Sunday, May 17, 2026

ఆడవారిలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఏ మగడైనా ఇష్టపడతాడు

ఆడవారిలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఏ మగడైనా ఇష్టపడతాడు

Author Name:Telugu Genics

Youtube Channel Url:https://www.youtube.com/@teluguGenics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Q-DjQcnsKUw



Transcript:
(00:05) [సంగీతం] స్త్రీ జీవితంలో భర్త అనేవారు కేవలం ఒక మనిషి కాదు ఒక నమ్మకం ఒక భద్రత ఆమె మనస్సు అనుకొని నిలబడే ఒక నీడ కానీ అదే భర్త ఆమెను అర్థం చేసుకోకపోతే ఆమె కన్నీళ్ళను చిన్న చూపు చూస్తే ఆమె ప్రేమను అలవాటుగా తీసుకుంటే అప్పుడు ఆ స్త్రీ జీవి జీవితం నరకం కంటే బాధాకరంగా మారిపోతుంది. ఇలాంటి భర్తతో జీవించడం ప్రతిరోజు ఒక యుద్ధంలా ఉంటుంది.
(00:39) ఒక స్త్రీ బయటకు నవ్వుతూ కనిపించొచ్చు కానీ లోపల మాత్రం నిశ్శబ్దంగా నలిగిపోతూ ఉంటుంది. భర్త కోపంగా మాట్లాడితే ఆమె తన తప్పేమిటో వెతుక్కుంటుంది. భర్త పట్టించుకోకపోతే నాలో ఏమి తక్కువ అని తననే తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. ఆమెకు కావలసింది పెద్ద పెద్ద బహుమతులు కాదు కొంచెం ప్రేమ కొంచెం గౌరవం నువ్వు బాగున్నావా అని అడిగే ఒక చిన్న మాట కానీ కొంతమంది భర్తలు స్త్రీ మనసు ఎంత సున్నితమో అర్థం చేసుకోరు భార్య చేసిన ప్రతి పనిలో తప్పులే వెతుకుతుంటారు ఆమె అలసటను గుర్తించరు ఆమె మౌనాన్ని పట్టించుకోరు ఇంటి కోసం పిల్లల కోసం భర్త కోసం తన జీవితాన్నే అర్పించిన స్త్రీ
(01:17) మూర్తికి చివరికి దక్కేది నిర్లక్ష్యం అయితే ఆ బాధను మాటల్లో చెప్పలేం ఇలాంటి భర్తతో ఉన్న స్త్రీ చాలాసార్లు ఏడవాలనిపించినా ఏడవలేదు. ఎందుకంటే ఆమె కన్నీళ్ళను కూడా ఎవరు అర్థం చేసుకోరని తెలుసు ఆమెకు భర్తతో మాట్లాడాలని ఉంటుంది కానీ ప్రతి మాట గొడవగా మారిపోతుంది. ఆమె ప్రేమగా దగ్గర కావాలనుకుంటుంది కానీ అతని నిర్లక్ష్యం ఆమెను మళ్ళీ ఒంటరిగా చేస్తుంది.
(01:44) కొంతమంది భర్తలు భార్యను కేవలం బాధ్యతగా మాత్రమే చూస్తారు. ఆమెకు భావాలు ఉంటాయని మర్చిపోతారు. భార్య కూడా అలిచిపోతుంది. భార్య కూడా బాధపడుతుంది. భార్య కూడా ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. కానీ ఇవన్నీ గుర్తించని భర్తతో జీవించడం ఒక స్త్రీకి నిజంగా చాలా కష్టం. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఆమె బయట వాళ్ళకి ఏమి చెప్పలేదు ఎందుకంటే సమాజం ఎప్పుడూ ఒకటి చెబుతుంది భర్త అంటే అలానే ఉంటారు భరించాలి.
(02:14) అలా భరిస్తూ భరిస్తూ చాలా మంది స్త్రీలు తమ నిజమైన ఆనందాన్ని కోల్పోతుంటారు. ఒకప్పుడు నవ్వుతూ ఉండే ఆమె నిశశబ్దంగా మారిపోతుంది. తనకి ఇష్టమైన విషయాలు కూడా మానేస్తుంది. తన మనసు చనిపోతున్న ఇంటిని కాపాడటానికే బ్రతుకుతుంది కానీ ప్రతి స్త్రీ గుర్తించుకోవలసిన విషయం ఒకటి ఉంది. ప్రేమ అంటే భయం కాదు, ప్రేమ అంటే అవమానం కాదు. ప్రేమ అంటే మనస్సును విరిచేయడం కాదు.
