Sunday, May 17, 2026

ఈజిప్ట్ మమ్మీలకు మించి.. ఇండియాలో ఉన్న ఈ 'లివింగ్ మమ్మీ' గురించి మీకు తెలుసా?

ఈజిప్ట్ మమ్మీలకు మించి.. ఇండియాలో ఉన్న ఈ 'లివింగ్ మమ్మీ' గురించి మీకు తెలుసా?

Author Name:Sri Rama Jayam

Youtube Channel Url:https://www.youtube.com/@lalithakrishnashastry

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wWa2q_Ab3nw



Transcript:
(00:00) మీకు జ్ఞానోదయం అయ్యేంత వరకు ఉరికించి ఉరికించి ఉరికించి వెంటాడి మీకు ఉపదేశం చేస్తాం. ఎందుకు ఆ మమ్మీని దాచడం జరిగింది రామానుజ స్వామి వారి యొక్క విగ్రహాన్ని స్టిల్ శ్రీరంగ క్షేత్రంలో ఎందుకు ఉంచారు రామానుజ స్వామి వారి యొక్క విగ్రహానికి ఎందుకు సమాధి కట్టలేదు రామానుజ స్వామి వారికే ఎందుకు ఈ వింత ఆచారాన్ని ఆయనకి పెట్టడం జరిగింది.
(00:35) టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ కూడా చేశారు. వాళ్ళ వైపు నుంచి ఏదైతే ప్రశ్న వస్తుందో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా నమస్కారం నేను మీ లలిత కృష్ణ శాస్త్రిని అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు మరొక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు రావడం జరిగింది మన సనాతన వైదిక హిందూ ధర్మంలో ఏ వ్యక్తి అయినా కూడా పామరుడు నుంచి పండితుడు వరకు బ్రహ్మచారి నుంచి సన్యాసి వరకు ఎవరైనా తీసుకోండి హిందూ ధర్మంలో పరమపదిస్తే వారి వారి సంప్రదాయాలను అనుసరించి వాళ్ళకి ఉత్తరక్రియలు అనేటువంటిది చేయడం మన ధర్మంలో చెప్పబడినటువంటి విషయాలు
(01:22) కొంతమందికైతే ఖననం చేస్తారు కొంతమందికైతే దహనాది కార్యక్రమాలు చేస్తారు యతీశ్వరులు అయితే సమాధిలాగా కడతారు అక్కడికి వీళ్ళందరూ దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇలా ఒక్కొక్క ఆశ్రమంలో లో ఒక్కొక్క ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలన్నీ కూడా హిందువులకు వర్తిస్తాయి అని మనకి ఆపస్తంభ గృహ్య సూత్రము బోధాయన గృహ్య సూత్రము ఆశ్వలాయన గృహ్య సూత్రము అదేవిధంగా మాధ్యంజని శాఖలో ఉన్నటువంటి గృహ్య సూత్రాలు అవన్నీ చెబుతున్నాయి.
(01:54) ఇవన్నీ కూడా ఎవరికి హిందూ ధర్మంలో ఉండేటువంటి వ్యక్తులకు, గురువులకు, ప్రతి ఒక్కరికి కూడా ఇవే రూల్స్ అని చెప్తున్నాయి. ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. ఏమిటి ఆ విషయం అంటే మనకి ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అని మూడు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం కదా ద్వైతమునకు మధ్వాచార్యుల వారు చక్కగా ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయ మూర్తి అదేవిధంగా అద్వైతమునకు శంకరాచార్య స్వామి వారు ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయ మూర్తి అదేవిధంగా విశిష్టాద్వైతమునకు రామానుజ స్వామి వారు ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళబడినటువంటి మహనీయ మూర్తి
(02:37) ఈ మూడు సంప్రదాయాలలో ఇవే పద్ధతులు ఆచరిస్తూ వస్తూ ఉంటారు. కానీ విశిష్టాద్వైత సంప్రదాయం గనుక మీరు చూసుకున్నట్లయితే అవి క్రిస్టియన్ యొక్క టెస్టిమోనీస్ లాగా అన్ని అంటే ఇక్కడ కట్ చేసి అక్కడ అతికించి ఈ అతుకుల బొంతులాగా చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. నేను ఎందుకు మరీ ముఖ్యంగా ఈ విశిష్టాద్వైతం గురించి మాట్లాడుతూ ఉంటాను అంటే ఈ విశిష్టాద్వైతులకు ఒకటే బాధ అద్వైతులను చూస్తే ఏ విధంగా అయితే రాక్షసులకి విష్ణుమూర్తిని చూస్తే ఇబ్బంది కలుగుతుందో ఈ విశిష్టాద్వైతులకు అద్వైతులను చూస్తే ఇబ్బంది కలుగుతుంది ఎప్పటికైనా ఈ అద్వైతుల వలనే మనకి ప్రాబ్లం ఈ
