Thursday, March 30, 2023

ఆనంద మార్గంలో వుండడమంటే అనుభవం నించీ నేర్చుకోవడం. చేసిన తప్పుల్నే చెయ్యకపోవడం. అదే ఈర్ష్య, అదే కోపం, అదే అసూయ, అదే అత్యాశ. వాటిని మళ్ళీ మళ్ళీ చేయకు. ఇది మేలుకునే సమయం.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 321 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆనంద మార్గంలో వుండడమంటే అనుభవం నించీ నేర్చుకోవడం. చేసిన తప్పుల్నే చెయ్యకపోవడం. అదే ఈర్ష్య, అదే కోపం, అదే అసూయ, అదే అత్యాశ. వాటిని మళ్ళీ మళ్ళీ చేయకు. ఇది మేలుకునే సమయం. 🍀*

*అనుభవం నించీ నేర్చుకోని జంతువు మనిషి ఒక్కడే. ఇది నా పరిశీలన. చివరికి గాడిదలు కూడా నేర్చుకుంటాయి. అరబిక్లో గాడిద కూడా రెండోసారి గుంతలో పడదు అన్న సామెత వుంది. మనిషి వేలసార్లు గోతిలో పడతాడు. ఒకటి రెండుసార్లు కాదు, వేలసార్లు, 'అరే పొరపాటయింది. అప్పుడయితే చీకటి. ఇప్పుడు వెలుగు వుంది. ఈ సారయినా పడను అని ఆలోచించాడు. ఇది మనిషికి సంబంధించిన ముఖ్యమయిన పరిశీలన. అతను తన అనుభవం నించీ నేర్చుకోడు.*

*ఆనంద మార్గంలో వుండడమంటే అనుభవం నించీ నేర్చుకోవడం. చేసిన తప్పుల్నే చెయ్యకపోవడం. అదే ఈర్ష్య, అదే కోపం, అదే అసూయ, అదే అత్యాశ. వాటిని మళ్ళీ మళ్ళీ చేయకు. ఇది మేలుకునే సమయం. పరిశీలనకు, చురుకుదనానికి, పాతమార్గాల్లో పడకుండా చైతన్యంతో వుండడానికి సమయం. నువ్వు పరీశీలనకు, సమర్థుడివి. అన్ని ఆటంకాల్ని, వంచనల్ని అధిగమించడానికి సమర్థుడివి. వాటిని దాటి వచ్చినపుడే నువ్వు ఆనందాన్ని అందుకుంటావు. అప్పుడే ఆకాశం నించీ నీ మీద పూల వర్షం కురుస్తుంది. నీ జీవితం ఆనందమయమైతే ఆ కాంతి యితరుల మీద కూడా ప్రసరిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

:::: మనస్సు రెండు రకాలు గా పనిచేస్తుంది,::::

 *:: మనస్సు రెండు రకాలు గా పనిచేస్తుంది,::*

*1) నేనైన మనస్సు*:- 

         మనస్సు  తనకు తాను ఒక యాజమాన్యాన్ని ఆపాదించు కొని, స్వాతంత్ర్యాన్ని ప్రకటించు కొని, గతం యెక్క బంధనం లో ఇరుక్కుపోయి, గతజ్ఞానం ఆధారంగా , వర్తమానంలో ఇమడలేనందున, భవిష్యత్తు మీద ఆశతో ఊహలతో, స్వేచ్ఛ లేక కట్టడి చేయబడి, నిబద్దతై, సంకుచిత పరిధి లో,మూసుకు పోయి,ఇరుకుగా వుంటుంది. 

*2) స్వేచ్ఛ మనస్సు*:-

       స్వేచ్ఛ గా, వర్తమానాన్ని  ఆస్వాదిస్తూ, కాల స్పృహ లేకుండా, అంతా ఎరుకై, నూతన స్పందనలతో,  నిర్మల మై, నిశ్చలమై, సున్నితంగా, వినమ్రమై, వివృతంగా, సావధానంగా, పరిశుద్ధ గా, నిర్భయంగా, ఎప్పుడూ క్రొత్తగా, అమాయకంగా, కుశలమై, కొనసాగే ప్రవాహంగా వుంటుంది.

ధ్యానించే మనస్సుకి, సొంత దారుడు, యజమాని లేడు.

*షణ్ముఖానంద 98666 99774*

::::::: కారణాలు, ఫలితాలు::::::

 *::::::: కారణాలు, ఫలితాలు::::::*
     *భయం*  మనకు భయం వేస్తూ వుంటుంది.  భయ పడకూడదు అని భయం పోవాలి అని అనుకుంటాం.
    *ఆందోళన* మనం ఆందోళన పడతాము.
ఆందోళన వద్దు , ఎప్పుడు ప్రశాంతత చేకూరుతుందా అని ఎదురు చూస్తాం.
       *దుఃఖం*  దుఃఖం కలుగుతూ వుంటుంది. ఇది ఏమి కర్మ రా అని ఏడుస్తాం.
    *కంగారు*  కంగారు పడతాం. నిశ్చలంగా వుంటే బాగుండు అని ఆశ పడతాం.
      *ఇవన్నీ ఫలితాలు ఇవేవి ఊరక రావు.*

  వీటికి కారణాలు వుంటాయి. అవి  కోరికలో, ఆశలో, ఒక దానికోసం పడే తపనో 
, ఆత్రుతతో, అజ్ఞానమో  కావచ్చు.
   ఈ కారణాలు వున్నంత కాలం పైన చెప్పిన భయాలు, ఆందోళనలు, కోపాలు వుంటాయి. మనం వీటిని అణచి వేస్తూ వుంటాము.
కారణం అలానే వుంటుంది కనుక మరల వస్తాయి.
 
   కారణాలను లేకుండా చేయిటే  ధ్యానం.
*షణ్ముఖానంద 9866699774*

మనసును నిరంతరం ధ్యానస్థితిలో నిలిపే మార్గం ఏమిటి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"513"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"మనసును నిరంతరం ధ్యానస్థితిలో నిలిపే మార్గం ఏమిటి ?"*

*"మనశ్శాంతికి, మోక్షానికి ఎంతకాలం పడుతుందని గురువుతో నిబంధనలు పెట్టుకోవటం శరణాగతికాదు. శరణాగతిలో తనకంటూ ప్రత్యేక ఆలోచన ఉండదు. కనుక గురువును నిరంతరం తలుచుకోవడం ద్వారా దైవస్మరణమే తన నిత్యకృత్యం అవుతుంది. అదే మనసుకు నిరంతరం ధ్యానస్థితిని కలిగిస్తుంది. మనం ధ్యానించ దలుచుకున్న నామం, వస్తువు, లేదా విషయం ఏదైనా మన మనోబలాన్ని బట్టి సిద్ధిస్తుంది. ఒక విషయం మన మనసులో ఎంత బలంగా ఉంటుందో అదే మన మనోబలం అవుతుంది. వెనక కూర్చున్న అందమైన భార్యతో బండిపై సినిమాకి వెళ్తున్న వ్యక్తి అప్పటివరకు సంతోషంగా ఉంటాడు. ఇంతలోనే డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయిన విషయం గుర్తుకురాగానే సంతోషంకన్నా ఏక్షణంలో ఎవరు పట్టుకుంటారోనన్న భయం మొదలవుతుంది. మనోబలం అంటే మనసు యొక్క లావు-వెడల్పులు కావు. ఆ మనసుకు ఎక్కువసార్లు గుర్తుకు వచ్చే విషయమే మన మనోబలం. దైవం, గురువు విషయంలోనూ పొందే శరణాగతే భక్తుడికి, సాధకుడికీ నిజమైన మనోబలం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              🌼💖🌼💖🌼
                     🌼🕉️🌼
                          *"శ్రీ"*

శాంతి, సుఖం ఈ రెండూ లభించే తీరులోవున్న తేడా ఏమిటి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"512"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"శాంతి, సుఖం ఈ రెండూ లభించే తీరులోవున్న తేడా ఏమిటి ?"*

*"మన మనసు శాంతిని, దేహం సుఖాన్ని కోరుతుంది. సుఖం కావాలంటే కోరుకున్న వస్తువు సమకూరాల్సిందే. కానీ శాంతి కావాలంటే అలాకాదు. కేవలం మానసిక భావన చాలు. మనకి కారు కొనుక్కోవాలి అనిపించింది. కారు లభించినప్పుడే దానిలో ఎక్కిన సుఖం మనకి దొరుకుతుంది. కానీ కారు కొనుక్కోవాలని మనం పెట్టుకున్న లోన్ అప్లికేషన్ మేనేజర్ అంగీకరించగానే మనకి శాంతి లభిస్తుంది. అలాగే వివిధ స్థాయిల్లో భక్తులు, శిష్యులు దైవం-గురువుల వద్ద అలాంటి శాంతినే పొందుతారు. అది శరణాగతితోనే సాధ్యమవుతుంది. అందుకే గురు-దైవ దర్శనం అయిన వెంటనే మనం కోరుకుంటున్న శాంతిని పొందుతున్నాం. మనం కోరినది వారు ఇస్తారన్న విశ్వాసం ఉన్నవారికే ఈ శాంతి కలుగుతుంది. ఆ విశ్వాసమే మనలో శరణాగతిని కలిగిస్తుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              🌼💖🌼💖🌼
                     🌼🕉️🌼
                          *"శ్రీ"*

ఎవరు గొప్ప

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

🪸🪸 *"ఎవరు గొప్ప"* 🪸🪸
     🪷🪸🪷🪸🪷🪸🪷
           🪷🪸🕉️🪸🪷
                 🪷🪸🪷
                       🪷
*"సుగంధపూరిత పరిమళాన్ని అందించే పుష్పం గొప్పదా, అటువంటి పుష్పాన్ని పూయించిన పూలమొక్క గొప్పదా, పూలమొక్క పెరిగి పుష్పించడానికి తోడ్పడిన, సూర్యరశ్మి, గాలి, నీరు, ఎరువు, భూమి మొదలైనవి గొప్పవా..."*

*"వైవిధ్యభరితమైన ఈ సృష్టి ఎంత గొప్పది సుందరమైన సృష్టిని సృజించిన సర్వేశ్వరుని సృజన మరెంత గొప్పదో కదా! నేనే గొప్ప, నా మతం, నా కులం గొప్ప లాంటి మాటలనడం వల్ల ఎన్నటికీ గొప్పవారు కాలేరు. ఈనాటి మానవుడు ఇతరుల భావాలను కించపరుస్తూ, తన గొప్పతనాన్ని చాటుకోవటానికి అహర్నిశలూ అప్రతిహతంగా కృషి చేస్తాడు. తనదే పైచేయి కావడం కోసం ఏ పాపకార్యాన్నయినా చేయటానికి వెనుకాడరు."*

*"కొందరు మేం గొప్పవారమని బీరాలు పలుకుతారు. వృక్ష, జంతు, భూచరాలు, జలచరాలూ, గాలి, నీరు, అగ్ని, మట్టి, ప్రకృతి అన్నీ కేవలం మానవుని సుఖసంతోషాలకే కైంకర్యం అవుతున్నాయి. వీటన్నిటినీ హరించి, భుజించి నేనే గొప్ప అని మిథ్యలో మానవుడు ఉన్నాడు."*

**నీటికి నీవేమిచ్చావని నీ దాహం తీరుస్తుంది, చెట్లకు ఏమిస్తున్నావని మధుర ఫలాలనిస్తున్నాయి,         ఐదు వేళ్లు ఒకటైతే గానీ ఆహారాన్ని నోటికి అందించలేమే. నోరు, దంతాలు, నాలుక సహకరిస్తే గానీ ఆహారం గొంతునుంచి కిందకి జారదే! లాలాజలం, జఠరాగ్ని ప్రమేయం లేకుండా ఆహారం జీర్ణం కాదే, జీర్ణమైన ఆహారం, రక్తంగా మారే ప్రక్రియ ఎంత గొప్పది. శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే హృదయం గొప్పతనం మాటేమిటి మరి, ఎవరు గొప్ప? శరీరంలో ఎక్కడైనా ఒక భాగానికి గాయమైతే మొత్తం శరీరంలో ఉండే వ్యాధినిరోధక శక్తి ఒక్కటై ఆ భాగం వెంటనే కోలుకోవటానికి ఎంతగా సహకరిస్తుందో. ఆ ప్రక్రియ ఎంత గొప్పది."*

*"కంటికి కనిపించని ఉపకారం చేసే సూక్ష్మజీవులు కోటానుకోట్లు మన దేహంలో ఉంటూ, ఈ దేహాన్ని అనుక్షణం కాపాడే వాటి సంగతేంటి, వాటి గొప్పతనం గురించి ఎన్నడైనా చెప్పాయా. గొప్పవారెప్పుడూ అందరినీ గొప్పవారిగా చేయాలనే చూస్తారు."*

