Sunday, May 17, 2026

అతి ప్రయత్నం చేయడం వెంటనే ఆపెయ్యాలి🌹అష్టావక్ర టాక్ 88🌹kanthrisa

అతి ప్రయత్నం చేయడం వెంటనే ఆపెయ్యాలి🌹అష్టావక్ర టాక్ 88🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FkOS3FzIIQ8



Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 88 మనం భాషలో వాడే పదాల్లో అభ్యాసి అనే ఒక పదం ఉంది సన్యాసి అనే పదం కూడా ఉంది. అభ్యాసి ప్రపంచానికి సంబంధించిన విషయాలు నిరంతరం నేర్చుకునేవాడు. సన్యాసి ప్రాపంచిక విషయాలు నిరంతరం వదిలేస్తూ తన మూల స్థితికి చేరుకోవాలనుకునేవాడు. ప్రపంచంలో నువ్వు నిరంతరం నిండడానికి ప్రయత్నం చేయాలి నిన్ను నువ్వు నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి.
(00:37) ప్రపంచంలో ఉన్న మనిషి ఒకటి ఉంటే 100 కావాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో 20 అవుతాడు 30 అవుతాడు 50 అవుతాడు ఆ 100 అనే స్థితిని ఎవరైతే చేరుతారో అతన్ని ఒక టాప్ మోస్ట్ ప్రొఫెషనల్ లేతే మాస్ట్రో లేకపోతే గ్రేట్ సైంటిస్ట్ అని మనం పిలుస్తాం బికాజ్ హి హస్ లర్న్డ్ ఎవ్రీథింగ్ కానీ అదే ప్రకృతిలో ఇప్పటికే 20 30 నేర్చుకొని ఉన్నావు ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్తున్నావు తిరిగి జీరో కావాలని ప్రయత్నం చేస్తున్నావ్ సో అభ్యాసం అనేది ఇన్ఫర్మేషన్ నీలో నింపుకోవడం సన్యాసం అనేది నీలో ఇన్ఫర్మేషన్ చూసి దాన్ని వదిలేసుకోవడం సో సన్యాసం గాని ఆధ్యాత్మికత గాని అభ్యాసము కాదు
(01:20) సో అభ్యాసంలో నువ్వు ఏదో చేయాలి సంతోషం ఉండాలంటే సన్యాసంలో నువ్వు ఏది చేయడానికి వీలు లేదు ఎందుకంటే కర్తా భావం లేదు తద్వారా సంతోషం నీ స్వభావం అని తెలుస్తది ఈ చిన్న సైద్ధాంతికమైన వ్యత్యాసాలు అర్థం చేసుకొని ఒక మనిషి గనుక జీవితాన్ని గడపడం మొదలుపె పెడితే ఒక గొప్ప క్వాలిటేటివ్ చేంజ్ తప్పకుండా వస్తుంది. సో అష్టావక్రుడు గడిచిన మూడు నాలుగు రోజులుగా కొన్ని విషయాలు చెప్తున్నాడు సూత్రాల ద్వారా మూఢత అట్లాగే అభ్యాసము అట్లాగే అధ్యాస తర్వాత మోక్షం సహజ మోక్షం ఇట్లాంటి వాటి గురించి సరే ఎవడు మూడుడు అంటే బుద్ధి లేని వాడు
(02:05) కాదు ఒక మూర్చ స్థితిలో పని చేసేవాడు చాలామంది ఆధ్యాత్మికతను కూడా అభ్యాసం లాగా చేస్తున్నారు ధ్యానాభ్యాసము చేస్తున్నారు న్నారు చాలామంది గురువులు ఇట్లా చెప్పడం కూడా మనం వినే ఉన్నాం మనం ధ్యానం చేయాలి ఇంకా సాధన చేయాలి ఇంకా నేర్చుకోవాలి నేర్చుకుంటూ ఉండాలి. అది తప్పుడు వ్యాఖ్య సరే వినేవాళ్ళు వేల మంది ఉండటం వల్ల ఆ వ్యాఖ్యకి బలం చేకూరవచ్చు కానీ సత్యము సత్యమే ఎక్కువమంది విని అంగీకరించినంత మాత్రాన సత్యమైపోదు.
(02:37) సో అష్టవక్రుడు ఈరోజు ఇట్లాంటి ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్తున్నాడు. దీన్ని మీరు కూడా మీ హృదయంలో నాటుకోండి నాప్నోతి కర్మణ మోక్షం విమూడోభ్యాసరూపిణ ధన్యో విజ్ఞాన మాత్రేణ ముక్తస్తిష్టత్య విక్రియా అంటే మూడుడు ఎవడైతే ఉన్నాడో అభ్యాసం వల్ల అలవాటుపడి కర్మలు చేసినంత మాత్రాన మోక్షం పొందలేడు. ధన్యుడు భాగ్యశాలి అయిన యోగి క్రియారహితుడై కేవలం విజ్ఞానం వల్ల ముక్తి
(03:23) పదం అధిష్టిస్తాడు. మనక ఆధ్యాత్మికతలో కేవల జ్ఞానం అనే ఒకానొక ఫ్రేజ్ వాడతారు వెరీ రేర్ ఫ్రేజ్ అది కేవల జ్ఞానం మాత్రంగా విషయం అర్థమయింది అంటే సరైన అవగాహన ఏర్పడ్డది మొట్టమొదటిసారి సరిగ్గా ఏది ఎలా చూడాలో అట్లా చూసావు దానికి ఇమాజినేషన్ గాని దానికి అజంప్షన్స్ గాని దానికి భయాలు గాని దానికి సాంప్రదాయం గాని ఏది జోడించలే ఉన్నది ఉన్నట్టుగా దర్శించావు దాని వల్ల కేవలం జ్ఞానం వచ్చింది ఏది ఎంత తెలియాలో అంత తెలిసింది.
