Monday, May 18, 2026

మీ పిల్లలను చూసి మిరే బయపడతున్నారా? || @sridevi_vlogs515

మీ పిల్లలను చూసి మిరే బయపడతున్నారా? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uLsON4pAWIY



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది పేరెంట్స్ పిల్లల్ని చూస్తే భయపడిపోతున్నారు. ఇది నిజమా కాదా మీ ఫ్యామిలీలో కూడా ఇలాగే జరుగుతుందా ఒక్కసారి వెనక్కి వెళ్లి మన ఇంట్లో ఏం జరుగుతుందో గుర్తు తెచ్చుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి అండి కన్న తల్లిదండ్రులే పిల్లలకి భయపడుతున్నారు. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అసలు కారణాలు ఏంటి? పిల్లల పెంపకంలో మనం ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాం ఇవన్నీ తెలుసుకుంటేనే దీనికి చిక్కుముడులు విడతాయన్నమాట ఒకప్పుడు తల్లిదండ్రులు క్రమశిక్షణగా పిల్లల్ని పెంచేవారు వాళ్ళ అండర్లో మనం ఉండేవాళ్ళం ఒక అరుపుకి గాని
(00:41) కేకకు గాని ఒక దెబ్బకు గాని ఒక చూపుకి గాని గజగజ వనికిపోయేవాళ్ళం భయపడిపోయేవాళ్ళం చెప్పాలంటే ఇది కూడా పోసేసేవారు పిల్లలు అంత క్రమశిక్షణగా పెంచేవారు మరి ఈ రోజుల్లో చూసుకుంటేనండి పిల్లలకే తల్లిదండ్రులు భయపడుతున్నారు అది చిన్న పిల్లలా పెద్ద పిల్లలా అని కాదు ఏ బిడ్డ అయినా సరే తల్లిదండ్రులని భయపెడుతున్నాడు. అందరూ ఇలా ఉన్నారా అంటే 90% ఇలాగే అన్నారు ఎవరో 10% పిల్లలు క్రమశిక్షణగా తల్లిదండ్రులకి భయపడుతూ పిల్లలు ఒల్లు దగ్గర పెట్టుకొని ఉంటారున్నమాట అసలు పిల్లలకి మనం ఎందుకు భయపడాలి తల్లిదండ్రులే భయపడితే మీ పిల్లలు సమాజాన్ని ఇంకెంత భయపడతారు సొసైటీని ఏం
(01:27) చేస్తారు ఒక ముక్కలో చెప్పాలంటే నాశనం చేస్తారు సైకోలా తయారవుతారు మరి తెలిసిందే కదా మీరు స్కూల్లో లో మాస్టర్ ని ఒక దెబ్బయనివ్వరు టీచర్ ని తిట్టనివ్వరు ఏమని అంటే పోలీస్ కంప్లైంట్స్ ఇస్తాం అంటారు ఇంటి దగ్గర ఒక దెబ్బయరు కొంతమంది క్రమశిక్షణగా పెంచుదామని చాలా ఆరాటపడుతూ ఒక సిస్టమాటిక్ లైఫ్ అలవాటు చేసినా కూడా మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉంటారండి గ్రాండ్ పేరెంట్స్ వాళ్లే చెడగొడుతూ ఉంటారు అతి గారాబం చేస్తారు బిడ్డని బిడ్డ అంటే ఆడ అవ్వచ్చు మగ అవ్వచ్చు ఇద్దరిని కలిపి చెప్తున్నా వాళ్ళని తిట్టినా కొట్టినా ముందు వీళ్లే వాళ్ళకి బోడి సలహాలు
