Sunday, May 17, 2026

Ramaa Raavi - రమా గారి మాటల్లో భాగవత రహస్యాలు ఇలా ఎప్పుడూ వినుండరు..? | Secrets Of Bhagavatham | iD

Ramaa Raavi - రమా గారి మాటల్లో భాగవత రహస్యాలు ఇలా ఎప్పుడూ వినుండరు..? | Secrets Of Bhagavatham | iD

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=14m5vym_pXw



Transcript:
(00:00) ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం రామాయణ మహాభారత భాగవతాల గురించి వింటూ ఉంటాము చాలా మంది పెద్దలు ఉన్నారు మనకి మీరు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే భాగవతం ఒక సిరీస్ కింద చేద్దామని నాకు అనిపించిందండి భాగవతంలో అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఒక వ్యక్తికి కావలసిన లక్షణాలు కర్తవ్యం విధులు విధానాలు అన్ని ఉన్నాయి దాన్ని మనం ఏమనా ఒక సిరీస్ కింద తీసుకెళ్ళగలుగుతామా తీసుకెళ్లొచ్చు అంటే ఎట్లా భారతం రామాయణం చేసుకుంటామో సిరీస్ గా అలాగే భాగవతాన్ని కూడా చేసుకోవచ్చు రామాయణ భారతాలేమో
(00:44) ఇప్పుడు రామాయణంలో రాములవారి గాధ రాముని అయనము ప్రయాణం ఆయన ఎట్లా వెళ్ళాడు ఎలా వచ్చాడు ఎట్లా భార్యను రక్షించుకున్నాడు ఏ రకంగా ధర్మ సంస్థాపన చేశాడు అవతార పరిసమాప్తి ఎలాగ అవతారం తీసుకున్నాడు అవతారం తాలకు ప్రయోజనం ఏమిటి అవన్నీ చేసి చివరికి పరిసమాప్తిని కూడా మనకి రామాయణంలో కనబడుతుంది ఒక్క రాముడే ప్రధాన కథానాయకుడు మ్ రాముడి పూర్వ ఉత్తర గాధలు కొంచెం మనకి కనిపిస్తాయి మధ్యలో మనకి వాలిని పరిచయం చేస్తారు ఆంజనేయ స్వామిని పరిచయం చేస్తారు సుగ్రీవుడిని పరిచయం చేస్తారు వాళ్ళది ఒక గాధ ఈ ముందు అంతవరకు వెళ్ళేవరకు అంతా రాముడి కథగానే కనపడుతుంది.
(01:24) అవును అక్కడి నుంచి మళ్ళకి మధ్యలో జటాయువు కనిపిస్తాడు తర్వాత సంపాతిది ఒక పాత్ర కనపడుతుంది. ఈ రావణాసురుడు అతని కుటుంబం అతని వ్యవహారం కానీ మొత్తం అందులో నాయకమణి రాముడే మ్ మహాభారతం తీసుకుంటే మహాభారతానికి మన ముఖ్య ప్రధానమైన ఘట్టాలు కురుపాండవులు వాళ్ళిద్దరూ కౌరవులు పాండవులు కొట్టుకోవడం చివరికి రాజ్యాధికారం చేజెక్కించుకోవటం అవును దీంట్లో భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం ఏం ప్రయత్నం చేశాడు ఏమిటి అవి చూపిస్తారు పూర్వగాథలు ఎన్ని కథలు ఉంటాయో ఆదిపర్వ నిండ కథలు ప్రతి పర్వ లోన ఈ పాండవుల చుట్టూత రకరకాల గాధలు అల్లుకొని ఆ కాలపు అనేక రకాల
(02:07) రాజ్యాల గాధలన్నీ మనకి కనిపిస్తాయి. అటు రామాయణంలో గాని ఇటు భారతంలో గాని భక్తి ఒక అండర్ కరెంట్ గా కనపడుతుంది. రామాయణంపు మొదటి దాంట్లో మొదటి బాలకాండలో విశ్వామిత్రుడు కనిపిస్తాడు ఆయన గట్టివాడుగా కానీ ఆయనది భక్తిగా చూపిస్తున్నట్టు మనకు కనిపించదు. అవును రాజుకి ప్రజలకి ఉన్న స్నేహము ఆపేక్ష తండ్రి పిల్లల మధ్యలో ఉండే స్నేహము ఆపేక్షలు తర్వాత భార్యా భర్తల మధ్య మానవ సంబంధాల్లోవే కనిపిస్తాయి కానీ ఇందులో భక్తి భావాలు తీవ్రంగా ఉన్నట్టుగా మనకి ఎక్కడ పెద్దగా కనిపించదు హనుమ పాత్ర ప్రవేశించాకే మనం ఆయనలో భక్తి యొక్క తీవ్రత తాదాత్మయత చూస్తాం.
(02:50) ఓకే మిగిలిందంతా రాములవారి కాతే మహాభారతంలో అక్కడక్కడ భక్తిపరులుగా ఉన్నవాళ్ళు మనకి కొంతమంది కనపడతారు. విదురుడు మ్ తర్వాత ఈ మన కృష్ణ గాధల్లో కొంతమంది కృష్ణుడిని అనుసరించినట్టుగాను ఇది కనిపిస్తుంది. చివరికి మనకి భీష్ముడు తీవ్ర భక్తితో భగవంతుని పట్ల ఆయన ఎలాంటి భక్తితో ఉన్నాడు ఆయన ఎట్లా భగవంతుని గౌరవించాడో చూస్తే మన విష్ణు సహస్రనామం కూడా అక్కడి నుంచి పుట్టిందే కదా కృష్ణుడు శ్రీకృష్ణుని పట్ల ఆ ధృతరాష్ట్రుడికి భక్తి ఉన్నట్టు విధురుడికి భక్తి ఉన్నట్టు అక్రూరుడికి భక్తి ఉన్నట్టు ఇట్లా కనిపిస్తుంది.