(03:53) సో మోక్షానికి మార్గం అది సో అష్టవకుడు ఏం చెప్తున్నాడు నాప్నోతి కర్మణ మోక్షం విమూడోభ్యాస రూపిణ సో రకరకాల పనులు అభ్యాసం చేస్తున్నప్పటికిని ఒక మూడు మోక్షాన్ని పొందలేడు దానికి కారణం ఏమిటి అభ్యాసం ఎడ్డు వస్తుంది. సో ఇప్పుడు నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను మళ్ళీ చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను అష్టావక్ర అయిపోయిన తర్వాత కూడా సందర్భం వస్తే మళ్ళీ చెప్తాను రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఒకటి ఉంది అభ్యాసం చేస్తున్నప్పుడు అభ్యాసం చేసేవాడు మిగులుతున్నాడు అంటే కర్తా భావన మిగులుతుంది.
(04:28) ఈ చిన్న విషయం అర్థంవుతుందా ఏదైనా చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అన్న భావన వల్ల నిజమైన ప్రమాదం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక పరంగా ప్రపంచంలో నేను చేస్తున్నా అని చెప్పుకోవాల్సిందే దాని ద్వారా గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు అవార్డ్స్ రివార్డ్స్ అని వస్తాయి దాని తర్వాత మనిషి నిజంగా దాన్ని అనుభవిస్తాడా ఆనందిస్తాడా ఆహలతం అవుతాడా అంతే రెలవెంట్ ప్రపంచం అనేది ఐడెంటిటీ ఓరియంటెడ్ ఎంతమంది ఎక్కువ గుర్తిస్తే అంత ఫేమస్ పర్సన్ నీవు ఆధ్యాత్మికత అంటే అసలు గుర్తించేవాడు లేడని తెలుసుకోవడం సంపూర్ణ విరోధ భాష్యం ప్రపంచానికి అసలు ప్రపంచం లేకపోతే ఉన్నదంతా ఆధ్యాత్మికతనే
(05:06) అసలు ఈ భూమిమీద బార్ అండ్ రెస్టారెంట్స్ లేవనుకో అసలు డ్రింకే లేదనుకో లేకపోతే అసలు వైన్ లేదనుకో ఇట్లాంటివి అసలు తయారీ చేసే సంస్థలే లేవనుకో అప్పుడు ఆప్కారి డిపార్ట్మెంట్ యొక్క అవసరం ఏముంది తాగుబోతుల్ని తాగుడు మానిపించే సంస్థల అవసరం ఏముంది ఆ సైకాలజిస్ట్ అవసరం ఏముంది అది ఉన్నందుకు ఇది ఉంది కదా సో [గురకలు] జన్మతః మనిషి ఆధ్యాత్మికత కలిగి ఉన్నవాడే ఆధ్యాత్మికత అంటే నీ సహజ స్వభావాలని స్వచ్ఛందంగా అనుభవిస్తున్నవాడు తన వ్యవహారంలోనూ తన మాటలోనూ తన ప్రవర్తనలోనూ తన నడకలోనూ ఆ సహజత్వమే ఉట్టి పడుతుంది. వేరేవాడి ఛాయ తన మనసులో ఏమాత్రం
(05:46) లేనివాడు. కానీ మనం స్కూల్స్ కి వెళ్లి నిరంతరం అభ్యాసం చేసి కరాటే అభ్యాసం చేసి వైలిన్ అభ్యాసం చేసి సంగీతం అభ్యాసం చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అభ్యాసం చేసి అదే అభ్యాసం వల్ల మనం ధ్యానాన్ని అభ్యాసం చేస్తున్నాం ఆధ్యాత్మికతని అభ్యాసం చేస్తున్నాం. ఎన్ని రకాల వింత వింత అభ్యాసాలు ఈ ప్రపంచానికి మానవజాతి ఇస్తుందో మీరు ఆశ్చర్యపోతారు.
(06:12) నేను చూసి చెప్తున్నాను. ఒకసారి ఒక పార్క్ కి వెళితే అక్కడ ఒక ధ్యాన ప్రక్రియ ఒకతను బోధిస్తున్నాడు. ఒక మిత్రుడు బలవంతం చేస్తే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్లెజెంట్ ఫేస్ వేసుకొని అతను చెప్తున్నాడు మనం చెట్లను కౌగలించుకుందాం. మన ప్రేమను వాటికి ఇద్దాం. ఆ చెట్టలో ఉన్న అంతులైన శక్తిని మనం తీసుకుందాం అని చెప్పి అందరు చెట్లను కౌగలించుకుంటున్నారు.