(02:03) ఇస్తారన్నమాట నువ్వు తిడుతున్నావు వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఇంటికి రాడు పారిపోతాడు ఏ రైలు ఎక్కేస్తాడు ఊరు దాటేస్తాడు ఏ నూతిలోనో గూతులోనో దూకుతాడు ఆత్మహత్యలు చేసుకుంటారు సూసైడ్ చేసుకుంటారు అని చెప్పి ముందు వీళ్లే ఆ మాటలు అనటం పిల్లలకి ఇలా చేయండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు ఉంటదిన్నమాట ఇప్పుడున్న గ్రాండ్ పేరెంట్స్ కచ్చితంగా అలాగే మాట్లాడుతున్నారు వీళ్ళ వల్లే పిల్లలు జీవితాలు పాడవటానికి పునాదులు వేసుకుంటున్నాయి తల్లిదండ్రులు చాలా గొప్పగా పెంచుదాం అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ ప్రయత్నాలు కూడా విఫలం
(02:39) అవుతున్నాయి. మరి పెంపక విషయంలో అసలు పిల్లల్ని ఎంతవరకు మనం కేర్ చేయాలి ఎలాంటి పోకళలో పెంచాలి అసలు ఎంతవరకు ప్రేమను పంచాలో మనకి తెలిసి ఉండాలండి అదే మనం మిస్ అవుతున్నాం ఇక్కడే మనం దెబ్బ తింటూ వచ్చాం. మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ రీజన్ పిల్లలు పాడవ్వడానికి కారణం ఉమ్మడ కుటుంబాలు లేకపోవటం నెంబర్ వన్ రెండు వచ్చేసి భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోవటం ఇది రెండండి మూడు వచ్చేసి అతి గారాబాలు చేయటం ఇదివరకు గ్రాండ్ పేరెంట్స్ ఉంటే చాలా కేరింగ్ ఉండేది వాళ్ళ నుంచి మంచి మంచి మాటలు వినేవాళ్ళం కథలు వినేవాళ్ళం ఇన్స్పిరేషన్ స్టోరీస్
(03:23) వినేవాళ్ళం ఎలా చేయాలి చేయకూడదు ఉండేది తల్లిదండ్రులకి పానివండి బయటికి వెళ్తే గ్రాండ్ పేరెంట్స్ ఉండేవారు గ్రాండ్ పేరెంట్స్ బయటకి వెళ్తే తల్లిదండ్రులు ఉండేవారు అలా షిఫ్ట్ల వారిగా పిల్లలతో కూడా ఉండేవారు. ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి లేదు. మరి నెంబర్ టూ వచ్చేసి జాబ్ చేస్తూ మీరు వెళ్ళిపోతారు మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉండరు మీరు ఉంచుకోరు మీకు ఇబ్బంది వాళ్ళ ముసల వాసనే మీకు గిట్టదు.
(03:50) వీళ్ళఏం చేస్తారు బోర్ ఫీల్ అవుతుందని అడ్డమైన ఫ్రెండ్షిప్లు చేస్తారు చాటింగ్లు చేస్తారు 24 గంటలు ఫోన్లు మాట్లాడతారు కొంతమంది పిల్లలయతే న్యూడ్ గా అటువైపులకి వీడియో కాల్స్ ఇంకా దరిద్రాలు చెప్పనవసరంలే మరి ఇంత చండాలమైన రోజులు వచ్చేసినప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి మీరెందుకు అర్థం చేసుకోవడంలా డబ్బు వెనకాతలే పరిగెడుతున్నారు మరి మనం జీవించడానికి అంటే ఈ లైఫ్ లీడ్ చేయడానికి కష్టాలు తీరడానికి డబ్బు చాలా అవసరంఅండి కానీ అన్ని ప్రాబ్లమ్స్ కి డబ్బే కారణం కాదు కొన్ని కొన్ని కుటుంబంతో ముడిపడి ఉంటాయి కొన్ని వ్యక్తిత్వంతో ముడిపడి ఉంటాయి కొన్ని మన ఆత్మవిశ్వాసంలో ముడిపడి ఉంటాయి.
