దయ్యాలు నిజంగా ఉంటాయా😱 #goast #fear #telugubhakti #sanatandharma #harekrishna #bhagavadgita #vedic
Author Name:Kurmagram
Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uNvBcoEig_c
Transcript:
(00:00) దయ్యాలు నిజంగా ఉంటాయా హరే [గొంతు సవరించుకోవడం] కృష్ణ సాధారణంగా షైతాన్ అంటారు షైతాన్ అంటే దయ్యము అంటారు. ఇంకొకవైపు దేవుడు దేవుడు దయ్యము ఇద్దరు గొడవ పడుతుంటారు అని అంటారున్నమాట చాలామంది వాళ్ళ యొక్క గ్రంథాలలో దేవుడు దయ్యము షైతాన్ దేవుడు ఇలా చెప్తుంటారు [సంగీతం] యాక్చువల్ గా వాస్తవంగా చెప్పాలంటే దయ్యము భగవంతుడితోటి సమానమే కాదు అసలు భగవంతుడు భగవంతుడు అండర్లోనే ఈ దయ్యాలు ఇవన్నీ ఉంటాయి కానీ భగవంతుడితోటి ఫైట్ చేయడానికి దయ్యాలు ఉండవండి ఎందుకంటే దయ్యాలు సాధారణమైనవి చూడండి మన శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే గరుడ పురాణం తీసుకున్నట్లయితే అందులో నాలుగు రకాల
(00:39) దయ్యాల గురించి వర్ణించబడింది. ఒకటి భూతాలు ప్రేతాలు పిశాచులు బ్రహ్మ రాక్షసులు వీళ్ళు ముఖ్యమైన వాళ్ళఅన్నమాట దయ్యాలలో సో భూతాలు అంటే ఎవరు మామూలుగా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు లేదా కార్ యాక్సిడెంట్ో ఏదైనా సడన్ గా యాక్సిడెంట్ అయి చనిపోతారు అకాల మరణం చెందుతారు వీళ్ళు భూతాలలాగా జన్మిస్తారు. ప్రేతాలు ప్రేతాలు అంటే ఎవరు ఇప్పుడు ఎవరైతే పుత్రులు సాధారణంగా మన యొక్క సంప్రదాయం ప్రకారంగా ఆ మనకు ఎవరైతే పిల్లలు ఉంటారు కదా మన సంతానం మనం చనిపోయాక వాళ్ళు శ్రార్దం పెట్టాలి పిండ ప్రధానం చేయాలి పిండ ప్రధానం చేయకుంటే మనం ప్రేతాల్లాగా జన్మిస్తాం
(01:13) మూడోది పిశాచులు పిశాచులు అంటే ఎవరంటే ఎవరైతే బతికి ఉన్నప్పుడు ఘోరమైన పాపకర్మలు చేసి అనేకంగా జీవులని హింసించి ఇతరులను మోసం చేసి అత్యాచారాలు చేసి వీళ్ళందరూ కూడా మరణం తర్వాత పిశాచుల్లాగా జన్మిస్తారు. ఇక బ్రహ్మ రాక్షసులు నాలుగో వాళ్ళు బ్రహ్మ రాక్షసులు అంటే ఎవరంటే వాళ్ళు శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారు అంటే వేదాల్లో ఉన్నది ప్రతి విషయం వాళ్ళకు తెలుసు కానీ ఆ తెలిసిన విషయాన్ని వాళ్ళు తప్పుడు మార్గంలో దాన్ని ఉపయోగించుకొని మంత్ర శక్తులు సాధించి చెడు మార్గాల్లో అవి దురుపయోగం చేస్తారు వాళ్ళందరూ మరణించిన తర్వాత బ్రహ్మ
(01:46) రాక్షసులై జన్మిస్తారు అన్నమాట కాబట్టి భగవంతుడికి ఈ నాలుగు కేటగిరీలకు సంబంధం లేదండి భగవంతుడు ఈ మొత్తం సృష్టికర్త కానీ ఈ భూత భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసులు మనం చేసిన కర్మల వల్ల మనం పొందే దుఃఖమైన బాధలు అన్నమాట ఇవి కాబట్టి మనము కొందరికి దయ్యం పట్టింది అంటారు అవును ఆ సూక్ష్మ శరీరం తోటి ప్రవేశిస్తుంది కానీ దయ్యాలు భూతాలకు కూడా దుఃఖాలు ఉంటాయి ప్రతి ఒక్క జీవుడు కూడా దుఃఖం తోటే అనుభవిస్తున్నాడు ఎందుకు చూడండి మనం చనిపోయిన తర్వాత మనకు శరీరం లేకుండా మనం తిరిగినట్టయితే శరీరం కావాలి శరీరం కావాలి అని ఏడుస్తుంటాయంట భూత ప్రేత పిశాచాలు నాకు ఎందుకు మళ్ళీ
(02:24) శరీరం లేదు అని అందుకనే నే మనకు సనాతన ధర్మంలో శారద పిండకర్మ అనేది ఉండేది ఇది పెట్టడం చాలా అవసరం ఇది పెట్టినట్లయితే మన పూర్వీకులు ఎవరైతే భూత ప్రేత పిశాచాలాగా తిరుగుతుంటారో వీళ్ళకు మళ్ళీ శరీరం దొరుకుతుంది అందుకే సైన్స్ కన్నా గొప్పదే మన శాస్త్రము శాస్త్రంలో ప్రతిదీ సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు కూడా చెప్పబడ్డాయి కాబట్టి దయ్యాల గురించి ఎక్కువ వరీ అవ్వకండి భగవంతుడు హరినామము ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళ దగ్గర దయ్యాలు భూతాలు ఏవి రానేరావు కాబట్టి హరినామము చేయడం అత్యంత అవసరం హరే హరే కృష్ణ
No comments:
Post a Comment