**మహాత్ములు, మహాపురుషులు, ధర్మస్థాపకులు వారి చర్యలు, ఆలోచనల ద్వారా సుగంధ పరిమళాలను వెదజల్లుతారు. కానీ ఎవరినీ కించబరచరు. తక్కువ చేయరు."*

*"ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ ‘వెనుక తరాలవారు వారి పరిశోధనల ద్వారా అందించిన పరిశోధనా ఫలాలు నా ప్రయోగానికి ఎంతో ఉపకరించాయి’ అని సవినయంగా చెప్పడం.. ఆయన గొప్పతనమే.      చెట్టు మొక్క వేర్లు గుప్తంగానే ఉంటాయి. కానీ వేళ్లే చెట్టు మనుగడకు మూలాధారం."*

*"మానవుల సుఖమయ జీవితానికి ఎందరో గుప్త సేవ చేస్తున్నారు. వారి సేవ ఎంత గొప్పది, మానవజాతి మనుగడకు క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు, వృక్ష, జంతుజాతులు.. ఒకటేమిటి ఈ సువిశాల విశ్వంలో పంచతత్వాలు కర్పూరమై కరిగిపోతున్నాయి."*

*"ఇప్పుడు చెప్పండి... ఎవరు గొప్ప"""*
*"ఈ మానవ దేహాన్ని నడిపించే పవిత్ర ఆత్మ ఎంత గొప్పది, స్థూలంగా కనిపించే కర్మేంద్రియాల కంటే మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఆత్మ మూలగుణాలైన శాంతి, శక్తి, ప్రేమ, పవిత్రత, ఆనందం, జ్ఞానం సంతోషం వల్ల ఆత్మ దివ్యగుణాలతో శోభిల్లుతుంది."*
            🪷🏵️🪷🏵️🪷
                  🪷🕉️🪷
                       *"శ్రీ"*

దేహంతోవున్న గురువుకు సేవలు చేయటం, ఆయన దేహంకాదు విశ్వవ్యాపకులుగా భావించటం ఈ ద్వంద్వ వైఖరులు ఏమిటి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"511"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"దేహంతోవున్న గురువుకు సేవలు చేయటం, ఆయన దేహంకాదు విశ్వవ్యాపకులుగా భావించటం ఈ ద్వంద్వ వైఖరులు ఏమిటి ? "*

*"గురువుతో మనకు పని ఉన్నప్పుడు దేహంగా భావించి వెళ్తున్నాం, వేడుకలకు ఆహ్వానిస్తున్నాం. మన బాధ్యతగా గురువు వద్దకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన సర్వవ్యాపకుడు కదా అని తప్పించుకుంటున్నాం. ఆహ్వానించే విషయంలో గురువును దేహంగాను, వారి ఎడల మన బాధ్యతలను తప్పించుకునేందుకు విశ్వవ్యాపకుల గాను ద్వంద్వభావంతో ఉండకూడదు. మనం ఒక వ్యక్తిని ప్రత్యక్ష గురువుగా భావిస్తాం. ఆ వ్యక్తి గురువు సర్వత్రా ఉన్నాడు అని బోధిస్తారు. అయినా ఆ మాటపై కొందరికి నమ్మకం కలగదు. మన అజ్ఞాన దృష్టి వారిని దేహంగానే భావిస్తోంది. గురువు ఎడల మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని నిర్వర్తించే విషయంలో వారి దేహానికి తగిన విలువ ఇవ్వాలి. మన సంస్కృతిని నిలిపేందుకు గురువు నిర్వహించే కార్యక్రమాల్లో స్వయంగా మనం పాల్గొనాలి. మనని మనం సంస్కరించు కోవడం కోసం దేహంగాఉన్న గురువు ప్రవర్తనను గమనించాలి. ఇలాంటి వాటి విషయంలో మనం అనుకునే గురువును దేహంగా చూడవలసిందే. గురువుకు సాష్టాంగ ప్రణామాలుచేసి, గురువుకు ఇష్టమైన ధార్మిక విషయాలను విస్మరించడం శరణాగతి కాదు. ఆధ్యాత్మిక వ్యాపారమే అవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             🌼💖🌼💖🌼
                    🌼🕉️🌼
                         *"శ్రీ"*

సద్గురువుకు, దైవానికి మధ్య తేడా ఏమిటి

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
      💖💖 *"510"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"సద్గురువుకు, దైవానికి మధ్య తేడా ఏమిటి ?"*

*"శరణాగతి చెందిన తర్వాత సద్గురువుకు, దైవానికి మధ్య తేడాలేదని తెలుస్తుంది. మూడు ముళ్ళు వేస్తే వివాహబంధం ఏర్పడుతుంది. గురువుతో మన బంధం అలా ఏర్పడేది కాదు. మన జన్మజన్మాంతరాల్లో ఆ బంధం మనకు తోడుగా వుండేది. సద్గురువుతో సంబంధం ఒక మంత్రంతోనో, శిరస్సుపై చేయిపెట్టి దీవిస్తేనో ఏర్పడేది కాదు. సద్గురు చేతిని మన శిరస్సుపై ఉంచాలని మనం కోరుకునేది ఎందుకంటే ఆ సద్గురువు అప్పటికే మన తలలోనే ఉన్నట్లు గుర్తించక పోవటం వల్లనే !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              🌼💖🌼💖🌼
                    🌼🕉️🌼
                         *"శ్రీ"*

ఆధ్యాత్మిక ఉన్నతి కోసం శరణాగతి చెంది ఉపదేశాలు అనుసరించాలా ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"509"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ఆధ్యాత్మిక ఉన్నతి కోసం శరణాగతి చెంది ఉపదేశాలు అనుసరించాలా ?"*

*"గురువు పట్ల శరణాగతి ఏర్పడేకొద్దీ ఆయన మనలోనే ఉండి ఇదంతా ఎలా చేస్తున్నారనే విషయం అవగాహనలోకి వస్తుంది. "శరణాగతి పొందని వారికే ఉపదేశాలు" అని భగవాన్ శ్రీరమణమహర్షి నిర్ధ్వంధంగా చెప్పారు. నిజంగా మనం శరణాగతి చెందితే, సద్గురు మనలోనే ఉండి మనని ప్రతిక్షణం ఎలా నడిపిస్తున్నారో అర్ధం అవుతుంది. మనం గురువు నుండి ఉపదేశాన్ని, వారి కరస్పర్శను కోరుతుంటాం. అంటే మనమింకా పూర్తి శరణాగతి చెందలేదని అర్ధం. ఉపదేశ, కరస్పర్శలు నిజాయితీతో స్వీకరిస్తే శరణాగతికి సోపానాలు అవుతాయి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              🌼💖🌼💖🌼
                    🌼🕉️🌼
                         *"శ్రీ"*

::::: మెదడు VS మనస్సు :::::

 *::::: మెదడు VS మనస్సు ::::::::::*

1) మెదడు హార్డ్ వేర్.
    మనస్సు సాప్ట్ వేర్ .
2) మెదడు స్వతంత్రగా పని చేయ గలదు.
మనస్సు మెదడు సహాయం లేకుండా పని చేయ లేదు.
3) మనస్సు కి మెదడు ఒక పరికరం.
మెదడు కి మనస్సు ఒక సుప్రీం 
4) మెదడు పరిణామ ఫలితం.
 మనస్సు వికాస ఫలితం. 
5) మెదడు లేని  ప్రాణులు వున్నాయి.
మనస్సు (చైతన్యం లో భాగం గా) లేని ప్రాణం వుండదు.
6) మెదడు నిబద్దం అవుతుంది.
మనస్సు నిబద్దం అవదు.
7)మెదడు కి రోగం రావచ్చు.
మనస్సు కి రాదు.
8) మెదడు వ్యక్తిగతం
మనస్సు సామూహికం
9)మెదడు శక్తి పరిమితం
మనస్సు శక్తి అపరిమితం.
10) మెదడుకి అలసట వుంటుంది
మనస్సు అలవదు.
11)మెదడు పరికరం
మనస్సు కార్య కలాపం
*షణ్ముఖానంద 98666 99774*

శ్రీ రమణీయం - 6 🌹 🥀 కార్యమా? కారణమా? 🥀

 [3/27, 17:11] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 6 🌹
🥀 కార్యమా? కారణమా? 🥀 
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 6. కార్యమా ? కారణమా? 🌈

✳️ మనం పనిని కాదు! ప్రేరణని గుర్తించాలి! రోజు చేసే పనుల్లో మన ప్రయత్నాలను మాత్రమే పరిగణిస్తున్నాం. అందుకే అంతా మన ప్రమేయంతో జరిగిపోతుందన్న భ్రమతోనే ఉంటున్నాం. కానీ, మన ప్రమేయం లేకుండానే జరిగిపోయేదే ‘విధి’ అని మరచిపోతున్నాం. ఈ భ్రాంతిపోవాలంటే అసలు ఆ ప్రయత్నానికి వెనుక ఉన్న “ప్రేరణ” ఎవరిది అని విచారించి గుర్తించాలి. ఈ సృష్టిని నడిపే ఈశ్వరుడే మనలో ప్రేరకుడిగా ఉన్నాడని గుర్తించిన రోజు ఈ అహంకారం నశిస్తుంది. ఆనందం మన సొంతం అవుతుంది. 

✳️ సద్గురువులు, సత్పురుషులు కేవలం ఆ ప్రేరణతోనే తమ ప్రత్యేక సంకల్పం ఏదీ లేకుండా సంచరిస్తారు. కనుకనే వారు ఈశ్వర సమానులు. మనం చేయకపోయినా ఏదీ ఆగదు. కనుకనే దాన్ని 'విధి' అన్నారు. అది తెలియక,  నేను చేస్తున్నాను అన్న భావన చేత మనకి ఆధ్యాత్మిక సాధన భారం అవుతుంది. ఆత్మ చింతనకు తనకు శక్తిచాలటంలేదన్న భక్తునితో భగవాన్ ఇదే వివరించారు. 

✳️ అసలు 'నేను’ అన్న భావనలోనే సరియైన అవగాహన లేకనే ఇదంతా. అందుకే భగవాన్ 'నేనుఎవరు?’ అన్నప్రశ్ననే సాధనగా చెప్పారు. 'నేను ఎవరు?' అన్న ప్రశ్న కేవలం ఈ మనోదేహాల పరిధిలో వేసుకుంటే 'నేనంటే ఈ మనోదేహాలే’ అనిపిస్తుంది. మనుసుని, దేహాన్ని వివేకం చేత విడి విడిగా విశ్లేషిస్తే అసలు కిటుకు తెలుస్తుంది. మనం ఇప్పుడు 'నేను'గా భ్రమిస్తున్న మనసుగానీ, దేహంగాని అసలు 'నేను' కావని వీటికి ఆధారభూతమై మనోదేహాల ఉనికికి కారణమైన చైతన్యమే నిజమైన 'నేను' అని విశదమౌతుంది. వినటం ద్వారా అవగాహన అయిన ఈ విషయాన్ని సదా మననం చేసుకుంటే అది ధ్యాసగా మారి అనుభవాన్ని ఇస్తుంది. మనోదేహాలను విశ్లేషించటమే విచారణ మార్గంలోని ప్రాథమికఅంశం. అందుకు మనకి స్వప్నస్థితి సహకరిస్తుంది.

✳️ సహజంగా మనందరికీ మనసు, దేహాలంటే వేరు వేరు అన్న భావన ఉండదు. ఈ స్థితి నుండి తాను మనసునని, ఈ దేహం ఉపాధి మాత్రమేనన్న వివేచనకు రావాలంటే మన ప్రతి కదలికను మనం గమనించుకోవాలి. మనం మెలుకువలో ఉండి చేసే పనుల్లో అసలు మనసు అనేది ఉందన్న విషయమే మరచి దేహంగానే భావిస్తూ పనులు చేస్తాం. స్వప్నంలో ఈ దేహం నిద్రపోయి ఉండగానే మనసు మాత్రం దేహాంగకర్మలు చేస్తూనే ఉంటుంది. పగలు దేహంతో ఉండే మనసు స్వప్నంలో కూడా దేహంగా భావించి సంచరిస్తుంది. జాగృతిలో దేహమే మనసుగా ఉంటే, స్వప్నంలో మనసే దేహంగా ఉంటుంది. ఈ రెంటికీ విడదీయలేని ఈ బంధం వల్లనే అసలు ప్రాణం ఒకటి ఉందని అదే ఈ పనులు చేయిస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. 

✳️ ఈ దేహ వ్యవస్థ, మనోవ్యవస్థలను విశ్లేషించి వాటిపూర్తి స్వరూప స్వభావాలు తెలుసుకోవడమే విచారణమార్గం. అందుకే కేవలం మన ప్రయత్నాలు, కార్యకలపాలనే కాకుండా ప్రతి పని వెనుక ఉన్నప్రేరణ ఎక్కడ నుండి వస్తుందో గమనించే ప్రయత్నం చేయాలి. మనకు అనుభవంలోకి వచ్చే ప్రమాదాలు, అదృష్టాలు కేవలం ఎదురయ్యే సంఘటనలే తప్ప మన సంకల్ప ఫలితాలుకాదు. అయినా వాటిని మనకే ఆపాదించుకుంటాము.