(03:22) అద్వైతులు గనుక ఉండినట్లయితే ఈ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ఖండిస్తారు కూకటి వేళ్ళతో నిర్మూలనం చేసేటువంటి శక్తి జ్ఞానం వాళ్ళకు ఉన్నది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందుకనే ఆ విశిష్టాద్వైతులు ఉదయాన్నే లేస్తే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మన గురువులను వక్రీకరిస్తూ అవమాన పరుస్తూ ఇష్ట రీతిన మాట్లాడుతూ ఉంటారు.
(03:48) ఆ అద్వైత సంప్రదాయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అవమాన పరుస్తూ ఉంటారు. అనరా అనేటువంటి మాటలు అంటూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదండీ చెప్పకపోతే నువ్వు చేస్తున్న తప్పు అని ఎవరికీ తెలుస్తుంది ఎవరికీ తెలియదు అందుకనే ఆ విశిష్టాద్వైతులకి అప్పుడప్పుడు వాతలు పెడుతూ ఉండాలి అంటే వాళ్ళ వాతలు పెట్టుకోవడం వాళ్ళకి కొత్త ఏం కాదు వాళ్ళ వాతలు నొప్పి కలగవు కదా మనం పెట్టేటువంటి వాతలు కొంచెం చిక్కుమనేటట్టుగా ఉంటాయి.
(04:16) సరే విషయంలోకి వెళ్దాం. ఈ రామానుజ స్వామి వారు ఈ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రత్యేకంగా చాలా గొప్పగా ముందుకు తీసుకొచ్చారు అని వాళ్ళ వాళ్ళ గ్రంథాలలో వాళ్ళ ఆచార్యులు వారు చక్కగా చెప్తూ వస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటిది కట్టారు వాళ్ళ ఆచార్యుల వారిని వాళ్ళు గొప్పగా అర్చిస్తూంటారు కీర్తిస్తూ ఉంటారు దాన్ని మనం గౌరవించాలి ఎందుకంటే ఏ మతంలో ఉన్న ఆ మత సంప్రదాయాలను విశ్వాస మనం గౌరవించాలి.
(04:48) అందుకని వాళ్ళు విశిష్టాద్వైతము ఆ మత ఆచార్యుల వారిని మనం గౌరవించాలి మనం ఎట్లాగైతే క్రిస్టియన్స్ ను గౌరవిస్తున్నామో ఎట్లాగైతే ముస్లిమ్స్ ను గౌరవిస్తున్నామో అదేవిధంగా మనం విశిష్టాద్వైతులను కూడా గౌరవించాలి తప్పేమీ లేదు కానీ ఆ విశిష్టాద్వైతులు మాత్రం మన ఆచార్యుల వారిని ఉదయాన్నే లేస్తే హీనాతిహీనంగా మాట్లాడుతుంటారు వాళ్ళకి కనువిప్పు కలగాలనే ఈ వీడియో చేయడం జరుగుతున్నది.
(05:16) ఈ రామానుజ స్వామి వారు 120 సంవత్సరాలు జీవించారు అని చెప్తారు ఈ జీవించి ఉన్నంత కాలము కూడా రకరకాలుగా టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ కూడా చేశారు శ్రీకూర్మ క్షేత్రం నుంచి ప్రారంభం చేసి అనేక రకాలుగా వారు చేసినట్టుగా చరిత్రలన్నీ మనకు చెప్తున్నాయి శ్రీరంగ పట్టణానికి వచ్చారు మైసూరు దగ్గర అక్కడ అంగుష్ట మాతృ పురుషుడైనటువంటి విష్ణువుని దర్శించుకున్నట్టుగా అక్కడ మళ్ళా సన్యాసాశ్రమం స్వీకరించినట్టుగా ఇలా [గురకలు] రకర రకాల కథలు ఉన్నాయి అవన్నీ కథలు చెప్పుకుంటూ వస్తాం అంటే ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఏదైతే ప్రశ్న వస్తుందో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా
(05:52) అన్ని ఈరోజే చెప్పుకుంటే ఎలా కాబట్టి వాళ్ళకి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నది ఏమిటంటే శ్రీరంగంలో రంగనాథుడి యొక్క దేవాలయంలో అందరికీ తెలిసిందే కదండీ శ్రీరంగ క్షేత్రం 108 దివ్య దేశాలలో ప్రముఖమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రంలో ఇప్పటి టికి రామానుజ స్వామి వారి యొక్క విగ్రహానికి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారని అనేక రకాలుగా వాళ్ళ ఆచార్యుల వారు చెప్పారు.