(03:28) సందర్భానుసారమే గానీ భక్తే ఫుల్ కరెంట్ కాదు అండర్ కరెంట్ అండర్ టోన్ లోపల ఉంది కొద్దిగా కానీ భాగవతంలో అట్లా కాదు నవవిధ భక్తి మార్గాలనే చూపిస్తారు మ్ భాగవంతము అంటేనే భగవంతునికి సంబంధించినది అని అర్థం పూర్తిగా భగవంతుడికి సంబంధించింది రామాయణాన్ని సీతాయాహ చరిత మహత్త అంటారు సీతా చరిత భారతాన్ని జయ కావ్యం అంటారు భాగవతం భాగవతమే పూర్తిగా అంటే భగవత్ సంబంధమైన వ్యవహారమే కనపడుతుంది.
(04:05) శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాలన్నిటిని మళ్ళీ క్రోడీకరించి ఎట్లా భగవంతుడు భూమిమీద ఏ స్వరూపాలతో ఏ ఏ కాలాల్లో ఎవరెవరి కోసం ఏ రకమైన భక్తుల కోసం ఎట్లాంటి స్వరూపాలను తీసుకున్నాడు 21 అవతారాలు తీసుకున్నాడు విష్ణువు అవును మనకి దశావతారాలు తెలుసు ఈ 21లో మిగిలిన 11టిని మనకి వేగ్గా తెలుసు అవును ఎలాగా ధన్వంతరి స్వరూపం మనకు తెలుసు పూజ చేసుకుంటాం ఎప్పుడు ధనంతరాస అప్పుడు తర్వాత మోహిని అవతారం అది కూడా మనకు తెలుసు కపిల మహర్షి అది కూడా మనకు తెలుసు సగరుడు కుమారులు సముద్రం తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు కపిల మహర్షి కనపడ్డాడని ఇట్లా కొన్ని అవతారాలని మనం వింటాం కానీ
(04:49) అవి ప్రత్యేకంగా భగవంతుడే ఆ రకంగా జన్మించాడని మనం అర్థం చేసుకోం మనకు దశావతారాలే తెలుసు అందులో ప్రఖ్యాతంగా రాముడు కృష్ణుడు వాళ్ళు ఆరాధ్య దైవాలుగా ఉన్నారు ఎందుకంటే పూర్తి మానవ స్వరూపాలతోటి మర్యాదా పురుషోత్తముడుగా రాముడు తర్వాత లీలా విలాస కృష్ణుడుగా ఈయన భగవంతుడు ఆయన ఏం చేసాడు ఎన్ని రకాలో చేశడు కదా లీలామానుష విగ్రహుడు అటు మానవుడుగాను చేరించాడు భగవంతుడుగాను కొంత చూపించాడు అందుకని వీళ్ళద్దరు ప్రఖ్యాతగా తెలుసు ఈ ప్రఖ్యాత గాధలని ఆటే ప్రఖ్యాతిగాలి అని చాలా గాధలని కలిపి భాగవతాన్ని తీసుకొచ్చారు భగవంతుని చేరటమే అల్టిమేట్ గోల్ మానవ జన్మకి
(05:33) పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది. మరణించిన ప్రతి ప్రాణి మళ్ళీ పుడుతుంది. అవునండి ఈ మళ్ళీ పుట్టకుండా ఈ జనన మరణ చక్రం సైకిల్ తిరక్కుండా ఎక్కడి నుంచి పుట్టామో ఎవరి వల్ల పుట్టామో అతనినే చేరటమే మోక్షం ఈ మోక్షానికి ప్రతిమానవుడు ప్రయత్నం చేస్తాడు. ఏ స్టేజ్లో వాళ్ళకి ముముక్షువులుగా అంటే మోక్ష సాధన కోసం ప్రయత్నించాలి అనేది వస్తుంది అనేది తెలీదు వందల జన్మలు ఎత్తిన తర్వాత రావచ్చు మ్ వస్తుంది కాదు రావచ్చు ఈ భక్తి నవమిధ మార్గాలు ఉన్నాయి కదా వీటిలల్లో ఏ మార్గాన్నైనా ఎవరైనా ఎప్పుడైనా పట్టుకోగలిగితే ఆ పట్టు బలమైన పట్టుగా మారితే అప్పుడు
(06:19) మోక్ష సాధనకి వెళ్తాం. మనకి రెండు న్యాయాలు చెప్తారు మర్కట కిశోర న్యాయం మార్జాల కిశోర న్యాయము అని మర్కట కిశోరము అంటే కోతి దాని పిల్ల మర్కటం అంటే కోతి కిశోరం అంటే కోతి పిల్ల ఈ మర్కట కిశోరం కోతి పిల్ల పుట్టంగానే తల్లిని ఇట్లా కరిచి పట్టుకుంటుంది. ఆ తల్లి ఎగురుతుంది దూకుతుంది ఆ చెట్టు ఎక్కుతుంది ఈ చెట్టు ఎక్కుతుంది ఎంత పరుగులు పెట్టినా పిల్లని పట్టుకోదు పిల్లని పట్టుకోదు పిల్లే తల్లిని పట్టుకొని ఉంటుంది అవునండి అసలు దాని పట్టు దాన్ని ఎంత లాగినా చెయ్యి విడవదు తెలుసానా అది తల్లిని విడిచే వయసు వచ్చాక దానంతట అది విడిచిపెడుతుంది.
(06:58) ఆ అది తల్లిని కరుచుకుందంటే దాన్ని పీకలేం మనం ఎందుకు తల్లే పీక పడేయలేదు దాన్ని వదలదు ఇలా భగవంతుని పట్టుకునే భక్తి ఒకటి మార్జాల కిషోరి న్యాయం అని రెండోది ఉంది. ఈ మార్జాల కిషోరం ఏంటంటే పిల్లి పిల్లల్ని పెడుతుందా పిల్లి పళ్ళు గోళ్ళు ఎంత పదునుగా ఉంటాయో పిల్లి పళ్ళు తలుక్కుమంటాయి భలే కొసగా ఉంటాయి.
