మనసు ఖాళీ చేస్తే మాధవుడు ప్రవేశిస్తాడు - An empty mind becomes the abode of Madhava
https://youtu.be/X8FoTYPgS2E?si=HqZ7C1-z38931Gkg
https://www.youtube.com/watch?v=X8FoTYPgS2E
Transcript:
(00:00) నమస్తే శంకరాచార్యుల వారు ఇలా వివరించారు. మానవ జీవితం ఎంతో అమూల్యమైనది. అయితే సంసారపు రాగద్వేషాలు, మోహాలు, కోరికలు, భోగాలు మనసుని అంటి పెట్టుకుని రోజులు, నెలలు, సంవత్సరాలు వృధా చేసుకునేలా చేస్తున్నాయి. మానవుడు ఈ మాయాజాలం నుంచి తప్పించుకొని తరించే జీవితాన్ని గడపాలంటే భక్తి, జ్ఞానము వైరాగ్యాలు అవసరము. ఇవే శంకరాచార్యుల వారు మనకు ప్రసాదించిన మహాజ్ఞాన సంపద.
(00:28) మన శరీరము పంచేంద్రియాలు కర్మేంద్రియాలు ధాతువులతో ఏర్పడింది. ఆహారం మట్టిలోనుంచి వచ్చినట్లే శరీరం కూడా చివరికి మట్టిలో కలిసిపోతుంది. రక్తము, మాంసము, నెత్తురు, మలమూత్రాలతో నిండిన ఈ శరీరాన్ని అందమని ఆకర్షణని భావించి మనకు మనమే మోహం సృష్టించుకుంటున్నాము. ఈ మోహమే అసూయ ద్వేషము రాగము భోగము కామము వంటి పాప కర్మలకు కారణమవుతుంది. దీపపు పురుగు మంటలలోపడి ఎలా మరణిస్తుందో అదేవిధంగా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాము.
(00:57) జీవితం చంచలమైనది క్షణికము బాధతో నిండి ఉంది బతకడానికి డబ్బు అవసరమే కానీ డబ్బే లక్ష్యం అయిపోతే జీవితం వ్యర్థమైపోయే ప్రమాదం ఉంది. గడిచిన కాలం తిరిగి రాదు కనుక ఉన్న సమయాన్ని వృధా చేస్తే మానవ జన్మ ఫలహీనం అవుతుంది. ఈ జన్మలో చేసే సాధన పైనే వచ్చే జన్మ ఆధారపడి ఉంటుంది. కర్మలు పూర్తిగా నశించేది మోక్షం ద్వారా మాత్రమే. మోక్షం సాధ్యమయ్యేది వివేకము వైరాగ్యము భక్తి ధ్యానము వీటితోనే ఇవన్నీ చేయాలంటే శరీరం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి.
(01:28) ఒక్కసారి మృత్యువు వరకు చేరితే సాధనకు అవకాశమే ఉండదు మృత్యువు ఏ క్షణం ఎవరిని వెంబడిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఉదాహరణకు ఒక ప్రదేశంలో హోరును వాన పడుతుంది. ఒక చెరువులో నుంచి ఒక బోదురు కప్ప బయటిక వచ్చింది అది చాలా ఆనందంగా గెంతుతోంది. ఆ కప్పను చూసి ఒక పాము కన్నల్లో నుంచి బయటిక వచ్చింది అబ్బా ఈ కప్ప ఎంత ఆరోగ్యంగా ఉంది ఈరోజు నాకు పండగే అనుకుంది.
(01:49) అలా ఆ కప్పను అనుసరిస్తున్న పామును చూసి ఒక ముంగిస అబ్బాయి ఈరోజు దేవుడు నాకు ఎంత మంచి ఆహారాన్ని అందించాడు అనుకుంది. అలా అనుకుంటూ పామును వెంబడించింది. ఆ ముంగిసను చూసిన నక్క మహా ఆనందపడుతూ దాని వెనకే వెళ్ళసాగింది. ఇలా వెళ్తున్న నక్కను చూసి ఆకలితో నకనకలాడుతున్న ఒక పులి ఆవగా దాదాన్ని అనుసరించసాగింది. ఆ పులిని చూసి ఒక వేటగాడు తన పంట పండింది అనుకని బాణం ఎక్కువ పెట్టి పులిని అనుసరించాడు.
(02:12) ఇలా ఒకదాని వెనక ఒకటి వాటి ఆహారం గురించి ఆరాటపడుతూ వెళ్తున్నాయి ఇలా అని మాత్రమే మనకు అర్థమయింది కానీ ఇందులో మనకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. అలా కప్ప, పాము, ముంగిస, నక్క, పులి, వేటగాడు ఇవన్నీ ఒకదాని వెనక ఇంకొకటి మృత్యువుగా వెళ్తున్నాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే మృత్యువు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని రాదు.
(02:34) మనకు చెప్పి కూడా రాదు. మృత్యువు సమీపించే సమయం ఆసన్నమైతే ఆ వ్యక్తి ఉండే ప్రదేశాన్ని కానీ అతని పదవిని కానీ అతని ఐశ్వర్యాన్ని కానీ లెక్క చేయదు. ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఎరుగుతో వ్యవహరిస్తూ తిధి వారా నక్షత్రాలు చూడకుండా ప్రతి నిమిషాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం ఉపయోగించుకోవాలి. అద్భుతమైన మానవ జన్మ లభించినప్పుడు శాశ్వతం కాని క్షణికమైనటువంటి విషయ వస్తువుల మీద కోరికలను అదుపులో పెట్టుకొని ఈ జీవిత పరిధి నుంచి బయటపడాలని తీవ్రమైన కాంక్ష కలిగి ఏకాగ్రతతో జీవించాలి అనుకోవడంపై సాధన ప్రారంభించాలి.