✳️ మొలిచే గుణం విత్తనంలో, మొలిపించే గుణం భూమిలో ఉందని మరచి వాటిని మనమే పెంచుతున్నామని అనుకుంటాం. ఎవరి ప్రమేయం లేకుండా పెరిగిన కీకారణ్యం మాటేమిటి? దీని భావం మన ప్రయత్నం అక్కర్లేదని కాదు. ఆ అహంకారం విడనాడమని. అలానే “విధిని తప్పించలేము” అని అంటే అది మన చేతిలో లేదని స్పష్టం చేయటమే. అసలు విధి స్వరూపం ఒక్కక్షణం ముందైనా మనం తెలుసుకోగలమా? మరి దానిలో మన ప్రమేయం ఎలా ఉంటుంది. విధిని నడిపించే ఆ మహాచైతన్యం మాత్రమే దాన్ని ఎలాగైనా మార్చగలదు. లేనిది ఊహించటం మానుకొని ఉన్నది గమనించటమే విచార మార్గం. ఒకే సూర్యుడు వంద నీళ్ళ కుండల్లో ప్రతిబింబించినట్లే విశ్వమంత నిండిన ఆ మహాచైతన్యం ఉనికి మన హృదయంలోనూ వెలుగుతుంది. మనం ఈ దేహం అని అనుకుంటున్నాం కనుక ఆ దైవాన్ని ఈ దేహంలో మాత్రమే వెతకగలం. దైవాన్ని హృదయంలో వెతకటం ద్వారా బాహ్యదృష్టితగ్గి సత్యశోధన అలవడుతుంది. 

✳️ మనలో ప్రాణానికి ప్రాణంగా ఉన్న ఆ దైవం మనసు, దేహాల ద్వారా వ్యక్తం అవుతూనే వాటినుండి పూర్తిగా విడిగానే ఉన్నాడు. నడిచేది, మాట్లాడేది, చూసేది, చేసేది అన్ని ఆ చైతన్య శక్తి మాత్రమే. మనలో ఉన్న ప్రాణం సర్వ స్వతంత్రం అయితే అందరిలోను సమానంగా ఉండాలి కదా ! కానీ అది ఓ మహా చైతన్యం ప్రేరణలో మాత్రమే మన దేహాల ద్వారా వ్యక్తం అవుతుంది. ఆ ప్రేరణని గుర్తించటమే ఆత్మానుభవం. మేఘాలు కదిలినా చంద్రుడే కదులుతున్నాడన్న భ్రమ కల్పించినట్లే చైతన్య కదలికను మరచి మనసు దేహాల గమనాన్ని గుర్తిస్తున్నాం.

✳️ ముక్తుడైన యోగి నియమించిన పనిని మాత్రమే చేస్తూ పోతాడు. అంతేగాని ప్రత్యేకంగా ఫలానా పని చేయాలనిగానీ, వద్దనిగాని అనుకోడు. చైతన్యస్రవంతి ఉండే సద్గురువుల దేహం, మనసు అన్ని ఆత్మగానే ఉంటాయి. వారి మనోదేహాలను స్మరించుటం చేతనే మన మనసులు సైతం ఆ ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాయి. వారి కాయము (శరీరం) కూడా సత్తు (ఆత్మ) గానే ఉంటుంది. కనుకనే వారిని 'సకాయులు' అంటారు.
[3/27, 17:12] +91 73963 92086: వారిని అనుసరించినా, అనుకరించినా, దర్శించినా, స్పర్శించినా మనకి ఆ దివ్యత్వపు శాంతి సంక్రమిస్తుంది. రమణ భగవాన్ సన్నిధిలో జంతుజాలాలు సైతం వాటి ప్రవృత్తిని, స్వభావాన్ని మర్చిపోవటం మనకి ఆవిషయాన్నే విశదపరుస్తుంది. సద్గురు సన్నిధి మనకు ఆ అనుభూతిని ఇస్తుంది. పరమాత్ముడు అయిఉండి కూడా సామాన్యుడిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ లాగానే సద్గురువులు ఎక్కడా తాము అధిపత్యాన్ని ప్రదర్శించరు. 

✳️ 'సత్య దర్శనం' కావలన్న శుభేచ్చని కోరితే దైవం ఎన్నడు తిరస్కరించడు. తాను శివుడికి వేరుకాదన్న అద్వైత స్థితి వచ్చినా ముక్తుడు తాను ఆ స్థితికి ఎదిగిన సాంప్రదాయ మార్గాన్ని అందరికీ చూపడం ధర్మం. కేవలం అంతర్గత సాధనను మాత్రమే గౌరవిస్తే తరతరాలకూ దాన్ని అందించడం కష్టం. అందుకే భారతీయ సాంప్రదాయం భావితరాలకు అందించే రీతిలో మూర్తి (విగ్రహ) పూజ వంటి సంస్కృతికి పట్టంకట్టింది. పచ్చిదనం పోయిన కాయ చెట్టునుండి ఊడిపడినట్లే ముక్తి సాధనలో పక్వదశలోఅన్ని కర్మలూ వదిలేస్తాయి. ఆ స్థితి వచ్చేవరకూ మన దేవతారాధన, తపస్సు అవసరం. దైవాన్ని అంతటా చూడమని అంటే పూజలు ఆపమని కాదు, అందులో కూడా దైవాన్ని చూడమనే. అన్నింటికీ ప్రేరణగా నిలిచే దైవాన్ని గుర్తిస్తేనే మన జన్మ ధన్యం అవుతుంది. సద్గురువుల అనుగ్రహం కోరాలేగానీ వారిని అర్థంచేసుకునే ప్రయత్నం చేయడం మర్రిచెట్టుపై పాకే చీమ ఆచెట్టును పూర్తిగా తెలుసుకోవాలని అనుకోవడం లాంటిదే.

   🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

హృదయం పట్ల స్పృహతో వుండు, చర్యపట్ల, ఆలోచన పట్ల, అనుభూతి పట్ల చైతన్యంతో వుండు. ఇవి మూడు కోణాలు వాటి గుండా మెలకువ రంగంలోకి వస్తుంది.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 320 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. హృదయం పట్ల స్పృహతో వుండు, చర్యపట్ల, ఆలోచన పట్ల, అనుభూతి పట్ల చైతన్యంతో వుండు. ఇవి మూడు కోణాలు వాటి గుండా మెలకువ రంగంలోకి వస్తుంది.   🍀*

*మరింత మరింత చైతన్యంగా వుండడం నేర్చుకో. నీ శరీరం పట్ల స్పృహతో వుండు. మనను పట్ల స్పృహతో వుండు. హృదయం పట్ల స్పృహతో వుండు, చర్యపట్ల, ఆలోచన పట్ల, అనుభూతి పట్ల చైతన్యంతో వుండు. ఇవి మూడు కోణాలు వాటి గుండా మెలకువ రంగంలోకి వస్తుంది. ఈ మూడింటి పట్ల స్పృహతో వుంటే నాలుగోది వస్తుంది. అది చైతన్యమే. అది రూపాంతరం. అది దైవత్వానికి దారి తీస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

శౌచం

 శౌచం

శౌచం అనేది రెండు విధాలుగా వుంటుంది. బాహ్యశౌచం, అంతఃశౌచం అని. బాహ్యశౌచం అంటే భగవంతునిచే అనుగ్రహింపబడిన మానవ దేహం పురషార్ధ సాధనకు కాబట్టి దేహాన్ని పరిశుభ్రంగా వుంచుకోవాలి. మన పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలి. మన ధర్మానుష్ణానుమునకు ఏర్పడిన విధులను నిర్వహించుట, వాటికి అనుగుణమైన విధంగా మన దేహాలంకరణకూడా ఉండాలి. ఇవన్నీ మన నిత్యకర్మాచరణకు అనువుగా నిర్ణయింపబడినాయి.

అంతఃశౌచము మన లక్ష్యసాధనకు ముఖ్యమైనది. మనకు ప్రమాణములైన వేదములపై పూర్తి విశ్వాసం వుండాలి. శృతులలో నిర్దేశించిన ధర్మములను విశ్వాసంతో ఆచరించాలి. ఉదాహరణకి వేదోక్తంగా పిల్లవానికి ఉపనయన సంస్కారం జరపాలి. ఎంతో శ్రమ, ఖర్చుతో వైభవంగా ఉపనయనం జరుగుతుంది. తరువాత పిల్లవాడు కర్మానుష్టానం చేయడు. తండ్రియే కర్మానుష్టానం చేయకపోతే పిల్లవాని చేత ఎట్లా చేయించగలడు? కాబట్టి  కార్యాచరణలో చిత్తశుద్ధి ఉండాలి. వైదిక ధర్మములను శిష్టాచారంగా పాటించవలెననే విశ్వసనీయమైన భావన ఉండటమే అంతఃశౌచం. కాబట్టి మన ఆచరణలన్నీ మార్గదర్శకంగా ఉండాలి. మనము ఎంతో ఇంద్రియ నిగ్రహము అలవరచుకోవాలి.

కామక్రోధములు నరకద్వారముల వంటివి. కోరికలే అన్ని అనర్ధములకు కారణమవుతున్నాయి. ఈనాడు సాంఘిక పరిణామాలన్నిటికీ అత్యాశ, విషయవాంఛలే కారణం. కాబట్టి శంకర భగవత్పాదులు మనకు ఉపదేశించిన విధంగా రాగద్వేషాలను విసర్జించి ఇంద్రియ నిగ్రహమును పాటించి శుద్దమైన అంతఃకరణము కలవారమై ధర్మాచరణమును పాటించి జీవిత పరమార్ధమును పొందగలగాలి.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

నివృత్తి మార్గం

 నివృత్తి మార్గం 

మనస్సు ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే ఒక యోగం. ఆ విధంగా ప్రయత్నం చేయటం వల్లనే మానవజీవితానికి సార్ధక్యం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఆ విధమైన నివృత్తి మార్గాన్ని పొందకలగటానికి సద్గురువు యొక్క కటాక్షం కావాలి. మార్గదర్శనాన్ని పొందాలి. నివృత్తి మార్గంలోనే ఆత్మజ్ఞానం పొందటానికి సమర్థులవుతారు. ఒక సందర్భంలో శంకరులవారు చెప్పారు - నేను చేస్తున్నాను అనే భావన బంధానికి కారణమవుతుంది, నాది అనే భావనకూడా బంధహేతువే అవుతుంది. అంటే అహంకార మమకారాలు విసర్జించిన వాడే సరైన మార్గంలో ఉన్నాడని అర్ధం. 

అవిద్య అంటే అజ్ఞానం, మాయ. దీనివల్లనే మానవుడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. దేహమే తాను అనే భావనలో ఉన్నాడు. దేహానికి ఏదైనా కష్టం కలిగితే నాకు కష్టాలు కష్టాలు కలుగుతున్నాయని బాధపడుతున్నాడు. తనది అంటే నాది అనుకున్న వస్తువుకు ఏదైనా నష్టం కలిగితే నా ఆస్థి నష్టమైనదని బాధపడుతున్నాడు. ఈ అనర్ధములన్నిటికీ అవిద్యతో ఏర్పడిన అహంకార మమకారములే కారణం. ఈ విధంగా దుఃఖం ప్రారంభమవుతుంది. అవతలివాడికి ఉన్నదనే దుఃఖం, తనకు లేదనే మరొక దుఃఖం. ఈ దుఃఖాలకు అవిద్యే కారణం. మనల్ని ఏమైనా అంటే చట్టున కోపం వస్తుంది, ప్రశంసిస్తే సంతోషం కలుగుతుంది. నిజమైన జ్ఞానికి ఏ స్పందన ఉండదూ. 

ఏమయ్యా ! నీకు మానవమానాలు లేవా ? అంటే నాకు అంతా సమానమే అంటాడు. పైపెచ్చు నన్ను నిందిస్తే నాకు సంతోషమంటాడు. ఎందుచేతనంటే తనకు ఉన్న పాపం పోతుందట. జ్ఞానులు అటువంటివారు. వారి స్వభావంలో మార్పు ఉండదు. ఆ విధంగా మానవుడు సమదర్శనుడై ఎప్పుడు ఉంటాడో అప్పుడు అతడు సరైన మార్గంలో ఉన్నాడని అర్ధం. 

