భార్య,తల్లి మధ్య నలిగిపోతున్న మగవాళ్ళు | @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w01Jl3pttHc
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి టాపిక్ చెప్పుకుందాంఅండి మగవాళ్ళందరూ పెళ్లి అయిన తర్వాత ఫ్యామిలీతో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అందులో ముఖ్యమైన సమస్య ఏది అంటే తల్లా పెల్లామ ఇది పెద్ద క్వశ్చన్ కింద మారుతుంది వాళ్ళ లైఫ్ లో ఆయనకి ఒక 70 80 ఏళ్ళు వచ్చినా సరే ఈ సమస్యకి చిక్కుముడులు విప్పలేరు ఈ సమస్యకి సొల్యూషన్ కూడా దొరకదున్నమాట.
(00:35) మరి ఈరోజు తల్లా పెళ్లామా అని చెప్పి ఒక టాపిక్ తీసుకుందాం. ప్రతి కుటుంబంలో ఇవే కలహాలు మగపిల్లవాడికి పెళ్లి అవ్వనంతసేపు అవ్వలేదని చెప్పి తల్లిదండ్రులు గుంజుకుంటారు తర్వాత ఒక అమ్మాయిని చూసే ప్రయత్నంలో విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇదివరకు అంటే కట్న కానుకలు తీసుకురావాలి బాగా ఆస్తిలో ఉండాలి అమ్మాయి కొందనపు బొమ్మలా ఉండాలి అని చెప్పి చాలా కండిషన్స్ పెట్టేవారు.
(01:05) ఇప్పుడు పిల్ల దొరకడమే కష్టమైపోతుంది. అది అందంగా ఉన్న అమ్మాయిలు కాదండి అందంగా లేకుండా ఇంకా చెప్పనవసరంలే ఆడపిల్ల అయితే చాలు రా బాబు అని తీసుకొచ్చుకుంటున్నారు. అది కుల మతాలకు అతీతంగా పెళ్లిలు జరుగుతున్నాయి. పెళ్లి ముచ్చట్లు అన్నీ అయిన తర్వాత ఇంటికి కోడలి పిల్ల వస్తుంది. కోడల పిల్లతో అత్తగారు సక్కిగా ఉంటుందా? ఇక్కడే అసలైన సమస్యలు మొదలవుతాయి అనమాట.
(01:30) ఇది ఈరోజు సమస్య కాదండి తరతరాలుగా అనాదిగా పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం అనమాట. అత్తగారిలో ఒకప్పుడు కుటుంబానికి ఒక దన్నుగా ఉండేవారు కోడలి పిల్లని కూడా కూతురులా చూసుకున్న అత్తలో ఉన్నారు అది కాదనట్ల ఎక్కువ శాతం కోడలని టార్చర్ పెట్టే అత్తలే ఉన్నారు. మరి ఈ రోజుకి కూడా అవే ఇగోలు అవే బెట్టులు అత్తగారు ఆలోచించే తీరు కూడా మారలేదు బయట నుంచి ఒక ఆడపిల్లని తెచ్చుకుంటే నా ఇల్లు ఆ అమ్మాయి ఇల్లు అయిపోతుంది.
(02:05) నా పెత్తనం అంతా కోడలు లాగేసుకుంటుంది నా కొడుకుని గ్రిప్లో పెట్టేసుకుంటుంది. నన్ను చూడదు నాకు ఇంత ముద్ద పెట్టదు మా ఆస్తులు రాయించేసుకుంటుంది నా కొడుకుని కొంగుకు ముడేసేసుకుంటుంది. ఈ ఆలోచనలే చేస్తున్నారు కానీ అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఈ సమస్య వల్ల ఎంతోమంది ఆడవాళ్ళు ఎన్నో చిత్రహింసలు పడుతున్నారు.