(06:22) నేను చెప్తున్నటువంటి మాటలు కాదు వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టుకునేటువంటి ఫ్లయర్స్ లో కూడా ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి రామానుజ స్వామి వారి యొక్క విగ్రహాన్ని పెడుతూ ఉంటారు వాళ్ళు ఇక్కడ నాకు సందేహం వచ్చేది ఏమిటంటే మనం ఈజిప్ట్ లో ఎవరైనా పరమపదిస్తే వాళ్ళు ఒక పెట్టెల్లో పెట్టి మమ్మీలుగా తయారు చేసి చేసుకునేటువంటి సంప్రదాయం ఉన్నది మనం చూస్తూనే ఉంటాం చాలా సినిమాల్లో కూడా వచ్చింది.
(06:44) హిందూ సంప్రదాయంలో అది లేదు కదా హిందూ సంప్రదాయంలో ఎవరైనా ఒకళ్ళు పరమపది ఇస్తే వాళ్ళకి ఘనన చేయటమో లేకపోతే దహనం చేయటమో సమాధి చేయటమో ఏదో చేస్తూ ఉండేవాళ్ళు కానీ రామానుజ స్వామి వారి యొక్క విగ్రహాన్ని స్టిల్ శ్రీరంగ క్షేత్రంలో ఎందుకు ఉంచారు రామానుజ స్వామి వారి యొక్క విగ్రహానికి ఎందుకు సమాధి కట్టలేదు రామానుజ స్వామి వారికే ఎందుకు ఈ వింత ఆచ ఆచారాన్ని ఆయనకి పెట్టడం జరిగింది ఇదే నేను ప్రశ్నించాలనుకుంటున్నాను.
(07:19) విశిష్టద్వైతులారా ఒకసారి మీరు చూడండి వినండి మీ గురువుగారి యొక్క విశిష్టమైనటువంటి సంప్రదాయం గురించి ఎందుకు మీరు రామానుజ స్వామి వారి యొక్క పార్థివ దేహాన్ని స్టిల్ పూజిస్తూ వస్తున్నారు? ఇక్కడ చాలా క్వశ్చన్లు ఉన్నాయి ఏమిటి ఆ క్వశ్చన్లు అంటే హిందూ కల్చర్ లోనే ఉన్నారా లేదా రామానుజ స్వామి వారు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ మమ్మీ సంప్రదాయం అనేటువంటిది హిందువులకు లేదు ఈజిప్ట్ లో ఉన్నవాళ్ళు చేస్తున్నారు కాబట్టి వారి యొక్క పార్థివ దేహానికి స్టిల్ ఏదో కొన్ని మూలికలు రాస్తూ ఎందుకు భద్రపరిచారు ఎందుకు దాన్ని ఆరాధనగా ఉంచుకుంటున్నారు దాని వెనకాల ఉన్నటువంటి
(08:05) ఆంతర్యం ఏమిటి బయట బయటకు వచ్చి చెప్పండి అందరు వింటారు ఎందుకు ఆ మమ్మీని దాచడం జరిగింది ఆ మమ్మీ వెనకాల ఏమైనా రహస్యాలు ఉన్నాయా ఆ మమ్మీ గురించి ఎవరైనా పోట్లాడుకుంటున్నారా ఆ మమ్మీ విశిష్టాద్వైతంలో వడగలైకి సంబంధించినదా తెంగలైకి సంబంధించిందా బాధ కలుగుతుంది కదా ఆ పెయిన్ మీకు రావాలి మా ఆచార్యుల వారిని అన్నప్పుడు ఆ పెయిన్ మాకు రాదా ఆ పెయిన్ గుర్తుపెట్టుకోండి ఆ పెయిన్ యొక్క లక్షణాలు అనుభవించి నెక్స్ట్ వీడియో చేసే ముందు నెక్స్ట్ పోస్ట్ పెట్టే ముందు ఆలోచించుకోండి మీకు ఆ పెయిన్ రావాలి అందుకనే చేస్తున్నాను నేను అది మీకు పురాణాలలో ఉన్నటువంటి ఒక కథ చెప్పాలని
(08:48) ఉన్నది నాకు ఒకసారి సనత్ కుమారులు అంటారు కదా సప్తవగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు నిత్యము సమాధి స్థితి బ్రహ్మ గురించి అంటే ఆ పరమాత్మ గురించి తపించేటువంటి మహనీయ మూర్తులు ఋషులు వాళ్ళు వారు ఒకసారి వైకుంఠ దర్శనం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులైన జయ విజయులు వారిని లోపలికి అనుమతించలేదు.
