Wednesday, September 18, 2024

 కర్ణుడు అడుగుతున్నాడు శ్రీ కృష్ణున్నీ  ...

ఓ కృష్ణా ... నేను పుట్టీ పుట్టకముందే నా తల్లి కుంతి నన్ను వదిలివేసింది. అలా పుట్టడం నా తప్పా / నా పాపం కాదుగదా !!???

నేను సూతుడ నైనందువలన ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు 
పరశురాముడు నాకు యుద్ధ విద్య నేర్పాడు కానీ ... అవసర సమయంలో నాకు అస్త్రాలు ఏమీ గుర్తురావు అని శపించాడు 

పొరపాటున నేను వదిలిన బాణం గోవుకు తగిలి ఒక బ్రాహ్మణుడు నన్ను అకారణంగా శపించాడు 

ద్రౌపది స్వయంవర సమయంలో అవమానించ బడ్డాను.

చివరికి నా తల్లి కుంతి కూడా యుద్ధం ఆరంభం అవుతుందన్న చివరి క్షణంలోనే నిజం నాతో చెప్పింది. అది కూడా తన బిడ్డలను కాపాడుకోవడం కోసం.

ఇంతవరకు నేను ఏదైనా పొందాను అన్నా ... గౌరవించబడ్డాను అన్నా ... అది దుర్యోధనుని దయా భిక్ష !!!

ఇప్పుడు చెప్పు ... నేను దుర్యోధనుని పక్షం నిలబడంలో తప్పేంటి ???

 దీని జవాబుగా కృష్ణపరమాత్మ ఇలా అన్నాడు ....ఓ కర్ణా #విను ...

నేను చెరసాలలో పుట్టాను 

నేను పుట్టకముందు నుండే నన్ను చంపడానికి చూశారు.

నేను పుట్టిన ఆ రాత్రే నేను నా తలిదండ్రుల నుండి వేరుచేయ బడ్డాను. 

నీవు చిన్నప్పటి నుండే కత్తిసాము , కర్రసాము , రథారోహణ ,అశ్వచాలనం ,ధనస్సు , బాణాలు వంటి వాటిని సాధన చేస్తూ పెరిగావు ..

నేను ఆలమందలను కాస్తూ పెరిగాను పైగా నడక రాక మునుపే నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి 

నన్ను సంరక్షించడానికి ఏ సైన్యమూ లేదు , నాకు ఏ ప్రాథమిక విద్యా లేదు 
కొన్ని సార్లు జనాలు అనడం నేను విన్నాను ... వాళ్ళ బాధలకు కారణం నేనే కారణం అట 

నీ శౌర్య ప్రదర్శనలో నీ గురువులచేత నువ్వు మన్ననలు పొందుతున్నపుడు .. కనీసం నాకు ప్రాథమిక విద్య కూడా లేదు , నేను సాందీపముని గురుకులానికి చేరింది ఎప్పుడో తెలుసా ... నా 16వ ఏట !!!

నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు 
నేను ఎవరైతే నన్ను కోరుకుంటున్నారో వాళ్ళను మరియు , రాక్షసుల /దుష్టుల నుండి నేను కాపాడిన వారిని చేసుకున్నాను 

జరాసంధుడి బారినుండి నా పరివారాన్ని కాపాడుకోవడం కోసం.. నేను మొత్తం యదుకులాన్ని యమునా నదీ తీరం నుండి (మధుర) ఎక్కడో ఉన్న సముద్ర తీర ద్వారకకు తరలించవలసి వచ్చింది 
దానికి కొందరు పిరికివాడు అనికూడా అన్నారు
 
ఒక విషయం గుర్తుంచుకో కర్ణా ...
జీవితంలో ప్రతి ఒక్కరికీ శోధనలు ఉంటాయి 

జీవితం అనేది ఎవరికీ పూలపాన్పు కాదు .

ధర్మరాజు కుడా ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు అనుభవించాడు ... కానీ అతను నమ్మిన ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు . 

ధర్మం ఏంటో నీ అంతరాత్మకు తెలుసు
ఎన్నిసార్లు నువ్వు అవమానింపబడ్డావు అనేది కాదు , జీవితం ఎంత చెడు అనుభవాలను చవి చూపించిది అనేది కాదు , 

ఎన్నిసార్లు నీకు అన్యాయం జరిగింది అనేది కాదు ... ఆయా సమయాలలో ధర్మం తప్పకుండా నువ్వెలా నిలబడ్డావు అనేది ముఖ్యం .

ఆరోపణలు ఆపు కర్ణా .. 

దుర్యోధనుడు అన్నివేళలా ధర్మం తప్పాడు , ఇది నీకు పూర్తిగా తెలుసు అయినా అతని పక్షం వహించావు . నీ జీవితంలో నీకు జరిగిన అన్యాయాలు... నువ్వు అధర్మం పక్షాన నిలవడానికి కారణాలు కాబోవు...కారాదు.
" #ధర్మోరక్షతిరక్షితః "

No comments:

Post a Comment