాదు సినిమాటిక్ హీరోని కాదు కానీ ఎవ్వడైనా గాని మనకేదో సామెత ఉంది పిలినైనా గోడకేసి నెట్టితే పులి అయిపోతుందిని వాళ్ళు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశరు మల్టివేషన్స్ ఆ కారణంతో అసలు నాది ఫార్మా రంగం కాదు నా నేపథ్యం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నేను దాంట్లోనే ఉద్యోగం కూడా చేశాను డిఫెన్స్ లో చేసింది అదే స్టేట్ గవర్నమెంట్ లో వచ్చి ఇండస్ట్రీస్ ప్రమోషన్ లో కూడా చేసింది ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ే తర్వాత ఫస్ట్ ఎంట్ర్ప్రనర్ గా మారినప్పుడు
(06:24) హైదరాబాద్ బ్యాటరీస్ లో చేసింది కూడా బ్యాటరీస్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఈ శాంత అన్న దానికి ఆ పుట్టుకకు కారణం ఒక అంతర్జాతీయ సదస్సులో మన దేశం గురించి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాది నేనేతల గురించి మనకు పిల్లల పట్ల మనకు ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణను బట్టి మనం మనకున్న సాంకేతికత వెనకబాటుతనం గురించి చాలా తూష్ణీ భావంతో మాట్లాడినప్పుడు చాలా భయంకరంగా అవమానంగా మాట్లాడినప్పుడు కొన్ని ఇతర దేశాలతో పాటుగా అంటే మనం ఏ బ్రాకెట్ లో ఉన్నామ అంటే శ్రీలంకన్ మయన్మార్ నేపాల్ అలాంటి దేశాలతో కలిపి భారతదేశం కూడా కలిపి వీళ్ళు వీళ్ళు బెగ్గింగ్ పోల్తో భిక్షాపా
(07:11) భిక్షా పాత్ర పట్టుకొని వస్తారు ఎంతకాలం వీళ్ళని కాపాడాలి మనం అది మీ మనసుకు గుచ్చుకుంది అది గుర్్చుకుంది గుర్చుకున్నాక అదది నేను బాధపడి ఇలా అనడం బాగాలేదు అనుకొని ఇండియాక వచ్చి ఇది నేను ఇంతర్జాతీజం డబ్ల్యూహెచ్ఓ సమ్మిట్ ఇది జెనీ వాళ్ళు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్టాల్వర్డ్స్ అప్పటికే ఆ రంగంలో మహా నిష్నాతులు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళకి లేరు ఎందుకు వాళ్ళ గురించి కానీ వచ్చి వాళ్ళని అడిగాను చేయండి చేయండి అని వాళ్ళు వాళ్ళు మన దేశంలో బయోఫార్మా లేదు ఇంతవరకు బయోటెక్నాలజీ రంగంలో మనం చాలా వీకే ఇప్పటలో కాదది మనకు టైం పడుతుంది నువ్వు
(07:48) ఎందుకు ఆవేశపడతావ్ ఏదో అంటారు టేక్ ఇట్ ఈజీ అన్నారు నాకు అలా అనిపించలేదు. ఒకటి అవమానం భరించడం కష్టం రెండోది మన దేశంలో మీద లేదు అనుకోనే భావన నాకు లేదు నాకు మొదటినుంచి ఒకటే నమ్మకం దీని ఈ నేల నాగరికత కొన్ని వేల సంవత్సరాలు అవును ఆల్రెడీ ఎవాల్వ్డ్ ఈ మేదస్సులో ఎవరికీ మనం తక్కువ కాదు ఎంద ఇతర దేశాలకి యూనివర్సిటీలు చూపించింది మనం మ్యాథమటిక్స్ గాని ఇక ఖగోళ శాస్త్రం గాని అన్ని లెక్కలు చెప్పింది మనం ఇలాంటి దేశంలో మీరు లేదు అనుకోవడం తప్పు కాకపోతే మన ప్రభుత్వం అధికారగణం మనకున్న వేదస్సుని వాడుకునే
(08:32) వాళ్ళకి మేదస్సు లేదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజునే వాడికి అవగాహన ఉంటే తన దేశంలో ఉన్నటువంటి మేదో సంపత్తిని వాడుకోవాలి సంపద కింద మార్చుకోవాలి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం అది వాడుకోలేని స్థితిలో కాబట్టి మనవాళ్ళు యువతంతా బయటకవెళ్లి వాళ్ళఏదో సాధిస్తున్నారు వాళ్ళ ఎన్ని ఆవిష్కరణలు అమెరికాలో జరిగినా ఇన్ని మనవాళ్ళే చేసిరు వాళ్ళ నేతృత్వంలో మనవాళ్ళు చేసింది మనం కూలి పని చేసి ఐపి వాళ్ళకి అంటగట్టి మనం కేవలం జీతభత్యాలు పుచ్చుకున్నాం దురదృష్టం అవన్నీ ఇక్కడే చేయొచ్చు ఇన్ఫోసిస్ వాళ్ళు అక్కడికి మనుషులని
(09:09) పంపించి అక్కడ వాళ్ళకి ఆవిష్కలకి సహాయం చేస్తున్నారు ఆ ఇన్ఫోసిస్ వాళ్ళు ఇక్కడే ఆడి సెంటర్ పెట్టి చేయవచ్చు నారాయణమూర్తి గారితో ప్రత్యక్షంగా నేనే అడిగాను ఆ మన ఇండియాలో ఆర్ఎండి కష్టం అన్నాడు ఆశ్చర్యపోయాను ఇలాగే టిసిఎస్ చాలా గొప్ప సంస్థ వాళ్ళు కూడా మనుషులు పంపిస్తారు. వాళ్ళ కూలీ చేసి కూలు సంపాదించి వీళ్ళకి వెనక్కి పంపిస్తారు.
(09:31) దేశానికి డాలర్స్ పరిపుష్టి వచ్చింది. మీదో ఐపి ఎక్కడి నుంచి వచ్చింది రాలేదు కదా మనం అప్పటికీ ఎంతకాలం కులీలమేనా మనం యజమానులు కాలేమా అలాంటి భావలో ఉన్న నాకు వాళ్ళు చెప్పినటువంటి ఫార్మా రంగంలో నిపుడులు చెప్పిన మాట నాకు మనస్కరించలేదు ఎవరు చేయకపోతే నేనే చేస్తాను దిగాను ఆ రకంగా నేను వచ్చాను నాకు సంబంధించింది కాదు అయితే కొంత కాలం తర్వాత పేరు వచ్చాక వరప్రసాద్ రెడ్డే వ్యాక్సిన్ కరిపెట్టాడు అనే స్థితికి వెళ్ళిపోయింది జర్నలిజం నాకు నాకు దాని గురించిన ఏ అక్షరమో తెలియదు.
(10:04) నేను చేసిందల్లా అలాంటి టీమ్ ని ఏర్పాటు చేసుకోగలిగాను. కానీ తక్కువ ధరకు వ్యాక్సిన్ ఇవ్వాలని మాత్రం మీరు చాలా పట్టుదలగా దానికి కూడా కారణం ఉంది. దానికి ఏం పెద్ద ఆదర్శం కాదు ఏమీ కాదు. వాళ్ళు అన్నది ఏమిటి ఇతర దేశంలో ఆ సమ్మిట్ లో ఈ వ్యాక్సిన్ 10 మందికి పుట్టిన ప్రతి బిడ్డకి ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి నేషనల్ ఇమ్యూనేషన్లో పెట్టినప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి.
(10:30) ఫ్రీగా ఇస్తారు బిడ్డ పుట్టిన 14 రోజులకే ఇస్తారు. అది గవర్నమెంట్ ఇవ్వాలి ప్రాథమిక పరిశుతి కేంద్రాల్లో ఇవ్వలేకపోయిన కారణం ఏంటి మిగితా వ్యాక్సిన్లు ఇస్తున్నారు డిఫతీరియా ఇస్తున్నారు పెట్రోసిస్ ఇస్తున్నారు టెటనస్ ఇస్తున్నారు మీజిల్స్ ఇస్తున్నారు మమ్స్ ఇస్తున్నారు రుబెర్లా ఇస్తున్నారు. బిసిజి ఇస్తున్నారు ఒక్క హెపటైటిస్ బి మాత్రం ఇవ్వడం లేదు ఎందుకు అంటే అది లోకల్ గా దొరకటం లేదు ఇంపోర్ట్ చేయాలి.
(10:54) ఆనాటికి నేను మాట్లాడేది 91 మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కేవలం 300 మిలియన్ అది కేవలం రెండు నెలల ఆయిల్ ఇంపోర్ట్ సరిపోతుంది. ఇవాళంటే మనం చాలా బిల్లు సాధించాం 600 670 బిలియన్ ఉందని విన్నాను నేను ఆ రోజుల్లో లేదు కాబట్టి గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి సిద్ధపడలేదు. రెండవది ఖరీదు ఎక్కువ 30 డాలర్ 35 డాలర్లకి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది.
(11:21) మనకు ఆనాటికి ఒక వార్షికంగా 22 మిలియన్ బేబీలు పుడుతున్నారు. అంటే 22*3 ప్రతి బేబీకి ఒకటి ఇవ్వాలి మూడు ఇవ్వాలి 22*3 66 మిలియన్లు మరి బ్యాక్ లాగ ఉన్నారు కదా పిల్లలు 12 ఏళ్ల పిల్లల వరకు ఇవ్వాలి. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది అందుకని మానేశారు. ఆ కారణంగా మానేశారు. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏమిటి ఇట్ షుడ్ బి మేడ్ అవైలబుల్ లోకలీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండకూడదు.
