🔥 *"8"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం / మోక్ష మార్గం / సృష్టి రహస్యం / ఏడు జన్మలు ఏమిటి ? / నేను అంటే ఎవరు ? / దుఃఖం ఎలా తొలగుతుంది ? / జ్ఞాన విచారణ / మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹"*
*"తడి గుడ్డ ఎండలో పడిందనుకో అప్పుడేమవుతుంది ?"*
*"భగ భగమని మండే ఆ ఎండ గుడ్డలోని తడినంతా పీల్చేసి గుడ్డను పొడి పొడి చేసేస్తుంది."*
*"అలాగే మానవుని అజ్ఞాన మనస్సు ప్రతిక్షణం శ్రీరాముని, శ్రీ కృష్ణుని, గౌతమ బుద్ధుని, జీసస్ ని, మహమ్మద్ ను, శ్రీ వేంకటేశ్వర స్వామిని, వేదవ్యాస మహర్షిని, వసిష్ఠ మహర్షిని, వాల్మీకి మహర్షిని, రామకృష్ణ పరమహంసను, షిర్డీ సాయిబాబాను, స్వామి వివేకానందను, గురునానక్ ను, రమణ మహర్షిని, పరమశివుడు భగవంతుడగు శ్రీ శివ భగవానుని పాదాలను ఇలా ఎవరి నమ్మకానికి తగినట్లుగా వారు తమ తమ ధైవాన్ని మనసులో ధ్యానించడం జరుగుతూ ఉండాలి."*
*"దానివల్ల మన అజ్ఞాన మనసులోకి వారి దైవీ శక్తి కలిగిన చైతన్య శక్తి ప్రవేశించి మన అజ్ఞానాన్ని దగ్దం చేసి వారికీ మనకూ తేడా లేకుండా చేసేస్తుంది."*
*"అప్పుడు శాశ్వతమయిన శాంతి మనకు లభిస్తుంది."*
*"కాబట్టి బుద్దే “భగవంతుడు” అనుకున్నాం గదా!"*
*"సందేహం లేదు."*
*"మరి ఇక ఈ శరీరం సంగతేంటి?"*
*"బుద్దీ, శరీరం ఒక్కటేనా?"*
*"లేక వేరు వేరా?"*
*"వేరు వేరయితే బుద్ధి యొక్క ఆజ్ఞను శరీరం పాటిస్తూ ఎలా కదులుతోంది. ?"*
*"ఎందుకంటే బుద్ధికి ఆకారం లేదు."*
*"శరీరం ఆకారం కలిగి ఉంది."*
*"ఆకారం లేని బుద్ది ఆకారం కలిగి వున్న శరీరాన్ని ఆజ్ఞతో కదిలించగలగడం ఏంటి?"*
*"అదే నిజమయితే మనిషిలోని బుద్ది ఒక చెట్టువైపు చూసి ఆ చెట్టుకు వ్రేలాడుతున్న పండు ఇప్పుడు నా చేతిలోకి రావాలి అనుకుంటే ఆ పండు చేతిలోకి వచ్చెయ్యాలి కదా!"*
*"మరి పండు ఎందుకు రావడం లేదు?"*
*"బుద్ది అనేది కేవలం శరీరాన్ని మాత్రమే కదిలించగలుగుతోందిగాని బయటి వాటిని ఎందుకు చలింపచేయలేకపోతోంది."*
*"లేదు లేదూ.."*
*"శరీరం బుద్ది అనేవి రెండు కాదు.."*
*"శరీరమే బుద్ది.. బుద్దే శరీరం అని అనుకోవడానికి శరీరం ఆకారం కలిగి ఉంటే బుద్దికి ఆకారం లేదు."*
*"ఆకారం నిరాకారం ఒక్కటెలా అవుతాయి."*
*"చెట్టు ఆకాశంలోకి పెరిగి ఉన్నంతమాత్రాన ఆకాశం, చెట్టు ఒక్కటవుతాయా ?"*