(02:31) నేను ఇదివరకు చేసిన వీడియోస్ లో నా సబ్స్క్రైబర్ ఒక ఆవిడ అడిగారండి మీకు పుణ్యం ఉంటది శ్రీదేవి గారు దీని మీద ఒక వీడియో చేయండి అని అందుకనే నేను ఈ టాపిక్ తీసుకున్నాను అన్నమాట కొడుక్కి బెల్లం కావాలి కానీ ఆ ఇంటికి కోడలు అవసరం లేదన్నమాట ఏమన్నా అంటే బయటి నుంచి వచ్చావు ఇది నీ ఇల్లు కాదు అంటారు అమ్మాలేమో ఆడపిల్లవి నువ్వు ఈడ పిల్లవి కాదు అంటారు పుట్టిల్లు ఎప్పుడు నీ సొత్తు కాదు అంటారు అత్తిల్లే నీ సొత్తు అత్తిల్లే నీకు అన్నీ నువ్వు అక్కడే పడిఉండాలి కొట్టినా తిట్టినా నరికినా చంపినా నువ్వు అక్కడే పడిఉండాలి నీకు ఆ ఇల్లే గతి నీ మొగుడే సర్వస్వం అని చెప్పి పంపుతారు. మరి
(03:12) అటు పుట్టిల్లు లేక ఇటు అత్తిల్లు లేక ఆ ఆడపిల్ల ఎంత నరకం అనుభవిస్తుంది ఎన్ని ఆలోచనలు చేస్తుంది. సర్వస్వం వదిలేసి వస్తుంది భర్త కోసం పుట్టిల్లిని వదిలేస్తది కన్న ఇల్లు కన్న ఊరు స్నేహితులు తోడ పుట్టినోళ్ళు చుట్టూ ఉన్న వాతావరణం వాళ్లకున్న గీదులు ఆవులు కుక్కపిల్లలు పిల్లి పిల్లలు ఇవి కూడా ప్రతి దాంతో అనుబంధం ఏర్పడుద్ది ఆ ఆడపిల్లకి పంట పొలాలు ఇంట్లో ఉన్న మొక్కలు చెట్లు పశువులు పక్షులు మరి వీటిలన్నిటిని వదిలి అత్తిల్లే సర్వస్వం అత్తమామే నా తల్లిదండ్రులు నా భర్తే నాకు దేవుడు నా భర్తే నాకు తండ్రి అని తెగించి వస్తుంది.
(03:56) ఎంత భయపడుతున్న ధైర్యంగా మెట్టిని ఇంట్లో కుడికాలు పెడుతున్నా అన్ని ఆశలు మూట కట్టుకొని వచ్చిన ఆడపిల్లకి మీరు ఏం మిగులుస్తున్నారు ఏ ప్రేమని ఇస్తున్నారు ఆప్యాయతను పంచుతున్నారు ఏం లేదు కదా పని మనుషులాగా పని చేస్తుంది. మొత్తం నా ఇల్లే అంటది ఉమ్మడి కుటుంబంలో ఉంటది ఇంటికివచ్చిన బంధువులందరిన నాోళ్ళని హక్కును చేర్చుకుంటది ఇటు పుట్టింటోలా అత్తింటి తరపు నుంచి వచ్చారా అని కూడా చూడదు.
(04:28) అంత కల్మషం లేకుండా ఉండేవారండి మరి ఇప్పుడు ఉండకపోవటానికి కారణం ఏమిటి అంటే కేవలం అత్తగారే అత్తింటోలే అందులో మామగారు చెవ్వులున్న చెవిటివాడిలాగా ఉన్నా అత్తగారే డ్రామా నడిపించేస్తారు ఇంతకీ తల్లా పెల్లామా అని చెప్పి మగవాడు తేల్చుకోవాల్సి వస్తే ఏం చేయాలి తల్లితో ఎలా ప్రవర్తించాలి భార్యతో ఎలా సఖ్యతగా ఉండాలి తల్లి మీద ప్రేమని పక్కన పెట్టాలా భార్యని పట్టించుకోకుండా ఉండాలా మరి ఇదొక పెద్ద క్వశ్చన్ కదండీ మరి మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీరు ఎలాగ ఈ సమస్యను ఫేస్ చేశారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలపండి మగవాడు తల్లా పెల్లామా అని తేల్చుకోలేక కుడితిలో పడ్డ ఎలకలాగా