(11:46) ఇట్ ఇట్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఆన్ పార్ విత్ అదర్ వాక్సిన్స్ ఆ వ్యాక్సిన్ అంతా ఇమూని షెడ్యూల్ లో చేర్చి ఇస్తున్నారు. ఇది కూడా దాంట్లో చేర్చాలంటే ఆ వ్యాక్సిన్ ఎంత ఖరీదో అంతకే ఇవ్వాలి నిజానికి ఆనాటికి నా నా మేదస్సు ఎంతవరకు ఉందంటే మిగతా వ్యాక్సిన్ ఎంత ఖరీదో కూడా తెలియదు. కనుక్కుంటే 40 రూపాయలు 50 రూపాయలు అన్నా అయితే ఈ వ్యాక్సిన్ కూడా అదే ఖరీదు అన్నాను.
(12:09) ఈ టెక్నాలజీ తెలియదు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ తెలియదు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఎంతమంది కావాలో తెలియదు ఎంత ఎక్విప్మెంట్ కావాలో తెలియదు. నిర్ణయం ఏమిటి గొప్పగా మిగతా వ్యాక్సిన్ ఏ ఖరీదు ఉందో ఇది కూడా అదే ఖరీదుకి ఇవ్వాలి లోకల్ రూపాయల్లో ఇవ్వాలి మేక్ ఇట్ అవైలబుల్ లోకలీ మేక్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ కామన్ మన్ ఈ కారణాలతో నేను ఆ ఎజెండా ఫిక్స్ చేసుకున్నా ఈ కరీర్ కే చేయాలి అని అంతే అది నేను ఆదర్శం కాదు ఇది ప్రాక్టికల్ గా ఇట చేస్తేనే గవర్నమెంట్ దీన్ని వాడుతుంది లేకపోతే వాడదు అన్నటువంటి భయంతో ఆ నిర్ణయం తీసుకున్నా ఆ ఇక్కడ మీరు ఈ ఫీల్డ్ లో దశాబ్దాలుగా ఉన్నారు కాబట్టి నేను పేరు పేర్లు చెప్పను
(12:45) కానీ ఆరు నెలలకు సంవత్సరానికి రెండేళ్లకు కూడా వ్యాక్సిన్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ప్రపంచంఅంతా వ్యాప్తిగా ఉంది మీడియాలో తుంకానుపుంకాలుగా వార్తలు వచ్చాయి. మీరేమో నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని చదువుతూ ఉంటా ఒక వ్యాక్సిన్ తయారు కావాలంటే రీసెర్చ్ బలంగా ఉండాలి అనేక ట్రయల్స్ ఉండాలి కనీసం నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు పడుతుంది అని అన్నారు హీన పక్షం ఆరేళ్ళు పట్టినా ఆ వ్యాక్సిన్ రావచ్చు రాకపోవచ్చు అని కూడా మీరు ఒక చోట అన్నారు అలాంటిది మరి ఆరు నెలలకు రెండేళ్లకే ఎలా వచ్చాయి అప్పుడు దాన్ని వ్యాక్సిన్ అనొచ్చా వ్యాక్సిన్ అనొచ్చు
(13:18) నేను వాళ్ళు చేసింది తప్పు అన్నాను గానీ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కి మొట్టమొదటి వ్యాక్సిన్ ప్లేక్ చేశారు 23 ఏళ్ళు పట్టింది అంటే ఆనాటికి ఆ ఉన్న 23 ఏళ్ళు పట్టింది 23 ఏళ్ళు పట్టింది. తర్వాత కూర్చున్న వ్యాక్సిన్లు అన్నిటికీ 16 తక్కువ లేదు 15 ఏళ్ళ తక్కువ పట్టది బిసిజి టైఫాయిడ్ కి వాటర్ చేశరు కానీ ఇప్పుడు సాంకేతికత పెరిగింది.
(13:46) ముఖ్యంగా మరి గత వన్ ఇయర్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. రెండు మూడేళ్ళ క్రితం వరకు మాత్రం నాలుగేళ్ళు కనీసం పడుతుంది నాలుగేళ్ళు ఎందుకు అంటే ఆవిష్కరణకి ఒక వ్యాక్సిన్ రూపకల్పన చేయడానికి పట్టే సమయం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పట్టొచ్చు దాన్ని టెస్ట్ చేయాలి దానికి సేఫ్టీ ఎంత ఉంది ఎఫికసీ ఎంత ఉంది టెస్ట్ చేయాలి వాటికి చేసేటటువంటి టెస్ట్లు ఒక టెస్ట్ సేఫ్టీ ఫర్ ఎగజాంపుల్ ఇది మూడేళ్ళయినా షెల్ఫ్ లో పెడితే అది వెక్కరించకుండా బాగానే ఉంటుందా స్టేబుల్ గా ఉంటుందా చెడిపోదా దాని సెల్ఫ్ లైఫ్ ఎంత అని చెక్ చేయాలి చెక్ చేయకుండా ఇస్తే బాడీలోకి వెళ్ళాక ఉంటుంది కదా అది
(14:29) ఏమన్నా వికటిస్తే అందువల్ల ప్రతి వ్యాక్సిన్ ని టెస్ట్ చేయాలంటే అన్ని రకాలు టెస్ట్ చేయాలంటే మినిమం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడుతుంది ఆఫ్టర్ ఆవిష్కరణ తర్వాత అంటే అర్థం ఏమిటి ఫోర్ అండ్ హఫ్ ఇయర్స్ పడుతుంది. అదే నేను కోవిడ్ టైం లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అందరికీ తాకేజులు వచ్చినాయి భారత్ బయోటెక్ కి వచ్చింది మాకు వచ్చింది సేమ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చింది బయోలాజికల్ ఇవాన్స్ కి వచ్చింది.
(14:51) నేను చేయలేను మీరు అడిగిన ఆరు నెలలో కాదు దీనికి టైం పడుతుంది అంటే నువ్వు సుంటవి అన్నారు వదిలేసారు నన్ను మిగతా వాళ్ళకంతా చేయించుకున్నారు వాళ్ళు చేశారు వాళ్ళు చేసింది తప్పుఅన్నా కానీ వాళ్ళన్ని టెస్ట్లు అయితే చేయలేదు. అది ఆపద్ ధర్మమైనటువంటి అనుమతులు ఇచ్చారు దాన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ అప్రూవల్ అంటే అప్పుడు కావాలి అందరూ భయంతో చచ్చిపోతున్నారు అప్పుడు ఇవ్వడం తప్పు కాదు ఇచ్చేసారు కొంతమంది వేకటించింది కొంతమందికి ఏమిటి ఎక్కువ మందికి వెటించింది.
(15:21) ఇతర దేశాల్లో దాని మీద వ్యాజ్యాలు ఉన్నాయి. ఫైజర్ అనేది చాలా గొప్ప సంస్థ అంతర్జాతీయంగా వాళ్ళ మీద 8.3 బిలియన్ డాలర్స్ కి వ్యాజ్యాలు ఉన్నాయి. 43% ఆఫ్ ఎక్స్పెక్టెడ్ మదర్స్ లాస్ దర్ బేబీస్ దాని అర్థం ఏమిటండి అది పర్ఫెక్ట్ కాదు ఆ మన వ్యాక్సిన్ మన దేశం నుంచి ఏడిన ఒక వ్యాక్సిన్ ని దక్షిణ అమెరికా వాళ్ళు రిజెక్ట్ చేశారు.
(15:44) డబ్బులు ఇచ్చేవాళ్ళే అప్రూవ్ చేయలేదు మనది మన వ్యాక్సినే మన డబ్బులు ఇచ్చేవాళ్ళే అనుమతి ఇవ్వలేదు. నేను చెప్పింది కరెక్టా కాదా అంతే కదా నేను చేయనన్నాను నన్ను మూర్ఖుడు అన్నారు. నా చిన్న చిన్న కమిటీలు ఉంటాయి మా పేరు సఈఓ క్లబ్ అని ఉంది సీఓ క్లబ్ లో కూడా వరప్రసా రెడ్డి చాదస్తుడు మూర్ఖుడు చెప్పింది చేయడు ఆయన అనుకున్నే చేస్తాడు.
(16:06) కానీ సమయం కొంత కాలం నిరూపిస్తుంది ఎవడు చెప్పింది కరెక్ట్ కాదు అంటే నేను పర్ఫెక్ట్ గా చెప్తాను కాదు నా భావన అది నా భావన శాస్త్రీయంగా మీకు దాని మీద ఉన్న నాకున్న అవగాహన నాకున్న నిబద్ధత టెస్ట్ చేయకుండా పిల్లలక ఇవ్వకూడదు ఇప్పుడు ఒక మందు వికటిస్తే తప్పు లేదండి అతను రోగి ఇష్టం రోగం తగ్గాలని తగ్గకపోవచ్చు వికటించొచ్చు కర్మ అతనికి బాగాలేదు ఆల్రెడీ బాగాలేదు స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉన్న మనిషికి చిన్న బిడ్డకి వ్యాక్సిన్ ఇస్తున్నాం హెపటైటిస్ బి ఇది రోగం ఉండి కాదు కాదు స్వచ్ఛమైన బిడ్డకి రక్షణ కోసం ఇస్తున్నది భక్షిస్తే ఎట్లా ఒక తరాన్ని మనం నాశనం చేస్తే
(16:45) చేయకూడదు కదా దీని మీద మరింత శ్రద్ధ పట్టాలి కదా అది నా ఉద్దేశం ఆ కాబట్టి అది జరగడం కష్టం అనే ఉదాయంతోనే నేను దూరంగా జరిగాను నేను చేసిన పనికి నేను ఇవాళ దగ్గరట్లేదు మంచి పనే చేశను అనుకుంటున్నాను ఆ ఇక మీ ఫార్మా నుంచి పక్కక వస్తే నాతో మీరు ఎప్పుడు మాట్లాడినా లేక సభల్లో మాట్లాడిన భారతీయ విద్యా వ్యవస్థ మీద చాలా ఆవేదనగా చాలా బాధగా కోపంగా కూడా మాట్లాడుతుంటారు ఎందుకు అంత తీవ్రత ఇవాళ దేశంలో ఉన్న అన్ని అనర్థాలకి కారణం వెతుక్కుంటూ పోతే టార్చ్ లైట్ వేసి వెతగ్గా వెతగ్గా వెతగ్గా అమ్మదొంగా దొరికాడు అనేది ఒక విద్యా విధానమే మనకు మనదైన విద్య పోయింది.