*"కాలేవు గదా! వీటికి సమాదానం ఇప్పుడు చూద్దాం."*
*"కదిలేది సత్యమా?"*
*"కదిలేదాన్ని కదిలించేది సత్యమా?"*
*కదిలేది జడం.*
*కదిలించేది చైతన్యం.*
*కాబట్టి కదిలించేది సత్యం.*
*ఈ శరీరాన్ని కదిలించేది బుద్ధి కాబట్టి..*
*బుద్ధికి ఆకారం లేదు కాబట్టి..*
*"కదిలే శరీరానికి కూడా ఆకారం లేదు అని గ్రహించడమే అంతిమ జ్ఞానం."*
*“నేను” అంటే ఈ కనిపిస్తున్న శరీరం కాదు."*
*"ఎందుకంటే “నేను” అనే భావనకు ఆకారం లేదు."*
*"ఆకారం లేనిది ఆకారాన్ని ఎలా చూడగలదు."*
*"కాబట్టి నాచే చూడబడే ఈ శరీరానికి కూడా ఆకారం లేనట్లే అని గ్రహించాలి."*
*"స్వప్నంలో కూడా నేను నా శరీరాన్ని అనేక ఇతర అనేక శరీరాలను చూస్తున్నాను."*
*"మెలుకువ వచ్చాక అవన్నీ ఏమైనట్లు!"*
*"అవి లేనివే అనుకోడానికి స్వప్నంలో ఉన్నట్లుగానే చూస్తూ అనుభవాలు పొందాను గదా!"*
*"కాబట్టి నేను చూస్తున్న ఇక్కడి ఈ శరీరం కూడా ఆకారం కలిగి వున్నట్లు భ్రమ చేత పైకి కనిపిస్తున్నా వాస్తవానికి ఈ శరీరం కూడా ఆకారం లేనిదే ఎందుకంటే ఆకారం అంటూ లేని నా స్వరూపంతో లేక బుద్ధితో చూడబడేదంతా కూడా ఆకారం లేనిదే అవుతుంది గాని ఆకారాలుగా కనిపించేవన్నీ వాస్తవానికి ఉన్నవి కావు అని గ్రహించడమే జ్ఞానం."*
*"కాబట్టి “బుద్దే భగవంతుడు” అంటే “నేనే భగవంతుడు” అని తెలుసుకున్నాం సరే!"*
*"అంత మాత్రాన దుఃఖం తొలగి ఆనందం అనుభవంలోకి వస్తుందా?"*
*"రాదు."*
*"ఎందుకంటే ఎడారిలో ఇసుకపై మండుటెండలో నడుస్తూ దాహంతో గొంతు ఎండిపోతున్న వానికి ఒక చోట “నీరు” కనిపించగానే దాహం తీరుతుందా?"*
*"తీరదు ."*
*"దాహం తీరాలంటే నీటిని చూస్తే చాలదు."*
*"నీటిని త్రాగాలి."*
*“నేనే భగవంతుడు” అంటే నశించే ఆకారాలతో సంబందం లేని “ఆనందమే స్వరూపం”గా కలవాడినే నేను అని ఎరిగి ఆ ఎరిగిన దాన్ని నిరంతరం మనసులో భావన చేస్తూ ఆ స్థితిలో స్థిరంగా మన మనఃస్థితి నిలిచేంత వరకు ఆ భావనను కొనసాగించాలి."*
*"భావనా బలం చేత కొన్నాళ్ళకు మనిషి బ్రమను దాటి మనసును ఛేదించి “బ్రహ్మం” అని శాస్త్రాలలో చెప్పబడే మనఃస్థితిలో నిలిచిపోతాడు."*
*"అట్టి స్థితిలో మనస్సు ఉండదు."*
*"అక్కడ ఆనందం అనుభవించేవాడు ఆనందం అంటూ వేరు వేరుగా రెండు ఉండవు."*
*"అదియే మానవుని స్వస్వరూపం."*