(04:34) మరి ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులని కొడుతున్నారు. కళ్ళతోనే భయపెట్టి ఇచ్చేస్తున్నారు స్కూల్ కి పంపడం కూడా అతి కష్టంగా ఉంది ఇంటి దగ్గర ఒక మాట అందాం అంటే భయం ఒక దెబ్బేద్దాం అంటే భయ్యం ఆడు ఏం చేసుకుంటాడో సూసైడ్ చేసుకుంటాడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా ఇవే పట్టుకుంటున్నారు. అతిగారాబాలు అబ్బరాలు కొడుకు పుడితే ఆమదంతో ఏదో కడిగారంట దీని వలన మీ లైఫ్ ఆఖరికి వచ్చేసరికి ఆశ్రమాల్లో ఉంటుంది ఏవండీ మనం మన మహాభారత ఇతిహాస రామాయణ గ్రంథాలని చదవలేదు సరే కదా మన పిల్లలకి వాటి పేర్లు కూడా తెలియకుండా పెంచుతున్నాం. రాముడు ఎవరో అని అడిగిన
(05:12) పరిస్థితి ఈరోజు మన దౌర్భాగ్యం గాంధారి 100 మంది కొడుకుల్ని గందే కౌరవులు 100 మంది అండి ఏమిటి ప్రయోజనం చరిత్రహీనులుగా మిగిలిపోయారు తల్లిదండ్రులు అదే పాండవులు ఐదుగురు కుంతీదేవి ఎంత క్రమశిక్షణగా సంస్కారంగా పెంచింది వాళ్ళ ప్లేస్ చరిత్రలో ఎలా ఉందో మీకు తెలుసు మరి పిల్లల్ని ఎందుకు కంటాం కడవరకు మనతో తోడుంటారని వాళ్ళ జీవితాన్ని చక్కబెట్టాలని వాళ్ళ చేతుల్లోనే కన్ను మూయ్యాలని మనం ఎంతో ఆశపడతాం వంశాభివృద్ధి జరగాలి కుటుంబం పేరు నిలబెడతాడు నా తర్వాత అన్ని వాడే చూసుకుంటాడు.
(05:51) ఈ రోజుల్లో అమ్మాయిలయితే అమ్మాయిలు ఆ బాధ్యతలు పట్టుకుంటారని తల్లిదండ్రులు చాలా నమ్మకంగా ఆశగా ఒక బిడ్డకి జన్మనిస్తారు. పునర్జన్మ తీసుకుంటున్న ఆ తల్లికి ఎంత పెయిన్ తీసుకొస్తున్నారో మీరు వృద్ధాశ్రమంలో పడేసి మీ అన్నీ పక్కన పెట్టండి మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం. ఇంతకీ పిల్లలకి ఎందుకు భయపడుతున్నారు అని నేను అడుగుతున్నా చాలామంది పిల్లలు ఇళ్లల్లో ఘోరంగా అరవటం కేకలేయటం బ్రహ్మ రాక్షసిలాగా అరవటం అన్నమాట ఏడుపులు పెడబొబ్బలు అన్ని వస్తువులు ఇసిరేయటం తల్లిని కొట్టడానికి రావటం తండ్రి మీద తిరగబడటం ఇంట్లోనుంచి వెళ్ళిపోవటం మగపిల్లలే కాదు సుమా ఆడపిల్లల
(06:28) పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్తున్నాను. వాళ్ళని చూస్తేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. వాళ్ళని చదివిస్తారు మంచి జాబులు వస్తాయి. మీకు స్కూల్ డేస్ కాలేజ్ డేస్ లోనే భయపడి చేస్తున్నారు. జాబులు వచ్చాక వీళ్ళ పరిస్థితి కుక్కక కన్నా హీనంగా తయారవుతుంది. కనీసం తిన్న కంచం క్లీన్ చేయరు. వీళ్ళు గదుల్లో కూర్చుని ఫ్రెండ్స్ తో మాట్లాడటం, లాప్టాప్ ముందు వేసుకొని కూర్చోవడం, ప్రపంచ విజేత లాగా పోజులు ఇచ్చేయటం, ఇల్లు మొత్తం నేనే నడుపుతున్నాను అని తల్లిని ఒక పనిమనిషిగా వాడుకోవటం తండ్రిని ఒక బంట్రోతుగా చూడటం ఇవే చేస్తున్నారు ఇప్పుడు చదువుకున్న పిల్లలు జాబ్ వున్న
(07:02) పిల్లలు. మరి ఇది ముందు ముందు ఎక్కడి వరకు వెళ్తది పిల్లలకి భయపడిపోయి ఏది వండమంటే అది వండుతున్నారు ఈవిడి ఈన ఇష్టాలు ఏమ లేవు కూరలు గాని టిఫిన్లు గాని ఈరోజు నువ్వు అది శనివారమా సోమవారమా శుక్రవారమా అని లేదు నాన్వెజ్ తినకూడదు అంటే వాళ్ళు వినరు ఈరోజు నాకు బిర్యానీ చేయాల్సిందే నాకు చికెన్ కావాల్సిందే ఇవే చెప్తున్నారు అదిరిచ్చి బెదిరిచ్చి తింటున్నారు తల్లిదండ్రులని భయపెట్టి ఇచ్చేస్తున్నారు పెళ్లిలు చేసుకోరు ఫ్రెండ్షిప్లు అంటారు లవ్లు అంటారు అక్కడ వరకు బానే ఉంటది.