(17:32) మనకు వచ్చిన విద్య మెకాలే పెట్టిన విద్య అప్పటివరకు మన గురుకులాలు మన పద్ధతి మన సంప్రదాయం మన వాంగ్మయం మన నీతి మన రీతి మన పద్ధతి అన్ని ఉండేవి వాటి నుంచి పక్కకు తప్పించారు ఎందుకు తప్పించారు ఈ జాతిని వశం చేసుకోవడానికి వాళ్ళకు బానిసలుగా మార్చడానికి స్వతంత్ర భావాలు లేకుండా చేయడానికి ప్రశ్నించే హక్కు తీసేయడానికి వాళ్ళకి కావాల్సింది ఆ రోజుల్లో క్లర్క్స్ క్లర్క్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసింది వాడికి వాడు చెప్పిన మాట వినేటటువంటి ఒక సేవకుడు కావాలి క్లర్క్ కావాలి చదువుకున్నవాడు కావాలి చదువులని అవే చెప్పింది చెయ్ మేము
(18:12) చెప్పిన పాఠాన్ని అప్పచెప్పి మళ్ళీ రాయి సొంత ఆలోచనలు అనవసరం టెక్స్ట్ పుస్తకంలో ఏముందో అది మాత్రమే రాస్తే నీకు మార్కులు నీ సొంత ఊహ చేసి రాస్తే వితకొట్టి ఫెయిల్ చేస్తారు. ఆ రకమైన విద్యా విధానం ప్రవేశపెట్టారు. దీంతో ఏమైంది మనం మనకు చదువు విజ్ఞానం వికసించడానికి కాదు ఒక ఉద్యోగం సంపాదించడానికి దాని ఉద్దేశమే అది ఆ రకంగా చేశారు మీరు ఇది పాస్ అయితే మీకు ఈ ఉద్యోగం ఉద్యోగం ఇది పాస్ అయితే నీకు ఈ ఉద్యోగం నిర్ణయించేశరు నువ్వు లాజ్ అవుతావా లాయర్ అవుతావ్ అంతేగన ఒక మనిషి అవుతావ అని చెప్పలే వాళ్ళు నువ్వు కామర్స్ అవుతావా ఆర్డిటర్ అవుతావ్ నువ్వు సైన్స్ అవుతావా
(18:52) సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంది. లిటరేచర్ అవుతావా లిటరేచర్ చదివితే తెలుగు పడిత అవుతావా లే ఇంగ్లీష్ పడి అవుతావా అని వాళ్ళు నిర్ణయించేశరు. దానికి తగ్గట్టుగానే మనకు ఎట్లైతే కృష్ణ భగవానుడు భగవద్గీతలో వర్ణాలు నిర్ణయించారో మీరు ఇది పని చేయండి మీరు ఈ పని చేయండి కమ్మరి కుమ్మరి నేతగాడు అని ఈ చదువులో ఇి విభాగాలు చేశారు ఈ ఇంజనీరు ఈ డాక్టర్ వీడు ఉద్యోగ విభజన చేసేసి మనల్ని నిర్ణయించారు మనం ఆ పరిధిలోనే ఆ చట్టంలోనే పెరిగాం మనిషిగా ఎదగలేదు మనిషిగా ఎదగడానికి ఏం కావాలి వ్యక్తిత్వం కావాలి వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ ఎన్ని దానికి కాస్త
(19:27) అవసరమైనటువంటి కనీసమైనటువంటి టి ఫౌండేషన్ మన వాంగ్మయం మహాభారతం ఎందుకు చదవాలి అంటే కుటుంబంలోనే పేచీలు వస్తాయి. ఎలా కలిసి మిలిసి ఉండగలరు ఎలా ఉండలేకపోతారు రామాయణం తల్లిదండ్రుల గౌరవం గురువుల పట్ల గౌరవం ఇవన్నీ ఇవన్నీ కష్టాలు వాళ్ళకి రాముడే అవతారం అని చెప్పి తెల్లవారితే ఆయన పట్టాభిషేకం పట్టాభిషేకం లేదు పొమ్మ అన్నారు ఆయన చక్రవర్తి కొడుకు ఒక చక్రవర్తికి అల్లుడు అలాంటి వ్యక్తికి తెల్లవారితే కథ మారింది అడిగి పోవాల్సి వచ్చింది పోతే పోయాడు అక్కడ మళ్ళీ భార్యని పోగొట్టుకున్నాడు ఆ ఏ సహాయం లేదు చివరికి మానవీయతలను తనకు సహాయగా పొంది వానలతో కూర్చుని వాళ్ళని
(20:08) ట్రైన్ చేసుకొని యుద్ధం చేశాడు ఇంకో దేశం వచ్చి ఇంతకే చేసిన ఆయన ఆత్మహత్య చేసుకోలే ఆత్మ విభతో నిలబడ్డాడు. ఇవాళ స్టూడెంట్స్ కి అది ఆ వాంగ్ చదవని స్టూడెంట్ కి 99% తక్కువ అయితే నీ మొహం నాకు చూపిస్తురా అని తల్లిదండ్రుల బాధ గుర్తొచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంటే వాడికి ఫౌండేషన్ లేదు. వ్యక్తిగా వాడికి ఫౌండేషన్ లేదు.
(20:29) సార్ ఇక్కడ ఆదర్శంగా మీరు చెప్పేది బాగుంది. భారతీయ తాత్వికత పురాణాలు మన సంప్రదాయం ఇవన్నీ బాగానే ఉంటాయి. ఒక 80 ఏళ్లుగా మనం ఒక పద్ధతిలో ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు మీరు ఇది కాదు అని మీరు చెబుతున్న విద్యా వ్యవస్థలోకి మారడం ఇన్ని కోట్ల మంది విద్యార్థులు ఉన్న ఈ దేశంలో సాధ్యమవుతుందా? చేయాలి. నేను అంటే ఇవాళ్ళకి ఇవాళ మార్పు వస్తాను అనటంలేదు ఎప్పుడు కూడానండి ఒక జాతిని నిర్వీర్యం చేయడానికి వాళ్ళకి ఇంచుమించుగా మూడు దశాబ్దాలు పట్టింది మూడు నాలుగు దశాబ్దాలు తిరిగి దాన్ని పట్టా ఎక్కించడానికి మనకి 10 దశాబ్దాలు పట్టొచ్చు ఒక శతాబ్దమే పట్టొచ్చు కానీ
(21:07) మొదలు పెట్టాలంటారు మొదలు పెట్టకపోతే ఎప్పటికీ ఇంకా దిగజారిపోతున్నాం మనం జారిపోతున్నాం ఊబిలోకి ఎక్కడో ఒక దగ్గర ఒక చెయ్యి పెట్టి ఆపి ఇది కాదురా మన విద్య ఇది చదువు కేవలం చదువు కాదు చదువుతో పాటు సంస్కారం అనేది రెండో నిజట పదం లేకుండా పోయింది. మన స్కూళ్లలో చదువే చెప్తున్నారు చదువుతో పాటు సంస్కారం చెప్పడం లేదు సంస్కారం చెప్పకపోతే ఈ జాతిలో మనిషిగా ఎవడు మిగలడు.
(21:33) మార్కుల అక్కర మార్కులే మిగులుతారు. దాని నుంచి తప్పించాలంటే సంస్కారం కూడా జోడించాలి అని ఎక్కడో మొదలుపెడితే ఒక తరం కాదు ఆ తరం తర్వాత నిష్తరం కూడా కాదు అయితరాలు ఆ తరాలు మారిన తర్వాత ఒక మంచి పౌర సమాజం ఏర్పడే అవకాశం ఉందని నా భావన. ప్రయత్నమే చేయకపోతే అసలు లేదు కదా ఇంకా దిగపట్టుకపోతూనే ఉంటాం ఇంకా దిగదారుతున్నాం అక్కడ ఆగలేదు ఇది రోజు రోజుకి దిన దినానికి దిగదారడం తప్పితే ఒక స్టేజ్ ఒక స్టేబుల్ స్టేజ్ లో లేదు ఇవాళ దాన్ని ఎక్కడో ఆపాలి ఎక్కించాలి ఒక్కొక్క మెట్టు ఎక్కించాలి.
(22:05) పట్టొచ్చు వంద ఏళ్ళు పట్టొచ్చు కానీ ప్రయత్నం అనేది లేకపోతే ఎట్లా గమనించాలి ఇప్పటికే మనుషులు ఎలా ఎప్పుడన్నా మనం విన్నామా చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి లేదుని విన్నాం. అవును ఇవాళ చెడ్డతలు కూడా కనిపిస్తుంది వార్తల్లో పైగా శంకరాచార్యులు అందులో చెప్పారు కదా మరి ఆ మాటే మహానుభావుడు జగద్గురువు ఆయన మాటకే లోటు వచ్చింది అని ఆశ్చర్యపోయాను నేను ఎక్కడైనా చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో గాని కుమాత నభవతి నభవతి అలాంటి మాటకే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిన సంస్కృతి దిగజారామ అంటే మనం ఎన్ని స్టెప్పులు కింద పడిపోయి ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి దిగులు రావట్లేదా మీకు
(22:41) ఎక్కడున్నాం మనం భర్తను చంపించిన భార్య భర్తే దైవం అని భర్త సతీ సగమనం చేసిన దేశంలో భర్తని చంపేయాలని కూర్చున్నటువంటి పెళ్ళ తయారయిందంటే ఏమని చెప్పారు అసలు ఏది సంస్కృతి అయినా మూలం ఇంట్లో స్త్రీ ఒక స్త్రీ ఆ ఇంట్లో గన చదువుకుంటే ఆ జాతి ఆ కుటుంబం అంతా బాగుపడ్డట్టుగా లెక్క ఒక స్త్రీ ఒక తప్పు చేసిందంటే ఆ కుటుంబంలో ఇంకా దిగజారి దిగదారి పోతుంది.