(03:06) ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే మనలో ఉన్న దురలవాట్లను పూర్తిగా వదిలేయాలి. అవి వదలకపోయినట్లయితే ఒక పక్క చేసే సాధన ద్వారా దుష్కర్మలన్నీ వదిలించుకుంటూ ఉంటూ మరొక పక్క ఆ అలవాట్ల ద్వారా అవి తిరిగి పేరుకొంటూ ఉంటాయి. ఒక పడవ నీళ్లలో ఉన్నంత వరకు అది క్షేమంగానే ఉంటుంది ఎప్పుడైతే ఆ పడవకి కన్నం పడి పడవలోకి నీరు రావడం మొదలవుతుందో వెంటనే ఆ పడవ ప్రమాదంలో పడుతుంది ఎప్పుడైనా సరే నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు అలాగే మనిషి కూడా విషయ వస్తువులపై పరిమితిని మించి ప్రేమను పెంచుకుంటూ పోతే పై విధంగానే సంసారం అనే సముద్రంలో మునిగిపోక తప్పదు
(03:40) కాబట్టి ఈ జీవితం యొక్క అర్థాన్ని మనం గ్రహించి ఆత్మ జ్ఞానానికి ముక్తికి గనక మనం ప్రయత్నించినట్లయితే జ్ఞాన స్వరూపుడైన సద్గురువు మనకు లభించి మనల్ని ముక్తి ముక్తి మార్గం వైపు నడిపిస్తాడు. మోక్షం పొందాలని అశాశ్వతమైన శరీరాన్ని దృష్టిలో ఉంచుకొని కాయకల్ప వ్రతాలు చేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు.
(03:59) నిజంగా ముక్తిని పొందాలంటే విషయాలన్నింటిని విషంలాగా విడిచిపెట్టాలి ఎందుకంటే మోహమే ఒక ముముక్షువుకు శత్రువు దానిని జయించలేని వాళ్ళకు మోక్షానికి అర్హత ఉండదు అని చెప్తారు శ్రీ రమణ మహర్షి తాను పరబ్రహ్మనే అని మరిచిపోయి తనని తాను జీవుడు అనుకోగానే ఈ జీవన్ మరణ పరంపరలో పడిపోతూ ఉంటాడు. నేనెవరిని అనే ప్రశ్నతో అసలు సత్యాన్ని తెలుసుకుంటే తాను జీవుడ్నే అనే అజ్ఞానం తొలగి స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు.
(04:24) అప్పుడు తాను పరబ్రహ్మ కాక వేరే ఏమీ కాదు అని స్పష్టమవుతుంది. అదే మోక్షము అని చెప్తారు. మరి మానవుడు మాధవుని అనుగ్రహానికి నోచుకోవాలంటే తన మనసును కోరికల కంపగా కాక ప్రేమ భక్తి విశ్వాసాల కంపగా చేసుకోవాలి. అది ఎలా అంటే ఒకసారి రుక్మిణి దేవి కృష్ణుడి చేతిలోని వేణువును చూసి ఇలా అడిగిందంట. విడవకుండా కృష్ణుడు ఎప్పుడూ నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటారు కదా పూర్వజన్మలో నువ్వు ఏ పుణ్యం చేశవు ఆ రహస్యం నాకు కూడా చెప్పు అని అడిగిందంట అందుకు వేణువు నవ్వి ఇలా చెప్పిందంట నా లోపల డొల్ల తప్ప ఏమీ లేదు ఆ ఏమీ లేకపోవడమే నన్ను ఆ ఆనంద కిషోరుడికి దగ్గర చేసింది అని చెప్పిందంట దీని అర్థం
(05:02) ఏంటంటే ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసులో నుంచి పూర్తిగా తొలగించుకుని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆ మాధవునితో సదా ఉండగలుగుతారు అని దీని అర్థం అప్పుడే ఆయన అనుగ్రహానికి నోచుకుంటారు మనం ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని ఆచరిస్తే ఇంకా ఎలాంటి సాధనలు అవసరం లేదు అంటే మన మనసు కోరికలతో నిండిపోయి ఉంటే అందులో దైవం ప్రవేశించడానికి చోటు ఉండదు వెలుగు నిండాలంటే గదిని ఖాళీ చేయాలి కదా అలాగే మోక్షం రావాలంటే మనసులో ఉన్న భయాలను ఆసనలను అహంకారాలను వదిలేయాలి.
(05:33) కృష్ణుడు వేణువు ఎందుకు ఆయన చేతిలో ఉండగలిగింది ఎందుకంటే దానిలో అహం లేదు స్వార్థం లేదు ఇష్టము అయిష్టము ఏమి లేవు శూన్యం అయినదే సంపూర్ణాన్ని అందుకుంటుంది అందుకే మనసు శూన్యం అయితే జీవితం మోక్షం వైపు సాగుతుంది ఆ మోక్షం దిశగా ప్రయాణించడానికి మనం ధ్యానం చేస్తూ జ్ఞానం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ థాంక్యూ
No comments:
Post a Comment