(07:22) కానీ ఈ పుట్టిన పిల్లని మెడ మీద ఇట్లా పట్టుకొని మెడ దగ్గర పట్టుకుంటుంది మీరు పిల్లి పిల్లల్ని పట్టుకెళ్ళేటప్పుడు చూసి తీరాలి అది ఆ పళ్ళు గుచ్చుకుంటాయి అనిపిస్తుంది మనకి ఆ ఏమ అవ్వదు ఆ పిల్లని ఇట్లా మెడ దగ్గర పట్టుకొని మోసుకుపోతుంది అది ఎక్కడికైనా సరే ఈ పిల్ల పుట్టిన పిల్ల దాని శరీరాన్ని తల్లి మీద వదిలిపెట్టేస్తుంది తల్లి ఎక్కడికి ఈడుచుకుపోయినా దానికి ఓకే అమ్మో నాకు నెప్పెడుతుంది అని కూడా అనదు.
(07:44) మనుషులు ఇట్లా నన్ను ఎవరైనా మోక్ష మార్గానికి తీసుకెళ్ళాలి అనుకుంటారు. అలా తీసుకెళ్ళబడరు తీసుకెళ్ళబడరు కేవలం గురువు అట్లా మోసుకెళ్తాడు కొంత దూరం తర్వాత నువ్వు పట్టుకోవాలి అవును ఆ పట్టుకోవాలంటే భక్తి రకరకాలుగా వెళ్తుంది మార్గాలు తొమ్మిది రకాలు చెప్తారు. ఈ తొమ్మిది రకాల్లో కేవలం మనం ఇప్పుడు చేయగలిగేది మనం భగవంతుడితో సఖ్యం చేయలేము దాస్యం చేయలేము ఏమి చేయలేం ఇప్పుడు మనం చేయగలిగేవి రెండు రకాలు శరణాగతి స్మరణ ఈ రెండు చేయగలుగుతాం ఈ కాలంలో ఇప్పుడు స్మరణ చేయాలంటే మనకి ఉద్యోగాలు చదువులు జీవన ప్రయాణం ఈ భవసాగరం మనం ఏమనాలి ఈదురుకుంటూ పోవాలి
(08:29) అవునండి ఇప్పుడు పూజ ఎట్లా కుదురుతుందండి అంటారు నోరుంది బుద్ధి ఉంది ఉన్నాయి కదా లోపల భగవన్ నామ స్మరణ చేసినవాడు కూడా ఈ మోక్షాని వైపుకి వెళ్ళగలుగుతాడు. ఆ స్మరణ ఎట్లా చేయాలి అని చెప్తుంది భాగవతంబ ఎట్లా భగవంతుని పట్టుకోవాలి అదేదో కష్ట సాధ్యమైంది కాదు పరమ సులువైన మార్గాన్ని కూడా బోధిస్తుంది చాలా కష్టం తపస్సు చేయొచ్చు ఇప్పుడు ఎవరు చేస్తాం తపస్సు కందమూలాలు తింటూ అక్కడ ఎక్కడో అడవిలో కూర్చొని శరీర మార్గాన్ని విడిచిపెట్టి ఆహారం లేదు గాలి లేదు నీళ్లు లేవు మనకేం అక్కర్లేదు ఓ శరీరం ఎండిపోయినా పర్వాలేదు అని అనుకుంటామా పూజ అనగానే
(09:11) ముందు మేకప్ మొదలు పెడతాం మనం మరి గుడిలో గుడిలోకి వెళ్ళాలంటే దేవాలయ దర్శనం ఎట్లా కొట్లా వెళ్ళంగా చక్కగా తయారయి శుభ్రంగా మేకప్ అయి మంచిగా నగలు వేసుకొని మగవాళ్ళు కూడా నగలు ధరించి ఈ శుభ్రంగా వెళ్ళమన్నారు కానీ అలంకరించుకొని వెళ్ళక్కర్లే కానీ మనం అలంకారం చేసుకని వెళ్తాం దేవుడి కోసమా అది మనకోసమా దేవాలయ గమనం దేవుడి కోసం అయితే ఈ గమనంలో ఉండే వేషం అంతా మనకోసమే ఇప్పుడు ఏమవుతుంది దేవాలయం చిన్నదైపోయి మనం పెద్దది అయిపోతుంది.
(09:41) అయిపోయాం సహజంగానే ఇప్పుడు దేవాలయమే పెద్దదిగా ఉండాలంటే నువ్వు అక్కడ ఎక్కడికో పరిగెత్తొద్దు నీ దేహమే దేవాలయం మనసు లోపల భగవత్ ధ్యానం ఎట్లా చేయొచ్చు ఎలా చేయాలో ఇట్లా చేసిన వాళ్ళు ఎవరెవరు ఎలా ఎలా తరించారో మనకి చూపిస్తుంది భాగవతం అయితే ఇందులో పురాతన కాలపు కథలు కాబట్టి పురాణం కదా ఇది పాతది కదా అట్లా మనం చేయలేకపోవచ్చు ఈకాల కాలానికి తగిన కొన్ని విధానాలని మనం అలవరుచుకోవచ్చు దాంట్లో పురాణ శ్రవణం ఒక ప్రత్యేకమైన పద్ధతి నువ్వు ఏదైనా సరే కార్తీక మాసం కార్తీక పురాణం విను మాఘమాసం మాఘ పురాణం విను వైశాఖ మాసంలో వైశాఖ పురాణం వినొచ్చు ఎప్పుడు ఏదో ఒకటి వినాలి
(10:26) అవును విన్న తర్వాత నువ్వు ఇప్పుడు మంచి విషయాన్ని చెవులతో విన్నాక ఏదనా చెడ్డ విషయం వినేటప్పుడు అది తప్పని నీకు అర్థం అవుతుందా అవ్వదా కచ్చితంగా అండి మనక ఎలా గుర్తొస్తాయి నీతి కథలో పురాణ కథలో మనం ఎందుకు వింటాము ఇవి వినడం వల్ల వల్ల ఆ ఏదైనా ఒక పొరపాటు జరిగేటప్పుడు ఇది తప్పని అక్కడ చెప్పారు. మానవ మేధ ఎట్లాంటిది 11 12 కంప్యూటర్ల కంటే పెద్దది.
