శ్రీకృష్ణుడి రాసలీల జరుగుతుందని నమ్మే నిధివన్ రహస్యం😱 |nidhivan story in telugu|
Author Name:Hema creations
Youtube Channel Url:https://www.youtube.com/@hema-5d
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3CMoxrnESgg
Transcript:
(00:00) రాత్రిపూట శ్రీకృష్ణుడు వచ్చే బృందావనంలో నిధివనం బృందం అంటే తులసి వనం అంటే అడవి ఈ తులసి వనాన్ని నిధివనం అని పిలుస్తారు. ఈ రోజుకి శ్రీకృష్ణుడు రాధా ఇక్కడికి రాసలీలల కోసం వస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ రాసలీలలు రహస్యంగా చూసిన భక్తులు మరణించి ఉంటారని నమ్మకం కూడా ఉంది. అందుకే నిధివనంలో రాత్రిఏడు గంటలు హారతి కార్యక్రమం తర్వాత పూర్తయ్యాక ఎవ్వరూ అక్కడ ఉండరు.
(00:29) మనుషులే కాదు జంతువులు కూడా అక్కడ ఉండవు. 5750 సంవత్సరాల నిధివనం తులసి మొక్కలతో అడవిలా పెరిగిన ప్రాంతం 5750 సంవత్సరాల క్రితం 10 కిలోమీటర్ల మేరకు ఈ వనం విస్తరించి ఉండేది. ఈ ప్రాంతాన్నే బృందావనం అని అంటారు. శ్రీకృష్ణుడు మధురలో పుట్టాడు. పెరిగింది బృందావనంలో అతడు గోపికలతో ఆడుకున్నాడు. ఈ బృందావనంలోనే శ్రీకృష్ణుడు 16801 రూపాయలతో తులసివనంలో రాసలీలలు చేశాడు.
(00:58) గోపికలు కోరిన కోరికలు తీర్చాడు అయితే సంత్ చైతన్య మహాప్రభు కలియుగంలో నిధివనం అంతరించిపోతూ ఉంది. ఆ సమయంలో చైతన్య మహాప్రభువు నవదీపం నుంచి వచ్చి బృందావనంలో ధ్యానం చేసుకున్నాడు. దాంతో ఆయన తులసి వనాన్ని మరింత గొప్పగా మార్చాడు. అందుకే ఈ కలియుగంలో కూడా తులసి వనం సజీవంగా ఉంది. అంతేకాదు సంత హరిదాస్ బృందావనానికి వచ్చి 12 సంవత్సరాలు కృష్ణుడు కోసం తపస్సు చేశాడు.
(01:28) శ్రీకృష్ణున్ని ప్రసన్నం చేసుకున్నాడు. నిధి వనంలో రెండు విగ్రహాలు కనిపిస్తాయి. ఇందులో ఒక విగ్రహాన్ని బృందావనంలో విహారి అని పిలుస్తారు రెండో విగ్రహాన్ని బ్యాంకే విహారి అని పిలుస్తారు మన ఇంట్లో పెంచుకునే తులసి మొక్కలని శ్యామ తులసి రామ తులసి అంటారు నిధి వనంలో పెరిగే తులసి మొక్కల్ని వన తులసి అంటారు వన తులసిలో కనిపించే మొక్కలు తులసి మొక్కలు కావని శ్రీకృష్ణుడితో రాసలీలలు చేసిన గోపికలకు ప్రతిరూపాలని భక్తులు నమ్ముతూ ఉంటారు.
(01:58) ప్రతి రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చినప్పుడు గోపికలు తనతో ఉంటారని ఉదయం లేవగానే తులసి మొక్కలుగా మారిపోతారని ప్రగాఢ నమ్మకం ఎండిన మొక్కలు నిధి వనంలో తులసి మొక్కల పై భాగం చూసినప్పుడు చాలా పచ్చదనంతో కనిపిస్తాయి. వాటి కాండం వేర్లు భాగం చూస్తే మాత్రం ఎండిపోయి కనిపిస్తాయి. ఇది నిజంగానే చాలా విచిత్రమైన దృశ్యం. ఆ మొక్కలే రోజు శ్రీకృష్ణుడికి ప్రణమెల్లుతాయని భావిస్తారు.
(02:27) ఇతిహాసాలతో కూడిన దేశం మనది అందుకే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది బృందావనం ఇందులోని నిధివన ఆలయం ఎంతో ప్రత్యేకత ఉంది. కృష్ణుడు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది గోపికలే. బృందావనంలో కృష్ణుడు నిత్యం వందలాది గోపికలతో రాసలీలల్లో మునుగుతేలుతాడట. ఆ ప్రాంతం ఇప్పటికీ ఉనికిలో ఉంది. అదే నిధివన్ ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భావించే ఈ ప్రదేశం అంతే రహస్యమైన సంగతులతో కూడి ఉంది.
