Monday, September 23, 2024

 పాండు రాజు వలన కుంతీదేవికి,మాద్రి కి సంతానం కలిగిందా? మరి మాద్రి ఎందుకు సహగమనం చేసింది .పాండు రాజు మరణానికి మాద్రి కారణమా? ద్వాపరయుగంలో యుగధర్మం అంతేనా?
పాండవుల జననం ఎపుడో జరిగిపోయింది.

తర్వాత కొన్ని సంవత్సరాలకు అంత్యకాలం సమీపించి మాద్రిని చూచి చలించి సమాగమం చేశాడు. శాపం పనిచేసి కాలధర్మం చెందాడు పాండురాజు.

స్త్రీ సంగమంలో మృతి కలిగేట్టు కిందముని శాపం. అది పాండవుల జననానికి ముందు ఏర్పడింది. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నా ఇపుడు నిగ్రహం తప్పింది. అది మరణకారణమయింది. ఎవరో ఒకరు భర్తను అనుగమించ దలచారు. పెద్ద దానికి నాకు ఆ హక్కు ఉన్నది. నేను భర్త వెంట వెళతానని కుంతి.— కాదు. భర్త మరణానికి నేను కారణం అయ్యాను. నేనే వెళతానని మాద్రి.

చిన్న పిల్లలను చక్కగా పెంచి పెద్ద చేయగల సామర్థ్యం ఉన్నదానివి నీవే జీవించి ఉండడం ఉచితం—అని తన బిడ్డలను కుంతి చేతిలో పెట్టి మాద్రి సహగమనం చేసింది.

కురుక్షేత్ర యుద్ధం తర్వాత కొన్ని సంవత్సరాలకు మృతులైన తమ భర్తలను కౌరవ కాంతలు వ్యాస మహర్షి అనుగ్రహంతో (నదీ జలాలలో ) కలుసుకొని సంతోషంగా ఆ నీటిలోనే సహగమనం చేస్తారు.

ద్వారకలో కృష్ణ నిర్యాణానంతరం రుక్మిణి మరికొందరు పట్టమహిషులు సహగమనం చేస్తారు. సత్యభామ తపస్సుకు వెళ్లి పోతుంది.

సహగమనం కేవలం ఐచ్ఛికంగా రాజ కుటుంబాలలో ఆ కాలంలో ఉండింది. రామాయణంలో దశరథ పత్నులెవరూ సహగమనం చేయలేదు.

రాజా రామ్మోహన్ రాయ్ గారి వదిన భర్త మృతికి సహగమనం చేసింది. రాయ్ విఫల ప్రయత్నం చేశాడు. రాయ్ తల్లి పండుముసలి మోక్షం కోరి జగన్నాథ స్వామి రథచక్రాల కింద పడి ప్రాణాలు విడిచింది. ( మొత్తం మీద ఆ నాడు ప్రాణ సమర్పణం పూర్తిగా ఐచ్ఛికంగా ఉండింది )

No comments:

Post a Comment