(02:36) నిజమైన భర్త భార్య తప్పులను మాత్రమే చూడడు. ఆమె బాధను కూడా అర్థం చేసుకుంటాడు. ఆమె మౌనంగా ఉన్నా ఏమైంది అని అడుగుతాడు. ఆమె అలసిపోయినా నేను ఉన్నాను అని భరోసా ఇస్తాడు. ఎందుకంటే ఒక స్త్రీకి ప్రపంచం మొత్తం అవసరం లేదు. తన మనసును అర్థం చేసుకునే ఒక మనిషి చాలు. ఇలాంటి భర్త దొరికితే ఆమె జీవితం స్వర్గంలా మారుతుంది కానీ అర్థం చేసుకొని భర్తతో జీవిస్తే ఆమె ప్రతి రోజు నిశ్శబ్దంగా కన్నీళ్లు మింగాల్సిందే కాబట్టి ప్రతి భర్త ఒక విషయం గుర్తుంచుకోవాలి భార్యను ప్రేమించడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు ఆమె మనస్సును గౌరవించడం ఆమె భావాలను వినడం ఆమె
(03:16) ఒంటరితనాన్ని అర్థం చేసుకోవడం ఎందుకంటే ఒక స్త్రీ బయట ఎంత బలంగా కనిపించినా ఆమె హృదయం ప్రేమ కోసం మాత్రమే కొట్టుకుంటుంది ఆ ప్రేమను తన భర్త దగ్గరే వెతుకుతుంది అందుకే భార్యను నిర్లక్ష్యం చేయకూడదు ఆమె మౌనాన్ని చిన్నచూపు చూడకూడదు ఎందుకంటే ఒకసారి ఆమె మనసు పూర్తిగా విరిగిపోతే మళ్ళీ అదే ప్రేమ నవ్వడం చాలా కష్టం ఒక ఇంటిని స్వర్గంలా మార్చేది ప్రేమతో కూడిన భర్త.
(03:46) కానీ అదే భర్త ప్రవర్తన విషయంలో మారితే ఆ స్త్రీ జీవితం నెమ్మదిగా నరకంగా మారుతుంది. భార్య బయటకు నవ్వుతూ కనిపించవచ్చు కానీ లోపల ప్రతి రోజు కొట్టుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని గాయాలు శరీరంపై కాదు మనస్సు పై పడతాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి భర్తతో స్త్రీకి ఎందుకు చాలా కష్టం వస్తుంది అనే విషయం గురించి. ఒక స్త్రీ పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె కేవలం ఒక మనిషిని కాదు ఒక జీవితాన్ని నమ్ముతుంది తన బాధలను పంచుకునే వ్యక్తి దొరికాడు అని భావిస్తుంది కానీ అదే వ్యక్తి తన కన్నీళ్లకు కారణం అయితే ఆమెకు ప్రపంచమే భారంగా అనిపిస్తుంది మొదటగా భార్య భావాలను అర్థం చేసుకుని భర్త కొంతమంది భర్తలు
(04:25) డబ్బు సంపాదిస్తే చాలు అదే బాధ్యత అనుకుంటారు. కానీ ఒక స్త్రీకి డబ్బు కంటే ఎక్కువగా కావల్సింది మనస్సు ఆమె మాట్లాడితే వినే వ్యక్తి ఆమె బాధలో తోడు నిలిచే వ్యక్తి ఆమె రోజంతా ఎంత అలసిపోయిందో అడగని భర్త ఆమె నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకోలేడు. అలాంటి ఇంట్లో స్త్రీ నెమ్మదిగా ఒంటరితనంలో కూరుకుపోతుంది. ఎప్పుడూ అవమానించే భర్త.
(04:49) కొన్ని మాటలు కత్తిలా గుచ్చుకుంటాయి. నువ్వు ఏమి చేయలేవు. నీ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది నీకు తెలివి లేదు ఏమీ లేదు ఇలాంటి మాటలు రోజూ వింటూ ఉంటే ఆమె ఆత్మవిశ్వాసం చనిపోతుంది. బయట ప్రపంచం ఎంత గౌరవించినా ఇంట్లో అవమానం ఎదురైతే ఆమె మనస్సు ముక్కలు అవుతుంది. భార్యను ఇతరులతో పోల్చే భర్త అమాకురాలిగలాగా ఉండలేవా? వాళ్ళు భార్యలా నువ్వు ఎందుకు ఉండవు? ఈ పోలికలు ఒక స్త్రీ హృదయాన్ని లోపల నుంచి కాలుస్తాయి.
(05:22) ఎందుకంటే ప్రేమ అంటే అంగీకారం కానీ పోల్చే భర్త దగ్గర ఆమె ఎప్పుడు సరిపోని వ్యక్తిగానే కనిపిస్తుంది. కోపం వచ్చినప్పుడల్లా అరవడం కొన్ని ఇళ్లల్లో భార్య భర్త అడుగుల నిశశబ్దం విన్నాకే భయపడుతుంది. ఎప్పుడు కోప్పడతాడో ఎప్పుడు అవమానిస్తాడో తెలియక భయంతో జీవిస్తుంది. భయం ఉన్నచోట ప్రేమ ఉండదు. అక్కడ కేవలం సహనం మాత్రమే ఉంటుంది. భార్య త్యాగాలను గుర్తించిన భర్త.