(06:43) సో ఇప్పుడు ఒక సిద్ధాంతానికి ప్రాతిపదిక జరిగింది. అది నిజమా కాదా అక్కడ ఉన్న వాళ్ళకి అనవసరం చేయడం వల్ల ఏదో తృప్తి వస్తుంది మనిషికి చేయడం వల్ల ఏదో తృప్తి ఎప్పుడు వస్తుంది. అన్నదానం చేస్తే తృప్తి వస్తుంది. ఎవరికైనా సహాయం చేస్తే తృప్తి వస్తుంది ఎవరికైనా అడ్రెస్ ఇస్తే తృప్తి వస్తుంది ఎవరికైనా అర్పిస్తే తృప్తి వస్తుంది సంథింగ్ బై గివింగ్ యు ఫీల్ యస్ ఇఫ్ సంథింగ్ ఇస్ ఫీలింగ్ ఇదంతా ప్రపంచపు చేష్ట చేయొద్దు అని నేనేమండి చెప్పడానికి చూడు ఒకసారి అభ్యాసం చేస్తూ చేస్తూ ఒకసారి ఆగి ఒక వన్ మంత్ గడవని అభ్యాసం యొక్క రిజల్ట్ ని అనుభవించవా
(07:26) ఓన్లీ అభ్యాసిగానే ఉంటావా లైఫ్ అంతా సో అభ్యాసం సాధన లిమిటెడ్ పీరియడ్ లో ఎండ్ అవ్వకపోతే నీలో మూడత యొక్క ఆవిర్భావం జరుగుతది. సో నువ్వు సాధించాలనుకున్న దానికంటే అభ్యాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడుతది. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూసే చెప్తున్నాను. ఒకప్పుడు అందులో నేను కూడా ఉన్నాను. సో నేను అభ్యాసం చేస్తున్నాను కాబట్టి ఏదైనా సాధించగలను అని అనుకున్నావా నువ్వు పప్పులో కాలేస్తావ్.
(07:58) అష్టవకుడు ఏం చెప్తున్నాడు ధన్యో విజ్ఞాన మాత్రేన ముక్తస్తి షటత్య విక్రిత విక్రియః అంటే ఎవడైతే జస్ట్ బోధ మాత్రం చేత తెలుసుకున్నాడో తనక ఏమి అంటుకోవడం లేదని అతను తక్షణం మోక్షాన్ని ముక్తిని అనుభవిస్తాడు మోక్ష ముక్తి అనేవి భవిష్యత్తుకి సంబంధించిన అంశాలు కావు అవి ఒక అపర వర్తమానానికి సంబంధించినవి సో మనిషి చేసే అన్ని క్రియలు బాహ్యానికి సంబంధించినవి ఆధ్యాత్మికత అక్రియ అంటే చేస్తున్నట్టే ఉంది కానీ కర్త లేడు అకర్మ కాదు అక్రియ కర్మ చేయవలసిందే కదిలిస్తే కర్మ కళ్ళు మూస్తే కర్మ ఈ చెంబుట పెడితే కర్మ క్రియ కర్త కర్మ క్రియ అంటాం కదా క్రియ
(08:45) అనేది వర్బ్ అంటే ఏదైతే యాక్షన్ చేస్తున్నావో దాన్ని బట్టి నీకుఒక ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు క్రియ చేస్తున్న భావన కలుగుతది. కర్మ అన్నది నువ్వు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగేది. కర్త అన్నది క్రియ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనుకోవడం వల్ల కర్త భావన జనరేట్ అవుతది. సో అక్రియ అంటే నేను అన్న భావన లేకుండా చేసే కర్మ ఒక పరిశుద్ధ శాంత కర్మ అది ఒకసారి అక్రియ అనేది ఆవిష్కృతం జరిగిన తర్వాత తిరిగి జీవితంలో వినికిపోవడం అంటూ ఉండదు.
(09:22) ఒకసారి కర్తా భావన పోయినా స్థితి నువ్వు అనుభవించిన తర్వాత సందర్భం కోసం అవసరం కోసం కర్తా భావన నీ జీవితంలోకి ఆహ్వానిస్తావ అంతే ఊరికే మాట వరసకు చెప్పడం వరకే కనిజంగా కర్త భావన ఉన్న స్థితి లేదని నీకు తెలుస్తూనే ఉంటుంది. రమణ మహర్షి 11 ఏళ్ల వయసులో అరుణాచలం వచ్చిన తర్వాత అరుణాచలం దగ్గర కోనేర్లో మునిగి బట్టలు తీసేసి శిరో మండలం చేయించుకున్న తర్వాత తన దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు ఉన్నట్టు చెప్పాడు.
(09:52) అన్ని వదిలేసిన తర్వాత అక్కడే పైన కూర్చున్న ఒక వ్యక్తి అన్నాడు అంటే అన్ని వదిలేసేవాడు డబ్బు మాత్రం ఎందుకు ఈ ప్రపంచంలో ఎవ్వడ డబ్బుని పట్టుకుంటాడు కదా డబ్బును వదిలేసే మనిషి ఎవడు కొందరు డబ్బును వదిలేశారు కానీ డబ్బును వదిలేసాను అన్న భావన వదిలేయలేదే ఇప్పుడు రమణ మహర్షి అలా చేసాడని మనం చేయాలని దాని ఉద్దేశం కాదు రమణ మహర్షి డబ్బుకు సంబంధించిన ఏ విషయాన్ని తన జీవితంలోకి ఆహ్వానించలేడు ఒక ఆరు కావాలని అంటే డబ్బుకి సంబంధించిన అన్ని అన్ని కోరికలు డబ్బుతోనే పడిపోయాయి.