ఒకరిని ద్వేషించటం వ్యర్ధమైన విషయం. అందరిలోనూ వ్యాపించిఉన్న ఆత్మతత్వం, చైతన్యం ఒకటేనని గ్రహించగలగాలి. ఇది స్వయంగా శంకరులు గ్రహించి, ఆ విషయాన్ని గ్రహించగలిగే అవకాశాన్ని మనకు కలుగచేసారు. ఒకనాడు వారి శిష్యులతోబాటు గంగ స్నానానికి వెళుతూవుండగా చండాలుని రూపంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆచార్యులు అతడిని దూరంగా ఉండు అన్నారు. దానికతడు అయ్యా ! తమరు దూరంగా ఉండమన్నది ఈ దేహాన్నా లేక సర్వవ్యాపకమైన ఈ ఆత్మనా ? అని అడిగాడు. అప్పుడు శంకరులు అతని జ్ఞానమునకు ఆశ్చర్యము చెంది ఈ రూపంలో దర్శనమిచ్చింది సాక్షాత్తు విశ్వనాధుడే అని గ్రహించి నమస్కరించాడు. అందుచేత శంకరులు తనకు అందరూ సమానమే, వ్యత్యాసము లేదు అన్నారు. కాబట్టి సర్వమానవులలోయున్న చైతన్యమొక్కటేనని గ్రహించి ఆ విధంగా ఆచరణచేయాలి. 

ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావన ఉండకూడదు. ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు నేను త్యాగబుద్ధితో చేస్తున్నాననే భావన కూడా ఉండకూడదు. త్యాగం సాత్వికంగా ఉండాలి. పరమేశ్వరార్పణమస్తు అనే భావనతో చేయాలి. ఆ విధంగా చేస్తే ఏ భయమూ ఉండదు. అంతా భగవంతునికే చెందుతుంది. ఆ విధంగా కర్మలను ఆచరించేవారి జన్మ ధన్యమవుతుంది. 

వేదాంత శ్రవణం చేసినా సరైన భావన రాకపోతే వాని జన్మ నిష్ఫలం. ఆత్మోద్ధరణ అనేది అందరికీ కావాలి. మంచి జరుగవలెనని తలచినప్పుడు ప్రవృతి మార్గంలో పోతే జరగదు. అందువలనే శంకరులు లోకోపకారం కొరకై అందరిని నివృత్తి మార్గంలో సత్కార్యాలు చేయాలనీ జన్మ సాఫల్యం పొందాలని ఆపేక్షించారు. శంకరులు రచించిన ఏదైనా ఒక స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించి మననం చేసి ఆ పాఠాన్ని ఆచరిస్తే ధన్యులవుతారు. కాబట్టి సర్వులూ శంకరులు నిర్దేశించిన నివృత్తి మార్గం అనుసరించి శ్రేయోవంతులు అవ్వుగాక. 

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామివారు.

:::: తృప్తి ఎందుకు వుండదు??? ::::

 *:::::  తృప్తి ఎందుకు వుండదు??? ::::*

  మనస్సు  ఎప్పటికప్పుడు అనుభూతి చెందుతూ తృప్తి కోసం తపిస్తూ వుంటుంది.

  తిన్నదే  తింటూ    వుంటుంది.
  విన్నదే  వింటూ    వుంటుంది.
  చూచిందే చూస్తూ వుంటుంది.

     అయినా దానికి కావలసిన అనుభూతి , తద్వారా తృప్తి లభించదు.

 వర్తమానపు అనుభూతి కోసం తపించే మనస్సు అనుభూతి చెందే సమయం వచ్చే సరికి ఈ అనుభూతి యొక్క పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడంలో బిజి అయిపోతుంది. ఇక దీనికి నూతన అనుభూతి లభించదు. అందుకే మనస్సు కి  తృప్తి లేదు.

ధ్యానం చేయండి . వర్తమానం లో జీవించండి. అనుభూతి పొందుతూ తూ వుండండి..

*షణ్ముఖానంద 98666 99774*

శ్రీ రమణీయం - 5 🌹 👌బ్రహ్మపదార్థంగా చూస్తే భేదమే లేదు 👌

 [3/26, 20:59] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 5 🌹
👌బ్రహ్మపదార్థంగా చూస్తే భేదమే లేదు 👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 5. బ్రహ్మపదార్థంగా చూస్తే భేదమే లేదు 🌈

✳️ విడదీయలేని ప్రకృతి చైతన్యాల కలయికే ఈ సృష్టి. మన మనసుకు ప్రాథమికంగా బాహ్యవిషయాలను మాత్రమే గమనించగల శక్తి ఉంది. అందువల్ల ప్రకృతిలో కనిపించే విభిన్నతనే అది చూడగలుగుతుంది. సూక్ష్మ పరిశీలనతో గమనిస్తేనే గానీ ప్రకృతి అంతటా అంతర్లీనంగా, సమానంగా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని మన మనసు చూడగలుగుతుంది. కోట్ల కొద్దీ చెట్లు వేరువేరుగా ఉన్నా వాటికి ఆధారమైన నేల సమంగా ఎలా ఉందో ఈ సృష్టిలో కనిపించే ప్రతి విషయం వెనుక కనిపించని చైతన్యం దాగిఉంది. అది అభిన్నంగా ఉంది. దానిని గమనించటానికి మన మనసుకు సాధన కావాలి. 

✳️ మనం ప్రతిప్రాణి చేసే పనులను, వాటి కదలికలను మాత్రమే చూస్తున్నాం. అందుకు ఆధారమైన కారణాలను చూడటం లేదు. ఇది మన నుండే మొదలౌతుంది. ఆత్మ స్థానమైన హృదయం నుండి వెలువడే మనసు ప్రపంచ విషయాలలోకి విస్తరిస్తుంది. అందువల్లే ఈ విక్షేపం జరుగుతుంది. ఈ భేదదృష్టి పోయి మనసుకి విభిన్నత గోచరించనినాడు మనం ఆత్మ స్థితిలోనే ఉంటాం. ప్రతిరోజు గాఢ నిద్రలో అదే జరుగుతుంది. అందుకే అందరం అక్కడ సమానంగా ఉంటున్నాం.  జాగృతిలో, స్వప్నాలలో అనేక తేడాలు ఉండవచ్చు. కాని గాఢనిద్రలో ఉన్న స్థితిలో ఎవరికీ ఏ తేడా ఉండదు. ఆ స్థితిని మనం మెళుకువలో కూడా సంపాదించుకోవాలంటే ఈ సృష్టి యెడల సమదృష్టి రావాలి. అంటే అంతటా సమంగా నిండి ఉన్న సత్యాన్ని, ఆధారాన్ని మనం చూడ గలగాలి. ఫ్యాన్ తిరగాలంటే అందుకు కరెంటు ఉన్నదన్న స్పష్టత మనకు ఎలా ఉంటుందో, ప్రతి ప్రాణిలోనూ ఉన్న బ్రహ్మపదార్థం చూడాలి. బ్రహ్మ పదార్థానికి అవి లేవని, అవన్నీ ప్రకృతి సత్యం అని కూడా అంత స్పష్టంగా మనకు తెలియబడాలి. ఈ పరిశీలన మన దేహంనుండే ప్రారంభం కావాలి. 

✳️ ఇతరులు చేసే పనులను మనం ఎలా పరిగణిస్తామో మన పనులను కూడా అలా పరికించగలగాలి. అంటే మన దేహ కార్యాలన్నింటికి సాక్షిగా ఉండాలి. ముందు దేహకర్మలను సాక్షిగా వీక్షించే మనసును సాధించాలి. ఆ తర్వాత మనసును నెమ్మదిగా ఆలోచనలకు సాక్షిగా మరల్చాలి. సాక్షిగా అంటే పరిశీలకుడిగా అని కాదు. కేవలం నిమిత్త మాత్రంగా ఉంటూ తెలియబడేవాటిని గమనిస్తూ ఉండాలి. ఇలా మన కదలికలలోనూ, ఎదుటి వారి కదలికలలోనూ బ్రహ్మ పదార్ధాన్నే చూడగలిగితే భ్రమలు తొలుగుతాయి. అందుకు దృఢవిశ్వాసం కావాలి. మనం ఏనాడు చూడని దయ్యాన్ని ఊహించుకొని చీకట్లో ఎలా భయపడతామో అంత గట్టి నమ్మకం మనలో ఉన్న ఆత్మ వస్తువుపై రావాలి. మన పంచేంద్రియాలకు గోచరం గాని శక్తి ఈ సృష్టిని నడుపుతుందన్న విశ్వాసంతో చేసే విచార సాధన త్వరగా సిద్ధిస్తుంది. మంచి రుచికరమైన భోజనం తినాలంటే పాత్రల శుద్ధి, పాకశుద్ధి ఎలా అవసరమో మనలో ఉన్న దివ్యత్వాన్ని సాధించాలంటే మనోదేహాల పవిత్రత అంత అవసరం. 

✳️ పవిత్రతను సంతరించుకున్న మనసు బ్రహ్మపదార్థాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటుంది. విభిన్నత కనిపించని మనసు “అంతస్సారమైన ఆత్మగా” నిలిచి ఉంటుంది. ఈ సృష్టిలో క్రియలన్నీ కేవలం చైతన్యశక్తి యొక్క కదలికలుగా తీసుకుంటే విచారసాధన సులువు అవుతుంది. చేప మొప్పలతోనూ, కప్ప చర్మం ద్వారానూ, మనిషి ముక్కుద్వారానూ గాలిపీల్చడం ప్రాణ వాయువు కోసమని గుర్తిస్తే ఈ బాహ్యకర్మల భేదం మనని బాధించకుండా ఉంటుంది. అందుకే 'జిల్లెళ్ళమూడి అమ్మవారు' *'తిట్లన్నీ అక్షరాలేగా నాన్న'* అన్నారు. 

🌈 అంతటా సమంగా ఉన్న బ్రహ్మపదార్థం ఇన్నీ ఆకారాలుగా, గుణాలుగా ఎందుకు వ్యక్తం అవుతుందంటే అది ప్రకృతి లక్షణం. ఒకే భూమిలో, ఒకే నీటితో మొలిచే మొక్కలు ప్రకృతి ధర్మాన్ని బట్టి భిన్నభిన్న జాతులుగా ఉన్నట్లే ఇవి కూడా. మొక్కలను విడదీయగలంగానీ, అందులో ఉండే ప్రాణాన్ని విడదీయలేం. అందుకే బ్రహ్మపదార్థమే మొక్కగా, మనిషిగా, జంతువుగా, నీటిగా, నిప్పుగా ఉందని తెలుసుకోవాలి. అప్పుడు మన శరీర కదలికలన్నీ బ్రహ్మ పదార్థం ఉండటం వల్లనే అని తెలుస్తుంది. 

🌈 ఈ విధంగా విశ్లేషిస్తూపోతే ప్రతి వస్తువు ఉనికికి, పనికి వాటిలో మార్పులకు, జనన మరణాలకు బ్రహ్మపదార్థమే కారణమని తెలుస్తుంది. మనకి ప్రస్తుతం ఈ బ్రహ్మీభావన లేని కారణంగానే మనం ప్రపంచం నుండి వేరు అనుకునే దేహాత్మభావనలో ఉంటున్నాం. 'నేనుదేహం’ అని కాకుండా 'ఈ దేహం నాది' అనే భావన రావాలి. మన ఉనికికి ఒక ప్రత్యేకత కోరుకోవటం చేతనే మనసు సమత్వాన్ని పొందలేకపోతుంది. మనందరం ఒకే బ్రహ్మపదార్థం తాలూకు విభిన్న పరికరాలమే తప్ప మూలంలో తేడా లేదని అర్థం అయితే 'స్వీట్' పేరు, రుచి ఏదైనా అన్నింటిలో ఉన్నది తియ్యదనమే కదా అన్నంత స్పష్టత వస్తుంది. 

🌈 అసలు మనసుకి ఈ భేదభావాలు, విక్షేపాలు ఎందుకంటే అది హృదయం నుండి వెలివడినందువల్లనే. మనసు వచ్చిన త్రోవలోనే వెనక్కి వెళితే తిరిగి నిశ్చల స్థితితో ఆత్మగా స్వస్థితి పొందుతుంది. కారణాలు ఏవైనా మనం అనుభవించే బాధగానీ, సంతోషంగానీ అవే ఉంటాయి. ఆకలి, కదలిక, బాధ, సంతోషం వంటి లక్షణాలు అన్ని జీవులకు సమానమే.
[3/26, 21:00] +91 73963 92086: స్థితులు సమానంగా ఉన్నా పరిస్థితుల్లో తేడాలు మనని నిత్యం దూరం చేస్తున్నాయి. మనం ఆ స్థితిలో ఉండగలిగితే, తానే ఆ బ్రహ్మపదార్థం అని తెలుకోగలిగితే ప్రత్యేకించి ప్రార్థించేందుకు ఏమి ఉండదు. కేవలం భక్తి, శరణాగతే మిగులుతాయి. 

