*🙏🩶అనిత్యం అసుఖం లోకం!!!*
*" ప్రపంచంలో శాంతి దొరుకుతుందని భావించి దానికోసం అనేకవిధాలుగా మనం పోరాడుతున్నాము. కాని, శాంతి జగత్తులో లేదు, నీలోనే ఉన్నది. ఒక వ్యక్తి ఏదో పని నిమిత్తం పట్నం పోయి ఒక హోటల్ కోసం చూస్తాడు. ఒక హోటల్ ముందర 'బ్రాహ్మణ హోటల్' అని బోర్డు కట్టి ఉంటుంది. మరోవైపు చూస్తాడు, అక్కడ 'మిలిటరీ హోటల్' అని బోర్డు వ్రేలాడదీసి ఉంటుంది. శాకాహారి అయితే బ్రాహ్మణ హోటల్లోనికి ప్రవేశిస్తాడు, మాంసాహారి అయితే మిలిటరీ హోటల్లోనికి ప్రవేశిస్తాడు. పేరు చూడకుండా మిలిటరీ హోటల్లోనికి ప్రవేశించి ఇడ్లీ, సాంబారు కావాలంటే వాడు ఇస్తాడా? 'ప్రక్క హోటల్కు పో' అంటాడు. అదేవిధంగా, ప్రపంచానికి వ్రేలాడగట్టిన బోర్డుమీద 'అనిత్యం అసుఖం లోకం' అని వ్రాసి ఉంది. ఆ బోర్డును చూసినవారెవరైనా ప్రపంచంలో శాంతి కావాలని అడుగుతారా? తనయందున్న శాంతిని మరచి జగత్తులో వెదకడానికి ప్రయత్నిస్తే అది దొరికేది కాదు. దైవాన్ని ఆశ్రయించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది. జగద్భావాన్ని దూరం చేసుకుంటేనే దైవభావమనే శాంతి లభిస్తుంది. ఈ విశ్వాసాన్నే మనమీనాడు పెంచుకోవాలి, చాటాలి."*
*"~భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు @ శత వసంత సౌరభం - అవతార వైభవం."*
No comments:
Post a Comment