(10:51) దీనికి జ్ఞప్తి జ్ఞాపకము ఉంటాయి సమయస్ఫూర్తి ఉంటుంది మనుషులకి ఈ సమయానికి గుర్తొస్తుంది ఇలాంటిదే ఈ కథలో చెప్పారు ఇది చేయకూడదు నీతి కథలు అందుకే చెప్తాం. అవునండి. నీతి కథలేమో మన జీవిత ప్రయాణంలో ఉపయోగపడతాయి. పురాణ గాధలేమో మన ఏమంటారు మన దేవుడి వైపుకి నడిచే నడకకి హెల్ప్ చేస్తాయి స్పిరిచువల్ పాత్ కి ఇవి ఉపయోగపడతాయి. వింటూ ఉంటే క్రమంగా మనకి కొంత అర్థంవుతుంది.
(11:17) మన జీవన ప్రయాణం ఏదో దేనికోసం అరులు చాచి పరిగెడతాం అవి తగ్గిపోతాయి. అయితే భాగవతం వ్యాస భగవానుడు రాసినప్పుడు సంస్కృతంలో రాయబడింది. మ్ చాలా పెద్దదే ఎన్నో వేల శ్లోకాలు ఉన్నాయి. ఎన్నో గాధలు కనిపిస్తాయి అందులో ఈ అన్ని స్కంధాలలో రాయబడిన దాన్ని పోతనామాత్యులు తెలుగులోకి రాశారు. ఉమ్ తెలుగు భాగవత పద్యాలు రాని వాళ్ళు అసలు తెలుగువాడే కాదంటారు పెద్దవాళ్ళు కొన్నైనా భాగవత పద్యాలు రావాలి మనకి నేర్చుకోవాలి పద్యాలు నేర్పించే ప్రక్రియ కూడా ఏదైనా చేసి చూద్దాం తర్వాత సంగతి కానీ పద్యాలు నేర్చుకోండి సంస్కృతమైనా తెలుగునా తెలుగు అయితే చక్కగా మన నోరు
(11:56) బాగా తిరుగుతుంది మనకు అర్థం అవుతుంది ఒక సంతోషం కలుగుతుంది ఏదైనా అర్థమైతే బాగుంటుంది కదా అవునండి అయితే ఈ పోతనామాత్యులు చేసిన దాంట్లో కొన్ని స్కంధాలు వారు చేయలేదని కొన్ని వారి శిష్యులు తర్వాత కొంతమంది చేశారని చెప్తారు. మనం ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా వరసగా వెళ్ళక్కర్ల ప్రతి స్కందంలోనూ ఉన్న గాధలని లైన్ గా చెప్పుకుందాం కొన్ని బుజ్జి బుజ్జివి చిన్న కథలు కొన్ని పెద్ద కథలు కూడా ఉంటాయి.
(12:21) ఈ కథల్లో మనకి ఏం కనిపిస్తాయి ధ్రువోపాఖ్యానం కనిపిస్తుంది ధృవపాఖ్యానం మనకి తెలుసు కదా తర్వాతేఏమో గజేంద్ర మోక్షం కనిపిస్తుంది ప్రహ్లాద చరిత్ర కనపడుతుంది ఎన్నో వీటిలో శ్రీకృష్ణుడు శ్రీరాముడు అందరూ అన్ని గాధలు కనిపిస్తాయి వరుసగా చెప్పుకుందాం ప్రతి స్కంధం వైస్ గానే వెళ్దాము మొత్తం టాప్ టు బాటం అట్లా లైన్ గా చెప్పను నేను ఓకే కానీ ఈ స్కంధంలో ఉన్న గాధ అయిపోయాక వచ్చే స్క వెళ్దాం అయితే దీనికి భాగవతం మొట్టమొదట భూమి మీదకి ఎలా వచ్చింది అనేది ఒకటి తెలుసుకోవాలి మనం వ్యాస భగవానుడు తన కుమారుడైన సుఖ మహర్షికి చెప్పారటహ ఈ విషయాన్ని సూత మహాముని తెలియజేశాడు
(13:00) నైమిసారణ్యానికి ఆయన వచ్చినప్పుడు ఋషులందరూ అడిగారు. ఈ జీవితాన్ని ఇలా తరింపచేసే మార్గం ఏదైనా చెప్పమంటే భాగవతం తరింపచేసే మార్గం అని ఆయన చెప్పాడు ఇది ఎవరికి ఎవరు చెప్పారు అంటే మొట్టమొదట సుకులు సుఖమహర్షి ఈయనకి పరీక్షిన్ మహారాజుకి చెప్పాడు ఈ పరీక్షిత్తు ఎవరు ఈ కథా ప్రారంభం ఇట్లా అవుతుందన్నమాట అయితే ఈ పరీక్షిత్ మహారాజు ఎవరు పాండవుల యొక్క మనవడు ఇంచుమించు కురుక్షేత్ర సంగ్రాామం పూర్తయపోయాక దుర్యోధనుడు ఆ ఇంకా అందరూ అయిపోయారు నేను ఒక్కడినే మిగిలాను ప్రాయోపవేశం చేస్తానని ఆయన వెళ్లి ఒక మడుగులో దాక్కున్నాడు ఉన్నాడు ఉండిపోయాడు లోపల దాక్కోవటం అనకూడదు ఇక
(13:45) ప్రాణాలు వదిలిపెడిచేయడానికి జలస్తంభాన విద్యతోటి నీటి అడుగున ఉండిపోయాడు ఆయనకు తెలిసింది అందరూ చచ్చిపోయారు ఎవరు లేరు ఆయన్ని వెతుక్కుంటూ ఆ అశ్వద్ధామ వీళ్ళు వెళ్ళారు కృపాచార్యుడు కృతవర్మ అశ్వద్ధామ ముగ్గురు వెతుక్కుంటూ వెళ్ళారు వెళ్లి వాళ్ళ ఆయన ఆయన చూశారు పరమ దుఃఖంతో అశ్వద్ధామ దుర్యోధనుడు చిన్నప్పటినుంచి ఒకే చోట పెరిగారు.