🌈 నిరంతరం నవ్యత కోసం ప్రాకులాడే మనసు సుఖసంతోషాలు ఎక్కడో ఉన్నాయని వెదికి వెదికి చివరకు అవితన మూలంలోనే ఉన్నాయని తెలుసుకుంటుంది. ఉన్నది ఉన్నట్లుగా ఉండటం సుఖం కాదనుకొని పరుగులు పెట్టినా... ప్రతిసుఖం వెనుక, సంతోషం వెనుక ఉన్నది ఆనిశ్చలతే అని ఒకనాటికి తెలుస్తుంది. ఆత్మ సంబంధంలేని సంతోషమే లేదు. మనకు తెలిసినా తెలియకపోయినా మనకి సంతోషం కలిగిందంటే మన మనసు తన మూలమైన ఆత్మతో కలిసిందనే అర్థం. అదే ఆత్మానుభవమని శ్రీరమణభగవాన్ అంటున్నారు. అది తెలియక సంతోషం బయట నుండి వస్తుందని మనసు భ్రమిస్తుంది. “కుక్క ఎండిపోయిన ఎముకముక్కను కొరుకుతున్నప్పుడు తన పళ్లనుండి వచ్చే రక్తాన్నే చీకుతూ అది ఆ ఎముక నుండి వస్తుందని భ్రమిస్తుంది" అని భగవాన్ ఈ విషయాన్ని సోదాహరణంగా వివరించారు. మనం సాధనకి, శాంతికి అడ్డం అనుకొనే కామ క్రోధాలు ఎవరిని ఆవరించి ఉన్నాయో లక్షణాలని మనకి తెలుస్తుంది. మల్లె, గులాబీల గుణాలు ప్రకృతివే గానీ మీవి కావుకదా.

  🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
 🕉️ *नमो भगवते श्री रमणाय* 🙏💥🙏

*Bhagavan Sri Ramana Maharshi* says:

💥"All metaphysical discussion is profitless unless it causes us to seek within the Self for the true reality. All controversies about creation, the nature of the universe, evolution, the purpose of God, etc., are useless. They are not conducive to our true happiness. People try to find out about things which are outside of them before they try to find out 'Who am I?' Only by the latter means can happiness be gained."💥

🙏🌷🙏 *शुभम् भूयात्*  🙏🌷🙏

🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి* ఉవాచ:

💥"అన్ని భౌతిక మైన (మెటాఫిజికల్) చర్చలు మనకు నిజమైన వాస్తవికత కోసం ఆత్మను అన్వేషించేలా చేస్తే తప్ప లాభదాయకం కాదు. సృష్టి, విశ్వం యొక్క స్వభావం, పరిణామము భగవంతుని ఉద్దేశ్యం మొదలైన వాటి గురించి తెలుసుకొనుటకు అన్ని వివాదాలు పనికిరానివి. 
మన నిజమైన ఆనందం, జనం 'నేను ఎవరు?' అని తెలుసుకోవడానికి ముందు తమ వెలుపల ఉన్న వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. 
కాని ఆత్మ విచారణ మార్గం ద్వారా మాత్రమే ఆనందాన్ని పొందవచ్చు."💥

🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

**** విధ్వంసం

 *🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 324 / Osho Daily Meditations  - 324 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 324. విధ్వంసం 🍀*

*🕉. ఇరవై నాలుగు గంటల సమయాన్ని వెచ్చించి, మీరు ఎలా విధ్వంసానికి పాల్పడుతున్నారో మీకు గుర్తున్న ప్రతిదాన్ని వ్రాయండి--అంతా వివరంగా. ప్రతి కోణం నుండి వాటిని చూడండి, ఆపై వాటిని మళ్లీ  చేయవద్దు. అది ధ్యానం అవుతుంది. 🕉*

*మీరు ఏదైనా చేయలేరని ముందే నిర్ణయించుకుంటే, మీరు చేయలేరు. మీ నిర్ణయం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఆటోసజెషన్ అవుతుంది. అది ఒక విత్తనం అవుతుంది. ఇది మీ మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. మీరు ఏమి చేయగలరో మరియు చేయకూడదని కూడా మీరు నిర్ణయించలేరు - మీరు దీన్ని చేయాలి, మీరే చూడాలి. జీవితం మాత్రమే నిర్ణయిస్తుంది. కాబట్టి ముందే నిర్ణయించుకోవడం మూర్ఖత్వం, చిన్నపిల్లల మనస్తత్వం, కానీ ఇటువంటి విషయాలు కొనసాగుతూనే ఉంటాయి. టేప్ దానంతట అదే ప్లే అవుతూనే ఉంటుంది. మీరు దానిని ఎక్కువగా ప్లే చేస్తే, అది అలవాటు అవుతుంది.*

*ఇది తప్పించుకోవడం మనస్సు యొక్క ఉపాయం. మీరు చేయలేరని నిర్ణయించుకున్న తర్వాత ఇంక బాధేముంది? ఎందుకు పోరాటం? ఎందుకు అంత సంఘర్షణ, శ్రమ? మీరు చేయలేరని మీకు ఇప్పటికే తెలుసు. మీరు పోరాటాన్ని నివారించగలిగేలా హేతుబద్ధీకరణను కనుగొనేది మనస్సు. మరియు వాస్తవానికి, మీరు ప్రయత్నాన్ని నివారించినట్లయితే, మీరు దానిని సాధించలేరు, కాబట్టి మీరు మీ నిర్ణయంపై వెనక్కి తగ్గుతారు. మీరు చెప్పేది సరైనది, ఇది ఎల్లప్పుడూ సరైనదదే; అది నీకు ముందే తెలుసు. ఇవి మనస్సులో స్వయంకృతాపరాధములు. అవి తమను తాము నెరవేర్చుకుంటాయి, ఇక వృత్తం కదులుతూనే ఉంటుంది, చక్రం కదులుతూనే ఉంటుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 324 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 324. SABOTAGE 🍀*

*🕉. Take twenty-four hours and write down everything that you can remember if how you have been sabotaging--everything in detail. Look at them from every angle, and then don't repeat them. It will become a meditation.  🕉*

*If you decide beforehand that you cannot do something, you will not be able to. Your decision will affect your life. If will become an autosuggestion. It will become a seed. It will sabotage your whole life. Even you cannot decide what you can and cannot do--you have to do it, you have to see for yourself. Only life decides. So it is simply foolish, childish, to decide beforehand-but many childish things continue. The tape keeps playing itself, and if you play it too much, it becomes habitual.*

*It is a trick of the mind to avoid. Once you decide that you cannot make it, then why bother? Why struggle? Why so much conflict, effort? You know already that you cannot make it. It is the mind that is finding a rationalization so that you can avoid struggle. And of course, if you avoid effort, you will not make it, so you fall back on your decision. You say it was right, it was always right; you knew it beforehand. These are self-perpetuating things in the mind. They fulfill themselves, and the circle goes on moving, the wheel goes on moving.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

::::::: వ్యాపకం. :::::::

 *::::::::::::  వ్యాపకం. ::::::::::::::*
    మనస్సు తన తృప్తి కోసం ఏదో ఒక వ్యాపకం (సంగీతం వినడం, పూజలు చేయడం,సేవ చేయడం, ఆట, పాట , పాలిటిక్స్ మొదలగునవి) పెట్టు కొని దానిని కొనసాగిస్తూ తృప్తి చెందుతుంది.
    అయితే ఈ తృప్తి ఎంతో కాలం కొనసాగదు.  కారణం ఆ వ్యాపకం  దినచర్యలో భాగంగా  మారిపోయి, యాంత్రిక చర్య లాగా తయారు అవుతుంది.
   ఎప్పుడైతే యాంత్రికంగా మారిందో అది ఇంకా ఏమాత్రం ఇంద్రియాలకు గాని మనస్సు కు గాని ఉత్తేజాన్ని ఇవ్వలేదు. పైపెచ్చు విసుగు తెప్పిస్తుంది. 
తృప్తి కాదుకదా అసంతృప్తికి కారణం అవుతుంది.
     అప్పుడు మరలా మరొక వ్యాపకం కోసం మనస్సు తన వేట మొదలు పెడుతుంది.
    పొందిన  అనుభూతిని శాశ్వతం చేసుకుందామని ఆ అనుభూతి యొక్క రుచిని తన జ్ఞాపకాల్లో దాస్తుంది, మనస్సు.
       అప్పుడు మనస్సు కి జ్ఞాపకాలే ప్రధానం కాని అనుభూతి కాదు.  తృప్తి ని పొందలేదు.

*షణ్ముఖానంద 9866699774*

శ్రీ రమణీయం -3 🌹 👌ఆత్మను ఆత్మగుణంతోనే సాధిద్దాం👌

 [3/24, 18:10] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం -3 🌹
👌ఆత్మను ఆత్మగుణంతోనే సాధిద్దాం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 3. ఆత్మను ఆత్మగుణంతోనే సాధిద్దాం 🌈

✳️ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉన్నప్పటికీ అది తెలుసుకునే గుణం మాత్రం మనిషికే ఉంది. ఒక్కసారి దాన్ని తెలుసుకోగలిగితే భగవంతుడు మనతోనే ఎలా ఉంటున్నాడో అర్థం అవుతుంది. నేను ఆత్మ స్వరూపుడనన్న సత్యం నిరంతర ఆనందాన్ని మనకి ప్రసాదిస్తుంది. మనలో వ్యక్తం అయ్యే ఎరుక ఈ ఆత్మ లక్షణమే. అన్ని విషయాలను ఆ ఎరుకతోనే గ్రహించే మనం అందుకు కారణం అయిన ఎరుకను మాత్రం గ్రహించ లేక పోతున్నాం. అందుకు తొలి కారణం మనకు ఆ గమనింపు లేకపోవడమే. 

✳️ మన మనస్సు మూడు స్థితుల్లో ఉంటుంది. ఒకటి హెచ్చు తగ్గులు లేని సమతౌల్యస్థితి. అదే శాంతి. దాన్నే సత్వగుణం అనిపిలుస్తాం. ఇదే ఆత్మ గుణంకూడా. రెండవది నిద్రావస్థ. ఎరుకగానీ, ఆలోచనలుగానీ లేని స్థితి. ఇదే తమోగుణం. మూడవది మనసు, అతివేగంగా ఉండే రజోగుణం. ఈ స్థితిలో ఎరుక కలిగి ఆలోచనలతో సతమతమయ్యే మనసు అనేక వికారాలను పొందుతుంది. *ఎరుక కలిగి ఆలోచనలు లేని ప్రశాంత స్థితే సత్వగుణం.*

✳️ ఇక్కడ మనం చేయాల్సిన సాధనల్లా మనస్సుని శాంతిగా ఉంచుకోవాలి. అది ఆత్మ సహజ లక్షణం. అశాంతి వల్ల మనం ఈ స్థితికి దూరం అవుతున్నా, సత్వగుణం వల్లనే మనస్సు శాంతిని పొంది ఆత్మానుభూతిని పొందగలుగుతుంది. ఆత్మ విచారం అంటే మొదట మన మనస్సు పోకడలు గమనించటమే. అప్పుడు దానితత్వం సత్వంగా ఉందా లేక అతివేగంగానో, అతి నెమ్మదిగానో ఉందా అన్నది తెలుస్తుంది. ఈ పరిశీలన వల్ల క్రమేణా మనస్సు తన స్వస్థితి అయిన సత్వాన్ని పొందుతుంది. ఆ సత్వ గుణంతో చేసే జపం, తపం మాత్రమే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అతి వేగం ఫలితాన్ని, సిద్ధిని కల్గించవు. సత్యదర్శనానికి ఆవశ్యకమైన ఈ సత్వగుణం కోసం మనం విధిగా ఆహార నియమాలు, వ్యవహార నియమాలు పాటించాల్సిందే. మనం చేసే పూజలు, దీక్షలు ఇందుకు సహకరించాలే గాని ఏదో దాటేశామన్న అహంకారాన్ని పెంచటానికి కాదు.

✳️ ఇలా, నిదానంగా సాధన చేస్తూ పోతే ఆత్మ ఒకనాటికి మనకే వ్యక్తం అవుతుంది. అంతే తప్ప ఆత్మదర్శనం ఒకరు చేయించేది కాదు. ప్రతి పనిలోను మనస్సు నెమ్మదిగా ఉంచటం మన సాధన కావాలి. అందుకు విరుద్ధంగా ఉంటే ఆలోచనలు పెరిగి వికారాలు చేరుతాయి. సదా మనలో ఆత్మకిరణంగా ఉన్న మనసు నుండి ఆలోచనలు, వికారాలు తొలగించటమే మన సాధన అని శ్రీరమణ భగవాన్ అంటున్నారు. 