(05:07) ఉండడానికి కారణం ఏమిటి అంటే కుడితిలో పడ్డ ఎలక గిలగిలా కొట్టుకుంటూ ఉంటది రోజు ఇంటికి వస్తే వీడికి ఇదే పరిస్థితి మరి అటువంటి కారణాలు దేనికొస్తాయంటే కొంతమంది అత్తలు ఉంటారండి కొడుకు నుంచి పెల్లాన్ని విడదీయాలని రోజు అదే పనిలో ఉంటారు. కంకణం కట్టుకుంటారు నేను అందరి గురించి చెప్పట్లా 60% అత్తలు ఇలాగే ఉంటారున్నమాట ఇప్పుడు పూర్తిగా 95% అయిపోయారు అనుకోండి ఇంటికి రాగానే కొడుక్కి కోడల మీద చాడీలు చెప్పటం ఆ అమ్మాయిని తిట్టించడం వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకుండా దూరాన్ని పెంచటం ఇంకా చెప్పాలంటే నాకు దడ పుట్టేస్తుంది అత్తలేండి నాకు దడ పుట్టేస్తుంది నాకు
(05:49) చామటలు పట్టేస్తున్నాయి నాకు బీపి ఎక్కువైపోతుంది ఆ నిన్ను ఒంటరిగా పడు పడుకోలేను నా కూడా పడుకో నా దగ్గరే ఉండు అని కొడుకుల్ని పక్కన వేసుకొని బొజ్జో పెట్టుకోవడం మొగుడు పెల్లాల్ని వేరు చేయటం కాపురం చేయనివ్వరు ఇది ఎంత దారుణం అండి ఎంత పాపం తెలుసా అండి మొగుడు పెల్లాల్ని వేరు చేస్తే ఆ దాంపత్యాన్ని మీరు దూరం చేస్తే అది మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ కర్మను పోగొట్టుకోలేరు అనమాట మరి అటువంటి పనులు ఎవరు చేయొద్దు కోడలు ఏమైనా మంచిగా ఉన్నారా అంటే కోడలు పెళ్లి అయిన తర్వాత కొన్నాళ్ళకి అతి తెలివి తేటలు ప్రదర్శిస్తది. కొత్తగా వచ్చిన కోడల పిల్ల
(06:26) అంతా నా వాళ్లే అని భ్రమలో బతుకుద్ది. ఎవరు ఎలాంటి వాళ్ళ తెలుసుకోవడానికి ఆమెకి కనీసం వన్ ఇయర్ టైం పడుద్ది. ఈ లోపల ఇవన్నీ జరిగిపోతాయి. కొడుకు నిజంగానే భార్య మీద అభండాలు నమ్ముతాడు. భార్య మీద విసుక్కుంటాడు పెళ్ళం అంటే అసహ్యం పుడుతుంది దూరం పెరుగుతుంది. దాంపత్య జీవితం కూడా ఎన్నో మైళ్ల దూరంలో ఉంటుంది. మరి వీళ్ళు దగ్గరయ్యే ప్రసక్తే లేదు అన్నట్టు మెల్లగా కుటుంబ కలహాలతో కూడి మొగుడు బెల్లాల గొడవల వరకు ఇవి మారతాయి అనమాట ఇందుకు కారణం ఎవరు అంటే కేవలం అత్తగారులే వీళ్ళు ఏమన్నా రాక్షసులా అని మనం అనుకుంటే అసలు కాదండి కొడుకు మీద అతి
(07:10) ప్రేమ కోడలు పెత్తనం లాగేసుకుంటుందని కొడుకు కోడలు కలిసి ఒక సినిమాకి వెళ్ళకూడదు శికారుకి వెళ్ళకూడదు బయటకి వెళ్ళకూడదు కనీసం కలిసి భోజనం కూడా చేయకూడదు కొడుకు డుకు పెల్లంతో అన్నం తిందామని చూసినా అరేయ్ మనఇద్దరం అన్నం తిన్నారా రేయ్ బాబు అని పిలుస్తూనే ఉంటారు. భోజనం ఇద్దరం కలిసి చేయాలని చెప్పి వాళ్ళ అమ్మతో తినేస్తూ ఉంటాడు అక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతాడు.
(07:35) ఎవరితో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం వల్లనే ఇన్ని సమస్యలు అన్నమాట. అంటే ఎవరి ప్లేస్ వాళ్లకి ఇవ్వాలి అన్నది మగాడు మర్చిపోతున్నాడు. అది తెలియజెప్పడానికి కూడా ఆ లిమిట్స్ అన్నవి క్రాస్ చేసేస్తాడు అన్నమాట ఎవరు చెప్పినా నమ్మరు ఎందుకంటే తల్లి ప్రేమ తల్లి మాయలో పడిపోతాడు ఇక్కడ పెళ్ళం ప్రేమలో ఎంత మత్తు ఉంటుందో తల్లి ప్రేమలో అంతకన్నా మాయ ఉంటుంది.