(10:25) ఇప్పుడు నేను ఈ విషయాన్ని నేను నేను పుట్టిన ఈ సమాజంలో ఇంకొక విధంగా అర్థం చేసుకోవాల్సి డబ్బు అవసరం నాకు అంతవరకే వ్యామోహం లేదు. తద్వారా అది ఉంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఇప్పుడు రమణ మహర్షి ఒకవేళ పండు తిన్నాడు అనుకోండి అది కూడా డబ్బు వల్లే వచ్చింది అందు రమణ మహర్షి డబ్బు లేదు కానీ డబ్బు ఉంది కదా ఏదేమైనా ఒక అవగాహన కలిగిన తర్వాత జీవితకాలం నువ్వు సహజంగా దాన్ని పాటిస్తున్నావ్ నాట్ బై ఫోర్స్ ఆర్ కోహర్షన్ సో రమణ మహర్షి ఆ రోజు ఆ తీర్థంలో డబ్బు వదిలేసిన తర్వాత మళ్ళీ జీవితంలో డబ్బు ముట్టుకోలేదు.
(11:02) అంటే డబ్బుకు ముట్టుకోలేదంటే డబ్బుకు సంబంధించిన వేటిని అతను ఆలోచించడం మానేసాడు. అది ఇప్పటికీ ప్రతి మనిషి చేయవచ్చు నేను పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పెయింటింగ్ గాలిలో వేయలేను కాబట్టి పెయింటింగ్ కోసం కొంచం డబ్బు కావాలి అందుకని డబ్బు ఎన్ని చేస్తున్నాడు అంతవరకి కానీ దాని పట్ల వ్యామోహం లేదు డబ్బుని తిండి కింద దాచుకొని పడుకోవట్లే అది అవసరం ఉందని గుర్తిస్తున్నాను అంతవరకి సో అక్రియా భావనలోకి రావాలి అంటే నేను చేస్తున్న అన్న ఒక ఆలోచన అంతమై శుద్ధ కర్మ జరిగే స్థితిలోకి వచ్చినప్పుడు అష్టవకుడు చెప్పేది అర్థమవుతుంది సో నువ్వు ఎంతన్నా అభ్యాసం చేయి ఏదైతే
(11:44) నువ్వు ఉన్నావు అయి ఉన్నావు అదే అవుతావు తప్పు ప్రత్యేకంగా ఏమి కావు ప్రపంచంలో ప్రత్యేకంగా అవుతావు నువ్వు సాదా సీదా మనిషివి ఐఏఎస్ అయ్యావు సాద సీదా మనిషివి స్వామీజీ అయ్యావు సాద సీదా మనిషివి పీఠాధిపతి అయ్యావు సాదా సీదా మనిషివి డాక్టర్ అయ్యావు ఇంజనీర్ అయ్యావు భర్త అయ్యావు భార్య అయ్యావు ప్రపంచం నువ్వు ఏమి కాని వాడిని ఏదో అవ్వమని చెప్పి అటువైపు నిన్ను తరుముతుంది.
(12:09) ప్రకృతి ఏదేదైతే నేను అనుకుంటున్నావో అదంతా వదిలేసి ఒక నోబడీగా మారు ఒక అనాముకుడిగా మారు అని చెప్తుంది. ఒక పరిపూర్ణ విరోధాభాష్యం ఇది. సో అజ్ఞాని ప్రయత్నం చేస్తున్నాడు ఆనందం కోసం తను చేసే ప్రతి పనులోన ఆనందం కోసమే అని చెప్తున్నాడు సుఖం కోసమే అని చెప్తున్నాడు ప్రశాంతత కోసమే అని చెప్తున్నాడు కానీ దాని రిజల్ట్లో అతను విషాదాన్ని అనుభవిస్తున్నాడు.
(12:34) అందుకే ఇప్పుడున్న సాటి మానవుడిని ఈ సమాజంలో మానవుడికి ఒక మంచి పేరు పెట్టాను విషాద ప్రాణి సో అతిగా అభ్యాసం చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గుర్తించడమే ఈ సూత్రం యొక్క అంతరార్థం ఒక చిన్న జెన్ స్టోరీ ఉంది ఒక జెన్ మాస్టర్ కుంగ్ఫు బోధిస్తుంటాడు ఒక శిష్యుడు వస్తాడు వెరీ ఓవర్ అంబిషియస్ పర్సన్ జన్ మాస్టర్ని అడుగుతాడు నేను సాధన చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్ అవ్వాలంటే రోజు ఎంతసేపు సాధన చేయాలి అని అడుగుతాడు.