(14:11) వాళ్ళ గురుపుత్రుడు కదా ద్రోణాచార్యుల కుమారుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడు దేశం వదిలిపెట్టి వెళ్ళ పాండవులు ఓళ్ళని ఊళ్ళు తిరిగారు కానీ ఈ అశ్వత్థామ మాత్రం చిన్నప్పటి నుంచి కౌరవులతో పాటే ఉన్నాడు మ్ తండ్రికి పాండవులు అంటే ప్రీతి కానీ ఇతనికి స్నేహం కౌరవులతోటే ఉంది అతను చెడ్డవాడు క్యారెక్టర్ చెడ్డదని నేను చెప్పలేదు చెప్పట్లేదు భారతం కూడా అట్లా చెప్పదు మనకి కానీ వీళ్ళతో పాటు ఉండటంతో ఈ దుర్యోధనుడు తోటి తీవ్రమైన స్నేహం ఉంది.
(14:39) తమ రాజు కదా అవును ఇలాగ అన్ని సర్వం కోల్పోయి రాజ్యం పోగొట్టుకొని అన్నదమ్ములందరూ చనిపోయి పెద్దలంతా పోయి ఈ ప్రాణావశిష్ట స్థితిలో ఉన్న దుర్యోధనుని సంతోష పెట్టడానికి పాండవులందరినీ చంపేస్తానని చెప్పాడు. ఆ సమయంలో పాండవులు అక్కడ లేకుండా చూసి రాత్రిపూట అర్ధరాత్రి శిబిరాల్లోకి జొరబడి పాండవుల శిబిరాల్లోకి వెళ్ళిపోయి ఆ పాండవుల యొక్క కుమారులు ఐదుగురు ఉపాండవులు ద్రౌపదీ దేవి కుమారులు ఈ ఐదుగురిని చంపేసాడు.
(15:12) ద్రౌపది దేవి సోదరుడు ద్రోణాచార్యుడి మరణానికి కారణమైన దృపద రాజకుమారుడు దృష్టద్యుమనుని కూడా సంహరించేసాడు నిద్రలో వాళ్ళు పడుకొని ఉన్నారు వీళ్ళు చంపేశరు బయటికి వచ్చిన వాడిని వచ్చినట్టు మొత్తం పీనిగల కుప్ప చేసేసారు పాండవుల శిబిరాలని తెల్లవారాక వచ్చి చూసుకున్నారు వాళ్ళు చూసుకుంటే కుమారులు మరణించి ఉన్నారు దుష్టజ్యమునుడు మరణించాడు ఓ పెద్దగా ఏడిచింది ద్రౌపది మీరు గెలిస్తే ఏం ప్రయోజనం నా కుమారులు చచ్చిపోయారు మా తమ్ముడు చనిపోయాడు సోదరుడు కదా ఆమెతో పాటు పుట్టాడు యజ్ఞంలో లోయించి ఆయన జన్మే ద్రోణుని చంపడం కోసం జరిగింది దృష్టజ్యుమనుడి పుటకే అందుకు దృపదరాజు
(15:48) రెండు కోరికలతోటి యజ్ఞం చేశాడు. అర్జునుని పెళ్లి చేసుకునే కుమార్తె ద్రోణాచార్యుని సంహరించే కుమారుడు కావాలి కావాలి అని అడిగితే కవచాంతోటి జన్మించాడు దుష్టద్యమనుడు అగ్నికుండంలో నుంచి ఓ ఈవిడ 16 ఏళ్ళు శోడస వర్ష ప్రాయ వివాహానికి యోగ్యమైన సౌందర్య స్వరూపాలతోటి పుట్టింది ద్రౌపది దేవి యాజ్ఞసేని అంటారు ఆమెని యజ్ఞంలో నుంచి పుట్టింది అలాగే పసిబిడ్డగా రాలా సీతాదేవల్లే చంటిపిల్లగా దొరకలా వివాహ యోగ్యమైన పుత్రికగా జన్మించింది అని చెప్తారు భారత ప్రకారం అతను అతను వచ్చిందే అందుకు ద్రోణాచార్యుని చంపేసాడు ఇతను కూడా చచ్చిపోయాడు. ఇక ఈవిడ
(16:24) దుఃఖించింది విపరీతంగా ఇతన్ని పట్టుకోవాలి అశ్వద్ధామని పరిగెత్తారు. ఇతను వీళ్ళందరినీ చంపేసాక అతనికి అసహ్యము సిగ్గు భయము కలిగినయి ఆయన యుద్ధం ప్రదేశాన్ని కురుక్షేత్రాన్ని విడిచిపెట్టి వ్యాసులవారి ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాడు. వెంబడిపడి పట్టుకున్నారు పట్టుకుంటే అతను ఏం చేశడు ఊరుకోలేదు అపాండవ మగుగాక అని ఒక బాణం వేసాడు ఒక మంత్రాన్ని అతనాన్ని విడిచిపెట్టాడు అంటే పాండవుల స్త్రీల గర్భాలలో ఉన్న శిశువులు కూడా గర్భస్రావం అయిపోయేలాంటి ఒక బాణం పడింది.
(16:59) ఇి పట్టుకున్నారు చంపేద్దాం అనుకున్నారు కానీ ద్రౌపది దేవి ఒప్పుకోలే నా కుమారులు పోయి భర్తలు ఉన్నారు గురుపత్నికి గురువు లేడు కుమారుడు కూడా లేకపోతే ఆమె దుఃఖంతో ఏమైపోతుంది వదిలి పెట్టేయండి అంటే తలలో ఒక మణి ఉంది శీరసు జుట్టు తీసేసి తలలో ఒక మణితో పుట్టాడట అశ్వత్థామ ఆ మణిని తీసుకున్నారు.