(08:03) యశోదాదేవి శ్రీకృష్ణుడు రిలేషన్ ఎలా ఉంటదో మీకు తెలుసు ఒక అద్భుతమైన బంధం పెంచిన తల్లి అయిన అలాగే ఇక్కడ ప్రతి తల్లిలోనూ మాయ ఉంటుంది ఆరాటం ఉంటుంది అతి ప్రేమలు ఉంటాయి దానివల్ల కన్న కొడుకు కాపురం కూలిపోతుందని గ్రహించలేరు మరి దీనికి సొల్యూషన్ ఏంటి అసలు బంధువులు వచ్చినప్పుడు ఒకలా ఉంటారు అత్తలు బంధువులు లేనప్పుడు ఒకలా ఉంటారు ఆ అమ్మాయిని కనీసం ఇంత ముద్ద టైం కి కూడా తినవరు పగలల్లా చాకరి చేసి ఏ నాలుగింటికో మూడింటికో ఇంత ముద్ద తింటదిన్నమాట మరి ఇవన్నీ చెప్పడాకండి వీడియోలు ఎంత సరిపోదు ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలే ప్రతి ఒక్కరు అనుభవించినవే మరి ఇందుకు మూల్యం ఈరోజు
(08:48) అత్త మామలు ఖచ్చితంగా చెల్లించుకుంటున్నారు. దీనివలనే ఇటువంటి ప్రవర్తన వలనే అత్తగారులు ఇలా సాధించడం వలనే ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం అయిపోయినాయి. వేరు కాపురాలు వచ్చేసినయి కనీసం తల్లిదండ్రులు మొఖం కూడా చూడనివ్వట్లేదు కనీసం ఒక ఫోన్ కూడా మాట్లాడనివ్వకుండా భర్తని ఎగరేసుకుపోతున్నారు దూరం పెడుతున్నారు. కేవలం పుట్టింటోళ్లతో అనే సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఎక్కడో అంటున్నారు.
(09:17) తల్లిదండ్రులు చచ్చారా లేదా అన్నది కూడా పట్టించుకోవట్లేదు మరి ఇంత బాధని అనుభవించడానికి కారణం మీ ప్రవర్తనే మీ బుద్ధే వయసు వస్తే సరిపోదు అండి మన బుద్ధి సక్రమైన తీరులో ఉండాలన్నమాట దయచేసి అందరూ క్షమించండి పెద్దవాళ్ళు ఈ మాట చెప్పకపోతే రేపన్నటి రోజున కోడల వల్ల మీరు బాధపడతారు అత్తగారుల వల్ల కోడళ్లు బాధపడతారు అన్నమాట మధ్యలో వచ్చేసి మీ కొడుకులు నలిగిపోతారు అది ఎంత ఎంత నరకమో అనండి ఇక్కడ సాఫీగా సాగే జీవితం ఏదో చిన్న చిన్న సంతోషాలతో ఆనందాలతో తృప్తిగా బతికితే చాలు మనం రోజు పంచపరమాన్నాలు తినవసరంలా పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద బిల్డింగలు
(10:00) ఉండక్కర్లా ఆస్తిపాస్తులు ఉండక్కర్ల తల్లిదండ్రుల ప్రేమ పొందే అర్హత మనకు ఉండాలి అదృష్టం ఉండాలి భార్య పంచే ప్రేమకి దానికి కూడా ఎంతో అదృష్టం ఉండాలి నోచుకొని ఉండాలి మరి ప్రతి భర్త ఇటువంటి కేరింగ్ తీసుకుంటేనే అంటే ఒక వ్యాపారాన్ని నడపడం ఒక టెక్నిక్ ఒక ఉద్యోగం చేయడం కూడా అది కూడా పెద్ద కల ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్నది సమాజంలో ఎవరితో ఎలా ఉండాలి అన్నది బంధువులతో ఎలా ఉండాలి అన్నది మగవాడికి బాగా తెలుసు స్నేహితులతో ఎలా ఉండాలి అన్నది కూడా కానీ ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయిపోతాడండి తల్లితో ఎలా ఉండాలి పెల్లంతో ఎలా ఉండాలి అన్నది తెలుసుకోలేడు ఎందుకంటే