(23:09) ఆ విషయం పోయింది ఇవాళ ఆవిడ వాళ్ళకి 33% ఏమిటండి సగాటి సగం వాళ్ళకి ఇవ్వాలి అదేంటి 33% 33 అంటేనే అవమానించ నీలో పురుషహంకారం చావలే వాళ్ళ 33 దగ్గరే పెట్టాలని అనుకున్న ఆలోచన నీదయితే నీలో ఇంకా దురహంకారం ఉంది పురుషహంకారం ఉంది సమానం మనకు ఆదిశంకరుడు సగం భాగం అమ్మవారికి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అని చెప్పి చెప్తే లేదు లేదు ఆయన టూ థర్డ్స్ శివుడు వన్ థర్డ్ అమ్మవారు అని చెప్పి అన్నారా లేదే లేదే నిజపల తప అందులో అంటాడు కదా ఆ ఒకరి తపస్సుకు ఒకరు ఫలంగా దొరికినవాడు మరి ఇదేమిటిది ఎక్కడి నుంచి వచ్చింది 33% ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేసిన నిర్ణయాలని
(23:52) భుజాన వేసుకుని లేదా శిరసులు పెట్టుకొని మోస్తున్నటువంటి ఈనాటి రాజకీయ నాయకులు ఇవాల్టికి ఎన్నో చట్టాలు ఇప్పటికీ వాళ్ళు ఏర్పరిచినవే అదే రాజ్యాంగంలో కూడా ఉన్నాయి కూడా అవే నిజానికి ఈ రాజ్యాంగం మీద నేను అంటే ఎవరు నెచ్చరు గానీ అంబేద్కర్ గారు సంతోషంగా లేరు. ఆయన చెప్పినవి లేవు కొన్ని తీసేసారు.
(24:19) ఆయన సంఘ సంస్కర్త ఆయన పేరుతో రాజ్యాంగం అని అంటున్నారు నిజానికి ఆయనకి అర్ధాంగీకారమైనటువంటి రాజ్యాంగమే మనం ఇవాళ నడుపుకుంటున్నాం. ఆ ఇప్పుడు ప్రధానంగా విద్యాబోధనలో మీడియంకు సంబంధించి చాలా చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఒక వర్గం ఏమో అంతర్జాతీయంగా మనం పోటీ పడాలి. విదేశాల్లో ఉద్యోగాలు రావాలి లేదా విదేశాల్లో ఇంటర్ తర్వాత డిగ్రీకో పీజీకో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తెలుగు మీడియంలో చదువుకుంటే మనవాళ్ళు వెనకబడిపోతున్నారు చాలా మందిని చులకనగా చూస్తున్నారు కాబట్టి ఆ వేగంలో ఆ పోటీలో ఉండాలి అనిఅంటే తప్పనిసరి ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఒక వాదన ఇంకో వాదన
(25:00) అసలు ఇది అవసరం లేదు జర్మనీ రష్యా చైనా ఇలా అంతర్జాతీయంగా చాలా చాలా దేశాలు వాళ్ళ మాతృభాషలో శాస్త్ర సాంకేతిక రంగాల విద్యాబోధన కూడా చేస్తున్నారు ఇప్పటికీ అలాగే ఉన్నాయి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి తెలుగులోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి వరకు కూడా మీడియంగా ఉండాలి అని మీరు తెలుగు భాషాభిమాని తెలుగు భాషకు సంబంధించి ఎక్కడ ఏదున్నా మీరు కనిపిస్తూ ఉంటారు.
(25:31) మీ అభిప్రాయం ఏమిటి దీని మీద నేను మీరు చెప్పిన రెండో వాదానికి బద్ధుడిని కానీ పరిగెత్తే రైలు నుంచి దిగారునుకోండి టక్క నిలబడలేరు పడిపోతారు పరిగెత్తే రైలు నుంచి దిగినప్పుడు కూడా మీరు కొంతసేపు పరిగిస్తారు దాంతో పాటుగా తర్వాత ఆగిపోతారు. ఎందుకు స్టెబిలిటీ అవునా ఇంతకాలం ఇంగ్లీష్ మోసాం మనము మన భాషా వ్యక్తులు భద్రాజు మీరు చెప్పారు ఇందాక అలాంటి మహానుభావులు ఉన్నా కూడా వాళ్ళ పారిభాషిక పదాలు రాయించుకోలేకపోయాం వాళ్ళు సరిగా వినియోగించుకోలేదు ఈ ప్రభుత్వాలు ఆయన ఏదో వైస్ ఛాన్సలర్ ఏదో చేసేసి సరిపెట్టేసుకున్నారు కానీ అయ్యా ఈ కార్యక్రమం చేయాలి మన భాషలో మనదైనటువంటి
(26:14) భాషలో సాంకేతిక పదాలు రూపొందించండి అని చెప్పి అని వాళ్ళకి ఎక్సర్సైజ్ ఇవ్వలేదు ఇంతెందుకు సిఎస్ఆర్ 40 లాబరేటరీస్ ఉన్నాయి 3000 సైంటిస్ట్లు ఉన్నారు అద్భుతమైన మేదస్ ఉన్నవాళ్ళు మన వ్యాక్సిన్ మనం చేసుకోవాలని చెప్పకపోబట్టే కదా నేను దిగాను అలాగే మన భాషావేత్తల చేత మనం చేయించుకోవాల్సిన పని చేయించుకోలేదు చేయించుకొని ఉంటే మనకు పారిభాషిక పదాలు వచ్చిఉంటే పరిపుష్టం అయి ఉంటే చైనా లాగే చైనా వాళ్ళు వాళ్ళ భాషలో నేర్చుకున్నారు.
(26:40) కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. అది కానీ బేసిక్ గా నువ్వు నేర్చుకోవాల్సిన నీ స్కిల్స్ అన్నీ కూడా నీ మాతృభాషలోనే వంటపడతాయి. నీ మేదస్సు అద్భుతంగా పనిచేసేది నీ మాతృభాషతోనే నువ్వు ఆలోచన అంతా విధానం అంతా ఒక విషయం మీకు సమస్య ఇస్తే నీ ఆలోచన ఇంగ్లీష్ లో చేయరు నీ మనసులో నీ ఊహ అంతా మాతృభాషా నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి దాన్ని తర్జుమా చేసుకొని చేస్తావు అంటే ఆ తర్జుమాలోనే 10% 20% 30% లాస్ ఉంది.
(27:11) నేనుఅనేది నీ మాతృభాష ఇప్పుడే మొదలు పెట్టు వాళ్ళకి ఇవాళ రాదు అది ఇంగ్లీషు నేర్చుకో కానీ దీన్ని మొదలు పెట్టాలి అది ఇంతవరకు మొదలు పెట్టలేదు మొదలుపెట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఒక శతాబ్దానికన్నా మారుతుంది అన్నానే ఇది అర్ధ శతాబ్దానికే మారొచ్చు పాతిక శతాబ్దానికే మారొచ్చు పాతికేళ్లకే మారొచ్చు చేయడం ఆ ప్రయత్నమే చేయలేదు చేయాలి ఇంకోటి ఎందుకు విదేశాలకే వెళ్ళాలండి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు పని చేసుకోకూడదు ఏ అమెరికాకే వెళ్ళాలా మన మన వీసా కోసం వాళ్ళు క్యూ కట్టాల్సిన రోజు రావాలని నేను ప్రార్థించేవాడిని ఇవాళ జరుగుతుంది అది మనవాళ్ళు ఎవరు ఇవ్వాళ
(27:47) వెంటపట్టలేదు అక్కడఉన్న కారణాలు కారణాలతో వాళ్ళు వస్తున్నారు ఇండియా వీసా కావాలి ఆ రోజు వచ్చింది నా ఆక్రోశమే కావచ్చు నా శాపమే కావచ్చు [నవ్వు] రాబోయే రోజుల్లో కూడా మీరు ఎక్కడికి ఉద్యోగాలకు వెళ్ళక్కలేదు బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీరు రావాలి వాళ్ళు ఇక్కడికి వచ్చి హిందీయో సంస్కృతమో ఏదో మన తెలుగుో నేర్చుకోవాల్సిన అగత్యం వాళ్ళకి ఏర్పడాలని మనం కోరుకోవాలి అంతేగానీ మనం ఇంకా మనం మన పిల్లలు ఆడకెళ్లి ఉద్యోగం చేసుకోవాలి ఆడకెళ్లి బతకాలి అది పేద భావం దానిసభం బానిస భావం గతిలేక ఆ రోజుల్లో బర్మాకి పోయారు మనం వ్యవసాయం చేయడానికి ఇవాళ
(28:20) పోతారా ఎందుకు పోవట్లేదు పరిపుష్టం అయ్యాం మనం ఇదే రకంగా మన ఇంజనీరింగ్లో గాని మన సాంకేతికతలో గాని ఇంఎందుకండి స్పేస్ సైన్స్ లో అక్కడి నుంచి ఇక్కడికి రావాలి మనమే బెటర్ గా ఉన్నవాళ్ళు కావాలి 100% మనం బాగున్నాం అంటే ఏమిటి అక్కడి నుంచి సైంటిస్ట్ ఇక్కడ పని చేయాల్సిన అవసరం వాళ్ళకి వచ్చింది ఈ పరిస్థితిని మార్చి కనిపెడుతున్నప్పుడు దానికోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు మనవాళ్ళు ఇదంతా ఓటు చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం ఇది అంటే ఏమవుతుందో ఎవరు ఓట వేయరేమో ఇద అంటే ప్రజల్ని మనం చైతన్యం పరచలే మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా
(28:56) మనం ఇక్కడే ఆ ఉపాధి కల్పన చేయగలం ఆవిష్కరణకు ఊతం ఇస్తాం మనం ఆవిష్కరణ చేసినప్పుడు సపోర్ట్ చేస్తాం ఇంకొకఆపిల్ కంపెనీ ఇక్కడే తయారు కావాలి ఇంకొక గొప్ప గొప్ప కంపెనీ ఇక్కడే ఆవిష్కరణ కావాలి అన్న ఆలోచన ప్రజల్లో కలిగించలేకపోయాం. మీడియం ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలుగు భాషా పరిరక్షణకు సంబంధించి మీరు చాలా ఆర్థిక సహాయం చేశారు హార్థిక సహాయం కూడా చేశారు చేస్తూనే ఉన్నారు.