(05:48) ఒక స్త్రీ తన జీవితాన్ని మొత్తం కుటుంబం కోసం అంకితం చేస్తుంది. తన కలలు తన ఇష్టాలు తన సంతోషం కూడా వదులుకుంటుంది. కానీ ఆమె చేసిన చిన్న పని కూడా గుర్తించకుండా నువ్వు ఏమి చేసావు అని అడిగితే ఆమె గుండె నిశ్శబ్దంగా ఏడుస్తుంది. భార్యను ఒంటరిగా ఫీల్ చేయించే భర్త. ఇంట్లో అందరూ ఉన్న తన మనసు చెప్పుకునే వ్యక్తి లేకపోతే ఆమె లోపల ఖాళీగా మారిపోతుంది.
(06:13) కొంతమంది స్త్రీలు రాత్రులు అందరూ నిద్రపోయాక మాత్రమే ఏడుస్తారు. ఎందుకంటే పగలంతా బలంగా నటించాలి కాబట్టి భార్యను గౌరవించని భర్త ప్రేమ తగ్గినా జీవితం సాగుతుంది కానీ గౌరవం పోతే ఆ బంధం నెమ్మదిగా చునిపోతుంది. భార్యను అందరి ముందు చిన్న చూపు చూడడం, ఆమె మాటకు విలువ ఇవ్వకపోవడం, ఆమె నిర్ణయాలను ఎగతాలి చెయ్యడం. ఇవి ఒక స్త్రీ మనసును పూర్తిగా విరిచేస్తాయి కానీ ఇంత బాధలో కూడా చాలా మంది స్త్రీలు ఎందుకు ఆ బంధంలోనే ఉంటారో తెలుసా? ఎందుకంటే ఆమెకు కుటుంబం ముఖ్యం.
(06:46) పిల్లల భవిష్యత్తు ముఖ్యం. సమాజం ఏమంటుందో అని భయం ఉంటుంది. మరి ఒకరోజు అతను మారుతాడేమో అని చిన్న ఆశ ఇంకా మిగిలి ఉంటుంది. అందుకే స్త్రీలు తమ కన్నీళ్లను దాచుకొని నవ్వుతూ జీవిస్తారు. కానీ ప్రతి భర్త ఒక విషయం గుర్తుంచుకోవాలి. భార్య కేవలం వంట చేసే వ్యక్తి కాదు ఆమె కూడా భావాలు ఉన్న మనిషే. ఆమెను ప్రేమించండి. ఆమె మాట వినండి. ఆమెను గౌరవించండి.
(07:12) ఎందుకంటే ఒక స్త్రీ మనసు విరిగిపోతే ఆమె బయటకు బతికినా లోపల పూర్తిగా ఖాళీ అయిపోతుంది. చివరిగా ప్రపంచం మొత్తం ఆమెకు వ్యతిరేకంగా ఉన్న భర్త ఒక్కరు తోడు ఉంటే ఆమె ఏ కష్టాన్ని అయినా ఎన్ని కన్నీళ్లు అయినా భరిస్తారు కానీ భర్త బాధకు కారణం అయితే ఆమెకు జీవితం చాలా భారంగా శూన్యంగా మారుతుంది. మంచి మనిషి అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు.
(07:41) ఒక వ్యక్తి నిజంగా మంచి మనిషిగా మార్చే కొన్ని ముఖ్యమైన గుణాల గురించి తెలుసుకుందాం కోపాన్ని నియంత్రించబడే మన సమాజంలో చాలా మంది ఇలా అంటారు ఎక్కువ కోపం చూపే వాళ్ళు మంచి మనుషులు కాదు కానీ ఇది పూర్తిగా నిజం కాదు ఎందుకంటే కోపం అనేది ప్రతి మనిషిలో ఉండే సహజమైన భావోద్వేగం కానీ ఒక మంచి మనిషి ప్రత్యేకత ఏమిటంటే అతను తన కోపాన్ని నియంత్రించగలడు కోపంలో ఎప్పుడు జీవితాన్ని పాడు చేసే నిర్ణయం నిర్ణయాలు తీసుకోడు తన మాటలతో ఎదుటివారిని గాయపరచడు మీ స్నేహితుడు ఏదైనా చేసి మీకు చాలా కోపం తెప్పించిన ఒక్కసారి ఆలోచించండి ఈ కోపం నా స్నేహం కంటే గొప్పదా అని కోపం వల్ల జీవితంలో విలువైన సంబంధాలను
(08:22) కోల్పోవద్దు ఇక రెండవది క్షమించడం నేర్చుకోవాలి క్షమించగలగడం ఒక గొప్ప మనిషి లక్షణం ఎవరినైనా క్షమించడం చాలా కష్టం కానీ అదే మనిషిని మరింత గొప్పవాడిని చేస్తుంది ఎందుకంటే తప్పు ఎవరికైనా జరుగుతుంది తప్పు చేసిన తర్వాత ఎవరైనా నిజంగా పశ్చాత్తాపంతో మీ దగ్గరికి వచ్చి క్షమించమంటే అది వారు మిమ్మల్ని విలువైన వ్యక్తిగా భావిస్తున్నారని అర్థం అప్పుడు మీరు కూడా వారి భావాలను అర్థం చేసుకుని క్షమించాలి ఒక్కసారి క్షమించడం నేర్చుకుంటే జీవితంలో మానసికంగా చాలా బలంగా మారిపోతారు.
(08:57) ఇక సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది చాలా స్వార్థపరులుగా మారిపోయారు. నాకేం ఉపయోగం అన్నదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ మంచి మనిషి కావాలంటే ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. సహాయం అంటే డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు ఒక వృద్ధుని రోడ్డు దాటించడం బస్సులో పెద్దవారికి సీటు ఇవ్వడం మర్యాదగా మాట్లాడడం ఇవి కూడా సహాయమే మీరు ఇతరుల జీవితాన్ని కొంచెం సులభం చేస్తే ప్రపంచం కూడా మీ జీవితాన్ని సులభం చేస్తుంది ఇక వినడం నేర్చుకోవాలి ఒక మంచి మనిషి కూడా అవుతాడు లిజనర్ అయితే ఇప్పుడు చాలా మంది వినరు ఎవరైనా తమ బాధ చెప్పడం మొదలు పెడితే పూర్తిగా వినకముందే సలహాలు ఇవ్వడం మొదలు
(09:36) పెట్టేస్తారు కానీ కొన్నిసార్లు మనిషికి కావాల్సిన సలహా కాదు తన బాధను ఎవరో ఓపికగా వినడమే మన ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా మనం మొబైల్ లోనే బిజీగా ఉంటాం. అది ఎదుటి వారిని గౌరవించుకోవడమే కాబట్టి మంచి మనిషి కావాలంటే ఎదుటి వారి మాటలను పూర్తి శ్రద్ధతో వినాలి లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. చాలామంది ఒకరిని బాధ పెట్టకూడదని అబద్ధపు హామీలు ఇస్తారు.
(10:01) ఉదాహరణకు మీ దగ్గర డబ్బు ఇవ్వాలని ఉద్దేశం లేకపోయినా ఇస్తాను చూస్తాను అంటూ ఎదుటివారిని ఆశ పెట్టేస్తారు ఇది మంచితనం కాదు మీకు చెయ్యలేని పని అయితే మర్యాదగా లేదు అని చెప్పండి నిజాయితీగా చెప్పినా లేదు అపద్దపు చూద్దాం కంటే ఎంతో మంచిది ఇక అపద్దాలు చెప్పొద్దు అపద్దం చిన్న చెడు అలవాట్లకు మూలం ఒక అపద్దాన్ని దాచడానికి మరో అపద్దం చెప్పాల్సి వస్తుంది ఎక్కువ అబద్దాలు చెప్పే వ్యక్తిని చివరికి ఎవరు నమ్మరు అందుకే నిజం వల్ల కొద్దిసేపు ఇబ్బంది వచ్చినా అబద్దాల బృదలో పడకండి బాధ్యత తీసుకోండి ఒక మంచి మనిషి తన విజయానికి మాత్రమే కాదు తన అపజయానికి కూడా
(10:43) బాధ్యత తీసుకుంటాడు. ఇప్పుడు చాలా మంది విజయం వస్తే ఇది నా తెలివి వల్ల అంటారు. ఇది నా తెలివి వల్ల అని అపజయం వస్తే దోషం ఇంకా ఎవరి మీదో వేస్తారు కానీ నిజమైన మంచి మనిషి ఇక్కడ నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాడు. ఇక నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించండి నకిలీ వ్యక్తిత్వం ఎక్కువ రోజులు నిలవదు మీరు ఎలా ఉన్నారు అలాగే ఉండండి కొంతమంది బయటకు చాలా మంచివారిలా నటిస్తారు కానీ నిజ జీవితంలో పూర్తిగా భిన్నంగా ఉంటారు.
(11:13) ఇది చివరికి వారి అసలైన వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది. అందుకే నిజాయితిగా జీవించండి. ఇక మర్యాదగా మాట్లాడండి. మనం ప్రేమగా మాట్లాడితే ఎదుటివారు కూడా ప్రేమగానే స్పందిస్తారు. రోజంతా అలసిపోయిన మనిషికి కొన్ని మంచి మాటలే చాలాసార్లు పెద్ద ఆనందం ఇస్తాయి. అందుకే గట్టిగా అరవడం కాదు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇక అసూయను వదిలేయండి. అసూయ మనిషిని నెమ్మదిగా నాశనం చేస్తుంది.
(11:39) ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడకండి వారిని ఎలా ఎదగాలో నేర్పించుకోండి ఎందుకంటే అసూయతో ఉన్న మనిషి ఎప్పటికీ నిజమైన మంచి మనిషి కాలేడు. ఒక మంచి మనిషిగా మారాలంటే కనీసం ఈ గుణాలు మనలో ఉండాలి. కోపాన్ని నియంత్రించాలి క్షమించడం నేర్చుకోవాలి సహాయం చేయాలి వినడం అలవాటు చేసుకోవాలి లేదు అని చెప్పడం నేర్చుకోవాలి అబద్దాలు మానేయాలి బాధ్యత తీసుకోవాలి నిజాయితిగా ఉండాలి మర్యాదగా మాట్లాడాలి అసూయను వదిలేయాలి.
(12:09) ఈ గుణాలు ఉన్నవారిని ప్రపంచం ఎప్పటికీ గౌరవిస్తుంది లో అతను చూపించిన ప్రేమ ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు అని అనిపించిందా ప్రతి నిమిషం మెసేజ్లు అపారమైన కేర్ నువ్వు నా ప్రపంచం అనే మాటలు నిజమైన ప్రేమలా అనిపించాయా లేక నెమ్మదిగా మీ జీవితాన్ని నియంత్రించే ఉచ్చులా మారాయా చాలా టాక్సిక్ రిలేషన్షిప్స్ ప్రేమతోనే మొదలవుతాయి మనం ప్రేమలో ఉన్నప్పుడు రెడ్ ఫ్లాగ్స్ కూడా రెడ్ రోజెస్ లా కనిపిస్తాయి.
(12:44) అందుకే చాలా మంది ఆలస్యంగా గ్రహిస్తారు. తాము ప్రేమించిన వ్యక్తే తమ మనశశాంతిని నాశనం చేస్తున్నాడని ప్రేమలో పడటం అనేది మరెక్కడా లేని ప్రత్యేకమైన అనుభూతి రొమాన్స్ విషయానికి వస్తే పెద్ద పెద్ద హామీలు, మధురమైన మాటలు మనల్ని చాలా సులభంగా ఆకర్షిస్తాయి. కానీ ఆ అందమైన కథ ఒక భయంకరమైన కలలా మారితే అప్పుడు ఇది ముందే గుర్తించి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కదా మనసారా ప్రేమిస్తున్నప్పుడు సంబంధంలో ఉన్న ప్రమాద సంకేతాలను మనం చాలాసార్లు పట్టించుకోం కానీ గుండె పగిలే బాధ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే నిపుణులు హెచ్చరించిన ఆరు రొమాంటిక్ ప్రవర్తనలను తప్పకుండా
(13:25) గమనించాలి. మొదటిది అతిగా ప్రేమ చూపించడం లవ్ బాంబింగ్ అంటారు. ఎవరైనా మొదట్లోనే మీపై బహుమతులు పొగడతలతో ముంచెత్తడం అధిక ప్రేమ వర్షంలా కురిపించారా మొదట ఇది కలలా ప్రపంచంలా అనిపించవచ్చు కానీ దీనిని లవ్ బాంబింగ్ అంటారు. ఇది ఒక మ్యానిపులేషన్ టెక్నిక్ ముందుగా ఎక్కువ ప్రేమ చూపించి తర్వాత ఒక్కసారిగా దూరమవుతారు.
(13:50) దాంతో మీరు వారి ప్రేమ కోసం తహతహలాడే స్థితికి చేరుకుంటారు. ఎవరైనా చాలా వేగంగా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండండి ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకోవడం కొత్తగా ప్రేమలో పడితే ఎక్కువ సమయం కలిసి గడపాలని అనిపించడం సహజమే అది హనీమూన్ ఫేజ్ కానీ కలిసి ఉండడం ఒకటి ఒకరినొకరు ఊపిరాడనివ్వకుండా చేయడం మరొకటి ఎప్పుడూ మీతోనే ఉండాలని పట్టుపట్టడం మిమ్మల్ని మీ కుటుంబం స్నేహితుల నుంచి దూరం చేయడం ఇవి కంట్రోల్ చేసే ప్రవర్తన సంకేతాలు కావచ్చు చాలా త్వరగా గా ఐ లవ్ యు చెప్పడం ఐ లవ్ యు అనే మూడు మాటలకు చాలా విలువ ఉంది.
(14:28) స్వస్థమైన సంబంధంలో ఉన్న వ్యక్తి ముందుగా మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటాడు. కానీ నిజంగా బలమైన అనుబంధం ఏర్పడకముందే ప్రేమను ప్రకటిస్తే అది నిజమైన ప్రేమ కంటే ప్రేమ అనే భావన పట్ల ఆకర్షణ కావచ్చు సైకాలజిస్ట్ల ప్రకారం ఇది కొన్నిసార్లు కంట్రోలింగ్ వ్యక్తుల లక్షణం కూడా అవుతుంది.