(10:46) చెప్పాను కదా మాయ అర్థం చేసుకునే టైం కూడా ఇవ్వకుండా ఆడవాళ్ళు మగాన్ని లాక్ చేసేస్తారు రెండు కత్తెలు ఒకే వరలో ఉండలేవు రెండు కొప్పులు ఒకే ఇంట్లో మసలలేవు ఇవే చెప్పేవారు సామెతలు ఇదివరకు రోజుల్లో లేరంటారా అర్థం చేసుకోలేదా కోడల పిల్లలు అత్తగారులు కోడల్ని కూతుర్లో చూసుకోలేదా మరి క్రమంగా ఎందుకు మనం మారిపోయాం ఎందుకు ఇంత ద్వేషం పెంచుకుంటున్నాం ఆ అమ్మాయి కూడా ఒక ఆడపిల్లే కదా నీ కూతురితో సమానమే కదా నీ కూతురు కాపురం బాగుండాలని నువ్వు ఎంత ఆలోచిస్తావ్ ఎన్ని దేవుళ్లకు మొక్కుతావో నీ అల్లుడు కూతురు సఖ్యతిగా ఉండాలని ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలాగే
(11:27) ఆలోచిస్తారు ఒక ఇంటికి పంపేసినప్పుడు అత్త మామ తల్లిదండ్రులని చెప్తూ ఉంటారు. అలా ఈ రోజుల్లో లేకపోవటానికి కారణం ఏమిటి అంటే కేవలం మీ తప్పిదాలే మరి మగాడు తల్లి నుంచి ఎటువంటి ప్రేమలు తీసుకోవాలి తల్లికి ఎంత సమయం ఇవ్వాలి మరి మగవాళ్ళందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి చాలా చిన్న విషయం ఇదేం పెద్దది ఏం కాదు మనంఏమి రాకెట్ సైన్స్ కోసం వెంపర్లాడట్లేదు ఇది అందరూ చేసిన పద్ధతులే మీ తాతలు ముత్తాతలు మీ తండ్రిగారు అలాగే పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారాలే తల్లికి కొంత సమయం ఇవ్వాలి తల్లితో కష్ట సుఖాలు పంచుకోవాలి తల్లిదండ్రుల యోగ క్షామాలు అడగాలి వారికి
(12:10) ఎదురు సమాధానం చెప్పకుండా అనుకువగా నడుచుకోవాలి వాలి ప్రతి మాట వాళ్ళు చెప్పినట్టే వినాలి అంటే వాళ్ళు చెప్పినట్టే చేయాలి అంటే కొన్ని సాధ్యపడతాయి కొన్ని అవ్వవు అందులో తప్పులు కూడా దొరలచ్చు కదా శ్రీదేవి గారు అని మీరు అడగొచ్చు మీ కుటుంబ పరిస్థితుల బట్టి మీ పోకళ్ళ బట్టి మీ ఆచారాల బట్టి కొన్ని చేయవలసి ఉంటాయి అవి వాళ్ళ మాట కాదనకుండా ఖచ్చితంగా మీరు చేయాల్సిందే మీకు వీలు పడనివి సాధ్యం కానివి కూడా ఉంటాయి అక్కడ వాళ్ళకి మీరు సరే అని చెప్పి నిదానంగా పోస్ట్ పోన్ చేస్తూ వాళ్ళకి సర్ది చెప్పుకోండి కోండి సమస్య ఏంటో నిదానంగా వివరించండి అప్పుడు వాళ్ళు దారిలో పడతారు.
(12:48) ఒకేసారి ఆలోచించడం ఒకేసారి చర్చించుకోవడం సమస్యని ఒకేసారి ఇది కాదు నేను చేయను కాదు కూడదు అనేసరికి వాళ్ళు దాన్ని యక్సెప్ట్ చేయలేరు. ఒకేసారి ఎప్పుడు మీరు పిట్ట మీటింగులు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఏం చేసినా మీరు నవ్వినా ఏడ్చినా మీరు ఎదురు సమాధానం చెప్పినా కోపగించుకున్నా విసుక్కున్న అన్ని మీ భార్య మీదకే వెళ్ళిపోతాయి.
(13:14) ఇదిగో ఆ అమ్మాయి వచ్చింది నా కొడుకు నాతో సరిగ్గా ఉండట్లేదు ఎదురు సమాధానాలు చెప్పుకుంటున్నాడు విసుక్కుంటున్నాడు కోపగించుకుంటున్నాడు అని చెప్పి చాలా వరకు భాగవతాలు వెళ్ళిపోతాయి అందుకనే మీరు తల్లిదండ్రులతో ఇలా మెలగాలండి వాళ్ళ కష్టం పంచుకోండి మీ కష్టాన్ని చెప్పండి అందరూ కలిసి భోజనం చేయండి అందరూ కలిసి ఏదైనా సరే కలిసి తినండి దాచుకోవటం మీరు వేరే తెచ్చుకోవడం వాళ్ళకి వేరే పెట్టడం చేయొద్దు అందరూ కలిసి మార్నింగ్ పూజలో పాల్గొనండి భగవంతుడి ఆరాధించండి సంప్రదాయాలు సంస్కృతులు ఖచ్చితంగా పాటిస్తేనే ఒక డ్రెస్సెన్స్ భారతీయ కట్టు బొట్టు ఉన్నప్పుడు ఆ ఇల్లు పెద్దవాళ్ళని
(13:51) అనుసరించి వెళ్తది. ఇంకా మీ భార్య విషయంకి వద్దాం. మరి భార్యతో ఎలా గడపాలి అంటారా అంటే పెళ్ళాం ఎప్పుడు నిరంతరం ఇంటి పనులతో బిజీ అయ్యి ఉంటది. మరి ఈ రోజుల్లో అయితే జాబ్ కూడా చేస్తున్నారు కాబట్టి మీకు ఆవిడతో సమయం గడిపే టైమే ఉండదు. మరి వాళ్ళతో ఎలా ఉండాలి అంటే ఆమెకి ఉదయం నుంచి మీరు టైం ఇవ్వకపోయినా ఖచ్చితంగా సాయంత్రాలు ఇంటికి వచ్చేసరికి రాత్రులు వచ్చేసరికి కచ్చితంగా టైం అంతా వాళ్ళకే ఇవ్వాలి మీరు పెళ్ళానికి ఇచ్చే టైం తల్లికి తల్లికి ఇచ్చే టైం పెళ్ళానికి ఇస్తే ఖచ్చితంగా సీన్ రివర్స్ అవుతుంది సినిమా అట్టర్ బ్లాక్ అవుతుంది అన్నమాట సాయంత్రం ఇంటికి
(14:35) రాగానే ఒక చక్కటి చిరునవ్వుతో మీ భార్యకి ఎదురు వెళ్ళండి అండి ఆమె చక్కటి చిరునవ్వుతో అదే ఆరాటంతో భరత్కి ఒక మంచి నీళ్లు గ్లాస్ తీసుకొస్తది. ఇటువంటి అలవాట్లు లేకపోయినా మీరు కచ్చితంగా మంచి నీళ్లుు తీసుకురమ్మని అడగాలన్నమాట. ఎందుకంటే అక్కడే చాలా గ్యాప్ వస్తది. వచ్చినప్పుడు ఇంకో మాట దొరలటాకు ఉండదు. ఎందుకంటే కొంతమంది బెల్లాలు మగాడు ఇంటికి రాగానే అతను ఎంత కష్టపడి వచ్చాడు వ్యాపారంలో నలిగిపోయాడా ఉద్యోగంలో నలిగిపోయాడా ట్రాఫిక్ లో నలిగిపోయాడా? అని చూడరు.
(15:11) ఆ వచ్చారా ఇంత లేట్ అయిందంటి ఇప్పటివరకు ఏం పని ఊరంతా బలాదూరుగా తిరిగవచ్చి ఈ టైం గా వచ్చేది ఇంట్లో పని పటా లేదా ఇంట్లో ఏం కావాలో చూడరా అని చెప్పి విసుక్కుంటూ ఉంటారు. అటువంటి మాటలు దొరలకుండా ఈ మంచి నీళ్లు గ్లాస్ తో తీసుకొచ్చి ఇవ్వడం అన్నదే ఒక మంచి కలమాట. చక్కగా వాటర్ తాగి మీరు రిలాక్స్ అవుతారు భార్య చేతి మీద ఆమె కూడా కొంచెం వెనకడుగు వేస్తది.
(15:36) ఎందుకంటే వాటర్ అడగ్గానే అమ్మో అలసిపోయాడేమో ఇప్పుడు తిడతారేమో మనం ఏం మాట్లాడకూడదు అని నోరు మూసుకుంటారు. ఇదివరకు ఉన్న అలవాట్లు ఇప్పుడు ఆడవాళ్ళకి ఎవ్వరికీ లేవు మీరు దయచేసి అలవాటు చేసుకోండి. ఇదివరకు పోకళ్ళు అలవాటు చేసుకుంటే మీ ఇల్లు ప్రశాంతతగా ఉంటది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి సాయంత్రం టైం ఇవ్వాలి. అలాగే రాత్రి అయ్యేసరికి ఆమెతో మంచి చెళ్లుు చర్చించాలి.
(15:59) పగలల్లా కష్టపడి మీరు ఎంత ట్రబుల్స్ వేస్ట్ చేశారు ఏం జరిగింది అని వివరించి కొన్ని కొన్ని చెప్పాలి కొన్ని కొన్ని చెప్పకూడనివి కూడా ఉంటాయి ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. పెల్లంతో ముద్దు ముచ్చట్లు కూడా ఉంటాయన్నమాట. వీటిని కూడా మీరు సీరియస్ గా తీసుకోవాలి వాటిల్ని పంచుకోవాలి. ఎందుకంటే మీ మనసు అక్కడే ఆగిపోద్దేమో అలసిపోయి ఆడదాని మనసు ఆగిపోదు. ఎప్పుడు కొత్త తరహాకే ఉంటుంది.
(16:25) ఎప్పుడు వికసించిన పుష్పం లాగే తన మనసు ఆలోచిస్తూ ఉంటుంది అది గ్రహించండి. ఈ దాంపత్యం అన్న విషయంలో కూడా చాలా సమస్యలు సంసారంలో తలెత్తుతాయి నేను అలసిపోయి వచ్చాను నేను ఇలాగే ఉంటాను నాకు రెస్ట్ కావాలి నాకు నిద్ర కావాలి అని మీరు ఒక రోజు రెండు రోజులు చెప్పొచ్చు రోజు చెప్పకూడదు చెప్పలేరు దానివల్ల మీ దూరం పెరుగుతుంది.
(16:50) మరి ఇటువంటి చిన్న చిన్న పరిష్కారాలు మీరు చేసుకుంటే మీ సంసారం ఒక పూల తోట లాగా ఎప్పుడు పుష్పాలు విరబూస్తూనే ఉంటాయి. ఆఖరి నిమిషంలో మనం ఒక్క ఆలోచన చేయాలి మరి ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేవు కదండీ మేము వేరే అంటున్నాం తల్లిదండ్రులు వేరే ఉంటున్నారు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అని మీరు అడగొచ్చు మీరు వేరేవి ఉండాలని చెప్పట్లేదు ఉండకూడదు అని చెప్తున్నాను తల్లిదండ్రులని ఖచ్చితంగా మీతో ఉంచుకోవాలి కూడా పెట్టుకోవాలి అందరూ ఒకే కుటుంబంలో ఉండాలి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ బాగుపడాలి అని నేను చెప్తున్నాను ఎందుకంటే చిన్నతనం నుంచి పొత్తిలులో ఉండగానే
(17:30) బిడ్డని తల్లి స్పర్శ ఆ వెచ్చతనం కోసం పొత్తిలులో వేస్తారు. అక్కడ నుంచి నిన్ను రాయికేసి కొట్టిందా రప్పకేసి కొట్టిందా లేదా నువ్వు అల్లరి చేస్తున్నావని తిండి తింటలేదని నీకు నీళ్లు పోయాలని నీకు పాలు పెట్టాలని నిన్ను బొజ్జగించాలని నీకు చదువు చెప్పించాలని బడికి పంపాలని ఇంకా నీకు స్నానం చేయించాలని ముడ్డి కడగాలని మూతి కడగాలని చెప్పి నిన్ను వదిలించుకోలేదు నీ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి నిన్ను చెట్టు అంత బిడ్డగా పెంచారు మరి దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల్ని మనం ఎందుకు వదలాలి అసలు వాళ్ళు పరాయి పంచన బతకాల్సిన అవసరం ఏంటి
(18:08) వృద్ధాశ్రమంలో ఎందుకు వేస్తున్నారు రోడ్ల మీదకి ఎందుకు పడేస్తున్నారు నేను నైట్నైన్ అవుతుంది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్ళవస్తున్నప్పుడు ఒక ముసలా ఆవిడ చలికి వనికిపోతూ కనీసం ఆమె దగ్గర ఎక్స్ట్రా వస్త్రం కూడా లేకుండా ముడుచుకుపోయిన చీరతోనే అలాగా ఫుట్ పాత్ మీద పడుకుంది. నేను బండి ఆపి నా పిల్లల కోసం తెచ్చుకున్న బాదం పాల్లో ఇంక నా దగ్గర అవే ఉన్నాయి ఒక బాదం బాటిలు ఇస్తే ఆకలితో ఉందే ముసలావిడ చాలా ఏళ్లు ఉంటాయండి 96 ఏళ్ళు అలా ఉండొచ్చు ముసలు ముద్దమాట గడగడా తాగేసింది అర్థం కాదేమో అనుకున్నా మామ ఊపు ఊపు అంటే ఊపారు చక్కగా తాగారు అంత
(18:52) కూలింగ్ ఉన్న మరి ఇటువంటి పరిస్థితులు ఎవరి తల్లిదండ్రులకి పట్టనివ్వద్దు అంత చండాలమైన గతులు పట్టని ఇవ్వద్దు అందుకనే అంటున్నా కచ్చితంగా తల్లిదండ్రులు మనతోనే ఉండాలి వాళ్ళు ఆ రోజున ఇదంతా నేను ఎందుకు చేయాలి వీడిని పెంచి పెద్ద చేయాలి అని అనుకున్నప్పుడు కచ్చితంగా ఈరోజు మనం భూమిమీద ఉండం మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారా అని చూస్తున్నాం ఉదయం లేచి దండాలు కూడా పెట్టేస్తున్నారు కొడుకులు కోడల్లో కూతుర్లు తల్లిదండ్రులు చావాలని ఏ వాళ్ళ బరువు మీరేమైనా మోస్తున్నారా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనండి మన ఇంటికే ఒక అందం ఒక కల ఎవరు మన ఇంటి వైపు చూడరు మాట అనరు మన పిల్లలు చాలా