(29:24) నాకు ప్రత్యేకించి హాసం పత్రిక అభిమానిని నేను. నా దగ్గర నా లైబ్రరీలో అన్నీ ఉన్నాయి. మొత్తం సెట్ ఉంది. హాసం పత్రిక పెట్టిన ఉద్దేశం ఏమిటి అది ఎందుకు మూతపడింది హాసం పత్రిక పెట్టిన ఉద్దేశం అయితే నాకు హాస్యం ఇష్టం సంగీతం ఇష్టం రెండు కావాలి హాస్యంలో నుంచి హ తీసుకున్నాను సంగీతంలో నుంచి సం తీసుకున్నాను.
(29:48) అయితే ఎందుకు కావాల్సి వచ్చింది అని అడగండి నాకు ఇష్టం ఆస్వాదించొచ్చు బజార్లో బూడం దొరుకుతుంది హాస్యం గాని సంగీతం గాని రమణ గారి పుస్తకాలు చూపుకుంటే హాస్యం సంగీతం కావాలంటే నాకు కావాల్సిన రాజేశ్వర్రావు గారు గంటసాల గారు పెండాల గారు మ్యూజిక్ వినొచ్చు ఇది దాంతో నేను సేద తీరా నాకు వచ్చిన కష్టాలకి నాకు వచ్చిన ఒత్తిళ్లకి నాకు వచ్చినటువంటి అనేక అనేక మానసిక సంక్షోభాలు తట్టుకోవడానికి సేద తీరినటువంటి అంశాలు ఈ రెండు నేను దాని వల్ల లబ్ది పొందాను ఇది అందరికీ పంచితే బాగుంది అనిపించింది.
(30:17) దానికోసంగా ప్రారంభించాను. నాకు సమయం లేకపోయినా నా మిత్రుడు ఎంబిఎస్ ప్రసాద్ అప్పచెప్పి చేయించాను. కానీ ఏది కూడా అది దాటి స్వయం సమృద్ధి సాధించాలి ఎల్లకాలం పెడుతూ పోలేం 48 లక్షల దాకా పెట్టాను. 78 ఇష్యూలు దాకా తీసుకొచ్చాను. అందరూ చాలా బాగుంది ఉత్తమాభిరుచులతో ఉంది ఇవాళ రేపు పత్రికలు ఇంత ఉత్తమాభిరుచులు లేవు భారతి పత్రిక తరువాత నా లైబ్రరీలో అలా దాచుకుని చదువుతున్నది హాసమే అలాంటి ఉన్నతమైనటువంటి అభిరుచి గల పేపర్ నడవాలంటే ఎల్లకాలం నేను ఎవ్రీ మంత్ దానికి 2 లాక్స్వ లాక్ పెట్టే పరిస్థితి కాదు అదొక కారణం రెండో కారణం దానికి ఇద్దరు
(31:02) ప్రయుక్తలు ఒకాయన రాజ ఒకాయన ఎంబిఎస్ ప్రసాద్ రాజా కంటెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయన ఆలోచన మారింది బడబ వాళ్ళ లేరు కదా ఆయన ఆయన ఎవరికో ఒకరికి అమ్మేద్దాం అన్న ఆలోచనకు వచ్చారు. నాకు అది నచ్చలేదు వాళ్ళ అభిరుచి మార్చి దాంట్లో వేరే రకమైనటువంటి ఆ లిటరేచర్ వస్తే బాగుండదు అని ఎంబిఎస్ కి ఆయనకి పొలతర కుదరలేదు.
(31:30) ఎంబిఎస్ చాలా సఫర్ అయ్యాడు ఆయన ద్వారా సరే ఆయనకి ఎందుకు కష్టం కలిగించడం ఇంతవరకే దాని ఆయుష్యు దేనికైనా ఆయం ఉంటాం ఇల్లు కట్టుకున్న ఆయం పెడతారు దీనికి 70 ఏళ్ళ అండి ఆయం ఉంది 70 ఏళ్ళ తర్వాత కూలిపోద్ది మనిషికే ఆయం ఉంది అవును ఆ పత్రిక 78 ఇష్యూస్ తో ఆయం తీరిపోయింది. కానీ మధుర జ్ఞాపకం కానీ ఇప్పుడు హాసం పేరుతో పుస్తకాలు వస్తున్నాయి వస్తున్నాయా అవును నేను ప్రింట్ చేస్తూనే ఉన్నాను అది ఆపలేదు దాని మీద నేను డబ్బు సంపాదించాడు కాదు ఫ్రీగానే ఇచ్చేస్తాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జగమెరిగిన గాయకుడు ఆయనతో మీకు పరిచయం ఉందని నాకు తెలియదు కానీ ఆయన చనిపోయాక మీరు ఒక
(32:07) నివాళిగా వ్యాసం రాశారు. అది రాసినప్పుడు మాత్రం వేసాను ఓ జీవ అప్పుడు చాలా వ్యాసాలు నేను కూడా నివాళిగా రాశను చాలా మందివి చదివాను కానీ మీది చదివినప్పుడు మాత్రం నాకు అందులో అబ్బా ఎన్నో దశాబ్దాలుగా ఆయనతో ఈయన జర్నీ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. బాలసుబ్రహ్మణ్యం గారితో మీ అనుబంధం ఎలాంటిది ఆయన పాటగా పాటగాడుగా అందరూ గౌరవిస్తారు నేను చేస్తాను కానీ ఆయనకన్నా ఆయన నాన్నగారి సంగీతం విని ఆనందించినవాడిని నేను శాంభమూర్తి గారు ఓ బాలు గారి నాన్నగారు ఆ శాంబమూర్తి గారు హరికథలు చెప్పేవారు నెల్లూరులో నేను చిన్న పిల్లాడప్పటి నుంచి ఆయన సంగీతం విని ఆయన హరికథ విని గాన
(32:48) మాధుర్యం విని సంగీతం మీద ఇష్టం పెంచుకున్నాను ఆ తర్వాత ఈ అబ్బాయి వచ్చి వచ్చాడు నాకు తెలియదు ఆయన కొడుకుని కూడా నాకు ఆయన పరిచయం అయింది చాలా కాలం తర్వాత అంటే ఆయన అనంతపూర్లో ఇంజనీరింగ్ చేసి మధ్యలో మానేసి వెళ్ళిపోయారు. నేను కాకినాడకి వెళ్ళిపోయాను ఇంజనీరింగ్కి నాకన్నా టూ ఇయర్స్ సీనియర్ ఆయన అప్పుడు పరిచయం లేదు.
(33:08) సామూర్తి గారే నాకు బాగా తెలుసు తెలుసంటే నేను చిన్న పిల్లాడిని నా ఆరో ఏ నుంచి ఆయన హరికథలు విన్నాను. ఆయన తొలిసారిగా ఆయన పరిచయం చేసుకున్నప్పుడు బాలసురుణని నేను మీ నాన్నగారి ఫ్యాన్ ని అని చెప్పా అదేంటది [నవ్వు] అంటే అవునండి అందరూ నా ఫ్యాన్ అని చెప్తారు మీరు చాలా వింతగా ఉన్నారండి మీరు ఎవరు మీరఏంటి అన్నాడు. నేను మీ నెల్లూరు వాడినే మీరు సామూర్తి గారి అబ్బాయి అని తెలిసి మీ దగ్గరికి వచ్చాను.
(33:31) అని చెప్పాను అయితే ఆహా అయితే నేను రాలేదుఅన్నమాట [నవ్వు] అవునండి మీ గొంతుకన్నా మీ నాన్నగారి గొంతు చాలా విశిష్టంగా ఉంటది నిజం చెప్పారు నేను ఒప్పుకుంటాను కానీ ఆయన పాట కూడా మంచి గొప్ప పాటగాడే ఉత్తరోత్తరా చాలా మెచూర్ అయిన తర్వాత బాగుంది ప్రారంభంలో లేతగా ఉండేది అప్పుడు గంటసాల పాటలే ఇష్టపడ్డాం ఈ అబ్బాయి ఏదో లేత ఉంతరా అనుకున్నాం అది కాదు ఆయన నాకు దగ్గర చేసింది ఆయన పాట కన్నా ఆయన మాట అద్భుతం ఆయన మాటలు మార్దం ఆప్యాయత క్లుప్తత స్పష్టత అన్ని ఉన్నాయి.
(34:10) ఇప్పుడు పాట అంటే ఏదో రచయిత రాస్తాడు దానికి ఈయన ప్రాణం పోస్తాడు. ఈయన కాదు ఈయన భావం కాదు మాట ఈయన భావం ఈయన హృదయంలో నుంచి వచ్చింది. ఆయన ప్రేమగా మాట్లాడే మాట అని చెప్పే విషయం ఎంత గొప్పగా చెప్పేవాడు ఏ విషయం అయనా ఆత్మీయంగా చెప్పేవాడు అందరి మీద ఆయనకి గౌరవాలు కృతజ్ఞతలు చాలా విపరీతంగా ఎవరి మీద కోపాలు లేవు. కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ఎంత బలిచ్చి చెప్పేవాడు అంటే ఆయనక అంత కోపం కలిగించాను.
(34:41) నేనే వెధవని ఆ చాలా కోపం వచ్చేసి నన్ను తిట్టేసాడు. అలాంటి తిట్లు ఎవరు తిరకూడదు కానీ అంత కోపం కలిగించాంటే నేను ఎంత అవధాన వింటాను ఈ రకంగా చెప్తే ఈయన సంస్కారం బాబు ఆయన ఇళయరాజా ద్వారా చాలా బాధపడ్డాడు. కానీ ఏనాడు ఒక్క మాట నా దగ్గరకి రాలేదు. వాడు నేను చాలా ఫ్రెండ్స్ మీకు తెలుసో తెలియదో ఇళయరాజాని తన ఇంట్లో పెట్టుకొని కాపాడుకున్నాడు. తన అన్నం పెట్టాడు.