(14:53) ఎప్పుడు మెసేజ్లు పంపడం కొత్త సంబంధంలో ఎక్కువగా చాట్ చేయడం ఉత్సాహంగానే ఉంటుంది. కానీ ప్రతి నిమిషం మెసేజ్ లు రావడం మీరు వెంటనే రిప్లై ఇవ్వకపోతే కోప్పడం ఇవి అసురక్షిత భావన ఎక్కువ అటాచ్మెంట్ కో డిపెండెన్సీ లక్షణాలు ఉండవచ్చు ఆరోగ్యకరమైన సంబంధం అంటే ఇద్దరికీ వారి వ్యక్తిగత ఇది స్థలం అనేది ఉండాలి స్పేస్ ఎప్పుడు గమనిస్తూ ఉండటం మీ ఫోన్ చెక్ చేయడం మీ సోషల్ మీడియా పాస్వర్డ్ అడగడం మీరు ఎక్కడ ఉన్నారో ఎప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నించడం ఇవి ప్రేమ కాదు ఇవి క్రమంగా కంట్రోలింగ్ మరియు అబ్యూసివ్ ప్రవర్తనగా మారవచ్చు. సంబంధంలో నమ్మకం చాలా ముఖ్యం.
(15:32) మీ భాగస్వామి ఎప్పుడు మీ ప్రతి అడుగు గమనిస్తుంటే అది పెద్ద రెడ్ ఫ్లాగ్ అసూయ మరియు సొంతం చేసుకోవాలనే భావన. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే కోప్పడం మీ దుస్తులపై నియంత్రణ చూపడం కొత్త స్నేహితుల గురించి అసహనం చూపించడం ఇవి ప్రేమలా కనిపించవచ్చు కానీ నిజానికి ఇవి మనిపులేషన్ మరియు అబ్యూస్ సంకేతాలు కావచ్చు నిజమైన ప్రేమ అంటే నియంత్రణ కాదు అది పరస్పర గౌరవం నమ్మకం ఇవన్నీ మీ జీవితంలో ఎప్పుడైనా అనిపించాయా ప్రేమలో ఉన్నప్పుడు చాలా రెడ్ ఫ్లాగ్స్ కనిపించవు కానీ వీటిని ముందుగానే గుర్తిస్తే మీరు ఆరోగ్యకరమైన మరియు ఆనందమైన సంబంధాన్ని నిర్మించుకోవచ్చు ఈ
(16:14) ప్రపంచంలో మూడు రకాల మనుషులు ఉంటారు ఒకరు పెళ్లైన వారు మరొకరు ప్రేమ కోసం వెతకనివారు మరొకరు సరైన వ్యక్తి దొరకాలి అని దేవుడిని ప్రార్థించేవారు మీరు మొదటి లేదా చివరి వర్గంలో ఉంటే ఇది మీ కోసమే చాలా మంది గుర్తించిన టాక్సిక్ రిలేషన్షిప్ సంకేతాలు ఏమంటే సంబంధంలో భద్రత లేకపోవడం అసురక్షిత భావన మరియు సంబంధం అస్థిరంగా అనిపించడం రెండు వేరు వేరు ఉదాహరణకు మీ భాగస్వామి మోసంచే చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు మీరు అనుమాన పడడం సహజమే.
(16:45) ఆరోగ్యకరమైన సంబంధంలో ఇద్దరు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. కానీ మీ భావాలను పట్టించుకోకపోతే మీలో అసురక్షిత భావన పెరుగుతుంది. మీ అవసరాలను పట్టించుకోకపోవడం సంబంధంలో ఉన్న మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. మీ ఆరోగ్యం, విశ్రాంతి, వ్యక్తిగత లక్ష్యాలు ఇవన్నీ కూడా ముఖ్యం. మీ అవసరాలను మీరు నిర్లక్ష్యం చేయడం లేదా మీ భాగస్వామి పట్టించుకోకపోవడం టాక్సీ సంబంధానికి సంకేతం కావచ్చు మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం మీ కలలు అభిప్రాయాలు భావాలను ఎప్పుడు చిన్నచూపు చూపిస్తే అది ఆరోగ్యకరమైన సంబంధం కాదు మీకోసం నిలబడకుండా ఎప్పుడు మిమ్మల్ని పక్కన
(17:26) పెట్టడం కూడా టాక్సీకి లక్షణమే నియంత్రణ ప్రవర్తన మీరు ఎవరితో మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నది నిర్ణయించడం మీ ఫోన్ లేదా సోషల్ మీడియా గమనించడం ఇవి ప్రేమ కాదు ఇది ఒక నియంత్రణ వ్యక్తిగత పరిమితులు లేకపోవడం నీకోసం ఏదైనా చేస్తాను అనడం ప్రేమలో అనిపించవచ్చు కానీ ఆరోగ్యకరమైన సంబంధంలో హద్దులు చాలా ముఖ్యం హద్దులు లేకపోతే ఒకరు ఇంకొకరిని వాడుకోవడం మొదలవుతుంది.
(17:53) మీ రహస్యాలను మీపై ఉపయోగించడం మీరు నమ్మకంతో చెప్పిన విషయాలను గొడవలలో ఆయుధంలా ఉపయోగిస్తే అది చాలా ప్రమాదకరమైన సంకేతం సంబంధాన్ని దాచిపెట్టడం మీతో ఉన్న సంబంధాన్ని ఇతరుల ముందు అంగీకరించకపోతే అది అవమానకరమైన విషయం కావచ్చు టెక్స్టింగ్ ద్వారా కనిపించే రెడ్ ఫ్లాగ్స్ ఒకసారిగా మాయమవడం మొదట ఎక్కువగా మెసేజ్లు చేసి తర్వాత రోజులు కనిపించకపోవడం తర్వాత ఏమి జరగనట్లు తిరిగి రావడం ఇది మేనిపులేషన్ కావచ్చు రాత్రి వేళలో మాత్రమే మెసేజ్లు పగులు కనిపించరు రాత్రి హాయ్ నిద్రపోలేదా అంటూ మెసేజ్ చేస్తారు ఇది మీరు వారి జీవితంలో ప్రాధాన్యత కాదనే సంకేతము ఒక్క
(18:33) పదంతో సమాధానాలు మీరు పెద్ద మెసేజ్ పంపితే వాళ్ళ నుంచి ఓకే ఓ ఓకే మాత్రమే వస్తే మీరు మాత్రమే ఆ సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తే అది ఆరోగ్యకరమైన సంబంధం కాదు ఎప్పుడూ విమర్శించడం మీ మాటలు మీ టోన్ మీ టైపింగ్ స్టైల్ అన్నింటిలో తప్పులే లే వెతుకుతుంటే ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం కావచ్చు గిల్టీ ట్రిప్పింగ్ నువ్వు చాలా బిజీగా ఉన్నావు కాబోలు సరే నేను ఇబ్బంది పెట్టను ఇలాంటి మెసేజ్లు పాజిటివ్ అగ్రెసివ్ సంకేతాలు ఆరోగ్యకరమైన సంబంధం అంటే ప్రేమ మాత్రమే కాదు అది గౌరవం నమ్మకం పరస్పర సహకారం స్వేచ్ఛ కూడా
(19:12) టాక్సిక్ సంబంధాలు మీ జీవితంలోని ఆనందాన్ని క్రమంగా తగ్గిస్తాయి అందుకే రెడ్ ఫ్లాగ్స్ ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా ఎందుకు నా సంబంధాలే చివరకు నన్నే బాధ పెడుతున్నాయి అని మళ్ళీ మళ్ళీ అదే రకమైన తప్పు వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారా లేదా నిజంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ ముందే ఉన్నా మీరు గుర్తించలేకపోతున్నారా కొన్ని సంబంధాలు మొదట ప్రేమలా కనిపిస్తాయి కానీ క్రమంగా అవే మనసును బంధించే విషపూరిత అనుబంధాలుగా మారిపోతాయి.
(19:50) అసూయ నియంత్రణ మాయ చేయడం భావోద్వేగాలతో ఆడుకోవడం ఇవి ప్రేమ కాదు ఇవి టాక్సిక్ అటాచ్మెంట్ యొక్క ప్రమాదకర సంకేతాలు ఈ వీడియోలో ఒక సంబంధం నెమ్మదిగా విషపూరితంగా మారుతున్నప్పుడు కనిపించే ముఖ్యమైన టాక్సిక్ రిలేషన్షిప్ పాటర్న్ గురించి తెలుసుకుందాం. ఈ సంకేతాలు ముందుగానే గుర్తిస్తే మీ మనసును మీ భవిష్యత్తును కాపాడుకోవచ్చు. అతిగా ఆధారపడటం ప్రేమ మన జీవితంలో ఒక అందమైన భాగం కానీ అదే మన మొత్తం ప్రపంచంగా మారిపోతే అది నెమ్మదిగా మనల్ని మనమే కోల్పోయేలా చేస్తుంది.
(20:26) మీ భాగస్వామి లేకుండా ఎక్కడికైనా వెళ్ళడం మీకు తప్పుగా అనిపిస్తుందా మీరు మాత్రమే ఆహ్వానించబడినా కూడా వాళ్ళు లేకుండా నేను వెళ్ళకూడదు అని అనిపిస్తుందా ఒకరినొకరు ప్రేమించడం సహజం కానీ ఎప్పుడూ కలిసి ఉండాల్సిందే అనుకోవడం ఆరోగ్యకరమైన ప్రేమ కాదు ఒక మంచి సంబంధంలో ప్రేమతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంటుంది.
(20:51) ఇద్దరికీ తమ తమ స్నేహితులు అభిరుచులు ఒంటరి సమయం కూడా అవసరం ఎందుకంటే మీ ప్రపంచం మొత్తం ఒక వ్యక్తి చుట్టూ తిరగడం ప్రారంభమైతే మీ వ్యక్తిత్వం మసగబారడం కూడా మొదలవుతుంది. అతిగా స్వతంత్రంగా ఉండటం కొన్ని సంబంధాల్లో ఒకరు అతిగా ఆధారపడితే మరొకరు పూర్తిగా దూరంగా ఉంటారు. మీ భాగస్వామి ఎప్పుడూ చల్లగా దూరంగా ప్రవర్తిస్తున్నారా? మీతో సమయం గడపడం కంటే తమకు ఇష్టమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? డేట్ కి ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ఏమి తినాలి అన్నీ వాళ్ళ నిర్ణయాలేనా అయితే అది ప్రేమ కాదు నియంత్రణ ఒక ఆరోగ్యకరమైన సంబంధంలో ఇద్దరి మాటకు సమాన విలువ ఉండాలి సంబంధానికి
(21:35) సంబంధించిన నిర్ణయాలు కలిసి తీసుకోవాలి ఎప్పుడు నా మాటే ఫైనల్ అన్నట్లు ప్రవర్తించే వ్యక్తి మీ భావాలను గౌరవించడం లేదు అన్నమాట మాయ చేయడం నెక్స్ట్ మీ భాగస్వామి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి మీ భావోద్వేగాలతో ఆడుకుంటున్నారా నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఇది చేస్తావ్ నాకోసం ఇంత కూడా చేయలేవా అంటూ మీలో గోల్డ్ గిల్టీ ఫీల్ కలిగిస్తున్నారా దీనినే ఎమోషనల్ మనిపులేషన్ అంటారు.
