Monday, May 18, 2026

 *ఈ ఆర్టికల్ అస్సలు మిస్ అవకండి.. చిరాకు, కోపం, ఇరిటేషన్ ఎక్కువగా ఉండే వాళ్లకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్* 
(ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)
(ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ (TCM) మీద నేను చాలా కాలంగా స్టడీ చేస్తున్నాను, నా వ్యక్తిగత అవసరాలకు వాడుతూ ఉంటాను. దాని ప్రకారం వీలు వెంబడి వివిధ లక్షణాలను డిస్కస్ చేస్తాను.)

కొంతమందికి టివిలో సౌండ్ అన్నా చిరాకు వస్తుంది, ఎవరైనా పెద్దగా మాట్లాడినా కోపం వస్తుంది. అన్ని సందర్భాల్లో ఉండదు కానీ కొన్నిసార్లు ప్రతీ ఒక్కరూ ఇది ఫేస్ చేస్తూ ఉంటారు.

 మిరపకాయ, ఆనియన్, గార్లిక్, పచ్చళ్లు, వేపుళ్లు, ఇతర బాగా వేడిగా, స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను తిన్నప్పుడు శరీరం లోపల వేడి ఉత్పత్తి అయి, Yinని ఆవిరి చేస్తుంది. అలాగే ప్రాణ శక్తి తల వైపు నెట్టబడుతుంది. దీంతో మైండ్ చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, విపరీతంగా టీ తాగడం వల్ల TCM ప్రకారం Heart Fire ఓవర్ యాక్టివ్‌గా తయారై  అది కాస్తా అడ్రెనల్ గ్రాండ్‌ని స్టిములేట్ చేసి, నాడీ వ్యవస్థ అశాంతిగా తయారవడానికి కారణం అవుతుంది. పేస్ట్రీలు, స్వీట్స్, వైట్ బ్రెడ్ వల్ల శరీరంలో గ్లూకోజ్ త్వరగా విడుదలై లివర్ - స్పీన్ యాక్సెస్ మీద వత్తిడి పెంచి మూడ్ స్వింగ్స్‌కి కారణం అవుతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకునే వారికి నేరుగా లివర్ హీట్ పెరిగి, మరుసటి రోజు ఉదయం లివర్ ఫైర్ రీబౌండ్ అవుతుంది.

జీర్ణ శక్తి తక్కువగా ఉన్న వారు మటన్ తీసుకుంటే Yang హీట్ అయి, దాని వల్ల శరీరంలోని నీరు వేడిగా ఉండే బాత్రూమ్‌లో ఎలాగైతే అద్దంపై నీరు ఆవిరిగా పేరుకుంటుందో అలా damp heat తయారై ఈ ఇరిటేషన్ సమస్యలు వస్తాయ.

అలాగే రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అయ్యే ప్రక్రియను అడ్డుకున్న వాళ్లం అవుతాం. దాంతో shen సెటిల్ అవలేక సమస్య వస్తుంది. 

మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. దోసకాయ, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, బ్రౌన్ రైస్, బార్లీ, మిల్లెట్స్, చల్లటి నీళ్లు కాకుండా గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడం వల్ల మెల్లగా ఈ సమస్య తగ్గుతుంది.

లైఫ్ స్టైల్ విషయానికి వస్తే చాలామంది అర్థరాత్రి వరకూ ఫోన్లు వాడుతున్నారు. నైట్ 10 తర్వాత ఫోన్ వాడితే, TCM ప్రకారం లివర్ బ్లడ్, Yin బర్న్ అవుతాయి. దీంతో Heart Fire రిలాక్స్ అవలేదు. ఎలాంటి ఎక్సర్‌సైజ్ లేకుండా గంటల తరబడి కూర్చున్నా కూడా Qi స్టాగ్నేషన్ ఏ్పడి, ఎమోషన్స్ బ్లాక్ అవుతాయి, దీంతో ఇరిటబులిటీ పెరుగుతుంది.  కొంతమంది బరువు తగ్గాలని భోజనం మానేస్తూ ఉంటారు. మరికొంత మంది ఇష్టమొచ్చిన టైమ్స్ లో ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇలా టైమింగ్స్ లేకపోవడం వల్ల Spleen మెరీడియన్ బలహీనపడి, ఆహారం సరిగా శక్తిగా మార్పిడి జరగక, శరీరంలో అరగని ఆహారం వల్ల dampness పెరిగి ఇరిటబులిటీ పెరుగుతుంది, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్లకూడా గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి చిరాకు పెరుగుతుంది.

ప్రాణాయామం వంటి శ్వాస క్రియలు ఏమీ చెయ్యకపోవడం వల్ల, కనీసం ధ్యానం వంటి వాటితో నిశ్శబ్ధంగా కూర్చోవడం చేయకపోవడం వల్ల నిరంతరం.. ఏదో ఒకటి చూస్తూ వింటూ నెర్వస్ సిస్టమ్ ని ఓవర్ స్టిములేట్ చెయ్యడం వల్ల Shen విపరీతంగా బయటకు వెదజల్లబడి, మొహం పాలిపోతుంది, ప్రాణశక్తి లోపిస్తుంది, గ్రౌండింగ్ మిస్ అవుతుంది. దీంతో ఇరిటబులిటీవస్తుంది. 

ఇన్ స్టా రీల్స్ వంటివి ఎక్కువగా చూడడం వల్ల వెంట వెంటనే డోపమిన్ విడుదల అవుతూ అది TCM ప్రకారం Liver Wind, Heart Fire అనే సమస్యలు పెంచుతుంది. అలాగే కొంతమంది తరచూ పొలిటికల్ డిబేట్స్ లో కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటూ సంఘర్షణలో ఉంటుంటారు. ఇది Liver Qiని స్టిములేట్ చేసి, మెంటల్ హీట్‌ని పెంచుతుంది. 

కొంతమంది అదే పనిగా ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, వీడియోలు చూస్తుంటారు. ఒకళ్లు చెప్పేది ఒకలా, మరొకళ్లు చెప్పేలా ఒకలా ఉండేసరికి, ఈ కాన్సెప్టులలో ఏది నిజం అనే ఆలోచనలు నిరంతరం మైండ్‌లో ఓవర్ స్టిమునేషన్ సృష్టిస్తాయి. దీనివల్ల తలలో సూడో Yang పరిస్థితి ఏర్పడి, చివరకు చిరాకు ఫ్రస్టేషన్ వస్తాయి.

అందుకే సాయంత్రం 6 తర్వాత అనవసరమైన డిస్కషన్స్, ఓవర్ థింకింగ్, రీల్స్ వంటివి చూడడం, స్క్రీన్ టైమ్ తగ్గించాలి. అలాగే నేను చెప్పినట్లు ఆహార పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.       -నల్లమోతు శ్రీధర్                            

No comments:

Post a Comment