(35:04) ఏమి లేదు రోజు అందరికీ పరిచయం చేశడు. సంగీత దర్శకుడిగా ఇతను పరిచయం చేస్తేనే ఆయనకి వచ్చింది. కానీ ఏనాడు ఎక్కడ చెప్పడు. నాకు తెలుసు అది ఆయన సంస్కారం కాదా అది ఏ మీటింగ్ లో చెప్పాడా ఇళ్లరాజాకి నేను ఆశ్రయం ఇచ్చి నా దగ్గర కాపాడుకున్నాను లేదు వాడంత జీనియస్ ఎవరు లేరని చెప్తాడు. ఏంటి పేచి సర్దుకోకూడదు అంటే నాకు వాడికి ఏం లేదు వాళ్ళ లాయరు మా లాయరు తిట్టుకుంటున్నారు తిట్టుకొని ఉంటారు [నవ్వు] అలా ఎవరు చెప్తారండి చాలా గొప్ప మనిషి సంస్కారవంతుడు ఆయన మాట ఎక్కువ ఇష్టపడ్డాను ఆయన ఆత్మీయతను చాలా అనుభవించాను చాలా దగ్గరవాడు నాకు మా ఇంట్లో మనిషి పోయినట్టుగానే బాధపడ్డాను
(35:45) ఆయన ఏదో ఒక పుస్తకం ఒక డాక్యుమెంటరీ చేయించాను మీరు చూడండి చాలా బాగుంది తప్పకుండా వన్ అవర్ డాక్యుమెంటరీ పాత పాట పాటలకు సంబంధించి అటు సాహిత్యం అయినా సంగీతం అయినా మీవి నేను చాలా సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటాను. మీరు పాడేవాళ్ళతో సమానంగా పాడుతుంటారు పాడేవాళ్ళతో సమానంగా పదాలు అందిస్తూ ఉంటారు అంటే బహుశా ఆ సాహిత్యమో సంగీతమో మీరు బాగా ఆస్వాదిస్తున్నారు.
(36:10) గంటసాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి తరువాత ఎవరు? ఎందుకు లేరు ఇప్పుడు? ఉండవచ్చు కాక ఆ గొంతులో శ్రావిత ఉండొచ్చేమో గానీ వికార్సిన నిజాయితీ ఉండదు. భాష భాష పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత మరి ఆయన కన్నడాలో పాడారు తమిళ్లో పాడారు మలయాళంలో పాడారు ఏ భాషకైనా కన్నడాలో రాజకుమార్ గారు అయితే మా కన్నడ వాళ్ళ కంటే గొప్పగా పాడాడు అని అన్నారు అవును వేదిక మీద అవును కారణం ఏంటంటే ఏ భాషకైనా ఆయన తల్లిగా భావించి సంభావించి పాడాడు అర్థం చేసుకొని పాడాడు ఆయన అర్థం తెలియకుండా ఏ పాట పాడలేదండి ఆ కవిత కూర్చుని బతిలాడుకొని
(36:52) చెప్పించుకునేవాడు ఆ ఉద్రేకము ఆ స్థాయి కూడా తెలుసుకునేవాడు ఈ పదం వాడారు దీంట్లో ఎంత నేను గొత్తు పెంచాలి ఇంత తగ్గించాలి అడిగి మరి పాడేవాడు ఏ గాయకుడు ఆ పని చేయడు. సంగీత దర్శకుడు చెప్పాడా మీటర్కి పాడేస్తున్నామా ఆ హై పిచ్చా లో పిచ్చా తారస్థాయా మంద్ర స్థాయా సమస్థాయా ఈ మూడే స్థాయిలు వాళ్ళకి తెలుసు ఇది అది కాదు పొరలు పొరలుగా కవి భావాన్ని పట్టుకొని కవితో కూర్చొని అర్థం చేసుక నారాయణ గారితో ఎంతతో కూర్చునేవాడు సిరివెందలతో కూర్చునేవాడు వాళ్ళద్దరితో స్నేహబంధ వేటుతో కూర్చునేవాడు గురువుగారు ఎట్లా రాశారు మీరు చెప్పండి మీ ఉద్దేశం
(37:27) ఏంటో చెప్పండి నేను అదే రకంగా పాడతాను అదేండి కవి భావం తెలియాలి కవి భావం తెలియకుండా ఏది పాడలేదు ఇలాంటి టి గాయకులు ఇవాళ రాలేదు వస్తే సంతోషం ఇప్పుడు గాయకులు అతను ఇచ్చినటువంటి దాన్ని ఎక్కడో పాడి రికార్డు చేసి పంపించేస్తున్నారా లేదా ఏ కూడా పాడేస్తుంది ఏ కూడా పాడుతున్నా అది అందువల్ల ఏంటంటే అలాంటి ఆయన పరిపూర్ణమైనటువంటి వ్యక్తి సంస్కారి గాయకుడు ప్రయోక్త రచయిత కూడా దర్శకుడు సంగీత దర్శకుడు సంగీత దర్శకుడు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరైనా ఇమిటేట్ చేయగారు ప్రోగ్రాం్ లో యాంకరింగ్ చేస్తే ఇంకా తిరుగులేదు తిరుగులేదు ఆయన మించిన వ్యక్తిని ఎక్కడ
(38:06) చూడలేదు. ఆ సినిమా పరిశ్రమలో మీకు చాలా మంది పరిచయం కానీ నేను చాలాసార్లు ఒకటి బాలు గారి గురించి చెబుతుంటారు. బాపు రమణ గారి గురించి చాలా పదే పదే చెబుతుంటారు. వాళ్ళతో మీకు ఎట్లా అనుబంధం ఏర్పడింది బాపు రమణలు నాకు ఎంబిఎస్ ప్రసాద్ పరిచయం చేసింది. ఎంఎస్ ప్రసాద్ కొంతకాలం మద్రాస్ లో పని చేశడు.
(38:28) అప్పటినుంచి పరిచయం 35 ఏళ్ల నుంచి పరిచయం. నాకు రమణ గారి పుస్తకాలు అంటే మహా ఇష్టం బాపు గర్భం వలన మహా ఇష్టం తర్వాత నేనే పరిచయం పెంచుకొని తరచుగా వాళ్ళని విజట్ చేసేవాడిని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి తప్పనిసరిగా బలవంతంగా లాకవచ్చి భోజనం పెట్టి కూర్చునేవాడిని వాళ్ళకి తర్వాత తర్వాత బాగా అలవాటు అయిపోయారు నాకు అంత తేలిగ్గా ఎవరికీ స్నేహానికి దొరకరు దొరకరు ఎవరి దగ్గరికి రారు ఎవరితో మాట్లాడరు మొత్తం మీద ఒకరక నేను వాళ్ళని బలవంతం చేసి స్నేహం చేయించుకున్నా కానీ స్నేహం చేశక అద్భుతమైన స్నేహం దొరికింది మహానుభావులు చాలా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ద్వంద సమాసం ఒకరి గురించి మాట్లాడు
(39:05) వీలు లేదు వీలు లేదు ఈయన ఆయన వాళ్ళద్దరి మధ్య నేను ఎంత గొప్పగా జరిగినాయో మా రోజులు మా ఇంట్లో ఉన్న అమ్మవారంతా ఆయన గీసిందే అదే చెక్ ఇచ్చింది. మా ఇంట్లో ఉన్న అనేక ఫోటోలు మీకు పైన చూపిస్తాను. వాళ్ళు కలిసిపోయారు మా కుటుంబంలో సమానం కలిసిపోయారు ఆయన వాళ్ళద్దరు మీరు పరిశ్రమ పెట్టడం దగ్గర నుంచి బహుశా రెండు తరాలను చూసి ఉంటారు.
(39:29) ఇప్పుడు 90ల తర్వాత ఆర్థిక సరళీకరణలు ప్రైవేట్ పోటీ ప్రపంచము స్టార్టప్ కల్చర్ దేశంలో ప్రతివాళ్ళు స్టార్టప్లు ఇలా పెడుతున్నారు. అసలు స్టార్టప్ కంపెనీలు పెడుతున్న యువత చేస్తున్న తప్పులుఏమిటి? తప్పులేం చేయటం లేదు వాళ్ళకి తగిలినటువంటి ఆధారం తగిన ప్రోత్సాహం ఉన్నాయని చెప్తున్న ఈ అబద్ధం వాళ్ళకి లేవు ఆ వాతావరణం లేదు లేదు నేరకాయలో నెయ్యి ఎంత ఉందో వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు అంతే మోసం ప్రభుత్వాలు బడ్జెట్లో పెడతారు స్టార్టప్స్ మనకు వాళ్ళ 20,000 స్టార్టప్స్ ఉన్నాయని ఎన్నిటికి డబ్బు ఇచ్చారు చెప్పమనండి ఎవరు నేనే స్వయంగా
(40:13) ఆ ప్రోత్సాహక పథకాల్లో ఒకటైనటువంటి బైరాక్ కి చైర్మన్ గా ఉన్నాను. అవును బైరాక్ అంటే బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఏం చేయాలి కేవలం స్టార్టప్ కంపెనీస్ కే చేయాలి. అంకుర సంస్థలు అంటాం అంటే వాడికి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని ఒక మా ప్రాడక్ట్ కిందనో ఒక సర్వీస్ కిందనో మార్చడానికి కావలసినటువంటి సహకారం అందించాలి.
