💐9శ్రీ లింగ మహాపురాణం💐
🌼అష్టాంగ యోగం🌼
#తొమ్మిదవ భాగం#
సూత మహర్షి శౌనకాది మహా మునులతో "మునులారా! నేను తెలిపిన వ్యాసావతారాలు ప్రతి ద్వాపరయుగం చివరిలో , శివ యోగాచార్య అవతారాలు కలి యుగం ప్రారంభంలో ఆవిర్భ విస్తుంటాయి.ప్రతిశివయోగాచార్యుడికినలుగురు
శిష్యలుంటారు.
శివయోగచార్యులను పాశు పతులని, తపసిద్దులు అని అంటారు. వీరు భస్మము, రుద్రా క్షలు ధరించి పాశుపతం అనే శివధ్యాన యోగమును ఆభ్య సించిరుద్రలోకముపొందుతారు.
ఇంద్రాది దేవతల నుండి పిశాచాది గణముల వరకు, సంసారబంధములోబంధిపబడిన మానవాదులను పశువులని పిలవబడతారు.ఇటువంటిపశు వులను పరిపాలించే ప్రభువు పరమేశ్వరుడు కనుక ఆయన ను పశుపతి అని పిలుస్తారు.
యోగీశ్వరుడైన శివుని యోగ మార్గం ద్వారా పొందగలము. ఆయనే ఈ యోగమార్గం స్వయంగా ప్రబోధించారు. అష్టాంగయోగం అని పిలువ బడే ఈ యోగము శివానుగ్రహం కలిగించే విశిష్టమైన ఉపాసనా మార్గం. ఈ అష్టాంగయోగం ఆచరిస్తూ శివానుగ్రహంత్వరగా లభిస్తుంది.
మానవుని శరీరంలో కంఠం నుండి నాభి వరకు గల ప్రదేశము ఉత్తమమైనది. దీని మధ్యలోనేహృదయంఉంటుంది. అలాగే రెండు కనుబొమల మధ్యగల భృకుటి స్థానము కూడా ఉత్తమమైనదే. ఈ రెండు స్థానాలను ఆశ్రయించి యోగా భ్యాసం చేసినవారికి సర్వార్థ జ్ఞానము లభిస్తుంది.
ఈశ్వరుని అనుగ్రహం ఉన్న వానికే యోగము లభిస్తుంది. ఇందుకు ఏకాగ్రత ముఖ్యం.
ఈ ఏకాగ్రత అనేది బ్రహ్మాదుల వలన లభించదు. అభ్యాసం ద్వారా వ్యక్తిలో క్రమక్రమంగా ఉద్భవిస్తుంది.మనస్సుఏకాగ్రత తో నిశ్చలమవుతుంది, నిర్మల మవుతుంది. శివానుగ్రహ ప్రాప్తి ద్వారా లభించేఅలౌకికానందం స్వయంగా అనుభ వించాలి గాని వేరేవరు చెప్పలేరు.
శివయోగంఅంటేపరమేశ్వరునికి సంబంధించిన నిరతిశయ ఆనందం. ఇలాంటి ఆనందం పొందడానికి శివజ్ఞానము కావాలి. ఈ జ్ఞానముశివునికృప వలనేలభిస్తుంది.జ్ఞానముచేతనే యోగము సిద్దిస్తుంది. శివ జ్ఞానము కలగటంవలనవిషయ వాంఛల నుండి ఇంద్రియాలను మరలించిమనస్సునునిరోధించే శక్తి అభ్యాసకుడికి వస్తుంది. అంతేకాకుండా అతను చేసిన పాపాలన్ని నశిస్తాయి.
అలా అభ్యాసం చేసి ఇంద్రియ నిగ్రహం పొందినవారికే యోగం సిద్దిస్తుంది.మనస్సునునిరోధించ టాన్నే యోగం అంటారు.
ఈ యోగము సాధించడానికి ఎనిమిదివిధానములు
ఉన్నాయి.
1)యమము 2)నియమము 3)ఆసనము4)ప్రాణాయామము 5)ప్రత్యాహారము 6)ధారణము 7)ధ్యానము 8)సమాధి
1) యమము : యమము అంటే భౌతిక లౌకిక కర్మలను పరిత్య జించిడం.అహింసపాటించడ
వలన యమము అలవాటు అవుతుంది. యమము పొంద డానికిసత్యం,బ్రహ్మచర్యం,అపరి గ్రహము అనే నియమాలని పాటించవలసి ఉంటుంది.
అహింస అంటే తనలాగానే ఇతరప్రాణులనుచూసుకోవడం. వారి మేలు కోసం ప్రవర్తించడం. సత్యం అంటే చూసింది,విన్నది, జరిగింది, అనుభవించింది యధాతథంగా ఇతరులకు బాధ కలగకుండా చెప్పడం. అసభ్య సంభాషణలు చేయకపోవడం, ఇతరుల దోషాలు తెలిసినా వాటిని మరోకరికి చెప్పకుండా ఉండటం కూడా సత్యము అవుతుంది.
అపరిగ్రహముఅంటేఆపత్కాలంలో కూడా ఇతరుల నుంచి ద్రవ్యాలని,వస్తువులనిమనస్సు చేత, మాట చేత, క్రియ చేత స్వీకరించకుండా ఉండటం. దీనిని అస్తేయం అంటారు.
మనోవాక్కాయ కర్మల ద్వారా మైథునాన్ని వాంఛించకుండా, ఆచరించకుండా ఉండటాన్ని బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మ చారులు, సన్యాసులు తప్పక పాటించాలి. గృహస్థులు ఇతర స్త్రీలను వాంఛించకుండా తమ భార్యలతో విహితమైన సమయాలలో మైధునం చేయవచ్చును. ఇటువంటి వారు బ్రహ్మచారుల గానే పరగణించ బడతారు. గృహస్థుడి భార్య పరమ పవిత్రురాలిగా చెప్పబడింది.
ఇంద్రియాలు విషయభోగాలు అనుభవించడంతోతృప్తిపడవమరింత కావాలని మనిషిని ప్రేరేపిస్తాయి. అందుకే త్రికరణ శుద్ధిగా భౌతిక విషయ సుఖ వాంఛలను విడిచి పెట్టాలి. కామసుఖం విడిస్తేనే మోక్షానికి అర్హత లభిస్తుంది. అలా వదల లేని మానవుడు మృగ పశు పక్ష్యాది జన్మలు పొందుతాడు. విషయ త్యాగం అంటే వివిధ రకాల కర్మలను కోరికలతో కాకుండా, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా,పరమేశ్వరార్పణ భావనతో ఆచరించడం. ఇటువంటి వారు మాత్రమే మోక్షము పొందటానికి అర్హులు అవుతారు.
తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 శ్రీ ఉఓంమా
మహేశ్వరాయ నమ:💜
లోకా:సమస్తాః
సుఖినోభవన్తు
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
No comments:
Post a Comment