(17:21) ప్రాణాలతో విడిచిపెట్టేసారు అశ్వత్థామని ఈ విడిచిపెట్టేసినప్పుడు ఈ అపాండవమగా కాని బ్రహ్మశీరో నామకా అస్త్రం అని ఒక అస్త్రాన్ని వేసాడు ఆ అస్త్రాన్ని వేయటం వచ్చు కానీ వెనక్కి తీయటం రాదు. బ్రహ్మశీర్షం అంటారు దాన్ని అర్జునుడికి వచ్చు అప్పుడు ఈ భూమంతా దద్దరిల్లిపోతుందని కృష్ణుడు బ్రహ్మదేవుడు వీళ్ళంతా నారదుడు ఆయనకి నచ్చ చెప్పి మంతను అస్త్రాన్ని వెనక్కి తీయించారు.
(17:44) కృష్ణుడు నువ్వు ఇలాంటివి పని చేశవు శిశుహంతవి నువ్వు చిన్న పిల్లల్ని చంపేసావు పైగా నిద్రలో ఉన్న వాళ్ళని సంహరించేవాడు బ్రాహ్మణుడికి తగిన పనేనా ఇది అని చెప్పి నువ్వు బతికున్నంత కాలం ఒంటి నుంచి దుర్గంధం వస్తుంది చీమురసి వ్రణాలతోటి నువ్వు జీవిస్తావు నువ్వు మరణించవని అతన్ని వదిలిపెట్టేసాడు అందుకే మనం సప్త చిరంజీవుల కథలో అశ్వద్ధామ కథ చెప్పుకుంటాం అశ్వద్ధామ తోటే మొదలవుతుంది కానీ అశ్వద్ధామ మిగిలిన వాళ్ళలాగా అద్భుతమైన చిరంజీవి కాదు శాపగ్రస్తుడు కృష్ణుడి శాపమే అతను వెళ్ వెళ్ళిపోయాడు ఈ బ్రహ్మ ఇది ఉంది కదా మణిని ధర్మరాజు తన కిరీటంలో
(18:18) వేయించుకున్నాడు కొంతకాలం ఇట్లా గడిచింది. ఎప్పుడైతే అపాండవమగాకాని అస్త్రం వేయబడిందో ఉత్తరా గర్భంలో అభిమాన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మీదకి వెళ్ళింది ఏడ్చిందట నాకు శిశువు మీదకి ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది నన్ను రక్షించమంటే ఆయన ఏం చేసాడు కృష్ణ పరమాత్మ మొత్తం అందరూ పోయారు వీళ్ళ వంశాన్ని మీద మగపిల్లలంతా వెళ్ళిపోయారు అభిమాన్యుడు పోయాడు ఉపపాండవులు పోయారు ఇంకా మొగపిల్లలు లేరి వీళ్ళ తర్వాత రాజ్యం ఎవరు తీసుకుంటారు అందుకని ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుకి చక్రం అడ్డువేసి ఆ బ్రహ్మ శిరస్సుని ఏదైతే అపాండవమగాక అనే మంత్రంతో
(18:52) అభిమంత్రించబడిందో దానిని ఆపేసాడు. అట్లా ఈయనతోటి రక్షింపబడ్డాడు విష్ణువు చేత రక్షింపబడ్డాడు కాబట్టి విష్ణురాతుడు అని పేరు పెట్టారు. ఆయన రక్షించబడ్డాడు. తర్వాత తనని రక్షించింది ఎవరు అని అతను అందరిని చూస్తున్నాడట. పరీక్షగా చూస్తున్నాడని పరీక్షిత్తు అని పేరు పెట్టారు ఈ రెండు పేర్లతోటి అతను రాజయ్యాడు. 35 సంవత్సరాలు కురుక్షేత్రం తర్వాత ఈ కుమారుని పరీక్షిత్తుని మనవడికి రాజ్యం ఇచ్చి పాండవులు కృష్ణుడిని కలుసుకోవడానికి వెళ్ళిపోయారు ఎందుకంటే కృష్ణ నిర్యాణం తర్వాతే పరీక్షిత్తుకి రాజ్యం వచ్చింది భగవంతుడు అవతారం చాలించి వెళ్ళిపోయాడు
(19:29) ఇంకొకసారి ఎప్పుడైనా అది చెప్పుకుందాం తప్పకుండా ఆ కృష్ణుడు వెళ్ళిపోవటం ఆ మౌసల పర్వం అంటారు మహాభారతంలో చేద్దాం అది ఒకసారి ఎప్పుడైతే ఇది జరిగిందో పాండవులు కూడా కుమారుడికి మనవడికి రాజ్యం ఇచ్చి వెళ్ళిపోయారు పరీక్షిత్తు అద్భుతమైన రాజుగా ఉన్నాడు తన పితామహులు ఎలా అద్భుతంగా రాజ్యం చేశారో ఆయన కూడా అలాగే చేశాడు తర్వాత ఆయన దిగ్విజయ యాత్ర చేశాడట ఎప్పుడైతే ఈ మన నాలుగు యుగాలు కదా ఈ యుగ పరిసమాప్తి అవుతూ ఉండగా కలియుగం కలి ప్రవేశించాడు అప్పటికే కలిపురుషుడు లక్షణాలు ఉన్నాయి దుర్యోధనుడికి వాళ్ళకి ఉన్నాయి కదా ఆ కలి ఈయన వెళ్తున్న దారిలో దిగ్విజయ