✳️ సత్వంతో చేసే సాధనలో 'తాపత్రయం' ఉండదు. అదే మనకి గుర్తు. ఆత్మ దర్శనానికి మరొక సాధన ఏకాంతవాసం. నిజానికి ఏకాంతవాసం అంటే ఆలోచనలు లేకుండా ఉండటమే. అయినా సామాన్యులం కనుక వీలైనంత మనసుని ఏకాంతంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉండటం కాదు ఏకాంతంగా ఉండాలి. *ఒంటరితనం శరీరభావన, ఏకాంతం అనేది ఆత్మభావన.* ఒక్కళ్ళమే ఉన్నా ఆలోచనలు కదిలితే అది ఏకాంతం కాదు. పదిమందిలో ఉన్నా మనస్సు ఒకే విషయంపై ఉంచితే అదే ఏకాంతం. అది నిరంతర సాధన ద్వారానే సాధ్యం. సత్వగుణంతో మాత్రమే మనసు ఏకాంతాన్ని అంగీకరిస్తుంది. మన మనస్సు ఏకాంతాన్ని అంగీకరించటం లేదంటే, ఆహార వ్యవహారాల ద్వారా 'సత్వగుణం' కోసం సాధనచేయాలని అర్ధం. రజోగుణంతో ఉన్నమనస్సు వేగందాని స్వస్వరూపాన్ని, దాని మూలమైన ఆత్మని తెలుసుకోలేదు. అందుకే ఆత్మాన్వేషణ కన్నా సత్వగుణ సాధనే మన ప్రథమ కర్తవ్యం. విచార మార్గం అంటే మన స్మృతిలో ఉన్న ఈ తేడాలు గుర్తించటమే. గుర్తించటం మొదలైన తర్వాత అవి తప్పక వీగిపోతాయి. మనలో వ్యక్తం అయ్యే సత్వగుణం, ప్రేమ, శాంతి, ఎరుక, ఆనందం ఇవన్ని ఆత్మ గుణాలే. అయితే వాటిని గుర్తించేంత సత్వగుణం, నిమ్మళం మనకి రావాలి.  ఆత్మానుభవం అయిన తర్వాత ఆ నిమ్మళం ఎలానూ శాశ్వత లక్షణం అయిఉంటుంది. అప్పటి వరకు మనం దానినే సాధనారూపంలో కాపాడుకోవాలి. మన తొందరే సత్యానికి, సాధనకి మనని దూరం చేస్తుంది. 

✳️ దేవుని ముందు కూర్చోని చదివే స్తోత్రాలు, నామాలు కూడా తొందరగా చదివేలా చేసి ఫలాన్ని దూరం చేస్తాయి. నెమ్మదించిన మనసులో ఒక్కనామం చదివినా ఫలమే, మనతోనే ఉండి మనకి అనుభవంలోకి రాని ఆత్మను మన మనసు ద్వారానే పట్టుకోవాలి. ముందు “ నేను” అని భావించే మనసు ఈ శరీరంలోనే ఉందన్న భావన ఏర్పడి మనోదేహాలు విడవాలి. ఎటు వెళ్ళినా శరీరం కదులుతుంది తప్ప శరీరంలోని 'నేను' (మనసు) కదలటంలేదని గుర్తించాలి. బస్సు ఎంత వేగంగా వెళ్తున్నా అందులో ఉన్న మనం ఆ సీటులోనుంచి కదలనట్లే ఇది కూడా. ఈ గమనింపు వల్ల మనసుకి నిమ్మళం వస్తుంది. 

✳️ సహజంగా ఎక్కువమంది పూజలు, పునఃస్కారాలు, అష్టోత్తరాలు, శతనామాలు ఇవన్ని భయంతో చేస్తూ ఉంటారు. అది పోయి దానిస్థానే భక్తి రావాలి. ఎక్కువ స్తోత్రాలు చేయటం కోసం తొందరగా చదువుతూ ఉంటాం. కాని వాటి అర్థాలు, భావాలు తెలుసుకొనే ప్రయత్నం చేయము. *నామస్మరణతో పాటు భావస్మరణ కూడా చేస్తేనే అధిక ఫలం.* ఏ పూజ అయినా ఆ అనంతశక్తిని గుర్తించేందుకే కదా! మన పూర్వ సంస్కారాల వల్ల ఏ దైవం పైన ఇష్టం ఏర్పడినా అది పరమతత్వానికి, ఆత్మదర్శనానికి, పరమ శాంతికి చేరుస్తుందని గుర్తించాలి.
[3/24, 18:10] +91 73963 92086: ప్రతి దేవుడి వేయి నామాలలోనూ వారంతా ఒకే పరమతత్వం తాలుకూ ప్రతిరూపాలేనని విశదమౌతుంది. *పరమేశ్వర శరణాగతి వల్ల మన కర్మలో ఉన్నది వచ్చి తీరుతుందనే విశ్వాసం ఏర్పడి వెంపర్లాట తగ్గుతుంది. సత్యం నుండి దూరం చేసే వెంపర్లాట తగ్గితే ఆత్మానుభవానికి అడ్డంగా ఉన్న అహం తగ్గుతుంది.* మనసుని గమనించటం ద్వారా వెంపర్లాటను గుర్తించి అధిగమించగలం. ఆత్మను తెలుసుకోవాలన్న శుభేచ్చ నిరంతర ధ్యాసగా మారే వరకు దానిని సాధన చేయాలి.

🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

శ్రీ రమణీయం -4 🌹 👌మన ప్రతి అనుభవం ఆత్మదే👌

 [3/25, 18:25] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం -4 🌹
👌మన ప్రతి అనుభవం ఆత్మదే👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 4. మన ప్రతి అనుభవం ఆత్మదే 🌈

✳️ శరీరం, మనసు ప్రతి ఒక్కరికీ అనుభవంలోనివే. దేహానికి చూడటం, వినడం, మాట్లాడటం, రుచి తెలుసుకోవడం, స్పర్శ తెలియడం వంటి లక్షణాలు ఉన్నాయి. సునిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ 'మనసు'కి ఉన్న సామర్థ్యాలేనని తెలుస్తుంది. మనసే ఈ ఇంద్రియాల ద్వారా ఈ పనులు చేస్తుంది. ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ పనులన్నింటిలోనూ 'గ్రహించడం' అనే ఒకే లక్షణం అంతర్సూత్రంగా ఉందని మనకి అవగాహనలోకి వస్తుంది. కళ్ళద్వారా దృశ్యాన్ని, చెవులద్వారా శబ్దాన్ని, ముక్కుద్వారా వాసనను, చర్మంద్వారా స్పర్శను, నాలుకద్వారా రుచిని మనం గ్రహిస్తాం. ఈ గ్రహించడం అనే లక్షణమే మనకు అనుభవంగా మిగులుతుంది. ఈ గ్రహింపు లక్షణం మనసుకి ఎక్కడిది అని శోధిస్తే మనసుగా వ్యక్తమయ్యే 'ఆత్మశక్తి'దేనని బోధపడుతుంది. 

✳️ మన ప్రతి అనుభవం వెనుక ఆత్మశక్తి ఉంది. మనసు, ఇంద్రియాల ద్వారా మనం పొందే ప్రతి అనుభవం 'ఆత్మశక్తి'దేనని మనకి స్పష్టమౌతుంది. శ్రీరమణభగవాన్ చూపిన విచారణ మార్గంలో మన ప్రయత్నమంతా ఆ ఆత్మను తెలుసు కోవడానికే. అది ఈ దేహాత్మభావనతో సాధ్యంకాదు. ఒకసారి కలిసిపోయిన గంగా, యమునల నీటిని ఎలావేరు చేయలేమో మమేకమైఉన్న ఆత్మ, మనసులను కూడా బాహ్యంగా వేరు చేయలేకపోవడమే అందుకు కారణం. ఈ రెంటినీ వివేకంచేత భావనలో వేరుచేయడం తప్ప పదార్థాలుగా విభజించ లేము. దీపంనుండి వెలువడే వెలుతురులా ఆత్మనుండి వెలువడ్డ మనసును దాని ‘కిరణం'గానే గుర్తించాలి. మనకు అనుభవంలేని ఆత్మను ఊహించడం కన్నా అనుభవంలో ఉన్న మనసునే దైవంగా భావిస్తే సాధన సులువు అవుతుంది. 

✳️ మన మనసు భయం, దుఃఖం, సంతోషం వంటి రూపాలను పొందినట్లే పెద్దల మాటలపై విశ్వాసంతో ఆత్మగా భావనచేస్తే తన సహజ స్వరూపమైన ఆత్మస్థితిలోనే ఉంటుంది. అందుకు ఈ సృష్టి అంతా బ్రహ్మస్వరూపమేనన్న సమదృష్టి అలవర్చుకోవాలి. 

✳️ అందరిలోనూ, అంతటా దైవాన్ని భావించడమే భక్తి. మహాయోగినిగా పేరున్న 'తాడువాయిమాత' తన చివరిక్షణం వరకూ ప్రతివారిని శ్రీరామచంద్రునిగానే ఆరాధించారు. శ్రీరమణభగవాన్ కూడా ఆత్మజ్ఞానం కలిగేవరకూ మనోదేహాలనే బ్రహ్మ పదార్థంగా గుర్తించి అర్చించమన్నారు. సత్యం అర్థమైనరోజు మన ఆత్మకు, మనోదేహాలకు పత్తికి, వత్తికి ఉన్నంత సామ్యం కనిపిస్తుంది. 'పత్తి'ని వత్తితే 'వత్తి' అయినట్లే ఆత్మ జీవత్వంచేత మనసుగా మారింది. అదే బాహ్య ప్రకృతిలో ఈ శరీరరూపం దాల్చింది. ‘పత్తి-దారం-వస్త్రం' లో రూపభేదం ఉన్నా అంతర్గత పదార్థంలో భేదంలేనట్లే... ‘ఆత్మ-మనసు-దేహం’ వ్యక్తీకరణలో తేడాఉన్నా అన్నీ బ్రహ్మపదార్థాలే. ఈ విషయాన్ని అనుభవంగా తెలుసుకున్నవారే జ్ఞానులు. వారి బోధనల ద్వారా ఈ విషయాలు మనకి అవగాహనలోకి వచ్చినా అనుభవంలోకి వచ్చే వరకూ మనం అజ్ఞానులమే. అవగాహననే అనుభవంగా భ్రమచెంది సాధన పూర్తి అయిందనుకోవడం అజ్ఞానం. 

✳️ ఆత్మకు ప్రతిరూపమైన మనసు మనకు నిత్యం అనుభవంలోనే ఉన్నా మనకి ఆత్మానుభవం మాత్రం తెలియడంలేదు. మనసు శరీరభావనతో ఉండటమే అందుకు కారణం. మనసు ఆత్మశక్తితో ప్రాప్తించిన ఎరుకతో ఈ దేహాన్ని తెలుసుకుంటూ అదే 'నేను' అనుకుంటుంది. మనసు తన ఎరుకను (గ్రహింపుశక్తిని) తెలుసుకోగలిగితే అందుకు కారణమైన ఆత్మను తెలుసుకోగలుగుతుంది. టార్చిలైట్ నుండివచ్చే కాంతిని గమనించకుండా అది ప్రసరించిన వస్తువును తెలుసుకుంటున్నట్లే మనకి ఎరుకలోనికి వచ్చే విషయాలు తెలుస్తున్నాయిగానీ ఆ ఎరుకగానీ అందుకు కారణమైన ఆత్మగానీ తెలియడం లేదు. మనం మనిషిని అన్న భావనతో ఉన్నంత సహజంగా జ్ఞాని తాను ఆత్మననే సత్యంతో అనుసంధానం అయి ఉంటారు. అందుకే... 'అహంబ్రహ్మస్మి' అనే మాట, ఆత్మజ్ఞానిదిగానీ మనదికాదు. మనం మనోదేహాలు రెండింటినే అనుభవించగలం. జ్ఞాని ఆరెండింటికీ మూలమైన ఆత్మను కూడా నిత్యం అనుభవిస్తూనే ఉంటారు. 

✳️ వాస్తవానికి మనకి ఆత్మానుభవం రోజూ జరుగుతూనే ఉన్నా దాన్ని మనం గ్రహించ గలిగితేగానీ ఆత్మజ్ఞానంగా మనలో నిలిచిపోదు. దానికోసమే మన ఈ ఆత్మవిచారణ సాధన. మనకి శాంతినిచ్చేదే అసలైన సాధన. ఏమార్గంలోనైనా సరే అందులో శాంతిగా, ఆనందంగా వ్యక్తం అయ్యేది మన ఆత్మ స్వరూపమే. నిత్యం మనలో ఉండే ఆత్మానందానికి అడ్డుగా ఉన్న అహంకారం తొలిగిపోయిన లిప్తకాలం మనం శాంతినీ, సంతోషాన్ని అనుభవిస్తున్నాం. మనం నిత్యం భావించే 'నేను' ను పోగొట్టు కోవడమే ఇక్కడ జరిగే ప్రక్రియ. అందుకే భగవాన్ నిద్రానుభవాన్ని సాధించ మంటున్నారు. మన నిద్రానుభవం మనకు తెలియకపోయినా నిద్రించే ఎదుటి వారిని గమనిస్తే మనకి దాని తత్వం తెలుస్తుంది. అప్పటివరకూ ఎన్నో చికాకులతో ఉన్న వ్యక్తి నిద్రలో ఏ ఆలోచనాలేకుండా సుఖాన్ని, శాంతిని అనుభవించడం మనం చూస్తాం. అదే మన సహజస్థితి అన్న సత్యం అవగాహన లోకివస్తే రోజు జరిగే ఆత్మానుభవాన్ని గుర్తించడం సులభం అవుతుంది.
[3/25, 18:25] +91 73963 92086: ✳️ ఆత్మవిచారమంటే కేవలం కళ్ళుమూసుకునే చేసేది కాదు. మన మనసు పొందే వికారాలను గమనిస్తూఉంటే అవేవీ దాని సహజరూపాలు కాదని బోధపడుతుంది. ఈ గమనింపు తీవ్రం అయ్యేకొద్ది ఆ వికారాలు ఆకాశంలా అన్నింటిలో నిండిన ఆత్మను చూడమనే భోధనేఉందని శ్రీరమణ భగవాన్ చెప్తున్నారు. 