(13:06) అప్పుడు అతను చెప్తాడు రోజు మూడు గంటలు సాధన చేస్తారు మరి ఆ తర్వాత ఆ తర్వాత ఆశ్రమ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు భిక్షక వెళ్తారు ఇట్లాంటివన్నీ చేస్తారు. మసాజ్ చేసుకుంటారు వాటివారు చదువుకుంటారు. అప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఓవర్ యంబిషియస్ పర్సన్ ఏం చెప్పాడంటే వీళ్ళు త్రీ అవర్స్ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కుంగ్ఫులో మాస్టరీ సాధించడానికి సిక్స్ ఇయర్స్ పడుతుంది.
(13:31) నేను త్రీ అవర్స్ కాకుండా ఎవ్రీ డే 10 అవర్స్ సాధన చేస్తాను మరి నాకు ఎంత సమయం పడుతుంది అంటే అప్పుడు గురువు తడుముకోకుండా చెప్పిన జవాబు స్టాక్ కూడా చెప్తున్నాడు అప్పుడు నీకు 25 సంవత్సరాలు పడుతుంది. ఇతను ఆశ్చర్యపోయాడు అందరికంటే ఎక్కువ సాధన చేస్తున్నాను ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాను మరి నాకు ఎందుకు రాదు అప్పుడు ఆ గురువు ఏం చెప్పాడంటే తక్కువ సాధన ఎక్కువ సాధన కాదు అవసరమైనంత సాధన మూడు గంటల సాధన చేసిన తర్వాత ఆ మూడు గంటల యొక్క సాధన ఫలితాన్ని నీ మనసు కూడా అర్థం చేసుకోవాలి బికాజ్ రియల్ స్కిల్ ఎస్టాబ్లిష్ ఇన్ ద మైండ్ నాట్ ఇన్ ద బాడీ మనసుకు పరిపూర్ణంగా అర్థమయిన తర్వాత ఆ
(14:04) సజెషన్స్ తోనే బాడీ పని చేయడం మొదలు పెడతది. వంట ఎవరైతే నేర్చుకుంటారో ఈ విషయం అందరికీ తెలుసు మానసికంగా అర్థమయిన తర్వాత దానికి అనుగుణంగా నీ శరీరం కదులుతుంది. మెల్లమెల్లగా శరీరం వేరేగా కదులుతుంది మనసు ఒకలా చెప్తుంది. రాను రాను మనసుకి శరీరానికి మధ్యన ఒక సయోధ్య కుదురుతుంది అక్కడ సహజంగా వంట చేయడం స్టార్ట్ అవుతుంది.
(14:24) సో దానికి పట్టే మినిమం సమయం తప్పకుండా పడుతుంది. సో అంతవరకే అభ్యాసం. సో అతిగా అభ్యాసం చేసినంత మాత్రాన నీకు రిజల్ట్ లేకపోతే నువ్వు పొందాలనుకున్న లక్ష్యము తొందరగా రాదు అని తప్పకుండా అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి నేను పురుషుని అవ్వాలని నిరంతరం అభ్యాసం చేస్తున్నా అంటే మీరు ఏమంటారు ఒక వ్యక్తి నేను స్త్రీని అవ్వాలని నిరంతరం అభ్యాసం చేస్తున్నా అంటే ఏమంటారు నువ్వు ఏదైతే అయి ఉన్నావో దానికి అభ్యాసం ఎందుకు అని అంటారా లేదా సో పురుషుని కాని వాడు పురుషుడు అవ్వడానికి అభ్యాసం చేయాలి ఎవడైతే మోక్షం తన స్వభావం కాదని తెలుసుకుంటాడు వాడే మోక్షం కోసం
(14:57) ప్రయత్నం చేస్తాడు సో యోగాభ్యాసాలు కర్మ కలాపాలు మోక్షం సంపాదించి పెట్టలేవు సో కర్మలు సంతానం ధనం మానవుడికి మోక్షం అందించలేవు. ఇది ప్రత్యేకంగా పుస్తకాలు చదివి తెలుసుకోవాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉన్న సమాజంలో మన బంధువులు మన స్నేహితులు మన శ్రేయోభిలాషులు వాళ్ళ జీవితాన్ని కాస్త దగ్గర నుంచి చూస్తే తప్పకుండా అర్థమవుతుంది.