(02:58) అక్కడ తిరిగే స్థానికులు సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు. భయభ్రాంతులకు లోనవుతారు అలాంటి ఎన్నో రహస్యాలు నిదువన్ సంగతులు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశం భక్తికి నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక. భగవంతుడిని వివిధ రూపాల్లో పూజించే మన దేశంలో ఎన్నో ఆలయాలు పవిత్ర స్థలాలుగా పూజనీయంగా వెలుగొందుతున్నాయి. వాటిలో నిదువనం కూడా ఉంది. భగవంతుని మనం స్వయంగా చూడగలిగే ప్రదేశం కానీ చూసిన వాళ్ళు మాత్రం అక్కడ తాము ఏం చూశారో అన్నది మాత్రం చెప్పలేరు ఎందుకంటే భగవంతుని చూసిన కళ్ళు మతి ఇక వారి వసలో ఉండవు మతిస్మితం కోల్పోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఇది నిధివనంలో తిరిగే ప్రతి
(03:42) ఒక్కరికి అంతు చిక్కని విషయం అలాగే తెలిసిన విషయం కూడా ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా తానే వచ్చి రాత్రిపూట రాసలీలలు జరుపుతాడని ప్రచారంలో ఉంది అయితే ఇందుకు సంబంధించిన గ్రంథాలు విశ్వాసాలకు సాక్ష్యాలు కూడా మనం చూద్దాం నిజంగానే శ్రీకృష్ణుడు ఇక్కడికి ప్రతి రోజూ వస్తాడా గోపికలతో రాసలీలల్లో పాల్గొంటాడా తెలుసుకుందాం.
(04:05) నిధివనం గురించి మీరు ఎక్కడా చూడని మీకు ఎక్కడా దొరకని విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. బృందావనంలో యమునా నది వడ్డున ఉన్నది నిధివన్ ప్రాంతం నాలుగు వైపులా సురక్షితంగా ఉండే ప్రాంతం నిధివన్ రహస్యాన్ని చేజించేందుకు చాలా మంది ప్రయత్నించారు. కొందరు నిధివన్ లోని చెట్లు వెనుక దాక్కుొని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించారు. తర్వాత రోజు వాళ్ళు షాక్ తో మతిస్తిమితం కోల్పోయిన వాళ్ళుగా ప్రవర్తించేవారట.
(04:31) కొందరు చూపు మాట కూడా కోల్పోయారు. అక్కడ ఏం జరిగిందో చూసేందుకు అసలు ప్రయత్నించకూడదని అది చాలా చిత్రంగా భయంకరంగా మనసును కలిపి వేసే విధంగా ఉండొచ్చని అక్కడ ప్రజలు నమ్ముతారు. అందుకే నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రి అయితే అటువైపు కిటికీలు తలుపులు మూసేస్తారు. నిధివన్ ఆలయం చుట్టుపక్కల ఉండే వన తులసి చెట్టు చిన్న పరిమాణంలో ఉండడమే కాకుండా ప్రతి రెండు చెట్లు ఒకదానిన ఒకటి పెనవేసుకుని ఉంటాయి.
(04:59) ఎన్నో చెట్లు వంకరుడు టింకర్లుగా ఒకదానినఒకటి పెనవేసుకొని కనిపిస్తాయి. పగటిపూట జంతువులు పక్షులు మనం చూడొచ్చు కానీ రాత్రిఎనిమిది గంటలు దాటితే మనుషులు కాదు కదా కనీసం పక్షి పురుగులు కూడా అటువైపు వెళ్ళదు. ఈ ప్లేస్ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాధల మధ్య అనుబంధంతో ముడిపడి ఉందట. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాడని స్థానికుల నమ్మకం అంతేకాకుండా రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేస్తూ ఉంటారని స్థానికులు చెబుతారు.
(05:35) ఆ సమయంలో కృష్ణుడు బటులు నిధివన్ చుట్టూ అదృశ్య రూపాల్లో కాపలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతూ ఉంటారు అందువల్లే రాత్రి ఆలయం ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం ఓ వెండి గ్లాస్ నిండా పాలు కొన్ని తీపి పదార్థాలు తాంబూలం పళ్ళు తోముకోవడానికి రెండు వేపపు పుల్లలు చీర గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారు.
(06:09) ఇక ఉదయం ఆలయం ద్వారం తీసేసరికి ఆ సమయానికి తాంబోలం నమిలి ఉమ్మిన గుర్తులు పాలు తాగిన ఆనవాళ్ళతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంచెం చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు పళ్ళు సగం తిన్న ఆనవాళ్ళు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. సూర్యాస్తమయం అయితే చాలు నిధివన్లోని ప్రధాన ఆలయం ద్వారాలు మూసేస్తారు. ఎక్కడికి మనుషులే కాదు కనీసం పక్షులు కూడా వెళ్ళవు.