(09:15) ఆ శరత్ కుమారులు జయ విజయులు ఇద్దరిని కూడా శపించారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీని నేను పూర్తిగా చెప్పక్కర్లేదు కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా ఒక పై పైన చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఏమని శపించారు అంటే మీరు భూలోకంలో జన్మించండి అని శపించారు అప్పుడు విష్ణుమూర్తే సాక్షాత్తు వైకుంఠం లోపలి నుంచి బయటికి వచ్చి సనత్ కుమారుల దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి వారిని పంపించిన తర్వాత జయ విజయులను అడుగుతారు మీరు నా మీద అమితమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఉంటూ నా భక్తులుగా జీవించి ఏడు జన్మలు ఎత్తి తిరిగి వైకుంఠానికి వస్తారా లేదా నా మీద వైరంతో మూడు జన్మల ఎత్తి నా దగ్గరికి వస్తారా అని వాళ్ళకి ఒక శాపం
(10:03) యొక్క విమోచనం విషయం చెప్తారు అప్పుడు వాళ్ళు స్వామి ఏడు జన్మలు అంటే చాలా కష్టము మిమ్మల్ని వదిలి మేము ఉండలేము కాబట్టి మేము మీకు వైరంగా ఉన్న మూడు జన్మల్లోనే వస్తామని చెప్పి తీసుకుంటారు వాళ్లే మనకి హిరణ్యాక్షుడు హిరణ్య కశుపుడు రావణ కుంభకర్ణులు తర్వాత శిశుపాలుడు దంతవక్త్రుడులాగా జన్మించారు మనకి పురాణ గ్రంథాలన్నీ చెప్తున్నాయి.
(10:26) ఈ స్టోరీ అందరికీ తెలిసిందే దీంట్లో ఉన్నటువంటి మర్మం గుర్తించండి జయ విజయులు అనేటువంటి వాళ్ళు సాక్షాత్తు భగవంతుడి దగ్గర పరమాత్మ దగ్గర విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు పరమాత్మ దగ్గర ఉండాలంటే వాళ్ళు ఎంతో తపోనిష్ఠులై ఉండాలి కదా ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి కదా అటువంటి వాళ్ళు ఒక మునులను ఎలా అవమానించడం జరుగుతుంది ఆ మాత్రం తెలియదా వాళ్ళకి మునులనే మనం అవమానిస్తే శపిస్తారు అని తెలిసే చేశారు అదేవిధంగా నిత్యము సమాధి స్థితిలో ఉండేటువంటి మునులు సత్వగుణ ప్రధానమైనటువంటి మునులు పరుష పదజాలం వాడనటువంటి మునులు ఆ మునులు కూడా ఎందుకు జయ విజయులను శపించవలసి వచ్చింది
(11:09) వాళ్ళు తప్పు చేశారు ఈయన తప్పు చేశారు ఒక రకంగా చూస్తే అప్పుడు పరమాత్మే వైకుంఠం నుంచి బయటకు వచ్చి ఇద్దరు తప్పులు చేశారు కాబట్టి ఇద్దరికీ కూడా లోపలికి ప్రవేశం లేదు అని ఆయనే బయటకు వచ్చి ఇద్దరిని ఊరడింపు చేసి పంపించేశారు ఇది గుర్తుపెట్టుకోండి ఇద్దరు తప్పు చేశారు కాబట్టి లోపలికి ప్రవేశం లేదు. అంటే రామానుజ స్వామి వారు తప్పు చేశారు కాబట్టే వాళ్ళకి వైకుంఠ లోకంలోకి ప్రవేశింప చేయడానికి అర్హత లేదు అని ఇక్కడ పెట్టేసారా అట్లా తీసుకోవచ్చా లేదు అంటే శరీరంలో ఒక అవయవం గనుక కోల్పోయినట్లయితే శరీరంలో ఇబ్బంది కలిగినట్లయితే వాళ్ళకి దహన కార్యక్రమాలకు
(11:49) సమాధి స్థితికి నోర్చుకోలేరు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే మీరు ఇట్లా భుజాలకి వాతలు పెట్టుకోవడం వల్ల అటువంటి ప్రాబ్లం వచ్చింది అనుకోవచ్చా ఏమనుకోవచ్చో మీరే ఆలోచించుకోండి నేను క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తున్నా మీరు రియలైజ్ అవుతారని ఇంకా మాట్లాడుతాము ఇంకా చేస్తామంటే మా దగ్గర తండోప తండాలుగా పుంఖానుపుంకాలుగా ఉన్న మీ చరిత్రలు తెల్లచీరల గురించి మల్లెపూల గురించి గాజుల గురించి ఇ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఒక్కొకటి బయటకి తీస్తాం తస్మాత్ జాగ్రత్త ఇది వార్నింగ్ అనుకోండి ఏమైనా అనుకోండి ఇంకొక్కసారి మా శంకరుల జోలికి వస్తే మా
(12:34) గురువుల జోలికి వస్తే మా యొక్క ప్రతిఘటన ఇలాగనే ఉంటుంది మీకు జ్ఞానోదయం అయ్యేంతవరకు ఉరికించి ఉరికించి ఉరికించి వెంటాడి మీకు ఉపదేశం చేస్తాం జై శ్రీరామ్ ఆ

No comments:

Post a Comment