(40:39) అక్కడ కూర్చుని నేను గమనించింది నా కాల వ్యవధి రెండేళ్ళు నేను ఆరు నెలలకే రిజైన్ చేశను ఎందుకంటే అంకుర సంస్థలకి ఇవ్వడం లేదు ఒత్తిళ్ల వల్ల బాగా బలపడ్డ సంస్థలకే ఇస్తున్నారు. వాళ్ళకి అసలు డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు కొట్టుకుపోతున్నారు డబ్బంతో అందువల్ల వాళ్ళకి అందటం లేదు రెండోది బడ్జెట్ లో 30 వేల కోట్లు అంటారు. 29వ000 కోట్లు వెనక్కి ఇచ్చేసామ అంటారు.
(41:03) వెయే ఇచ్చామ అంటారు. సరైనటువంటి సంస్థలు లేవు అంటారు అదంతా అబద్ధం నెంబర్ కనిపిస్తుంది మనకు ప్రజలకి అంత అక్కడ అలకేషన్ ఉండదు. ఒకవెయ కోట్లు మాత్రం ఖర్చు పెడతారు అది కూడా ఎవరికీ రైట్ పీపుల్ కి కాదు. అంకుర సంస్థలకి తగిన ప్రోత్సాహకాలు ఇక్కడ లేవు నెంబర్ వన్ పాయింట్ టూ వాళ్ళు చేసే తప్పులు ఏమిటి అంటే ఊహించి అన్ని గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పినటువంటి అన్ప్రిపేర్డ్ గా వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో దూకేస్తున్నారు.
(41:34) ఇవ్వకపోతే దాని మీద వక్ర మార్గాలు పడుతున్నారు. ఇది కాదు ఇకనా అని చెప్పి వదిలేయాలి దాన్ని దాన్ని ఎట్టైనా కొనసాగించాలి తత్వంతో ఏదో ఎవరినో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కి రకరకాల మాటలు చెప్పి మీకుఎందుకు ఇది ఐదు నెలలు మూడు నెలలు అయిపోద్ది నాలుగు నెలలు అయిపోద్ది అని వాళ్ళకి డబ్బు తీసుకుంటారు ఏదో చేస్తారు కాదు చెడ్డ పేరు వచ్చింది.
(41:56) ఇవాళ నేను చాలా మంది అంకు సంస్థకి నేను సహాయం చేశను. చాలా ఫెయిల్ అయినాయి. ఇక్కడే నాది ఇంకొక దీని కొనసాగింపుగా ఇంకో ప్రశ్న ఉంది ప్రతివాళ్ళు ఒక రెండేళ్ళ మూడేళ్ళలో నేను పెట్టిన 10 కోట్లు 1000 కోట్లు అవుతుంది 2000 కోట్లు అవుతుంది ఈ వాల్యేషన్ గేమ్ లో ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇదఎంత గ్యాంబ్లింగ్ అండి అసలు మన సంస్కృతే గ్యాంబ్లింగ్ అసలు నేషనల్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్లు ఎన్ఎస్సిలు ఈ దాని మీద షేర్లు పెట్టడం జంత అఫిషియల్ గానే అది అఫిషియల్ గానే చేస్తున్నారు గవర్నమెంటే గవర్నమెంటే లాటరీలు నడిపింది దౌర్భాగ్యం కాదు స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టడం దౌర్భాగ్యం లక్షల కోట్లు
(42:29) లక్షల కోట్లు లక్షల కోట్లు సంపద ఒక్క రోజులో 5 లక్షల కోట్లు ఆవిరి 10 లక్షల కోట్లు ఆవిరి నెంబర్లు ఇవంతా మోసం దగ సామాన్య మానవుడికి టోపీ ఇది ఇవి పోతే గాని ఈ అసలు జోద జోదరులుగా తయారు చేసేటువంటి తత్వం బహుశా మహాభారతం నుంచి తెచ్చుకున్నారేమో అవును కలిలో పరీక్షిత్తు యుద్ధానికి వెళితే కలి ఎక్కడెక్కడ ఉండాలో ఆ ప్లేసుల్లో ఉంది జూదం జూదం ఆ జూదమే జూదలుగా మారుస్తున్నారు తప్పు అది నేను ఎప్పుడు నమ్మను నా అందుకని పబ్లిక్ ఇష్యూ కి పోను శాకక్షలు నమ్మను ఇది నమ్మను ఓహో శాంతా పబ్లిక్ ఇష్యూ కు వెళ్ళకపోవడానికి ఇది కారణమా కాదు దీనికి ప్రధాన కారణం అమాయకులు నా
(43:09) కంపెనీ ఏమిటో దాని పరిస్థితి ఏమిటో దాని పురోగిత ఏమిటో తెలియని వాళ్ళు ఇది పెరుగుతుందని ఆశతో పెట్టడం నాకు ఇష్టం లేదు. అది వాడికి 10 రూపాయలు పెడుతున్నాడు అంటే అది వందో వెయ్యో అవుతుందనే కదా వాడికి ఆశ ఉంది ఆశను నేను యాక్సెప్ట్ చేసి తీసుకోవడం కాదు నాకు ఇష్టం లేదు. అవుతుందో కాదో నమ్మకం ఉండి నేను చేసే కృషి అదే ఫలితం ఏదైనా వీడితో ఉండాలని చెప్పి అనుకున్న వాడి దగ్గరే డబ్బు తీసుకున్నాను.
(43:36) అది నా బంధువులు నా స్నేహితులు ముగ్గురు నలుగురు అంతే ముగ్గురు నలుగురితోనే శాంత ప్రారంభమయింది. అంతేగనీ పబ్లిక్ ఇష్యూ అనేది నమ్మలేదు పోలేదు. హైదరాబాద్ అంతర్జాతీయంగా ఫార్మాకు పెద్ద హబ్బు ఇప్పటికే అయ్యింది భవిష్యత్తులో ఇంకా ఇంకా అనేక మెట్లు ఎక్కుతుంది అని చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత వాస్తవం ఉంది డెఫినెట్ గా ఎందుకంటే ఒకటండి హైదరాబాద్ కి అనుకోకుండా నాలెడ్జ్ బేస్ అయింది నాలెడ్జ్ సెంటర్ ఇది స్ట్రాటజికలీ ఇండియాకి నడి బొడ్డులో ఉంది ఏ బార్డర్ కి దగ్గరగా లేదు సముద్రానికి ఎటు సముద్రం చూసినా మధ్యలో ఉంది పీఠభూమి మీద అందుకే డిఫెన్స్ లాబ్స్ రీసెర్చ్
(44:17) లాబ్స్ అని ఇక్కడ వచ్చినాయి డిఎల్ఆర్ఎల్ డిఆర్డిఎల్ డిఎంఆర్ఎల్ భారత్ డైనామిక్స్ బిహెచ్ఎల్ బిఎల్ అన్ని ఇక్కడే వచ్చినయి సో మేదోపరమైనటువంటి సమాజం ఏర్పడింది చుట్టూ దానిి తగ్గట్టుగానే స్కూల్స్ కాలేజీలు కాలేజీల్లో కోర్సులు అన్ని తయారైనాయి. సహజంగానే వాళ్ళ పిల్లలు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నారు. చూడండి వ్యాక్సిన్ కంపెనీలు ఐదు ఉన్నాయి ఇక్కడ దేశంలో ఆరో ఏడో ఉంటే ఏడు ఉన్నాయి హైదరాబాద్ లోనే హైదరాబాద్ లో ఐదు ఉన్నాయి.
(44:44) డిఫెన్స్ లాబ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇంత మేదో సంపత్తి కలిగిన వాతావరణం ఉంది ఇక్కడ ఫార్మా కూడా ఐడిపిఎల్ ఇక్కడ ప్రారంభం అయింది. అక్కడి నుంచే ఎన్ని స్పిన్ ఆఫ్స్ డాక్టర్ రెడ్డి లాబ్స్ కానీ హెట్రోడక్స్ కానీ మైలాన్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి దానినుంచే వచ్చినాయి అందువల్ల దీనికి పునాది వేశారు. ఈ నేల మీద అవకాశం ఉంది నేను నమ్ముతాను ఇంతకన్నా పెద్ద ధనవంతులు ఉన్న అహ్మదాబాద్లో కావచ్చు కానీ దీనికి సాట రాదు నేను నమ్ముతాను ఇక్కడే జరుగుతుంది.
(45:13) ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు గారి వెనక మీరు తరచుగా కనిపిస్తూ ఉంటారు. ఆయనతో ప్రయాణం ఎట్లా మొదలైంది? అది అమ్మ పుణ్యం అమ్మ ఆయన ఉపన్యాసాలు విన్నది రేడియోలో మా ఇంటి పురోహితులు సుబ్రమణ్య శర్మ గారు ఆయన అడిగాను ఆయన ఒక సిడి ఇచ్చారు ఆ రోజు సిడీలు అద్భుతంగా ఉంది ఉపన్యాసం విన్నాను మా అమ్మ కోరిక కూడా అదే ఒకసారి వినరా వినరా అంటే విన్నాను.
(45:43) ఎందుకో ఆమె ఒకసారి ఆయన్ని కలవాలందిరా మా అమ్మకి ఆర్థరైటిస్ వయసు కూడా బయటికి ఎక్కడ తిరగదు బాగా ఉన్న రోజులో కూడా బయటికి వచ్చామని కాదు ఇంటికే పరిమితమైన మనిషి సరే ఆయన ఉపన్యాసాలు చెప్తున్నా మన ఇంట్లో చెప్పించుంది అంటే అంతకుముందు నేను వెరికపాటి వారి చేత ఉపన్యాసం చేయించాను ఆ పాత ఇంట్లో మన సామవేదం షణ్ముఖ సార్ సామవేదం సార్ ఆయన చేత చేయించాను.
