నకుల, సహదేవుల ఏ విషయాల్లో ప్రావీణ్యులు? మిగిలిన ముగ్గురు పాండవులంత పేరు వారికి రాకపోవడానికి కారణం ఏమిటి?
నకుల -సహదేవులు అశ్వినీ దేవతల వరముగా మాద్రి కి జన్మించిన వారు. పంచ పాండవులలో చివరి ఇద్దరు. వ్యాసుడు తన మహాభారత ఇతిహాసంలో వీరిద్దరికి ఇవ్వవలసిని ప్రాముఖ్యతను వీడలేదు.
ముందుగా నకులుడు :
1 .నలుపు శరీర ఛాయతో కురువంశములోనే అత్యంత అందమైనవాడు.
2 .గుఱ్ఱముల పోషణ,వాటి అనారోగ్య లను నయంచేసే కళ ను తెలిసినవాడు. నైపుణ్య రధ సారధి కూడా.
3 .అశ్వనీ కుమారుడు కావున ఆయుర్వేదం తెలిసిన వాడు.
4 .మంచి కత్తి యుద్ధ పోరాటవీరుడు. ముఖ్యముగా వర్షము లో గుఱ్ఱం పై యుద్ధం చేసినా వర్షము లో తడవకుండా ఉండగలిగే నేర్పు కలిగినవాడు.అనేక ఆయుధాలను ఉపయోగించే నేర్పు కలిగినవాడు.
5 .మంచి దౌత్య వేత్త .
6 .భవిష్యత్తును చెప్పగలడు/చూడగలడు. కానీ చెప్పినవెంటనే, జ్ఞాపక శక్తి లేదు/అనగా మరచిపోవును .
కురుక్షేత్ర యుద్దములో మొదటి రోజునే దుశ్యాసనుని ఎదుర్కొని ఓడించినా భీముని ప్రతిజ్ఞ కోసం విడిచిపెడతాడు. భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధన కృతవర్మ అశ్వత్ధామ వంటి వీరులను అడ్డుకుంటాడు. కర్ణుని ముగ్గురు కొడుకులను యుద్ధంలో చంపుతాడు. కర్ణునితో తలపడి యుద్ధం చేసి చివరకు కర్ణుడు కుంతి కి ఇచ్చిన మాట ప్రకారం బయట పడతాడు.
సహదేవుడు ::
1 .అత్యంత తెలివి కలవాడు. ధర్మరాజు కు సలహాదారు గా నియమింపబడ్డవాడు. సహదేవుడు కూడా ఆయుర్వేదం -పశు సంరక్షణ లో ప్రవీణుడు. తన సోదరుడు నకులుడు కన్నా మంచి జ్యోతిష్య వేత్త.
2 . మహాభారత యుద్ధ పర్యవసానం , గెలుపు అన్నీ ముందుగానే తెలిసినవాడు. కానీ శాప కారణమున బయట పెట్టలేనివాడు.
3 . నకులుడు మాదిరిగానే మంచి కత్తి యుద్ధనిపుణుడు.
దుర్యోధనుని కోరిక మేర యుద్ధ ముహూర్తం చెప్పిన వాడు.
మాయ జూదమున, శకుని మోసం గ్రహించి, యుద్ధమున శకునుని చంపుటకు ప్రతిజ్ఞచేసి , 18 వ రోజు యుద్ధమున తన ప్రతిజ్ఞ నెర వేర్చుకొన్న వాడు.
ఐదుగురి పాండవ సోదరులలో చివరి ఇద్దరు కనుక తమ అగ్రజుల మాట ప్రకారం ఉండుట వలన అంత ప్రాముఖ్యత లేదని భావించడం కద్దు.
రాజసూయ యాగంలో ఇద్దరూ నకుల సహదేవులు అనేక రాజ్యాలను జయించిన వీరులు.
No comments:
Post a Comment