*ॐ श्री शिवानन्दलहरी*
*శ్రీ శివానన్దలహరీ*
*SREE SIVAANANDA*
*LAHAREE*
*(श्रीमच्छंकरभगवतः कृतौ)*
*(శ్రీ శంకరాచార్య విరచితమ్)*
*(BY SREE AADI SANKARA)*
*శ్లోకం : 80/100*
*SLOKAM : 80/100*
*एष्यत्येष जनिं मनोऽस्य कठिनं*
*तस्मिन्नटानीति म-*
*द्रक्षायै गिरिसीम्नि कोमलपदन्यासः*
*पुराभ्यासितः ।*
*नोचेद्दिव्यगृहान्तरेषु सुमनस्तल्पेषु*
*वेद्यादिषु*
*प्रायः सत्सु शिलातलेषु नटनं*
*शम्भो किमर्थं तव ॥ ८०॥*
*ఏష్యత్యేష జనిం మనోఽస్య*
*కఠినం తస్మిన్నటానీతి మ*
*ద్రక్షాయై గిరిసీమ్ని కోమల*
*పదన్యాసః పురాభ్యాసితః I*
*నోచేద్దివ్య గృహాంతరేషు*
*సుమనస్తల్పేషు వేద్యాదిషు*
*ప్రాయస్సత్సు శిలాతలేషు*
*నటనం శంభో! కిమర్థం తవ ॥*
*"వీడు మళ్లీ పుడతాడు.*
*వీడి మనస్సు ఎంతో కఠినమైనది.*
*గట్టిగా ఉండే ఆ మనస్సుపై నేను సంచరించాలి" అని భావించి,*
*నా రక్షణ కోసం - అంటే నా కఠినమైన మనస్సుపై తిరగడం కోసం, పర్వత ప్రాంతాలలో పాదాలు ఉంచడం ముందుగా అభ్యసించావా? అలాకాకపోతే*
*శంకరా!*
*ఎల్లప్పుడూ దివ్యసౌధాలలో పూలపాన్పులూ అరుగులూ ఉండగా,*
*ఎందుకని బండరాళ్లపై నాట్యం చేస్తావు?*
*This one will be born, his mind is hard and I have to dance on it.*
*So thinking my lord ,*
*To save me ,you walked with your tender soft feet on hard surfaced mountains,*
*during yore and practiced and learnt.*
*If it is not so instead of walking,*
*in divine homes, beds of flowers and well laid out paths.,*
*You danced on rocky surfaces.*
*Is it the meaning of that, Oh Shambhu?*
*ఉత్తమ భక్తుడు*
*- తన మనస్సులో పరమేశ్వరుడు తప్పక తన పాదపద్మాలని నిల్పుతాడు.*
*- పరమేశ్వరుడు తన్ను రక్షిస్తాడని ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉంటాడు.*
*పరమేశ్వరుడు కూడా తదనుగుణంగానే వాత్సల్యాన్ని ప్రదర్శిస్తాడు.*
*1.ఇందు శివుని త్రికాలవేదిత్వము సూచింపబడింది.*
*2.శివుని కైలాసనివాస తాండవముపట్ల భావింపబడిన కారణం కడు మనోహరం, వాత్సల్య భక్తిసూచకము.*
https://youtu.be/fts-bccDXJM?si=vTBhZbLdMnl9m-UF
*కొనసాగింపు..*
*=x=x=x=*
*సేకరణ, కూర్పు :*
*రామాయణం శర్మ*
*భద్రాచలం*
No comments:
Post a Comment