(46:08) ఇంకొక ఆయన కూడా ఉన్నారు కదండీ జొన్నవిత్తుల జొన్నవిత్తుల వారు సామవేదం వారు గరికపాటి వారు అయినాయి ఒకసారి ఈయన పిలువు రా మా ఇంట్లో ఒక ఫంక్షన్స్ చేస్తుంటాం ఆ మాతా పితల సంస్మరణి అంటే మా అమ్మ ఉన్నప్పుడు మా నాన్నగారు పోయినప్పుడు ఆయన సంస్మరణ కింద చేసేవాడు. ఆయన ఇళ్లక వచ్చి చెప్పరంటమ్మ కానీ ప్రయత్నం చేస్తాను అమ్మ మొత్తం మీద ఆయన కలవడం జరిగింది అడిగితే నేను రానండి ఇక్కడికి చెప్పారు ఆయన టెంపుల్స్ లో చెప్తాను పబ్లిక్ ప్లేస్ చెప్తాను ఇళ్లకి రాను ఆయన ఎవరి దగ్గర ఒక రూపాయ కూడా తీసుకోరు.
(46:46) సరే అన్నాను ఆయన ఆయన అభిమాతాన్ని కాదు నేను అలా అవును అవును తర్వాత ఆయనే ఒకసారి ఫోన్ చేశరు మీ గురించి విన్నాను అమ్మగారు కోరారున్నారు కదా వస్తానున్నారు ఆ చెప్పారు వచ్చారు వచ్చి మా అమ్మని చూశారు తర్వాత తర్వాత సంవత్సరానికి రెండు సార్లు కావాలని అడిగారు ఆయన ఆయన దగ్గర నేను బాసిం పట్టు కూర్చొని ఏమి నేర్చుకోలేదు కానీ ఆయన ఫాలో అవుతాను ఆయన ఏం చెప్తారు అదే చేస్తారు ఏమి చేస్తారో అదే చెప్తారు.
(47:19) ఆయన కాషాయం కట్టని సన్యాసి చాలా గొప్ప వ్యక్తి అందువల్ల ఆయన అనుసరిస్తాను అనుకరిస్తాను. ఆ గురుపదేశంగా ఏమి తీసుకోలేదు చాలా నమ్మకం ఆయన అంటే నాకు ఆయన చెప్పింది చేస్తారు ఆయన గోశాల కొన్ని లక్షల మందిని కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారు చేశారు చేశారు నేను ఆ రకంగా ప్రభావితమైన వ్యక్తిని నేను ఆయన కానీ మా ఇద్దరి మధ్య తగుమాత్రం దూరమే ఉంది తరసుగా ఆడిపోయి కూర్చొని మీరు [నవ్వు] అన్నట్టుగా నేను తరసు కనపడను హైదరాబాద్ కి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తారు రెండు సార్లు మిగతా ఇప్పుడు ఆ విశ్వనాథ్ గారికి సంబంధించి చేసినప్పుడు నన్ను పిలిచారు వాళ్ళ అబ్బాయిలు విశ్వనాథ గారి సినిమా
(47:57) శంకరాభరణం గురించి చెప్పినప్పుడు తర్వాత ఆయన మిగతా కొన్ని ఆయన గురించి చెప్పిన ఉపన్యాసాలు వాళ్ళ పిల్లలే పిలిచారు విశ్వనాథ్ గారి పిల్లలు విశ్వనాథ్ గారు ఇక్కడ ఇంటర్వ్యూ చేశారు ఆల్ ఇండియా రేడియోకి మా ఇంట్లో ఆయనతో కూడా మంచి అనుబంధం ఉంది నాకు కానీ ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు ఆయన ఇంట్రవర్ట్ అలా ఆలోచిస్తూ ఉండేవారు మధ్యలో ఏదో నచ్చితే అబ్బాయి వరప్రసాద్ నాకు బాగా నచ్చావు అనేవాడు అంతే ఎక్కువ మాట్లాడేవారు తెలుగులో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకం ఏది అయ్యా చాలా పుస్తకాలు ఉన్నాయి మీ అంత జ్ఞాపక శక్తుడు చెప్పలేదు కానీ అయ్యో మీకు
(48:32) లక్షణంగా ఉంది జ్ఞాపక నాకు ఇటీవల కాలంలో బాగా ఇంపాక్ట్ చేసిన పుస్తకాలు రెండు ఉన్నాయి. ఒకటి విరాట్ స్టీఫాన్ స్వైక్ అని ఆయన రాసిన దానికి తెలుగు సేత పొనుగోటి కృష్ణారెడ్డి అబ్బబ్బబ్బబ్బా 38 పేజీలు అంతే పెద్ద బాల శిక్ష లాంటిది అది చిన్న పుస్తకం నాకు నా మీద నామీద నాకే అసహ్యం వచ్చింది అంత పర్సనాలిటీ మార్పు కావాలి జడ్జ్మెంట్ ఎవరిని జడ్జ్ చేయకు ఆడు ఏ కండిషన్స్ లో ఆ నిర్ణయానికి వచ్చాడో నీకు తెలియదు.
(49:07) నీకున్న అర్ధ సమాచారంతో వాడి మీద జడ్జిమెంట్ చేయకు అనేది దాని మూల సూత్రం అదిఒకటి చాలా ఇంపాక్ట్ అయింది దాని పుస్తకాలు 10వే 15వే కాపీలో చేసి అందరికీ పంచాను స్కూల్ పిల్లలకి చదవాలి వాళ్ళని ఇంకోటి నాకు ఒక కల ఉందని ఆయన కొరియన్ అది ఆ పుస్తకాన్ని తెలుగు సేత చేసిన నరసింహారావు గారు వైజాగ్ ఆయన ఆయన నన్ను ఆవిష్కరించమన్నారు. ఎందుకండీ అంటే ఎందుకో మీరు చేస్తే బాగుం అనిపించింది ఆయన కథ మీలాంటి కథే అన్నాడు.
(49:36) నిజమా అని చదివాను. చదివి ఆవిష్కరించాను మన సెక్రటరియట్ దగ్గర ఏదో ఉంది బుక్స్ పేరు మర్చిపోయాను బ్రిటిష్ లైబ్రరీ ఆ బ్రిటిష్ లైబ్రరీ సెక్రటరియట్ ఎదురుగా చదివితే సామ్యం చాలా ఉంది ఆయన డైరీ మనిషి కాదు మెకానికల్ ఇది లేరు ఆయన ఆయనకి ఇష్టం లేదు ఇవన్నీ ఆదర్శాలు నాలాగే కంపల్షన్ వచ్చింది. ఆయన రెచ్చగొట్టబడ్డాడు చేశాడు కాకపోతే ఆయనకి నాకు ఒక తేడా ఉంది.
(50:10) ఆయనది కాని సబ్జెక్ట్ లోకి ఆయన వచ్చాడు నిలబడ్డాడు అక్కడ చేశాడు కానీ దాన్ని వదలకుండా అక్కడే ఉండిపోయి కొంత అభాసపాలయ్యాడు నేను మాత్రం వదిలేయడానికి సిద్ధపడ్డాను నన్ను వాళ్ళు వదలకుండా కూర్చోపెట్టుకున్నారు ఇదే మీకు తెలుగులో సంగీతం సాహిత్యం రెండు ఇష్టం మీ వెంట దశాబ్దాలుగా పడుతున్న పాట ఏమిటి? అట్ట దశాబ్దాలుగా పడే పాట అంటూ చెప్పడం కష్టం చాలా ఉన్నాయండి అనేక సందర్భాల్లో అలా నాకు అసలు ఏది నేను నా దగ్గర 3700 అవును నేను ఇదివరకు మీరు చెప్పారు ఆ పాటలన్నీ పెన్ డ్రైవ్ మీరు అందరికీ ఇస్తుంటారు కూడా అందరికీ ఇస్తుంటారు మీకు ఇస్తాను అవన్నీ సాహిత్య పరంగా సంగీత పరంగా అద్భుతం
(50:50) ఉంటాయి దానికి తిరుగులేదు కొన్ని వేలు కాబట్టి ఒకటి కాదు కొన్ని వేలు వేలు 3700 పాటలు ఉన్నాయి అంటే జోనర్ గా నేను డివైడ్ చేశ ఆయన పోచుకోకూడదు కానీ వ్యాస భగవాన్ లాగా [నవ్వు] అది వేద విభాగం చేశంటంటే గీత విభాగం నేను 120 రకాల జోనస్ తయారు చేసుకున్నా కళ్ళ మీద పాటలు ఆ కలల మీద పాటలు హృదయం మీద పాటలు వెన్నెల మీద పాటలు అయితే నేను ఈ పాడ్కాస్ట్ ఇక్కడికి ముగించి తర్వాత ఎప్పుడన్నా మీతో తిరుగుతూ ఈ విభాగాల్లో విడిగా కొన్ని ప్రోగ్రాములు చేయాలి.
(51:21) చేయండి నేను మీకు అది ఇస్తాను. ఆ టాబ్లెట్ గాని ఇస్తాను కొంత టైం పట్టొచ్చు ఈ లోపల ఒక పుస్తకం నేను క్యూఆర్ కోడ్ పెట్టి ఇచ్చాను దాంట్లో అన్ని ఫోటోస్ ఉన్నాయి ఆ స్కాన్ చేస్తే మీకు అపార్ట్మెంట్ ఆ వచ్చేస్తది హాయ్ పుస్తకం ఇస్తాను ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి నేను ఇంకొక 20 ప్రశ్నల వరకు పెట్టుకున్నాను కానీ గంటలు గంటలు అయితే జనం కూడా చూడరు కాబట్టి మళ్ళీ మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా విడిగా ఇప్పుడు కవర్ చేయని విషయాలు మాట్లాడతాను మీరు ఇంటికి పిలిచి ఆతిత్యం ఇచ్చి చాలా చాలా సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు మీకు
(51:56) నేను దాన్ని ఏమంటారు చంద్రుడికి ఒక నూలుపోగులాగా జర్నలిజం లో నాకు గురువైన బోధరాజు రాధాకృష్ణ గారు రాసిన ఆ మరువరాని మాటలు తెలుగు భాషలో ఎప్పటికీ మర్చిపోకుండా సామెతల్లాగా వాడుతున్న ఈ పుస్తకం మీకు ఇవ్వాలని ఇది శాంతా వరప్రసాద్ రెడ్డి గారితో ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమం మరో విశిష్టమైన అతిథితో తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు సెలవ్ నమస్కారం [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment