*దానం, విరాళం, సంతర్పణ భేదాలు చెప్పగలరు.?*
దానం అంటే ఉచితంగా ఇవ్వడం.
విరాళం అంటే విరివిగా పెద్దమొత్తం ఇవ్వడం,
సంతర్పణ అంటే భోక్తకు బాగా తృప్తిగా భోజనం పెట్టడం —అని ఈ పదాలకు నేటి సామాన్య అర్థాలు.
ఈ మూడూ సంస్కృత పదాలే.
దానం మూడు రకాలు అంటుంది భగవద్గీత. (శ్రద్ధాత్రయ విభాగ యోగం )
సాత్విక దానం — ప్రతిఫలం ఏమీ అపేక్షించకుండా ఇవ్వడం నా కర్తవ్యం అనే బుద్ధితో ఇవ్వడం. కీర్తి , గౌరవం కూడా కోరకుండా ఇచ్చేది .
రాజస దానం — నలుగురూ తనను పొగడాలి. తన పేరు చెప్పుకోవాలి అని అహం తో ఇచ్చేది. ఇచ్చినట్లు బోర్డ్లు వ్రాయించుకోవడం, ప్రకటనలు ఇచ్చుకోవడం ఈ రకం దానం.. ప్రతిఫలం అపేక్షిస్తూ ఇచ్చేది రాజసదానం.
పాప పరిహారంగా ఇచ్చేదీ ఈ కోవలోకే చేరేదే.
తామస దానం:— దొంగ తన దొంగసొమ్ము ఇతరుల దగ్గర పెట్టడం. ఒకరి వినాశం కోరుతూ ఇచ్చేది. అది అతడి దగ్గర చేరి అతణ్ణి నాశనం చేయాలి అని ఇచ్చేది. తనకు పనికిమాలినది మరొకరికి ఇవ్వడం ఈ కోవకు చెందిన దానం.
విరాళం— అంటే చందా..
ఒకరి మేలుకోరి/ ఒక సంస్థ కోసం ఇచ్చేది.. ఇది సాత్విక దానంలో చేరుతుంది.
సంతర్పణం అంటే చక్కగా తృప్తి పరచడం.
ధన కనక వస్తు వాహనాదులు యథాశక్తి ఇచ్చి *ఇక చాలు* అని అనేట్టు ఇవ్వడం సంతర్పణ.
No comments:
Post a Comment