(15:23) సో ఆ తర్వాత అష్టవకుడు చెప్తున్నాడు మూడోనాప్నోతితబ్రహ్మ యతో భవితుమీచతి అవిచిన్నపిదీరోహి పరబ్రహ్మ స్వరూపభాక్ అజ్ఞాని తాను బ్రహ్మ కావాలని తీవ్రంగా కోరుకుంటాడు కోరుకోవడం కారణంగా తను బ్రహ్మ కాలేడు కానీ జ్ఞాని వాంచరహితుడు ఏ కోరికలు లేవు ఏమి కోరుకొని వాడు కనుక జ్ఞాని పరబ్రహ్మ స్వరూపం తక్షణమే పొందుతాడు. ఈ సూత్రంలో ఒక అద్భుతమైన పదం ఉంది ఇది మనం రెగ్యులర్ గా వినే పదం కాదు మూడో నాప్నోతి త బ్రహ్మ యతో
(16:11) భవితి మిచ్చ అనిచన్నపి ధీరోహి పరబ్రహ్మ స్వరూప భాక్ స్వరూప భాక్ అనే పదం చాలా అర్థవంతమైన పదం ఇది నేను ఇద్దరు ముగ్గురిని క్రాస్ చెక్ చేసుకొని అక్కడి నుంచి చెప్తున్నాను స్వరూప భాక్ అంటే నీ సహజ వ్యవహారం అంటే ఎలాగైతే సహజంగా నువ్వు వ్యవహరిస్తావో ఆ స్థితి సో స్వరూప భాగ అన్నది ఒక అఖండ స్థితిని ప్రతిపాదించే ఒక ఒక అద్భుతమైన ఫ్రేస్ అంటే నీ స్వభావంలో ఎప్పటికీ మార్పు లేదు ఎగ్జాంపుల్ నీలో పురుష తత్వం అఖండంగా ఉంది నీలో స్త్రీ తత్వం అఖండంగా ఉంది నీలో శ్వాసక్రియ అఖండంగా ఉంది నీలో జీర్ణక్రియ అఖండంగా ఉంది అది దేశ కాలమాన కులమత పరిస్థితులకి
(17:00) లోబడి లేదు దానంతక అదే స్వరూప భాగ అయి నిలబడ్డు అది సో దాని సహజ వ్యవహారంలో తానుంది నీ జీర్ణ క్రియ అవునా కాదా అట్లా జ్ఞాని తన సహజ వ్యవహారంలో ఉంటాడు అతను పారిస్ లో ఉన్న అతను అమెరికాలో ఉన్నా ఎగ్జాంపుల్ మన శ్రీల ప్రభుపాద గురించి ఒక చిన్న సంఘటన చదివా నేను మొట్టమొదటిసారి ఆయన దాదాపు 60 65 ఏళ్ల వయసులో అమెరికాకి వెళ్ళాడు ఇక్కడంతా రెస్ట్ తీసుకున్న వయసు అది కానీ అతను అమెరికాకి వెళ్లి తన యొక్క అనుభవాన్ని లేకపోతే కృష్ణుని యొక్క భావజాలాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని సంకల్పించి వెళ్ళాడు ఇక్కడ సిద్ధాంతం ఇంపార్టెంట్ కాదు. సో అమెరికా వెళ్ళిన
(17:42) తర్వాత అతను ఒక ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన తర్వాత పొద్దున్న లేచి తన పూజ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ఆ అతిథులు ఆ అతనికి ఆదిత్యం ఇచ్చిన వాళ్ళు చూశారు అట్లా రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది 10 రోజులు అయింది 20 రోజులు అయింది ఆశ్చర్యపోయారు నువ్వు అమెరికా వచ్చావు కానీ ఇండియాలో ఏం చేస్తున్నావ్ అమెరికాలో అదే చేస్తున్నావ్ సో అప్పుడు అతను ఏం చెప్పాడంట ఎక్కడున్నా లేదు అనంత విశ్వంలో ఉన్నా అది కృష్ణ చైతన్యంలో ఉన్న అందుకని నా ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు స్వరూప భాక్ సో ఎవరి ప్రవర్తన ఊరిని బట్టి మనిషిని బట్టి మారుతుందో అతను సహజ వ్యవహారాన్ని
(18:24) కోల్పోయాడు. అతను నిరంతరం కృత్రిమ వ్యవహారాన్ని తన మీద ఆపాదించుకుంటున్నాడు. సో అష్టవక్కుడు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాడు అన్నమాట. నువ్వు మూఢత వద్దు నేను ఏదైనా అనుకుంటే సాధిస్తాను అన్న భావన వల్ల నువ్వు సాధించే అవకాశాన్ని కోల్పోతావ్ ఎందుకంటే అప్పటికే సాధ్యమై ఉన్న దాన్ని నువ్వు తిరిగి ప్రయత్నం చేయడం ఏమిటి ఒకసారి నా దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు జీవితాన్ని అర్థం చేసుకోవడం కష్టమైన పనా సులువైన పనా అతి సులువైన పనా దాన్ని కాస్త వివరిస్తారా అని అడిగినప్పుడు నేను చెప్పాను నీ యొక్క బొటన వేలు చూపించు అంటే చూపించాడు నీ చూపుడు వేలు చూపించాడు ఈ
(19:04) రెండు వేళ్ళని కలుపు టక్కన కలిపాడు అంత సులువ అని చెప్పారు. ఈ [గురకలు] వేలుకి ఆ వేలికి మధ్యన నువ్వు విరిగించే సిద్ధాంతం వల్ల ఆలస్యం కావచ్చు ఈ వేలికి ఆ వేలుకి మధ్యన ఎవరు దూరితే ఆలస్యం కావచ్చు ఇప్పుడు ఈ వేలుకి ఆ వేలుకి మధ్యన ఒక చిన్న రాయి పట్టుకో నువ్వు ఎంత వత్తిన ఈ వేలు ఆ వేలు కలవదు సో నువ్వు చేయవలసిందల్లో వేలుని మార్చడం కాదు రాయిని మార్చడం సో అష్టమగుడు అదే చెప్తున్నాడు అజ్ఞాని నిరంతరము సాధన చేసి నేను ఫలితం పొందుతాను అనే భ్రమలోనే ఉంటాడు దానికి కారణం ఏమిటి ప్రపంచం అటువంటి అధ్యాస కలిగింది.