(20:08) యాత్రలో ఒక శూద్ర వేషాన్ని ధరించి నాలుగవ జాతివాడిలాగా కనపడి ఆవుల్నిత తంతున్నాడట ఆవుల్ని తంతుంటే అతను తన్నిన తన్నుకి ఒక వృషభం ఒక ఎద్దు ఆంబోతంట పడిపోయిందట ఈయన వెంటనే ఆపి అతన్ని శిక్షించబోయాడు. శిక్షించబోయి అతన్ని పట్టుకొని ఎవరైతే కలి ఈ స్వరూపంలో ఉన్నాడో అతన్ని పట్టుకొని ఈ ఆవుని ఎద్దుని అడిగాడు అమ్మ నిన్ను కొట్టిన వాడిని ఎలా రక్షించ ఏం చేయమంటావు ఏం శిక్షించమంటావు అని అంటే ఆవిడ ఏం చెప్పిందట అయిపోయింది కృష్ణుడు తిరిగిన భూమి గోరూపాన్ని ధరించి ఉందట భూమి అప్పుడు కృష్ణుడితో పాదస్పర్శతో పునీతమయ్యాను కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక వచ్చేది
(20:51) కలే ఇక ఇలాంటి వాళ్లే ఉంటారు. ముందంతా ఎలా అయింది నాలుగు పాదాల నడిచింది అవును తర్వాత కృత యుగానికి వచ్చేసరికల్లా కృతయుగం నుంచి త్రేతా యుగానికి వచ్చేసరికి మూడు పాదాలు అయింది ధర్మం ద్వాపరంలో రెండు పాదాలు ఉంది ఇప్పుడు కలి కేవలం సత్యంతోటి మాత్రమే నడుస్తుంది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అని అని మాట్లాడుకుంటుంటే ఈ వృషభ ధర్మదేవత వృషభ రూపంలో దర్శనం ఇచ్చాడు ఈయనకి నా పని అయిపోయింది నేను చివరికి వచ్చేసింది ఇది ఈ కాలం ఎంత కాలమో ఇట్లా గడవాల్సిందే ఇక ముందు ఇలాంటి వాళ్లే కనపడతారు అంటే ఈ స్వరూపం మార్చుకొని ఉన్నాడు కదా కాలి అతను శరణు చొచ్చాడు
(21:31) పరీక్షిత్తుని ప్రభువు నాకు సెలవివ్వు నేను ఎక్కడ ఉండాలో చెప్పు నేను ఎక్కడో చోట ఉండాలి కదా కలి పురుషుడిని అవును నియమం ప్రకారం ఇప్పుడు నేను నాదే సమయం నన్ను ఎక్కడ ఉండమంటావో చెప్పంటే మధ్యశాలలు జూదశాలలు మ్ స్త్రీలు అంటే వ్యభిచారం ఇలా నాలుగు చోట్లు చెప్పాడు ఇంకొక చోటు కూడా చెప్పమంటే బంగారం అని చెప్పాడట ఈ ఐదు చోట్ల కలి ప్రభావం ఉంటుంది.
(21:59) ఎక్కడ మధ్యశాల తాగాక కొట్టుకుంటారు అమ్మ నాన్న కొడుకు కూతురు ఏమి తెలీదు ఎవరిని ఏం చేస్తారో తెలీదు కలి ప్రభావం జూదశాల కాసేపు జూదం ఆడతారు తర్వాత మా అమ్మని పెడతా మా నాన్నని పెడతా మా తమ్ముడు అస్తి కూడా నేనే పెట్టేస్తా అంటారు. స్త్రీల వ్యవహారంలో కూడా అంతే అక్కడ అమ్మ నాన్న కొడుకు కూతురు బావి వరస ఏమి ఉండదు బంగారము అంతే ధనం డబ్బులో కూడా ఇంతే కలే ఉంటుంది విడిచిపెట్టేసాడు కలి ప్రభావం నిదానంగా ఈయన రాజ్యంలోకి ప్రవేశించింది కలిని ఈ నాలుగైదు చోట్ల ఉండమని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత ఈయన వేటకి వెళ్లి ఈ సైన్యం నుంచి ఒంటరి అయిపోయి ఒక సమీకమ మహర్షి ఆశ్రమం
(22:46) వైపుకి వెళ్ళాడు దాహంగా ఉంది మంచినీళ్లు కావాలని అడిగితే శమీక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన సమాధానం చెప్పల కలి ప్రభావానికి లోనైన పరీక్షిన్ మహారాజు ఏమిటి పాండవులకి మనోడు భగవంతుడి చేత కాపాడబడినవాడు కలి ప్రభావానికి లోనైపోయాడు లోనయి అక్కడ ఒక చచ్చిన పాము ఉంటే ఆ పాము ఎత్తి ఆ ఋషి గారి మెడలో వేసేసాడు సమీక మహర్షి మెడలో సమాధానం చెప్పలేదన్న కోపంతోటి అంతే వెళ్ళిపోయాడు ఈయన తపస్సు చేసుకుంటున్న తండ్రి మెడలో ఈ చచ్చిన పాముని చూసినటువంటి ఈయన కుమారుడైన శృంగి శమీక మహర్షి కుమారుడు ఎవరైతే నా తండ్రి మెడలో ఇట్లా చచ్చిన పామును వేసి
(23:31) అవమానించాడో వాడు తక్షకుడి కోపాగ్నికి బలి అవుతాడు అని శపించాడు ఏడు రోజుల లోపల అని ఏడు రోజుల లోపల తక్షకుడు కాటు వేయాల్సిందే ఇప్పుడు బ్రాహ్మణ శాపం ఎప్పుడైతే చెప్పబడిందో బ్రాహ్మణుడు ఒకడిని శపించాడు తక్షకుడు పేరు పెట్టాడు అంటే అది తక్షకుడికి ఆజ్ఞ అన్నమాట చేయాల్సిందే ఈ మెలుకు వచ్చిన సమీక మార్షి ఇది తెలుసుకుని ఎంత పని చేశవు ఆయన ఏం అలసటకి లోనయి ఈ పని చేశాడో మహానుభావుడు కాబట్టి దీన్ని మరల్చగలవా అంటే మరల్చలేడు శృంగి శాపాన్ని ఇవ్వగలదు కానీ శాపాన్ని మరల్చలేకపోయారు.
