Friday, August 21, 2026



 

🦚జ్ఞానప్రసూనాలు🚩

1. ఆ పురుషుడు స్రష్ట అనియు, విశ్వము సృష్టింపబడినది అనియు భావించుట అసంగతము. ఒక దీపము మరియొక దీపముతో వెలిగింప బడినప్పుడు వాని మధ్య స్రష్ట-సృష్టి అను సంబంధము లేదు. అగ్ని ఏకమే.

2. ఆకాశము ఆకాశముగా ఆకాశములో నుండునట్లే బ్రహ్మము బ్రహ్మముగా బ్రహ్మములో నుండును.

3. ఈ సృష్టి అనునది అవిభాజ్యమగు బ్రహ్మమే.

4. ధనార్జనకై వంటచెరకును సేకరించుటలో నిమగ్నుడయిన వానికి చింతామణి లభించినట్లు తమ అవసరములను నెరవేర్చుకొనుటకై గురువును, శాస్త్రములను ఆశ్రయింతురు. అయినను కాలక్రమమున గురు, శాస్త్రముల ఉపదేశములను అనుష్టించుటవలన వారు ఎక్కువ విలువగల ఒకానొక విషయమును(మోక్షమును) సాధింతురు.

5. బ్రహ్మము సర్వశక్తి సంపన్నము.

No comments:

Post a Comment