(07:34) ఇల్లీగల్ అఫైర్స్ తర్వాత నాకు ఎక్కడో జాబ్ వచ్చిందని లివింగ్ రిలేషన్ అంటారు. ఈ తల్లిదండ్రులు భయపడి చేస్తున్నారు ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మర్యాద ఎవరో వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని వీళ్ళ పేరెంట్స్ ఏం మాట అంటారో బాబు బాగున్నామని పలకరించిన సరిగ్గా రెస్పెక్ట్ ఎవరో సమాధానం ఎవరో ఎంత గలేజ్ గా తయారయ్యారు. పిల్లలు ఇష్టమేనండి ఇంకా తల్లిదండ్రులు ఏమి లేదు ఒక కీలు బొమ్మల్లా వాడుకుంటున్నారు మర బొమ్మల్లాగా యూస్ చేస్తున్నారు అన్నమాట కేవలం తల్లిదండ్రులే అలా చేశారండి పిల్లల్ని అతి గారాభం అలాగే ఒకరితో ఒకరు పోల్చుకోవడం పక్క పిల్లలతో
(08:08) పోల్చుకోవడం బంధువుల పిల్లలతో పోల్చుకోవడం వాళ్ళకి ఎక్కడో సీట వచ్చిందని అనటం వీళ్ళకి ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనటం అదే లక్షలు లక్షలు నువ్వు కూడా తెచ్చుకో అని పోటాపోటీగా చదివించారు కానీ సంస్కారంతో పెంచలేదు నీలివెత్తు సంస్కారం అన్నదే నీ కుటుంబంతో పాటు నీతో పాటు ఈ సమాజానికి వెలుగునిస్తుందని మీకు తెలుసండి ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే నేను నిన్ను కనమన్నానా అసలు నువ్వు నన్ను ఎందుకు కన్నావ్ నేను నిన్ను చదివించమన్నానా నేను అడిగానా ఇవే చెప్తున్నారు మరి పిచ్చోళ్ల మీరు వింటున్నారు భయపడిపోతున్నారు ఇంకా కొట్టుకొని చంపుకునే పరిస్థితులు కూడా
(08:48) మనకు వచ్చేసినయి శ్రీకాకుళంలో ఒక అబ్బాయి తల్లిని తన స్నేహితుడితో కలిసి చంపేసాడంట మర్డర్ ప్లానింగ్ అమాట ఎందుకంటే తన ప్రేమ లేకలే బయటపడినయ అని తనుటెత్ చదువుతున్నాడు తల్లి వారించింది మంచి చెప్పాలని చూసింది ఎప్పటికప్పుడు మందలిస్తూ ఉంది దానికి కక్షపించేసుకొని ఏకంగా లేపేసాడు ఈరోజున నేను డాన్ అవ్వాలని చెప్పి ముందు నా తల్లినే చంపాను అంటున్నాడు.
(09:16) మరి పిల్లలు ఎంతవరకు వెళ్ళిపోయారు మరి సొసైటీ ఏమైపోద్ది వాడి వల్ల నీ కుటుంబానికి ముప్పు ఉన్నప్పుడు పక్కనోడికి ఎక్కడ రక్షణ ఉంది వాడు స్కూల్ కి వెళ్ళినాడు డేంజరే సొసైటీలో తిరిగినాడు డేంజరే రోడ్ల మీద ఇంకా వాడు బతకడం అనవసరం అన్నట్టు ఒక మృగంలా ఉన్నాడు నా సజెషన్ ఏంటంటే ఇదివరకు రోజుల్ని మనం ఫాలో అవ్వాలండి కచ్చితంగా లేకపోతే ముందు ముందున్న తరాలు చాలా డామేజ్ అయిపోతాయి అన్నమాట ఇదే పోకడ అనుకుంటున్నారు అంటే ఒక్కొక్క ఒక ఏరియాలో సంక్రాంతి ఒకలా చేస్తారు కొంతమంది ఇంకోలా చేస్తారు అలా వాళ్ళ ఇంట ఆచారాలు ఉంటాయి ఇది కూడా ఒక పండగ లాగా మీరు చేసే పద్ధతులు
(09:56) కూడా వాళ్ళు ఓహో ఇలాగే చేయాలనుకుంటా అని చెడినే ఫాలో అవుతున్నారు. మరి మన పూర్వకాలం నుంచి మన పెద్దలు గురుకులాల్లో ఒక వయసు ఎనిమిది పది ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లల్ని అడవుల్లో గురుకులాల్లో పడేసేవారు శ్రద్ధ బుద్ధులతో పాఠాలు నేర్పించేవారు ఎన్నో మంచి కథలు వినిపించేవారు దానితో పాటు విద్యని బోధించేవారు సంస్కారాన్ని నేర్పేవారు ఇవన్నీ ఇప్పుడు లేవు మరి మనం కూడా కొద్దో గొప్పో రామాయణ ఇతిహాస భాగవత గ్రంథాలు మహాభారతాలు ఇవన్నీ అన్నీ చెప్పాలండి మన రాజుల గురించి మన చరిత్రల గురించి మనవాళ్ళు తల్లిదండ్రులక ఇచ్చే విలువ గురించి గౌరవాల
(10:38) గురించి మనం చెప్పకపోతే నాశనం అయ్యేది ప్రతి తల్లితండ్రి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెక్కలు వస్తే పక్షి ఎగిరిపోయినట్టు ఈరోజు మీ బిడ్డలు ఎగిరిపోతున్నారు. మరి ఇక్కడైనా అది ఆపాలి. పల్లెటూరులు నిర్జీవంగా స్మసానంలో తయారవుతున్నాయి. ప్రతి ఊర్లో ముసలవాళ్ళ తప్ప పిల్లలు యంగ్ ఏజ్ వాళ్ళు ఎవ్వరూ ఉండట్లేదు అత్యాసలకు పోయి డబ్బు వెనకాతల పరిగెడుతూ ఆ సాఫ్ట్వేర్ జాబులు మోజుతో ఇంకా పెద్ద పెద్ద జాబులు పెద్ద పెద్ద చదువులు చెప్పనవసరం లేదు వీటి మోజు నేర్పొద్దు పిల్లలకి సంస్కారం నేర్పండి క్రమశిక్షణ నేర్పండి ఫామ బెత్తం పెట్టుకొని తాట తీయండి వాతలు తేలేటట్టు
(11:18) కొడితే గన మాట వింటారు స్కూళ్లలో కూడా మీరు కొట్టొద్దు అన్నారని చెప్పి టీచర్స్ ఇంకా ఇంకా వదిలేశరు. పోలీస్ కంప్లైంట్లు వస్తున్నాయి అని చెప్పి కూడా వాళ్ళు ఇంకా అదే సంది ఇదే సందని లెసన్స్ కూడా చెప్పడం మానేసారు. ఏదో బట్టి పట్టేస్తారు వీళ్ళక అప్ప చెప్పేస్తారు ఇంక మరి ఆ స్టూడెంట్ కి బతకడం ఎలా తెలుస్తుంది కొట్టేమన్నాను అని చెప్పి చంపేయకండి బాబు మళ్ళీ నాకు కామెంట్ల వర్షం గురుస్తది.
(11:43) తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు భయం చెప్పాలి ఆపాలి అది మొక్కై వంగనిదే మానై వంగుద్దా అని చెప్పి మా మాస్టర్ మాకు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు చిన్నతనం నుంచే మీరు ఆ కేరింగ్ తీసుకోవాలి ప్రతిదీ మంచి మాటలు చెప్పాలి ఎవరి మీద చెడు మాటలు చెప్పకోకూడదు బంధువుల గురించి మీ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఇంకా ఈర్షా ద్వేషాలు కక్కకూడదు వాళ్ళకి అసూయ నేర్పొద్దు ప్యూర్ హార్టెడ్ గా పెంచండి మంచి వ్యక్తిత్వాన్ని నేర్పండి మానవత్వాన్ని నింపండి ఇవే అసలైన ఆయుధాలు ఇవి ఒక్క రోజు వచ్చేసరికి అంటే మన బిడ్డలు పెద్దయి మనకి ఏజ్ అయిపోయేసరికి అది మనకి ఒక వృక్షంలా నీడని ఇస్తుందన్నమాట
(12:26) మరి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను ఎందుకంటే కన్న తల్లిదండ్రా అని కూడా వాళ్ళకి తెలియట్లేదు విచక్షణ జ్ఞానం లేకుండా ఎంత క్రూరంగా చంపుతున్నారో మరి ఏం గచచి చంత్రాలు అసలు మన భారతీయ సంస్కృతిలో ఇటువంటివి ఎప్పుడూ ఎన్నడూ మనం చూడలేదు కానీ మధ్యకాలంలో ఇవే చూస్తున్నాం. మరి తల్లిదండ్రులందరూ చాలా కేర్ఫుల్ గా ఉండండి పిల్లల్ని అను అనువు కనిపెట్టుకొని ఉండండి బాధ్యత తీసుకోండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి కోపం ఎప్పుడు చూపించాలి ప్రేమను ఎప్పుడు చూపించాలి అని మీకు తెలిసి ఉండాలండి ప్రేమ అన్నది మనిషిని దగ్గర
(13:05) చేస్తుంది ఎంత క్రూరంగా ఉన్న వాళ్ళనైనా మార్చుతుంది అన్నమాట మరి పిల్లలతో సమయం గడపండి వాళ్ళకి ప్రేమను పంచండి ఇద్దరు జాబులు చేయడం వలన మన ఇల్లు నడుస్తుంది ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇది కామనో ఇలా ఉండకపోతే బతకలాం బండి చక్రాలు నడవో ఏదో చెప్తారు కానీ అసలైన కుటుంబమే లేనప్పుడు పిల్లలే క్రమశిక్షణలో లేనప్పుడు సరైన దారిలో లేనప్పుడు ఆ పిల్లలే ప్రాణాలతో లేనప్పుడు మీరు ఎవరి కోసం సంపాదిస్తారు ఎవరికోసం కష్టపడతారు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
(13:37) దయచేసి పిల్లలకి ఎక్కడా లూజ్ ఇవ్వద్దు. మీరు ఎటువంటి తప్పులు వాళ్ళ ముందు చేయొద్దు మీరు స్ట్రిక్ట్ గా ఉంటేనే పిల్లలు ఉంటారు మీరే రోల్ మోడల్ అని పిల్లలకి గుర్తుపెట్టుకోండి. మరి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. మనమందరం ఇదివరకులా హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా మన పిల్లల్ని సనాతన ధర్మంలో మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎలా పెంచారో ఇటువంటి ఆచరణలోనే పెడతారని ఆశిస్తూ అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ

No comments:

Post a Comment