(19:35) క్రమశిక్షణగా పెరుగుతారు మన పిల్లల్ని మనం కాచుకొని కాపలా కాసుకొని ఎక్కడికి వెళ్లారా ఏంటా అని మనం చూడనవసరంలే మన అమ్మోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కి వాళ్ళు అలవాటు అవుతారు ఒక కోళ్ళని కథలు వింటారు ఇంకా ఇన్స్పిరేషన్ స్టోరీస్ వింటారు ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు అని చెప్తారు ఆటోమేటిక్ గా పిల్లలకి వేరే ఆలోచనలు రావు ఇంట్లో ఎవరూ లేన లేనప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి బోర్ కొడుద్ది ఎవరో ఒకళతనో చాట్ చేస్తూ ఉంటారు లేదా ఫోన్లు పట్టుకొని రీల్స్ తిరగేస్తూ ఉంటారు లేదా ఎవరో ఒకరితోనో కాలక్షాపంకి ఫోన్లు
(20:09) మాట్లాడుతూ ఉంటారు ఇవే వ్యసనాల కింద మారి జీవితాన్ని నాశనం చేస్తాయని మీరు గమనించాలి అందుకనే ఖచ్చితంగా పెద్దవాళ్ళు మన కూడా ఉండాలి ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది ఆ కుటుంబం నిలుస్తుంది మర్రి చెట్టు లాగా అది ఒక నీడని ఇస్తుందన్నమాట మనకి అందుకనే ఇది గమనించండి ఇకనే యనా మన పద్ధతులు మార్చుకోండి మరి అందరూ కలిస్తే గొడవలు ఉండవా చిరాకులు ఉండవా అని మీరు అడుగుతారు.
(20:38) దాని బదులు ఎవరికాలు సపరేట్ గా ఉండడమే మంచిది మేడం అని చెప్తారు. ఇది రాంగ్ డెసిషన్ అండి ఇక్కడ సమస్య లేని ఇల్లు ఉండదు సమస్య లేని ఉద్యోగం ఉండదు సమస్య లేని వ్యాపారం ఉండదు సమస్య లేని మనిషి ఉండడం నీకు ఈ తలనొప్పి కాకపోతే ఇంకో తలనొప్పి పెద్దవాళ్ళు ఉంటే పెళ్ళం కూడా భయపడుతుంది. మీకు అర్థంవుతుందా అలాగే వాళ్ళ పెద్దవాళ్ళకి మీరు కూడా గౌరవం ఇవ్వాలి అత్తగారు మామగారు అని కండిషన్ లో ఉంటది సంసారం ఎక్కడైనా సమస్యలు ఉంటాయని మనం గమనించాలి దీన్ని సాల్వ్ చేసుకోవడం మనకి తెలిసు ఉండాలి తెలివిగా వ్యవహరించండి ఉమ్మడి కుటుంబాల్ని డెవలప్ చేసుకోండి మన భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడండి
(21:18) ఇంకొక విషయం అసలైన టాపిక్ కి మళ్ళీ వద్దాం మరి మగవాళ్ళందరూ టెన్షన్ తీసుకోకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆ ఒత్తుల్లో నుంచి బయటకి వచ్చి ఎవరితో ఎలా ఉండాలి ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి తల్లితో ఎలా ఉండాలి పెళ్లంతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి బంధువులతో ఎలా ఉండాలి తండ్రితో ఎలా ఉండాలి అన్నది బాగా తెలిసి ఉండాలండి 64 కలల్లో ఇది ఒక కల అప్పుడు మీ సంసారం ఇంత కూడా బీట్లు పడదున్నమాట మరి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అందరూ జా జాగ్రత్తగా కుటుంబాన్ని ఒక కంచుకోటలా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ అత్తగార్లు కోడలని ఇబ్బంది పెట్టకుండా కల్మషం లేకుండా
(22:04) ఉంటారని అదే కోడల పిల్లలు కూడా అత్తమామని తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూస్తారని ఆశపడుతున్నాను ఇంకా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలని ఇంకా గట్టిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అందరి ఉమ్మడు కుటుంబాలకి అందరి ఫ్యామిలీస్ కి అందరి భార్య భర్తలకి అందరి అత్తలకి కోడలకి చేరవేస్తారని ఆశిస్తూ అందరికీ షేర్ చేస్తారు కదు మరి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది.
(22:31) మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఉంటానండి.
No comments:
Post a Comment