*"మోక్ష స్థితి అని చెప్పబడే అకృత్రిమమయిన “ఆనందం” అదే."*
*"తెలిసినా తెలియకున్నా ప్రతి ప్రాణి ఆరాటపడేది ఆ “ఆనందం” కోసమే."*
*"అయితే మానవుడు తగినంత ప్రయత్నశీలుడు కాకపోవడం వల్ల ఆ స్థితి లభించడం లేదు."*
*"మరొకసారి శ్రద్దగా గమనించండి."*
*"ఈ ప్రపంచం “కంటికి” కనిపిస్తోంది."*
*"అదే కంటికి ఈ ప్రపంచాన్ని “చూసేది” కనిపించట్లేదు."*
*"ఎంత విచిత్రం. “చూసేదానికేమో” ఆకారం లేదు."*
*"కాని చూడబడే ప్రపంచం అంతా ఆకారం కలిగి ఉంది."*
*"చూడబడేదాన్నంతా ఏదయితే చూస్తోందో ఆ చూసే దాన్ని చూడడమే “సర్వం” చూడడం అవుతుంది."*
*"అప్పుడు “చూసేదే చూడబడేది కూడా” అని అర్ధం అవుతుంది."*
*"అలాగే చూసేదానికంటే వేరుగా చూడబడేదనేది మరొకటి లేదు ఒకవేళ వుందంటే “చూడబడేదంతా కూడా చూసేదాని రూపమే కాబట్టి చూసే నాకు రూపంలేదు కనుక నాచే చూడబడే సమస్తం నిరాకారమే” అనే మహత్తరమయిన అనుభవం మానవునికి కలుగుతుంది."*
*"అట్టి అనుభవం మనిషికి కలిగాక అతడు “జన్మ-మృత్యువు” అనే రెండు బ్రమలను దాటేస్తాడు."*
*"ఎందుకంటే జన్మించడం మరణించడం అనే రెండు భ్రమలు శరీరానికి చెందినవి."*
*"నేను శరీరం కాదు."*
*"జన్మ మృత్యువులు రెండూ నాకు చెందినవి కావు అని ఎవడు గ్రహిస్తాడో అతడు మరణాన్ని జయించినవాడే అవుతాడు."*
*"అలా గ్రహించడమే “బ్రహ్మనందం” అనీ “ముక్తి” అనీ “ఆత్మ సాక్ష్యాత్కారం” అనీ శాస్త్రాలు చెబుతున్నాయి."*
*"జన్మించడం మరణించడం అనేది వస్తు దృష్టి."*
*"ఈ అయిదు లోకాల్లోని ఏ వస్తువయినా ఒకనాటికి నశించాల్సిందే."*
*"పుట్టే ప్రతిదీ ఆకారం కలిగి వుంటుంది."*
*"ఆకారం కలిగిన ప్రతిదీ నశిస్తుంది."*
*"మనిషి స్వరూపం నిరాకారం."*
*"ఆకారమే లేని మనిషికి నాశనం అనేది ఎక్కడుంటుంది."*
*"ఒక గ్రామంలో అగ్ని చెలరేగితే ఇళ్ళన్నీ బూడిదవుతాయి."*
*"ఆకాశం బూడిదవుతుందా ?"*
*"కాదు గదా!"*
*"కాబట్టి ఆకారాలే నశిస్తాయి."*
*"నిరాకారానికి నాశనం లేదు."*
*"అలాగే నిరాకారానికి జన్మా లేదు."*
*"జన్మే లేదు కాబట్టి మృత్యువు కూడా లేదు."*
*"నేను ఈ శరీరాన్ని అనుకున్నవాణ్ని మృత్యువు కభళిస్తుంది."*
*"ఈ శరీరం నేను కాదు నేను నిరాకార చైతన్యాన్ని అనే భావనలో వున్న వానిని మృత్యువు ఏమీ చెయ్యలేదు."*
💖🔥💖🔥💖
💖
No comments:
Post a Comment