(24:07) మరల్చలేని వాడు అసలు శాపం ఇవ్వకూడదు కానీ నువ్వు ఈ పని చేశవు రాజుని హెచ్చరించమని వెంటనే అక్కడికి కబురు చేశారు. నువ్వు ఈ చేసిన ఈ పని వల్ల శమీక మహర్షి కుమారుడు నిన్ను శపించాడు ఏడు రోజుల లోపల నీకు తక్షకుడి కాటు అందుతుంది ఏడు రోజుల్లో నువ్వు మరణిస్తావు అప్పుడు ఆయన తను చేసిన పొరపాటు తెలుసుకున్నాడు దుఃఖంతో రాజ్యాన్ని త్యజించి అప్పటికి ఆయనకి నలుగురు కుమారులు ఉన్నారు.
(24:36) జనమే జేడు వాళ్ళలో మొదటివాడు కుమారుడికి రాజ్యం అప్ప చెప్పి గంగా ప్రవేశం చేద్దాం అనుకున్నాడు ప్రాయోపవేశం చేసేత అంతటి నేనే వెళ్ళిపోయి ఆ గంగా నది దగ్గరికి వెళ్ళిపోతాను అంటే అప్పుడు వచ్చిన ఋషులు వాళ్ళు భారద్వాజుని విశ్వామిత్రుని ఎంతమందో ఋషులు వచ్చారు ఈయన్ని చూడడానికి వస్తే అప్పుడు అడిగాడు నా ప్రాణం చివరికి వచ్చేసింది నా దశ ఈ చివరి రోజుల్లో నేను మోక్షం కోసం ఏం చేయగలను పూర్వం ఖట్వాంగుడు అనే ఒక రాజు దేవతలకి బోల్డ్ అంత యుద్ధంలో సహాయం చేశడట సహాయం చేస్తే వాళ్ళు నీకు ఏం కావాలో అడుగు నువ్వు ఏం కావాలంటే అది ఇస్తామ అన్నారట అయితే ఈయన ఏమన్నాట నాకుేం వద్దు మోక్షం
(25:10) కావాలి ఇంకా నాకు జీవన ప్రమాణం ఎంత ఉందంటే ఒక ముహూర్తం ఉందని చెప్పారు ఒక ముహూర్తమే ఆ ముహూర్త కాలంలో నువ్వు ఏం చేయతంటే నేను భగవత్ ధ్యానం చేసుకుంటానని ఆయన వెంటనే భూలోకానికి వచ్చేసి భగవధ్యానంతో ఒక ముహూర్త కాలం భగవత్ ధ్యానం తోటే మోక్షాన్ని పొందాడు అట్లా ఏడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ ఏడు రోజుల్లో నువ్వు భగవత్ ధ్యానం చేసుకోమని చెప్పాడు పారు పరీక్షిత్కి అదే సమయానికి భగవత్ ప్రేరితుడైనటువంటి సుఖమహర్షి అక్కడికి వచ్చాడు.
(25:39) వచ్చి ఈ రాజుని సంభావించి ఆయన ఎట్లాంటి వాడు అంటే వస్త్రాలు కూడా ధరించడు. సుఖమహర్షి మహాద్భుతమైనవాడు పుట్టుకతోటే జ్ఞాని చాలా గొప్పవాడు ఆయన తన తండ్రి దగ్గర విన్న భాగవతాన్ని నీకు భాగవతాన్ని చెప్తాను ఈ ఏడు రోజులఅని ఏడు రోజుల్లో మోక్షాన్ని ప్రసాదించాడు పరీక్షిత్కి ఏడు రోజులు అంటే మనకు ఉన్నవి ఏడు రోజులే చూడు ఆదివారం నుంచి శనివారం దాకా ఎన్ని రోజులు ఏడు రోజులు అంతే మన మరణం ఏడు రోజుల్లోనే కదా ఎవరికైనా జరిగేది సెవెన్ డేస్ కాదు ఈ సెవెన్ డేస్ లోనే ఏదో ఒక రోజు అవుతుంది అందుకని అదిఏ ఏ రోజైనా కావచ్చు కాబట్టి భగవద్ధ్యానాన్ని అలవరుచుకోవాలని చెప్తుంది
(26:17) భాగవతం ఆయన ఈ ఏడు రోజులు ఇతనికి బోధించారు మొత్తం భాగవతాన్ని తన తండ్రి ఎలా రాశారో యథాతథంగా అదేవిధంగా ఎన్నో రకాల గాధలు విష్ణు గాధలతోటి భాగవతోత్తముల గాధలతోటి ఈయనకి పరీక్షిత్తుకి తెలియజేశారు. పరీక్షిత్తుక సుఖమహర్షి తెలియజేసిన భాగవతాన్ని సూత మహాముని ఈ నైమిసారణ్యంలో ఉన్న అరణ్యాల్లో ఉన్నటువంటి మునులకి తెలియజేశారు ఆ గాధ మనం చెప్పుకుంటాం ఇందులో ఎన్నో రకాల గాథలు వస్తాయి ఇది దీని మొదటి భాగం మొదటి భాగం ఇక్కడి నుంచి వరుసగా ఒక్కొక్క స్కంధంలో ఏమేమి గాథలు ఉన్నాయో చెప్పుకుందాం మనం వినటానికి అంటే ఇన్ని కథలు ఉన్నాయా ఇంత తెలుసుకోవాల్సిన
(26:57) విషయం ఉందా అని అనిపిస్తా ఉంది రమ్మగారు వీళ్ళు వెంబడి మీరు అన్నట్లుగా ఒక సిరీస్ ప్రకారం ముందుకు తీసుకెళ్దాం అండి అలాగే నమస్తే నమస్తే నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్
(27:26) కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ
(27:58) డ్రీమ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక కొద్ది పడేసా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా ఊరికే నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను 6 లక్షలు కట్టా
(28:41) బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యాస్ డిఫికల్ట్ యస్ రైడింగ్ అట్ టైగర్

No comments:

Post a Comment