✳️ మనకి కనిపించని, మన అనుభవంలోలేని ఆత్మను నేరుగా భావన చేయలేము కనుక మంత్రజపం, రూపధ్యానాల ద్వారా ఆ స్థితిని పొందాలి. నోటితో ఉచ్చరించడం ద్వారా మొదలైన మంత్రజపం క్రమంగా మానసికజపంగా ఆ తర్వాత ధ్యానంగా పరిణమిస్తుంది. ధ్యానస్థితి అంటే బ్రహ్మపదార్థంతో అనుసంధానం కావడమే. కవిత్వం, పాట, భజన, సుందరదృశ్యాలు వంటివాటిలో నిమగ్నమైనప్పుడు కూడా ఈ ఆత్మానుసంధానమే జరుగుతుందని భగవాన్ స్పష్టంచేస్తున్నారు. 

✳️ మనని మనం మర్చిపోయే ప్రతిపని మనని ఆస్థితికే చేరుస్తున్నా దాన్ని గుర్తించే ప్రయత్నంలో లేముకనుక ఆ విషయం తెలియడంలేదు. మన ప్రయత్నంతో ఆ స్థితిని నిలుపుకోవడమే మనం చేసే సాధన.

  🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

ప్రతి మనిషికి నలుగురు భార్యలు ఉంటారు వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అని శాస్త్రవాక్యం.

 🙏🙏🙏🌹🌹🌹
ప్రతి మనిషికి నలుగురు భార్యలు ఉంటారు వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అని శాస్త్రవాక్యం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఆ నలుగురు ఎవరో మనిషి తెలుసుకుంటూ ఉండాలి

నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు, అపురూపంగా చూసుకునే వాడు....
మూడవ భార్య కూడా ఇష్టమే కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు, తను వారితో వెళ్లి పోతుందేమో అన్న భయంతో...

రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు. ఆమె కూడా అతని సమస్యలను తీర్చేది

మొదటి భార్య అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఆమెను అస్సలు పట్టించుకునే వాడే కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిపోయాయి.

అతని అనారోగ్య క్షీణించిపోయింది. ఇక అతనికి బ్రతకను అని తెలిసిపోయి తన మీద ఎవరికీ నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి.....

తన నాలుగవ భార్యను పిలిచాడు.
నేను మరణానికి దగ్గరలో ఉన్నాను, నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాను కదా. నాతో పాటు నువ్వు కూడా వచ్చేసెయ్ అన్నాడు. మరణంలో కూడా నాకు నీ తోడే కావాలి అన్నాడు. నాల్గవ భార్య అది విని దూరంగా వెళ్ళిపోయింది.

ఇకపోతే మూడవ భార్యను పిలిచి ఆదే కోరిక కోరాడు... అతనితో మూడవ భార్య ఇలా అన్నది.
ఇన్ని రోజులు నీతో ఉన్నాను నీ అవసరాలన్నీ తీర్చాను. ఇక నాకు నీతో పనేమీ లేదు, నేను వేరే వారి దగ్గరికి వెళ్ళి పోతున్నాను అన్నది.

అలాగే బాధతో ఏడుస్తూ తన రెండో భార్యను పిలిచి అడిగాడు. నేను నీతోపాటు నీ శవయాత్ర వరకు నీతోనే ఉంటాను. తరువాత నేను వెళ్ళిపోతాను, కాకపోతే నిన్ను అప్పుడ ప్పుడు తలచుకోగలను అని అన్నది...
అంత ప్రేమగా చూసుకున్న ఆ ముగ్గురు అలా అనేసరికి ఇక మొదటి భార్యను నిర్లక్ష్యం చేశాను కదా తనని అడగటం వృదా అని ఆలోచిస్తూ ఉండగా.....

మొదటి భార్య తలపుచాటు నుండి చూస్తూ, మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా  నేను మాత్రం మీ వెంట మీ చివరి ప్రయాణం దాక వస్తాను
మీరు బాధపడకండి అని అన్నది.

అప్పుడు అతని కళ్ళల్లో కన్నీరు ఆగకుండా ప్రవహిస్తుండగా చేతులెత్తి ఆమెకు నమస్కరించాడు....
కాబట్టి మనిషి దేన్నీ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. పోయేముందు తెలుసుకున్నా ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక ప్రతి మనిషికి జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి....

పైన చెప్పిన నలుగురు భార్యలు ఎవరో కాదు వీళ్లే.

1. నాల్గవ భార్య :     మనశరీరం...
2. మూడవ భార్య :   సంపద ఆస్తులు...
3. రెండవ భార్య : స్నేహితులు బంధువులు...
4. మొదటి భార్య : మనఆత్మ...

నిజమే కదా ! మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి
ఆ నలుగురిని నిర్లక్షము చేయకండి ఎందుకంటే ఆ
నాలుగూ ఈశ్వరుడు మనకు ప్రేమతో ప్రసాదించినవి, ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు...

గురువు, జ్ఞాని ఒక్కరేనా, ఏమైనా తేడా ఉంటుందా !?

 *"గురువు, జ్ఞాని ఒక్కరేనా, ఏమైనా తేడా ఉంటుందా !?"*

*"మనం చేరుకోవలసిన చివరి గమ్యాన్ని సాధించి మనకు మార్గం చూపేవాడు గురువు. గమ్యం గురించి మాత్రమే తెలుసుకొని బోధించేవాడు గురువు కాడు. అతడూ మనలాగే సాధకుడే అవుతాడు. దేహాత్మభావన దాటానివాడు అంటే తనను దేహం అనుకునేవాడు గురువుకాడు. గురువు కేవలం దేహమాత్రుడే అనుకునే వాడు శిష్యుడూకాడు. మనకు నిద్రలో ఎలాగైతే బేధభావన ఏదీ తెలియకుండా పోతుందో జ్ఞానికి మెలకువలోనే అలా ఉంటుంది. నిద్రకు, జ్ఞానానికి కొద్ది తేడానే ఉంది. ఏమీ తెలియకుండా పోవటం నిద్ర అయితే, అన్నీ తెలుస్తూ మనసులో ఏమీ లేకుండా పోవటం జ్ఞానం. అలా ఉండే జ్ఞానికే గురువు అని పేరు !"*

ఆనందం ఆంతర్యంలోనిది. వ్యక్తిగతం. దాన్ని నీలోనే చూడవచ్చు. దానికి ఎవరి సాయం అక్కర్లేదు. ఒకసారి దాన్ని దర్శిస్తే నువ్వు విజేతవు. జీవితం ధగధగ లాడుతుంది.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 319 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆనందం ఆంతర్యంలోనిది. వ్యక్తిగతం. దాన్ని నీలోనే చూడవచ్చు. దానికి ఎవరి సాయం అక్కర్లేదు. ఒకసారి దాన్ని దర్శిస్తే నువ్వు విజేతవు. జీవితం ధగధగ లాడుతుంది.  🍀*

*ఆనందాన్ని దర్శించని వ్యక్తి ఓటమిలో జీవిస్తాడు. అతని జీవితమంతా చిరాకు, వైఫల్యం. జనాల ముఖాల్ని చూడండి. పెద్దగా అనిపిస్తూ, ముఖాల్ని వేలాడేసుకుని వుంటారు. ముసలితనం ముంచుకొచ్చినట్లుంటారు. దిగులుగా వుంటారు. కోపంగా వుంటారు. కారణం వాళ్ళ కలలు చెడిపోయివుంటాయి. ఆ వైఫల్యం జీవితంలో వుండదు. బాధ్యత వాళ్ళదే. అర్థరహితమయిన వాటిని అందుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అవి ధనం, గౌరవం, అధికారం. అవి అందుకోలేకపోతే ఆందోళనకు లోనవుతారు. అందుకుంటే మరింత ఆందోళనకు గురవుతారు. నిజానికి అందుకోవడం కన్నా అందుకోలేకపోవడం మేలు కనీసం అక్కడ ఆశ ఐనా వుంది. అందుకున్న వాడికి ఆశ వుండదు.*

*అందుకున్న వాటి మీదే అతడు సకల శక్తుల్నీ కేంద్రీకరిస్తాడు. వాటి నించీ బయటపడడు. ఆనందం ఆంతర్యంలోనిది. వ్యక్తిగతం. దాన్ని నీలోనే చూడవచ్చు. దానికి ఎవరి సాయం అక్కర్లేదు. ఒకసారి దాన్ని దర్శిస్తే నువ్వు విజేతవు. జీవితం ధగధగ లాడుతుంది. నీ అస్తిత్వ ఆకాశం నక్షత్రాల్లో నిండుతుంది. నీరసం లేని జీవితం జీవించినవాడు మరణంలోనూ నిండుగా వుంటుంది. మరణం ఒక విశ్రాంతి మాత్రమే. అది విశ్రాంతి సమయం. అనంతంలో ఐక్యమయ్యే సందర్భం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

::::::సరైన ధ్యానం::::::

 *::::::సరైన ధ్యానం::::::* 

          ధ్యానం యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యాలు రెండు.

1) శరీరాన్ని మనస్సుని ఉద్రేక స్థితి నుండి శాంత పరచడం.

2) దృష్టి ని బాహ్యం నుండి అంతరంగం వైపుకి మరల్చి , అంతరంగాన్ని శుద్ధి చేయడం.

   ఏ ధ్యాన ప్రక్రియ అయితే ఈ లక్ష్యాన్ని సాధించ కలదో అదే సరైన ధ్యానం.

*షణ్ముఖానంద98666 99774*.

నేటి మంచి మాట. కోరికలు

 నేటి మంచి మాట.         

*మానవుడు తన కోరికలన్నీ తీరితే సంతోషముగా ,      సుఖముగా ఉండవచ్చును అని అనుకుంటాడు.* 

*కానీ నిజానికి కోరికలు తీరితే కాదు, కోరికలు ఆరితేనే       సుఖముగా, సంతోషముగా  ఉండగలడు.*

*కోరికలకు అంతం ఉండదు. ఒకటి తీరితే మరొకటి, అది తీరితే  మరొకటి ఇలా   ఒకదాని తర్వాత  మరొకటి పుడుతూనే ఉంటుంది.* 

*ఇంకా కోరిక తీరితే ఆనందం , తీరకపోతే దుఃఖం. దుఃఖం వలన కోపం, కోపం వలన విచక్షణ కోల్పోవడం, తద్వారా అన్యాయం, అధర్మం, హింసకు పాల్పడడం తుదకు జీవనం నాశనం అవ్వడం జరుగుతుంది.* 

*కనుక కోరికలను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. కోరికలు మితంగా, ధర్మ బద్ధంగా జీవనమునకు అవసరమగు విధముగా ఉండాలి తప్ప అత్యాశకు పోకూడదు.*

*దేవుని యందు ప్రేమను పెంచుకుంటే అసలు మనం   ఏ కోరికా కోరనవసరం లేదు. ఎప్పుడు మనకి ఏది అవసరమో ఆయనే చూసుకుంటాడు..*

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

నమస్కారం అనేది మనిషి యొక్క సంస్కారం నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం మానవుని సంస్కారం. అది ఎలాగో తెలుసుకుందాం.

 నమస్కారం అనేది మనిషి యొక్క సంస్కారం నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం మానవుని సంస్కారం. అది ఎలాగో తెలుసుకుందాం.

మనం తోటివారికి నమస్కరించేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ప్రతీకగా భావం వస్తుంది.
 ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి 

సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది ఒక ప్రత్యేక శైలి. ఈ పలకరింపు శాస్త్రీయతతో మేళవించిన సంప్రదాయం. పెద్దవారిని చూడగానే చిన్నవారు చేతులు జోడించి నమస్కరించడం భారతీయులు చేసే పని. ‘నమస్కారం’లో ‘నమ’ అంటే వంగి వుండటం. అంటే.. పెద్దల ఎదుట అహంకరించకుండా వుండట.
అసలు ఎందుకు నమస్కరించాలి..? ప్రస్తుతరోజుల్లో ప్రతిఒక్కరు పలకరించుకునేవిధంగా ‘హాయ్’, ‘హలో’ అని చెప్పుకుంటే సరిపోతుంది కదా అనే సందేహం కలగవచ్చు. కానీ.. అలా చేయకుండా నమస్కారం కచ్చితంగా చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకు బలమైన కారణం కూడా వుంది. మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం. ధన, ఋణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం (సర్క్యూట్) పూర్తి అవుతుంది. మనిషి శరీరంలో అటువంటి ధృవాలు చేతి వ్రేళ్ళు. వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది. విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది. రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిమీద ఉంటుంది. ఎక్కువ శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపనలు కలుగుతాయి. అవి  సరిగా మేలు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు ఈ నమస్కారం.