(06:37) ఒకవేళ ఎవరైనా నిధివనంలో రాత్రిపూట ఉండి శ్రీకృష్ణుడి రాసలీలలు దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికి పిచ్చి పట్టడం లేదా ప్రాణాలు పోవడం వంటివి జరుగుతున్నాయి. అందుకు సాక్ష్యంగా కొన్నేళ్ల క్రితం జైపూర్కు చెందిన ఓ కృష్ణ భక్తుడు నిధివనంలో ఏం జరుగుతుందో చూడాలని శ్రీకృష్ణుడు భగవానుని దర్శనం చేసుకోవడానికి దొంగతనంగా అక్కడే ఉండిపోయాడు.
(07:02) రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి నిధివాన్ ప్రవేశ ద్వారంలో అతను పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట. అలాగే గతంలో ఓ భక్తుడికి కూడా ఇలాగే జరిగిందట. శ్రీకృష్ణుడు రాసలీలలు చూడడానికి ప్రయత్నించి పిచ్చివాడు అయిపోయాడు. శ్రీకృష్ణుడు లీలలు మానవులు అర్థం చేసుకోలేరు అని స్థానికులు చెప్తారు.
(07:26) అయితే నిజంగా నిధి వన్ లోనికి శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి వస్తూ ఉంటాడా ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వనాల గురించి అక్కడ ఉన్న చెట్లు గురించి అలాగే మన శాస్త్రాల్లో కూడా తెలుస్తుంది. వీటి మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు బహుశా ఈ ప్రాంతాల్లో రాత్రిపూట ఎక్కువగా రేడియేషన్స్ ఉన్నందున నీడ పడకుండా ఆకర్షణ శక్తి వల్ల ఈ చెట్లు చాలా పక్కకు తిరిగి ఉంటాయని అంతేకాకుండా ఇవి పెనవేసుకుని ఉంటాయని అంటున్నారు.
(07:55) వీధి వనంలో కూడా ఇలా ఉండి ఉండొచ్చని మన శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు కేవలం కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జ్ఞానానికి సంబంధించిన వ్యాఖ్యలు చెప్పేవారు ఆ జ్ఞానాన్ని కేవలం ఆ ప్రదేశాల్లో మాత్రమే కొంతమంది సిద్ధ పురుషులు పొందేవాళ్ళు సామాన్య వ్యక్తులకు ఆ జ్ఞానం కనిపించదు వినిపించదు పిచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు భౌతిక రూపంలో నుంచి దూరంలో ఉన్నాడని ప్రతి అణువులోనూ ఉన్నానని చెప్తారు.
(08:28) నిధివనంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు బాహ్య రూపంలో కాకుండా జ్ఞాన రూపంలో ఉండి ఉండొచ్చు విరాట రూపంలో ఉండి ఉండొచ్చు. ఆ రూపంలో ఉండి ఆ ప్రకృతిని ఆ ప్రదేశాన్ని సంరక్షిస్తూ ఉండొచ్చు అని సాధనికులు చెప్తుంటారు. సాధారణ మస్తిష్కానికి ఇది అంతుచిక్కని అంతుపట్టని రహస్యం అందుకే నిధివనంలో చెట్ల మీద ఒక్కరు కూడా చెయ్యి వేయరు. ఆ శ్రీకృష్ణు లీలల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
(08:53) ప్రతి చోట తానే ఉండి ప్రకృతిని నడిపిస్తున్న మహానీయుడు శ్రీకృష్ణుడు నిధి వనం కేవలం శ్రీకృష్ణుడి వల్లే ప్రసిద్ధి పొందింది అంటే అస్సలు కాదు మరొక కారణం కూడా ఉంది. ఇక్కడ వనం అందులో వృక్షాలు కూడా ఈ స్థలం ప్రసిద్ధి గాంచేలా చేశాయి. సాధారణంగా కింద నుంచి పైకి కొమ్ములు వ్యాపిస్తున్నట్లుగా పరుచుకున్నట్లుగా చెట్లు పెరుగుతాయి.
(09:16) కానీ నిధి వనంలో మొత్తం రివర్స్ లో ఉంటుంది. చెట్లన్నీ కిందకి వంగి పెరుగుతూ ఉంటాయి. స్థానికుల కథనం ప్రకారం దేవుడిని నమస్కరించడానికి ఆ చెట్లన్నీ ఇలా కిందకి వంగి ఉంటాయని చెప్తున్నారు. అసలు ఇలా ఎలా జరుగుతుందో ఇంతవరకు ఏ శాస్త్రవేత్త నిరూపించలేకపోయాడు. ఏది ఏమైనా కొన్ని రహస్యాలను రహస్యంగానే ఉండనివ్విచ్చి ఆ పవిత్ర స్థలాన్ని దర్శించుకొని భగవంతుని మనసారా ప్రార్థించడమే నిజమైన భక్తి నిధివానిలో గోపికలకు దాహం తీర్చడానికి శ్రీకృష్ణుడు ఒక గొంతు తవ్వాడంట.
(09:50) దాన్ని విశాఖకుం అని అంటారు. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ ని దర్శించుకున్నప్పుడు ఈ ప్రదేశాలని మర్చిపోకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment