Monday, May 18, 2026

 🌻 *దశావతారములు*  🌻

          దశావతారము అన్న మాటని కొంచము జాగర్తగా అర్ధము చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతరములను ఎందుకు స్వీకరిస్తాడు. దశావతారములు అని పది అవతారములు పది ఎందుకు విశేషతను పొందాయి? అన్న విషయము మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది. *తార అన్న మాటకి వ్యతిరేక పదము అవతార. తార అంటే నక్షత్రము కాదు. తార అంటే ముత్యము ఎంత నిర్మల్యముతో, మలినములేకుండా శుధ్ధమైనదిగా ఉంటుందో అంత శుధ్ధమైనది అని ఒక అర్ధము. తరింపచేయునది కాబట్టి తార అని రెండవ అర్ధము.* 

          ప్రపంచములో తరింపచేసేది ఏది ? *భగవంతుని నుండి విడిపోయిన వాడు మళ్ళీ భగవంతునిలో కలసిపోవడము లేదా తాను ఆత్మ అని ఎరుకలోకి రావడము* తరించడము. ఈ తరింప చెయ్యగలవాడు పరమేశ్వరుడు ఒక్కడే. తార శబ్దము భగవంతునికి ఒక్కడికే అన్వయము అవుతుంది.

🙏 *దశావతార స్తుతి* 🙏

*నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే ।*
*రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ॥*

*వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే ।*
*మీనాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 1 ॥*

*మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో ।*
*కూర్మాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 2 ॥*

*భూచోరకహర పుణ్యమతే క్రీడోద్ధృతభూదేవహరే ।*
*క్రోడాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 3 ॥* 

*హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో ।*
*నరసింహాచ్యుతరూప నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 4 ॥* 

*భవబంధనహర వితతమతే పాదోదకవిహతాఘతతే ।* 
*వటుపటువేషమనోజ్ఞ నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 5 ॥* 

*క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతికర్తాహరమూర్తే ।* 
*భృగుకులరామ పరేశ నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 6 ॥* 

*సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో ।* 
*రావణమర్దన రామ నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 7 ॥* 

*కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే ।* 
*కాళియమర్దన లోకగురో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 8 ॥* 

*దానవసతిమానాపహర త్రిపురవిజయమర్దనరూప ।* 
*బుద్ధజ్ఞాయ చ బౌద్ధ నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 9 ॥* 

*శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే ।* 
*కల్కిరూపపరిపాల నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥ 10 ॥* 

*నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే ।* 
*రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ॥* 

*ఇతి దశావతార స్తుతిః ।*.             

No comments:

Post a Comment