(22:04) ఇలాంటి వ్యక్తులు మొదట చిన్న విషయాలతో ప్రారంభిస్తారు. మెల్లగా మీ హద్దులను దాటుతూ మీ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపడం మొదలు పెడతారు. చివరికి మీరు మీకోసమా వాళ్ళ కోసమా బ్రతుకుతున్నారా కూడా అర్థం కాకుండా పోవచ్చు. మీరు మాయ చేయబడుతున్నట్టు అనిపిస్తే ఆ సంబంధం నుంచి బయట పడడం తప్పు కాదు సహాయం కోరడం బలహీనత కాదు ఇక వ్యక్తిత్వాన్ని కోల్పోవడం మీకు ఇష్టమైన పనులను వదిలేసి జంటగా చేసే పనులకే పరిమితమైపోయారా మీ వ్యక్తిగత స్నేహితులను దూరం చేసుకుని కేవలం కామన్ ఫ్రెండ్స్ తోనే గడుపుతున్నారా అలా అయితే మీరు నెమ్మదిగా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు.
(22:45) గుర్తుంచుకోండి సంబంధం లో ఉన్నా కూడా మీరు గానే ఉండాలి మీ అభిరుచులు మీ కలలు మీ వ్యక్తిత్వం ఇవే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబడతాయి నిజమైన ప్రేమ మీ వ్యక్తిత్వాన్ని చెరిపేయదు దాన్ని మరింత అందంగా మార్చుతుంది ఇక స్వార్థం మరియు డిమాండ్స్ మీ భాగస్వామి ఎప్పుడు తమ అవసరాల గురించే ఆలోచిస్తున్నారా మీ భావాలు మీ కోరికలు వాళ్లకు పెద్దగా పట్టవా బహుశా వారు మీ దగ్గర నుంచి మాత్రమే ప్రేమ గిఫ్ట్స్ సహాయం కోరుతుంటారు కానీ మీకోసం మాత్రం ఏమి చేయకపోవచ్చు అది ప్రేమ కాదు స్వార్థం మంచి భాగస్వామి తమ సంతోషంతో పాటు మీ సంతోషాన్ని కూడా పట్టించుకుంటారు.
(23:27) సంబంధం అనేది ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించే స్థలం కాదు. నెక్స్ట్ ప్రేమను భావోద్వేగ ఆకలితో గంధరగోళం చేయడం మీరు నిజంగా ప్రేమలో ఉన్నారా లేక కేవలం ఒంటరితనాన్ని నింపుకోవడానికి ఎవరో ఒకరిని పట్టుకున్నారా కొన్నిసార్లు చిన్నప్పటి లోపాలు ప్రేమ భావం మనలో ఒక భావోద్వేగ ఖాళీని సృష్టిస్తాయి. ఆ ఖాళీని నింపుకోవడానికి సంబంధాల్లోకి వెళ్ళినప్పుడు అది ప్రేమలా అనిపించవచ్చు కానీ నిజమైన ప్రేమ ఆధారపడటం కాదు ఒక ఆరోగ్యకరమైన సంబంధంలో ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమిస్తారు కానీ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోరు గుర్తుంచుకోండి సంబంధం మీ జీవితాన్ని అందంగా మార్చాలి. మీ శాంతిని
(24:10) నాశనం చేయకూడదు. మీరు మీరుగా ఉండగలిగే వాళ్ళు వాళ్లుగా ఉండగలిగే గౌరవం నమ్మకం సమానత్వం ఉన్న ప్రేమను కనుగొనడం పూర్తిగా సాధ్యమే. ఈ వీడియోలో చెప్పిన విషపూరిత సంబంధ లక్షణాలు ఏదైనా మీరు అనుభవించారా అలా అయితే మీ అనుభవాన్ని ఒక కామెంట్ లో పంచుకోండి. ఈ వీడియోలో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. విషపూరిత సంబంధంలో ఉన్నవారికి తప్పకుండా షేర్ చేయండి.
(24:36) ఇలాంటి మీనింగ్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు థాంక్యూ వెరీ మచ్ జై హింద్ వందేమాతరం.

No comments:

Post a Comment