(19:41) సో ఒక అఖండ తత్వాన్ని ఒక అఖండాన్ని నువ్వు అనుభవించాలంటే నీ మనసులో ఒక నిశ్చలత రావాలి. సో చాలామంది ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక పరమైన విషయాలు మాట్లాడవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళకి జీవితం అర్థమైంది, ఆధ్యాత్మికత అర్థమైంది వాళ్ళలో స్వరూప, భాగ్య యొక్క ఉదయం జరిగింది అని చెప్పడానికి లేదు.
(20:04) వాళ్ళు జస్ట్ భాషపరంగా రకరకాల విషయాలు చెప్తూ ఉండవచ్చు రజ్జు సర్పవ అని ఒక వ్యక్తి నిరంతరం బోధిస్తూ ఉన్నాడంట ఒక ఊర్లో రజ్జు సర్పవ అంటే నువ్వు తాడుని చూసి పాము అనుకుంటున్నావ్ కానీ ఒకసారి తాడు మీద పడ్డప్పుడు ఆగి చూడు అది పాము కాదని తెలియడంతో నీలో భయం వెళ్ళిపోతుంది అంతేగని ఎగిరి గంతు లేకని చెప్తూ చెప్తూ చెప్తూ ఉండగా ఆ ఊర్లో ఉన్న పిల్లలకి ఒక చిన్న ఆలోచన వచ్చింది చెప్పేది నిజమా కాదా ఇతను ఆచరిస్తాడా లేదా పగటి పూట అతను పోతుంటే పాము పాము అని అరిచి ఆ తాడిని తీసి అతను మెళలో వేస్తే అతను వెళ్లి గోడ పడు రాలగొట్టుకున్నాడంట అప్పుడు పిల్లలందరూ కేరింతలు కొడుతుంటే
(20:43) ఊర్లో వాళ్ళంతా వచ్చి ఈ పిల్లలని తిట్టినప్పుడు ఆ పిల్లల్లో ఒక పిల్లవాడు చెప్పాడంట ఇతను ప్రతిరోజు చెప్తున్నాడు రజు సర్పవత్ అసలు నీ మీద ఉన్నది తాడా పాము చూసుకుని ఆ తర్వాత భయపడని చెప్పిన వ్యక్తి మీద తాడేస్తే నిజంగా నిశ్చలంగా చూస్తాడు అనుకున్నాం కానీ ఆశ్చర్యం పళ్ళరగొట్టుకున్నాడు సో సో ఇతను చెప్తున్నది అతను ఆచరించడం లేదు.
(21:05) తీరా విషయం తన దాకా వచ్చినప్పుడు అంతా మారిపోయింది. సో చాలా మంది పరిస్థితి ఇంతే వాళ్ళు చెప్తారు కానీ నిజంగా ఆచరించరు. సో పాండిత్యానికి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు సమాచారానికి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం ఎవడు మూడుడు అంటే ఎక్కువ విషయాలు బట్టి పడితే ఎక్కువ విషయాలు ఆ బైహార్ట్ చేస్తే అందరి ముందు గొప్పగా ఆధ్యాత్మికత గురించి మాట్లాడితే జ్ఞానోదయం అయిపోయింది అనుకునేవాడు మూర్ఖుడు అతని మనసులో ఇప్పటికీ వేరేవాడు ఉన్నాడు.
(21:40) సో ఆధ్యాత్మిక అనుభవం అన్నది పదాల ద్వారా వ్యక్తపరిచే విషయము కాదు సరే ఒక వ్యక్తికి భాషలో ప్రావీణ్యత ఉండి అతను కాస్త అందంగా చెప్పవచ్చు కానీ అంతశ్రోతలు అతనికి అనుభవమై ఉండాలి. అది ఎట్లా వస్తుంది పరివర్తనాంతర ప్రవర్తన ద్వారా వస్తుంది అంటే సమూలంగా నీలో ఒక పరివర్తన కలిగింది అంతః పరివర్తన కలిగింది ఆ తర్వాత నీ ప్రవర్తనలో ఒక మార్పు వచ్చింది స్వరూప భాక్ లాంటి ఒక అనుభవం నీకు సహజ వర్తమానం అయింది.
(22:15) నువ్వు నిరంతరం ఒక నిరంతర నిర్వచనీయమైన శాంతిని ప్రశాంతతని అనుభవిస్తున్నావ్ అదే నీకు రూఢి ఎట్లా నీకు జీవితం అర్థమైంది అంటే నీ జీవితంలో వచ్చిపోయే అంశాలకు అతీతంగా నీలో ఒక అనిర్వచనీయమైన శాంతిని నువ్వు నిరంతరం అనుభవిస్తూ ఉంటావు. అనుభవించేవాడు ఉండడు క్లైమ్ చేసేవాడు అయినప్పటికిని సో జ్ఞాని ఎవరు మోక్షాన్ని కూడా ఆకాంక్షించనివాడు.