నమస్కరించటంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది. దేవతలకు రెండు చేతులు సహస్రారంపై జోడించాలి. పెద్దలకు నుదుటిపై అంజలి ఘటించాలి. సాటి వారికి అభివాదం చేయటానికి రెండు చేతులను హృదయ స్థానంలో జోడించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ స్థాయిలో గౌరవించదగిన వారింకెవరైనా వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనినే దండప్రణామమ్ అని కూడా అంటారు. అంటే, కర్ర లాగా నేలమీద పడి ,ఎనిమిది అవయవాలు  భూమిని తగిలేట్టుగా నమస్కరించటం. స్త్రీలు పంచాంగాలతో చేస్తే సరి పోతుంది. స్త్రీల ఉదరం, వక్షస్థలం మనిషి అస్తిత్వానికి, పోషణకి నిలయాలు కనుక అవి నేలకు తగులరాదు. నిజానికి ఇలా చేయటం వల్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటివారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది.

నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు.
ఒక మహారాజు అడవి మార్గంలో వెలుతుండగా ఆ దారిలో ఒక బౌద్ధ సన్యాసి ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి 'ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?' అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు ఆ తర్వాత రోజు మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడు పోయాయి కాని మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
అప్పుడు ఆ రాజు 'మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా (ఉండదు) ఇవ్వరు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?' అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది. 

యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య. రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.'ఎదిగేకొద్దీ ఒదగాలి' అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు.
ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది. శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని, పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.అందుకే 'అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్యరహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో,మనలో ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి.మానవుని సంస్కారం నమస్కారం కాబట్టి ఈ సమాజంలో అందరిని( పెద్దలను ) గౌరవిద్ధాం ఆదర్షంగా నిలుద్ధాం.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

పుష్పాలు మనకు ఎంతగా ఉపయోగపడతాయో పూజకు పుష్పాలు ఎందుకు వాడుతారో తెలుసుకుందాం.

 పుష్పాలు మనకు ఎంతగా ఉపయోగపడతాయో పూజకు పుష్పాలు ఎందుకు వాడుతారో తెలుసుకుందాం.

పువ్వులు అని చెబితేనే వాటి సువాసన, మృదుత్వం, రంగులు సృష్టి యొక్క అత్యద్భుతాలు స్ఫురణకు వస్తాయి. ప్రస్తుతం మానవసమాజంలో పవిత్రత ఎంత వెదికినా కనిపించని వస్తువుగా ఉంటోంది. అయితే పువ్వులు పవిత్రవనాలుగా, పరిశుద్ధతను కలిగి విశ్వమంతటా మెరుస్తున్నాయి. పువ్వులన్నీ త్యాగ దీపాలే. ఏ పూల మొక్క కూడా తన కోసం పువ్వులను పుష్పించడం లేదు. అన్నీ ఇతర జీవుల కోసమే ఉంటున్నాయి. ఎవరూ కోయకున్నప్పటికీ పువ్వులు నేలరాలినా అవీ భూమిలో ఎరువుగా మారుతోంది. తన సువాసనలతో పుడమిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాయి. మంత్రాలవల్ల, మాయల వల్ల, తాంత్రిక శక్తుల ద్వారా సాధించలేనివాటిని పువ్వులతో సులువుగా సాధించగలము. ఎంతోమంది సిద్ధపురుషులు పువ్వులకు సంబంధించిన దైవీక రహస్యాలెన్నింటినో మనకు అందించారు.
హిందు మతంలో పూజలు అనేవి నిత్యం చేస్తారు. వీటిలో అనేక ఆచారాలు. ఏదేవుడికి పూజ చేసినా సరే వారికి ఆయా రకాల పుష్పాలను సమర్పించడం సాధారణం. ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి తెలిసి వుండదు. భక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు ‘గీత’లో చెప్పాడు. ఎవరైతే దైవాన్ని పరిశుద్ధమైన, నిష్కపటమైన మనస్సుతో పూజించి తరిస్తారో అలాంటి వారిని ఆ దైవం వెన్నంటే ఉండి కాపాడుతుంది. సాక్షాత్తు శ్రీక్రిష్ణభగవానుడే తన అర్చనా విధానంలో పుష్పాలను చేర్చాడంటే.. భగవదారాధనలో పుష్పాల పాత్ర ఎంత అమోఘమైందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల పూజా విధానంలో పుష్పాలు తప్పనిసరి అయిన వస్తువులుగా మారాయి.
అయితే.. దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి, శుభ్రతతో కూడుకున్నదై వుండాలి. పురిటివారు, మైలవారు బహిష్టులైన స్త్రీలు పుష్పాలను తాకరాదు. అలాంటివి పూజకు పనికిరావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది. శుచిగా, స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర, పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలి. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగం
సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడు పుష్పాలతో పూజించాలట. విష్ణుభగవానుడిని తులసి దళాలతో, శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో, గాయత్రిదేవిని ‘మల్లిక’, ‘పొగడ’, ‘కుశమంజరి’, ‘మందార’, ‘మాధవి’, జిల్లేడు, ‘కదంబ’, ‘పున్నాగ’, ‘చంపక’, గరిక పుష్పాలతో పూజించాలిట. అలాగే ‘శ్రీచక్రాన్ని’ తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువపూలు, గురువింద పుష్పాలతో పూజించాలి. అలాగే మహాశివుని మారేడు దళాలతో పూజించడంవల్ల పరమేశ్వరుడు సంతృప్తిచెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు. అలాగే పవళ మల్లె పుష్పాలతో పూజిస్తే మంచి కోర్కెలు, మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయట. ఎర్ర పుష్పాలు శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం. ఈ పుష్పాలతో పూజవల్ల శ్రీమహాలక్ష్మి సంతుష్టురాలై, అభీష్టసిద్ధినిస్తుంది

 శ్రేయస్కరం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనములు, మందారము, నీలాంబరాలు, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగన్నేరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతారు. అలాగే కంఠాన గంధాన్ని, చెవిలో పుష్పాన్ని ధరించాలట. జుట్టు ముడిలో తులసిదళాన్ని ధరించరాదట.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

శ్రీరామనవమి

 *_నేటి విశేషం_*

           *శ్రీరామనవమి*

*కల్యాణ రాముని అవతార కథ*
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు... 
ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 
పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. 
ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. 
శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది, శ్రీ రామ నవమి పండుగను స్వామి జన్మదినంగాను, సీతా మాతతో కళ్యాణ మహోత్సవంగాను జరుపుకుంటారు. 
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది...
(ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. )

భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును, భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది...

పూర్వము వాల్మీకి యను మహర్షి శ్రీ మద్రామాయణము అను మహా కావ్యము వ్రాసెను. భారతీయులకు వాల్మీకి మొదటి కావ్యరచయిత;శ్రీ మద్రామాయణమే మొదటి కావ్యము, ఈ కావ్యము నుండి భగవంతుని దశావతారములు లోని రామావతారము గురించి మనకు తెలియుచున్నది...

భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది.
శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికిని అనగా త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము అయి కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగా కొనియాడబడుతూ శ్రీ రామ నవమి అను పేరున నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకొనుచున్నాడు.

*జన్మ వృత్తాంతం*
త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులను వేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువు రామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి,వారిని శాంతపరచి పంపెను.

భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. 
ఆ యఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. 
ఆ పాయసమును దశరధుడు తన మువ్వురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. 
కొన్నాళ్లకు యీ మువ్వురు భార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. 
ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు, గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను, రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులే శ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు.

చైత్ర మాసమున, శుద్ధ నవమీ తిధినాడు, పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహములు ఉచ్ఛంలో నుండగ కర్కాటక లగ్నమున గురుడు చంద్రునితో కలసి వుండగా, జగన్నాధుడు, సర్వలోకారాధ్యుడు , సర్వ లక్షణ సంయుతుడును అగు ఆ మహా విష్ణువు కౌసల్యాదేవి గర్భమున శ్రీరామ చంద్రమూర్తిగా జనియించెను...
శ్రీరాముడు పూర్ణ మానవుడుగా జీవించెను.

*రామ నవమి*
శ్రీ రాముని జననమైన నవమి తిధి నాడే ఆయన వివాహము సీతా మహాదేవి తో అయినదట. 
అట్లే రాజ్య పట్టాభిషేకము కూడ నవమి నాడేనట, అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము.

*విది విద్ధానం*
ఆ రోజు మానవులందరూ తల స్నానము చేసి శుభ్రమైన లేక క్రొత్త బట్టలను ధరించి సీతారాముల పూజించి, కళ్యాణ మహోత్సవను జరిపించి, వసంత ఋతువు - ఎండాకాలము అగుటవలన పానకము, వడపప్పు ఆరగింపు చేసి ప్రసాదము పంచుదురు. 
దశమి నాడు పట్టాభిషేక ఘట్టము జరుపుదురు, కొందరు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు రామనవరాత్రోత్సవము జరుపుదురు. 
ఈ తొమ్మిది దినములందు రామాయణ పారాయణము, రాత్రులందు రామకధా కాలక్షేపము జరుపుదురు.

శ్రీ రామనవమి నుండి రామకోటి వ్రాయుట నారంభించి, మరుసటి శ్రీ రామనవమికి ఆ వ్రతము ముగించు ఆచారము కూడ కలదు. 
శ్రీ రామ నామము లక్ష, కోటి వ్రాసిన ఒక్కోక్క అక్షరమే మహా పాతకములను నశింపజేయునని శంకరుడు పార్వతికి చెప్పునట్లు భవిష్య ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదమున వివరింపబడినది.

               *_🌾శుభమస్తు🌾_*
    🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

డబ్బు శాశ్వతం కాదు..... డబ్బే జీవితమూ కాదు

 *డబ్బు శాశ్వతం కాదు..... డబ్బే జీవితమూ కాదు*

ఒక జడ్జి తన వృత్తినుండి పదవివిరమణ అయ్యాక తన భార్య తో తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు.

"లక్ష్మీ నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని జడ్జి గా ఉన్నప్పుడు కాని ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు"  అని అన్నాడు.

ఏంటా కేసు అని ఆమె అడగగా

"ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు" అన్నాడు

కొడుకుని పిలిచి 
"ఏంటయ్యా నీ తండ్రికి నెలకు సరిపడండబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు"  అని అడిగాను

"మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన వ్యక్తి.
నెలనేలా ఆయనకు పెన్షన్ వస్తున్నది.
బాగానే డబ్బులు ఉన్న వ్యక్తి నా పైన ఇలా ఎందుకు కేసు పెట్టాడో అర్థం కాలేదు"  అని కొడుకు అన్నాడు

ఆ తండ్రి "అవును డబ్బుకు నాకు లోటులేదు కాని నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమని" అడిగాడు

తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిసాను.. ఎందుకయ్యా ఇలా అడిగావు అని ప్రశ్నించాను.

"మాకు ఉన్నది ఒక్కడే కొడుకు.... మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మాతో గడిపి వెళ్ళగలడని ఆశ... వాళ్ళ అమ్మకు వాడంటే ప్రాణం" 😍  అని అన్నాడు

ఇలా చెబుతూ ఆయన కళ్ళు తడిచాయి😢

డబ్బే ప్రధానం అనుకుంటారు... అంత కంటే ఎక్కువగా మనల్ని ఎదురుచూసే వారుంటారు అని గుర్తించలేము.

*నాకెందుకో అప్పటి కన్నవారికి నేడు ఉన్న తల్లితండ్రులకి చాలా తేడా  కనిపిస్తుంది*

 *నాటి కాలంలో మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు పిల్లలు మా కళ్ళ ముందు ఉంటే చాలు.. సరిపడా సంపాదన చాలు అనుకునే వారు*

*నేడు తల్లిదండ్రులు, పిల్లలు అంటే వారు విదేశాలకు వెళ్ళిపోవాలి... లక్షలు సంపాదించాలి అని కోరుకుంటున్నారు*


అందుకే  ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనేవాటికి విలువ లేకుండా పోయింది 

ఎవరైనా ఇవన్నీ పిల్లల నుండి  ఆశిస్తుంటే పిచ్చి వాళ్లను చూసినట్టు చూస్తున్నారు.

*మాయా ప్రపంచం*🤷🏻‍♂️