(22:43) ఆపేక్ష లేని కారణంగా అతను ఉన్నదాన్ని స్పష్టంగా చూడగలుగుతాడు దర్శించగలుగుతాడు అనుభవించగలుగుతాడు. మన భాషలో ఈ పదాలు ఉన్నాయి అపేక్ష అండ్ ఉపేక్ష ఉపేక్షించిన వాడికి జీవితం త్వరగా అర్థమవుతుంది. ఆ ప్రాపంచిక విషయాల్లో నేర్చుకోవాలంటే నీకు ఆపేక్ష అవసరం, కసి అవసరం ఫ్యాషన్ అవసరం, రకరకాల విషయాలు అవసరం మనసుని నువ్వు ఉత్తేజితం చేయాలి.
(23:10) మళ్ళీ ఉద్విజ్ఞం చెందిన మనసుని నువ్వు స్టిములేట్ చేయడానికి ఇంకేదో చేయాలి చాలామంది ధ్యానం చేయడానికి కారణం ఓన్లీ స్టిములేట్ చేయడానికే అంటే రకరకాల యక్టివిటీస్ లో మనసు ఉద్దిగ్నం అయింది దాన్ని కాస్త ప్రశాంత పరచడానికి ఏదో ఒక దాని మీద ధ్యాస పెడతారు ధ్యానం యొక్క మూలస్థితి అది కాదు. సో అష్టావక్కుడు చెప్తున్న ఈ సూత్రము లేదా ఇంతకుముందు చెప్పిన రకరకాల సూత్రాల సారము ఇంతవరకు ఎవరు చెప్పలేదు అందరూ మోక్షాన్ని కోరుకో అని చెప్పిన వాళ్లే మనం చూసిన రకరకాల సినిమాల్లో రకరకాల చదివిన పుస్తకాల్లో మోక్షం కోసం బయలుదేరిన వాళ్ళు అట్లా మోక్షాన్ని పొందిన వాళ్ళు ప్రయత్నం
(23:50) వల్ల మోక్షాన్ని పొందిన వాళ్ళు అష్టవకుడు చెప్తాడు మోక్షం పట్ల కూడా ఇచ్చలేని స్థితిలో ఉండిపో అంటాడు అల్టిమేట్ ఇది తద్వారా నువ్వు నువ్వు తిరిగి నీ యొక్క సహజ సాధారణ రూపంలో సంచరిస్తావ్ సో ఈ ఒక్క విషయం చెప్పి నేను ఈరోజు చర్చ ముగిస్తాను అదేమిటి ఒకవేళ ప్రయత్నం వల్ల మోక్షం వచ్చిందా ఆ ప్రయత్నం వల్ల వచ్చిన మోక్షాన్ని నువ్వు ప్రదర్శించక మానవు తప్పకుండా ప్రదర్శిస్తావ్ అప్రయత్నంగా మోక్షం నీ స్వభావం అని తెలిసినప్పుడు నీలో ప్రదర్శన పోతుంది.
(24:27) నువ్వు సాదా సీదా మనిషిలాగా సంచరిస్తావ్ ఎవడైతే ప్రయత్నం వల్ల మోక్షాన్ని అనుభవిస్తున్నాడో అది నియంత్రణ వల్ల మనిషి అనుభవించే బ్రహ్మచర్య లాంటిది. చాలా నియమాలతో కూడి ఉంటుంది అది. కానీ ఇప్పుడు అష్టవక్కులు చెప్తున్న సహజ మోక్షం ఏదైతే ఉందో నీ సహజ స్వభావమే జన్మతః నువ్వు మోక్షంతోనే వచ్చావు నువ్వే అనవసరంగా రకరకాల విషయాలని నీ మీద ఆపాదించుకున్నావ్.
(24:53) పనికిరాని రంగులు నీ మొహం మీద రాసుకున్నాం తద్వారా నీ రియల్ ఫేస్ కనబడకుండా పోయింది. స్వాష్టవకుడు చెప్పేదాన్ని మీ హృదయంలో నాటుకోండి మీ సహజత్వాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయండి నేను చేస్తాను మీరు చేయండి అది నిరంతరం ఎలాగైతే చెట్టుకు నిరంతరం నీళ్లు పోయాలో మీ సహజత్వాన్ని నిరంతరం మీరు సజీవంగా ఉంచుకోవాలి. అంటే ప్రపంచం అంటుకోకుండా మీ యొక్క మనసును ఉంచుకోగలిగితే ఒక సహజమైనటువంటి అందం ఒక సహజమైన ఆకర్షణ ఒక సహజమైన వర్తమానపు అనుభూతి నిరంతరం ఎవరైనా ఆస్వాదించొచ్చు సో ధ్యానము చేయడం వేరు ధ్యాన స్థితిని అనుభవించడం వేరు ధ్యానం చేస్తూ కూడా కర్త
(25:36) భావన లేకుండా ధ్యాన స్థితి కొనసాగడం వేరు స్వరూప భాగ అంటే అది నిరంతర వర్తమానపు ధ్యానానుభూతి పరివర్తనానంత ప్రవర్తన తద్వారా మనిషి అనుభవించే ఒక సహజ శాంతి అట్లాంటి శాంతి మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కోరిక నేరవరినా నెరవేరకపోయినా నేను ఏమి పట్టించుకోనని మీకు చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్న మీలోను ఓపిక చేరుకొంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరసవయస

No comments:

Post a Comment